13-11-2018, 01:30 PM
Nice update
Romance "అతి"మధురం
|
13-11-2018, 01:30 PM
Nice update
22-11-2018, 10:37 PM
26.చెప్పలేను...
"నన్నెందుకు మోసం చేసావ్ రియా...?"అన్న విజయ్ మాటతో...అతని కళ్ళలోకి చూసింది రియా "విజయ్...."అంది కన్నీళ్ళు దిగమింగుకుంటూ...... "ఐ యాం ఎక్స్ పెక్టింగ్ యూ టూ సే ద ట్రూత్..."అన్నాడు విజయ్ చేతులు ముడుచుకుంటూ "ఎందుకలా అంటున్నావ్ విజయ్...?"అడిగింది రియా తన ఫోన్ లోని గ్యాలరి ఓపెన్ చేసి....రియ-విక్కి క్లోస్ గా వున్న పిక్ ని చూపించాడు విజయ్....అది చూసిన రియా భారంగా గాలి వదులుతూ... "నిన్నే కాదు విజయ్ నన్ను నేనే మోసం చేసుకున్నాను...అభి..ఐ మీన్ విక్కి ఐ మీన్ విక్రాంత్ అభిమన్యు లేకుండా బతకగలను అనుకున్నాను..కాని నా వల్ల కాలేదు..."అంటూ ఆగింది రియా ఆ పేరు వినడం తోనే విజయ్ భృకుటి పడింది..."వాట్....నువ్వు చెప్పిన అభి...?విక్కి ఒకరేనా...?"అడిగాడు విజయ్ అవున్నన్నట్టు తలూపింది రియా..... "విజయ్...నేను అభి ని ప్రేమించాను...ఇన్ ఫాక్ట్ తనకి కూడా చెప్పాను...తన కోసం అమెరికా కూడా వచ్చాను...అప్పుడె నువ్వు కరెక్ట్ గా ఇండియా వచ్చి వున్నావు.....అభి నీ పిక్ తన గ్యాలరి లో చూపించాడు...నువ్వు తనకి నీ కంపెని లో జాబ్ ఆఫర్ చేసిన సంగతి కూడా తను నాకు చెప్పాడు....ఇన్ ఫాక్ట్ నేను నీకు అభి భార్య గా పరిచయమవ్వాల్సింది...కాని అలా జరగలేదు దానికి కారణం .....నా మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ ఒకరోజు ఒంట్లో నలతగా వుందని హాస్పిటల్ కి వెళ్ళిన నాకు అక్కడి డాక్టర్ ఏవో టెస్ట్లు చేసి నేను ఎక్కువ కాలం బతకను అని చెప్పారు...నాకు ఏం చెయ్యాలో పాలుపోలేదు......అభి నేను లేకుండా బతకలేడని తెల్సు...నేను లేకపోయినా తను నన్ను తల్చుకోకుండా వుండాలి అని ఆలోచించాను.....ఒకవేళ నేను తనకి దూరమయినా నా ఙపకాలతో తను బతికేస్తాడని నాకు తెల్సు అలా జరగకూడదని నీకు దగ్గరయ్యాను...కాని నేనలా వుండలేకపోయాను....అందుకే ఆ రోజు బస్ లో నీకు ప్రపోస్ చేసినా ఆ టాపిక్ మళ్లి మనమధ్య తీసుకు రాలేదు....ఆ తర్వాత నువ్వొచ్చి ప్రపోస్ చేసినప్పుడు నో చెబుదామనుకుంటుండగా అభి రావడం కనిపించింది...ఇక నో చెప్పలేకపోయాను...ఆ తర్వాత అయినా నీతో మాట్లాడదాం అనుకున్నా కాని నువ్వు ప్రాజెక్ట్ పని మీద వెళ్ళిపోయావ్....ఈ మధ్యలో.....నేను అభి నుంచి దూరంగా వుండలేనన్న నిజం నాకర్థం అయ్యింది......నా జబ్బు విషయం తెల్సినప్పుడు నేను దానికి తగిన మందులెప్పుడు వేసుకోలేదు...సో దట్ తను వచ్చేలోపు చనిపోతే బెటర్ అని...కాని అలా జరగలేదు.,....మీన్ వైల్ నా చివరి రోజులు అభి తో వుండాలనిపించింది....అందుకే మెడిసిన్ తెచ్చుకోవడానికి వెళ్తే....తెల్సింది ఏమనగా నాకెలాంటి జబ్బు లేదని...అనవసరంగా నేనే చేజేతులారా ఇదంతా చేసుకున్నాని.....ఇదంతా నాకివాళె తెల్సింది...ఐ హోప్ యూ అండర్ స్టాండ్..."అంది రియా తను చెప్పడం పూర్తి చేస్తూ "అభి కి చెప్పావా...?"అడిగాడు విజయ్ "లేదు....నీ దగ్గరికి వచ్చేముందు ఐ హ్యాడ్ ఏ బ్యాద్ డ్రీం....సో"అంది రియా "నీకేమైనా పిచ్చా.....?ఇప్పుడే చెప్పు...."అని అభి కి ఫోన్ కలపబోతుండగా.... "నో...విజయ్...చెబుతాను కాని ఇవాళ కాదు.....లెట్ మీ ప్రిపేర్...తను ఎలా మాట్లాడినా నేను తట్టుకోగలగాలి...సొ గివ్ మి సం టైం...యండ్ థ్యాంక్యూ ఫర్ అండర్ స్టాండింగ్ మి...."అని లేచింది రియా.... తనకి బై చెప్పి.....ఒంటరి గా నడవసాగాడు విజయ్ "నేను చేసింది కరెక్ట్ ఆ తప్పా...?"ఆలోచించసాగాడు విజయ్..... తనలో ఒక భాగం రియా ని వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేదు ...మరొక భాగం తనని ప్రేమించని అమ్మాయి తనెలా ఆనందంగా వుండగలడు అని వాదిస్తుంది.... రియా ని వదులుకోవడానికి ఇష్టపడని భాగం....ఒకవేళ రియా ని అభి నుంచి దూరం చేస్తే అప్పుడు తను కచ్చితంగా ప్రేమిస్తుంది కదా అన్న ఆలోచనని రేకెత్తిచింది...నిజమే కదా అనుకుంది రెండవ భాగం..... ********* మరుసటి వుదయం......అభి కి ఇష్టమైన పింక్ కలర్ కుర్తి లో మెరిసిపోతుంది రియా......ఆఫీస్ కి చేరుకుని ఎంట్రంస్ లో అడుగుపెట్టిందో లేదొ.....అక్కడ రిసెప్షెనిష్ట్ తో మాట్లాడుతున్న విజయ్...అప్పుడే పని మీద బయట కొచ్చిన అభి ఇద్దరూ కళ్లార్పకుండా తననే చూడసాగారు..... విజయ్ ని చూసిన రియా...కళ్ళతో తనెలా వున్నానంటూ సైగ చేసింది...."సూపర్ "అని కళ్ళతోనే తెలిపాడు విజయ్.....వాళ్ళిద్దరి చూపులు చూసిన అభి కి లోపల చెప్పలేనంత బాధ..... ఇంతలో రియా ఫోకస్ అభి వైపు షిఫ్ట్ అయ్యింది.....రియా చూపు తన వైపు నుంచి తప్పుకోవడం తో సేం అదే బాధ విజయ్ మనసులో వచ్చి చేరింది..... అభి ని చూడగానే రియా కళ్లలో వచ్చిన మెరుపు విజయ్ చూపు దాటి పోలేదు.....రియా అభి ని సమీపిస్తుండగా అబి కొత్తగా జాయిన అయిన షాలిని క్యూబికల్ వైపు నడవడం చూసి......తన అడుగులు కాస్తా ఆగిపోయాయి...... షాలిని క్యూబికల్ నుంచి బయటకొచ్చిన విక్కి చిరునవ్వులు చిందిస్తూ తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు......అభి ని అలా చూసిన రియా ఉత్సాహం నీరు గారి పోయింది...తన క్యూబికల్ లోకి అసహనం గా వెళ్ళి వర్క్ చేస్కోసాగింది...... 2 గంటల తర్వాత.....కోపం తగ్గిన రియా అభి క్యాబిన్ కి వెళ్దామని లేచి నిల్చుందో లేదొ....అభి షాలిని క్యూబికల్ వైపు నడుస్తూ కనిపించాడు అసహనంగా కుర్చిలో కూలబడిన రియా దగ్గరికి వచ్చాడు విజయ్.... "రియా...హౌ ఎబౌట్ ఎ కాఫీ..."అన్నాడు విజయ్ రియా కి వెళ్ళాలని లేకున్నా అభి అక్కడే వుంటాడు అని విజయ్ తో పాటు వెళ్ళింది....ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు....వాళ్లకి ఆపోసిట్ టేబుల్ లో షాలిని-అభి కూర్చున్నారు........ "ఇంతకి ఎప్పుడు చెబుతున్నావ్...?"అడిగాడు విజయ్ "చెప్తాను...కాని ఎక్కడ అభి ఎప్పుడూ ఆ షాలిని తోనే వుంటున్నాడు..."అంది రియా తనలా అసహనం వ్యక్తం చేస్తుండగానే అభి షాలిని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ కనిపించాడు......ఇంక రియా వల్ల కాలేదు...... "ఏం చెయ్యాలి...ఏం చెయ్యాలి..."అని ఆలోచిస్తూ.....తన కాఫీ కప్పులో సడన్ గా చెయ్యి పెట్టింది....."అమ్మా...."అని అరిచింది....... అంతే వెనక్కి తిరిగి చూసిన అభి.......తన కోసం రాబోతూ......అక్కడ కనిపించిన దృశ్యాని చూసాగిపోయాడు ******#####******
23-11-2018, 04:21 PM
Nice update
24-11-2018, 10:47 AM
Bro e story naaku baga nachindi.. Twists meeda twists tho manchi feel kaligistundi.. Next update kosam 1 weak nundi waiting.. Update plzee
24-11-2018, 11:48 AM
27. లెట్స్ టాక్
విజయ్ రియా చేతిని తన చేతిలోకి తీస్కుని ఊదుతున్నాడు.......అది చూసిన అభి అక్కడ నుంచి లేచి వెళ్ళాడు....వెను వెంటనే రియా కూడా అభి వెంట వెళ్ళింది.....షాలిని-విజయ్ బాధ-షాక్ లో వాళ్ళిద్దరి వైపు చూడ్డం తప్ప ఏం చెయ్యలేదు..... "అభి...అభి....ఆగు..."అంది రియా వెనక నుంచి.....ఆగకుండా వెళ్ళిపోతున్నాడు అభి.....ఫాస్ట్ గా నడిచిన రియా అతన్ని అందుకుని అతని చెయ్యి పట్టుకుని పక్కకి లాగింది...... "ఎందుకు అలా వెళ్ళిపోతున్నావ్...?విజయ్ నా చెయ్యి పట్టుకున్నాడనా...?"అడిగింది రియా "నీ చెయ్యి ఎవరు పట్టుకుంటే నాకెందుకు....?"అన్నాడు అభి "ఏది అదే మాట నా కళ్ళలో చూసి చెప్పు.,..."అంది రియా అటు-ఇటూ చూశాడు అభి..."నా కళ్లలోకి అభి.....నీకెలా వుందో గాని అభి నువ్వు షాలిని చెయ్యి పట్టుకుంటే నా ప్రాణం పోతున్నట్టు వుంది....."అంది రియా "అభి నీకోటి చెప్పాలి....."అంది రియా "నాకు వినాలని లేదు...."అన్నాడు అభి "ఇట్స్ ఎబౌట్ అవర్ లైఫ్ అభి...ప్లీస్...."అంది రియా "ఇట్స్ నో మోర్ అవర్...ఇట్స్ యువర్స్....యండ్ మైన్ సపరేట్లి...."అన్నాడు అభి "సరే....పోని దాని గురించే విను..."అని రియా కంప్లీట్ చేసేసరికి...."షాలిని...వెయిట్ ఐ యాం కమింగ్..."అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అభి....ఇంతలో అక్కడికి వచ్చాడు విజయ్...."నీకెమైనా పిచ్చా....?అలా ఎందుకు వచ్చేశావ్...?"అని అరిచి తన దగ్గరున్న ఆయింట్ మెంట్ తన చేతికి రాశాడు విజయ్ "ఇది చాలా చిన్న గాయం విజయ్....దీనికి ఆయిట్ మెంట్ రాస్తే సరిపోతుంది కాని నా మనసు కి తగిలిన గాయం ఏ మందు రాస్తే తగ్గిద్దో...."అని అంది రియా **** ఆ సాయంత్రం.....రియా అభి కోసం వెయిట్ చేస్తుండగానే.....అభి షాలిని తో కలిసి వెళ్ళిపోయాడు..... ఆ రోజు రాత్రి..... అభి కి ఫోన్ చేసిన రియా నాట్ రీచబుల్ అని రావడం తో వాళ్ళింటి బయట అటు-ఇటు తిరగసాగింది...."లాభం లేదు....ఇవాళ ఎలా అయినా అభి తో మాట్లాడాల్సిందే అని బిల్డింగ్ వెనక్కి వెళ్ళింది.....అదృష్టవశాత్తు....అక్కడ డోర్ లాక్ చెయ్యలేదు...హమ్మయ్య....అనుకుంటూ లోపలికి వెళ్ళిన రియా అభి రూం లోకి వెళ్ళడానికి పెద్ద టైం పట్టలేదు......... అభి అటు వైపు తిరిగి పడుకోని వున్నాడు........ "అభి...."అని మొదలుపెట్టి తన మనసులో వున్నదంతా చెప్పేసి భారంగా వూపిరి పీల్చుకుని....చివరగా..."ఐ లవ్ యూ"అని చెప్పిందో లేదో...అతను పైకి లేచి రియా వైపు తిరిగి చూశాడు...అంతే రియా ఉత్సాహం అంతా నీరుగారి పోయింది..."విజయ్....నువ్విక్కడ ఏం చేస్తున్నావ్....?"అంది రియా చిరాకుగా "ఆ మాట నేనడగాలి..."అన్నాడు విజయ్ సీరియస్ గా "ఐ కేం హియర్ టు కన్ ఫెస్ టు అభి....ఇప్పుడు చెప్పు నువ్విక్కడ ఏం చేస్తున్నావో...."అంది రియా "ఇది నా రూం..."అన్నాడు విజయ్ "హో షిట్....అభి రూం ఏది...?"అంది రియా "ఎదురు రూం...."అని తన వైపు చూశాడు అభి "ఓకే థ్యాంక్యూ..."అని అభి రూం వైపు పరిగెత్తింది రియా.....తను వెళ్ళిన వైపే మసక బారిన కళ్లతో చూస్తుండిపోయాడు అభి....... తను వెళ్ళేసరికి అభి రూం లో లేడు...."ఎక్కడ వెళ్ళివుంటాడు...?"అని ఆలొచించగా.....ఇంతలో బాత్రూం తలుపు చప్పుడు అయ్యేసరికి అటు వైపు దృష్టి సారించింది రియా....అప్పుడే స్నానం చేసి....వచ్చిన అభి రియా ని చూసి....అరిచినంత పని చేసాడు....అభి రియాక్షన్ పసి గట్టిన రియా ముందుగానే అభి అరవకుండా అతని నోటి పై చెయ్యి వేసి ష్....అంది.... ఇద్దరూ ఒకరినొకరు చూస్కున్నారు...ఒక 30 సెకన్ల తర్వాత పక్కకి వచ్చేస్తూ...."నువ్వెమన్నా అమ్మాయి వా అలా అరుస్తావేంటి...?"అంది రియా "అమ్మాయి అయితేనే అరవాలని రూల్ వుందా...?"అన్నాడు అభి "సరేలే....రెడి అవ్వు...బయటకి వెళ్దాం..."అంది రియా "బయటకా...?"అనుమానంగా అడిగాడు అభి "హా బయటకే ఎందుకంత ఆశ్చర్యపోతావ్...ఇంతకుముందు చాలా సార్లు బయటకి వెళ్లాం కదా......?"అడిగింది రియా..... "ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు...."అన్నాడు అభి కబోర్డ్ నుంచి బట్టలు తీసుకుంటూ "వేరు లేదు.....చెట్టు లేదు...నువ్వు వస్తావా రావా...?నేను నీతో మాట్లాడాలి..."అంది రియా "లేదు...నాకు నిద్రొస్తుంది తమరు దయచేస్తే నేను నిద్రపోతా....విల్ యూ?"అడిగాడు అభి "నో నేను వెళ్ళను...untill you listen to me"అంది రియా "కొంచెం సేపు బయట వెయిట్ చెయ్యి డ్రస్ అప్ అయ్యి వింటాను..."అన్నాడు అభి "హలో నేను విసిటింగ్ అవర్స్ లో రాలేదు...అర్థరాత్రి వచ్చాను...ఇలా సడన్ గా బయట వెయిట్ చెయ్యి అంటే నన్నేవరైనా చూస్తే?"అంది రియా "ఉఫ్.......ఏం చెయ్యను...నీకు ఫ్రీ గా ఎక్స్పోసింగ్ ఇవ్వనా...?"అన్నాడు అభి "నేను కళ్ళు మూసుకుంటా నీ పని నువ్వు కానివ్వు....యూ కెన్ ట్రస్ట్ మి అభి"అంది రియా కళ్ళు మూసుకుంటూ "నో...వె..."అన్నాడు అభి "సరే ఇలానే ఎక్స్పోస్ చెయ్యి నాకేమి ప్రాబలం లేదు....నాకు హ్యాపి గానే వుంది నిన్నిలా హాఫ్ నేక్డ్ గా చూడడం..."అంది రియా సిగ్గు పడుతూ "ఒకే ఫైన్ కళ్ళు మూస్కో...తెరిచావో యూ విల్ బి అవుట్ ఆఫ్ మై రూం"అన్నాడు అభి "హా ఓకే "అంది రియా...కానిమధ్య మధ్య లో చూడ్డానికి ట్రై చేసింది.......కాని కుదరలేదు..... ఒకసారి డ్రస్ అప్ అయ్యాక...అభి ఒక బుక్ తీసుకుని బెడ్ మీద కూర్చిని చదువుకోసాగాడు......రియా కి చాలా కోపం వచ్చింది..,...కాని తను చేసిన పనికి అభి కి చిరాకొచ్చింది....!!!
24-11-2018, 11:50 AM
28.ఐ డోంట్ కేర్
అభి తనని పట్టించుకోపోవడం తో రియా కి చాల కోపం వచ్చింది కాని రియా.....ఆ కోపాన్ని తన పైనా చూపించకుండా బయటకి వెళ్ళింది....తను వెళ్ళిన వైపే అనుమానంగా చూస్తున్న అభి...తన అడుగుల సడి వినిపించడం తో......తిరిగి బుక్ పై కాంస్న ట్రేట్ చేసినట్తు నటించాడు .....తిరిగి వచ్చిన రియా చేతి నిండా చిప్స్ ప్యాకెట్లు...కూల్ డ్రింక్....బాటిల్స్ వున్నాయి... అవన్ని టేబుల్ మీద పెట్టి......అతన్ని చూస్తూ ఒక్కో ప్యాకెట్ ఓపెన్ చేసి తినసాగింది...సౌండ్ చేస్తు......ఆ సౌండ్ కి చిరాకొచ్చినా రియా చూపులు అంతకు మించి ఇబ్బందికి గురిచేస్తున్నాయి....చూసి చూసి విసుగొచ్చిన అభి....తన వైపు చూసి....."ఆ కళ్లు దించు...అలా చూస్తావేంటి...?అయినా?"అన్నాడు "థ్యాంక్ గాడ్....ఫైనల్లి..."అంది రియా "రియా రేపు ఆఫీస్ లో మాట్లాడుకుందాం...ఐ యాం రియల్లి ఫీలింగ్ స్లీపి నౌ....ప్లీస్ "అన్నాడు అభి "నో వె......నువ్వస్సలు నన్ను పట్టించుకుంటున్నావా....?నేను నిన్ను నమ్మాను...ఇవాళ నాకు నువ్వు ఆంసర్ చెయ్యాల్సిందే...."అంది రియా "నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నేను ఆంసర్ కావాలని.,....అరిచాను నాకెవరు సమాధానం ఇవ్వలేదు...అఖరికి నువ్వు కూడా మొహం తిప్పేసుకున్నావ్...ఇప్పుడు నీకు నేనెందుకు ఇవ్వాలి....?"అన్నాడు అభి "అప్పుడు నేను వున్న పరిస్థిలు అవి అభి...ఇప్పుడు అడుగు ఐ విల్ డెఫినెట్లి ఆంసర్ యూ"అంది రియా "నేను ఏమి అడగను ఏమి చెప్పను...ఐ రియల్లి హేట్ యూ నౌ...సో ప్లీస్ లీవ్"అన్నాడు అభి "ఏది ఆ మాట నా ముఖం చూసి చెప్పు అభి...డు యూ రియల్లి హేట్ మీ...."అంది రియా రియా ముఖం లోకి చూడలేని అభి...."హా కాదు ఇప్పుడేంటి...యూ ఆల్రెడి హావ్ మూవ్డ్ ఆన్ కదా....వాట్ ద బిగ్ డీల్?"అన్నాడు అభి వెంటనే అభి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్న రియా...."నేను మూవ్ ఆన్ కాలేదు అభి..ఐ స్టిల్...."అని అంటుండగా..........తలుపు చప్పుడు కావడం తో....అలర్ట్ అయిన అభి రియా ని మంచం కిందా దక్కొమని చెప్పి తలుపు తీశాడు.....ఎదురుగా విజయ్ వాళ్ల అమ్మ....చేతిలో వాటర్ బాటిల్ టొ ప్రత్యక్షమయ్యారు... "ఎమైంది ఆంటి....?"అడిగాడు అభి "అది...ఇందాక నీ రూం లో వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయాను విక్కి...ఇచ్చి వెళ్దాం...."అని ఆవిడ వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్ళిపోయిందో లేదో...పరిగెత్తుకుంటూ....వచ్చి మంచం కిందకి తొంగి చూశాడు.....చేతులను చెంపలకి ఆనిచ్చి.....అభి రాక కోసం ఎదురు చూస్తున్న రియా కి చెయ్యి అందిచ్చి బయటకి లాగాడు....నీట్ గా దువ్వుకున్న జుట్టు కాస్తా మంచం కింద దూరడం వల్ల లైట్ గా చెదిరింది.....పైగా మంచం కి వున్న బూజు తన ముఖం పై పడింది...... తను బయటకి రాగానే ఆమె అవతారం చూసి....పిచ్చి పిచ్చి గా నవ్వుకున్నాడు అభి...అభి అలా నవ్వుతుంటే అలానే చూస్తుండిపోయింది రియా "ఐ లవ్ యూ అభి...."అసంకల్పితంగా తన నోటి నుంచి వచ్చిన మాటలకి షాక్ అయిన అభి....తనకి చాలా దగ్గరగా వున్న రియా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని.....అలానే తన కళ్ళలోకి చూస్తుండిపోయాడు....... మెల్లగా వాళ్ళిద్దరి ముఖాల మధ్య దూరాన్ని కరిగిస్తూ రియా అతనికి సమీపంగా వెళ్తుండగా అభి మాత్రం తన కళ్ళలోకి చూస్తూ వున్నాడు......వారిద్దరూ అత్యంత సమీపంగా వుండగా....మెల్లగా తన తల ని అభి తలకి తాకించిన రియా.......అతని కళ్ళలోకి చూస్తూ.....తన చేతులను అభి మెడ చుట్టూ వేసింది...రియా వూపిరి అభి కి తాకుతుండగా.....తను ఇంకా రియా సమీపంగా జరుగుతూ...... నిద్రనుంచి మేల్కున్నాడు......!!! **** ఆఫీస్ కెళ్ళిన అభి.....తనని తాను బిసీ గా వుంచుకున్నాడు ఒక్కసారి కూడా విజయ్ వైపు చూసే ప్రయత్నం చెయ్యలేదు......ఆ ముందు రోజు రాత్రి జరిగినదే అతని కళ్ళ మూందు మెదులుతుంది...... రియా కి దగ్గరగా జరిగిన అభి....కి ఒక్కసారిగా చలనం వచ్చింది...వెంటనే వెనక్కి తగ్గడు...మరు క్షణమే పైకి లేచి...."Riya...get the hell out of here "అని అరిచాడు....రియా షాక్ అయ్యి చూస్తుండిపోయింది...తన కళ్ళలో కన్నీళ్ళు ఏ క్షణం లో అయినా బయటకి రావడానికి రెడి గా వున్నాయి..... "i said get out...."అని తన ముఖం వైపు చూడకుండా చెప్పాడు అభి.... అభి కోపాన్ని చూసిన రియా...ఏదొ చెప్పాలనుకుని కూడా ఆగిపోయి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది...... ఇక ప్రస్తుతానికి వస్తే....రియా మధ్యలొ రెండు సార్లు క్యాబిన్ కి వచ్చింది...తనే కావాలని తన ముఖం వైపు చూడలేదు...... తనకి దూరంగా వుండడం ఇన్ ఫాక్ట్ అభి కి కూడా బాధ గానే వుంది కాని ఏం చెయ్యలేని పరిస్థితి...షి ఈస్ హిస్ ఫ్రెండ్స్ గాళ్ ఫ్రెండ్.......ఇది గుర్తొచ్చే రాత్రి అలా బిహేవ్ చేసాడు....కాని ఎంత కాదనుకున్నా తను నిన్న చెప్పిన మాటలే చెవుల్లొ మారుమొగుతున్నాయి..."ఐ లవ్ యూ అభి..."తను చెప్పింది నిజమా....?తనని నేను మళ్లి నమ్మొచ్చా....?తను 2 డేస్ నుంచి నాతో మాట్లాడాలి అని తిరుగుతుంది...మేబి ఇది చెప్పడానికేనా....?ఇది మరో నాటకం కాదు గా....?మేబీ ఇది నాటకమే నేమొ....!హా........ఏం అర్థం కావట్లేదు......పరి పరి విధాలుగా అభి ఇక్కడ ఆలొచిస్తుంటె....అక్కడ రియా తనకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది...మరి ఇంకొకరు.......వాళ్ళ రాబోయే జీవితానికి ప్రణాళిక లు వేస్కుంటున్నారు.....!!!
24-11-2018, 12:04 PM
Tnx bro adagagaane update ichinanduku.. Ilage regular updates tho complete chepeyandi annepu bro
నైస్ లవ్ స్టొరీ...
కానీ మన ప్రేమ కోసం వేరే వాళ్ళ ఎమోషన్స్ ని వాడుకోవడం కరెక్ట్ గా అనిపించట్లేదు...ఫీలింగ్ సారీ ఫర్ విజయ్... ప్రేమించి విడిపోవడం కన్నా ఇది ఇంకా భరించలేని బాధ...
25-11-2018, 11:03 AM
బాగుంది భయ్యా
జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish
01-12-2018, 07:30 PM
Bro waiting.. Next update plzee
25-12-2018, 04:57 PM
Update pls waiting here
26-12-2018, 07:03 AM
Bhayya mi kadha motham epuday chadivanu non arotic kuda entha Baga rayocha anipinchindhi but MIRU storie ni saspance love patti appasaru pls continue your store mi dhagara nunchi manchi update vastundhani assisthu mi. abhimani SHREDDER
02-01-2019, 01:49 AM
Bro story bagundhi, cinima bagateytagaligite 100days confirm
02-01-2019, 01:52 AM
Annepu Garu update please
08-01-2019, 11:17 PM
Update please
08-03-2024, 09:57 AM
Good story
|
« Next Oldest | Next Newest »
|