Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కాలేజ్ డేస్
waiting sir..
[+] 1 user Likes readersp's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update please
[+] 1 user Likes Venky.p's post
Like Reply
banasura garu mee katha adbutanga undi.. alage meeru ee kathanu aneka vidhaluga vivarinchi rayadam to memu kuda chala asakthi to chaduvutunnamu..
Super bro continue...
[+] 1 user Likes babubablu9966's post
Like Reply
Super andi story chalabagundhi romantic and adventurous
[+] 1 user Likes Vandanalokaprakash's post
Like Reply
Super update
[+] 1 user Likes Venky.p's post
Like Reply
Super kummesaru brooo adventure story broo... Waiting for update broo
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
(24-01-2020, 11:07 PM)Vandanalokaprakash Wrote: Super andi story chalabagundhi romantic  and adventurous

Thanks
Like Reply
Thumbs Up 
(23-01-2020, 11:34 AM)babubablu9966; Wrote: banasura garu mee katha adbutanga undi.. alage meeru ee kathanu aneka vidhaluga vivarinchi rayadam to memu kuda chala asakthi to chaduvutunnamu..
Super bro continue...

థ్యాంక్స్ బ్రో. . . . కొత్త అప్డేట్ రాస్తున్నాను.
Like Reply
Update please
[+] 1 user Likes Venky.p's post
Like Reply
Update bro
[+] 1 user Likes Prasanthkumar297's post
Like Reply
Update bro
[+] 1 user Likes Kumar siva sex hero's post
Like Reply
సూపర్ బ్రో... చాలా బాగా రాస్తున్నారు..
[+] 1 user Likes krish782482's post
Like Reply
బ్రో స్టోరీ చాలా బాగా రాస్తున్నారు మీరచన సైలి నాకు నచ్చింది మీ రచన అంటే నాకు చాలా బాగా ఇష్టం

బ్రో తరువాతి అప్డేట్ ఇవ్వమని కోరుకుంటున్నాను
[+] 1 user Likes గోపీచంద్ గోపి's post
Like Reply
Super
[+] 1 user Likes Vandanalokaprakash's post
Like Reply
Update please Plzzzzzzzzz..........
[+] 1 user Likes Sweet481n's post
Like Reply
update bro..
[+] 1 user Likes babubablu9966's post
Like Reply
Update please
[+] 1 user Likes Venky.p's post
Like Reply
Update please
[+] 1 user Likes Venky.p's post
Like Reply
Please update bro...
[+] 1 user Likes Naga raj's post
Like Reply
                                                           పూల ఱేడు    
          

           రాజుకి రెండుమూడు రోజులుగా నిద్ర పట్టడం లేదు. ఆ చంద్ర భవనం అంతు చూడందే అతనికి నిద్ర పట్టేలా లేదు. దొడ్లో మంచం మీద పడుకుని ఆకాశంలోని చుక్కలను చూస్తూ ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ చంద్ర భవనం చుట్టూనే.
           మంచం మీద తనతో పాటు బావమరిది చిన్నాగాడు తన మీద కాలేసుకుని పడుకున్నాడు. మంచం పక్కన మామ రంగప్ప ఈత చాప మీద పడుకున్నాడు. ఇంట్లో అత్తా, మరదలు చాప మీద నిద్రపోతున్నారు. 
           పగటి యెండకు వేడెక్కిన భూమి, రాత్రి వీచే చల్లటి గాలికి చల్ల బడింది. ఆ చల్లటి గాలికి హాయిగా నిద్ర పడుతొంది. కానీ ఆలోచనలు రాజుని పడుకోనివ్వడం లేదు. ఇంకో ఇరవై రోజుల్లో అమావస్య. అయిదు రోజులలో పున్నమి వచ్చేస్తొంది.
           అమావస్య రోజు బలయ్యే ఆడపిల్లని తలుచుకుంటేనే భయం వేస్తొంది. ఆ రోజు పిశాచం తన పూర్వరూపం సంతరించుకుంటుంది. ఆ పిశాచానికి శరీరాన్ని అరువిచ్చేదెవరు. అరువుచ్చిన వాడు మాయలు, మంత్రాలతో శక్తి వంతుడవుతాడు. అజేయుడవుతాడు. మరి వాడి కుటుంబం. ఒక వేళ అది కేశిరెడ్డేనా. లేక అతని అనుచర గణంలో ఒకడా. ఇటువంటి ఆలోచనలతో తిక్క బట్టి పోతొంది రాజుకి. 
           పక్కకి తిరిగి చూడగానే మామ పక్కనే వున్న టార్చ్ లైట్ కనిపించింది. రంగనాయకుని కుంట కింద వరి మడి నాటినప్పుడు రాత్రి పూట నీళ్లు కట్టవలసి వస్తే చీకట్లో ఇబ్బంది పడకుండా ఆ టార్చ్ లైట్ తెచ్చుకున్నాడు రంగడు.
           మీదున్న బావమరిది కాలుని పక్కకి జరిపి, మామ పక్కనే వున్న టార్చ్ లైట్ చేతపట్టుకుని చెప్పులు తొడుక్కుని వూరికి పడమర దిక్కున వున్న చంద్ర భవనం వైపు నడక సాగాడు. 
          వూరు బయటున్న చింత తోపు దాటుతుండగా "ఏమిరో మనవడా, యాడికి ఒగనివే యల్లబారినావ్" అన్న పిలుపు వినిపించింది. పక్కకు తిరిగి చూస్తో ఒక ముసలాడు. తమల పాకులో సున్నం పూసి నోట్లో పెట్టుకుంటున్నాడు. చింత చెట్టుకింద వున్న రాతి సమాది మీద కూర్చుని వున్నాడాయన. 
          పది రోజులుగా వూర్లో తిరుగుతున్నాడు రాజు. ఏనాడూ ఈ మొఖాన్ని ఎరిగి వుండలేదు. ఏమో ముసలాడు కదా ఇంటినుండి బయటికి వచ్చి వుండడు. తను చూసి వుండక పోవచ్చు అనుకుని "ఈడికే తాత కొంచెం పనుంది." అన్నాడు మొహమాట పడుతూ.            
          "పో. . . పో . . . . నీ పని సక్కరంగా జరుగుతుంది పో" అన్నాడు వక్కాకు నోట్లో నములుతూ.. 
          ఆ ముసలి మహానుభావుడు చచ్చి పదేళ్లకు పైనే అవుతాంది. అది మనోడికి తెలీదు. మాట్లాడింది మనిషే అనుకుంటున్నాడు. చంద్ర బవన ప్రదేశాన్ని చేరుకోవాలనే ఆలోచనే తప్ప మరొకటి లేదు. 
          శంకర్రావు గారి బావి దాటుతుంటుంటే సుట్రగాలి హోరున వీచింది. దానికి దారిలో అడ్డం వచ్చిన ప్రతిదాన్ని పైకిలేపుతూ రాజు మీదకు వచ్చింది.ఆ గాలి వుదృతానికి చిన్న చిన్న రాల్లు ఎగిరి రాజు మీద పడ్డాయి. కన్నుల్లో పడకుండా ముఖాన్ని చేతులతో అడ్డం పెట్టుకున్నాడు. ఆ గాలి అతన్ని దాటి వెళ్తుండగా ఆడవారి నవ్వు లీలగా వినపడింది. "థూ. . . ." అని తిట్టుకుని కదిలిపోయాడు.
          శంకర్రావు పెద్ద కోడలు ఆ బావిలో పడి చచ్చిపోయిందని అంటుంటారు. రాత్రి పూట వంటరిగా పయనించే మగాళ్లని ఆపి బయపెడుతూ వుంటుందంటారు. రాజు కనపడని వాటికి బయపడే వాడు కాదు. బయంకరంగా కనిపించే వాటికి మొదట్లో జడిసినా ఆ తరవాత తేరుకుని ఆ భయాన్ని దాటేయగలడు.
          రాజు సుట్రగాలికి బయపడకపోయే సరికి మానవ రూపాన్ని దరించి ఎదురు వచ్చింది. వాలు జడ వేసుకుని, మల్లెపూలు పెట్టుకుని, బొడ్డుకిందికి చీర కట్టి, వయ్యారంగా నడుచుకుని ఎదురొచ్చింది. "ఏరోయ్ పిల్లగా, యాడికి పోతాండావు ఒగనివే" అని వగలు పోయింది. ఆ ఒంపు సొంపులు అధికంగా కనపింప జేస్తూ, ఎర్రటి పెదాలను కొరుకుతూ అడుగుతున్న ఆమెను చూడగానే రాజుకి నవ్వొచ్చింది. ఆమె అంత అందంగా కనపడినా ఆమె నడివయసులో వున్న ప్రౌడ రూపాన్ని రాజు ముందర వుంచింది. 
          రాజు కన్య పిల్లలను తప్పితే వేరే ఆడవారిని ఆ దృష్టితో చూసే వుద్దేశం ఎప్పుడూ వుండదు. "యాడికి పెద్దమ్మా వచ్చేది. ఇంత రాత్రి పూట ఒగ దానివే ఏమ్ జేస్తాండావు. పెద్దయ్య లేడా" అన్నాడు.
         వాడు పెద్దమ్మ అనగానే ఆమెకు కోపం నశాలానికి తాకింది."ఏరా నీకు పెద్దమ్మ లాగ కనిపిత్తాన్నానా నీకు" అని అరిచింది. బయంకరమైన ఆమె అరుపు వినగానే రాజు గుండెలు అదిరిపోయాయి. జుట్టు విరబోసుకుని, కళ్లను అగ్ని గోలాలుగా జేసుకుని మిందికి దూకింది. రాజు గట్టిగా కేక పెట్టి నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుండి పోయాడు. ఎంత సేపు ఎదురుచూసినా ఆమె అతన్ని తాకక పోయే సరికి కల్లు తెరిచి చూశాడు. ఎదురుగా ఆమె లేదు. బ్రమా అనుకున్నాడు. కానీ ఆమెను తను చూశాడు. చుట్టూ తిరిగి చూశాడు. ఆమె ఎక్కడా కనపడలేదు.
         గుండెల్లో రేగుతున్న భయాన్ని కొద్దిగా చల్లరే వరకు మెల్లగా నడిచి, భయం కొంచెం తగ్గాక వేగం పెంచాడు. ఈసారి ఎవరు పలకరించినా పలక్కూడదనే నిర్ణయానికి వచ్చాడు. చంద్ర భవనం ఆవరణని చేరుకుంటుండగా ఆడపిల్లల నవ్వులు వినిపించాయి.
         అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయాడు. పక్కనే వున్న రాతిని మొరుగు చేసుకుని నిక్కి చూశాడు 'ఎవరా నవ్విందని'. 
         ఒక రాతిని పీఠలాగ చేసుకుని ఒక నడివయసులోనున్న ఆడది కూర్చుని వుంది. ఆమె చేతిలో చేట. ధాన్యాన్ని చెరుగుతొంది. ముందర ఇద్దరు ఆడపిల్లలు ఆడుకుంటున్నారు. పరికిణి వేసుకుని వున్నారు. పెట్టేలు గీసి వాటిలో ఒక చిన్న పెంకుని వేసి కుంటుతున్నారు. తొక్కుడు బిళ్ళ.
         "ఆ నీ ఆట అయిపోయింది. నువ్వు గీత తొక్కావు" అనింది ఒక పిల్ల. "లేదు నీ నేను తొక్కలేదు" అని వాదించింది ఇంకో పిల్ల.
         "అత్తా సూడు అక్క అబద్దాలు చెబుతొంది. అది గీత తొక్కినా తొక్కలేదని అంటొంది" అని ఆ పెద్దావిడకి కంప్లయింట్ చేసింది.
         "నువ్వే అబద్దాలు చెప్తొండేది" అనిందా పిల్ల.
         "నువ్వే'
         "నేను కాదు నువ్వే"
         "కాదు నువ్వే" 
ఇలా వారు వాదించుకుంటుంటే "అబ్బ బ్బా . . . . ఆపండే రండి ఇంట్లోకి పోదాం" అని జబ్బలు పట్టుకుని లాక్కుపోయింది.
వాళ్లు పొతూ పొతూ కూడా 'నువ్వే' . . .'నువ్వే' . . . అని వాదించుకుంటున్నారు. "ఆవ్వవ్వవ్వ. . . " అని ఒక పిల్ల ఇంకో పిల్లని ఎక్కిరించింది.
         రాజు వారిని చూసి నవ్వుకున్నాడు. 
         పీఠ లాంటి రాతిని దాటి లోపలికి పోగానే కనపడకుండా పోయారు. వెంటనే తలుపు వేసిన చప్పుడు. అక్కడ ఎటువంటి తలుపులు లేవు కానీ తలుపులు మూసిన చప్పుడు రాజుకి ఒక్క క్షణం పాటు ఏమి అర్థం కాలేదు.
         అక్కడికి వెల్లి తలుపులు ఏమైనా వుండాయేమో చూడాలని అనిపించినా భయం మూలంగా ముందుకి అడుగు వేయలేక పోయాడు. అసలికే ఒక అనుభవం అతన్ని బెదరగొట్టేసింది. ఇప్పుడో రెండో అనుభవానికి సిద్దంగా లేడు. అందుకనే వాళ్లంతకి వాళ్లు తనకి కనిపించే వరకు వేచి చూశాడు.
                                          * * * * * * * * * * * * * * * * * * * * * * * *
         
         సుమారుగా గంట ఎదురు చూశాక తలుపులు తెరుచుకున్న చప్పుడు. ఆ వెంటనే ఆడపిల్ల గుంపు నవ్వుకుంటూ వచ్చిన సవ్వడి. వారి కాళ్లకున్న గజ్జలు గల్లు గల్లు మని సవ్వడి చేస్తున్నాయి. వాటి సవ్వడికి రాజు గుండేల సవ్వడి మారింది. నమ్మలేనట్లు నోరు తెరుచుకుని చూస్తూ వుండిపోయాడు.అందమైన దేవకన్యలు వాళ్లు. ఆ అంగ సౌష్టవం, ఆ అందమైన ముఖారవిందాలు. అంత అందమైన శరీరాలకు మరింత అందం జేకూర్చేలా వుండే వారి వస్త్రాలంకరణ. వారి ఒంటిమీద నగలు బంగారంతో జేసినవి. వాటిలో కొన్ని వజ్రాలు, పగడాలు కూడా వున్నాయి. అవి వెన్నెల కాంతిలో మెరుస్తున్నాయి.
గుంపుగా వచ్చిన ఆ ఆడ పిల్లలు జంటగా చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా తిరుగుతున్నారు. వారలా తిరుగుతుంటే వారి కాళ్లకున్న అందెలు చేసే సవ్వడి ఒక రాగంలాగా వినిపించింది. వారలా అలసిపోయే దాకా తిరిగి అలసటకు గుండెల మీద చేతులు వేసుకుని రొప్పుతూ ఒక చోట కూలబడ్డారు.
        "ఇప్పుడేమాట ఆడుకుందాం" అనింది వారిలో పెద్దమ్మాయి.
        "గుజ్జన గుళ్లు" ఒకమ్మాయి.
        "వద్దు" 
        "నాలుగు స్థంభాలాట"
        "వూ హూ" 
        "చెన్నే కుప్పలు"
        "నిన్ననే కదా ఆడింది"
        "ముక్కు గిల్లే ఆట"
        "అమ్మో నా ముక్కు" అనింది ఒక పిల్ల.
        "చింత పిచ్చులాట"
        "వద్దు"
        . . . . . 
        . . . . . 
ఇలా వారి సంభాషణ చానా సేపు సాగింది. మరేమి చేద్దాం అని అనుకుంటుండగా "బొమ్మల పెల్లిల్లు" అనింది  ఒక పాప.
       "ఎప్పుడూ బొమ్మల కేనా"
       "బొమ్మలకి వద్దు గనీ మనలోనే ఎవరో ఒకరికి చేద్దాం" అన్నారు. ఆ మాట అందరికి నచ్చింది. 
       "ఎవరు చేసుకుంటారు?"  అందరూ కలిసి పెద్ద పిల్లని ఎంపిక చేశారు.
       "పెండ్లి కూతురుంది. పెండ్లి కొడుకేడీ" అని నవ్వేసిందొక పిల్ల. ఆ పిల్లతో అందరి నవ్వులు కలిశాయి.
       "ఈ పెండ్లి కూతురిని నేను చేసుకుంటాను" అని ముందుకొచ్చిందొక పిల్ల.
       "నేను మగవాడినే చేసుకుంటాను" అనింది పెద్ద పిల్ల.
       "ఒక్క మగపురుగు కూడా లేకుండా తరిమేశామే. ఇప్పుడు మగవాడెక్కడ చిక్కుతాడే" అనిందొక పిల్ల.
       "నేను మగవాడిగా మారితే" అని ఒక పిల్ల మగవాడి వేషానికి మారింది. తెల్లటి చొక్కా, దోతిలోకి పెండ్లి కొడుకు వేషాన్ని దరించింది.
       "నేను మగపుట్టుక పుట్టిన వాడినే చేసుంటానని" ఆ పిల్ల ఆశల మీద నీళ్లు పోసింది. ఆశ పడిన పెండ్లికొడుకు బుంగ మూతి పెట్టి మునుపటి రూపానికి మారిపోయింది. 
        ఈ సంభాషణ నంతటిని గమనిస్తున్న రాజు మొదట అక్కడ ఏమి జరుతుందో అర్థం కాలేదు. కానీ వారలా వేషాలు మార్చడం చూడగానే అది బ్రమ కాదు. కల అసలే కాదు. ఇది నిజమే. నిర్దారించు కోవడానికి గిల్లి చూసుకున్నాడు. నొప్పనిపించింది.
        ఆ పూబోణీలు అక్కడ అడుగు పెట్టిన కాడి నుండి గాలిలో పూల పరిమలం అధికమైంది. మత్తెక్కించే మల్లెల వాసన. గాలి కూడా చల్లగా వీస్తూ శరీరానికి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తొంది. అట్లాంటి వాతావరణంలో అందంగా అలకరించుకున్న కన్నెపిల్లలను చూస్తుంటే మనసు వుర్రూతలూగుతొంది. మగాడై పుట్టి అలాంటి శరీరాకృతులను చూసి తట్టుకోవడం మహాకష్టం. అతని ప్రమేయం లేకుండానే అతని మగతనం గట్టి పడింది. 
        వారి సంభాషణ పెళ్లి మీదకు రాగానే మనసు మరింత బరువెక్కింది. 'అరేయ్. . . .వీళ్లు మనుసులై వుంటే ఎంత బాగుండేది. పెళ్లి కూతురులా ఆళ్ల మద్యలో కుచ్చున్న పిల్ల ఎంత అందంగా వుంది.' అని అనుకున్నాడు అంతరంగంలో. ఆ పాప మీదకి రాజు మనసు మరులు పోయింది.
        ఇంతలో ఆ ఆడగుంపులో వయస్సులో పెద్దదయిన ఆడది "అయితే వరుణ్ని మేమే ఎంపిక చేస్తాం . . . నీకు ఇష్టమేనా" అనింది. దానికా పెళ్లి కూతురు సిగ్గు పడుతూ తనకిష్టమే అన్నట్టు తలూపింది. ఆమె సిగ్గుని చూసి ఆట పట్టించారు.
        ఆ సందర్బానికి తగ్గట్టు ఒక పాట అందుకున్నారు.దానికి మిగిలిన వారు గొంతు గలిపారు.
                                                    వచ్చావటయ్యా పూల ఱేడా,
                                                    తెచ్చావటయ్యా పూల రాజా,
                                                    నీవు తెచ్చిన పూవులే కా
                                                    నికల కిస్తామూ
               
                                                    కోరి కోరినీ అందానికీ మా 
                                                    కోకిలమ్మా గొంతుకునకూ,
                                                    సొగసుచేతా పాటచేతా                                       
                                                    తగీపోయిందీ
   
                                                    రావయ్య ఓ పూల రాజా
                                                    రావయ్య ఓ అందగాడా
                                                    కోకిలమ్మకు నీవు, నీకూ
                                                    కోకిలా తగునూ
        అని పాటలు పాడుతూ ఆమెను అల్లరి పట్టిస్తుంటే ఆమె సిగ్గుతో తుర్రుమనింది. ఆమె వెంటే మిగిలిన ఆడపిల్లలు పరిగెత్తారు ఒకరిద్దరు తప్ప. ఆమె వెళ్లిన వెంటనే అంతవరకూ ఆ ప్రదేశాన్ని ఆవరించుకుని వున్న పూల పరిమళం ఆమె వెంటే వెళ్లిపోయింది. రాజు మనస్సు వుసూరు మంది. అప్పటికే తెల్లారిపోయే సూచనలు కనిపిస్తుండటంతో వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకున్నాడు.
         ఆ పెళ్లి కూతురు చంద్రభవన నాశనానికి కారణమైన రామాచార్యుల కూతురు పుష్పవళ్లే. ఆమెకు పువ్వులంటే ప్రాణం. అందుకనే ఆమెను ఆ భంగళాలో నివసిస్తున్న తోటి ఆడపిల్లల ఆత్మలు "నీకు పూల రాజుతోనే మనువు, ఆ వసంతుడి అందాన్ని చూసి నీవు కోకిల గొంతుతో పాటలు పాడి వాడిని సంతోష పెడితే, వాడు నీకు ప్రాణ ప్రదమైన పూవ్వుల లాగా చూసుకోవాల" అని ఆట పట్ట్టించేవారు.
         ఆ భవనానికి ఆమె రాణిలా, మిగిలిన వారు చెలికత్తెల్లా వుండేవారు. వారిదే ఆ కోట. వారందరికి పెద్ద పార్వతి. నడివయస్సు ఆడది. కాలుని పైశాచికత్వానికి బలైన ఆడది.పదేళ్ల కింద వారి ఆత్మలను భవనం నుండి విడిపించిన తరవాత అంతకు ముందు నుండి అక్కడ నివశిస్తున్న పిశాచాలను తరిమేసి ఆ ఆడ గుంపు మాత్రం మిగిలిపోయింది.
         రాజు వెనక్కి తిరిగి వెళ్లే సమయంలో పార్వతి మిగిలిన వారికి ఎదో చెబుతొంది. అది వినాలని చెవిని నిక్క బెట్టాడు.  
        "ఈ పెళ్ళితో మనం ఇక్కడ ఈ లోకంలో మిగిలిపోయిన కారణం పూర్తవుతుంది. అన్ని పనులు సక్రమంగా జరగాలి. మనం ఆయన చెప్పిన పనిని పూర్తీచేస్తే, మనకు విముక్తి లభించినట్టే. ఈ కార్యంతో లోక కళ్యాణమొకటి ముడిపడి వుందని ఆయన అనే వారు" అంటొంది.
        "అది సరే మరి పెండ్లి కొడుకెవరు" అనిందో పూబంతి.
        "ఇంకెవరు పూల రాజే"
        "ఎవరా పూల రాజు?"
        "రాజంటే రాజే!"
        "ఎవరా రాజు?"
        "అడిగో ఆ రాజు" అని రాతి వెనకనుండి తొండలా నిక్కి చూస్తున్న రాజు వైపు చేయి చూపించి. వెంటనే రాజు గుండెలు జారిపోయాయి. దెయ్యాలు తన వునికిని కనిపెట్టాయన్న విషయం రాజుకి అర్తం కాగానే పరిగెత్తి వెళ్లిపోవాలనుకున్నాడు. కానీ పరిగెత్త కుండా అక్కడే వుండిపోయాడు. ప్రాణం లేని దెయ్యం తననేమి చేస్తుందనే ధైర్యం కావచ్చు. కానీ ఆ ధైర్యం ఎక్కువసేపు నిలబడలేదు. దారిలో తనకు ఎదురైన శంకర్రావు కోడలు గుర్తుకు రాగానేఅయినా ధైర్యంగా నిలబడ్డాడు.  ధైర్యంగా వుంటే చాలు భయానికి ధైర్యమే విరుగుడు. "దెయ్యాలు కూడా ధైర్య వంతులని ఏమి జెయ్యలేవురా అబ్బిగా" అనేటోడు రంగప్ప మామ.
          "ఒరేయ్ అబ్బి, ఒగనాడు నేను మాయన్న యెన్నెల యెలుగులో గూటవ కట్టినాం చేను దున్నదామని, పాపం మీ పెద మామ నిద్రమత్తులో ఎద్దులను తిరగ గట్టినాడు. వలపట దాన్ని దాపట వైపు, దాపట దాన్ని వలపట వైపు. అంతే ఆ చిన్న గుట్ట మీది నుండి ఒక ఆడ మనిషి దిగొచ్చింది. పిచ్చి నా కొడకల్లారా ఎద్దులను సరిగ్గా కట్టడం నేర్చుకొండి అని చెప్పి యెల్లిపోయింది. అంతే ఆ పొద్దుటి నుండి రాత్రిపూట ఆ చేను జోలికే పోయేది లేదు. మా నాయనకి చెప్తే దెయ్యమన్నాడు. మా యమ్మకి చెపితే దేవత అనింది.
           అంతే గాదురా నాయనా ఆ రామ్మూర్తిగాడు, గొర్రెలు కాసుకునే యెదప ఆ గుట్టకాడ బాపనోళ్ల పాపను చెరచబోతే ఆయమ్మ వచ్చి వాని తలకాయను బండకేసి కొట్టి సంపేసింది. అమాయకపు ఆడపిల్లలను ఆయమ్మకు తెలిసేలా ఏమైనా చేశారంటే చాలు వానికి చావే గతి. హ్మ్మమ్మ్. .. అంతే సంపేత్తాది." అని రంగడు చెప్పినవన్నీ రాజుకు గుర్తుకు వచ్చాయి.
           రాజు ఆ రాతి మీద కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు. పార్వతి ముందుగా రాజుని చేరుకుంది. ఆమె వెనకాల మిగిలిన ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. రాజు చుట్టూరా గుండ్రంగా తిరుగుతూ రాజుని పరిశీలిస్తున్నారు.
          "ఎందుకలా తిరుగుతున్నారు?"అనడిగాడు.
          "అక్కా మనం ఈనికి కనపడతాండామె" అనింది ఓ పూబంతి.
           దానికి సమాదానంగా పార్వతి "నాకు తెలుసు" అనింది.
          "మరీ చిన్న పిల్లాడేమోనే మీసం గూడా సరిగ్గా రాలా" అని రాజు మూతిని వేళ్లతో గట్టిగా పట్టుకుని నోటిని వెడెల్పు చేసింది. ఎద్దు పళ్లని పరిశీలించి దాని వయస్సు చెప్పినట్టు "పల్ల వరస చక్కగానే వుంది. కానీ చిన్న వాడు"అనింది ఇంకో పూ బంతి.      
          "కానీ మన రాణెమ్మకి చక్కని జోడి"అనింది మరో పూబంతి.
          "రాణెమ్మ ఎవరు?" అనడిగాడు.
          "ఇంకెవరు మా కోకిలమ్మ. గొంతెత్తి పాడిందంటే చాలు వసంత కోకిల కూడా తలవంచాల్సిందే"
          "ఇంత వరకూ మాతో ఆడుకొనింది కదా నువ్వు చూడలేదా?"
          "సరిగ్గా చూడలేదు"
          "పరవాలేదు. మా సాంప్రదాయంలో వధువుని వరుడు పెళ్లికి ముందు చూడ్డం నిషిద్దం. సూత్ర ధారణ ముందు మాత్రమే ముఖం పరిచయం. అంత వరకు విరహమే." అనింది పార్వతి.
           నాలుగు గంటల సమయం దగ్గర పడే సమయానికి "ఇంక చాలు సమయం అవుతాంది లోపలికి పదండి" అని పూ బోణీలను అదిలించింది పార్వతి. వారులోపలికి వెళ్లిన క్షణాలకు పెద్ద మందిర ద్వారాన్ని మూసినట్టు కిర్రున శబ్దం వచ్చింది.    
           
Like Reply




Users browsing this thread: 8 Guest(s)