Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
నెక్స్ట్ కేక్ పీస్ తీసుకుని అమ్మకు తినిపించాను . అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా చేతిలో కేక్ ను నాకు తినిపించి , నా ప్రాణమైన బుజ్జి నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలిపి , నన్ను తన గుండెలపై హత్తుకొని నుదుటిపై తియ్యని ముద్దుపెట్టి , బుజ్జి .........నాకు నీ తరువాతనే మీ అక్కయ్య అనిచెప్పింది . 

అలా ఎప్పటికీ వద్దమ్మా ...............మీకు , నాకు ఫస్ట్ అక్కయ్యనే ఆ తరువాతే నేను, మా అక్కయ్య బంగారం ముందు అక్కయ్యకు విష్ చెయ్యండి అనిచెప్పాను .

అమ్మ , అక్కయ్య ........ఇద్దరూ ఆనందబాస్పాలతో మోకాళ్లపై కూర్చుని చెరొకవైపు నుండి బుగ్గలపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి , నా తమ్ముడు బంగారుకొండ అక్కయ్య అంటే చెప్పలేనంత ప్రేమ అంటూ హత్తుకున్నారు .



లవ్ యు అక్కయ్యా , లవ్ యు అమ్మా ........అని చిరునవ్వులు చిందిస్తూ బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , అమ్మా అక్కయ్యకు ఇంకా విష్ చెయ్యలేదు అని ముద్దుగా చెప్పాను .

లవ్ యు బుజ్జి .........అంటూ లేచి కేక్ అందుకొని అక్కయ్యకు తినిపించి happy birthday అంటూ కౌగిలించుకుని , తల్లి ఇది నీకు 21 వ పుట్టినరోజు నా బుజ్జి వలన ఇదే నీ 20 పుట్టినరోజు ఫంక్షన్స్ కంటే అత్యంత సంతోషమైనది అంటూ నా కురులను ప్రేమతో స్పృశించింది .



అక్కయ్యా ........నాన్నకు అని చుట్టూ చూస్తే ఎక్కడా కనిపించకపోవడంతో , బాధపడుతుంటే , 

అక్కయ్య చూసి వెంటనే ఫ్రెండ్స్ నా తమ్ముడు జీవితంలో తొలి birthday జరుపుకుంటున్నాడు . అందరూ వచ్చి మనసారా విష్ చెయ్యండి అని గట్టిగా , గిఫ్ట్స్ కూడా నా తమ్ముడికే ఇవ్వండి please అంటూ చేతులతో సైగచేసింది .

అలాగే అని గుండెలపై చేతులను వేసుకుని బదులిచ్చి , అందరూ నన్ను చుట్టేసి ఏ హీరో ఎంతోమంది ప్రయాణికులలో సంతోషాన్ని నింపావు , అందుకు ఈ పుట్టినరోజు కానుకలు అంటూ సంతోషన్గా birthday విషెస్ తెలిపి కేక్ తినిపించారు . 

థాంక్స్ అక్కా , థాంక్స్ అక్కా ..........అని ఆనందంతో పొంగిపోయి గిఫ్ట్స్ అందుకొని అక్కయ్యకు ఇచ్చాను .

మహేష్ కదా ........క్యూట్ name and హ్యాండ్సమ్ అంటూ ప్రతి ఒక్కరూ నా బుగ్గలను నొప్పిపుట్టేలా గిల్లేస్తుంటే ............ 

అక్కయ్యా ...........అంటూ వెళ్లి వెనుక దాక్కున్నాను . 

ఒసేయ్ ........ఇక చాలులేవే చూడు నాతమ్ముడి బుగ్గలు ఎర్రగా ఎలా కందిపోయాయో చూడండి అంటూ మోకాళ్లపై కూర్చుని , వాల్లంతే ఎవరైనా హ్యాండ్సమ్ అబ్బాయి కనబడితే చాలు వాళ్లకు ఏదేదో అయిపోతుంది . వాళ్ళందరూ వెళ్ళాక నీకు అమ్మతో దిష్టి తీయిస్తాను . నా అందమైన తమ్ముడిపై అందరికళ్ళు ఎలా పడుతున్నాయో చూడు అని ప్రేమతో నా బుగ్గలపై ముద్దులుపెట్టింది . 

అక్కయ్య మాటలకు హ హ హ...........అంటూ నవ్వి , ఏదేదో .......అంటే ఏమిటి అక్కయ్యా .......అని అడిగాను .

ఒకసారి మీ అక్కయ్యను వదిలి మా గుంపులోకి రా హీరో అదేంటో నీకు కలిగేలా చేస్తాము అని ముసిముసినవ్వులు నవ్వుతూ అక్కయ్య ఫ్రెండ్స్ వస్తావా , ఫీల్ అవ్వాలని ఉందా ..........అని నావైపు కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

ఛీ ఛీ ..........మీరు మారరే , చిన్నపిల్లాడిని పట్టుకుని ఏమిటా మాటలు , నువ్వు వినద్దు తమ్ముడూ అంటూ చెవులు మూసింది .

అమ్మ ముసిముసినవ్వులతో కాస్త నెమ్మదిగా మాట్లాడండి ఊరు మొత్తం వినపడేలా ఉన్నాయి అంటూ ఆశీర్వదించడానికి వచ్చిన ముత్తైదువులను భోజనాలు చెయ్యడానికి పిలుచుకొని వెళ్ళిపోయింది .

 వీడు చిన్నపిల్లాడా ........... పేపర్లో న్యూస్ చూశాక కూడా ఆ మాట అంటావు ఏంటే  వాసంతి , ఇవాళ రాష్ట్రం మొత్తానికి హీరో అయిపోయాడు , మరొకరు అయితే వదిలితే మా అందరికీ కడుపు చేసేలా ఉన్నాడు అని చేతులతో పొట్టవైపు చూపించి సైగలు చేసి ఆపకుండా నవ్వుతూనే , ఒసేయ్ వాసంతి నువ్వు లేనప్పుడు వీడిని ఎత్తుకుని వెళ్లిపోతాము మానుండి నువ్వే నీ తమ్ముడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ మళ్లీ నా బుగ్గలను గిల్లడానికి ముందుకు వస్తుంటే , నన్ను వెనక్కు దాచేసుకొని , చిలిపి నవ్వుతో మీరు అన్నంతపని చేసేవాళ్లే , ఈక్షణం నుండి నా ప్రాణాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను మీనుండి అని నవ్వుకుంటుంటే .........

మిగిలిన కేక్ అందుకొని ముందు అక్కయ్యకు ఆ వెంటనే నా ముఖానికి పూసి వాళ్ళల్లో వాళ్ళు పూసుకుంటూ , స్ప్రే , మించు మరియు పూలను చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు .

ఒక్కవిషయం మాత్రం అర్థమయ్యింది అక్కయ్యకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారని మరియు ఒకరికొకరంటే చాలా ఇష్టం అని వాళ్ళ సంతోషం చూస్తుంటే .......

తమ్ముడూ రా అంటూ నాచేతిని అందుకొని అందరూ happy birthday మహేష్ అంటూ ఊరుమొత్తం వినిపించేలా కేకలువేసి నన్ను సంతోషంతో పైకెత్తారు.



కాసేపటి తరువాత అమ్మవచ్చి తల్లి ఊరి జనమంతా నీ తమ్ముణ్ణి ఒకసారి చూడాలని , birthday విషయం తెలుసుకుని విష్ చెయ్యాలని ఆశిస్తున్నారు అని అక్కయ్య చెవిలో చెప్పడంతో నన్ను కిందకు దింపారు .

మా బంగారాన్ని కూడా మీలో కలిపేసుకుని కేక్ పూసేసారా ...........మీరింకా చిన్నపిల్లలు అనుకున్నారా అని తియ్యని కోపంతో తిడుతూ , నా ముఖంపై పూసిన కేక్ ను అమ్మ చీర కొంగుతో తుడుస్తుంటే .........  

అందరూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ .........అంటీ మొదట ఇదే పూసింది , కాదు అంటీ ముందు ఇదే పూసింది , కాదు అంటీ అది , నువ్వే నువ్వే .......అంటూ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుని నవ్వుతుంటే ..........

చాలు చాలు .........అందరూ దొంగలే అంటూ అమ్మకూడా నవ్వడంతో ........

కేక్ బాక్స్ కు అంటిన క్రీమ్ తీసుకుని అందరూ గుమికూడి అమ్మకు కూడా పూసేసారు.

మిమ్మల్ని అంటూ కొట్టబోయి , భలే భలే ..........అంటూ నవ్వుతూ గెంతులేస్తున్న నన్ను చూసి అమ్మ ఆనందంతో పొంగిపోయి , 

నా బంగారుకొండ సంతోషం చూసి మిమ్మల్ని వదిలేస్తున్నాను , ఇప్పుడు రూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయ్యి వేరే చీర కట్టుకోవాలి . తల్లి బుజ్జిని , నీ కోతి స్నేహితులందరినీ పైన ఉన్న రూంలలోకి పిలుచుకొనివెళ్లి శుభ్రం చేసుకుని కిందకు రండి భోజనాలు చేద్దురుకాని , 

తల్లి ముందు బుజ్జి ని క్లీన్ చేసి వేరే కొత్తబట్టలు వేసుకుని పీలుచుకొనిరా , బయట అందరూ నీ ముద్దుల హీరో కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు అనిచెప్పి కింద తన రూంలోకి వెళ్ళింది . 

ఒసేయ్ నారూమ్ కాకుండా మిగిలిన రెండు రూంలలో మీఇష్టమొచ్చినంతసేపు కోతివేశాలు వేసి కిందకు రండి , నేను నా ప్రాణం మా రూమ్ కు వెళ్లి శుభ్రం చేసుకుని త్వరగా కిందకు వచ్చేయ్యాలి అని నాచేతిని అందుకొని పైకి పిలుచుకొనివెళ్లింది.



తమ్ముడూ షర్ట్ కు కేక్ అంటింది విప్పి ముఖం ను శుభ్రం చేసుకునిరా అని కప్ బోర్డ్ లో ఉన్న టవల్ తీసి వెనక్కు తిరిగి , 

షర్ట్ లేకుండా ఉన్న నన్ను తల ఒకవైపుకు వాల్చి , టవల్ ను తన గుండెలకు హత్తుకొని కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయింది . 

ఏమిటక్కయ్యా ...........అలా కొత్తగా చూస్తున్నావు .

ఏమీలేదు తమ్ముడూ ..........నా తమ్ముడి కండలను చూసి , నా ఫ్రెండ్స్ మాటలు గుర్తుకువచ్చి అలా చూస్తుండిపోయాను అంటూ దగ్గరకొచ్చి నుదుటిపై ముద్దుపెట్టి , తమ్ముడూ తియ్యగా ఉంది అని మళ్ళీ ముద్దుపెట్టింది .

కేక్ క్రీమ్ వలన అయ్యింటుంది అంటూ నేను కూడా అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి అవునక్కా తియ్యగా ఉంది అని ఇద్దరమూ నవ్వుకున్నాము .

అక్కయ్య నా చేతి కండలను తాకి , wow ఎంత స్ట్రాంగ్ నిజమే నాతమ్ముడు రియల్ హీరో అంటూ ప్రాణంలా గుండెలకు హత్తుకొని ముద్దులతో ముంచెత్తి , రెండు చేతులతో రెండు బుగ్గలను గిల్లేసింది .

లవ్ యు అక్కా అంటూ సంతోషంతో నవ్వుతుంటే .........

తమ్ముడూ బుగ్గలు నొప్పివేయ్యడం లేదా , లవ్ యు లవ్ యు ........తమ్ముడూ , మరిచిపోయి గిల్లేసాను అంటూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకుంది .

ప్రేమ , సంతోషం , కోపం , తిట్టడం ,గిళ్లడం , కొట్టడం ............ఇలా మా అక్కయ్యే చెయ్యాలి నేను ఆనందించాలి . మా అక్కయ్యనా హృదయమంతా నిండిపోయింది . మా అక్కయ్య నన్ను ఏమిచేసినా నాకు అమితానందం అని అక్కయ్య కన్నీళ్లను తుడిచి నవ్వించాను . 

నా తమ్ముడు బంగారం అంటూ ఆనందంతో పొంగిపోయి ముఖమంతా ముద్దుల వర్షం కురిపించి , తమ్ముడూ ఎక్కడ ముద్దుపెట్టినా తియ్యగా ఉంది , నిన్ను కొరుక్కుని తినేస్తాను అంటూ కొరికినట్లు సంతోషంతో ఆవ్........అనింది .

నా జీవితం నా ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యకే సొంతం , ప్రేమతో కొరికి తినెయ్యండి అంటూ నవ్వుతూ చేతులు విశాలంగా చాపాను .

లవ్ యు sooooo మచ్ తమ్ముడూ అంటూ కౌగిలించుకుని ఇప్పుడుకాదు సమయం వచ్చినప్పుడు ............అంటూ ముసిముసినవ్వులు నవ్వి , కింద అందరూ నా బుజ్జి హీరోకోసం వెయిటింగ్ తొందరగా ఫ్రెష్ అయ్యి రా అంటూ టవల్ అందించి బాత్రూం లోకి పంపించింది . 

లోపలకువెళ్లి ప్యాంటు కూడా విప్పేసి సబ్బుతో కడుక్కుని ఒక టవల్ నడుముకు చుట్టుకొని , మరొక టవల్ తో తుడుచుకుంటూ బయటకువచ్చాను .

తమ్ముడూ ...........ఈ కొత్తబట్టలు వేసుకుని నువ్వు కిందకువెల్లు నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పింది .

మా అక్కయ్యను వదిలి నేను ఎక్కడకూ వెళ్ళను , గది బయట ఉంటాను ఎంతసేపయినా మీరు వచ్చాకే వెళదాము అని బదులిచ్చాను . 

లవ్ యు తమ్ముడూ ...........బయట ఎందుకు వెళతావు , ఇంకెప్పుడూ అలా మాట్లాడకు , నాకు కన్నీళ్లు వచ్చేస్తాయి . నేను నీ హృదయంలో ఉంటే , నా హృదయమంతా ఉన్నది నువ్వే తమ్ముడూ అంటూ గుండెలపై ప్రాణం కంటే ఎక్కువ అని హత్తుకొని , టీవీ చూస్తూ కూర్చో రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , నా చిరునవ్వుని చూసి సంతోషంతో బాత్రూమ్లోకి వెళ్ళింది .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
15 నిమిషాల తరువాత ఫేస్ వాష్ చేసుకుని టవల్ తో తుడుచుకుంటూ వచ్చి , నన్ను అందంగా ముస్తాబు చేసి తను ఆలంకరించుకుని , వెళదామా అంటూ చేతులు కలిపి చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చి అమ్మకు నన్ను అప్పజెప్పి కిటికీలోనుండి బయటకు చూస్తోంది .



మమ్మల్ని చూడగానే ........మహేష్ నీ birthday అనిచెప్పారు అంటూ సంతోషంతో గుంపుగా చుట్టుముడుతుంటే , అమ్మా జాగ్రత్త అని అక్కయ్య కంగారుపడింది .

తోటలో పనిచేసే సోమయ్య క్షణాల్లో మధ్యలోకి చేరి అమ్మగారు అంటూ నన్ను ఎత్తుకుని మీరు లోపలకువెళ్లండి నేను చూసుకుంటాను అని ఎత్తుకున్నాడు .

అక్కయ్య చూసి హమ్మయ్యా .......అంటూ గుండెలపై చేతిని వేసుకుంది .

ఊరి జనమంతా విష్ చేసి తమకు తోచిన గిఫ్ట్ ఇచ్చి వంటలు అద్భుతం అని మాట్లాడుకుంటూ సంతోషంతో అర గంటలో అందరూ వెళ్లిపోయారు . 

సోమయ్య ఎత్తుకుని వచ్చి మెయిన్ డోర్ దగ్గర ఉన్న అమ్మకు అప్పచెప్పివెళ్లాడు .

అక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఏమీ కాలేదు కదా తమ్ముడూ అని మోకాళ్లపై కూర్చుని హత్తుకొని , నేను నవ్వుతుండటం చూసి ఆనందించింది . 

అక్కయ్యా .......ఊరివాళ్ళంతా చాలా మంచివారు , చాలా ప్రేమ చూపించారు అని సంతోషంతో చెప్పాను . ఇంత ప్రేమ ఆప్యాయతలు సిటీలలో ఉండవు అక్కయ్యా ............ఎంతైనా పల్లెటూళ్ళ పల్లెటూల్లే ................అని గర్వంతో చెప్పాను . 



ఇంతలో అక్కయ్య ఫ్రెండ్స్ వచ్చి , మీ అక్కతమ్ముళ్ల అనుబంధం సినిమా అయిపోతే తిందాము . మాకు చాలా ఆకలివేస్తోంది అని నీరసంగా చెప్పారు .

మీకే కాదే నాకు కూడా ..........అక్కయ్యా నాకు కూడా అని చెప్పడంతో అందరూ నవ్వేశారు .

అయితే అందరమూ కలిసి తిందాము తమ్ముడూ మనందరికోసం మేడ మీద షామియానా వేయించాను . వంటలన్నీ పైకి వచ్చేస్తాయి అంటూ నా చేతిని అందుకుంది . నేను అమ్మ చేతిని అందుకున్నాను . 

నా బుజ్జి బంగారం అంటూ నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయింది .



వంట వాళ్ళు వంటలన్నింటినీ పైకి మార్చేశారు . ముందే కుర్చీలు arrange చేసినందువల్ల , బఫె ద్వారా ఇష్టమొచ్చిన ఐటమ్స్ వడ్డించుకొని చుట్టూ అందరూ కూర్చుని తింటున్నారు . 

అందరూ వడ్డించుకొని వెళ్లిన తరువాత , తమ్ముడు కుర్చీలో కూర్చో వడ్డించుకొని వస్తాను అని అమ్మతోపాటు వెళ్లి ఒక ప్లేట్ లలో అన్ని ఐటమ్స్ తో వచ్చి , ఇద్దరూ నా ఎదురుగా కూర్చుని నాకు ఒక ప్లేట్ అందివ్వబోయారు .

అలిగినట్లు చేతులు కట్టుకున్నాను . ..........

ఉమ్మా.........అంటూ ఇద్దరూ చెరొకవైపు ముద్దులుపెట్టి , నా ప్లేట్ ప్రక్కన మరొక కుర్చీలో ఉంచేసి , ఫస్ట్ అక్కయ్య నెక్స్ట్ అమ్మ ప్రేమతో కలిపి తినిపించి మురిసిపోతుంటే ..........

అమృతం అమ్మా అక్కయ్యా ............ ఆమ్ ఆమ్........అంటూ తిని మీ......రు ......తినండి అని ముద్ద నములుతూనే చెప్పాను .

మా బంగారం అంటూ పొంగిపోతూ వాళ్ళు తిని నాకు తినిపిస్తుంటే , కళ్ళల్లో ఆనందబాస్పాలతో .............7 ఏళ్ల నుండి నేనే ఒక్కడినే తిన్నాను అక్కయ్యా........,ఇప్పుడు దేవతలాంటి అమ్మ , అక్కయ్య మరియు చుట్టూ నా ప్రాణమైన అక్కయ్య ఫ్రెండ్స్ తోపాటు తింటుంటే చాలా బాగుంది. నెక్స్ట్ 7 ఏళ్ళు మీకు వీలు కలిగినప్పుడల్లా ఇలాగే తినిపిస్తారా అని కన్నీఇళ్లను తుడుచుకుంటూ ప్రేమతో అడిగాను .

అక్కయ్య , అమ్మ హృదయం చలించిపోయినట్లు కళ్ళల్లో చెమ్మతో నోటివెంట మాట రానట్లు తలఊపి , అమ్మ అయితే నా చేతిని అందుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని , తలపై ముద్దుపెట్టి వీలుకాకపోయినా మా ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జికి నా బుజ్జికి తినిపిస్తాము . అంతకంటే మాకు అదృష్టం ఇంకేమి కావాలి అని ప్రేమతో తినిపించింది .

అక్కయ్య అయితే నన్ను చూస్తున్న చూపుకు భాషలో పేరే పెట్టలేదు అన్నంత ప్రాణంలా చూసి , కారుతున్న కన్నీళ్లను తుడుచుకుని తినిపించింది .



నామాటాలు విని అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ నాచుట్టూ చేరి కళ్ళల్లో చెమ్మతో , ఏంటి హీరో , హ్యాండ్సమ్ , క్యూట్ బాయ్...........ఇలా రకరకాలుగా ఆప్యాయతలతో పలకరించి లేచి చుట్టూ నిలబడి , మీ అమ్మ అక్కయ్యేనా ........మేము కూడా తినిపించొచ్చా అని ఆశతో అడిగారు .

అంతే అంతులేని ఆనందంతో ఆనందబాస్పాలతో ఆ ఆ ...........అంటూ ఎంతవీలయితే అంత పెద్దగా నోటిని తెరిచాను . 

వారిలో వాళ్ళు పోటీపడుతూ తోసుకుంటూ ముందుకురావడం చూసి అక్కయ్య తన కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని ఒసేయ్ నెమ్మది , నా తమ్ముడిని ఏమో చేసేలా ఉన్నారు అంటూ సంతోషంతో కళ్ళల్లో నీల్లువచ్చేలా నవ్వుతోంది . 

అక్కయ్య సంతోషాన్ని చూసి గుండెలపై చేతిని వేసుకుని ఫీల్ అవుతుంటే నా తమ్ముడు బంగారం అంటూ ఎడమ చేతితో బుగ్గను ప్రేమతో స్పృశించింది .

అందరూ సంతృప్తితో భోజనాలు చేసిన తరువాత పైన మొత్తం అంతటినీ కిందకు పంపించేసి , షామియానా కింద పెద్ద పరుపు పరిచి అందరూ కూర్చుని సరదాగా ముచ్చట్లు పెట్టారు . 

అక్కయ్య నన్ను తన ముందు కూర్చోబెట్టుకొని రెండుచేతులను చుట్టేసి నా తలపై ,బుగ్గలపై ప్రాణంలా ముద్దులుపెడుతూ తన ఫ్రెండ్స్ తో సంతోషన్గా మాట్లాడుతున్నారు, చుట్టూ ఉన్నవాళ్లు మహేష్ మావల్ల కావడం లేదు అంత క్యూట్ గా ఉన్నాయి అంటూ నా బుగ్గలను గిల్లడానికి try చేస్తుంటే , ఒసేయ్ కొడతాను మిమ్మల్ని అంటూ వాళ్ళ చేతులను తోసేసి నా తమ్ముడిని మీనుండి రక్షించుకుంటాను అని నన్ను మరింత చుట్టేసి , నేనున్నాను కదా తమ్ముడూ వీళ్ళు నన్ను తాకాను కూడా తాకలేరు అని అందరికీ తియ్యని వార్నింగ్ ఇచ్చింది .

ఒసేయ్ 24/7 ఇలాగే నీతమ్ముడిని ఇలాగే సేవ్ చేస్తావా ........

ఆ..........

చూద్దాము ఒంటరిగా మాకు దొరక్కపోడు అంటూ వార్నింగ్ మరిచిపోయినట్లు మళ్లీ నాబుగ్గలను గిల్లడానికి చేతులు చెప్పగానే , చురుక్కుమనేలా దెబ్బ వేయడంతో నాతోపాటు మిగిలినవాళ్ళంతా పగలబడి నవ్వుకున్నారు .

ఫంక్షన్ గురించి , birthday గురించి , కాలేజ్ గురించి అందరూ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతుంటే ............

అక్కయ్య ఆనందాన్ని వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ పొంగిపోతుంటే , లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దులతో ప్రేమలో ముంచెత్తింది .

అక్కయ్య కౌగిలిలోనే హాయిగా నిద్రపోతుండటం చూసి , అక్కయ్య ష్.......... అంటూ చేతులతో మెల్లగా జోకొట్టింది . 

కొన్ని నిమిషాల్లోనే అక్కయ్య ఒడిలో వాలిపోవడంతో అక్కయ్యతోపాటు అందరూ సంతోషించి , ఒసేయ్ మాహేరోని రూంలో బెడ్ పై పడుకోబెట్టు , ఉదయం వచ్చాము ఇక మేము ఇంటికి వెళతాము అనిచెప్పడంతో ,

థాంక్స్ వే .........అని అక్కయ్య చెప్పింది .

నా తమ్ముడు నిద్రపోతున్నాడు ఇక మీరు దొబ్బేయ్యండి అంటావు , సరే ఏమిచేస్తాము అంటూ ప్రతి ఒక్కరూ నన్ను స్పృశించి జాగ్రత్తగా ఎత్తుకుని అక్కయ్య రూంలో పడుకోబెట్టారు .

అక్కయ్య నా ప్రక్కనే కూర్చోవడం చూసి , ఒసేయ్ గేట్ వరకూ అన్నా వచ్చి మమ్మల్ని పంపు అని కోరడంతో .........

 ష్ ష్ ......... మీరేమైనా బుజ్జి పాపాయిలా .......సరే సరే ........పదండి అంటూ నా భుజాల వరకూ దుప్పటికప్పి , నుదుటిపై తియ్యని ముద్దుపెట్టి వదల్లేక వదల్లేక నా చేతిని వదిలి ఫ్యాన్ వేసి అందరితోపాటు బస్ స్టాప్ వరకూ వెళ్లి బస్ రావడంతో , అందరూ వచ్చి సంతోషం పంచినందుకు చాలా చాలా థాంక్స్ అంటూ కౌగిలించుకుని జాగ్రత్తగా వెళ్ళండి , వెళ్ళగానే కాల్ చెయ్యండి అనిచెప్పి బస్ వెళ్ళగానే ఊరి ఫ్రెండ్స్ తో ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నారు .

నిద్రలో ఏదో పీడ కల రావడంతో నుదుటిపై చెమటతో అక్కయ్యా .........అంటూ బెడ్ పై లేచి కూర్చుని చుట్టుచూసి అక్కయ్య కనిపించడంతో , దుప్పటి తీసేసి పరుగున వస్తుంటే ..........

అప్పటికే పరుగున గది తలుపు దగ్గరకువచ్చి మోకాళ్లపై కూర్చుని నన్ను గుండెలకు హత్తుకొని , నుదుటిపై చెమటను చూసి ఫ్యాన్ ఉన్నా చెమట పట్టిందంటే ........కలగన్నావా ........తమ్ముడూ అంటూ పైటతో తుడిచి అడిగింది . 

అక్కయ్యను భయపడుతున్నట్లు గట్టిగా కౌగిలించుకుని , అవునక్కయ్యా ........మళ్లీ రైల్వే స్టేషన్ లో ఒంటరిని అయిపోయినట్లు కలవచ్చింది .

లేదు లేదు .........తమ్ముడూ అంటూ కళ్ళల్లో చెమ్మతో నా బుగ్గలను అందుకొని నా ప్రాణం ఉన్నంతవరకూ అలా జరగనివ్వను . అంతా నా ఫ్రెండ్స్ వల్లనే లేకపోతే నేను నా తమ్ముడి ప్రక్కనే ఉండేదాన్ని అని ముద్దుపెట్టి ప్రాణంలా హత్తుకుంది .

అమ్మకూడా కేకవిని కంగారుపడుతూ వచ్చి మా ఇద్దరినీ అలాచూసి ఆనందబాస్పాలతో , తల్లి నీకు ట్రైన్ లోనే చెప్పానుకదా ..........ఫంక్షన్ లో మరింత అలసిపోయారు కదా అలానే ఉంటుంది . 

వెళ్లి హాయిగా నా బుజ్జి ప్రక్కనే పడుకో , నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేను నా కొడుకుని చూసుకుంటాను అని చిలిపినవ్వుతో చెప్పింది .

అమ్మో .........అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుంది .

అమ్మ నావైపు చూసి కన్నుకొట్టడంతో , ఇద్దరమూ నవ్వుకున్నాము .

అమ్మా మేము మళ్లీ కిందకు వచ్చేన్తవరకూ డిస్టర్బ్ చెయ్యొద్దు , ఏ చప్పుళ్ళూ వినిపించకూడదు సరేనా అనిచెప్పి నా చేతిని అందుకొని బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పి , ప్రక్కనే వాలిపోయి హాయిగా నిద్రపో తమ్ముడూ ఇక నేను నిన్నువిడిచి ఎక్కడికీ వెళ్ళను అని నుదుటిపై ముద్దుపెట్టి జోకొట్టింది .

అమ్మకూడా నా బుగ్గలను స్పృశించి ముద్దుపెట్టింది .

లవ్ యు అమ్మా , లవ్ యు అక్కయ్యా .........అంటూ అక్కయ్య చేతిపై చేతులువేసి అక్కయ్యనే చూస్తూ పెదాలపై చిరునవ్వుతో నిద్రలోకి జారుకున్నాను .



తల్లి నువ్వుకూడా పడుకో కింద పనులు నేను చూసుకుంటాను అని అమ్మ మళ్లీ నా నుదుటిపై ముద్దుపెట్టి తలుపు క్లోజ్ చేసి వెళ్ళింది . 

అక్కయ్య నన్నే ప్రాణంలా చూస్తూ జోకొడుతూ జోకొడుతూ నిద్రపోయింది .

*************



మళ్లీ వెచ్చని ముద్దులకు మెలకువ వచ్చి చూస్తే అమ్మ , అక్కయ్య చెరొకవైపున కూర్చుని నవ్వి , తమ్ముడూ లేచి తినేసి మళ్లీ పడుకో అని చెరొక బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

లేచి కూర్చుని లైట్స్ వేసి ఉండటం మరియు విండో బయట చూస్తే చీకటి పది ఉండటంతో , అక్కయ్యా .........టైం ఎంత ......అంటూ గోడపై ఉన్న గడియారం చూస్తే రాత్రి 10 గంటలు అయ్యింది .

అంతసేపు నిద్రపోయానా .........అంటూ ఆశ్చర్యపోయి , అక్కయ్యా అంటూ సంతోషంతో హత్తుకొని మా అక్కయ్య ప్రక్కనే ఉండటం వలన చిన్న పీడకల కూడా రాలేదు హాయిగా నిద్రపోయాను అనిచెప్పాను .

తమ్ముడూ నేను కూడా అలాగే నిద్రపోయాను . అమ్మవచ్చి లేపి అర్ధరాత్రి ఆకలి వలన ఎక్కడ కడుపు నొప్పిస్తుందో అని , తిని పడుకోండి అనిచెప్పడంతో లేచాను అంటూ నన్ను చుట్టేసి తిందామా అంటూ ఇద్దరమూ ఒకేసారి నోళ్లు తెరిచాము .

అమ్మ మొదట నాకు తినిపించబోతే నోటిని మూసేశాను . అక్కయ్యకు తినిపించబోతే అక్కడ మూసేసింది . 

ఇలా అయితే ఎలా ముందు ఎవరికో మీరే డిసైడ్ చేసుకోండి అని అలిగినట్లు ప్రక్కకు తిరిగింది అమ్మ .

మొదటి ముద్ద తమ్ముడికే , అక్కయ్యకే .........అని ఒకేసారి పలికి ఒకరొకరము చూసుకుని నవ్వుకున్నాము . ఇద్దరమూ ఇంతకూ పట్టువిడువకపోవడంతో ........

అక్కయ్యా .........సంధికి వద్దాము . ఒకరోజు ఫస్ట్ మీకు మరొకరోజు ఫస్ట్ నాకు ........

ఇదేదో బాగుంది ..........అయితే ఈరోజు మొదటి ముద్ద నా తమ్ముడికి .......

అలా ఎలా కుదురుతుంది అక్కా సరిగ్గా విన్నారా లేదా ఒకరోజు ఫస్ట్ మీకు అని ముందుచెప్పాను కాబట్టి అమ్మా అక్కయ్యకు మొదట తినిపించు అని చెప్పాను .

అవునా అన్నట్లు అక్కయ్య ఆలోచనలో పడింది . 

మా మంచి అమ్మకదా అంటూ అమ్మ ముఖాన్ని మావైపు తిప్పి అక్కయ్యకు ఫస్ట్ తినిపించు అమ్మా అని మాట్లాడుతుంటే .........

అమ్మ ముద్దకలిపి నానోటిలో పెట్టేసి నవ్వుతుంటే , అక్కయ్య అయితే యాహూ..........అంటూ చేతులుపైకెత్తి , షాక్ లో ఉన్న నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , అమ్మా ఇప్పుడు నాకు అంటూ నోట్లోకి తీసుకొని తినింది . 

అమాయకుణ్ణి చేసి నన్ను మోసం చేశారు కదూ అంటూ అమ్మ , అక్కయ్య ప్రేమకు పరవశించిపోయి వాళ్ళతోపాటు నవ్వుకుని , అక్కయ్యకు తమ్ముడుకి అంటూ మాట్లాడుతూ అమ్మ ప్రేమతో కలిపి తినిపించింది ముద్దలతో కడుపు నిండిపోయింది .



పెద్ద గ్లాస్ నిండా అక్కయ్య నీళ్లు తాగించడం , అమ్మ తన చీరతో మూతి తుడవగానే ..........

అక్కయ్యా..........పాస్ అర్జెంట్ అంటూ బాత్రూం లోకి పరిగెత్తడం చూసి అమ్మా అక్కయ్య నవ్వుకున్నారు . చేతులు కాళ్ళు కడుక్కుని టవల్ తో తుడుచుకుంటూ బయటకువచ్చేసరికి , అక్కయ్య బెడ్ నీట్ గా పరిచి తమ్మడు నిద్రపోవడానికి రెడీ అని చూపించింది . 

అప్పుడేనా ........ఇప్పుడే కదా పడుకొనిలేచి తిన్నాము ......అని ధీర్ఘం తీస్తుంటే ,

నాకు కూడా అలానే అనిపిస్తోంది తమ్ముడూ ........., మూవీ చూద్దామా అని అడిగింది .

లవ్ యు అక్కా అంటూ ఆనందంతో వెళ్లి కౌగిలించుకున్నాను . 

నా నుదుటిపై చిరునవ్వుతో ముద్దుపెట్టి బెడ్ పై వాలిపోయి దుప్పటిలో వెచ్చగా వొదిగిపోయి చూద్దామా .........అని అడిగింది .

Wow నిద్రవస్తే అలాగే పడుకోవచ్చు అని బదులిచ్చాను . 

అవును అంటూ నన్ను బెడ్ పై కూర్చోబెట్టి టీవీ on చేసి , తమ్ముడూ ఏ మూవీ చూద్దాము అని అడిగింది .

మా అక్కయ్యకు ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం అని బదులిచ్చాను .

అక్కయ్య చిరునవ్వుతో సీడ్ లు తిరగేస్తూ నాకోసం అన్నట్లు , తమ్ముడూ కామెడీ మూవీ ...........

అక్కయ్యా ...........నవ్వి నవ్వి నోటికీ పెయిన్ రావాలి అలాంటి మూవీ ......

ఇదిగో అంటూ చూపించి పెట్టి ,

బెడ్ పైకి చేరి తలకు ఎత్తుకు రెండు రెండు దిండ్లు ఉంచుకుని ఇద్దరమూ ప్రక్కప్రక్కనే వాలిపోయాము .

సినిమా స్టార్టింగ్ నుండే కామెడీ వలన నవ్వుతూనే ఉన్నాము . అక్కయ్యా ........ఇంతలా ఇప్పటివరకూ నవ్వలేదు లవ్ యు అంటూ అక్కయ్య చేతిని నా గుండెలపై పెట్టుకున్నాను .

ప్చ్..........అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , తమ్ముడూ థియేటర్ లో ఏదైనా సినిమా చూసావా .........., 

లేదు అక్కయ్యా ......అసలు స్టేషన్ బయటకు వెలితేనే కదా , బయటకు వెళితే ఏమౌతుందో అని స్టేషన్ లో తెలిసిన జనాలతోనే ఉండేవాణ్ణి .

తమ్ముడూ...........అంటూ ఉద్వేగంతో నా నుదుటిపై ముద్దుపెట్టి , ఇక మీ అక్కయ్య ఉందికదా ప్రపంచం అంటే ఏమిటో చూపిస్తాను అంటూ మూవీ చూడకుండా నన్నే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది .

నేను టీవీ వైపు చూస్తూ ఆపకుండా నవ్వుతూనే , అక్కయ్యా మూవీ చాలా బాగుంది చూడు అని చెప్పాను . 

 నువ్వు చూడు , నేను మాత్రం నా ఫ్రెండ్స్ చెప్పినట్లు నా ముద్దుల బుల్లి హీరోని , తన స్వచ్ఛమైన నవ్వుని చూస్తున్నాను కదా అంటూ మళ్లీ నా బుగ్గపై ముద్దుపెట్టింది .

అలా చూస్తుంటే నాకు ఏదేదో అవుతోంది అని సిగ్గుపడుతూ చెప్పాను .

ఏదేదో అంటే అంటూ నా నడుముపై గిలిగింతలు పెట్టడంతో ,

గలగలా ..........నవ్వుతూ ఎగిరిగిరిపడ్డాను .

నా బుల్లి తమ్ముడికి గిలిగింతలు ఎక్కువ అంటూ చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ పెట్టి ,  నా నవ్వులు చూసి ఆనందంతో లవ్ యు తమ్ముడూ ........ఇక ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అని నన్ను చుట్టేసి నా గుండెలపై వాలిపోయింది .

వెంటనే తలెత్తి తమ్ముడూ ...........బరువుగా ఉన్నానా , నాకు బుద్ధిలేదు అంటూ ప్రక్కకు జరుగుతుంటే , 

మా అక్కయ్య నన్ను అలా హత్తుకొని గుండెలపై వాలుంటే చాలా చాలా హాయిగా ఉంది , ఇప్పుడు ఇక్కడ నొప్పివేస్తోంది అని ఛాతీ చూపించాను .

అలా అయితే మళ్లీ వాలిపోతాను అంటూ నా గుండెలపై వాలిపోయింది .

ఆహా..........ఇప్పుడు వెచ్చగా హాయిగా ఉంది లవ్ యు అక్కయ్యా అంటూ మాట్లాడుతూ టీవీ రన్ అవుతున్నా నిద్రలోకి జారుకున్నాను . 

నా నుదుటిపై వెచ్చని ముద్దు పెట్టినట్లు , మ్మ్మ్........అంటూ మూలుగడంతో , లవ్ యు తమ్ముడూ అని అక్కయ్యా ప్రక్కన దిండుపై తలవాల్చి , రిమోట్ తో టీవీ ఆఫ్ చేసి , అప్పటివరకూ తలవాల్చిన నా గుండెలపై తియ్యని ముద్దుపెట్టి జోకొడుతూ నిద్రపోయింది.
Like Reply
రాత్రంతా తమ్ముడుని గుంటూరుకు తీసుకెళ్లి ఎలా సంతోషం పంచాలో అని ఆలోచిస్తూనే పడుకున్నట్లు తెల్లవారకముందే లేచి నా నుదుటిపై వెచ్చని ముద్దుపెట్టి , నెమ్మదిగా బెడ్ దిగి కింద అమ్మ రూంలోకివెళ్లి లేపిమరీ విషయం చెప్పి రెడీ అవ్వమని చెప్పింది . 

చాలా సంతోషం తల్లి స్నానం చేసి వంట చేస్తాను తిని వెళదాము అనిచెప్పడంతో ,

లవ్ యు అమ్మా అంటూ కౌగిలించుకుని బస్ 8 గంటలకు వచ్చేస్తుంది అంతలోపు టిఫిన్ తినేసి బస్ స్టాప్ లో ఉండాలి అంటూ ఉత్సాహంతో పైకివచ్చి , నేను ఇంకా హాయిగా నిద్రపోతుండటం చూసి , లేచేలోపు స్నానం చేసి రెడీ అవుదాము అని డ్రెస్ టవల్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళింది . 

అక్కయ్య రెడీ అయ్యి రావడం , నేను మేల్కొని వొళ్ళువిరిచి కళ్ళుతెరవడం ఒకేసారి జరిగింది .

గుడ్ మార్నింగ్ తమ్ముడూ ............

పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అక్కయ్యా ........, అప్పుడే స్నానం కూడా అయిపోయిందా , నేనే అన్నమాట దున్నపోతులా నిద్రపోయాను అని లేచి బాత్రూం వైపు నిద్రమత్తులోనే వెళుతుంటే అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుని , నా నుదుటిపై ముద్దుపెట్టి టవల్ అందించింది .

అర గంటలో తల స్నానం చేసి వచ్చాను .

తమ్ముడూ బూస్ట్ అంటూ టేబుల్ పై ఉంచి మరొక టవల్ అందుకొని నా తడి వెంట్రుకలను తుడిచి డ్రెస్ అందించింది .

అక్కయ్యా ..........అటువైపు తిరుగు అంటూ సైగచేసాను . 

సరే సరే ..........అంటూ ముసిముసినవ్వులతో అటువైపు తిరిగి , తమ్ముడూ అయ్యిందా ........

లేదు అక్కయ్యా .........

అయ్యిందా ..........నవ్వుకుంటూ,

ఇంకా లేదు , తిరగొద్దు ..........

ఇప్పుడు .........మరింత నవ్వుతూ వెనక్కు తొంగిచూసి ప్యాంటు వేసుకున్నావా .......

అక్కయ్యా ..........చూస్తున్నావుకదూ ......

లేదు తమ్ముడూ ప్రామిస్ ఇప్పుడే చూసాను , అప్పటికే ప్యాంటు వేసేసుకున్నావు అంటూ తనలోతాను గుసగుసలాడి నవ్వుకుంటూ నా బుగ్గలను గిల్లింది . 

షర్ట్ వేసుకోగానే నాకు బూస్ట్ అందించి , దువ్వెన అందుకుని దువ్వి , ముఖానికి పొడర్ పట్టించి రెడీ చేసి కిందకు పిలుచుకొనివచ్చింది .

హాల్ లో పేపర్ చదువుతున్న నాన్నకు గుడ్ మార్నింగ్ చెప్పాను . 

పట్టించుకోకుండా పేపర్ వదిలేసి బయటకు వెళ్లిపోయారు .

నేనెక్కడ బాధపడతానో అని , నాన్నకు వినపడినట్లు లేదు ముందు వంటగదిలో ఉన్న అమ్మకు చెప్పుపో అని పంపించి , బయట వెళుతున్న నాన్నవైపు కోపంతో చూసింది .

అమ్మా .........గుడ్ మార్నింగ్ అనిచెప్పాను .

బుజ్జి రాత్రి బాగా నిద్రపట్టిందా ..............అంటూ హత్తుకొని వొంగి నుదుటిపై ముద్దుపెట్టింది .

అక్కయ్య జోకొడుతుంటే లాలిపాడినట్లు అనిపించింది అమ్మా , కొత్త చీర కట్టుకున్నారు ఎక్కడికైనా వెళుతున్నారా ............అని బాధతో అడిగాను .

వెళతారా కాదు వెళుతున్నాము గుంటూరుకు వెళుతున్నాము . నా బుజ్జి నాన్నకు కొత్త కొత్త బట్టలు తీసుకుని సాయంత్రం వరకూ సరదాగా గడిపబోతున్నాము . 

అవునా అమ్మా .........లవ్ యు అంటూ సంతోషంతో గట్టిగా కౌగిలించుకున్నాను .

ఇలా కూర్చో తొందరగా వంట చెయ్యాలి లేకపోతే మీ అక్కయ్య నన్ను తిట్టేస్తుంది . అంతలో అక్కయ్య లోపలకువచ్చి అమ్మా ఇంకా కాలేదా బస్ వచ్చే సమయం అయ్యింది అని కొప్పుడుతుంటే , 

చెప్పానా ........అంటూ అమ్మ నవ్వింది . 

అమ్మతోపాటు ముసిముసినవ్వులు నవ్వుతుంటే , కట్టపై కూర్చున్న నాముందుకువచ్చి నా చేతులను తన తుజాలపై వేసుకుని , ఏమిటి అమ్మా కొడుకులు సంతోషంతో నవ్వుతున్నారు అని నా బుగ్గలను స్పృశిస్తూ అడిగింది .

ఇంట్లో ఎంతమంది ఉన్నా మా అక్కయ్యే యువరాణి , తను చెప్పిందే శాసనం అని అమ్మ చెబుతుంటే ఆనందంతో నవ్వుతున్నాము అక్కయ్యా .........

నా తమ్ముడు యువరాజు అంటూ హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించింది .

ఇదిగో తల్లి , బుజ్జి .........టిఫిన్ రెడీ వెళ్లి డైనింగ్ టేబుల్ పై కూర్చోండి అని చెప్పింది . 

తమ్ముడుకి తినిపించాలి మరిచిపోయావా అమ్మా , మేము సోఫాలో కూర్చుంటాము ఒక్క ప్లేట్ లోనే వడ్డించుకునివచ్చెయ్ ముగ్గురూ తిందాము అని నా చేతినిపట్టుకొని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చుంది .

అమ్మ ప్లేట్ లో వడ్డించుకొనివచ్చి మా ఇద్దరికీ తినిపించి తానూ తినింది . 

అమ్మా సమయం లేదు అంటూ ఒక బ్యాగులో టవల్ తోపాటు అవసరమైనవి తీసుకుని ముగ్గురమూ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చామో లేదో బస్ స్టాప్ నుండి బస్ గుంటూరు వైపు వెళ్ళిపోయింది .

అంతే అక్కయ్య కోపంతో అమ్మవైపు చూస్తుంటే ............

Sorry తల్లి కళ్ళుమూసుకుని 10 కౌంట్ చెయ్యి కోపం తగ్గిపోతుంది అని నవ్వుతూ ముందుకువచ్చింది .

నేను చేస్తాను అంటూ నాకళ్ళు మూసుకుని 1 2 3 .........చెబుతుంటే , అక్కయ్య నవ్వుకుని కళ్ళుమూసి నాతోపాటు కౌంట్ చేస్తూ 10 అంటూ కళ్ళుతెరిచాము .

సడెన్ గా ఇంటిముందు కారు వచ్చి ఆగింది . అక్కయ్య ఆశ్చర్యపోతుంటే .......

మనకోసమే , నా ప్రాణమైన బుజ్జిని మొదటిసారి ఎంజాయ్ చెయ్యడానికి తీసుకెళుతున్నాము , బస్ లో పిలుచుకునివెళతాను అని ఎలా అనుకున్నావు , తల్లి ఇప్పుడెకదా అన్నావు నీ తమ్ముడు ఈ ఇంటి యువరాజు అని అని మాట్లాడుతుంటే ,

లవ్ యు అమ్మా అంటూ అమాంతం సంతోషంతో కౌగిలించుకుని , తమవైపు కళ్ళల్లో చెమ్మతో ఆరాధనతో చూస్తున్న నాదగ్గరకువచ్చి , ఏమైంది తమ్ముడూ అని అడిగారు.

లవ్ యు అమ్మా , అక్కయ్యా ..........అంటూ ఇద్దరినీ ఒకేసారి కౌగికించుకొని , ఆనందబాస్పాలు అక్కయ్యా అని ఉద్వేగంతో చెప్పాను . 

అమ్మా ఈ క్రెడిట్ మొత్తం నీదే , కారు మన సర్పంచి గారిది కదా ......

అవును తల్లి నువ్వు ఉదయం విషయం చెప్పగానే సోమయ్యకు డబ్బులిచ్చి పంపి ఈరోజు మొత్తం మనతో ఉండేలా సెట్ చేసాను . మన ఇష్టం ఎక్కడికీ వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు , మనమిక సమయాన్ని వృధా చెయ్యకూడదు ప్రతి క్షణం మనకు ముఖ్యం , నా బుజ్జి పూర్తి ఎంజాయ్ చెయ్యాలి అని కారులో నాకు చెరొకవైపు అమ్మ అక్క కూర్చుని పోనివ్వమని డ్రైవర్ కు చెప్పి నా తలపై బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెడుతూ దారిలో తోటను మనదే అని చూపించి తొందరలోనే ఎక్కడకూ వెళదాము అని చెప్పి , ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నాకు చూపిస్తూ అర గంటలో గుంటూరు చేరుకున్నాము.



బాబు ముందు భ్రమరాంబ మల్లికార్జున గుడికి వెళ్ళమని అమ్మ చెప్పింది .15 నిమిషాలలో తీసుకెళ్లాడు .

అమ్మ అమ్మే ........అంటూ అక్కయ్య నన్ను సంతోషంతో ముద్దుపెట్టి , ముగ్గురమూ కిందకు దిగి బయట పూలు టెంకాయ తీసుకుని లోపలకువెళ్లి నా పేరు మీద మరియు అక్క పేరుమీద పూజ జరిపించింది అమ్మ . తల్లి ఒకే ఒక కోరిక నా పిల్లలిద్దరూ ఎప్పుడూ సంతోషంతో ఉండాలి అని ప్రార్థించింది .

అక్కయ్య ........నా తమ్ముడు , అమ్మ సంతోషంతో ఉండాలని ,

నేను నా ప్రాణమైన అక్కయ్య , అమ్మ సంతోషంతో ఉండాలని ప్రార్థించి ....... ముగ్గురమూ ఒకేసారి కళ్ళుతెరిచి మిగిలిన ఇద్దరూ ఏమి కోరుకున్నారో మనసుకు తెలుసు అన్నట్లు ప్రాణంలా చూసుకుని ఆనందించాము .

కాసేపు ప్రశాంతమైన వాతావరణం గల గుడిలో కూర్చుని ప్రసాదం తిని మరొకసారి ప్రార్థించి బయటకువచ్చి కారులో కూర్చున్నాము .



అమ్మగారు ఎక్కడకు పోనివ్వమంటారు అని డ్రైవర్ అడిగాడు .

ఇక వీళ్ళ ఇష్టం అని అమ్మ నవ్వి చెప్పడంతో , 

లవ్ యు అమ్మా ఇస్కాన్ టెంపుల్ కు కూడా వెళదాము అని చెప్పి డ్రైవర్ ను పోనివ్వమంది .

అక్కడ కూడా ప్రార్థించి , అక్కయ్య ఒక కాలేజ్ దగ్గరకు వెళ్ళమని చెప్పింది .

10 గంటలు అవుతుండటంతో అందరూ కాలేజ్ కు వస్తున్నారు .

తమ్ముడూ ఇదే మా కాలేజ్ అని చూపించి , మా కోతులు ఎవరైనా మనతోపాటు వేస్తారేమో చూద్దాము అని 5 మందికి కాల్ చేసింది . 

ఐదుగురిలో ఇద్దరే కాలేజ్ కు వచ్చారు , ఆ ఇద్దరు కూడా క్లాస్ లో ఉన్నామే గంట పడుతుంది , ఈ సోదిగాడి గురించి తెలుసుకదా అని క్లాస్ జరుగుతున్నట్లు గుసగుసలాడారు .

వీళ్లంతా కాదు తమ్ముడూ నీ బుగ్గలను గిల్లి గిల్లి పెట్టే నా క్లోజ్ ఫ్రెండ్ కు కాల్ చేస్తాను అని చేసి , బయట వైట్ కలర్ కారులో ఉన్నాము అని చెప్పి మెయిన్ గేట్ వైపు చూస్తుంటే .........

వెనుక నుండి వచ్చి విండో తట్టింది . ఒసేయ్ సునీతా అంటూ కారు దిగి స్కూటీ మీద ఉన్న తన ఫ్రెండ్ ను అక్కయ్య కౌగిలించుకుంది .

రెండు నిమిషాలు ఇక్కడే ఉండు స్కూటీ పార్క్ చేసి వస్తాను అని లోపలకు వెళ్లి వచ్చి ,ఇంతకీ నా హీరో ఎక్కడ అని అడిగింది .

ఇదిగో అంటూ అక్కయ్య డోర్ తెరిచి అమ్మతో మాట్లాడుతున్న నన్ను చూపించగానే .........

క్షణంలో లోపాలలు దూరిపోయి కూర్చుని హీరో ..........అంటూ నన్ను రెండుచేతులతో చుట్టేసి , ఇంటికి వెళ్లిన దగ్గర నుండి నీ క్యూట్ ఫేస్ , బ్యూటిఫుల్ స్మైల్ , ముద్దుముద్దు మాటలు ............అన్నీ నీ ఆలోచనలే నా బుర్రన్తా నిండిపోయాయి , ముఖ్యన్గా ఈ నోరూరించే బుగ్గలు ఉన్నాయి చూడు నావల్ల కాదు అంటూ గిల్లేసింది. 

స్స్స్...........అక్కయ్యా ........అని కేకవేశాను . 

ఒసేయ్ అంటూ వెనుక నుండి తలపై ఒక దెబ్బ వేసి కిందకు దిగు అది నా ప్లేస్ అని చిరుకోపంతో చెప్పింది .

అమ్మా .........ముందే చెప్పాను కదా , ఎలాంటి ఛాన్స్ వదులుకోను అని నువ్వే ముందువెళ్లి కూర్చో అని అక్కయ్యను తోసేసి డోర్ వేసి నవ్వుతూ , sorry హీరో ఇప్పటి నుండి నెమ్మదిగా గిల్లుతాను . మరి ఏమి చెయ్యమంటావు వాటిని చూస్తే నా చేతులు అస్సలు ఊరుకోవు . Sorry sorry ............అంటూ నన్ను చుట్టేసి ఆప్యాయతతో తలపై ముద్దుపెట్టింది .

అక్కయ్య నవ్వుకుని వెళ్లి ముందర కూర్చోవడానికి అటువైపు వచ్చింది . 

అమ్మ కారు దిగి తల్లి నీ తమ్ముడి ప్రక్కన కూర్చో నేను ముందు కూర్చుంటాను అని చెప్పడంతో ఎక్కి కూర్చున్నారు .



ఒసేయ్ సునీతా .........ఇలా అయితే ok , అలాకాదని మరొకసారి గిల్లావో ఆ వేళ్ళను ఇరిచేస్తాను అని అక్కయ్య నవ్వుతూ వార్నింగ్ ఇచ్చింది .

ఒసేయ్ నా హీరోకి sorry చెప్పేసాను , అదంతా మా understanding అంతేకదా హీరో అంటూ గిల్లిన చోట ముద్దుపెట్టింది .

నీ ఇష్టం సునీతక్కా .........కానీ మీరు మాత్రం అక్కయ్యతో ఎప్పుడూ ఇలా సరదా సరదాతో కలిసే ఉండాలి , మీరంటే అక్కయ్యకు చాలా ఇష్టం అనుకుంటాను అని చెప్పాను .

ఇద్దరూ అమితానందంతో నన్ను చెరొకవైపు నుండి హత్తుకొని నుదుటిపై ముద్దులుపెట్టారు .

తల్లి ఎక్కడికీ అని అమ్మ అడిగింది .



అమ్మా తమ్ముడిని మా కాలేజ్ ప్రక్కనే ఉన్న కాలేజ్ లో చేర్పించాలి . తమ్ముడూ నీకు ఇష్టమే కదా అని అక్కయ్య అడిగింది .

సోమవారం నుండి మా అక్కయ్య కాలేజ్ కు వెళుతుంది , నేను ఇంట్లో ఒంటరిగా మా అక్కయ్యను వదిలి ఉండటం వల్ల అవుతుందా అని ఆలోచిస్తున్నాను . ఇప్పుడు అక్కయ్యతోపాటు నేను కూడా ఇక్కడకు రావచ్చు కాబట్టి నాకు ఇష్టమే అక్కయ్యా అంటూ అని సంతోషంతో బదులిచ్చాను .

అవును తమ్ముడూ నేను ఈ విషయం గురించి ఆలోచించనే లేదు నా బుజ్జి తమ్ముణ్ణి విడిచి నేను కాలేజ్ కు వచ్చేదాన్ని కాదేమో , ఇప్పుడు ఇద్దరమూ హ్యాపీ అంటూ నన్ను చుట్టేసి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .



కాలేజ్ కు అనుకున్న కాలేజ్ లోపలికి వెళ్ళాము . పెద్ద గ్రౌండ్ , తోట , పిల్లలు ఆడుకోవడానికి అన్నిరకాలు ఉండటం చూసి ఆనందిస్తుంటే .........

తల్లి బుజ్జికి కాలేజ్ నచ్చినట్లుంది అని అమ్మ చెప్పింది .

అంటీ ఈ కాలేజ్ , మా కాలేజ్ ఒక్కరిదే ..........హీరో ఇక్కడి నుండి కాలేజ్ లోకి దారి కూడా ఉంది అని సునీతక్క మాట్లాడుతుంటే ..........

ఆతృతతో ఎక్కడ సునీతక్కా అని అడిగాను . 

హీరో ముందు జాయిన్ అయ్యి వచ్చి అన్నీ చూపిస్తాను అంటూ మెయిన్ బిల్డింగ్ లోపలికి ఆఫీస్ రూంలోకి వెళ్లి న్యూ జాయినింగ్ అనిచెప్పడంతో ఒకదగ్గరికి పంపారు.



అక్కడున్న మేడం అక్కయ్యలను చూసి మీరు మన కాలేజ్ స్టూడెంట్స్ కదా అని అడిగారు . అవును మేడం అంటూ చేతులు కలిపి , నా తమ్ముడు మహేష్ ని కాలేజ్ లో జాయిన్ చేయించాలి అని చూపించింది . 

క్యూట్ బాయ్ అంటూ మేడం నా బుగ్గలను గిళ్లడంతో .........,

సునీతక్క చేతిని అడ్డుపెట్టుకుని ముసిముసినవ్వులు నవ్వింది . ఒసేయ్ ఆపు అంటూ అక్కయ్య తలపై కొట్టింది . 

ఏమైంది అని మేడం అడగడంతో ..........

ఏమీ లేదు మేడం దీనికి కాస్త తిక్క , మీరు చెప్పండి అని అక్కయ్య అడిగింది .

మహేష్ ఇంతకు ముందు ఏ కాలేజ్ లో చదివేవాడివి , ఏ క్లాస్ అని అడిగింది .

నేను అక్కయ్యవైపు చూస్తుంటే , మేడం అంటూ నా గురించి మొత్తం వివరించింది . 

చాలా సంతోషం వాసంతి , మనం ఇప్పుడు ఏమిచేద్దామంటే మామూలుగా మహేష్ వయసు ప్రకారం 3rd క్లాస్ ఉండాలి , కానీ మహేష్ కు అంత knowledge ఉందొ లేదో టెస్ట్ చెయ్యాలి లేకపోతే క్లాస్ లో ఏమీ అర్థం కాదు అని ల్యాండ్ లైన్ నుండి థర్డ్ క్లాస్ మిస్ ను పిలిపించి , నన్ను చూపించి మొత్తం వివరించారు . 



మిస్ నన్ను మాత్రమే ప్రక్కనున్న రూంలోకి పిలుచుకొనివెళ్లి 15 నిమిషాల తరువాత వచ్చి , మేడం 4th క్లాస్ లో జాయిన్ చెయ్యొచ్చు అనిచెప్పి నవ్వుతూ నా తల నిమిరి వెళ్లిపోయారు .

మేడం తో పాటు మేమంతా ఆశ్చర్యపోయాము .

వాసంతి నిజం చెప్పు మహేష్ ఇప్పటివరకూ చదువుకోలేదా ..........

లేదు మేడం కాలేజ్ లో ఎంటర్ అవ్వడం ఇదే తొలిసారి . 

ఇంత మంచి స్టూడెంట్ ను మాకు అందించినందుకు చాలా థాంక్స్ అంటూ 15 నిమిషాలలో జాయినింగ్ చేసుకున్నట్లు ఫారం ఇచ్చి క్యాష్ కౌంటర్లో కట్టి మర్నాడు Monday నుండి కాలేజ్ కి రావచ్చు , ఏమేమి తీసుకురావాలో అక్కడ లిస్ట్ ఇస్తారు అని మళ్ళీ ఇంటెలిజెంట్ బాయ్ అంటూ బుగ్గలను గిల్లింది . 

స్స్స్..........అంటూ నా బుగ్గలను పట్టుకున్నాను .

సునీతక్క నవ్వు ఆగడం లేదు . మనకే కాదు హీరో బుగ్గలంటే మరొకరికి కూడా ఇష్టం అంటూ సంతోషంతో నవ్వుతూ అక్కయ్య బుగ్గలను ప్రేమతో స్పృశించి అమౌంట్ కట్టి లిస్ట్ తీసుకుని బయటకువచ్చి అన్నీ చూపించారు .

కారు ఎక్కి నెక్స్ట్ అని అడగడంతో ,

అమ్మా నా తమ్ముడి కోసం వాటర్ పార్క్ అని అక్కయ్య చెప్పగానే , డ్రైవర్ పోనిచ్చాడు .



15 నిమిషాలలో చేరుకున్నాము . నాలుగు టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళగానే వాటర్ రైడ్స్ , ఫౌంటెన్ , మినీ ట్రైన్ , స్విమ్మింగ్ పూల్ చూసి ఆనందం పట్టలేక అక్కయ్య చేతిని బిగిపెట్టాను . 

తమ్ముడూ నీఇష్టమొచ్చినంతవరకూ ఎంజాయ్ చెయ్యి వెళ్లు వాటర్ రైడ్స్ దగ్గర వదిలి పూల్ దగ్గర వచ్చి కూర్చున్నారు . 

పైకెక్కి జీవితంలో ఇలా చుట్టూ పిల్లలతో సరదాగా గడుపుతానని అనుకోలేదు , లవ్ యు అక్కయ్యా..........అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ , పైనుండి అక్కయ్యా .........అంటూ ప్రేమతో పిలిచి కిందకు జారాను . 

నా ఆనందం చూసి అమ్మ , అక్కయ్యలు పరవశించిపోతున్నారు . నీళ్ళల్లో పూర్తి తడిచి పైకివచ్చి అక్కయ్య దగ్గరకువెళ్లి లవ్ యు అక్కయ్యా ..........చాలా ఆనందంగా ఉంది అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , తుర్రుమంటూ ఈసారి రౌండ్స్ రైడ్ పైకి చేరి చుట్టూ తిరుగుతూ కిందకు జారుతూ వచ్చి నీళ్ళల్లో పడ్డాను . మళ్లీ పైకెక్కి లవ్ యు అక్కయ్యా .......అంటూ మరొక బుగ్గపై ముద్దుపెట్టి పైకి పరిగెత్తాను .



ఏంటే అలా చూస్తున్నావు అని అక్కయ్య సునీతక్కయ్యను ఆడిగింది . 

ఆలస్యం అయినా నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివే వాసంతి , నువ్వంటే ప్రాణమే వాడికి అంటూ సంతోషంతో చెప్పింది . 

అవును నా తమ్ముడు ఒక్క క్షణం కనపడకపోతే ఈ హృదయం కూడా తట్టుకోలేదు . అక్కయ్యా అని ప్రాణంలా ఒక్కొక్క ముద్దు పెడుతుంటే ఇన్ని సంవత్సరాలు ఏమి మిస్ అయ్యానో అర్థమైంది అంటూ నావైపు చేతిని ఊపి ఆనందబాస్పాలతో మురిసిపోతొంది .

నా తమ్ముడి సంతోషమే నా సంతోషం అంటూ నీళ్ల దగ్గరికి వచ్చి , నేను పైకి రాగానే లవ్ యు తమ్ముడు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , వెళ్లు తనివితీరేంతవరకూ ఆడు అని అక్కడే నిలబడింది .

అలా అర గంటవరకూ రైడ్స్ మరియు నీళ్ళల్లో ఎంజాయ్ చేసి , మరికొద్దిసేపు చాలామంది పిల్లలతో రైన్ డాన్స్ లో గెంతులేసి పైకివచ్చి చలికి వణుకుతూ .........అక్క..... య్యా చా. .....లు అని తడబడుతున్న మాటలతో చెప్పాను .

అమ్మా బ్యాగులో నుండి టవల్  అందుకొని నన్ను బెంచ్ పై కూర్చోబెట్టి , అమ్మ వీపుపై , సునీతక్క చేతులను రాస్తూ , అక్కయ్య టవల్ తో తల తుడిచి నా బాత్రాలు తీసుకుని changing రూమ్ దగ్గరకు తీసుకెళ్లి లోపలకు పంపింది . 

తడి బట్టలను విడిచి డ్రై అయ్యి అక్కయ్య అందించిన బట్టలను వేసుకుని ఉత్సాహంతో బయటకు వచ్చాను . 

తమ్ముడూ ఇప్పుడెలా ఉంది అని బుగ్గలపై చేతులతో నుదుటిపై వెచ్చని ముద్దుపెట్టింది . 

ఇప్పుడు వెచ్చగా ఉంది అక్కయ్యా ......... నీళ్ళల్లో చాలా ఎంజాయ్ చేసాను లవ్ యు అంటూ అక్కయ్య చేతిని రెండు చేతులతో పట్టుకుని అమ్మదగ్గరికి చేరుకున్నాము .



అక్కడి నుండి బంపింగ్ కార్స్ దగ్గరకు వెళ్లి రెండుసార్లు ఆడి ఎంజాయ్ చేసాను . మధ్యాహ్నం ఒంటి గంటవరకూ నేను ఏది చూపిస్తే అది , అన్నిచోట్లా తిరిగి ఎంజాయ్ చేసి అలసిపోయి అక్కయ్యా .........ఆకలి అని చెప్పాను .

ఓకేరోజులోనే ఇంత ఎంజాయ్ చేస్తే అలసిపోక ఏమవుతావు హీరో అంటూ బుగ్గలను కసిగా గిళ్లబోయి , వెనుక అక్కయ్య చెయ్యి తన వీపుపై పడుతుందని గుర్తుకొచ్చి అక్కడితో ఆగిపోయి నా కురులను ఆప్యాయంగా నిమిరింది .

అమ్మ నీళ్లు తాగించి తల్లి మాంచి స్టార్ హోటల్ కు వెళదాము అని బయటకువచ్చి కారులో హోటల్ చేరుకున్నాము .



డ్రైవర్ ను కూడా భోజనానికి పిలిచి మేము నలుగురూ ఒక టేబుల్ ఆక్రమించేసాము. తమ్ముడూ బిరియాని అని అడిగింది . 

పెదాలను తడుముకుని ఊ ఊ ...........అంటూ తల ఊపాను . మెనూ కార్డ్ అందుకొని ముందు నాకు ఐస్ క్రీమ్ ముగ్గురికీ కూల్ డ్రింక్స్ తెమ్మనిచెప్పి , బిరియానీతోపాటు చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసింది . ఆ ఐటమ్స్ పేర్లు వినడం అదే తొలిసారి .

ముందు ఐస్ క్రీమ్ , డ్రింక్స్ తీసుకురావడంతో క్షణాల్లో తినేసాను . ముగ్గురూ ఆశ్చర్యపోయి తమ్ముడూ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అని సునీతక్క అడిగింది .

చల్లగా , తియ్యగా చాలా బాగుంది అక్కయ్యా ..........., ఫస్ట్ టైం తినడం అందుకే అలా ............,

అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో ఒకేసారి మూడు flavours తెమ్మని చెప్పి , తమ్ముడూ ఒక పెద్ద ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకెళ్లి మన ఇంటి ఫ్రిడ్జ్ లో పెడతాను నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెళ్లి తిను అని చెప్పి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , మూడు పిల్లాడికే ఇవ్వండి అని అక్కయ్య చెప్పింది .

లవ్ యు అక్కయ్యా ...........అంటూ ఇష్టంతో రెండు తినేసి మరొకటి బిరియానీ తిన్న తరువాత తింటాను అని చెప్పడంతో ........

నీ ఇష్టం తమ్ముడూ అని ముద్దుపెట్టింది . ఇంతలో ఆర్డర్ చేసినవన్నింటినీ టేబుల్ పై ఉంచడంతో , ఫస్ట్ టైం చూస్తున్నట్లు కుమ్మేయాలన్నంతలా అలా చూస్తుండిపోయాను.

అన్నీ నా తమ్ముడి కోసమే అంటూ తన ప్లేటులో వడ్డించి నాకు తినిపించి తానూ తినింది .

లవ్ యు అక్కా ...........అంటూ ఆవురావురుమంటూ కడుపునిండా తిని , కప్పులో కరిగిపోయిన ఐస్ క్రీమ్ తాగి అక్కయ్యా .............కడుపు నిండిపోయింది అంటూ పొట్ట చూపించాను . 

అక్కయ్యలు అమ్మ సంతోషంతో నవ్వుకున్నారు . డ్రైవర్ తిన్నదానికి కూడా బిల్ కట్టేసి కారులోకి చేరాము.
Like Reply
తమ్ముడూ నెక్స్ట్ మూవీకి వెళదాము . టర్నింగ్ లో ఊరిలో ఏ సినిమాలు ఆడుతున్నాయో ప్రతి ఒక్క పోస్టర్ అతికించి ఉంటారు , నువ్వు దేనికి వెళదామంటే ఆ మూవీ చూద్దాము అని అడిగింది .

సంగీతక్క కళ్ళుమూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ , నేను తను అనుకున్న మూవీ పేరునే చెప్పాలి అని తనలో తానే మూట్లాడుతోంది .

అక్కయ్యా పోస్టర్లు చూసి అవసరం లేదు మనం సిటీలో తిరుగుతున్నప్పుడే చూసాను , నాకు స్పైడర్ మ్యాన్ చూడాలని ఉంది . వారం రోజుల ముందు రిలీజ్ అయ్యిందనుకుంటాను . రైల్వే స్టేషన్ టీవీ లలో చూసాను , మా అక్కయ్యకు కూడా ఇష్టమైతే వెళదాము అని బదులిచ్చాను .



నా మాటలను వింటూ షాక్ చెందినట్లు సునీతక్క కదలకుండా ఉండిపోయింది . డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి బాబు సూపర్ మూవీ అంట మన ఊరి స్టూడెంట్స్ మాట్లాడుతుంటే విన్నాను , సాలీడు హీరోని కొరకగానే అతడు స్పైడర్ మ్యాన్ ఆయిపోతాడంట , గ్రాఫిక్స్ అత్యద్భుతమని చెప్పారు అని ఆపకుండా మాట్లాడుతుంటే .............



సునీతక్క తేరుకుని , హీరో నువ్వు నిజంగా నా హీరోనే మూడురోజుల నుండి కాలేజ్ బంక్ కొట్టి వెళదామంటే కుదరడం లేదు థాంక్యూ soooooo మచ్ హీరో నేను ప్రార్థించింది కూడా అదే అంటూ అమాంతం నన్ను సైడ్ నుండి చుట్టేసి బుగ్గను కొరికేసినంత పనిచేసింది . డ్రైవర్ అన్నయ్య కూడా నాలానే ప్రార్థించినట్లున్నాడు ..........



అవును అమ్మగారు , మీవలన మూవీ చూడొచ్చనే ఆనందంలో అలా అంటూ సిగ్గుపడుతూ పోనిచ్చాడు . 



నా తమ్ముడి ఇష్టమే నా ఫ్రెండ్ కు కూడా కోరుకుంటోంది కాబట్టి నాకు మరింత ఇష్టంగా ఉంది తొలిసారి కార్టూన్స్ తరువాత స్పైడర్ మ్యాన్ మూవీ వచ్చింది కాబట్టి దానికే వెళదాము తమ్ముడు అంటూ నా బుగ్గలను అందుకొని నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టింది . అమ్మా మీకు అని అడిగాను , గ్రాఫిక్స్ సినిమా ఇప్పటివరకూ చూడలేదు , నా బుజ్జి వలన ఆ కోరిక కూడా తీరబోతోంది అని సిగ్గుపడుతూ బదులిచ్చింది .

వో వో.......... అంటీ మీకు కూడా కోరికలు ఉన్నాయి అంటూ సునీత అమ్మను ఆటపట్టించింది .



అమ్మగారు 15 నిమిషాల్లో గుంటూరులోని బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్ దగ్గరకు తీసుకెళతాను . రష్ ఎక్కువగా ఉంటుంది అయినా పర్లేదు లేడీస్ డైరెక్ట్ లోపలకు వెళ్లిపోవచ్చు అని చెప్పాడు . 

థియేటర్ చేరుకుని చూస్తే వీకెండ్ వలన రష్ ఎక్కువగానే ఉంది , కానీ లేడీస్ ను లోపలికి పంపిస్తుండటం చూసి వెళ్లి 5 టికెట్స్ తీసుకుని ఒకటి డ్రైవర్ కు ఇచ్చి లోపలకు వెళ్ళాము . 

అమ్మగారు నాకు ముందు ఉండి చూస్తేనే కిక్కు మాస్ అంటూ ముందు సీట్లోకి వెళ్ళిపోయాడు .

నాకు చెరొకవైపు అక్కయ్యలు , ప్రక్కనే అమ్మ కూర్చుంది . మూవీ స్టార్ట్ అవ్వగానే అక్కయ్య నా చేతిని చేతివేళ్ళతో పెనవేసి ఇంటరెస్ట్ గా చూస్తోంది . సునీత అక్కయ్య , అమ్మ అయితే మూవీ లో లీనమైపోయారు .

స్పైడర్ కొట్టడం ........స్పైడర్ మ్యాన్ లా మారడం ........హీరో తన శక్తులను టెస్ట్ చెయ్యడం ..........బిల్డింగ్ బిల్డింగ్ లు దాటుకుని వెళుతున్నప్పుడల్లా అక్కయ్య , స్పైడర్ మ్యాన్ కిందకు పడిపోతాడేమోనని నా చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని గుండెలపై హత్తుకుంటోంది . 

అక్కయ్యా ...........హీరో కదా ఏమీ కాదులే అని నవ్వుతూ ధైర్యం చెప్పడంతో , 

లవ్ యు తమ్ముడూ అంటూ నాచేతిపై ముద్దుపెట్టి నవ్వింది .



అంతలో ఇంటర్వెల్ పడటంతో అమ్మా ఇక్కడే ఉండు తమ్ముడు తినడానికి ఏమైనా తెస్తాము అని నన్ను పిలిచారు . 

అక్కయ్యా .........హోటల్ లోనే ఫుల్ అయిపోయింది లోపల కొద్దిగా కూడా ఖాళీలేదు అనిచెప్పాను . 

అయితే కూల్ డ్రింక్స్ ఒక్కటే తెద్దాము తమ్ముడూ అనిచెప్పడంతో........

దానికైతే ఫుల్ గ్యాప్ ఉంది లోపల అంటూ నవ్వుకుంటూ ముగ్గురమూ వెళ్లి తీసుకొచ్చి కూర్చోగానే మూవీ స్టార్ట్ అయ్యింది .

సెకండ్ హాఫ్ మరింత అదిరిపోయింది . చుట్టూ ఉన్న జనాలంతా విజిల్స్ వేస్తుంటే .............హీరోయిన్ ను కాపాడే scene కు అందరితోపాటు నేనుకూడా విజిల్ వేసాను .

హీరో నీకు విజిల్ వెయ్యడం వచ్చా .........ఎలాగో నాకు చూపించవా......... థియేటర్ లో వేయాలని చిన్నప్పటి నుండి కోరిక .........

అక్కయ్యా .........అంటూ అక్కవైపు చూసాను . 

నేర్పించు తమ్ముడూ లేకపోతే అది వదలదు అని నవ్వి కళ్లతో సైగచెయ్యడంతో అటువైపు తిరిగి నోటిలో వేళ్ళు ఎలా పెట్టుకుని వేయాలో చూపించాను . 

గాలిమొత్తం పీల్చి చేతులు నోట్లోకి దూర్చి విజిల్ వేసింది , మొదటిసారే థియేటర్ మొత్తం వినిపించేలా సౌండ్ రావడంతో , థాంక్స్ థాంక్యూ sooooo మచ్ హీరో అంటూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి వదిలింది .

అంతలో స్పైడర్ మ్యాన్ మేరీ జేన్ ను పైనుండి వచ్చి తను ఎవరో తెలీకుండా ముద్దు పెట్టే scene రావడంతో , థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయి కన్నార్పకుండా చూస్తున్నట్లు అనిపించింది .

అక్కయ్యలిద్దరికీ కూడా తెలిసిపోయినట్లు , అక్కయ్య సిగ్గుపడుతూ తల దించుకుంది , సునీతక్క మాత్రం నావైపు కొరుక్కుని తినేసేలా చూస్తుంటే , అక్కయ్యా ..........అంటూ చేతిని చుట్టేసాను . 

ఒసేయ్ చిన్నపిల్లాడితో ఏంటే సిగ్గులేదు నీకు అని ముసిముసినవ్వులతో చెప్పింది .

పెదవులు కలువగానే యూత్ అంతా లేచిమరీ విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లేలా చేశారు .

చూడవే దాని పవర్ ...........ఇంత వయసు వచ్చింది , ఒక్క కిస్ టేస్ట్ చేసామా ............అంతా నీవల్లే , పెళ్లి తరువాతే అన్నీ అని నన్ను కూడా ఆపుతున్నావు . 

ఆ మాటలు అమ్మ విన్నట్లు సంతోషించింది . 

హీరో ఇంతకు ముందు scene చూసావా .........అని సునీతక్క చిలిపి నవ్వుతో అడిగింది .

ఒసేయ్ నిన్నూ అంటూ అక్కయ్య , సునీతక్క తలపై మొట్టికాయ వేసి తమ్ముడూ దాని మాటలు వినద్దు నువ్వు ఇటువైపురా అని లేచి నన్ను అమ్మ ప్రక్కన కూర్చోబెట్టింది . 

అద్భుతమైన ఫైట్ తో క్లైమాక్స్ సుఖాంతం అయ్యింది . హీరో మూవీ సూపర్ కదా అంటూ నెమ్మదిగా బయటకు వచ్చేసరికి డ్రైవర్ కారుని గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు .

కారు ఎక్కగానే సమయం 5 అయ్యింది నన్ను కాలేజ్ దగ్గర వదళాలే వాసంతి ఇంటికి వెళ్లిపోవాలి అనిచెప్పింది . 

నాకు కూడా తెలుసే అంటూ కాయలేజ్ లో సునీతక్క దిగి , హీరో నీవల్ల చాలా తియ్యని గుర్తులు ఆస్వాదించి నీకు ఋణపడిపోయాను . ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చేస్తాను బై అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి కాలేజ్ నుండి స్టూడెంట్స్ ఇంటికి వెళుతుంటే సునీతక్క లోపలకు వెళ్లడం చూసి నవ్వుకున్నాము .



తమ్ముడూ ఇప్పుడు చూడు బుద్ధిమంతురాలిలా కాలేజ్ నుండి వస్తున్నట్లు ఎలావస్తుంది అని అక్కయ్యా చెప్పడం , అలాగే అక్కయ్య మిగిలిన ఫ్రెండ్స్ తో పాటు దర్జాగా బయటకు రావడం చూసి నవ్వుకున్నాము .

అందరూ కారుని చుట్టుముట్టి ఒసేయ్ ఒక్క గంట ఆగలేవా ..........ఎలా ఎంజాయ్ చేశారో ఇదిచెబుతుంటే అసూయ వచ్చేస్తోంది అంటూ అక్కయ్యపై నిందలు వేశారు .

ఒసేయ్ సునీత కంటే ముందు మీకే కాల్ చేసాను , మీకు అదృష్టం లేదు అంతే అంటూ నవ్వింది . 

ఇంతకీ మన క్యూట్ బాయ్ ఎక్కడ కారులో దాచేశావా .......మేమేమీ ఇప్పుడే ఎత్తుకెళ్లము లేవే దిగమని నువ్వే పిలుస్తావా ....... .లేక మేమే దాడి చెయ్యమంటావా అని ముందుకువస్తుంటే ,

అమ్మా తల్లులు ఆగండి మీరంతా కలిసి భయపెట్టేలా ఉన్నారే అంటూ డోర్ తీసి చెవిలో ear phones పెట్టుకుని అక్క మొబైల్ లో పాటలు వింటున్న నా బుగ్గపై ముద్దుపెట్టడంతో ,

అక్కయ్యా అంటూ మొబైల్ ప్రక్కన పెట్టాను . 

తమ్ముడూ నిన్ను వీళ్లంతా చూడాలంటున్నారు .

అక్కయ్యా.............నన్ను ఎక్కడపడితే అక్కడ గిల్లుతారు అని బదులివ్వడంతో , అమ్మతోపాటు నవ్వుకుని , తమ్ముడూ నేనున్నాను కదా అలాచేస్తే వాళ్ళను కొట్టేస్తాను అంటూ నా నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి చెయ్యి అందుకొని కిందకు దిగడం ఆలస్యం ,

హ్యాండ్సమ్ , క్యూట్ బాయ్ ,మహేష్ .............అంటూ మీదకు వస్తుంటే , అక్కయ్య నన్ను వెనుక నుండి హత్తుకొని , ఒసేయ్ మీ చేష్టలతో నా బుజ్జి తమ్ముణ్ణి ఏమైనా చేసారనుకో ఊరుకోను .

ఏమిచేస్తావే ఏమిచేస్తావే ..........అంటూ ముందు అక్కయ్యకు గిలిగింతలుపెట్టి , నన్ను తమవైపు లాగి , హీరో మమ్మల్ని ఏమిచెయ్యమంటావు నువ్వు అంత క్యూట్ గా ఉంటేనూ మాచేతులను మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటూ బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి , ఈరోజుకు మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటున్నాము అంటూ కంగారుపడుతున్న నా తలపై ఇష్టంతో స్పృశించి తమ తమ బ్యాగులలోనుండి పెద్ద పెద్ద chocolates తీసి ఇచ్చారు . 

నాపెదాలపై చిరునవ్వు చిగురించడం చూసి అక్కయ్య కూడా సంతోషించింది . 

కాలేజ్ లో జాయిన్ అయ్యావట కదా రోజూ chocolates ఇస్తాము కానీ ఇంత సాఫ్ట్ గా కాదు ఎందుకంటే ఈరోజు లాగా కంత్రిల్ చేసుకోవడం మావల్ల కాదు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు . 

అక్కయ్యా .......అంటూ అందరి మధ్యలోనుండి అక్కయ్య వెనుక దాక్కున్నాను . 

ఒసేయ్ నేను కూడా ఈరోజు ఉన్నంతలా సాఫ్ట్ గా ఉండను అంటూ అక్కయ్య నవ్వుతూ వారికొక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది .

చూద్దామే ఈ యుద్ధం లో ఎవరు గెలిచి హీరోని చేజిక్కించుకుంటారో అని చెప్పడంతో లోపల ఉన్న అమ్మతోపాటు అందరూ నవ్వుకుని , ఇక వెళతాము అని అక్కయితను కౌగిలించుకుని , అక్కయ్య వెనుజ నుండి తొంగిచూస్తున్న నావైపు కన్నుకొట్టి వెళ్లిపోయారు .



నావైపు తిరిగి ఇద్దరమూ నవ్వుకుని ఎక్కి కూర్చుని అన్నా షాపింగ్ మాల్ కు వెల్లమని చెప్పింది .

నేరుగా తీసుకెళ్లి గుంటూరులోని బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ముందు కారుని ఆపాడు .

నాకు చెరొకవైపు అమ్మ అక్కయ్య చేతులను పట్టుకుని లోపల కిడ్స్ wear దగ్గరకు పిలుచుకొనివెళ్లి , సేల్స్ గర్ల్ కు నన్ను చూపించి ఇప్పటి ట్రెండ్ కు తగ్గ అన్ని డ్రెస్సెస్ చూపించండి అని చెప్పింది .

అమ్మా నువ్వు తమ్ముడికి ఏవి నచ్చితే అవి తీసుకో నేను ఆ డిస్ప్లే లో ఉంచినవి సెలెక్ట్ చేస్తాను అని సుమారు గంటసేపు సంవత్సరానికి సరిపోయే బట్టలను సెలెక్ట్ చేసాము .

నెక్స్ట్ కాలేజ్ డ్రెస్సెస్ , నైట్ డ్రెస్ లు , షార్ట్స్ , చలికి జర్కిన్స్ , స్టైల్ కోసం క్యాప్స్ ........ఇలా అన్నింటినీ నాకోసం తీసుకున్నారు .

చివరన తమ్ముడూ లోచెడ్డీలు వేసుకుంటావా అని చెవిలో అడిగింది . 

నేను సిగ్గుపడుతుంటే .........

ముసిముసినవ్వులు నవ్వి , కాలేజ్ కు వెళతావు కదా వేసుకో మంచిది అని బనియన్స్ మరియు చెడ్డీలను తీసుకుని ఇంకా ఇంకా అని ఆలోచించి thats it అని చెప్పడంతో కౌంటర్ కు పంపించారు . 

అక్కయ్య బిల్ పే చేసేసింది , షాప్ లో ఉన్నవాళ్లు అన్నింటినీ బయటకు తీసుకొచ్చి కారులో వెనుక ముందు సర్దేశారు . 

అక్కడి నుండి బుక్ స్టోర్ కు వెళ్లి కాలేజ్ లో ఇచ్చిన లిస్ట్ ప్రకారం బ్యాగ్ బుక్స్ తీసుకుని అటునుండి foot wear కు వెళ్లి కాలేజ్ కోసం షూస్ , రీబాక్ షూస్ మరియు చప్పల్స్ తీసుకుని ప్రక్కనే ఉన్న పిజ్జా కార్నర్ లో పిజ్జా తినేసి , ఐస్ క్రీమ్ షాప్ లో రెండు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ తీసుకుని కారులోకి చేరిపోయి , అన్నా ఐస్ క్రీమ్ కరిగేలోపు ఊరికి చేరిపోవాలి అని అక్కయ్య చెప్పింది . 

చూస్తారుకదా అమ్మగారు అంటూ కారుని పోనిచ్చాడు .

సిటీ దాటి చీకటిలోనే 20 నిమిషాలలో ఊరికి దగ్గరకు చేరుకున్నాము అని అక్కయ్య నన్ను హత్తుకొని నుదుటిపై ముద్దుపెట్టి చెప్పింది .

అక్కయ్యా ........ఉదయం అడుగుదామనుకున్నాను , మన ఊరి దగ్గర మాత్రం పొలాలు పండలేదు , సిటీకి దగ్గరవుతున్న కొద్దీ ఎక్కడచూసినా పచ్చదనం కనిపించింది అని అడిగాను . 

అవును తమ్ముడూ కొన్ని సంవత్సరాల క్రితం మన ఊరిలో అంతకంటే పచ్చదనం ఉండేది పంటలతో కలకలాడిపోయేవి కానీ మన వెనుక ఉన్న ఊరివాళ్ళతో గొడవలు అందుకే వాళ్ళు అక్కడ ఉన్న డ్యామ్ నుండి నీటిని మన కాలువల్లోకి వదలడం లేదు , వాళ్లకు రాజకీయంగా పలుకుబడి ఉండటంతో మన ఊరివాళ్ళు ఏమీచెయ్యలేకపోతున్నారు . 

మన తోట ఒకప్పుడు నీళ్లతో పళ్ళు కూరగాయల చెట్లతో నిండుగా ఉండేది , కానీ ఇప్పుడు ఎందుటాకులతో నిండిపోయింది , అందుకే నిన్ను తీసుకువెళ్లలేదు లేకపోతే నిన్ననే వెళ్ళేవాళ్ళము . లోపల నేను నీళ్ళల్లో స్విమ్ చేసేదాన్ని ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీరు లేదు అని బాధపడుతూ చెప్పింది . అమ్మ కళ్ళల్లో కూడా కన్నీరు కారింది.

కారు ఇంటిముందు ఆగింది , సోమయ్య పరిగెత్తుకుంటువచ్చి మొత్తం లాగేజీని డ్రైవర్ సహాయంతో లోపలపెట్టేశాడు . 



మహేష్ నీవలన స్టార్ హోటల్ లో మొదటిసారి తిన్నాను , చూడాలనుకున్న మూవీ చూసాను థాంక్స్ అని డ్రైవర్ చెప్పాడు .

అన్నయ్యా ......   మీఇంట్లో పిల్లలు ఉన్నారా ..........

నీవయసున్న ఒక తమ్ముడు ఉన్నాడు బాబు ,

తమ్ముడూ ఐస్ క్రీమే కదా అంటూ రెండింటిలో ఒకటి నాకు అందించింది . 

దానిని డ్రైవర్ అన్నకు అందించి నా ఫ్రెండ్ కు ఇవ్వండి అని బై చెప్పి , అక్కయ్య దగ్గరకు వచ్చి లవ్ యు అక్కయ్యా .........అంటూ సంతోషంతో చేతినిపట్టుకొని లోపలకువెళ్లాము .



తల్లి , బుజ్జి మీరు ఫ్రెష్ అయ్యి రండి అంతలోపు వంట వండేస్తాను అని అమ్మ నా నుదుటిపై ముద్దుపెట్టి చెప్పింది . 

అమ్మా పిజ్జా తో నా కడుపు నిండిపోయింది ..........

కొద్దిగానే కదా బుజ్జి తినింది , నిద్ర సరిగ్గా పట్టదు . నాచేతులతో ప్రేమతో తినిపిస్తాను అనిచెప్పింది. 

మా అమ్మ తినిపిస్తానంటే నేనొద్దంటానా అలాగే అమ్మా అంటూ అక్కయ్యను లాక్కుంటూ పైకి వెళ్ళాము. ఇద్దరమూ అలసిపోయినట్లు సోఫాలో వాలిపోయి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము . 



తమ్ముడూ నైట్ డ్రెస్ వేసుకో కంఫర్ట్ ఉంటుంది , కింద నుండి తీసుకొస్తాను అంతలోపు నువ్వు ఫేస్ వాష్ చేసుకో అనిచెప్పడంతో ,

సరే అక్కా అంటూ బాత్రూమ్లోకివెళ్లి టాయిలెట్ పోసి ముఖం కడుక్కుని తుడుచుకుంటూ బయటకు వచ్చాను . అక్కయ్య బట్టలను బెడ్ పై ఉంచి తనుకూడా బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ లో వచ్చింది . 

అవునక్కా హాయిగా ఉంది అంటూ కిందకు వెళ్లి వంట గదిలో అమ్మతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ , వంట అవ్వగానే అమ్మచేతి ముద్దలు తిని గుడ్ నైట్ కిస్ అందుకొని ,మనసారా అమ్మను హత్తుకొని అక్కయ్య చేతిని అందుకొని పైకివెళ్లి , నిన్నలానే టీవీ చూస్తూ అక్కయ్య ప్రాణమైన వెచ్చటి ముద్దుల్లో తడుస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నాను.
Like Reply
తరువాతి రోజు ఆదివారం స్నానం చేసి కిందకువచ్చి అమ్మ అక్కయ్య చేతులలో టిఫిన్ తింటుంటే , బయటి నుండి మహేష్ మహేష్ ...........అంటూ ఒక పిలుపు వినిపించింది .

తమ్ముడూ నువ్వుతిను నేను చూస్తాను అంటూ వెళ్లి నావయసున్న పిల్లాడితో లోపలకువచ్చి , అదిగో నీ ఫ్రెండ్ మహేష్ అని నావైపు చూపించింది .

Hi మహేష్ అంటూ నాదగ్గరకువచ్చాడు .

ఆశ్చర్యపోతూనే hi అని పలకరించి , నవ్వుతున్న అక్కయ్యవైపు చూసాను .

నిన్న ఐస్ క్రీమ్ ఇచ్చి ఫ్రెండ్ అయ్యావు కదా తమ్ముడూ ............

ఐస్ క్రీమ్ సూపర్ మహేష్ , ఫ్రెండ్ కాబట్టి థాంక్స్ చెప్పాను.........నాపేరు కృష్ణ అంటూ చేతిని చాపాడు .

Hi కృష్ణ అంటూ చేతిని కలిపి , అక్కయ్యా.........నా ఫ్రెండ్ కు కూడా టిఫిన్ అనిచెప్పాను .

అయ్యో...........అంటూ తలపై మొట్టికాయ వేసుకుని లోపలకువెళ్లి ప్లేట్ లో తీసుకొచ్చింది . 

అక్కయ్యా........ఇంట్లో తినేసివచ్చాను , కృష్ణ నువ్వు తింటేనే నేను తినేది అని నోటిని మూసేశాను . 

సరే మహేష్ అంటూ అక్కయ్య చేతిలోనుండి అందుకున్నాడు .

నిమిషంలో అయిపోగొట్టేసాడు . 

ఏయ్ కృష్ణ ఆకలి లేదన్నావు , అక్కయ్యా........ఈసారి ఎక్కువ అని చెప్పాను . 

అక్కయ్య నవ్వుకుంటూ వెళ్లి ప్లేట్ నిండా పెట్టుకునివచ్చింది .

టిఫిన్ చాలా tasty గా ఉంది మహేష్ .........

మా అమ్మ చేతివంట రుచి అద్భుతం తిను అంటూ , ఆ ........అని నోరుతెరిచాను .

అమ్మ మురిసిపోయి పెద్ద పెద్ద ముద్దలు తినిపించింది .

ఆ ప్లేట్ కూడా ఖాళీ చేసి , నేను మాట్లాడేంతలో ........... కడుపు నిండిపోయింది , అమ్మా చాలా రుచిగా ఉంది అంటూ వేళ్ళను సైతం నాకేశాడు .

నవ్వుకుని అమ్మా నాకు కూడా చాలు ...........

లాస్ట్ ముద్ద అంటూ ప్రేమతో పెద్దది తినిపించి , నీళ్లు అందించింది .



మహేష్ అందరమూ క్రికెట్ ఆడటానికి వెళుతున్నాము , నిన్నుకూడా పిలుచుకునివేళదామని వచ్చాను రా వెళదాము అని పిలిచాడు .

అక్కయ్యవైపు చూస్తే ........

వెళ్ళిరా తమ్ముడూ కృష్ణతోపాటు అందరూ ఫ్రెండ్స్ అవుతారు అని నుదుటిపై ముద్దుపెట్టు చెప్పి , నా జేబులో 100 రూపాయలు పెట్టి  ఏమైనా తినండి అంటూ తాగడానికి వాటర్ బాటిల్ కూడా అందించింది .

లవ్ యు అక్కయ్యా అంటూ అక్కయ్యను , అమ్మను కౌగిలించుకుని కృష్ణతో మాట్లాడుతూ బయటకు వెళ్ళాము .

అక్కయ్య మెయిన్ గేట్ వరకూ వచ్చి మేము టర్నింగ్ అయ్యేంతవరకూ చూస్తూ నిలబడి సంతోషంతో లోపలకువెళ్లింది .



ఊరి బయట పెద్ద గ్రౌండ్ , ఊరంతా అక్కడే ఉన్నట్లు ఏజ్ కు తగ్గట్లు నలువైపులా ఆడుతున్నారు . కృష్ణ తన టీం దగ్గరకు వెళ్లి రేయ్ మహేష్ అని పరిచయం చేసేలోపల , అవునురా నిన్న ఫంక్షన్ లో చూసాము అంటూ చేతులుకలిపి పేర్లు చెప్పి ఫ్రెండ్స్ అయిపోయాము.

ఫ్రెండ్స్ అంతా సరిసమానంగా డివైడ్ అయ్యి నన్ను కూడా ఒక టీమ్ లో వేసుకున్నారు .

ఫ్రెండ్స్ నాకు క్రికెట్ ఆడటం రాదు , ఇప్పటివరకూ బ్యాటు కూడా పట్టుకోలేదు అనిచెప్పాను .

మహేష్ చూస్తే వచ్చేస్తుంది కష్టమేమీ కాదు మనది బ్యాటింగ్ ఓపెనర్స్ ఆడేది చూడు అంతే , మనం ఆడేది టెన్నిస్ బాల్ కాబట్టి తగిలినా ఏమీకాదు అని చెప్పారు .

సరే అంటూ కృష్ణ ప్రక్కనే కూర్చున్నాను . బౌలింగ్ వెయ్యడం , మా టీమ్ బ్యాటింగ్ ఆడటం చూస్తుంటే , రాము రన్స్ , ఫోర్స్ , సిక్స్ లు , ఔట్ , బోల్డ్ , క్యాచ్ గురించి మొత్తం వివరించడంతో ఈజీ నే అనిపించింది . 

కొడుతున్నారు , ఔట్ అయ్యి వస్తున్నారు , నెక్స్ట్ బ్యాట్స్ మాన్ వెళుతున్నాడు . ఇక చివర మిగిలింది రాము , నేను .

ఔట్ అవ్వడంతో రేయ్ కృష్ణ ఇంకా రెండు over లు ఉన్నాయి కుమ్మేయ్ రా అని పంపించారు . 

అంతే కృష్బ వచ్చిన బాల్ ను వచ్చినట్లు బ్యాటును ఎత్తెత్తి కొడుతున్నాడు .

చివరి ఓవర్ ఫస్ట్ బాల్ కు మరొక ఫ్రెండ్ బౌల్డ్ అవ్వడంతో మహేష్ వచ్చెయ్ అంటూ కృష్ణ కేకవేశాడు . కాస్త కంగారుపడుతూనే వెళ్లి బ్యాటు పట్టుకున్నాను . మహేష్ టచ్ చేసి ఇటువైపు పరిగెత్తేయ్ అనిచెప్పాడు . వెళ్లి వికెట్స్ ముందు బ్యాటు పట్టుకుని నిలబడ్డాను . 

ఫస్ట్ బాల్ డాట్ , సెకండ్ బాల్ డాట్ .............కృష్ణ నాదగ్గరకువచ్చి , చేతి కండలు తాకి మహేష్ నాకంటే బలం ఉంది నీకు బాల్ టైమింగ్ చూసి నీదగ్గరకు రాగానే లాగిపెట్టి కొట్టు అని చెప్పాడు .

నెక్స్ట్ బాల్ వెయ్యగానే నాదగ్గరికి రాకముందే ఎక్కడ తగులుతుందో అని కళ్ళుమూసుకుని బ్యాటును వెనక్కు లాగి కొట్టాను . బాల్ సరిగ్గా తగిలి మాప్రక్కనే ఆడుతున్న మరొక మ్యాచ్ అవతల సిక్స్ దాటేసింది . 

అంతే మహేష్ అంటూ కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంతో కౌగిలించుకున్నాడు .

నాకు మరింత ఉత్సాహం వచ్చేసింది . అలాగే కొట్టబోయి బౌల్డ్ అయిపోయాను.

బాధపడుతుంటే ఫస్ట్ మ్యాచ్ లోనే సిక్స్ కొట్టావు గ్రేట్ ఇప్పుడు ఫీల్డింగ్ అని నన్ను బౌండరీ దగ్గర నిలబెట్టారు . నా ఘోరమైన ఫీల్డింగ్ వలన , క్యాచ్ లు వదిలెయ్యడం వలన మా సైడ్ మ్యాచ్ ఓడిపోయింది . 



మహేష్ ఏమి పర్లేదు మరొక మ్యాచ్ ఆడదాము , లాస్ట్ లో బానే ఆపావు బ్యాటింగ్ లో సిక్స్ కొట్టావు ఇంకెమికావాలి గెలిచింది కూడా మన ఫ్రెండ్సే కదా అనిచెప్పడంతో ,

అవునుకదా అంటూ గెలిచినవాళ్ళతోపాటు ఎంజాయ్ చేసి , ఫ్రెండ్స్ నన్ను మీ లో చేర్చుకున్నందుకు అందరికీ ఐస్ క్రీమ్స్ నేను ఇప్పిస్తాను అంటూ 100 రూపాయలతో కొనిచ్చాను .

థాంక్స్ మహేష్ అంటూ తినేసి మరింత ఉత్సాహంతో మరొక మ్యాచ్ మొదట మాది ఫీల్డింగ్ . అందరిలానే నాదగ్గరికి వచ్చిన బాల్ ను వధలకూడదు అని నిర్ణయించుకొని దూరం వెళుతున్నా రైల్వే స్టేషన్ లలో ఫ్లాట్ ఫారం లలో ట్రైన్ వస్తోందంటే టిఫిన్ అమ్మడానికి ఎలా పరిగెత్తేవాడినో అలా  పరిగెత్తుకుంటూ వెళ్లి పడిపోయి మరీ ఫోర్ వెళ్లే బంతిని ఆపాను .

నేను ఆపను అనే ధైర్యంతో మరొక రన్ కు పరిగెత్తుతుంటే , బలంకొద్దీ కీపర్ వైపు విసిరాను . కీపర్ అందుకొని ఔట్ చేసి మహేష్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సూపర్ అంటూ అభినందించారు . ఇక ఉత్సాహం రెట్టింపవ్వడంతో 90% బాల్స్ ఆపి, రెండు క్యాచ్ లు కూడా పట్టాను . 

మహేష్ నువ్వేనా ..........అంటూ ఆశ్చర్యపోయి సంతోషంతో బ్యాటింగ్ మొదలెట్టాము . స్కోర్ chase చేస్తూ వికెట్స్ కూడా రెగులర్ గా పడుతున్నాయి . చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం , అంతలో మాంచి ఊపులో ఉన్న కృష్ణ కూడా ఔట్ అయిపోయాడు . రన్నర్ గా అటువైపు ఉన్న ఫ్రెండ్ కు కూడా నాలాగే కొత్త , ఇక ఆ మ్యాచ్ కూడా పోయిందనుకున్నారు . 

కృష్ణ మాత్రం కన్ఫిడెన్స్ కోల్పోక నాదగ్గరికివచ్చి మహేష్ అంతలా పది dive లు చేసినా నీకు ఏమీకాలేదు , అంతే ధైర్యంతో బాల్ తగులుతుంది అన్న భయం వదిలి కళ్ళుతెరిచి కొట్టు చూడు అంటూ నాచాతీపై ఒక గుద్దు గుద్ది నొప్పికాలేదు కదా , బాల్ తగిలినా అంతే అని నాకు తెలుసు నువ్వు కొడతావు అని మరొక దెబ్బవేసి వెళ్ళిపోయి టెన్షన్ టెన్షన్ తో చూస్తూ నిలబడ్డాడు .

మొదటి బాల్ వెయ్యగానే కళ్ళుమూసుకుని బ్యాట్ లేపాను మిస్ అయ్యింది . 

ఇక ఒడిపోయినట్లే అని కృష్ణ తప్ప మిగితావాళ్ళంతా ఆకలౌతోందని వెనుతిరుగుతుంటే , కృష్ణ మాత్రం రెండు చేతులతో నాలో ఉత్సాహం నింపాడు .

నెక్ట్ బాల్ వెయ్యగానే కళ్ళుతెరిచి కొట్టబోయాను నా భుజం పై బలంగా తగిలింది . నొప్పి అనిపించకపోవడంతో ఇక వెయ్యండి అంటూ చిరునవ్వుతో రెడీ అయ్యాను . 

బ్యాట్ పిచ్ పడగానే చూసి కాస్త ముందుకెళ్లి మిడ్ ఆఫ్ లో ఇంటికి వెళుతున్న మా ఫ్రెండ్స్ మీదుగా వాళ్ళ ముందు బాల్ పడింది . 

రేయ్ చెప్పాను కదరా అంటూ కృష్ణ సంతోషంతో ఎగిరి గెంతులేస్తుంటే , బాల్ అందుకొని అందరూ వెనక్కు వచ్చి two బాల్స్ 6 రన్స్ అంటూ టెన్షన్ పడుతూ చూస్తున్నారు .

కృష్ణ వచ్చి సింగిల్ మాత్రం వద్దు 2 or 4 or six వాడికి బ్యాటు కూడా పట్టుకోవడం రాదు అని చెప్పి వెళ్ళాడు . 

నెక్స్ట్ బాల్ కొట్టినా ఫీల్డర్ దగ్గరకు వెళుతుంటే సింగిల్ తిరగకుండా ఆపేసాము .

కృష్ణ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ టెన్షన్ రెట్టింపైంది . బాల్ వెయ్యబోతుంటే రాముతోపాటు అందరూ మహేష్ కొట్టు మహేష్ కొట్టు please అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు . హాఫ్ మ్యాట్ పిచ్ రావడంతో బలంకొద్దీ మిడ్ ఆన్ వైపు కొట్టినా బంతి బౌండరీకు చాలా దూరంలో ఉన్న ముళ్ళకంపల్లో పడింది .

మహేష్ సిక్స్ అంటూ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పైకి లేపి ఎంజాయ్ చేశారు . బౌలింగ్ ఫ్రెండ్స్ వచ్చి రేయ్ మాంచి ప్లేయర్ దొరికాడు నెక్స్ట్ వీక్ అన్నయ్యలతో మ్యాచ్ పెట్టుకుందాము అని కాసేపు ఎంజాయ్ చేసి అందరితో ఉన్న కొంత కొంత డబ్బుతో ఐస్ క్రీమ్స్ అందరికీ కొని జుర్రేస్తూ ఎండలో చెమట కారుస్తూ చిరునవ్వులు చిందిస్తూ తింటూ కృష్ణ తోపాటు ఇంటికి చేరుకుని , 



రారా అంటూ చెయ్యిపట్టుకొని లాక్కుని అక్కయ్యా అక్కయ్యా ...........అంటూ సంతోషంతో లోపలకు వెళ్ళాము . వంట గదిలోనుండి వచ్చిన అక్కయ్యను అమితానందంతో హత్తుకొని , అక్కయ్యా అక్కయ్యా .........అంటూ ఆయాసంతో నేను కృష్ణ తోపాటు క్రికెట్ ఆడాను ఒక మ్యాచ్ గెలిచాము అని చెప్పాను .

అమ్మా ఫ్రిడ్జ్ లో చల్లని నీళ్లు తీసుకురా అని కేకవేసి తన కొంగుతో నా చెమటను తుడుస్తుంటే ...........

అవునక్కా ..........మహేష్ వల్లనే గెలిచాము అని కృష్ణ ఆనందంతో చెప్పాడు . 

ఫస్ట్ మ్యాచ్ నావల్లనే కదా రాము ఓడిపోయింది అదికూడా చెప్పు అని చెప్పాను . 

అది నీకు క్రికెట్ గురించి తెలియనప్పుడు అంటూ మొదటి నుండి జరిగిందంతా చెప్పి చివరలో రెండు సిక్స్ లు కొట్టి గెలిపించగానే అందరమూ వెళ్లి మహేష్ ను పైకి ఎత్తేసాము అక్కా అని చెప్పాడు .

అక్కయ్యా .........అంతా కృష్ణ వల్లనే , కృష్ణ లేకపోయుంటే అలా జరిగేది కాదు , నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు , థాంక్స్ రా అంటూ కృష్ణని కౌగిలించుకున్నాను . 

ఉదయం నుండి నిన్ను రా , ఒరేయ్ .........అని పిలుద్దామనుకున్నాను కానీ నువ్వేమనుకుంటావో అని భయపడ్డానురా అంటూ కృష్ణ నన్ను మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు .



మా సంతోషాన్ని చూసి అక్కయ్య మురిసిపోయి చేతితో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , తమ్ముడూ అమ్మ నేను కలిసి బిరియాని చేసాము , కృష్ణని పైకి పిలుచుకొనివెళ్లి ఫ్రెష్ అయ్యి రండి తిందాము అనిచెప్పింది .

లవ్ యు అక్కయ్యా అంటూ రెండుచేతులతో చుట్టేసి హత్తుకొని రారా .......అంటూ పైకి పిలుచుకొనివేళ్ళాను.



రేయ్ ఇంటికి వెళతాను లేరా అని కృష్ణగాడి మాటలు విని , కృష్ణా నీ ఫ్రెండ్ కు క్రికెట్ నేర్పించావు ట్రీట్ వద్దా , మీ అన్నయ్యకు కావాలంటే ఫోన్ చేసి చెబుతాను మీరు ముఖం చేతులు కడుక్కుని రండి , తమ్ముడూ తీసుకెళ్లు ........

రేయ్ అక్కయ్య చెప్పిందికదా తినాల్సిందే అంటూ రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యి కిందకువచ్చాము . 

మాఇద్దరినీ డైనింగ్ టేబుల్ లో కూర్చోబెట్టి కృష్ణకు మొదట వడ్డించి , నాకు అక్కయ్య తినిపించింది .

అక్కయ్యా ............నిన్న హోటల్ లో తిన్న బిరియానీ కంటే అద్భుతంగా ఉంది , అవునురా మహేష్ ఇలాంటి బిరియానీ నేను ఇంతవరకూ తినలేదు అంటూ ఆతృతతో తింటున్నాడు . 

మరేమనుకున్నావురా అమ్మ అక్కయ్య కలిసి చేశారు , రిజల్ట్ ఇలానే ఉంటుంది . లవ్ యు అమ్మా అక్కయ్యా .......అని సంతోషంతో చెప్పాను .అమ్మ మురిసిపోయింది .

రేయ్ ఉదయం అమ్మ తినిపించడం చూసాను , ఇప్పుడు అక్క తినిపిస్తోంది అని కృష్ణగాడు అడిగాడు .

అక్కయ్య మొత్తం వివరించడంతో , sorry రా అంటూ నా చేతిని స్పృశించి బిరియానీని కుమ్ముతుంటే ,అక్కయ్యతోపాటు నవ్వుకున్నాను .

క్రికెట్ ఆడి చెమట చిందించడం వలన కడుపునిండా తిన్నాము . 

రేయ్ అమ్మ ఎదురుచూస్తుంటుంది మళ్లీ కలుద్దాము అని వెళ్ళిపోయాడు . 



తమ్ముడూ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉండు , అమ్మ నేను తినేసి జాయిన్ అవుతాము అని చెప్పడంతో , 

సోఫాలో వచ్చి కూర్చుని టీవీ on చేసి స్ట్రెయిట్ స్పోర్ట్స్ ఛానెల్ వెతికిమరీ పెట్టుకుని ఓల్డ్ మ్యాచ్ చూస్తున్నాను .

అక్కయ్య ప్లేటులో వడ్డించుకొని వచ్చి నా ప్రక్కనే సోఫాలో కూర్చుని తింటుంటే , రెండు మ్యాచ్ లు ఆడటం , బిరియాని కుమ్మడాన్ వలన క్రికెట్ చూస్తూ చూస్తూ అక్కయ్య భుజం పై వాలిపోయి నిద్రలోకిజారుకున్నాను.



సాయంత్రం మళ్లీ కృష్ణగాడు వచ్చాడు అని అక్కయ్య నా బుగ్గలను ప్రేమతో స్పృశిస్తూ లేపింది .

పైకివెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని వచ్చేసరికి అక్కయ్య , అమ్మ మరియు కృష్ణగాడు మధ్యలో క్యారెమ్ బోర్డ్ పెట్టి మూడువైపులా కూర్చుని , తమ్ముడూ నీకోసమే ఎదురుచూస్తున్నాము వచ్చి కూర్చో మనిద్దరమూ ఒక జట్టు అనిచెప్పింది .

అక్కయ్యా ఈ ఆట కూడా నాకు రాదు ఒడిపోతాము అని బదులిచ్చాను .

నా తమ్ముడితో కలిసి ఆడితే చాలు నాకు ఆనందం ఓడిపోయినా పర్లేదు అని అక్కయ్య చెప్పింది .

అయినా మనం ఒడిపోయేది అమ్మతో వీడితోనే కదా అంటూ రాత్రివరకూ ఆపకుండా నవ్వుతూ ఎంజాయ్ చేసాము . 

రాత్రి కూడా కృష్ణగాడు నాతోపాటు భోజనం చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు .

తమ్ముడూ ఉదయం కాలేజ్ గుర్తుందికదా ...........

మా అక్కయ్యతోపాటు అంటూ వెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చున్నాను . 

నన్ను కౌగిలిలో బిగించి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి తొందరగా లేవాలి కాబట్టి తొందరగా వెళ్లి పడుకుందాము అని చెప్పడంతో ........

అలాగే అక్కయ్యా అంటూ అమ్మకు గుడ్ నైట్ చెప్పి ముద్దు తీసుకుని పైకివెళ్లి పడుకున్నాము.
Like Reply
ఉదయం అక్కయ్యకంటే ముందే మేల్కొని నాచుట్టూ వేసిన చేతిని నెమ్మదిగా ఎత్తి బెడ్ దిగి గుడ్ మార్నింగ్ అక్కయ్యా ..........అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి దుప్పటిని భుజాలవరకూ కప్పి , కింద వంట గదిలోనుండి సౌండ్స్ వినిపిస్తుండటంతో అమ్మలేచి మాకోసం టిఫిన్ ఏర్పాట్లలో ఉందని , టవల్ అందుకొని చప్పుడు చెయ్యకుండా బాత్రూమ్లోకి దూరి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ఒక టవల్ నడుముకు చుట్టుకొని మరొక టవల్ తో లోపలే టవల్ తో తల తుడుచుకుంటుంటే ...........

తమ్ముడూ తమ్ముడూ ..........అంటూ అక్కయ్య కంగారుపడుతున్నట్లు మాటలు వినిపించి డోర్ తీసుకుని రూంలోకివచ్చి కనిపించాను .

హమ్మయ్యా ...........అని గుండెలపై చేతినివేసుకొని నాదగ్గరకువచ్చి మోకాళ్లపై కూర్చుని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ప్రాణంలా గుండెలకు హత్తుకొని , ఇంత పొద్దున్నే నువ్వు కనిపించకపోయేసరికి కొన్ని క్షణాలు నా హృదయం తల్లడిల్లిపోయింది అని వెంటనే పెదాలపై చిరునవ్వుతో నా బుజ్జి తమ్ముడు అప్పుడే స్నానం చేసేసాడు , good morning తమ్ముడూ అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి నా చేతిలోని టవల్ అందుకొని తల తుడిచింది.



 గుడ్ మార్నింగ్ బుజ్జి అంటూ అమ్మ బూస్ట్ తీసుకొచ్చింది . అమ్మా సరైన సమయానికి వచ్చావు , కింద తమ్ముడి కాలేజ్ డ్రెస్ మరియు అవసరమైనవి తీసుకొచ్చి బెడ్ పై ఉంచు నేను స్నానం చేసివచ్చి తమ్ముణ్ణి కాలేజ్ కి రెడీ చేస్తాను అని నా నుదుటిపై ముద్దుపెట్టి టవల్ డ్రెస్ అందుకొని బాత్రూమ్లోకి వెళ్ళింది .

అమ్మ అక్కయ్య చెప్పినవన్నీ తీసుకువచ్చి బుజ్జి మీరు కిందకు వచ్చేలోపల వేడివేడి ఇడ్లి వడ రెడీ చేస్తాను అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి కిందకు వెళ్లారు .

బెడ్ పై టవల్ తోనే కూర్చుని బుక్స్ చూస్తూ కూర్చున్నాను . 

అక్కయ్య స్నానం చేసి కాలేజ్ కు వెళ్ళడానికి అందమైన డ్రెస్సువేసుకుని కురులను తుడుచుకుంటూ రూంలోకి వచ్చింది .

అక్కయ్య చాలా బాగుండటంతో కన్నార్పకుండా అలా అక్కయ్యనే చూస్తూ ఉండిపోయాను .

నా చూపులు అక్కయ్యను తాకినట్లు తదేకంగా తననే చూస్తుంటే ........

సిగ్గుపడి ఏంటి తమ్ముడూ అలా కొత్తగా చూస్తున్నావు అని అడిగింది .

అక్కయ్యా ..........డ్రెస్ బాగుంది అనిచెప్పాను ...........

సిగ్గుపడి వెంటనే బుంగమూతిపెట్టుకుని నా ప్రక్కనే కూర్చుని అయితే నేను బాలేను అన్నమాట అని అటువైపు తిరిగింది .

మా అక్కయ్య దేవత ............అది ఒకరు చెప్పాలా , మా అక్కయ్య వలన డ్రెస్ కు అందం వచ్చింది . అందుకే అడిగాను అని చెప్పాను .

అక్కయ్య సంతోషంతో మరింత సిగ్గుపడి పరవశించిపోయి , నా తమ్ముడు ఈదేవత ప్రాణం అంటూ బుగ్గలను అందుకొని ముసిముసినవ్వులు నవ్వుతూ నుదుటిపై ముద్దుపెట్టి , లోదుస్తులు అందించి వేసుకోమనిచెప్పి వెనక్కు తిరిగింది .

ఇంతకు ముందులా చూస్తావు అంటూ నవ్వుకుంటూ బాత్రూం లోకి పరిగెత్తి వేసుకొని బయటకువచ్చాను .

అక్కయ్య ఇంకా నవ్వుతూనే పిలిచి కాలేజ్ డ్రెస్ వేసి బెల్ట్ టై షూస్ వేసి దువ్వి పొడర్ పూసి fogg కొట్టి అందంగా తయారుచేసి , అద్దం ముందు కూర్చుని తానూ అలంకరించుకుంటుంటే .............

అక్కయ్యా ...........దేవతలు కూడా అలంకరించుకుంటారా అని అడిగాను .

తమ్ముడూ..............నాకి సిగ్గేస్తోంది అంటూ నన్ను తన ముందు కూర్చోబెట్టుకొని తలపై ముద్దులు కురిపిస్తూ , తనలో తాను ముసిముసినవ్వులు నవ్వుతూ రెడీ అయ్యి అయిపోయింది కిందకు వెళదామా అని అడిగింది . 

అక్కయ్యా .........ఎందుకో నాదేవతను రోజంతా అలా చూస్తూనే ఉండాలనిపిస్తోంది అనిచెప్పాను . 

నీఇష్టం తమ్ముడూ కాలేజ్ కాలేజ్ ఎగ్గొడదామా చెప్పు నీకోసం దేనికైనా రెడీ అంటూ రెండు చేతులతో వెనకనుండి చుట్టేసి పెదాలను నా వెంట్రుకలపై తాకించింది .

ఫస్ట్ రోజే వెళ్లకపోతే బాగుండదు . ఇద్దరమూ ఓకేదగ్గరికి కదా వెళ్ళేది మా అక్కయ్యను ఇంట్లో , బస్ లో అలా చూస్తూనే ఉంటాను కాబట్టి హ్యాపీ రండి వెళదాము అని అక్కయ్య కాలేజ్ కు అవసరమైనవి , నా కాలేజ్ బ్యాగ్ తీసుకుని కిందకు రావడం ఆలస్యం ,



మధ్యాహ్నానికి లంచ్ boxes అంటూ అక్కయ్యకు అందించి , బుజ్జి కాలేజ్ డ్రెస్ లో ఎంత బాగున్నావు నాన్న అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , టిఫిన్ ప్లేటులో తీసుకొచ్చి ఇద్దరకూ తినిపించింది .



అమ్మా బస్ వచ్చే సమయం అయ్యింది అంటూ నీల్లుతాగి లంచ్ బాక్స్ తీసుకుని మరొకచేతితో వెనుక బ్యాగు తగిలించుకున్న నాచేతినిపట్టుకుంది .

ఒక్క క్షణం తల్లి నా బుజ్జినాన్న తొలిరోజు కాలేజ్ వెళుతున్నాడు దిష్టి తగలకుండా అరచేతిపై కాటుక చుక్క పెట్టనివ్వు అంటూ పెట్టి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి, కొద్దిసేపు చదువుకుని ఎక్కువసేపు కొత్త ఫ్రెండ్స్ తో సంతోషన్గా ఆడుకో అనిచెప్పింది.

లవ్ యు అమ్మా ........బై అంటూ టాటా చేస్తూనే అమ్మకూడా గేట్ వరకూ వచ్చి నవ్వుతూ పంపింది .



బస్ స్టాండ్ దగ్గర సిటీలో చదువుకుంటున్న అమ్మాయిలూ అబ్బాయిలూ అంతాబుష్ కోసం ఎదురుచూస్తున్నారు . మేమువెళ్లి నిలబడటం ఆలస్యం బస్ హార్న్ సౌండ్ రావడంతో అందరూ బ్యాగ్స్ బుక్స్ తీసుకుని అలెర్ట్ అయిపోయారు . ముందూ వెనుక డోర్స్ గల ప్రైవేట్ బస్ రావడంతో , ముందు అమ్మాయిలు వెనుక అబ్బాయిలు బస్ ఎక్కసాగారు . విండో లోనుండి వాసంతి సీట్ పెట్టుకున్నానులే నెమ్మదిగా రా అని ముందు ఊరి అక్కయ్య ఫ్రెండ్ పిలవడంతో ,

Hi కాంచన అంటూ చేతిని ఊపి థాంక్స్ అన్నట్లు ఫ్లైయింగ్ కిస్ మరియు లంచ్ బ్యాగ్ ఇచ్చి నా చేతిని పట్టుకుని బస్ ఎక్కాము . 

హీరో అంటూ నాచేతిని అందుకొని బ్యాగుతీసి తన తొడలపై పెట్టుకుని ప్రక్కనే కూర్చోబెట్టుకుంది . అక్కయ్య సీట్ చివరన కూర్చుంది .

థాంక్స్ వే సోమవారం కదా అందరూ కాలేజ్ కాలేజ్స్ కు బయలుదేరారనుకుంటాను రష్ ఎక్కువ ఉంది . 

అందుకేనే వాసంతి మా ఊరి దగ్గర నుండి సీట్ కాపాడుకుంటూ వచ్చాను , నీకోసం కాదనుకో నా బుల్లి హీరో కోసం అంటూ నా భుజం చుట్టూ చేతినివేసి హత్తుకుంది . 



బస్ బయలుదేరింది . రెండునిమిషాలు అయ్యిందో లేదో వెనుక నుండి తోసుకోవడాలు మొదలయినట్లు అమ్మాయిల కోపంతో మూలుగులు వినిపించడంతో ........

ఈ పోకిరీ వెధవలు మొదలెట్టేసారా ఇక బస్ సిటీలో ఆగేంతవరకూ పాపం అమ్మాయిలపై పడుతూనే ఉంటారు అని అక్కయ్య బాధపడింది .

ఇప్పుడు ఏంటే నేను మాఊరిలో ఎక్కినప్పటి నుండి రష్ లేకపోయినాకూర్చున్న అమ్మాయిలను కూడా టీజ్ చేస్తున్నారు అని కాంచన అక్కయ్య కూడా ఫీల్ అవుతూ బదులిచ్చింది .

 రోడ్ బాగున్నా రాను రాను అమ్మాయిలపై కావాలనే పడుతున్నట్లు చేస్తుంటే , అక్కయ్య కోపంతో ఈ పోకిరీ వెధవలకి బుద్ధిచెప్పడానికి ఎవరైనా వస్తే బాగుంటుంది అని దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ,



 కళ్ళుతెరిచేలోపు అక్కయ్య హ్యాండ్ బ్యాగులోనుండి మొబైల్ తీసుకుని లేచి వెనక్కు వెళుతూ ఒక్కొక్క పోకిరీ వెధవ ఏమేమి చేస్తున్నాడో మొబైల్లో వీడియో తీస్తూ చివరివరకూ వెళ్ళాను .

కొంత మంది కోపంతో మరికొంతమంది భయంతో మరికొంతమంది పిల్లనాయాలా అంటూ రాక్షస నవ్వు నవ్వుతూ , రేయ్ వీడియో తీసి ఏమిచేస్తావు సెక్యూరిటీ ఆఫీసర్లకు చూపిస్తావా ........, మాకు సెక్యూరిటీ అధికారి లంటే భయం లేదు ఇదిగో ఇంకా బాగా తియ్యి వీడియో లో మా ముఖాలు క్లియర్ గా కనిపించాలి . సెక్యూరిటీ ఆఫీసర్లు లాక్కెలుతారు రెండు రోజులు స్టేషన్ లో ఉంచుకుని పంపిస్తారు , ఇప్పటికే రెండు మూడు సార్లు స్టేషన్ లో ఉన్నాము ఆ వీడియో తో నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు . చూశావు కదా బస్ లో ఇంతమంది ఉన్నా ఒక్క నాకొడుకొకైనా మమ్మల్ని ఆపే దమ్ముందా అని గట్టిగా నవ్వుతున్నారు .

తమ్ముడూ ........అంటూ అక్కయ్య భయంతో కంగారుపడుతుంటే ...........

ఒసేయ్ నువ్వు ప్రార్థించిన దేవుడు నీ తమ్ముడినే పంపినట్లున్నాడు కాస్త ఆగవే , రోజూ ఇలా జరుగుతున్నా భయంతో పట్టించుకోని మిగతా మగవాళ్లకు మన హీరోని చూసైనా బుద్ధివస్తుంది అంటూ అక్కయ్య నాదగ్గరికి వస్తుంటే ఆపింది .



మీరు ఇంత చేస్తున్నారంటే అన్నింటికీ తెగించి ఉంటారని ముందే ఊహించాను . ఈ వీడియోని సెక్యూరిటీ ఆఫీసర్లకు చూపిస్తానని ఎవరు చెప్పారు . అంతకంటే powerful వ్యక్తులకు అదే మీరు ఇష్టపడే , ప్రేమించే , భయపడే వాళ్లకు చూపిస్తాను .

 మనం ఇష్టపడే , ప్రేమించే , భయపడే వ్యక్తులు  ............ఎవరురా అంటూ వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడి నావైపు చూస్తుంటే ..........

అదేరా మీ ఇంట్లో అమ్మానాన్నలను , అక్కాచెల్లెళ్లకు , అఞ్ఞాతమ్ముళ్లకు మరియు మీ ఊరికి ఇదెబుష్ లో మీవెంటే వచ్చి ఊరి మధ్యలో స్క్రీన్ పై వేసిమరీ ప్రతి ఒక్కరికీ చూపిస్తాను . ఇంట్లొమీరు బుద్ధిమంతులు అనుకునే మీ వాళ్ళు బయటకు అడుగుపెట్టగానే ఎలాంటి కొడుకుని కన్నారు అని ఛీకొట్టి వాళ్లపై ఉమ్మేస్తుంటే  అప్పుడు మీ ముఖాలు , మీ నవ్వు మీ కాన్ఫిడెన్స్ చూడాలని ఉందిరా అంటూ మొబైల్ నొక్కుతూనే అప్పుడు మీలా మేమంతా ఆనందంగా నవ్వుని టపాకాయలు పేల్చుతూ ఎంజాయ్ చేస్తాము .

అంతే ఒక్కొక్కడి నుదుటిపై అలా జరగకూడదు ఊర్లో తలెత్తుకోలేము అని నుదుటిపై చెమటతో కంగారుపడి , రేయ్ ముందు ఆ పిల్లాన్ని పట్టుకొని మొబైల్ లాక్కొని పగలగొట్టేయ్యండిరా అని నన్ను చుట్టుముట్టేసి కదలకుండా పట్టేసుకున్నారు .

అక్కయ్య తమ్ముడూ అంటూ గజ గజా వణుకుతూ నాదగ్గరికి రావడానికి కూడా కొద్దిగా కూడా దారి లేకపోవడంతో డ్రైవర్ , కండక్టర్ బస్ ఆపండి ఆపండి అని కేకలు వేస్తోంది .



మొబైల్ లాక్కొని ఇప్పుడేమిచేస్తావు పిల్లనాయాలా ..........అంటూ నవ్వుతుంటే ,

అక్కయ్యా .........వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు భయపడకండి అని చెప్పి , రేయ్ మొబైల్ పగలగొట్టండి , పగలగొడితే వీడియో ఉండదు అనుకుంటున్నారా ......ఒకసారి వాట్సాప్ తెరిచిచూడండి , మా అక్కయ్య ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళిపోయింది అని నేను నవ్వాను . ( స్పైడర్ మ్యాన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన సమయంలో వాట్సాప్ లేదు , కానీ situation డిమాండ్ చెయ్యడంతో తప్పలేదు ఫ్రెండ్స్ ).

చెక్చేసి చూసి అవునురా గ్రూప్ లో పంపేసాడు ఎంతమందికి వెళ్లిందో అని నావైపు కోపంతో , రేయ్ నిన్ను ఏమిచేస్తామో చూడు అని షర్ట్ పట్టుకుని కొట్టబోయాడు . 

రేయ్ మొద్దువేదవలు ఒకసారి వెనక్కు తిరిగి చూడండిరా అంటూ నవ్వుతుంటే ......

వెనక్కు తిరిగి చూసారు . మొబైల్ ఉన్న ప్రతిఒక్కరూ వీడియో తీస్తున్నారు . 

అక్కయ్యాలిద్దరూ అందరినీ దాటుకుంటూ నా దగ్గరికి చేరుకుని తమ్ముడూ తమ్ముడూ ........అంటూ కంగారుపడుతుంటే ,

అక్కయ్యా .........చెప్పానుకదా వీళ్ళనన్ను ఏమీ చేయలేరు అని , ఇంకా ఏమి జరుగబోతోందో ఎంజాయ్ చెయ్యండి అని నవ్వుతూ చెప్పాను .

రేయ్ ఇప్పటివరకూ రెండుమూడురోజులు జైల్ కు అత్తారింటికి వెళ్లి వచ్చినట్లు వచ్చారు . కానీ చిన్నపిల్లాడికి ఇంతమంది కొట్టారని సెక్యూరిటీ ఆఫీసర్లకు తెలుస్తే ఉందిరా ...............ఎలా కొడతారా తెలుసా సంవత్సరం పాటు నడవడానికి కష్టపడతారు అని చెప్పగానే ,

భయంతో బెదిరిపోయి నన్ను వదిలేశారు . తమ్ముడూ అంటూ అక్కయ్యలిద్దరూ నన్ను హత్తుకున్నారు . 

బాబు మా తప్పేంటో తెలిసింది మమ్మల్ని క్షమించు ఇంకెప్పుడూ ఇలా చెయ్యము వీడియో delete చెయ్యండి అని బ్రతిమాలారు .



అంత త్వరగానా ...........బస్ లో ఉన్న ప్రతి ఒక్క అక్కయ్య కాళ్లపై పడి మీ కన్నీళ్ళతో అభిషేకించి తప్పయింది అక్కయ్యా , చెల్లెమ్మా ..........అంటూ ప్రాధేయపడండి అప్పుడు వాళ్లంతా satisfy అయ్యి delete చేయమంటే మీరు కొరినట్లుగానే చేస్తాను అని అక్కయ్యల చేతులను పట్టుకొని చెప్పాను .

తమ్ముడూ ఈ పోకిరీ వెధవలు మమ్మల్ని అక్కయ్యా , చెల్లి అనిపిలిస్తే ఆ అనురాగానికే మచ్చ కాళ్లపై పడమని చెప్పు తమ్ముడూ అని వాళ్ళవైపు కోపంతో చూస్తూ చెప్పారు . 

మీరు చెప్పింది కరెక్టే అక్కయ్యలూ ..........వీళ్ళు తోబుట్టువులుగా పుట్టాలని ఏ అమ్మాయి అయినా ఎలా కోరుకుంటుంది వెళ్లి బావిలో ధూకండి , మీకోసం బాధపడేవాళ్ళు ఒక్కరుకూడా ఉండరు , అంతకంటే ముందు వెళ్లి అందరి అక్కయ్యల కాళ్లపై పడండి అని చెప్పాను.



నామాటలు పూర్తికాకముందే మొదట అక్కయ్యలిద్దరి కళ్ళముందు పడి క్షమించమని వేడుకున్నారు . 

అక్కయ్య ఆనందబాస్పాలతో పొంగిపోయి తమ్ముడూ అంటూ అమితమైన సంతోషంతో నా నుదుటిపై ముద్దుపెట్టింది . 

అందరూ వెళ్లి కాళ్లపై పడుతుంటే మిగతావాళ్ళు నవ్వుతూ వీడియో తీశారు . 

డ్రైవర్ బస్ ఆపండి అనిచెప్పి అందరినీ దింపేసి మరొకసారి బస్ లో కనిపించారో మొత్తం వీడియోలు సెక్యూరిటీ ఆఫీసర్లకు టీవీల్లో వచ్చేస్తాయి అనిచెప్పడంతో దిగి పరిగెత్తారు. 

అధిచూసి అందరూ నవ్వి బస్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది , మన దేవతలను మనం కాకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు అన్నయ్యలూ , లేకపోతే మనల్ని మగాళ్లు అనటం వేస్ట్ అంటూ అక్కయ్యలతోపాటు వెళ్లి మా సీట్లలో కూర్చున్నాము .



కండక్టర్ దగ్గరకువచ్చి వాళ్లకు సరైన గుణపాఠం చెప్పావు బాబు అని అందరూ ఇంకా చప్పట్లు కొట్టి అభినందిస్తుంటే , బాబు బస్ పోనివ్వమంటారా అని అడిగారు .

అవును ఫస్ట్ రోజు కాలేజ్ కి వెళుతున్నాను ఆలస్యం అవ్వకూడదు తొందరగా పోనివ్వండి అనిచెప్పాను .

అందుకే నిన్ను ఇంతకుముందు బస్ లో చూడలేదు బాబు , తొలిరోజే ఇంతమందికి సంతోషాన్ని పంచావు , ఏ కాలేజ్ బాబు అని అడిగారు . 

అక్కయ్యవైపు చూసాను కాలేజ్ పేరు చెప్పడంతో , డ్రైవర్ కు బస్ ను నేరుగా అక్కడికే పోనివ్వమని , ఎవరికైనా అర్జెంటా అని అడిగాను . 

మా తమ్ముడి కోసం ఆలస్యమయినా పర్లేదు అంటూ ఒక అక్కయ్య వచ్చి , తమ్ముడూ నీపేరు ఏమిటి అని అడిగింది . 

మహేష్ అక్కయ్యా ...........

తమ్ముడూ మహేష్ ఇక్కడ ఉన్న మీ అక్కయ్యాలందరికీ నిన్ను సంతోషంతో ఎత్తి అభినందించాలని ఉంది కాని నువ్వు కాలేజ్ బెల్ కొట్టేలోపు చేరుకోవాలని , ఆలస్యం అవ్వకూడదని మనసారా కోరుకుంటున్నాము మళ్లీ కలుస్తాము కదా అప్పుడు మాత్రం వధలము అంటూ ఒక్కొక్కరే వచ్చి అభినందించారు . వాసంతి అక్కా తమ్ముడా ఎప్పుడు చూడలేదు . ఒహ్........మొదటిరోజు కదా ........మీ తమ్ముడు , మా తమ్ముడు కూడా .....  రియల్ హీరో అక్కా థాంక్యూ sooooo మచ్ అని అక్కయ్యను అభినందించారు .

అక్కయ్య ఆశ్చర్యకరమైన సంతోషంతో నన్నే చూసి , తమ్ముడూ ఎంత అప్పుడే ఎంత ఎదిగిపోయావో అనిపిస్తోంది , నా బుల్లి దేవుడిని ప్రక్కనే పెట్టుకుని పైన చూసి ప్రార్థించాను అంటూ నన్ను ప్రాణంలా చుట్టేసి పరవశించిపోయింది . 

కాలేజ్ ఇంటర్వెల్ లో అమ్మకు కాల్ చేసి మొత్తం విషయం చెబుదాము అంటూ 10 నిమిషాలలో అక్కయ్యాలతోపాటు కిందకు దిగుతుంటే , అందరూ వచ్చి లంచ్ బాక్స్ , నా బ్యాగుని కిందకు తీసుకొచ్చి ఇచ్చి all the best అని సంతోషంతో చెప్పి బస్ లో వెళ్లారు.



పిల్లలందరూ కాలేజ్ లోపలికి వెళుతుంటే అక్కయ్యలిద్దరూ నాచేతిని పట్టుకుని లోపలకు పిలుచుకొనివెళ్లి ప్రేయర్ లో వదిలారు . 

నేను అక్కయ్యవైపే చూస్తుంటే ఇక్కడే ఉంటాము అని చెప్పడంతో ముగించి అక్కయ్య దగ్గరకు పరిగెత్తాను .

వాసంతి 15 నిమిషాలే నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాడు , ఇంటర్వెల్ వరకూ క్లాస్ లో ఉంటాడంటే డౌబ్ట్ నాకు అని కాంచన అక్క చెబుతుంటే మురిసిపోయి ,నా నుదుటిపై ముద్దుపెట్టి , తమ్ముడూ మనకు చదువు ముఖ్యం అనిచెప్పి , లోపలకు క్లాస్ దగ్గరకు పిలుచుకువెళ్లి , క్లాస్ మిస్ వచ్చేన్తవరకూ wait చేసి రాగానే new జాయినింగ్ అంటూ పరిచయం చేసి జాగ్రత్తగా చూసుకోండి అనిచెప్పి నా బుగ్గలను స్పృశించి ఇంటర్వెల్ కు వచ్చేస్తాను అనిచెప్పి వెళ్లిపోయారు .

మిస్ అందరికీ మహేష్ అంటూ పరిచయం చేసి కూర్చోమని చెప్పింది . ముందు ఎక్కడా ఖాళీ లేకపోవడంతో వెనుక వెళ్లి కూర్చున్నాను .



 మిస్ బుక్ తీసి 35 th పేజీ తియ్యమని చెప్పి టీచ్ చేస్తుంటే , ఏమీ అర్థం కాక మరొకవైపు అక్కయ్య పదే పదే గుర్తుకువస్తుంటే , క్లాస్ అయిపోగానే బ్యాగ్ వదిలేసి పరిగెత్తుకుంటూ బయటకువచ్చి నిన్న చూపించిన గేట్ ద్వారా కాలేజ్ లోకి వెళ్ళాను . మాకంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు ఉండటం , అక్కయ్య క్లాస్ ఏదో తెలియక లోపల తిరుగుతూ ఒక్కొక్క క్లాస్ దాటి వెళుతుంటే ,

విండో ప్రక్కనే కూర్చున్న సునీతక్క హీరో అని పిలిచి అక్కయ్యకు చెప్పినట్లు , క్లాస్ జరుగుతున్నా అక్కయ్యతోపాటు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా బయటకు రాగానే , అక్కయ్యా ..........అంటూ అమాంతం హత్తుకున్నాను .

 తమ్ముడూ ఏమయ్యింది ...........మిస్ కొట్టిందా ......... 

లేదక్కా అప్పుడే 35 వ పేజీ కి వచ్చేసారు . నాకు ఏమీ అర్థం కావట్లేదు మరొకవైపు నిన్ను చూడకుండా ఉండలేకపోయాను , నిమిషం నిమిషానికి నా గుండె వేగం పెరుగుతూనే ఉంది . నాకు ఈ చదువొద్దు ఏమొద్దు మా అక్కయ్య దగ్గరే ఉంటాను అని కళ్ళల్లో నీళ్లతో చెప్పాను .

ఒసేయ్ చెప్పానా నిన్ను వదిలి ఒక్క క్లాస్ అయినా ఉండలేడు అని అంటూ కాంచన అక్క చెప్పి , you are very lucky వాసంతి అని సంతోషించింది . 

అక్కయ్య మురిసిపోయి నా నుదుటిపై ముద్దుపెట్టి కన్నీళ్లను తుడిచి , ఇప్పటివరకూ జరిగిన క్లాస్ లన్నీ నేను చెబుతాము నేర్చుకుంటావా అని అడిగింది .

ఒసేయ్ తన ప్రాణమైన దేవత నేర్పిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందే అని సునీతక్క చెప్పడంతో ..........నేను చిరునవ్వులు చిందిస్తూ తల ఊపి అక్కయ్యను హత్తుకున్నాను .



ఒసేయ్ మీరు క్లాస్ కు వెళ్ళండి మేము పార్క్ లోకి వెళతాము అని అక్కయ్య చెప్పింది .

ఒసేయ్ మా హీరోకి మేము కూడా నేర్పిస్తాము నువ్వే కావాలంటే క్లాస్ కు వెళ్లు , రా హీరో మనం పార్క్ లోకి వెళదాము అంటూ చెయ్యి అందుకొని లాక్కొని వెళుతుంటే ,

అక్కయ్య సంతోషించి , మీరు వెళ్ళండి నేను తమ్ముడి క్లాస్ కు వెళ్లి బ్యాగు తీసుకొస్తాను అని అక్కయ్య కాంచన అక్కతో కలిసి కాలేజ్ వైపు వెళ్ళింది .



ఏంటి హీరో బస్ లో పోకిరీ వెధవలకి సినిమా చూపించావట కాంచన చెప్పింది . నాకు ఎప్పుడో తెలుసు నువ్వు రియల్ హీరో అని అందుకే నీకు ఆ పేరు పెట్టింది . అది విన్నప్పటి నుండి నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా ముద్దుపెట్టి అభినందించాలి అని మనసు పదే పదే కాంక్షించింది , ఇంటర్వెల్ వరకూ ఎలారా బాబు అని మదనపడుతూ క్లాస్ కూడా వినకుండా కిటికీలోనుండి బయటకు చూస్తుంటే నువ్వే కనిపించావు అంటూ బుగ్గలను సున్నితంగా గిల్లి ముద్దుపెట్టింది .



అక్కయ్య దేవుణ్ణి ప్రార్థిస్తూ బాధపడుతుంటే అక్కయ్య సంతోషం కోసం నాకు తెలియకుండానే ధైర్యం వచ్చేసి మొత్తం క్షణాల్లో జరిగిపోయింది . 

మీ అక్కయ్య నిజంగానే అదృష్టవంతురాలు హీరో నివ్వు వచ్చాక మీ అక్కయ్య పెదాలపై చిరునవ్వు ఆగట్లేదు అంటే నమ్ము , క్లాస్ లో కూడా నిన్నే తలుచుకుంటూ ముసిముసినవ్వులు నవ్వుతూనే ఉంది , క్లాస్ కూడా రెండు మూడు సార్లు డిస్టర్బ్ అయ్యింది . క్లాస్ అయిపోగానే మీ అక్కయ్యే నీదగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేది .

అవునా సునీతక్కా .........అంటూ మురిసిపోయి పార్క్ లో కూర్చున్నాము .



అక్కయ్య బ్యాగు తీసుకుని దూరంగా కనిపించగానే అక్కయ్యా .........అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి చేతిని పట్టుకుని అక్కయ్యనే చూస్తూ చూస్తూ వచ్చాను .

ఏంటి తమ్ముడూ అలా చూస్తున్నావు .........

ఒసేయ్ క్లాస్ లో నువ్వు చేసిన రచ్చ చెప్పాను . 

లవ్ యు తమ్ముడూ అంటూ చిరునవ్వుతో ముద్దుపెట్టి కూర్చోబెట్టి , మొదటి పేజీ నుండి అక్కయ్యలందరూ చెప్పిస్తుంటే సులభంగా అర్థమయ్యి చక చకా బదులిస్తుంటే , గుడ్ వెరీ గుడ్ అంటూ చుట్టూ ముద్దులతో ముంచెత్తారు .
Like Reply
కాలేజ్ ఇంటర్వెల్ బెల్ మ్రోగడంతో నన్ను పిల్లలతోపాటు ఆడుకోవడానికి పిలుచుకొనివెళ్లారు . అర గంటసేపు అక్కయ్యల ముందే మా క్లాస్ పిల్లలతో కలిసిపోయి ఫ్రెండ్స్ అయ్యి ఆడుకున్నాను , 

అక్కయ్య మా క్లాస్ మిస్ ను కలిసి విషయం చెప్పడంతో .........

మీకు వీలైనది మీరు టీచ్ చెయ్యండి , తనకు ఇష్టమైనప్పుడే క్లాస్ కు రమ్మనండి , నేను కూడా స్పెషల్ కేర్ తీసుకుంటాను అని బదులివ్వడంతో , 

థాంక్స్ మేడం అంటూ చేతులు కలిపారు .



ఇంటర్వెల్ తరువాత కూడా కాలేజ్ పార్క్ లో కూర్చుని అక్కయ్యలు నేర్పించినది నేర్చుకుని , మధ్యాహ్నం అందరి లంచ్ బాక్స్ లు అందరమూ టేస్ట్ చేసాము . 

సునీత తొలిరోజే కదా మొత్తం వద్దు , అమ్మ కూడా తమ్ముడు అడ్జస్ట్ అయ్యాడా అంటూ పదే పదే కాల్ చేస్తోంది , అమ్మకు తమ్ముణ్ణి చూడాలని ఉన్నట్లుంది . అమ్మకు బస్ లో జరిగినది కూడా ఇంకా చెప్పలేదు , so మేము ఊరికి వెళతాము అని చెప్పింది . 

అవునక్కయ్యా ..........నాకు కూడా అమ్మను వెంటనే చూడాలని ఉంది .

నాకు తెలుసు తమ్ముడూ..........అంటూ తలపై స్పృశించింది .

నేనుకూడా వచ్చేస్తానే నువ్వులేకుండా నేనొక్కటే ఏమిచెయ్యాలే సాయంత్రం బస్ లో ఒక్కతే రావాలంటే నాకు భయం అంటూ కాంచన చెప్పడంతో అందరికీ బై చెప్పి కాలేజ్ దగ్గర నుండి ఆటోలో సర్కిల్ చేరుకొని బస్ లో బయలుదేరాము . అమ్మకు కాల్ చేసి విషయం చెప్పాము .

ఊరికి దగ్గరవుతున్న కొద్దీ దర్శనమిస్తున్న ఎండిపోయిన పంటలు చూసి అక్కయ్యలిద్దరూ బాధపడుతూ ఊళ్ల మధ్యన ఉన్న గొడవలు గురించి మాట్లాడుతూ బస్ స్టాప్ చేరుకున్నాము .

బస్ దిగగానే బుజ్జీ ..........అంటూ అమ్మ కనిపించడంతో , అమ్మా .......అంటూ పరుగునవెళ్లి హత్తుకున్నాను . 

కాలేజ్ లో బాగా ఎంజాయ్ చేశావా నాన్నా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , బ్యాగు అందుకోగా ఇంటివైపు నడిచాము .

అమ్మా బస్ లో రోజూ పోకిరీ వెధవలు ........

ఏంటి తల్లి ఈరోజు కూడా అల్లరి చేశారా ..........నిన్ను తమ్ముడిని తాకాలేదు కదా అంటూ కంగారుపడుతూ అడిగింది .

అమ్మా కాస్త చెప్పేది పూర్తి విను అంటూ ఇంటికి చేరుకుని కాంపౌండ్ లో నిలబడి చెప్పింది . 

వింటున్నంతసేపు నన్ను వెనుక నుండి హత్తుకొని మొత్తం విని బుజ్జీ అంటూ మోకాళ్లపై కూర్చుని ముద్దులతో ముంచేసి మురిసిపోయింది . నా బుజ్జిమీద ఎంతమంది కల్లుపడ్డాయో అంటూ తల్లిప్రేమతో లోపలికివెళ్లి పిడికిలిలో ఏదో తీసుకొచ్చి దిష్టి తీసి తు తు ......అంటూ ఉమ్మమనిచెప్పి , తల్లి వెనక్కు తిరగకుండా లోపలకు పిలుచుకొనివెళ్లు అనిచెప్పింది .

పైకి రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యివచ్చి సోఫాలో కూర్చుని క్రికెట్ చూస్తూ కూర్చున్నాను . 

తమ్ముడూ నువ్వు నాకు పెద్దవాడిలా కనిపిస్తున్నావు నీ ఒడిలో పడుకోవాలని ఉంది అని అడిగింది .

పట్టరాని సంతోషంతో పొంగిపోయి అక్కయ్య పడుకోవడం కోసం అనుకూలంగా కూర్చున్నాను .

లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి నా తొడలపై తలవాల్చి సోఫాలో పడుకుంది .

 టీవీ మ్యూట్ లో ఉంచేసి అక్కయ్య భుజం పై జోకొట్టాను . 

తమ్ముడూ నువ్వు ప్రక్కనే ఉంటే అంతకంటే సేఫ్ ప్లేస్ లేదనిపిస్తోంది అంటూ నా మరొకచేతిని అందుకొని తన గుండెలపై హత్తుకొని కళ్ళుమూసుకుంది .

అమ్మా దుప్పటి అని కెకెయ్యడంతో , మా ఇద్దరినీ చూసి మురిసిపోయి దుప్పటి తెచ్చి అక్కయ్యకు కప్పి , నా తలపై ప్రేమతో ముద్దుపెట్టి వెళ్ళింది.



ఉదయం బస్ లో వెళ్లిన ముందు ఊరి అక్కయ్యలు స్కూళ్ళు కాలేజ్ వదిలిన తరువాత ప్రైవేట్ బస్ స్టాండ్ చేరి వేచి చూసి మరీ అదే బస్ ఎక్కి నాకోసం బస్ మొత్తం వెతికి నిరాశతో వాళ్ళ ఊర్లు చేరుకుని , ప్రతిరోజు పోకిరీ వెధవల వలన బాధపడుతూ ఇంటికి వచ్చేవాళ్ళు తొలిసారి చాలా చాలా ఆనందంతో ఉత్సాహంతో హుషారుతో తమ తల్లిని , అక్కయ్యలను మరియు చెల్లెళ్లతో డాన్స్ చెయ్యడం చూసి ఆశ్చర్యపోయి ,

తల్లి సిటీలో జాయిన్ అయినప్పటినుండి నిన్ను ఏరోజూ ఇంత సంతోషంతో చూడలేదు , ప్రతిరోజూ ఏదో జరిగింది అన్నట్లు బాధతో కొన్ని కొన్ని రోజులు కన్నీళ్ళతో రావడం చూసి మేము బాధపడేవాళ్ళము అంటూ బుగ్గలను అందుకొని నుదుటిపై ముద్దులు కురిపించి , ఈరోజు నిన్ను చూస్తుంటే చాలా సంతోషం వేస్తోంది అని అడిగింది .

అమ్మా మీతో ఇంట్లోవాళ్ళతో మన ఊరి అమ్మాయిలందరూ ( అందులో సర్పంచి కూతురు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ కూతురు కూడా ఉంది ) ఒక విషయం దాచారు . ఆ విషయం తెలిస్తే పరువు పరువు అని అందరి నాన్నలు ఎక్కడ మా చదువులను ఆపేయ్యమంటారో అని భయపడి ఎవ్వరమూ చెప్పలేదు .

అంతే అమ్మలు కంగారుతో ఏంటే ఏవిషయం అని అడిగారు .

చెప్తాను కదా ఎందుకంత ఆత్రం అంటూ ఉదయం బస్ లో జరిగింది మొత్తం వివరించి ఇక వాళ్ళ వీడియోలు ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉండటం వలన ఇక బస్ అంటే భయపడేలా చేశాడమ్మా మహేష్ , ఇంతకీ మహేష్ వయసెంతో తెలుసా 10 ఏళ్ళు కూడా సరిగ్గా నిండలేదమ్మా ...........తనకి సరిగ్గా థాంక్స్ కూడా చెప్పనందుకు ఊరిలోని అమ్మాయిలంతా చాలాబాధపడుతున్నారు . సాయంత్రం బస్ లో కూడా రాలేదు అని అమ్మలను కౌగిలించుకొన్నారు .



అదంతా గది బయట నుండి విన్న కొంతమంది నాన్నలు , లోపలికివచ్చి కళ్ళల్లో కన్నీళ్ళతో తల్లి మమ్మల్ని క్షమించు . మా పరువు ప్రతిష్టలు కోసం పిల్లలను బలిచేస్తున్నాము . ఒక ఆడపిల్లకు కష్టమొస్తే తల్లిదండ్రులతో చెప్పుకుంటారు . కానీ ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోతే పిల్లలు ఎంతలా బాధపడతారో తెలిసి మా హృదయం కదిలిపోయింది తల్లి అంటూ చేతులుచాపి కౌగిలిలోకి పిలిచారు . 

నాన్న అంటూ పరుగునవెళ్లి కౌగిలించుకొన్నారు . 

కూతురు ప్రాణంలా కౌగిలించుకుంటే , తన ఆనందం చూడటం కంటే ఒక తండ్రికి అదృష్టం ఏముంటుంది తల్లి అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , ఇంతకీ ఆ బాబుది ఏ ఊరు అని అడిగారు . 

చెబితే మీరు మళ్లీ మొదటికొస్తారు మేమే ఎలాగోలా రుణం తీర్చుకుంటాము అని బదులిచ్చారు .

తల్లి వాళ్ళది ఏ ఊరైనా ఎవరి పిల్లాడైనా సంతోషంతో కలిసి మా ఊరి పిల్లలకు సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు తెలుపుతాము అని చెప్పారు . 

నాన్నగారు మాట తప్పకూడదు అని ఊరుపేరు చెప్పగానే కోపంతో చూస్తుంటే ,

నాకు తెలుసు నాన్నగారు మీకు మీ పిల్లల కంటే పరువు ప్రతిష్టలే ముఖ్యం అందుకే మేము మీతో ఏవిషయం చెప్పము అంటూ అమ్మా చెప్పానుకదా అంటూ వెళ్లి కౌగిలించుకుని బాధపడుతుంటే ,

తల్లి ఇది నేనొక్కరే తీసుకునే నిర్ణయం కాదు వెళ్లి సర్పంచి , చైర్మన్ గారిని కలుస్తాను అనిచెప్పి వాళ్ళ ఇంటిదగ్గరకువెలితే అప్పటికే అక్కడకు చాలామంది పేరెంట్స్ చేరడం చూసి వెళ్లి విషయం కనుక్కోవడంతో , సంతోషించి అందరికీ సపోర్ట్ గా నిలబడ్డారు .



చైర్మన్ బయటకువచ్చి మీ పిల్లలే కాదు నా కూతురు కూడా మీలానే కోరుకుంటోంది లేకపోతే జీవితంలో మాట్లాడను అంటోంది . 

చూడండి చైర్మన్ గారు ఎప్పుడో జరిగిన కొట్లాటలను మన పిల్లల మీద రుద్దడం మంచిదికాదు అని చదువుకున్న వ్యక్తి మాట్లాడటంతో , దానికి అందరూ వంత పాడారు . ఇంతకుముందు రెండు ఊర్లవాళ్ళము అన్నదమ్ముల్లా ఉండి జాతర్లు , సంబరాలు చేసుకునేవాళ్ళము ఒకసారి ఆలోచించండి అని చెప్పడంతో , 



తనకు కూడా అదేకావాలి లేకపోతే లోపల ఫుడ్ కూడా పెట్టేలా లేదు తల్లీకూతుళ్ళు అని కాస్త బెట్టుచేసి అందరూ ఒప్పించడంతో తగ్గినట్లు , ఊరందరి సంతోషమేకదా నాకు కావాల్సింది రేయ్ తిప్పయ్యా , గోపి .........ట్రాక్టర్లు తియ్యండ్రా అందరమూ ఆ ఊరికి వెళుతున్నాము అని కెకెయ్యడంతో , ట్రాక్టర్లు ఉన్నవాళ్ళంతా వెళ్లి తీసుకొచ్చి గుంపులు గుంపులుగా సంతోషంతో అరుస్తూ బయలుదేరారు.



ఒకటివెనుక ఒకటి ట్రాక్టర్లు వరుసపెట్టి వస్తుండటం అదికూడా కలిసిపోతున్నాము అని ఆనందంతో కేకలువేస్తూ వస్తుండటం , ఊరిబయటే చూసిన జనాలు రేయ్ మన ఊరిమీదపడటానికి ఊరుమొత్తం వస్తోందిరోయ్ దొరికిన ఆయుధం పట్టుకొని రండి అంటూ పరిగెత్తుకుంటూ ఊరుమొత్తం చెప్పడంతో ,

దొరికిన వాటిని చేతబట్టుకొని అందరూ ఒకచోట గుమికూడి కోపంతో వారివైపు చూస్తున్నారు .

ఇంట్లో టీవీ చూస్తుంటే నాన్నగారు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపులన్నీ వేసేసి పక్క ఊరివాళ్ళు మన ఊరివాళ్లను కొట్టడానికి వచ్చారు , సౌండ్ చేయకండి అంటూ టీవీ ఆఫ్ చేసి రూంలోకి వెళ్లి దాక్కున్నారు .

తల్లి అంటూ అమ్మవచ్చి నా మీద పడుకున్న అక్కయ్యను లేపి విషయం చెప్పింది .

తమ్ముడు అంటూ అక్కయ్య నన్ను తన గుండెలపై దాచుకుని నీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు అంటూ ముద్దుపెట్టి తలుపువైపు చూస్తున్నారు .

అక్కయ్యా .........నా ప్రాణాలడ్డు వెసైనా మా అమ్మను అక్కయ్యను కాపాడుకుంటాను భయపడకండి అంటూ ధైర్యం చెప్పాను .

తమ్ముడూ అంటూ ఇద్దరూ ప్రాణంలా ముద్దుపెట్టి రెండువైపుల నుండి హత్తుకున్నారు .



బయట మాత్రం అందరూ ట్రాక్టర్లు దిగి మేము గొడవపడటానికి రాలేదు చూడండి కర్రలు కూడా లేవు అంటూ స్వయంగా చైర్మన్ , సర్పంచ్ వచ్చి మా ఊరి సర్పంచి చేతులను కలిపి మొత్తం వివరించి, మా ఊరి పిల్లలకు మీ ఊరిలోని పిల్లాడి వలన మంచి జరిగింది తనను అందరమూ ఒకసారి కలిసి మా కృతజ్ఞతలు తెలపాలని వచ్చాము అంతే లేకపోతే మాపిల్లలు మాతో మాట్లాడేలా లేదు అనిచెప్పారు . మీరు అనుమతిస్తే కలిసి ఎలావచ్చామో అలా వెళ్లిపోతాము అని వినయంతో చెప్పారు .



మా ఊరివాళ్లకు మీవాళ్లపై ఎప్పుడూ కోపం లేదు వెళ్ళండి అంటూ ఊరిలోకి దారి వదిలి , ఇంతకీ ఎవరి పిల్లాడు అనిచెప్పారు .

వాసంతి అనే అమ్మాయి తమ్ముడని మాత్రం చెప్పారు .

ఒహ్ .......మహేష్ కోసం వచ్చారన్నమాట , రెండు రోజుల క్రితం పేపర్ చూసినవాళ్ళందరికీ పిల్లాడు పరిచయమే అని చెప్పారు .

అతడేనా ఊరుఊరంతా చూసాము అయితే వెంటనే కలవాల్సిందే అంటూ ఆతృత చూపిస్తుంటే ........

మహేష్ అంటే మా అందరికీ ఇష్టం , రండి మేమే స్వయంగా తీసుకెళ్తాము అని ఊరుఊరంతా పక్క ఊరివారందరినీ పిలుచుకొనివచ్చి బయటి నుండే వాసంతి , అమ్మాయి వాసంతి నీ తమ్ముడి కోసం ఎంతమంది వచ్చారో ఒకసారి బయటకువచ్చి చూడండి అనిపిలిచారు .

అంతలో కృష్ణగాడు గేట్ తీసుకుని పరిగెత్తుకుంటూ తలుపుదగ్గరకువచ్చి రేయ్ మహేష్ వినిపిస్తుందా తొందరగా తలుపు తెరువరా అని తలుపు తట్టాడు .
Like Reply
అమ్మా అక్కయ్యా .........కృష్ణ పిలుస్తున్నాడు అయితే ఏమీ పర్లేదు రండి అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని వచ్చి తలుపుతీసాను .

నన్ను చూసి ఇంతచిన్న పిల్లాడు అంటూ ఆశ్చర్యపోయి , మేము దగ్గరకు వెళ్ళొచ్చా అని అడిగి లోపలకువచ్చి , బాబు ఉదయం నువ్వు కాపాడిన వాళ్ళందరూ మా ప్రాణానికి ప్రాణం , ఇప్పుడు నిన్ను స్వయంగా కలిసి ధన్యవాదాలు తెలుపకపోతే మా పిల్లలు మాతో మాట్లాడము అని కూర్చున్నారు . 

మాపిల్లలను ఆ వెధవల బారినుండి కాపాడినందుకు చాలా చాలా ధన్యవాదాలు బాబు అంటూ తనను తాను పరిచయం చేసుకుని అందరి తరుపున చైర్మన్ నా చేతులు కలపడానికి ముందుకువచ్చారు . 



ఒక్క నిమిషం బస్ లో ఉన్న అక్కయ్యలందరూ వాళ్ళ వాళ్ళ నాన్నలతో మాట్లాడమని మొండిగా ఉన్నారు అంటారు .

అవును బాబు ............ నిన్ను కలిసి థాంక్స్ చెప్పకపోతే నాకూతురైతే తన అమ్మతో కలిసిపోయి నాకు ఫుడ్ కూడా పెట్టమని బయటకు తోసేశారు అని ఎవరికీ వినిపించకుండా నా చెవిలో చెప్పాడు .



ఒహ్ .........అలానా మీకు మంచి జరిగింది కాబట్టి మన ఊళ్ల మధ్య గొడవలున్నా .........మా ఊరివాళ్లపై కోపం ఉన్నా ఇంత దిగివచ్చారు . 



మరి అంతచేసిన నాకు మీ ఇంటి ఆడపడుచులను క్రూరమైన మానవ జంతువుల నుండి కాపాడినా జస్ట్ థాంక్స్ చెప్పి వెళ్లిపోతారా ............రుణం తీర్చుకోవాలని లేదా అని అడిగాను .

నీకు ఏమిఇచ్చినా తక్కువే బాబు చెప్పు ఏమి ఇవ్వమంటావు , డబ్బు నగలు .........అని అందరూ నన్ను చుట్టూ చుట్టేసి చెప్పు బాబు చెప్పు అని అడిగారు .



మా ఊరివాళ్ళంతా ఎంత డబ్బు నగలు అడుగుతాడో అని గుసగుసలాడుకుంటూ మావైపు చూస్తున్నారు .



చెప్పు బాబు ఎంతైనా ఇస్తాము ............

మాట తప్పరు కదా .........

బాబు నేను ఊరి చైర్మన్ , ఇతడు సర్పంచి..........

అక్కయ్యవైపు చూస్తూ నీళ్లు కావాలి అని అడిగాను .

నీళ్ళా............. అని వచ్చినవారంతా ఆశ్చర్యపోతుంటే .........

అక్కయ్యకు మాత్రం మొత్తం అర్థమైపోయి కళ్ళల్లో నీళ్లతో , yes yes తమ్ముడూ అంటూ తల ఊపింది .



అవును మా ఊరి పొలాలు తడవటానికి నీళ్లు కావాలి , ఆ నీళ్లు మీరు వదిలితేనే వస్తాయని మా అక్కయ్య ద్వారా తెలుసుకున్నాను . ఆ పొలాలను చూసి మా అక్కయ్య మరియు మా ఊరివాళ్ళంతా బాధపడని రోజులేదు , మీ పొలాలకు కావాల్సిన నీటిని డబల్ తీసుకుని మిగిలిన నీటిని మాఊరికి వదలండి , అప్పుడు నేనే మీకు చేతులెత్తి నమస్కరిస్తాను అనిచెప్పాను . ఎవరో రాజకీయ స్వార్థం కోసం స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి అన్నదమ్ముల్లా కలిసున్న మనం ఇలా గొడవలు పడటం భావి తరాలకు మంచిది కాదని చెప్పాను. పంటలు సరిగ్గా పండకపోవడం వలన గత కొన్ని సంవత్సరాలుగా మా ఊరి వాళ్లంతా మా ఊరి అమ్మకు జాతర కూడా జరిపించలేదు .



నామాటలను విని మా ఊరు ఊరు మొత్తం ఒకరొకరిని చూసుకుని షాక్ లో ఉండిపోయారు .

 బాబు అధితప్ప ఏదైనా అని .........చెప్పబోయి , మాటిచ్చామని గుర్తుకువచ్చి ఆగిపోయి , తలదించుకొని ఒక్కమాటకూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు .



 అక్కయ్యా ..........అంటూ కళ్ళల్లో నీళ్లతో వెళ్లి మనవల్ల కూడా కాలేదు అక్కా అంటూ హత్తుకొని ఏడవడం మొదలెట్టాను . 

అక్కయ్య ఎలా ఓదార్చాలో తెలియక నానా తలపై చేతులువేసి స్పృశించింది .

రేయ్ మహేష్ నీ ఫ్రెండ్ అయినందుకు గర్వపడుతున్నానురా అంటూ భుజం పై చేతిని వేసి ఓదార్చాడు .

అమ్మ తన కన్నీళ్లను తుడుచుకుని లోపలకువెళ్లి తాగడానికి నీళ్లు తీసుకొనివచ్చి తలపై ప్రాణంలా స్పృశించింది .



ఇక మా ఊరివాళ్ళందరి కళ్ళల్లో నీళ్లతో మావైపు దండం పెట్టి బాధపడుతూ వెళ్లిపోయారు .



అమ్మ అక్కయ్య ఓదారుస్తూ లోపలికి పిలుచుకొనివెళ్లారు .

కృష్ణ కూడా మావెంటే వచ్చి చాలాసేపు ఉండి వెళ్ళిపోయాడు .

తరువాత ఊరిలో ఉండే అక్కయ్య ఫ్రెండ్స్ , అమ్మకు తెలిసిన వాళ్ళకు విషయం తెలిసి ఇంటికి వచ్చారు . 

రాత్రి అమ్మ ప్లేటులో వడ్డించుకొని వచ్చి తినిపించబోయినా ...........అక్కయ్యా ....నాకు తినాలని లేదు అంటూ అక్కయ్య గుండెలపై వాలిపోయి ఏడుస్తూ ఏడుస్తూనే ఎప్పుడో అర్ధరాత్రి నిద్రపోయాను .



తెల్లవారకముందే నిద్రమబ్బుతో చెంబు చేతబట్టుకొని చెరువు గట్టుకు వెళ్లిన ఊరివాళ్లకు , నీళ్ల చప్పుడు వినిపించి చెరువు వైపు చూస్తే చెరువు మొత్తం నీళ్లతో నిండిపోయి పొలాలవైపు చిన్న చిన్న కాలువల్లోకి వెళుతుండటం , ఆ నీళ్లన్నీ ముందు ఊరినుండి పెద్ద కాలువలో వస్తుండటం చూసి చెంబుని అక్కడికక్కడే వదిలేసి ఊరిలోకి వచ్చి , ఊరంతా వినిపించేలా చెరువు మొత్తం నీటితో నిండిపోయింది లేవండ్రా బాబు అని అరవడంతో అందరూ ఉలిక్కిపడి లేచి బయటకువచ్చి విషయం తెలుసుకుని చెరువు దగ్గరకు పరుగులుతీశారు .



దగ్గరవుతున్న కొద్దీ నీళ్ల చప్పుడుకు పెదాలపై చిరునవ్వుతో గట్టుమీదకు చేరి నీళ్లతో కలకళలాడుతుండటం చూసి ఆనందంతో పరవశించిపోయి , రేయ్ ఇకనుండి మన అదృష్టం మారబోతోంది అంటూ గెంతులేశారు , మరి కొందరైతే ఏకంగా నీళ్ళల్లోకి దుంకేసి ఈతాడారు .



 అన్నా ఇక అన్ని పొలాల్లోకి వదులుదామా అని ఒకరు అడిగాడు .

తమ్ముడూ ఇలా చెరువు మొత్తం నిండిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకదా ....... రేయ్ పదండ్రా మహేష్ ఇంటికి , మహేష్ ద్వారానే అన్ని పొలాలకు నీళ్లు వెళ్లేలా చిన్న కాలువల గాట్లు తెరిపిద్దాము , కొంతమంది పూజ ఏర్పాట్లు చెయ్యండి అంటూ ఊరంతా కదిలింది...............
Like Reply
Super bro
[+] 1 user Likes Vijaykumar032's post
Like Reply
Superb narration bhayya and oka superhit movie chusthunte madya lo current poyinattu undi but eagerly waiting for next update bhayya
[+] 1 user Likes Kishore129's post
Like Reply
చాలా చాలా బాగుంది మిత్రమా. ఏమని చెప్పను, ఎంతని చెప్పను మీ రచనా శైలిని.ఎంత చెప్పినా ఏమని చెప్పినా అది చాలా తక్కువే అనిపిస్తుంది. ఈ అప్డేట్ మొత్తం చాలా బాగుంది. అందుకే నేను అంత విడమరిచి ఆ సన్నివేశం బాగా రాశారు, ఈ సన్నివేశం బాగా రాశారు అని చెప్పలేక పోతున్నాను. ప్రతీ సన్నివేశం చాలా బాగుంది. నాకు ఇంతకు మించి ఏమీ చెప్పాలో తెలియటం లేదు.
తప్పుగా ఎమన్నా అంటే మన్నించండి.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
Too good update sir

నెక్స్ట్ 7 ఏళ్ళు మీకు వీలు కలిగినప్పుడల్లా ఇలాగే తినిపిస్తారా అని కన్నీఇళ్లను తుడుచుకుంటూ ప్రేమతో అడిగాను .

Ekkada ela adagadaniki emaina twist vundha sir

Leka emaina spell mistake ha
[+] 1 user Likes ravali.rrr's post
Like Reply
Super update bro
మీ
Umesh
[+] 1 user Likes Umesh5251's post
Like Reply
Haaa mahesh garu. అద్భుతం మహేష్ గారు మనసు పరవసించిపోవయ్యింది అనుకో చదివి మాటలు రావడం లేదు అమీ చెప్పాలో అప్డేట్ చదివి ఎంతో ఆహ్లదకరం గా ఆనందంగా సూపర్ అండి.
[+] 1 user Likes Saradhi41's post
Like Reply
చాలా చాలా బాగుంది అప్డేట్????????❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
              అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి 
[+] 1 user Likes Raju1987's post
Like Reply
Em cheppagalam sir ie update gurinchi
Ie update chaduvutu unnanta sepu yedo feel tho Chala happy ga anipinchindi super Sir thanks u Mahesh sir
[+] 1 user Likes noohi's post
Like Reply
మిత్రమా మహేష్...
ముందుగా మీ రెండవ దారం కూడా వంద పేజీలు పూర్తి చూసుకున్ననందుకు శుభాకాంక్షలు మిత్రమా..
update మాత్రం అదరకొట్టారు మిత్రమా..
వాసంతి ముందుగా మహేష్ కి కేక్ తినిపించమనడం మహేష్ నాకు కాదు ఫిస్ట్ అక్కయ్య కి ఆ తర్వాతే నాకు అని చూపడం వాళ్ళని చూసి అమ్మ అన్ధబాష్పాలు కార్చడం అసలు నీకు మాత్రమే వీలు అవుతుంది మిత్రమా ఇలా కథలని వర్ణించడం...
నాన్న ekada కనిపించకుండా పోవడం కేక్ తినిపించడం కోసం మహేష్ బాధపడడం...
అక్కయ్య వాళ్ళ ఫ్రండ్స్ ని పిలిచి సైగ చేయటం వాళ్ళు అందరు వచ్చి గిఫ్టులు ఇవ్వడం mahesh బుగ్గలు గిల్లడం బాగుంది....
ఉరి జనం అందరు మహేష్ కి బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం అక్కయ్య లోపలి నుండి చూస్తూ అనాధపడడం వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ బాగుంది...
అందరు కలిసి కామెడీ మూవీ చూస్తూ నవ్వుతు మాట్లాడుకుంటూ చూడటం అక్కయ్య మహేష్ ని థియేటర్ లో ఎం ఐన మూవీ చూసావా అని అడగటం దానికి మహేష్ లేదు అని చెప్పడం అక్కయ్య అమ్మ కళ్ళలో తడి చేరడం అక్కయ్య మహేష్ కి ప్రపంచం లో ఉన్న అన్ని చూపిస్త అనడం నిజంగా వారి మధ్య అనుబంధం కి ఒక హాట్స్లోఫ్ ...
అక్కయ్య ఒడిలో టీవీ chusthu హాయిగా నిద్రపోవడం అదుర్స్ ...
ఉదయమే లేచి గుంటూరు మొత్తం తమ్ముడికి చూపించాలి అని అనుకుంటూ అక్క కూడా నిద్రపోవడం....
ఉదయం లేచాక అమ్మ వంట రెడీ చూస్తూ ఉండగా అక్కయ్య ఫ్రెష్ ఐ వచ్చి మహేష్ ని స్నానం ki పంపగా మహేష్ స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకుంటూ ఉండంగా అక్కయ్య చిలిపిగా చూడటం మహేష్ సిగ్గుపడటం వెంటనే టిఫిన్ చేయటం అమ్మ సర్పంచ్ గారి కార్ ని తీసుకురమ్మని చెప్పి బయలుదేరాడం సూపర్బ్...
టెంపుల్ కి వెళ్లడం అక్కడ నుండి కాలేజీ కి వెళ్లడం అక్కయ్య బెస్ట్ ఫ్రండ్ ని కలసి కాలేజ్ లో జోన్ చేయటం నెక్స్ట్ మూవీ కి వెళ్లడం కాలేజ్ సంబంధించి ఐటమ్స్ అన్ని తీసుకుని హోటల్ కి వెళ్లి బిర్యానీ స్క్రీమ్స్ తినడం మల్లి ఇంటికి రావడం డ్రైవర్ అంకుల్ తో మాట్లాడి ఐస్ క్రీం న ఫ్రండ్ కి ఇవ్వండి అని చెప్పడం సూపర్బ్ అసలు ఇంత చిన్న వయసులో మహేష్ ని ఎక్కడికో తీసుకువెళ్తునారు అసలు హెరొఇస్ం ఎలేవేటే చేయటం లో మీకు మిరే సాటి మిత్రమా...
సండే మహేష్ మహేష్ అంటూ కృష్ణ రావడం బయటికి వెళ్లి ఆడుకుందాం ani చెప్పి వాళ్ళ frnds కి పరిచయం చేసి క్రికెట్ ఆడడటం ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవటం మల్లి కృష్ణ ఏంకౌజ్మెంట్  తో సెకండ్ మ్యాచ్ గెలడం మీలోని రైటర్ ని ప్రతి క్షణం మమల్ని ఆశర్యపరుస్తూనే ఉన్నాడు మిత్రమా...
ఇంటికి వెళ్లి అమ్మ అక్క లకు కృష్ణ మ్యాచ్ మహేష్ వల్లే గెలిచాం అని చెప్పడం మహేష్ కూడా ఫస్ట్ మ్యాచ్ నావల్లే ఓడిపోయారు అని చెప్పడం కృష్ణ అయితే మహేష్ అది కాదు నీవల్ల రెండవ మ్యాచ్ గెలిచాం అని చెప్పడం మహేష్ అమ్మ అక్కయ్య కృష్ణ వల్లనే నేను ఆలా అడగలిగాను అని చెప్పడం వాళ్ళ మధ్య మంచి ఫ్రండ్షిప్ బాండ్ కి దరితీస్తుంది...
అక్కయ్య బిర్యానీ చేయటం మహేష్ కృష్ణ బాగుంది అనుకుంటూ లొట్టలేసుకుంటూ తినడం నైట్ ఐంది అని కృష్ణ వెళ్లిపోవడం మహేష్ అక్కయ్య తో టీవీ చూస్తూ హాయిగా నిద్రపోవడం ఆరోపించారు అప్డేట్ మాత్రం...
ఉదయమే నిద్రలేచి మహేష్ కాలేజ్ కి రెడీ అవడం అక్కయ్య న కోసం అమ్మ పొద్దునే లేచి వంట చేయటం అపుడే అక్కయ్య లేచి బుజ్జి లేచావా నేను కూడా రెడీ వస్తా అనై కాలేజీ కి రెడీ కావడం..
టిఫిన్ చేసి బస్సు కోసం చూస్తూ ఉండంగా బస్సు రావడం బస్సు ఎక్కి ఫ్రండ్ పాకాన కూర్చుని వెళ్లడం అపుడు బాయ్స్ అమ్మాయిలని టీజ్ చేయటం చూసి అక్కయ్య గాడ్ ని వేసుకోవటం అది చుసిన మహేష్ వాళ్ళ టీసింగ్ ని వీడియో తీసి బయపెట్టాడం ఈ ఎపిసోడ్ లో మాత్రం సూపర్ గ ఎలేవేట్ చేసారు మహేష్ ని....
మహేష్ ని కాలేజ్ పంపి అక్కవాళ్ళు కాలేజీ కి వెళ్లడం మహేష్ ఎం అర్ధం కాకా అక్క దగరికి రావడం నాకు ఏమి అర్ధం kavadam లేదు అక్క అని చెప్పడం అక్క మరియు అక్క వాళ్ళ ఫ్రండ్స్ అందరి మహేష్ కి స్టడీస్ లో హెల్ప్ చేయటం అదే విషయం కాలేజ్ టీచర్ కి చెప్పడం మేడం కూడా ఒప్పుకోవడం సూపర్....
బస్సు లో జరిగిన విషయం అందరు అమ్మాయిలు వాలా ఇంట్లో చెప్పడం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వాళ్ళ ప్రేమ కి దూరం కాకుండా ఉన్నారు అని అనుకోవడం అందరు కలిసి మహేష్ కి కృతజ్ఞతలు చెప్పటానికి రావడం ఈ ఉరి వాళ్ళు అందరు మన మీదకి వస్తున్నారు అని అనుకోవడం ఛైన్మన్ అండ్ సర్పంచ్ గారు మాట్లాడటం పేపర్ లో వచ్చిన ఆ మహేష్ ఈ మహేష్ ఒక్కరే అని చెప్పడం వాళ్ళ అనందం అయితే చెప్పటానికి వీలు లేదు...
అందరు గొడవ కోసం వస్తున్నారు అని అనుకుని డోర్స్ పెట్టుకుని ఉన్న వాసంతి ఫామిలీ కృష్ణ పిలవడం వాళ్ళ ఎం అక్కదు అని మహేష్ బయటికి రావడం ఈ బాబు ఈ pani చేశాడా అని అనుకోవడం అందరు కలిసి ని ఋణం ఎలా తీర్చుకోవాలో తెలీదు అని అనడం అపుడు మహేష్ నాకు నీళ్లు కావాలి అని అడగడం అమ్మ అక్కయ్య బాధపడడటం  అందరు మహేష్ చెప్పింది విని సైలెంట్ గ వెళ్లిపోవడం ఆరోపించారు అప్డేట్ మాత్రం మహేష్ ఏజ్ తాను చేసే పనులకి అసలీ పొంతన లేదు నిజంగా మీకు స్కిల్స్ కి ధన్యవాదములు మిత్రమా...
ఉదయం లేచి చుసిన జనానికి నీళ్లు రావడం చూసి అనాధానపడటం ఇది అంత మహేష్ వల్లే జరిగింది అని పూజలు స్టార్ట్ చేదాం అని మహేష్ ని కలవటానికి వెళ్ళటం 
సూపర్ మిత్రమా..
మహేష్ వాళ్ళ రెండు ఉరులు మల్లి ఒకటి గ కలిసి జాతర చేస్తారు అందరు మహేష్ ని మరియు వాళ్ళ ఫామిలీ ఎలా చూస్తారో అండ్ అమ్మ అక్కయ్య ల అనాధాన్ని మహేష్ ఎలా ఎంజాయ్ చేస్తాడో అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి మిత్రమా....
[+] 5 users Like akhil akki's post
Like Reply
Mahesh garu emani varninchalo teliyadam ledu
[+] 1 user Likes DJDJDJDJ's post
Like Reply
Janmanichina Talli kosam prayanam update eppudu sir
[+] 2 users Like DJDJDJDJ's post
Like Reply
No word bro u r keka
[+] 1 user Likes Vinay smart's post
Like Reply




Users browsing this thread: 120 Guest(s)