Posts: 7,242
Threads: 6
Likes Received: 14,007 in 2,240 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
రాము డోర్ తీసుకుని ల్యాబ్‍లోకి వచ్చాడు.
మేజర్ ఎక్కడ ఉన్నాడా అని మెల్లగా లోపలికి వస్తున్న రాముకి మేజర్ నాగేష్(వెంకట్) బుల్లెట్‍తో స్వాగతం పలికాడు.
దాంతో రాము వెంటనే తన నడుముకి ఉన్న పౌచ్‍లో గన్ తీసుకుని మేజర్ మీద కౌంటర్ ఫైరింగ్ చేస్తూ లోపలికి రావడానికి ట్రై చేస్తున్నాడు.
అలా వీళ్ళీద్దరూ ఫైరింగ్ చేసుకుంటుంటే ఇక్కడ సిస్టమ్‍లో వెంకట్ బ్రెయిన్ మెమరీ కాపీ అవుతున్నది.
ఫైరింగ్ చేసుకుంటున్న వాళ్ళిద్దరి గన్స్ లో బుల్లెట్లు అయిపోవడంతో మేజర్ నాగేష్(వెంకట్) ముందుకు దూకి రాముకి అవకాశం ఇవ్వకుండా కొడుతూ అతను కింద పడేలా కొట్టాడు.
దాంతో రాము కింద పడిపోయి పైకి లేవడానికి ట్రై చేస్తూ మేజర్‍ని అటాక్ చేస్తున్నాడు.
వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటుంటే అక్కడ ఉన్న గ్లాస్ డోర్స్, కొన్ని సిస్టమ్స్ పగిలిపోతున్నాయి.
మేజర్ ఒకసారి తలతిప్పి సిస్టమ్ వైపు చూసే సరికి అక్కడ సిస్టమ్‍లో కాపీ ప్రోగ్రెస్ బార్‍లో 43% కాపీ అయినట్టు చూపిస్తున్నది.
ఇదే అదనుగా రాము అక్కడ గ్లాస్ డోర్ పగలడంతో అక్కడ ఉన్న గ్లాస్ ముక్కను తీసుకుని కాళ్ళ మీద, చేతుల మీద గట్టిగా గాయపరిచాడు.
దాంతో మేజర్ నాగేష్ కాళ్ళు, చేతులు కదపలేక కింద పడిపోయాడు.
ఇక రాము అతనికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మేజర్ నాగేష్ రెండు కాళ్ళు, చేతులు కట్టేసి కదలకుండా చేసేసాడు.
కాని అప్పటికి ఇంకా కోపం చల్లారకపోవడంతో రాము పక్కనే ఉన్న గ్లాస్ ముక్కని తీసుకుని మేజర్ పొట్టలో మూడు పోట్లు పొడిచాడు.
అప్పటికి సిస్టమ్‍లో వెంకట్ బెయిన్ మెమరీ కాపీ ప్రోగ్రెస్ బార్‍లో 73% కాపీ అయినట్టు చూపిస్తున్నది.
రాము గన్ తీసుకుని మేజర్ నాగేష్ ని షూట్ చేయడానికి అతని వైపు గురి పెట్టాడు.
అది చూసిన మేజర్, “రాము….ప్లీజ్ నన్ను చంపొద్దు….నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను…” అంటూ రాముని బ్రతిమలాడుతూ చిన్నగా జరుగుతు అక్కడ ఉన్న టేబుల్‍కి ఆనుకోగానే డేటా కాపీ అయిపోయినట్టు సిగ్నల్ వినిపించింది.
అది విన్న మేజర్ నాగేష్ (వెంకట్) తన ఒంటి మీద గాయాలు పెడుతున్న బాధ అంతా మరిచిపోయి గట్టిగా నవ్వాడు.
మేజర్ నాగేష్ అలా సడన్‍గా నవ్వేసరికి రాముకి ఏదో అనుమానం వచ్చి, “ఎందుకలా నవ్వుతున్నావు,” అనడిగాడు.
“ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నీకు ఏమొస్తుంది….నువ్వు ఏది చెబితే అది చేస్తాను….నిన్ను కూడా వెయ్యేళ్ళు… కాదు….నీ ఇష్టం వచ్చినంత కాలం బ్రతికేలా చేస్తాను…నా మాట విను,” అన్నాడు మేజర్ నాగేష్.
“మరణం దేవుడు ఇచ్చిన వరం….అది లేకపోతే మనిషి బ్రతుకు బోర్ కొడుతుంది….అయినా నాకు అలాంటి ఆశ ఉన్నదని ఎలా అనుకున్నావు,” అంటూ రాము గట్టిగా అరిచాడు.
కాని అంతలొనే ఏదీ ఆలోచన వచ్చిన వాడిలా అక్కడ ఉన్న చైర్‍లో కూర్చుని ఆలోచిస్తూ తన ఫోన్ తీసుకుని రేణుకకి ఫోన్ చేసాడు.
రాము : హలో….రేణు….
రేణుక : హా…చెప్పండి…..
రాము : ఎక్కడ ఉన్నావు….
రేణుక : ఇంట్లోనే ఉన్నాను….ఏంటి సంగతి…అలా కంగారు పడుతున్నావెందుకు….అంతా బాగానే ఉన్నది కదా…..
రాము : అంతా బాగానే ఉన్నది….నువ్వు ఇప్పుడు వెంటనే న్యూరో రీసెర్చ్ సెంటర్‍కి వచ్చేయ్….
రేణుక : ఎందుకు రామూ….నీకు అంతా బాగానే ఉన్నది కదా….(అంటూ కంగారు పడింది.)
రాము : రేణూ…రేణూ….ఎక్కువ కొశ్చన్లు వేయకుండా నేను చెప్పిన చోటకు వచ్చేయ్….
రేణుక : సరె….రామూ….ఇప్పుడే బయలుదేరుతున్నా….(అంటూ ఫోన్ పెట్టేసింది.)
రాము కూడా ఫోన్ కట్ చేసి మేజర్ నాగేష్ వైపు చూసి, “ఇప్పుడు ఒకామె వస్తుంది….ఆమె బ్రెయిన్ డేటా మొత్తం కాపీ చేసి ఇంకొకరి బాడీలొకి ట్రాన్స్ ఫర్ చేస్తావా,” అనడిగాడు.
మేజర్ నాగేష్ (వెంకట్) : తప్పకుండా….ఇంతకు ఆమె ఎవరు….
రాము : ఆ విషయాలు నీకు అనవసరం….చెప్పింది చేస్తే బ్రతికి ఉంటావు…లేకపోతే ఇప్పుడే చంపేస్తాను….
మేజర్ నాగేష్ : సరె….సరె….ఇంతకు ఎవరి బాడీలోకి పంపించాలో అదైనా చెబుతావా…..
రాము కొద్దిసేపు ఆలోచించి వెంటనే మానసకు ఫోన్ చేసి ఆమెను కూడా ల్యాబ్‍కి రమ్మని చెప్పాడు.
దాంతో మానస ఏమీ ఆలోచించకుండా రాము పిలిచాడని చెప్పి బయలుదేరింది.
కాని రాము మనసులో ఆలోచనను మాత్రం పసిగట్టలేకపోయింది.
రాము : (ఫోన్ కట్ చేసి) మానస బాడీలోకి కాపీ చెయ్…..
మేజర్ నాగేష్ (వెంకట్) : తప్పకుండా....అలాగే కాపీ చేస్తాను….(అంటూ అక్కడ ఉన్న సిస్టమ్ ని దాని కోసం రెడీ చేస్తున్నాడు.)
అరగంటకు మానస, రేణుక ఒకరి తరువాత ఒకరు ల్యాబ్‍లోకి అడుగుపెట్టారు.
వాళ్ళిద్దరూ దాదాపుగా ఒకేసారి రావడంతో రాముకి ఏం చెయ్యాలో తోచలేదు.
రాము ఒంటి మీద దెబ్బలు, ఒళ్ళంతా గాయాలతో ఉన్న మేజర్ నాగేష్(వెంకట్), ల్యాబ్ అంతా చిందవందరగా ఉండటంతో మానసకు మాత్రం ఏం జరిగిందో అర్ధమయింది.
కాని ఇవేమీ తెలియని రేణుక మాత్రం రాము ఒంటి మీద దెబ్బలు చూసేసరికి కంగారు పడుతూ రాము దగ్గరకు వెళ్ళీ కావలించుకుని, “ఏమయింది….ఈ దెబ్బలేంటి,” అంటూ ఏడుస్తున్నది.
రాము కూడా రేణుక చుట్టూ చేతులు వేసి, “రేణూ….నాకు ఏమీ కాలేదు…బాగానే ఉన్నాను…ముందు ఆ ఏడుపు ఆపు,” అన్నాడు.
ఒక ముసలావిడ రాముని కౌగిలించుకుని ఏడవడం చూసి రాము ఆమె మనవడు అనుకున్నది మానస.
కాని రాము కూడా ఆమెను పేరు పెట్టి పిలవడం....అంతే కాకుండా కొంచెం అధికారం ఉన్నట్టు మాట్లాడుతుండటంతో అమెకు అర్ధం కాక వాళ్ళిద్దరిని అలాగే చూస్తున్నది.
రాము ఆమె దగ్గర నుండి తన దగ్గరకు రాగానే మానస తనతో పాటు ల్యాబ్‍లోకి వచ్చిన రేణుకని చూసి రాముని పక్కకు తీసుకెళ్ళి, “రామూ….ఈ ముసలావిడ ఎవరు ఇక్కడకు ఎందుకు వచ్చింది,” అనడిగింది.
“నేనే ఆమెను రమ్మన్నాను….నీకు అంతా వివరంగా చెబుతాను….ఇక్కడే కూర్చో,” అన్నాడు రాము.
అలాగే అని అక్కడే కూర్చున్నది.
రాము వెంటనే రేణుకని ఇంకో రూమ్ లోకి తీసుకెళ్ళి జరిగింది అంతా చెప్పి, “రేణుకా…నిన్ను ఇప్పుడు ఈ ముసలి శరీరం లోనుండి….ఆవిడ శరీరంలోకి పంపేలా ఏర్పాటు చేస్తున్నా,” అన్నాడు.
రాము చెప్పింది మొత్తం వివరంగా విన్న రేణుక ఆశ్చర్యపోతూ, “వద్దు రాము…ఇది చాలా తప్పు….ఇంకొకరి ఒంట్లోకి వెళ్ళి….వాళ్ళు అనుభవించాల్సిన సుఖాలను మనం అనుభవించాలనుకోవడం చాలా తప్పు…” అన్నది.
రాము : కాని నాకు నీతో సంతోషంగా గడపాలని ఉన్నది….
రేణుక : నాక్కూడా నీతో సంతోషంగా ఉండాలని ఉన్నది…కాని అది ఇలా కాదు….
రాము : ప్లీజ్ రేణు….నేను చెప్పింది విను….
రేణుక : నీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు….నాకు నీతో గడపలేదు అన్న ఒక్క బాధ తప్ప నేను నా జీవితంలో అన్ని సంతోషాలను చూసాను…నీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇన్నేళ్ళు గడిపాను….ఇప్పుడు నన్ను నువ్వు ఈ పని చేసి తప్పు చేయమంటున్నావు….అయినా ఒక వేళ నేను ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోవాలి కదా….
రాము : ఎవరైనా ఇలా చెబితే ఒప్పుకుంటారా….తెలియకుండా చెయ్యడమే…..
రేణుక : ఇది ఇంకా పెద్ద తప్పు రామూ….అయినా నువ్వు ఇలా తప్పుగా ఆలోచిస్తున్నావేంటి….మా అందరికీ మంచి చెప్పాల్సిన నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావా…ఇంకా జీవితంలో ఆవిడ ఏ సంతోషాలను అనుభవించలేదు….అలాంటి అమ్మాయికి నేను ద్రోహం చేయలేను…..నా వల్ల కాదు…..
రాము : నేను చెప్పినా వినవా…..
రాము అలా అనగానే రేణుక ఒక్కసారి రాము కళ్ళల్లోకి చూసి, “రామూ….నీకు ఎప్పుడైనా ఎదురు చెప్పానా….సరె… నువ్వు చెప్పినట్టు తప్పకుండా వింటాను….కాని ఒక్క షరతు,” అన్నది.
రాము : ఏంటది…..
రేణుక : నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను….కాని ఆవిడ పేరు ఏంటి…..
రాము : మానస….
రేణుక : హా….మానసకు మొత్తం నిజం చెప్పు….ఈ పనికి ఆవిడ ఒప్పుకుంటే నేను సంతోషంగా నువ్వు చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉన్నాను…..
మానస ఎలాగూ ఒప్పుకోదన్న విషయం రేణుకకి తెలుసు.
The following 12 users Like prasad_rao16's post:12 users Like prasad_rao16's post
• 7799335777, dprv.subbarao, Jack789, Manavaadu, Naga raj, ramd420, ravali.rrr, Ravi21, Sachin@10, sisusilas1@, SS.REDDY, Venkat 1982
Posts: 7,242
Threads: 6
Likes Received: 14,007 in 2,240 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
మానసే కాదు ఏ ఆడది ఈ పనికి ఒప్పుకోదని రేణుకకి తెలుసు….అందుకే రాము మాట కాదనలేక ఈ విధంగా చెప్పింది.
దాంతో రాము చేసేది లేక మానసని పిలిచి రేణుకని పరిచయం చేసాడు.
రాము : మానసా….ఈమె పేరు రేణుక……
మానస : హాయ్….బామ్మ గారు….(అంటూ రాము వైపు తిరిగి) నీకు నాయనమ్మ అవుతారా…..(అనడిగింది.)
మానస అడిగిన దానికి రాముకి ఏం చెప్పాలో తెలియలేదు.
రాము : నా నాయనమ్మ కాదు….నాకు భార్య అవుతుంది….
రాము అలా అనగానే మానస ఒక్కసారిగా బిత్తరపోయింది….ఆమె నోటి వెంట మాట రాలేదు.
రాముని, రేణుకని మార్చి మార్చి చూస్తున్నది.
రేణుక చూస్తే డెబ్బై ఏళ్ళు ముసలావిడ….రాము పాతికేళ్ళ కుర్రాడు….వీళ్ళిద్దరూ భార్యాభర్తలేంటి అన్న ఆలోచనతో రాము వైపు అయోమయంగా చూస్తున్నది.
మానస తన వైపు అలా ఎందుకు చూస్తుందో అర్ధం అయిన రాము, “మానసా….నీకు మా కధ పూర్తిగా వివరంగా చెప్పేంత టైం లేదు….అందుకని బ్రీఫ్‍గా చెబుతున్నాను….మా పెళ్ళి ఎలా జరిగింది అనేది మాత్రం చెబుతాను,” అంటూ జరిగింది మొత్తం చెప్పాడు.
రాము చెప్పింది విన్న మానసకు నమ్మబుధ్ధి కాలేదు….కాని రాము మొహం చూస్తుంటే అతను అబధ్ధం చెబుతున్నాడని అనిపించడం లేదు.
మానస : అంటే ఈమె నిజంగా నీ భార్యేనా……(అంటూ నమ్మలేనట్టు రాము వైపు చూస్తూ అడిగింది.)
రాము : మరి అదే కదా చెబుతున్నది….
మానస : నాకు అసలు నమ్మబుధ్ధి కావడం లేదు…నువ్వు కాలంలో వెనక్కు వెళ్ళడం ఏంటి…ఈమెను పెళ్ళి చెసుకుని పిల్లల్ని కన్న తరువాత మళ్ళీ నువ్వు నీ కాలానికి తిరిగి వచ్చి నీ ఫ్యామిలీని కలవడం….నాకు అంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కళ్ళ ముందు కదులుతున్నట్టు ఉన్నది….
రాము : ఇదంతా చెబితే ఎవరూ నమ్మరనే…..ఎవరికీ చెప్పలేదు….కాని పరిస్థితుల వలన నీకు చెప్పాల్సి వచ్చింది….
మానస : అందుకేనా మొన్న నువ్వు కౌన్సిలింగ్‍లో బావి గురించి చెప్పావు….
రాము : అవును….ఆ బావిలొ పడటం వలనే నేను నా కాలానికి తిరిగి వచ్చాను….
మానస : సరె….ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావు…..
రాము : వెంకట్ చేసిన experiment గురించి నీకు తెలుసు కదా…..
మానస : అవును….ఆ కేసు మిస్టరీ చేదించింది నువ్వే కదా…..
రాము : ఇప్పుడు నాకు రేణుకతో కలిసి బ్రతకాలని ఉన్నది…
మానస : ఎలా కుదురుతుంది రామూ….ఆమె చూస్తూ డెబ్బై ఏళ్ళ ముసలావిడ….నువ్వు చూస్తే ఇంకా పాతికేళ్ళ వయసు ఉన్నవాడివి….
రాము : నువ్వు ఒప్పుకుంటే కుదురుతుంది…..(అంటూ ఆమె కళ్ళల్లోకి చూడలేక తల దించుకున్నాడు.)
మానస : నేను ఒప్పుకుంటే….కుదిరేదేంది….(అంటూ రాము వైపు డౌట్‍గా చూస్తూ….) అంటే నీ ఉద్దేశ్యం వెంకట్ చేసిన experiment ద్వారా రేణుకని నా శరీరం లోకి పంపిద్దామనుకుంటున్నావా…..
రాము తల ఎత్తకుండానే అవునన్నట్టు తల ఊపాడు.
తన డౌట్ క్లియర్ అయ్యే సరికి….రాము అలా అనే సరికి మానసకి నోట మాట రాలేదు.
ఆమె కళ్ల వెంబడి కన్నీళ్ళు కారుతున్నాయి.
మానస : నిజంగా నువ్వేనా రామూ ఇలా మాట్లాడుతున్నది….(అంటూ ఇంకా మాట్లాడటానికి నోట మాట రాక అలాగే రాము వైపు చూస్తూ నిల్చుండి పోయింది.)
రాముకి కూడా తప్పు చేస్తున్నట్టు క్లియర్‍గా తెలుస్తుండటంతో మాసన కళ్లల్లోకి చూడలేక అలాగే తల వంచుకుని ఉన్నాడు.
రాము ఏమీ మాట్లాడకపోయేసరికి మానస ఇక రేణుక వైపు తిరిగి….
మానస : మీక్కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుందా…..
రేణుక : అది కాదమ్మా…..
మానస : ఏది కాదండీ….మీ స్వార్ధం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా…..
రేణుక : లేదమ్మా….నేను కూడా అదే చెప్పానమ్మా….రాము నా మాట వినడం లేదు….ఇక నావల్ల కాక నిన్ను ఒప్పించమని పంపించాను…నువ్వు ఎలాగూ ఒప్పుకోవని….అలా చెప్పాను….
రేణుక మాట కూడా వినడం లేదని అర్ధమయిన మానసకి ఏం చేయాలో తోచక అక్కడ ఉన్న చైర్‍లో కూర్చున్నది.
మానస అలా ఏడుస్తుంటే రాముకి చాలా బాధగా అనిపించి మెల్లగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ మానస దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసాడు.
దాంతో మానస ఒక్కసారిగా తల ఎత్తి రాము కళ్ళల్లొకి చూస్తూ ఇందాకటికంటే గట్టిగా ఏడుస్తూ చైర్‍లో నుండి లేచి రాముని గట్టిగా వాటేసుకుని ఏడుస్తూ, “రామూ….నువ్వంటే నాకు చాలా ఇష్టం…నాకు నీతో కలిసి బ్రతకాలని ఉన్నది… కాని నీకు నా మీద ప్రేమ లేదు,” అంటూ అతని ఛాతీ మీద తల పెట్టి ఏడుస్తూ ఒక చేత్తో రాము వీపుని గట్టిగా పట్టుకుని, ఇంకొ చేత్తో రాము గుండె మీద చిన్నగా కొడుతున్నది.
వాళ్ళిద్దరిని అలా చూసిన రేణుక కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి.
అప్పటికే ఆమె కూడా రాముకి పెళ్ళి చేద్దామని డిసైడ్ అవడంతో వాళ్ళిద్దరిని అలా చూసినా కూడా భాధ అనిపించలేదు.
కాకపోతే రాము తన మాట వినకుండా ఒక అమ్మాయికి అన్యాయం చేస్తున్నాడన్న భాధ మాత్రం ఆమెను నిలువనివ్వడం లేదు.
రేణుకు వాళ్ల దగ్గరకు వచ్చి రాము భుజం మీద చెయ్యి వేసి, “రామూ…..” అన్నది.
రేణుక మాట వినగానే రాము, మానస ఒక్కసారిగా సృహలోకి వచ్చి విడివడ్డారు.
రేణుక : రామూ….ఒక్కమాట అడుగుతాను సమాధానం చెబుతావా…..
రాము : ఏంటది రేణూ….
రేణుక : ఆ సైంటిస్ట్ ని ఎందుకు అంత పట్టుదలగా వెంటబడి మరీ పట్టుకున్నావు…..
రాము : అతను మర్డర్స్ చేసాడు…..ఐదుగురిని చంపేసాడు….
రేణుక : ఎందుకు చంపాడు….
రాము : అలా అడుగుతావేంటి రేణూ….వాడు ఒకళ్ళ శరీరంలో ఉండటానికి….తన పాత పగలు తీర్చుకోవడానికి ఈ భయంకరమైన పన్నాగం పన్నాడు…..
రేణుక : మరి నువ్వు చేస్తున్నదేంటి…నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు…అతను తన స్వార్ధం కోసం చేస్తే…నువ్వు నీ స్వార్ధం కోసం చేస్తున్నావు….అది తప్పు కదా.....
రాము : నేను స్వార్ధం కోసం చేయడం లేదు….మన ప్రేమను బ్రతికించుకోవడానికి ట్రై చేస్తున్నాను….నేను నీతో సంతోషంగా గడపాలనుకున్నాను….కాని…కుదరలేదు….నీకు మాత్రం నాతో సంతోషంగా గడపాలని లేదా….
రేణుక : నీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉన్నది రాము….నాక్కూడా నీతో సంతోషంగా జీవితం గడపాలని ఉన్నది… కాని దానికి ఇది మార్గం కాదు….ఒక ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకూడదు….నువ్వు కాలంలో వెనక్కు రావడం… నీతో పిల్లల్ని కనడం వరకే నా సంతోషం ముడిపడి ఉన్నది….అక్కడితో నా పని అయిపోయింది….దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి రాము….నీ సంతోషానికి నేను ఎప్పుడూ అడ్డు రాను….నీకు మళ్ళీ పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాను….
రాము : రేణూ….(అంటూ ఆశ్చర్యపోయాడు.)
రేణుక : అవును రామూ….నువ్వు ఒక రెస్పాన్స్ బుల్ జాబ్‍లో ఉన్నావు….ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని మన ఇంట్లో వాళ్ళకు తెలిసిందంటే….ఇప్పటి దాకా నిన్ను దేవుడిలా చూసిన వాళ్ళందరి దృష్టిలో ఒక్కసారిగా దిగజారిపోతావు….వాళ్ళందరిని బాధ పెట్టి….ఈ అమ్మాయి జీవితాన్ని బాధ పెట్టి మనిద్దరం సంతోషంగా ఎలా ఉండగలమనుకున్నావు….ఇప్పుడు నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా….తరువాత నువ్వు నీ తప్పు తెలుసుకున్నా అప్పుడు బాధ పడి ప్రయోజనం లేదు…..అందుకని నా మాట విని ఈ ఆలోచన మానుకో….ఇది చాలా తప్పు రాము….
అంటూ రాముకి ఇంకా నచ్చచెప్పాలని చూస్తున్నది….కాని మానస ఆమెని మధ్యలోనే ఆపుతూ….
మానస : వద్దు రేణు గారు….మీరు రాముని అంతలా బ్రతిమలాడాల్సిన పని లేదు….రాము ఏంటో…అతని ప్రేమ ఏంటో నాకు బాగా తెలుసు….(అంటూ రాము వైపు తిరిగి) నువ్వు ఎలా చెబితే అలా చేయడానికి నేను ఒప్పుకుంటున్నా రామూ….నాకు నీతో కలిసి బ్రతకడం కావాలి….ఈ పని చేయడం వలన నేను మానసికంగా నీకు దగ్గరగా లేకపోవచ్చు….కాని శారీరకంగా నీకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను కదా…..అది చాలు నాకు….(అంటూ కళ్ళు తుడుచుకుని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు రాము వైపు చూసింది.)
మానస అలా అనేసరికి రాము ఏమీ చెప్పలేక అలాగే చూస్తున్నాడు.
కాని రేణుక మాటలు మాత్రం రాము మనసుని అతలాకుతులం చేస్తున్నాయి.
Posts: 7,242
Threads: 6
Likes Received: 14,007 in 2,240 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
03-02-2020, 06:03 PM
(This post was last modified: 10-02-2020, 12:22 PM by prasad_rao16. Edited 2 times in total. Edited 2 times in total.)
దాంతో ఎటూ తేల్చుకోలేక ఏం చేయాలో తెలియక అలాగే కదలకుండా ఉన్నాడు.
ఇక మానస వెంటనే వెనక్కు తిరిగి మేజర్ నాగేష్ (వెంకట్) దగ్గరకు వెళ్ళి అతనితో, “వెంకట్….రేణుక గారి మెమరిని నా బాడీలోకి కాపీ చేయండి….” అన్నది.
నాగేష్(వెంకట్) : నిజంగానా…..
మానస : అవును….(అంటూ రేణుక వైపు తిరిగి) రేణుక గారూ….మీరు వచ్చి స్కాన్ చేయించుకుంటే మీ మొమరీని కాపీ చేసి నాలో ప్రవేశపెడతాడు….రండి….
మానస అలా అనగానే రేణుక ఒక్కసారి రాము వైపు తిరిగింది.
కాని రాము అలాగే మానస వైపు చూస్తున్నాడు….అతని మొహంలో ఏవిధమైన భావాలు కనిపించడం లేదు.
దాంతో రేణుక చిన్నగా రాము దగ్గరకు వచ్చి, “రామూ….ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో….ఆ అమ్మాయి నీ సుఖం కోసం, సంతోషం కొసం తన జీవితాన్ని పణంగా పెడుతున్నది….నాకు మాత్రం ఇష్టం లేదు….ఒకవేళ నీ బలవంతం మీద నేను ఈ పనికి ఒప్పుకున్నా….నీతో మాత్రం సంతోషంగా గడపలేను….” అంటూ రాము కళ్ళల్లొకి చూసింది.
కాని రాము ఏమీ మాట్లాడకపోయేసరికి ఇక చేసేది లేకపోవడంతో రేణుక మెల్లగా స్కాన్ మిషన్ దగ్గరకు వచ్చింది.
నాగేష్(వెంకట్) ఒక ఇంజక్షన్‍లో జెల్‍ని ఎక్కించి….రేణుకని స్కాన్ బెడ్ మీద పడుకోబెట్టి ఆమె తలకు ఆ జెల్ ఇంజక్షన్ చేసాడు.
దాంతో ఎలక్టానిక్ జెల్ రేణుక మెదడులో అన్ని న్యూరాన్స్ లోకి నానో మీటర్స్ రూపంలో ఫిక్స్ అయినట్టు అక్కడ మానిటర్‍లో చూపిస్తున్నది.
నాగేష్(వెంకట్) సిస్టమ్ ముందు కూర్చుని రేణుక బ్రెయిన్ మొత్తాన్ని కాపీ చేయడం మొదలుపెట్టాడు.
అది కాపీ అవుతున్నట్టు ప్రోగ్రెస్ బార్ పెరిగేకొద్ది రేణుక, మానస, రాము ముగ్గురిలో టెన్షన్ పెరిగిపోతున్నది.
రేణుక బ్రెయిన్ కాపీ అయిపోయినట్టు చూపిస్తుండటంతో నాగేష్(వెంకట్) మానస వైపు, “తరువాత నీదే వంతు,” అన్నట్టు చూసాడు.
నాగేష్(వెంకట్) చూపులో భావాన్ని అర్ధం చేసుకున్న మానస వెంటనే రేణుక దగ్గరకు వెళ్ళి, “మీ బ్రెయిన్ కాపీ అయిపోయింది రేణు గారు,” అన్నది.
దాంతో రేణుక స్కాన్ బెడ్ మీద నుండి దిగింది.
మానస ఆ బెడ్ మీదకు ఎక్కబోతూ ఒక్కసారి రాము వైపు చూసింది.
వెంటనే ఆ బెడ్ మీద నుండి దిగి రాము దగ్గరకు వెళ్ళి ఒక్కసారి గట్టిగా కౌగిలించుకుని, “ఇదే చివరి సారి రామూ…. నేను మానసికంగా నీ దగ్గర లేకపోయినా శారీరకంగా నీకు దగ్గరగా ఉంటానన్న తృప్తితో వెళ్తున్నాను….నేను ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉండాలనే కొరుకుంటున్నాను,” అంటూ రాము పెదవుల మీద ఒక ముద్దు పెట్టి మళ్ళీ స్కాన్ బెడ్ దగ్గరకు వచ్చి పడుకుని నాగేష్(వెంకట్) వైపు కానివ్వమన్నట్టు చూసింది.
నాగేష్(వెంకట్) ఎలక్ట్రానిక్ జెల్‍ని మానస మెదడుకి ఇంజక్ట్ చేయగానే అక్కడ మానిటర్‍లో మెదడులోని న్యూరాన్స్ లోకి నానో మీటర్లు ఫిక్స్ అయినట్టు చూపిస్తున్నాయి.
నాగేష్(వెంకట్) సిస్టమ్ దగ్గరకు వెళ్ళి రేణుక బ్రెయిన్ మెమరీ కాపీని మానస మెదడు లోకి ట్రాన్స్‍ఫర్ చేయడం మొదలుపెట్టాడు.
అందులో ప్రోగ్రెస్ బార్ పెరిగేకొద్ది మానస కళ్లల్లో నీళ్ళు ఆగడం లేదు.
రాము కూడా మనసులో ఒక వైపు తప్పు, ఇంకో వైపు రేణుక మీద ప్రేమ రెండు యుధ్ధం చేసుకోవడం మొదలుపెట్టాయి.
రేణుక మళ్ళి ఒక్కసారి రాము దగ్గరకు వెళ్ళి, “రాము…ఇప్పటికైనా మించి పోయింది లేదు….ఈ ప్రాసెస్‍ని అపెయ్…” అంటూ బ్రతిమలాడుతున్నది.
కాని రాము ఏమీ మాట్లాడకపోయేసరికి రేణుక ఇక చేసేది లేక అక్కడ చైర్‍లో కూర్చుని బాధపడుతున్నది.
అలా ప్రోగ్రెస్ బార్ 95% కి రాగానే….ఇంకో ఐదు శాతం కాపీ పూర్తవగానే మొత్తం మెమెరీ మానస బ్రెయిన్‍లో కాపీ చేయడం పూర్తి అయిపోతుంది అనగా అక్కడ ఎవరూ ఊహించని విధంగా రాము తన నడుముకి ఉన్న పౌచ్‍లో నుండి రివాల్వర్ తీసి కాపీ చేసున్న సిస్టమ్‍ని, అక్కడ ఉన్న ప్రతి ఎక్విప్‍మెంట్‍ని పనికిరాకుండా షూట్ చేసాడు.
దాంతో సిస్టమ్ పనిచేయకపోయేసరికి కాపీ ప్రాసెస్ మధ్యలో ఆగిపోయింది.
అది చూసిన నాగేష్(వెంకట్) కొపంగా రాము వైపు చూస్తూ, “ఏం చేసావో తెలుస్తుందా నీకు….ఇంత పెద్ద ప్రయోగాన్ని మధ్యలో ఆపేసావు….పైనా ఎక్విప్‍మెంట్ మొత్తం నాశనం చేసావు….ఎంత ఖర్చు అవుతుందో తెలుసా…ఇంత మూర్ఖంగా చేసావు,” అంటూ మీదకు వస్తున్నాడు.
రాము వెంటనే నాగేష్(వెంకట్) కాళ్ళ మీద షూట్ చేసాడు.
దాంతో నాగేష్(వెంకట్) కింద పడిపోయి నొప్పితో గిలగిలలాడిపోతున్నాడు.
రాము చేసిన పనికి రేణుక మొహంలొ సంతోషం కనిపించగా….మానస మొహంలో ఆశ్చర్యం కనిపిస్తున్నది.
దాంతో రాము వెంటనే మానస దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని, “సారీ….మానసా…..నీ ప్రేమని అర్ధం చేసుకోలేక పోయాను….రేణుకని బ్రతికించుకోవాలన్న స్వార్ధంతో నీకు అన్యాయం చేయాలనుకున్నాను….కాని నువ్వు నన్ను అసహ్యించుకోకపోగా నా కొసం ఈ త్యాగానికి సిధ్ధపడ్డావు….నన్ను క్షమించు,” అన్నాడు.
రాము అలా అనగానే మానస కూడా సంతోషంతో రాముని గట్టిగా కౌగిలించుకుని, “రామూ….ఇందులో క్షమాపణలు చెప్పడానికి ఏమున్నది…నీ ప్రేమ కొసం నువ్వు చేసావు….నా ప్రేమ కోసం నేను చేసాను….కాని ఇలాంటి ప్రయోగాలు ఎప్పటికైనా ప్రమాదమే,” అన్నది.
రాము : అవును మానసా….నన్నే ఒక్క నిముషం ఈ ప్రయోగం తప్పుగా అలోచించేలా చేసింది….ఇలాంటి ప్రయోగాలు సమాజానికి మేలు చేయకపోగా దీని వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది…..(అంటూ మళ్ళి నాగేష్(వెంకట్) దగ్గరకు వచ్చాడు.)
రాము తన చేతిలో గన్ తీసుకుని నాగేష్ తలకు ఎయిమ్ చేసి, “ఒక్క నిముషం నన్ను కూడా నీ రూట్‍లోకి తెచ్చుకున్నావు…..నిన్ను ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం,” అన్నాడు.
నాగేష్ భయపడుతూ, “వద్దు….నన్ను చంపొద్దు….ప్లీజ్….” అంట్రూ రాముని బ్రతిమలాడటం మొదలుపెట్టాడు.
“ఏరా...నువ్వు ఎంతమందిని చంపావు….అప్పుడు నీకు జాలి అనిపించలేదా….ఆఖరికి ఇపుడు నువ్వు ఉన్న ఈ శరీరం కూడా నీది కాదు…నువ్వు చిన్నప్పుడు కలిసి చదువుకున్న నీ ఫ్రండ్‍ది…మరి ఆయన శరీరంలోకి దూరినప్పుడు నీకు ఏమీ అనిపించలేదా….నీలాంటి వాడు బ్రతికి ఉండటం సమాజానికి చాలా చేటు కలిగిస్తుంది… నిన్ను జైల్లో పెడితే ఇపుడు నా మైండ్‍ని పొల్యూట్ చేసినట్టే అక్కడ వాళ్ళ మైండ్ కూడా పొల్యూట్ చేస్తావు,” అంటూ ఇక నాగేష్‍కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గన్‍లో ఉన్న బుల్లెట్లు మొత్తం నాగేష్(వెంకట్) బాడీలోకి దింపేసాడు.
దాంతో నాగేష్(వెంకట్) చలనం లేకుండా పడిపోయాడు.
రాము మారిపోయి మంచిగా నిర్ణయం తీసుకోవడంతో రేణుక కూడా ఆనందంగా రాముని వాటేసుకున్నది.
మానస కూడా రాము దగ్గరకు వచ్చి వెనకనుండి గట్టిగా వాటేసుకున్నది.
అలా ఒక్క నిముషం గడిచిన తరువాత రాము వాళ్ళిద్దరి కౌగిలి నుండీ విడిపించుకుని, “పదండి….ఇక్కడ నుండి వెళ్దాం….ప్రసాద్ ఎలా ఉన్నాడో చూద్దాం,” అంటూ తన దగ్గర ఉన్న వాకీటాకీని తీసి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఇక్కడ జరిగింది చెప్పి ఫార్మాలిటీస్ పూర్తి చేయమని చెప్పాడు.
అలాగే కమీషనర్‍కి ఫోన్ చేసి జరిగింది చెప్పి నాగేష్(వెంకట్)ని ఎన్‍కౌంటర్ చేసిన విషయం మొత్తం చెప్పేసాడు.
దాంతో కమీషనర్ అలాగే అని ల్యాబ్ దగ్గరకు వచ్చాడు.
అతను రాగానే మొత్తం జరిగింది చెప్పి, “సార్….ప్రసాద్ దగ్గరకు వెళ్తున్నా….ఏదైనా అవసరం అయితే పిలవండి సార్,” అన్నాడు.
“అదేంటి రామూ….ఈ న్యూస్ ప్రెస్‍కి రీలీజ్ చేద్దాం….కొద్దిసేపు ఉండు,” అంటూ కమీషనర్ రాముని ఆపి అక్కడ ఉన్న కానిస్టేబుల్‍తో రేణుకని, మానసని హాస్పిటల్‍లో దింపమని చెప్పాడు.
దాంతో కమీషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేసు వివరాలు మొత్తం చెప్పి రాము, ప్రసాద్ కలిసి ఈ కేసుని ఎలా ఛేధించారో వివరంగా చెప్పారు.
ఆ కేసు గురించి చెబుతున్నంత సేపూ ప్రెస్ వాళ్ళు నమ్మలేనట్టు చాలా సైలెంట్‍గా ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆసక్తిగా విన్నారు.
మొత్తం చెప్పిన తరువాత రాము ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రెస్‍కి రిలీజ్ చేసారు.
ఆ తరువాత రెండు రోజులు టీవీల్లో ఈ కేసు గురించి, కేసుని సాల్వ్ చేసిన రాము, ప్రసాద్, అతని టీం గురించే చర్చలు జరిపారు.
ఇదంతా ప్రసాద్ హాస్పిటల్‍లో ఉన్న టీవిలో చూసి చాలా సంతోషపడిపోయాడు.
వారం రోజుల తరువాత ప్రసాద్ హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యాడు.
తరువాత రోజు రాము, ప్రసాద్ ఇద్దరూ కమీషనర్ ఆఫీస్‍కి వెళ్లారు.
రాము, ప్రసాద్ లోపలికి వెళ్ళి కమీషనర్‍కి సెల్యూట్ చేసారు.
కమీషనర్ కూడా వాళ్ళ వైపు చూసి కూర్చోమన్నట్టు చైర్స్ వైపు చూపిస్తూ ప్రసాద్‍తో, “ఎలా ఉన్నది ప్రసాద్….అంతా బాగానే ఉన్నది కదా,” అనడిగాడు.
ప్రసాద్ : అంతా బాగున్నది సార్….డ్యూటీలో జాయిన్ అవడానికి ఫార్మాలిటీస్ కూడా పూర్చి చేసాను….
కమీషనర్ : గుడ్…గుడ్….(అంటూ రాము వైపు చూస్తూ)….ఇప్పుడు మీ ఇద్దరికీ ఒక న్యూస్ చెబుదామని పిలిచాను.
రాము : ఏంటి సార్….అది….
కమీషనర్ : ఇంత క్రిటికల్ కేస్ సక్సెస్‍ఫుల్‍గా సాల్వ్ చేసినందుకు నిన్ను యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్ మెంట్‍కి ట్రాన్స్‍ఫర్ చేస్తున్నట్టు ఆర్డర్స్ వచ్చాయి….
రాము : చాలా హ్యాపీగా ఉన్నది సార్…..ప్రమోషన్ కన్నా చాలా సంతోషంగా ఉన్నది సార్….
కమీషనర్ : కాని అక్కడ ఇంత దూకుడు పనికి రాదు రాము….చాలా జాగ్రత్తగా ఉండాలి…క్రైం డిపార్ట్ మెంట్‍లో ఉంటేనే ఇప్పడికి పన్నెండు ఎన్‍కౌంటర్లు చేసావు….ఇంకా కొన్ని లెక్కలోకి రాకుండా చాలా జాగ్రత్తగా కేసులు క్లోజ్ చేసావు….
రాము : అవన్నీ ఎందుకు చేసానో మీక్కూడా తెలుసు కదా సార్…..
కమీషనర్ : అందుకనే…ఎప్పుడూ నిన్ను సపోర్ట్ చేస్తున్నాను….ఇప్పుడు కూడా నిన్ను ఆ డిపార్ట్ మెంట్‍కి పంపించడం నాకు ఇష్టం లేదు….కాకపోతే నువ్వు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నావని accept చేస్తున్నా…..(అంటూ ప్రసాద్ వైపు చూసి) రాముతో పాటు నీకు కూడా అవార్డ్ ప్రకటించారు….
ప్రసాద్ : చాలా థాంక్స్ సార్….మరి నా పరిస్థితి ఏంటి సార్….
కమీషనర్ : పరిస్థితి ఏంటి…అవార్డ్ ఇస్తున్నారు కదా…..
ప్రసాద్ : అదే….నన్ను కూడా రాము సార్‍తో పాటు యాంటీ టెర్రరిస్ట్ డిపార్ట్‍మెంట్‍లోకి పంపించడం లేదా….
కమీషనర్ : ఏంటి నువ్వు కూడా వెళ్తావా…..
ప్రసాద్ : ట్రాన్స్ ఫర్ చేయండి సార్….రాము సార్‍తో నాకు చాలా హ్యాపీగా ఉన్నది….
కమీషనర్ : రాముకి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నది….కాని ఆ డిపార్ట్ మెంట్ చాలా డేంజర్….ప్రాణాలకే ప్రమాదం…..
ప్రసాద్ : నాకు రాము సార్ మీద పూర్తి నమ్మకం ఉన్నది సార్….ఆయన తనతో పాటు ఉండే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు…ఇన్నాళ్ళూ ఆయనతో పని చేసాను….ఇక పోయే టైం వస్తే ఏం చేయలేం సార్…..
కమీషనర్ : సరె…నీ ఇష్టం…నిన్ను రాము అసిస్టెంట్‍గా ట్రాన్స్ ఫర్ చేస్తాను….
ప్రసాద్ : థాంక్యూ వెరీ మచ్ సార్….
కమీషనర్ : (రాము వైపు చూసి) ప్రసాద్‍ని బాగా మాయ చేసావు రాము…..
రాము : నేను మాయ చేయడం ఏంటి సార్….అతను ఏమైనా అమ్మాయా….మాయ చేయడానికి…(అంటూ నవ్వాడు.)
ఆ మాట వినగానే ప్రసాద్, కమీషనర్ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.
కమీషనర్ : నువ్వు ఎంత రోమియోవో నాకు బాగా తెలుసు రామూ….కాని జాగ్రత్త….ఈ మధ్య స్ట్రింగ్ ఆపరేషన్స్ చాలా చేస్తున్నారు….
రాము : అలాగే సార్…..
ఇద్దరూ అక్కడ నుండి బయటకు వచ్చారు.
రాము, ప్రసాద్ ఇద్దరినీ ఈ కేసు సాల్వ్ చేసినందుకు ప్రభుత్వం వాళ్ళిద్దరికీ అవార్డ్ తో పాటు స్పెషల్ కమెండో ట్రైనింగ్‍కి పంపించారు.
అలా కొద్ది రోజుల తరువాత ట్రైనింగ్ కి వెళ్ళాల్సి ఉండగా రాము, ప్రసాద్ తమకిష్టమైన కాఫీషాప్ లో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు.
ప్రసాద్ : సార్....ఇంతకీ మీరు జరీనా మేడమ్ ని అనుభవించారా....
రాము : ఇంకా మరిచిపోలేదా....
ప్రసాద్ : కంటిన్యూ చేయండి సార్....చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది....
రాము : ఆ రోజు ఏం జరిగిందంటే.......(అంటూ మధ్యలో ఆపిన తన స్టోరిని కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు.....)
(To B Continued..........)
(తరువాత అప్డేట్ 870వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=27&page=870)
The following 19 users Like prasad_rao16's post:19 users Like prasad_rao16's post
• AB-the Unicorn, abinav, ceexey86, gudavalli, hai, Jack789, mahi, Manavaadu, Naga raj, ramd420, ravali.rrr, Ravi21, Sachin@10, sisusilas1@, Sivakrishna, spicybond, SS.REDDY, unknown 786, Venkat 1982
Posts: 336
Threads: 5
Likes Received: 170 in 111 posts
Likes Given: 101
Joined: Nov 2018
Reputation:
15
•
Posts: 203
Threads: 0
Likes Received: 64 in 58 posts
Likes Given: 192
Joined: Dec 2018
Reputation:
1
•
Posts: 3,989
Threads: 0
Likes Received: 2,710 in 2,202 posts
Likes Given: 42
Joined: Jun 2019
Reputation:
20
వావ్ ప్రసాద్ గారు అప్డేట్ ఇరగదీశారు, మరళ జరీనా మేడం వచ్చింది, ఇంక్క పండగే పండగ.
•
Posts: 1,329
Threads: 0
Likes Received: 1,059 in 706 posts
Likes Given: 36
Joined: Oct 2019
Reputation:
11
Wow super మధ్యలో ఆగిన జరీనా స్టోరీ మొదలుపెడుతున్నారు. చాలా థాంక్స్. అప్డేట్ సూపర్
•
Posts: 6,540
Threads: 0
Likes Received: 3,065 in 2,570 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
35
•
Posts: 983
Threads: 4
Likes Received: 528 in 312 posts
Likes Given: 699
Joined: Nov 2018
Reputation:
3
03-02-2020, 09:10 PM
(This post was last modified: 03-02-2020, 09:11 PM by sandycruz. Edited 1 time in total. Edited 1 time in total.)
Prasad rao Garu... Evalti update blockbuster Andi... Ramu ni negative shade lo chala baga chupincharu... Renu ni transfer chesesi dual mind la chestaru anukunna kani srusti ki virudham GA em cheyakunda chala baga end chesaru... Manasa ki Ramu ki pelli chestaru anukunna... Nenu ite Manasa character introduce ayinappati nundi chustunna Valla pelli kosam... Manasa tho pelli chestara leka inka emaina plan chesaro chudali...
Malli zareena ni teeskocharu... Eppudu Malli zareena fans antha Valla bodies lo activate ipotaru...
•
Posts: 762
Threads: 1
Likes Received: 256 in 216 posts
Likes Given: 3,019
Joined: Jun 2019
Reputation:
6
Ekaa aipoledaaaa kani continue chaidi sir epatiki interest ga vudi storie
•
Posts: 8,182
Threads: 1
Likes Received: 6,211 in 4,395 posts
Likes Given: 50,537
Joined: Nov 2018
Reputation:
107
వావ్ ఓక సస్పెన్స్ థ్రిల్లర్ చూపించారు
అప్డేట్ బాగుంది
•
Posts: 406
Threads: 2
Likes Received: 55 in 47 posts
Likes Given: 11
Joined: Nov 2018
Reputation:
7
Adbhutam ga rasaru Prasad Garu. Mundu Mee mind ki hatsoff cheppali itlanti thoughts vachinanduku. Ekuva laagakunda entavaraku rayalo meeku telisinatlu chala mandiki teledemo. Ekada bore anipinchale ee mission matram. Prasad matram baaga gurtu unchukunnatlu unnadu zareena madam ni.prasad tho paatu memu kuda baaga gurtu unchukunnam. And meeku kudirite starting page lo index pettadaniki try cheyandi or mottam PDF file ivvadanikaina try cheyandi.
•
Posts: 303
Threads: 0
Likes Received: 116 in 89 posts
Likes Given: 151
Joined: May 2019
Reputation:
2
ప్రసాద్ గారు మీ కథ అద్భుతం. మి రచనా శైలి మహ అద్భుతం.your marvelous.thank u sir wonderful update
•
Posts: 221
Threads: 0
Likes Received: 33 in 29 posts
Likes Given: 0
Joined: Apr 2019
Reputation:
2
•
Posts: 2,316
Threads: 0
Likes Received: 1,599 in 1,301 posts
Likes Given: 579
Joined: Jan 2019
Reputation:
5
•
Posts: 1,176
Threads: 0
Likes Received: 799 in 627 posts
Likes Given: 877
Joined: Nov 2018
Reputation:
13
•
Posts: 2,956
Threads: 0
Likes Received: 1,205 in 997 posts
Likes Given: 8,865
Joined: Jan 2019
Reputation:
13
•
Posts: 311
Threads: 0
Likes Received: 80 in 68 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
2
•
Posts: 5,114
Threads: 0
Likes Received: 3,000 in 2,505 posts
Likes Given: 6,290
Joined: Feb 2019
Reputation:
19
•
Posts: 57
Threads: 0
Likes Received: 13 in 10 posts
Likes Given: 7
Joined: Oct 2019
Reputation:
1
అప్డేట్ చాలా బాగుంది.... అంతకంటే ఎక్కువ నొ జెరీనా డార్లింగ్ మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతుంది
•
|