Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
? *వాట్సాప్ భగవద్గీత* ?
#1
*వాట్సాప్ కృప*

? *వాట్సాప్ భగవద్గీత* ?

*శ్రీ మొబైల్ ఉవాచ:*

నీవు గత మెసేజ్ ల గురించి చింతింపవలదు.
నీవు భవిష్యత్తునందు వచ్చే మెసేజ్ ల గురించి కూడా చింతింపవలదు.
వర్తమాన మెసేజ్ ల గురించి మాత్రమే ఆలోచించుము.

నీవు గతంలో ఇక్కడ లేనప్పుడును ఈ మెసేజ్ ల పరంపర కొనసాగుతూనేవుండినది.
భవిష్యత్తులో నీవు లేకున్ననూ ఈ మెసేజ్ ల పరంపర కొనసాగుతూనే వుంటుంది.

ఇప్పుడు నీది అనుకున్న మెసేజ్ గతంలో వేరొకరిది.
అదే మెసేజ్ భవిష్యత్తులో ఇంకొకరి స్వంతమవుతుంది.
అది నీది అనుకుని భ్రమపడుతున్నావు.
అదియే నీ సమస్త దుఃఖములకు కారణమవుతున్నది.

'అద్భుతం' , 'బాగుంది' , 'ధన్యవాదములు' వంటి శబ్దములు నీ మనస్సు నుండి తొలగించుము.
నీవు పరులనుండి ఏమియును ఆశించక మెసేజ్ చేసి చూడుము.
వాట్సాప్ రూపమువంటి భవసాగరమునందు నీవు వుంటూ సమస్త సంకుచిత భావములనుండి వైదొలగి, నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగును.

వాట్సాప్ లో  జాయిన్ అయినందుకు మిన్నకుండక ఏదేని  ఒక పోస్ట్ అయిననూ పంపుతూ వుండుము.
ఈజన్మలో భగవంతుడు ఎన్నో బంధాలను సృష్టించెను... వాట్సాప్ కూడా కొత్త బంధాలని చేకూరుస్తుంది.

యదాయదాహి మొబైలస్య
గ్లానిర్భవతి సిగ్నలః
అవుట్ ఆఫ్ రీచ్ సూచనేన
త్వరిత జాగృత సంశయాః

విచ్ఛేదితం సంపర్కాః
కలహం మాత్ర భవిష్యతి
తస్మాత్ చార్జింగ్ ఏవం రీచార్జింగ్
కుర్వంతు తవ సత్వరం

మనసోక్తం చాటింగ్
హాస్యవినోదేన టెక్స్టింగ్
సత్వర సత్వర ఫార్వార్డింగ్
అఖండితం సేవాః ప్రార్థయామి

టచ్ స్క్రీనం నమస్తుభ్యం
అంగుళీస్పర్శం క్షమస్వమే
ప్రసన్నాయ ఇష్టమిత్రాణాం
అహోరాత్రం మెసేజం కరిష్యే

ఇతి శ్రీ మొబైల్ భగవద్గీత సంపూర్ణం

*ఓం శాంతిః శాంతిః శాంతిః*

Source:Internet what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఇలాంటి పేరడీలని రూపొందించేవారిని అభినందించాలి Smile

సోషలు నెట్వర్కు మాధ్యమాలకి అనుగుణంగా రూపకల్పన చేస్తున్నప్పుడు
సంక్షిప్తత అవసరం అవుతుంది. విషయాల పట్ల తగిన పరిజ్ఞానం ఉన్నవారికి
క్లుప్తంగా ఉన్నా అర్ధం అవుతాయి. ఇతరులకి సంక్లిష్టంగా అనిపించగలవు.

అర్ధమయినా, కాకున్నా ఫార్వార్డు చేసేవారు ఎక్కువగా ఉంటున్నట్లు ఉంది !
Like Reply




Users browsing this thread: