Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
saravali-vol-1.pdf






http://www.mediafire.com/file/9jyxp8evwn...1.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
కలశం ఏర్పాటు ఎందుకు? సృష్టికి ముందు ఏం జరిగింది?
ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే.. తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు
ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే.. తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తారు.


అయితే కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే.. సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రము మీద శయనించుచున్న తరుణంలో అతని నాభి నుంచి ఒక కలువ పువ్వు ఉద్భవించినది.

దాని మీద కూర్చుని బ్రహ్మ ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. అంతా జలమయమై ఉన్న విశ్వంలో బ్రహ్మ సృష్టి ప్రారంభమైంది. సృష్టికి ముందు విశ్వమంతా జలమయంగానే వున్నదని పురాణాలు చెప్తున్నాయి.

విశ్వం జలమయం కావడం సమస్త జీవులను నీరే ఆధారమనే విషయాన్ని మానవాళి అర్థం చేసుకోవచ్చు. నీరు పూజ్యనీయమైంది. అందుకే ఏ పూజ చేసినా కలశం ఏర్పాటు చేసి.. అందులో పవిత్ర జలంతో నింపుతారు.

కలశానికి పూచే పసుపు కుంకుమలు, మామిడి ఆకులు సౌభాగ్యానికి సంకేతం. కలశములోని నీరు సమస్త విశ్వానికి ప్రతీక. ఇందులో దేవతలుంటారని వారిని ఆహ్వానించే దిశగానే కలశపూజ చేస్తారని విశ్వాసం. ఈ కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతామూర్తులను పూజించడంతో సమానం.
Like Reply
దిక్కులు
(1) తూర్పు,
(2) దక్షిణం,
(3) పడమర,
(4) ఉత్తరం

మూలలు
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం

వేదాలు
(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

పురుషార్ధాలు
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా

పంచభూతాలు
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.

పంచేంద్రియాలు

(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.

లలిత కళలు
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.

పంచగంగలు
(1) గంగ,
(2) కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.

దేవతావృక్షాలు

(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.

పంచోపచారాలు
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.


పంచామృతాలు
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.

పంచలోహాలు
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.

పంచారామాలు

(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం

షడ్రుచులు
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.

అరిషడ్వర్గాలు షడ్గుణాలు

(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.

ఋతువులు
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర

సప్త ఋషులు
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యభిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

సప్త నదులు
""""""""""""""""""""""
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.

నవధాన్యాలు
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.

నవరత్నాలు
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.

నవరసాలు
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర

నవదుర్గలు

(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.

దశ సంస్కారాలు

( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం

దశావతారాలు
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.
[+] 1 user Likes dev369's post
Like Reply
జ్యోతిర్లింగాలు

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)

తమిళనాడు ~ రామలింగేశ్వరం

తెలుగు వారాలు
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.

తెలుగు నెలలు
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
(9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.

రాశులు

( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.

తిథులు
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు

( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు

( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108

( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. -
1934, 1994, 2054, 2114

9యువ. -
1935, 1995, 2055, 2115

10.ధాత. -
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119

14.విక్రమ. -
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122

17.స్వభాను. -
1943, 2003, 2063, 2123

18.తారణ. -
1944, 2004, 2064, 2124

19.పార్థివ. -
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128

23.విరోధి. -
1949, 2009, 2069, 2129

24.వికృతి. -
1950, 2010, 2070, 2130

25.ఖర.
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ.
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31.హేవళంబి.
1957, 2017, 2077, 2137

32.విళంబి.
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి.
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్.
1962, 2022, 2082, 2142

37.శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42.కీలక.
1968, 2028, 2088, 2148

43.సౌమ్య.
1969, 2029, 2089, 2149

44.సాధారణ .
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46.పరీదావి.
1972, 2032, 2092, 2152

47.ప్రమాది.
1973, 2033, 2093, 2153

48.ఆనంద.
1974, 2034, 2094, 2154

49.రాక్షస.
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156,

51.పింగళ
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159

54.రౌద్రి
1980, 2040, 2100, 2160

55.దుర్మతి
1981, 2041, 2101, 2161

56.దుందుభి
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164

59.క్రోదన
1985, 2045, 2105, 216

60.అక్షయ
1986, 2046, 2106, 2166.
[+] 1 user Likes dev369's post
Like Reply
నివేదనల పేర్లు..


1)చూతఫలం=మామిడిపండు
2)ఖర్జూర= ఖర్జూరం.
3)నింబ=వేప
4)నారింగ=నారింజ
5)భల్లాతకీ=జీడిపప్పు
6)బదరీ=రేగు
7)అమలక=ఉసిరికాయ
8)శుష్కద్రాక్ష=కిస్మిస్
9)అమృత లేక బీజాపూరం= జామపండు
10)ఇక్షుఖండం=చెఱకుముక్క
11)కదళీఫలం,రంభా ఫలం=అరటిపండు
12)నారికేళం=కొబ్బరికాయ
13)జంభీర= నిమ్మ పండు
14)దాడిమీ=దానిమ్మపండు
15)సీతాఫలం= సీతాఫలం
16)రామఫలం= రామఫలము
17)కపిత్త=వెలగ పండు
18)శ్రీ ఫలం, బిల్వఫలం= మారేడు
19)మాదీ ఫలం=దబ్బ పండు
20)జంభూఫలం=నేరేడు
ప్రసాదములు.
21)వాతాదం= బాదము పప్పు
1)కుశలాన్నం =పులగం
2)చిత్రాన్నం=పులిహోర
3)క్షీరాన్నం=పరమాన్నం
4)పాయసం=పాయసం
5)శర్కరాన్నం= చక్కెరపొంగలి
6)మరీచ్యన్నమ్= కట్టు లేదా మిరియాలపొంగలి
7)దధ్యోదనం= పెరుగు అన్నము
8)తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం
9)శాకమిశ్రితాన్నం=కిచిడీ
10)గుడాన్నం = బెల్లపు పరమాన్నం
11)సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం
(గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసింది గాన ఆపేరు)
12)గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు
13)గుడమిశ్రిత తండులపిష్టం= చలిమిడి
14)మధురపానీయ=పానకం
15)పృథక్=అటుకులు
16)పృథకాపాయస=అటుకుల పాయసం
17)లాజ=పేలాలు
18)భక్ష్యం= పిండివంటలు
19)భోజ్యం= అన్నము మొదలగునవి
20)వ్యంజనం=పచ్చడి
[+] 1 user Likes dev369's post
Like Reply
కొన్ని ముఖ్యమైన యెాగములు గురించి తెలుసుకుద్దాము:-

సరస్వతి యెాగము:- శుభ గ్రహము లైన గురు,శుక్ర,బుధలు 1,2,4,5,7,9,10 స్థానములలో ఏ స్థానమున అయినను వుండి గురుడు ఉచ్చ రాశి యందు గాని మిత్ర క్షేత్రము నందు గాని వున్నచో సరస్వతి యెాగము కలుగును.
ఈ యెాగము వలన కవులు,పండితులు,అనేక శాస్త్రములు చదివినవారు,నేర్పు, మంచి కళత్రము లవారును అగుదురు.

త్రిలోచన యెాగము:- రవి,చంద్ర,కుజులు పరస్పర త్రికోణ రాశులలో వుండినచో త్రిలోచన యెాగము వర్తించును.
ఈ యెాగము వలన శతృవులకు సింహస్వప్నం వలె నుండుట,ధన సంపాదన, మానసిక బలము,తెలివి తెలివితేటలు,శతృవులపై విజయము సాధించువారును,మంచి ఆరోగ్యము,ఐశ్వర్యము కలవారును అగుదురు

కేమద్రుమ యెాగము:- చంద్రడున్న స్థానమునకు 2,12 స్థానముల యందు గ్రహములు లేకుండుట వలన కేమద్రుమ యెాగము కలుగ గలదు.
ఈ యెాగము వలన విరుద్దమైన వృత్తులు యందు వుండుట,దుష్ట వేషముల నవలంబించుట,దారాపుత్ర సంపద లేకుండుట,మలినులు,విదేశములందు నివసించు వారునుఅగుదురు.

చంద్రుడున్న స్థానమునకు 2,12 స్థానములందు గ్రహములు లేనప్పటికిని,పాప శుభ గ్రహములలో యేగ్రహములచే నైనను చంద్రడు చూడబడిన కేమద్రుమ యెాగగము భంగమై జాతకులను చక్రవర్తిని,ధీర్ఘాయుష్మంతుని చేయును.
చంద్రుడున్న స్థానమునకు 2,12 స్థానములయందు ఏ గ్రహములు లేనప్పటికీ 4 కేంద్రముల యందు పాప,శుభ గ్రహములు ఏవియున్నను కేమద్రుమ యెగము భంగమై "కల్పద్రుమ"యెాగము కలుగును.ఈ యెాగము వలన జాతకులకు ఎల్లప్పుడూ శుభ ఫలితములు కలుగును.

జన్మకాలమందు తులారాశి లో గురు కుజు లను, కన్యారాశిలో రవి యుండి, మేషరాశి యందుడు చంద్రనకు(బుధ,శని,శుక్రులు)ఇతర గ్రహ ధృష్ఠి వున్నప్పుడు కేమద్రుమ యెాగము భంగమగును. శుక్రుడు,బుధుడు,గురుడు కలసి లగ్నమునకు కేంద్ర స్థానముల యందున్నను,చంద్రుడు పూర్ణుడైనను ఆ చంద్రునకు కేంద్రములందు గ్రహములున్నను కేమద్రుమ యెాగ ఫలితములుండవు.

అనభ యెాగము:-చంద్రుడున్న స్థానమునకు 12 వ యింట రవి,రాహు,కేతువులు తప్ప మిగతా గ్రహములు ఏవైనా వున్నచో అనభ యెగము ఏర్పడును.
ఈ యెాగము వలన స్వయంగా ధనార్జన చేయువాడు,మర్యాద కీర్తి గలవారును,బుద్ధిమంతులు సుఖముగా జీవించువారును,మంచి కార్యములు చేయువారును,మంత్రియు అగుదురు.

సునభ యెాగము :- చంద్రుడున్న స్థానమునకు 2వ యింట రవి,రాహు,కేతువులు తప్ప మిగతా ఏవైనా గ్రహములున్నచో సునభ యెాగము ఏర్పడును.
ఈ యెాగము వలన స్వయంగా ధనార్జన చేయువారును,మర్యాద కీర్తి గలవారును,బుద్ధిమంతులు,సుఖముగా జీవించువారును,మంచి కార్యములు చేయవారును,మంత్రి యగును.

ధురుధురా యెాగము :- చంద్రడున్న స్థానమునకు 2,12 స్థానములందు రవి రాహు కేతువులు తప్ప మిగతా గ్రహములున్నచో ధురుధురా యెాగమగును.
ఈ యెాగము వలన ధనము,వాహనములు,భూములు కల్గి సుఖములనుభవించెదరు.శతృవులను జయంచువారును,అందమైన స్త్రీ,పురుషులను పొందువారును,మంచి నేత్రములు కలవారును అగుదురు.

అఖండ సామ్రాజ్య యెాగము:-లగ్నము స్థిర లగ్నమై 2 వ భావాధిపతి చంద్ర లగ్నాత్తు కేంద్రమునందుడుట వలన ఈ యెాగము వర్తించును.
ఈ యెాగము వలన ప్రపంచము ఏలగల శక్తి,అధిక ధన సంపదలు,పేరు ప్రఖ్యాతులు,అందరిలో తగిన గౌరవ మర్యాదలు కలుగ గలవు.

నీచ భంగ రాజ యెగము:-ఒక ఉచ్చ గ్రహము నీచ గ్రహము కలిసి వుండిన గ్రహము యెక్క నీచ దోషము పోయి శుభత్వము కలుగ గలదు.
ఈ యెాగము వలన చాలా అదృష్టము, మంచి కీర్తి,సుఖ సంతోషములు, చేయు పనులు కచ్చితమైనవిగా నుండును.చాలా ఆరోగ్య సంపదులు కలిగినవారగుదురు. మంచి కీర్తి ప్రతిష్ఠలు కలుగ గలవు.

పంచ మహాపురుష యోగములు

ఈ అయిదు యోగములు కుజ, బుధ, గురు, శుక్ర, శని, గ్రహములవలన కలుగును.
ఆ యోగములు. 1) రుచిక మహాపురుష యోగము, 2) భద్ర మహాపుష యోగము,
3)హంసమహా పురుష యోగము, 4) మాళవ మహాపురుష యొగము
5) శశ మహాపురుష యొగము. పైన చెప్పిన అయుదు గ్రహములు,
కేంద్రములందుండవలెను. అట్లు కాక ఆ రాశులు, ఆయా గ్రహములకు,
స్వ, ఉచ్చ, క్షేత్రములై ఉండవలెను. జాతాక పారిజాతమున,
మూల త్రికొణములయందున్నను, సకల బలములు గలిగి ఉండవలెననిరి.
అందరూ అంగీకరించనది ఈ సూత్రములే.

రుచిక మహాపురుష యోగ జాతకులు, ధైర్య సాహసములుచెసి, ధనము సంపాదించెదరు
బలవంతులు, శత్రువులను జయించు వారు అగుదుగురు, సేనానాయకులు కాగలరు.
భద్ర మహాపురుష యోగ జాతకులు,సంపూర్ణ ఆయుష్షు విద్యాధికుడు పరులచే
ప్రశంసించబడిన వాడు బుద్ధిమంతుడు అగును.

హంస మహాపురుష జాతకులు, మంచి గుణములు కలిగి, రాజ సమానులు, సుందరాకారము
కలిగి, చెతులలొ, శంఖ చక్ర, పద్మ ముద్రలు, గలిగి ఉందురు. భొజన ప్రియులు, ధార్మికులు అగును.
మాళవ్య మహాపురుష యోగజాతకులు దృధమైన శరీరము వాహనములు, ధనము,
భార్యా సంతానము, అదృష్ఠము మొదలగు శుభ లక్షణములు కలవాడగును.
శశ మహాపురుష యొగమున జన్మించిన వారు, సర్వజనములకు ప్రియుడు, గ్రామ పెద్ద,
సెనాని, అగును కాని ఇట్టివారు, వ్యసనములు కలిగి, పరధన భోగి, అగును.

ఈ అయుదు యోగములు రాజప్రదములు, ఉన్నతొద్యోగములు కలుగును.
ఇందులో ఏ ఒకటి రెందు కలిసినను మహారాజ యోగము పట్టును.
Like Reply
[Image: Whats-App-Image-2019-12-20-at-3-15-13-PM.jpg]
Like Reply
13th and 14th Jan 2020, All Transports vehicles like buses, trains and flights (arrivals and departures) will be late in all over INDIA.

THIS IS AS PER MUNDANE ASTROLOGY.
Like Reply
గ్రహణం రోజు పళ్ళెం లో రోకలి నిలబెడతారు ... ఇది కొంతమంది చూసి ఉంటారు .. ఇంకొంత మందికి తెలిసి ఉండదు.

సాదారణముగా రోకలి పళ్ళెములో ఎటువంటి ఆధారం లేకుండా నిలపడదు. అయితే గ్రహణ సమయములోనే నిలపడుతుంది. అది ఎందుకో , ఎలాగో ఇప్పుడు చూద్దాం ?

మనకి టీవీలు, సమాచార వ్యవస్థ అంతగా లేనప్పుడు, ప్రజలు గ్రహణం పట్టు ( start ) .. విడుపు ( end ) తెలుసుకొనుటకు , రోకలి ని నీటి పళ్ళెంలో తూర్పు దిశగా నిలబడితే ... అది గ్రహణం పట్టే సమయంలో నిలబడుతుంది అప్పుడు గ్రహణం పట్టడం అని ,,, మళ్ళీ తిరిగి రోకలి క్రింద పడిపోతే గ్రహణం విడుపు క్రింద పసిగట్టే వారు...ఇప్పటికి పల్లెటూరల్లో ఇదే సాంప్రదాయం కొనసాగుతుoది... దానికి ఈరోజు గ్రహణం సమయంలో మన
శాస్త్రం ప్రకారం తెలుసుకున్నారు. మరి సైన్స్ ప్రకారం కూడా తెలుసుకోవాలి గా ఎందుకంటే శాస్త్రం ఒకలగా చెబితే సైన్స్ మరోలా చెబుతోంది ... నిజానికి ఇక్కడ ఏది అబద్ధం కాదు

సైన్స్ ప్రకారం చూస్తే ఏదైనా వస్తువును పడిపోకుండా నిలబెట్టాలంటే #భూగురుత్వాకర్షణ శక్తి వల్ల దానికి కలిగే భారం (Weight) దాని ఆధార పీఠం (Base) గుండా పయనించగలగాలి ... పొడవు ఎక్కువగా ఉండి, పీఠం వైశాల్యం తక్కువగా ఉండే రోకలిలాంటి వస్తువును పడకుండా నిలబెట్టడం కొంత కష్టమైన పనే. కానీ అసాధ్యం కాదు. ప్రయత్నిస్తే నేల మీద లేదా ఏదైనా పళ్లెంలో నిలబెట్టవచ్చు... దానికి ఉదాహరణ సన్నని, నిడుబాటి కర్రను కూడా నిలువుగా మనం అరచేతిలోను లేదా చూపుడు వేలు చివరనో బ్యాలన్స్‌ చేయడం చేయగలం...

విశ్వంలోని ప్రతి రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని #గురుత్వాకర్షణ బలం అంటారు ... గ్రహణం వేళ #సూర్యుడు, #చంద్రుడు, #భూమి ఒకే రేఖపై వచ్చినప్పుడు సూర్య, చంద్రుల మధ్య ఉండే గురుత్వాకర్షణ ఒక్కటవుతుంది... అది భూమిని ఆకర్షిస్తుంది ... ఆ బలం వస్తువులపై పని చేసే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పనిచేస్తుండటం వల్ల రోకలిని నిలబెట్టడం కొంచెం సులభం అవుతుంది ... అలాగే పళ్లెంలో నీళ్లు పోసి ఆ మధ్యలో కూడా రోకలిని నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడే అసంజన బలాలు (adhesive forces) కూడా ఇందుకు దోహదపడతాయి. అందుకే గ్రహణ సమయంలో రోకలిని నిలబెడుతుంది.
Like Reply
saravali-vol-2.pdf




http://www.mediafire.com/file/rc8h1t337h...2.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply
జ్యోతిష్య నవరత్నాలు

నవరత్నాలు అనేవి భూసంపద, జలసంపదల నుండి ఉద్భవిస్తాయి. భూమిలో పై పొర సుమారు 60 మైళ్లు ఉంటుంది. ఈ నాటికి భూమిలోనికి తవ్వగలిగిన గరిష్ఠదూరం 5 కి||మీ మాత్రమే. భూమిలోనికి వెళ్లిన కొలది ఉష్ణోగ్రత పెరుగుతూ, ప్రతి 120 అడుగులకు 1 డిగ్రీ చొప్పున పెరుగుతుంది. ఇలా 30 మైళ్ల లోతులో 1200 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ అంతా ద్రవరూపంలో ఉంటుంది. అలా భూమిలోనికి వెళ్లినకొలది అనేక ఖనిజాలూ, రత్నాలూ ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

'స్వాతి ముత్యం' అంటే, స్వాతి కార్తెలో, అంటే సూర్యుడు స్వాతి నక్షత్రంలో సంచరించే కాలంలో, ముడుచుకొని ఉన్న ముత్యపు చిప్పలు తెరచుకుంటాయి. ఆ సమయంలో వర్షం ఆ చిప్పలలో చుక్కలుగా పడిన తర్వాత అవి ముడుచుకొంటాయి. ఇవి లోపల ఘనీభవించి ముత్యాలుగా ఏర్పడతాయి. వీటినే స్వాతి ముత్యాలంటారు.

రత్నధారణజ్యోతిషశాస్త్రాల అవినాభావసంబంధం: రత్నధారణ అనేది పూర్వకాలం నుండి జ్యోతిషశాస్త్రంతో ముడిపడి ఉంది. మానవశరీరంలో సప్తధాతువులు ఉంటాయి. అవి చర్మం, నాడులు, కొవ్వు, మాంసం, అస్థులు (ఎముకలు), ఉపస్థు, స్నాయువులు (సన్నని నరాలు). ఈ సప్తధాతువులకూ, సప్తవర్ణాలకూ, ప్రతి నిధులైన గ్రహాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. చర్మానికి శుక్రుడు, నాడీ మండలానికి బుధుడు, కొవ్వుకు గురుడు, మాంసానికి కుజుడు, ఎముకలకు శని, ఉపస్థుకు శుక్ర-కుజులు, స్నాయువుకు రవి-చం ద్రులు కారకులుగా నిర్ణయింపబడ్డారు. వ్యక్తికి ఏయే ధాతువులు క్షీణదశ వైపు పయనిస్తుంటాయో, వాటికి సమతుల్యత ఏర్పరచి, శారీరక-మానసికశక్తులను అభివృద్ధి పరుస్తాయి. జాతిరత్నాలలో 'దైవికశక్తులు' దాగుంటాయని మన పూర్వికులు నిర్దేశించారు.

రవి (కెంపు) (మాణిక్యం):- సమర్థప్రభువు. ఇది ధరించినవారికి ఆయుర్వృద్ధి, ధనలాభం, అధికారం, ఉన్నతస్థితి, రోగనివారణ, మనోవికాసం కలుగుతాయి. ఇది ఎరుపు రంగుతో బాలసూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. ధాన్యం, గోధుమలు, శుద్ధికి ఆవు పాలు, గంగాజలం, మంత్రం ఓం దృణిః సూర్యాయ నమః||

చంద్రుడు ('ముత్యం') (మౌక్తికం):- గుణం రాణి. ఇది ధరించిన వారికీ, వివాహం కానివారికీ త్వరలో వివాహం జరగటం, కుటుంబ, దాంపత్యానుకూలత, స్త్రీసౌఖ్యం, కార్యసిద్ధి, సంపదలు, ధనధాన్యవృద్ధి, మేహశాంతి కలుగుతాయి. గుండె జబ్బు రాదు. స్త్రీల పాలిట కామధేనువు వంటిది. ముత్యాలు తెల్లగా, స్వయంగా మెరుస్తుంటాయి. ధాన్యంబియ్యం, శుద్ధికి సైంధవ లవణం, వరిపొట్టు (ధాన్యం పొట్టు). మంత్రం ఓం సోం సోమాయ నమః||

కుజుడు(పగడం)-ప్రవాళం:- గుణం సేనానాయకుడు, ఉద్యమనాయకుడు. ఇది ధరించినవారికి శత్రుసంహారం, సాహసం, ధైర్యం చేకూరుతాయి. బుుణవిమోచనం, అధికారం, మాట చలాయింపు కలుగుతాయి. ఇది చిలుక ముక్కు రంగునూ, దొండ పండు రంగునూ పోలి ఉంటుంది. ధాన్యంకందులు. శుద్ధికి ఆవు పాలు, కంకుమ నీరు, రక్తచందనం నీరు. మంత్రం ఓం అం అంగారకాయ నమః||

బుధుడు(పచ్చ) (మరకతం-ఎమరాల్డ్‌):- గుణం తన వ్యాపారాలు తాను చూసుకునే తెలివైనవాడు. ఇది ధరించినవారికి జ్ఞాపకశక్తి, బుద్ధి చాతుర్యం కలిగి, నరాల ఒత్తిడి తగ్గుతుంది. విషదోషాలు హరిస్తుంది. ఉన్మాదం, పిచ్చి, దృష్టిదోషాలను పోగొడుతుంది. ఇది నెమలి పింఛం, గరిక చిగుళ్ల రంగులలో ఉండును. శుద్ధికి ఆవు మజ్జిగ, గోమూత్రం, పసుపు నీరు. ధాన్యంపెసలు. మంత్రం ఓం భుం బుధాయ నమః||

గురువు( 'పుష్యరాగం' )(టోపాజ్‌). గుణం తన మేధాశక్తితో ఇతరులకు మేలు చేసే ఆదర్శవాది. ఇది ధరించినవారికి బుుణవిమోచనం, శత్రుజయం, ఉద్రేకం, ఆందోళన, తగ్గడం, పుత్రసంతానం, వంశవృద్ధి కలుగుతాయి. దీని రంగు బంగారు. లేత గులాబీ రంగులో ఉంటాయి. ధాన్యంసెనగలు శుద్ధికి ఉలువల గంజి, సెనగలు, ఉడికించిన నీరు. మంత్రం ఓం బృహస్పతయ నమః||

శుక్రుడు(వజ్రం) (డైమండ్‌):- గుణం తన మేధాశక్తితో తాను వృద్ధి చెందేవాడు. ఇది ధరించినవారికి నూతనతేజస్సు, కళ, ధన ధాన్యసంపదలు సంసారజీవితంలో అనుకూలత, సుఖం, స్త్రీలకు సుఖప్రసవం కలుగుతాయి. కలరా, ప్లేగు వ్యాధులు రావు. ఇది సహజమైన కాంతితో తేలికగానూ. తీర్చిన కోణాలతోనూ అందంగా కనిపిస్తుంది. ధాన్యంబొబ్బర్లు. శుద్ధికి ఆవు పాలు, బియ్యం కడిగిన నీరు, బొబ్బర్లు ఉడికించిన నీరు, మంత్రం ఓం శుం శుక్రాయనమః||

శని (నీలం) (సఫైర్‌) గుణం ఇతరుల ఆలోచనను ఆచరణలో పెట్టేవాడు. ఇది ధరించినవారికి అపమృత్యు దోషాలు పోవటం, సంఘంలో గౌరవం, పలుకుబడి, ధనలాభం కలుగుతాయి. శని దోషాలు యావత్తూ తొలగును. ఇవి 3 రకాలు 1. ఇంద్రనీలం, 2. మహానీలం, 3. నీలమణి. ఇది నల్లని రంగు, నీలి ఆకాశం రంగు, నెమలి కంఠం రంగులతో ఉంటుంది. ధాన్యంనల్ల నువ్వులు, శుద్ధికి నల్ల నువ్వుల నూనె, నీలిచెట్టు ఆకుల రసం, నల్ల ద్రాక్ష రసం. మంత్రం ఓం శం శనైశ్చరాయనమః||

రాహువు(గోమేదికం) గుణం ఆశాపరుడు, ఇది ధరించినవారికి నష్టద్రవ్యలాభం, స్త్రీమూలంగా సహాయం, లాభం, వశీకరణ కలుగుతాయి, ఆవేదన తగ్గుతుంది. ఈ రాయి సహజమైన గోమూత్రవర్ణం కలిగి ప్రకాశిస్తూ వుంటుంది. ధాన్యంమినుములు, శుద్ధికి మాదీఫలరసం, తేనే, గోమూత్రం. మంత్రం ఓం ఐం హ్రీం రాహవే నమః||

కేతువు(వైడూర్యం) (కాట్స్‌ ఐ) గుణం నిరాశాపరుడు. ఇది ధరించినవారికిజ్ణానసిద్ది.తెలివితేటలు మనోనిబ్బరంకల్గును
[+] 1 user Likes dev369's post
Like Reply
scientific-*****-astrology-1.pdf







http://www.mediafire.com/file/gr2jksjns2...1.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply
scientific-*****-astrology-2.pdf






http://www.mediafire.com/file/dv1oogn276...2.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply
Navamsa in Astrology.pdf







http://www.mediafire.com/file/s11lgba7ky...y.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply
secrets-of-ashtakavarga.pdf







http://www.mediafire.com/file/fwy2rri971...a.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply
గృహప్రవేశము ఎలాచేయాలి....?

శ్లో "అకవాట మానాచ్చన్న మభుక్త బలి భోజనం
గృహం న ప్రవిశేద్ధిమానా పదమా కరంహి తత్"
వాస్తురాజవల్లభం

ద్వారాలులేకుండా, ,పైకప్పులేకుండా,వాస్తుశాంతి,వాస్తుహోమములేకుండా,8 దిక్కులలో బలిలేకుండా,భదువులకు భోజనాలు పెట్టకుండా గృహప్రవేశము చేయరాదు సత్యనారాయణ వ్రతం రోజుయినా భోజనాలు పెట్టాలి

శాంతికమళాకారము,బృహద్వా స్తుమాలా,ధర్మ సింధు,నిర్ణయసింధూ,కాలామృతము, మొదలైన గ్రంధాలలో గృహప్రవేశము ముందు వాస్తుశాంతులు చేయకుండా యజమాని గృహప్రవేశము చేయరాదని గ్రంధాలు చెబుతున్నాయి

ఎందుకంటే ఇల్లునిర్మాణము చేసేటప్పుడు క్రిమికీటకాలహింస,చెట్లు నరికినదోషము,అంతర్గత శల్యదోషాలు,ఆయాది దోషము, ముహూర్తదోషము,కాకిప్రవేశ దోషము, భూతప్రేతపిశాచ ప్రవేశము పోవాలంటే వాస్తుదోషాలకు ,తగిన శాంతి హోమాలుచేసి తరువాత శుభమూహర్తంలో గృహప్రవేశము చేయాలి ఇదిశాస్త్రము ఈవిధంగా తెలంగాణ,రాయలసీమ ప్రాంతాలలో కొన్నిప్రాంతాలలో చేస్తారు ఈనాడు గృహప్రవేశాలు మరిదారుణంగా చేస్తున్నారు
శుభముహూర్త సమయంలో ముందుగా గోవు, దంపతులు గృహంలో కుడికాలుపెట్టి లోపలికి వెళ్ళాలి కానీ ముందు ఫోటోగ్రాఫర్ వెళ్తున్నాడు ఆదిిచెప్పులతో ఇలా అందరుకాదు కొంతమంది
గుమ్మందగ్గరే చెప్పులు,బియ్యము గ్లాసు కాలితోతన్ని లోపలికి పోవటం ఇవిిదోషము, సాంప్రదాయవస్త్రాలు ధరించకుండా,ఆడవారు కాలికి పసుపురాయకుండా గృహప్రవేశం చేసేస్తున్నారు,ఆగ్నేయంలో వంటగదిలో పొంగించవలసిన పాలు నట్టింట్లోపొంగించడం చేస్తున్నారు ,సింహద్వారానికి పసుపురాసి బొట్లుపెట్టకుండా,మామిడిఆకులు కట్టకుండా ప్రవేశం చేస్తున్నారు

కొంతమందిపుణ్యాహవాచనము,ఏకాశీతి పదవాస్తుమండపారాధన చేయకుండా పూజముగిస్తున్నారు

గృహప్రధానద్వారాము తలుపులు ముహూర్త సమయానికి తెరిచి ప్రవేశము చేయాలి అంతవరకు మూసిఉంచాలి ప్రవేశం ముందు దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండటానికి
రాత్రి గృహప్రవేశము ఐతే ఉదయమునూతన గృహంలో వాస్తుశాంతి చేయవలెను వాస్తుశాంతి రాత్రి,సాయంత్రము చేయరాదు

గృహప్రవేశము,రాత్రి పూట,పగటిపూట చేయవచ్చు ఎక్కువగా పగలు చేయకపోవడానికి కారణము మంచి శకునంకాజాలదని,రాత్రి ఎవ్వరు తిరగరని ఎక్కువగా రాత్రి గృహప్రవేశం చేస్తున్నారు గృహప్రవేశము చేసినవారు రాత్రిఅంతా జాగరణ చేయాలి సూర్యోదయం వరకు నిద్రపోరాదు ఎందుకంటే ఆగృహము కూడా నిద్రావస్థను పొదుతుందని పెద్దలు చేెప్పినారు
మూడురోజులు తప్పకుండా ఉదయము సాయంత్రము నూతన గృహంలో దీపారాధన చేయవలెను ఒకవేళ మైలసోకిన 5 రోజులు ఆపివేసి మరల చేయవలెను

పాలు పొంగించడానికి తొడబుట్టిన చెల్లెలులేదా అక్కచేత పాలుపొంగించవలెను వారులేకపోతే పెళ్లయిన కూతురు చేత పాలుపొంగించవలెను వారులేకపోతే సోదరివరస ఐనవారు ఎవరైనా పాలుపొంగించాలి పాలుపొంగించినవారికి పసుపు కుంకుమతో వస్త్రాలు పెట్టవలెను
వాస్తుశాంతి పూజ విధానము
గణపతిపూజ,పుణ్యాహవాచనము, పంచగవ్యసంస్కారము,ఏకాశీతి పదమండల వాస్తుపూజ,నవగ్రహ మండపారాధన,లక్ష్మీ గణపతి,రుద్ర,నవగ్రహ,వాస్తు,హోమాలు,వాస్తుపర్యగ్నికరణ, బ్రాహ్మణులకు నవగ్రహ దానాలు మొదలైన పూజలు చేయవలెను
[+] 1 user Likes dev369's post
Like Reply
జననకాల నక్షత్రదోషాలు పరిహారాలు ................!!

పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది . ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవ గ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషెకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.

1. అశ్విని 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము ౩ నెలలు ఉండును. ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.

2. భరణీ 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది.

3. కృత్తిక నక్షత్రములో 3 వ పాదము లో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగ చేయును. 1 2 4 పాదములలో జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.

4. రోహిణి నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామకు, 2 వ పాదము తండ్రికి, ౩వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు . అందు వలెనే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.

5. మృగశిర 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.

6. ఆరుద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జన్మంచిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.

7. పునర్వసు నక్షత్రము 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.

8. పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. పుష్యమి నక్షత్రము లో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు 2 పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు . మూడు, నాలగవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును . వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి . గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును.

9. ఆశ్లేష నక్షత్రములో 1 వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2 వ పాదము శిశువునకు 3 వ పాదము తల్లికి 4 వ పాదము తండ్రికి దోషము . నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.

10. మఖ నక్షత్ర 1 వ పాదములో జనన మైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్ర్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము . ౩ వ పాదము న పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము . అశ్వము దానమిచ్చుట వలన దోషము తొలగును . 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.

11. పుబ్బ నక్షత్రములో 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

12. ఉత్తర నక్షత్ర 1, 4 వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. నూనె పాత్రను దానము చెయ్యాలి. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.

13. హస్తా నక్షత్ర 3 వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

14. చిత్త నక్షత్రములో 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.

15 స్వాతి నక్షత్రమున 1 2 3 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.

16 విశాఖనక్షత్రము జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును . 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.

17. అనూరాధ నక్షత్రములో 1 2 3 4 పాదముల లో జన్మించుట వలన దోషము లేదు.

18 . జ్యేష్ట నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1 2 3 4 ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి . అందు ఏ భాగములో పుడితే ఆ భాగ సంభందము కలవారికి తప్పక నాశనము కలుగును. 1 వ భాగములో తాతయ్యకు 2 అమ్మమ్మ కు ౩ తల్లి తోడ బుట్టిన వారికి , మేనమామలకు 4 అన్నలకు, అక్కలకు 5 శిశువునకు 6 ఎవ్వరికి దోషము ఉండదు 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు 8 జాతకునకు 9 తల్లికి 10 తండ్రికి దోషము కలుగ చేయును. మరియు నాల్గవ పాదమున జనన మైతే తండ్రికి దోషము . ఇది సమారు 9 నెలలు ఉండును . గోవు ను దానము ఇచ్చుట వలన శాంతి కలుగును. విశేష శాంతి చేయించాలి .

19. మూల నక్షత్రము ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండును. ఈ నక్షత్రములో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, ౩ వ పాదము ధనమునకు నాశనము కల్గించును 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు . మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి. పన్నెండు భాగాలలో 1 వ భాగము తండ్రికి దోషము 2 తల్లికి ౩ అన్నలకు 4 భాగస్వాములకు 5 పిల్లనిచ్చిన మామగారికి 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు 8 ధనమునకు 9 జీవన నాశనము 10 దరిద్రమును కల్గిస్తుంది 11 భ్రుత్యులు 12 జాతకునికి నాశనము కలుగ చేయును.

జ్యేష్ట ,మూలా నక్షత్రములలో జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును . దోష నివారణ కొరకు ఎద్దును దానమివ్వడము. నవ గ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.

20 పూర్వాషాడ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2 3 వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము . 4 వ పాదమున జననము దోషము లేదు .

21 ఉత్తరాషాడ నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .
22 శ్రవణం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .
23 ధనిష్ట నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .
24 శతభిషం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .
25 పూర్వాబాద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు . నాల్గవ పాదము సామాన్య దోషము .

26 ఉత్తరాభాద్ర నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

27 రేవతి నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు . 4 వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి . .

ఈ నక్షత్రములనే కాక దుష్ట తిధి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలముల యందునూ, గ్రహణ సమయములలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట ముఖ్యము.
[+] 1 user Likes dev369's post
Like Reply
#కోనసీమ_అంటేనే_అందం.అది వేదసీమా అని పెద్దల ఉవాచ.
శ్రీశైల పర్వతసానువుల తరువాత తొందరగా మనోలయమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవ క్షేత్రాలు.

#ఇక_కోనసీమ_రుద్రులగురించి

కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న “#జగ్గన్నతోట” ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని చెప్పరానిది.మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్య కాలం లో సంక్రాంతి కనుమ నాడు కోనసీమలోని “మొసలిపల్లి శివారు జగ్గన్నతోట” లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన,చారిత్రాత్మకమైన,అతిపురాతనమైన,పవిత్రమైన సమాగమము.ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి.ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ వుండవు.ఇది పూర్తిగా కొబ్బరి తోట.ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడం తో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది ఏకాదశ రుద్రుల కొలువు.హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా,ఈ భూమండలం మొత్తానికీ ఒక్క చోటే అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే.

లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి.సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి.అప్పటి నుండీ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరమూ కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా , భూమి తల్లక్రిందులైనా ఈ రుద్రులను ఒక్కచొట చేర్చుతారు ఈ గ్రామస్తులు.సంస్థానదీశులైన #శ్రీ_రాజా_వత్సవాయి_జగన్నాధ_మహారాజు కు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.

ఈ ఏకాదశ కొలువైన గ్రామాలు ఆ రుద్రుల పేర్లు వరుస గా

1-వ్యాఘ్రేశ్వరం-శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలాత్రిపురసుందరీ)

2-పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి(బాలా త్రిపుర సుందరి)

3-మొసలపల్లి-మధుమానంత భోగేశ్వర స్వామి

4-#గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు

5-గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు

6-పెదపూడి-మేనకేశ్వరుడు

7-ఇరుసుమండ-ఆనంద రామేశ్వరుడు

8-వక్కలంక-విశ్వేశ్వరుడు

9-నేదునూరు–చెన్న మల్లేశ్వరుడు

10-ముక్కామల-రాఘవేశ్వరుడు

11-పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడు.

ఇవీ గ్రామాలు ఆ గ్రామాల రుద్రుల నామాలు.ఈ స్వామి వారలను “ప్రభలపై” అలంకరించి మేళ తాళాలతో,మంగళ వాయిద్యాలతో,భాజా బజంత్రీలతో “శరభా శరభా” హర హర మహాదేవ” అంటూ ఆయా గ్రామాల నుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు.

ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లి కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు

“శ్రీ వ్యాఘ్రేశ్వరుడు”.ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.

ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా “హరా హరా” అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల(11)దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.

#నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవా త్రయంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః’
అంటూ రుద్రంలో ఏకాదశ రుద్రుల గురించి ప్రస్తావన ఉంటుంది.

ఆ ఏకాదశ రుద్రులు ఏకకాలం లో సమాగం అయ్యే సన్నివేశం చూస్తే మనసు పులకిస్తుంది.ఈ తీర్థము ను దర్శించడానికి ప్రపంచవ్యాప్తం గా స్థిరపడిన కోనసీమ ప్రజలే కాక,దేశ విదేశీయిలు వచ్చి దర్శించి తరిస్తారు.
[+] 1 user Likes dev369's post
Like Reply
*108 ఉపనిషత్తులు.....*

ఉపనిషత్తు పేరు - వేదం

1 ఈశావాస్య ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
2 కేన ఉపనిషత్తు సామవేదం
3 కఠ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
4 ప్రశ్న ఉపనిషత్తు అధర్వణవేదం
5 ముండక ఉపనిషత్తు అధర్వణవేదం
6 మాండూక్య ఉపనిషత్తు అధర్వణవేదం
7 తైత్తిరీయ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
8 ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదం
9 ఛాందోగ్య ఉపనిషత్తు సామవేదం
10 బృహదారణ్యక ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
11 బ్రహ్మ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
12 కైవల్య ఉపనిషత్తు అధర్వణవేదం
13 జాబాల ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
14 శ్వేతాశ్వతర ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
15 హంస ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
16 ఆరుణిక ఉపనిషత్తు సామవేదం
17 గర్భ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
18 నారాయణ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
19 పరమహంస ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
20 అమృతబిందు ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
21 అమృతనాద ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
22 అధర్వశిర ఉపనిషత్తు అధర్వణవేదం
23 అధర్వశిఖ ఉపనిషత్తు అధర్వణవేదం
24 మైత్రాయణి ఉపనిషత్తు సామవేదం
25 కౌషీతకీబ్రాహ్మణ ఉపనిషత్తు ఋగ్వేదం
26 బృహత్ జాబాల ఉపనిషత్తు అధర్వణవేదం
27 నృసింహతాపిని ఉపనిషత్తు అధర్వణవేదం
28 కాలాగ్నిరుద్ర ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
29 మైత్రేయ ఉపనిషత్తు సామవేదం
30 సుబాల ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
31 క్షురిక ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
32 మంత్రిక ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
33 సర్వసార ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
34 నిరాలంబ ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
35 శుకరహస్య ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
36 వజ్రసూచిక ఉపనిషత్తు సామవేదం
37 తెజోబిందు ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
38 నాదబిందు ఉపనిషత్తు ఋగ్వేదం
39 ధ్యానబిందు ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
40 బ్రహ్మవిద్య ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
41 యోగతత్త్వ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
42 ఆత్మబోధ ఉపనిషత్తు ఋగ్వేదం
43 నారదపరివ్రాజక ఉపనిషత్తు అధర్వణవేదం
44 త్రిశిఖబ్రాహ్మణ ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
45 సీత ఉపనిషత్తు అధర్వణవేదం
46 యోగచూడామణి ఉపనిషత్తు సామవేదం
47 నిర్వాణ ఉపనిషత్తు ఋగ్వేదం
48 మండలబ్రాహ్మణ ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
49 దక్షిణామూర్తి ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
50 శరభ ఉపనిషత్తు అధర్వణవేదం
51 స్కంద ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
52 త్రిపాద్విభూతిమహానారాయణ ఉపనిషత్తు అధర్వణవేదం
53 అద్వయతారక ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
54 రామరహస్య ఉపనిషత్తు అధర్వణవేదం
55 రామతాపిని ఉపనిషత్తు అధర్వణవేదం
56 వాసుదేవ ఉపనిషత్తు సామవేదం
57 ముద్గల ఉపనిషత్తు ఋగ్వేదం
58 శాండిల్య ఉపనిషత్తు అధర్వణవేదం
59 పైంగల ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
60 భిక్షుక ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
61 మహా ఉపనిషత్తు సామవేదం
62 శారీరక ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
63 యోగశిఖ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
64 తురీయాతీత ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
65 సన్యాస ఉపనిషత్తు సామవేదం
66 పరమహంస పరివ్రాజక ఉపనిషత్తు అధర్వణవేదం
67 అక్షమాలిక ఉపనిషత్తు ఋగ్వేదం
68 అవ్యక్త ఉపనిషత్తు సామవేదం
69 అన్నపూర్ణ ఉపనిషత్తు అధర్వణవేదం
70 ఏకాక్షర ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
71 సూర్య ఉపనిషత్తు అధర్వణవేదం
72 అక్షి ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
73 అధ్యాత్మ ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
74 కుండిక ఉపనిషత్తు సామవేదం
75 సావిత్రి ఉపనిషత్తు సామవేదం
76 ఆత్మ ఉపనిషత్తు అధర్వణవేదం
77 పాశుపతబ్రహ్మ ఉపనిషత్తు అధర్వణవేదం
78 పరబ్రహ్మ ఉపనిషత్తు అధర్వణవేదం
79 అవధూత ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
80 త్రిపురాతాపిని ఉపనిషత్తు అధర్వణవేదం
81 దేవి ఉపనిషత్తు అధర్వణవేదం
82 త్రిపుర ఉపనిషత్తు ఋగ్వేదం
83 కఠరుద్ర ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
84 భావన ఉపనిషత్తు అధర్వణవేదం
85 రుద్రహృదయ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
86 యోగకుండలి ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
87 బస్మజాబాల ఉపనిషత్తు అధర్వణవేదం
88 రుద్రాక్షజాబాల ఉపనిషత్తు సామవేదం
89 గణపతి ఉపనిషత్తు అధర్వణవేదం
90 దర్శన ఉపనిషత్తు సామవేదం
91 తారసార ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
92 మహావాక్య ఉపనిషత్తు అధర్వణవేదం
93 పంచబ్రహ్మ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
94 ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
95 గోపాలతాపిని ఉపనిషత్తు అధర్వణవేదం
96 కృష్ణ ఉపనిషత్తు అధర్వణవేదం
97 యాజ్ఞవల్క ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
98 వరాహ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
99 శాట్యాయనీయ ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
100 హయగ్రీవ ఉపనిషత్తు అధర్వణవేదం
101 దత్తాత్రేయ ఉపనిషత్తు అధర్వణవేదం
102 గారుడ ఉపనిషత్తు అధర్వణవేదం
103 కలిసంతరణ ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
104 జాబాలి ఉపనిషత్తు సామవేదం
105 సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు ఋగ్వేదం
106 సరస్వతీరహస్య ఉపనిషత్తు కృష్ణయజుర్వేదం
107 బహ్వృచ ఉపనిషత్తు ఋగ్వేదం
108 ముక్తిక ఉపనిషత్తు శుక్లయజుర్వేదం
[+] 1 user Likes dev369's post
Like Reply
Vargottama-Rahu-and-Ketu-Vedic-Astrology.pdf








http://www.mediafire.com/file/sc9sfx8uim...g.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)