Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శాతకర్ణి2
#1
పాఠకులకు నమస్కారం
ఇది సింహబలుడు(శాతకర్ణి1)కు కొనసాగింపు...

రాజ్యం పట్టు కోల్పోయింది ,ప్రజలు దారి తెన్నూ లేకుండా ఉన్నారు. శాతకర్ణి కి ఇది పెనుసవాలు గా మారింది.

రాజ్యం లో అందరికి క్రమశిక్షణ అలవాటయ్యేలా చర్యలు తీసుకున్నాడు.

శృంగార సాహిత్యాన్ని ఆదరించకుండా శాస్త్ర విజ్ఞాన ,ఖగోళ ,వైద్య శాస్త్రాలు వృద్ధి చందేలా చేసాడు .


చరిత్ర లో మొదటి సారి నాణేలు ముద్రించి వర్తకం లో పెను మార్పు తీసుకు వచ్చాడు .

ఇంతలో ఒక నాగసాధువు శాతకర్ణి కి రెండు పుస్తకాలు ఇచ్చాడు .ఈ పుస్తకాలను రహస్యం గా వుంచాలి అని చెప్పాడు.

ఒక దాని మీద యోగ వశిష్టo అని రాసి ఉంది .రెండవది రామరాజ్యం అని వుంది .

రాజ్యం దీన పరిస్థితి దృష్ట్యా రామరాజ్యం చదవసాగాడు సింహబలుడు .

అందులో రామరాజ్యం ఎలా ఉండేదో పూసగుచ్చినట్టు తెలుపబడింది.

రామ రాజ్యం అంటే ప్రజలు రామునికి సేవకులు కాదు. ప్రజలను సేవించటం పరమావధి గా భావించాడు ఉత్తమపురుషుడైన రాముడు.

పట్టాభిషేకం రోజు ప్రజలకు తన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మర్యాదపురుషోత్తముడు. తరువాత సీత ను రక్షించి తీసుకురావటానికి సహాయం చేసిన అందరికి కృతఙ్ఞతలు చెప్పారు.

కృతజ్ఞతాభావం ప్రజల్లో మమేకమయ్యేలా చేసారు శ్రీ రాముడు. ప్రజలు తాముచేసిన పనులకు సరైన ప్రతిఫలం పొందేవారు.

రాజ్యానికి సమీపం లో బ్రహ్మదేవుని గుడి ఉంది ,గుడి వద్దకు వెళ్ళడానికి కొలను దాటాలి.దానికోసం తెప్పలు, పడవలు ఉండేవి. రాజుగారికి కష్టం గా ఉందని గుడి వరకు కఱ్ఱవంతెన కట్టారు. ప్రజలు కూడా సుఖబడ్డారు. ఒక రోజు శ్రీరాముడు వంతెన గుర్రం మీద దాటుతూ కాళిగా పడివున్న తెప్పలను చూసారు. వెంటనే తెప్పనడిపే వారిని పిలిపించి వారి జీవనభృతి కోల్పోయారని తెలిసి వారికీ సత్వరం గుడి నిర్వహణ, వంతెన నిర్వహణ బాధ్యతలు ,వారి కష్టానికి ప్రతిఫలం అందేలా చూడమని ఆదేశించారు.

ఒక రోజు నెత్తురోడుతున్న కుక్క రాముని వద్దకు వచ్చింది.అప్పుడు రాముడు ఎవరు కొట్టారు అని అన్నది. ఒక బ్రాహ్మణుడు బిక్ష మధ్యలో అడ్డుకున్నందుకు ఆగ్రహం తో ఇలా చేసాడు అంది. అప్పుడు బ్రాహ్మణుని పిలిపించి రాముడు కుక్కను ఇతనికి ఏ శిక్ష విధించాలో అడిగాడు.

అప్పుడు కుక్క అతనిని పీఠాధిపతిని చెయ్యమంది. రాముడు కుక్కను అడిగాడు ఇది శిక్ష కాదు బహుమతి కదా అని. ..అప్పుడు కుక్క బ్రాహ్మణుడు తన సత్కర్మల వల్ల అరిషవర్గాలను త్యజియించి ఉన్నత స్థానాన్ని పొందాలి ..కానీ ఇతని క్రోధం వల్ల ఆ స్థానానికి అర్హుడు కాదు. పీఠాధిపతి అవ్వడం వల్ల తన అధికారాన్ని దుర్వినియోగం చేసి నీచ స్థానాన్ని పొందుతాడు .అదే అతనికి శిక్ష అని కుక్క మాయం అయ్యింది. ఇలా రామరాజ్యం లో రామునికి సనాతన ధర్మం కాపాడటానికి సకల జీవులు సాయపడేవి.
అయోధ్య ద్వారం వద్ద సత్యం,ధర్మం వల్ల మీలో భయం ప్రాలద్రోలుతాయి అని వ్రాయించారు.

సనాతన ధర్మం ఆయువుపట్టుగా సాగింది రామరాజ్యపాలన అని వుంది .

యోగవాసిష్ఠం చదివి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నాడు శాతకర్ణి .రాజ్యం లో ఉన్న పరిస్థితుల వల్ల కలిగిన నైరాశ్యం సద్దుమణిగింది.

ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమైనందున ఖజానా ఆదాయం గురించి ఆలోచించాడు శాతకర్ణి.

వేగుల ద్వారా రాజ్యం లో గుప్తనిధుల గురించి విచారణ చేశాడు.

కొడంగళ్లురు ఆలయం చుట్టుప్రక్కల కొన్ని గుప్తనిధులు ఉన్నాయని సమాచారం.

కేరళ దేశం లో భయంకరమైన అడవిలో నిధి దొరుకుతుందని నాగ సాధువులు శాతకర్ణి కి చెప్పారు.రాజ్యం నుండి భీకర అరణ్యానికి బయలు దేరాడు నిధి వేటకు రాజు.శాతకర్ణి తన పరివారం లో మహా వీరులు పది మందిని తీసుకు వెళ్లాడు.మార్గo మధ్య లో నది అడ్డం వచ్చింది. వెడల్పుగా ఉన్న నదిని ఎలా దాటాలి అని అనుకొంటూ ఉండగా ఒక పెద్ద నావ వచ్చింది.నావ లోనుండి తనకు పరిచయ మైన ముఖం కనపడింది.అతడే భట్టు.అతడు శాతకర్ణి ని గుర్తుపట్టి లోపలికి ఆహ్వానించాడు.అప్పుడు నావ ప్రయాణo మొదలయ్యింది.

జీవనయానం లో ఏంతో మంది మహానుభావులను చూసిన శాతకర్ణికి భట్టును చూడగానే ఒక యుగపురుషుడిని చూసిన అనుభూతి పొందాడు. శాతకర్ణి భట్టును ఖగోళ పరిశోధనలను గురించి అడిగాడు. అప్పుడు భట్టు ఇలా అన్నాడు,మిత్రమా ఈ భూమి రూపం ఏమిటో తెలుసా అన్నాడు..".బల్లపరుపుగా ఉండును అని చెప్పి ,మిత్రమా నాదో సందేహం ? మరి గుండ్రంగా ఉన్న భూమిని వరాహావతారం లో ఉన్న శ్రీమహావిష్ణువు కాపాడారు కదా అని అన్నాడు శాతకర్ణి.

అప్పుడు భట్టు నవ్వుతూ నేనూ భూమి బల్లపరుపు గా ఉండేది అనుకున్నాను, కానీ నౌకాయానం లో నక్షత్రాల స్థితి గతులను చూసిన తరువాత భూమి గుండ్రం గా ఉండడమే కాకుండా తనచుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తాను తిరుగుతుంది అని క్లుప్తంగా ముగించి ఆర్యభట్టీయం అనే పుస్తకం చూపించాడు.


రెండో అంకం ప్రారంభం .............

భట్టు కి తాను వచ్చిన సంగతి చెప్పాడు శాతకర్ణి ....

అప్పుడు భట్టు అలోచించి ఎక్కడో ఉన్న గుప్త నిధులు గురించి ఎందుకు ........ఇక్కడి నుండి నౌకాయానం చేస్తే కుమారకుండలం అనే దీవి వస్తుంది .అక్కడ వివిధ దేశాలనుండి వచ్చిన వర్తకులు ఉంటారు. ...వజ్రాలను రాసుల్లా పోసి వర్తకం చేస్తారు. బంగారు బాంఢాగారాలు అనేకం ఉన్నాయి. ఒకసారి అక్కడకు వెళ్ళు అనే తీసుకువెళ్లాడు.

అక్కడ వర్తకం చూసి మతిపోయింది శాతకర్ణి కి .

అప్పుడు అక్కడికి మాలి దేశం నుండి వచ్చిన ముసా చక్రవర్తి కంట పడ్డారు. ముసా చక్రవర్తి ప్రపంచం లోకెల్లా ధనవంతుడు. ఎడారికి రాజు అయినా అతని భూమి లో బంగారు గనులు, వజ్రాల గనులు కనుగొన్నారు. ...బంగారు వర్తకం లో పేరుగాంచారు. కుమారకుండలం వచ్చిన ముసాచక్రవర్తి బంగారం వజ్రాల కంటే విలువైంది కొందామని పదివేల మంది సైన్యం తో వేల రాసుల బంగారం ,వజ్రాలతో వచ్చాడు.





వర్తకమందిరం వద్ద తనకు బంగారానికి విలువైన వస్తువు ఇమ్మని అడిగాడు.

అప్పుడు భట్టు ముసా చక్రవర్తి వద్దకు వెళ్లి ఆర్యభట్టీయం పుస్తకం చూపించాడు. ..సున్నా అనే కొత్త సంఖ్య ను చెప్పి దాని వల్ల గణన ,వర్తకం ఎలా మారుతుందో చెప్పాడు. నౌకాయానం లో నక్షత్రాల స్థితి గతుల బట్టి తయారుచేసిన పటాలను చూపించాడు. వాతావరణ మార్పుల బట్టి రాశి ఫలాల గణనను బట్టి ఎడారి లో కూడా వ్యవసాయం ఎలా చేయవచ్చో తెలిపాడు. ....

ముసా చక్రవర్తి తన పండితులతో ఆర్యభట్టీయం పుస్తకాన్ని వారిభాషలోకి తర్జుమా చేయించాడు. కొంత మంది పండితులను అక్కడ వదిలి వారిని ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం అభ్యసించి రమ్మని చెప్పాడు. ..

తన దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకోమని భట్టు కి ఇచ్చాడు. అప్పుడు భట్టు తాను ఎటువంటి సంపద ఆశించి తన వద్ద ఉన్న విద్యను నేర్పలేదని ,తన విద్య ఎడారిని కొంతమేర సస్యశ్యామలం చెయ్యగలిగితే తనకు మంచిదని చెప్పి సెలవు తీసుకున్నాడు.

శాతకర్ణి ముసా చక్రవర్తి తో ఇలా అన్నాడు. ...మీ రాజ్యాన్ని పెట్టనికోటలా చేసే యుద్ధవ్యూహాలు, రక్షణ వ్యూహాలు ఇందులో ఉన్నాయి. మీరు శాంతికాముకులు, జ్ఞాన తృష్టవున్నవారిలా ఉన్నారు. స్వీకరించండి అని హనుమంతుడు తనకిచ్చిన యుద్దగీత ఇచ్చాడు.సంతోషించి చక్రవర్తి ఆ పుస్తకాన్ని తర్జుమా చేయించాడు. ..

కానీ చక్రవర్తికి ఈ సంపద వల్ల వైరాగ్యం వచ్చింది. దాని గురించి ఏమన్నా సలహా ఇమ్మని శాతకర్ణి ని అడిగాడు. అప్పుడు తనకు నాగసాధువు ఇచ్చిన వసిష్ఠ రామ సంవాదం గురించి చెప్పి అందులో సారాన్ని మొత్తం వివరించాడు శాతకర్ణి. ...జీవితం గురించి తెలుసుకున్న చక్రవర్తి తన భావితరాలకు ఈ జ్ఞానభాండాగారాన్ని అందించాలని అనుకోని ఆ పుస్తకాలను వారి భాష లోకి అనువదింప చేసాడు.

జీవన మర్మాన్ని తెలుసుకున్న చక్రవర్తి ....తన వద్ద ఉన్న బంగారాన్ని వజ్రాలను రెండు భాగాలు చేసి ,సైన్యం ఇచ్చి వారి రాజ్యాలలో వారిని వదిలి రమ్మని చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాడు.

అంతలో హఠాత్తుగా కొంతమంది వచ్చి భట్టును, శాతకర్ణిని ఎత్తుకు పోయారు మెరుపు వేగం తో. ..

వారిని కళ్ళకు గంతలు కట్టి పెద్ద కట్టడాల వద్దకు తీసుకు వెళ్లారు.
అవి త్రికోణాకృతి లో ఉన్నాయి.




భూమి మీద ఇదే పెద్ద కట్టడం లా అనిపించింది.
సింహం ముఖం తో ఉన్న విగ్రహం ఉంది.
కళ్ళకు గంతలు తియ్యగానే ఎదురుగా మూస మహారాజు ఉన్నాడు...



శతకర్ణి ని ,భట్టుని చూసి ఇవి మా పూర్వికులు నుండి వచ్చిన సంపద...ఇందులో ఏముందో ,ఎందుకు కట్టారో తెలియక సతమతమవుతున్నాము....మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి...కానీ వీటిలో ఎదో నిఘాదార్ధం ఉంది...బయట వ్యక్తులు ఇక్కడకు రావడం నిషిద్ధం అందుకే రహస్యం గా తీసుకు రావడం జరిగింది ..క్షమించండి అన్నాడు...

అప్పుడు ఆ కట్టడం పక్కన ఉన్న ఒక మొక్కను తీక్షణం గా చూసాడు భట్టు...అది కేరళ ప్రాంతం లో పెరిగే మిరప మొక్క ...దాని పేరు కాంధార ములకి...




అప్పుడు చెప్పాడు భట్టు ..ఈ మొక్క దిక్సుచి లాగా ఉపయోగ పడుతుంది...కాండం ఉత్తర ధ్రువం వైపు పెరుగుతుంది...
ఈ మొక్కను ఎవరో కేరళ నుండి ఇక్కడకు తెచ్చారు అని గ్రహించాడు భట్టు.
ఈ మొక్కను ఆధారం గా చేసుకొని నిర్మించవచ్చు అన్నాడు...
భట్టు మూస మహారాజు కు తనకు కొంచెం వ్యవధి కావాలని చెప్పాడు....
భట్టు శాతకర్ణి త్రికోణాకృతి లోపలికి వెళ్లారు...
లోపల ఒకాయన విగ్రహం ఉంది...ఆయనే ఈ త్రికోణాకృతుల సృష్టికర్త అని చెప్పారు.. అతని పేరు ఇంహోటప్ అని అన్నారు..అతని ముఖం చూడగానే నుదుటి పై నామాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు...




ఇంతలో రాత్రి కావొచ్చింది....
త్రికోణాకృతి పైకి ఎక్కాడు శాతకర్ణి ......మహా మేరు పర్వతం గుర్తు కు వచ్చింది అతనికి...అంత ఎత్తు ఉన్నది ఆ కట్టడం.....
ఆకాశంలో పరుచుకున్న నక్షత్రాలను గమనిస్తున్నారు శాతకర్ణి,భట్టు ఇద్దరు....
ఇలాంటివి త్రికోణాకృతులు ఇంకా పెద్దవి ఆరు ఉండటం గమనించారు...
అందులో ఒకటి కొండ మీద ఉంది...
ఈ కట్టడాలను పైనుంచి ఆకాశం లో ఒక నక్షత్ర సమూహం నుండి వెలుగు రావడం గమనించారు..
అప్పుడు గుర్తుకు వచ్చింది...ఆ నక్షత్రాలను కాల భైరవ నక్షత్రం అంటారు అని భట్టుకు....




భట్టు వెంటనే కింద కు వచ్చి కాగడా వెలుతురు లో ఇసుక మీద లెక్కలు వేయ సాగాడు...
కలభైరవ నక్షత్ర కూటమి ని లెక్కగట్టి ఈ త్రికోణాకృతి
భూమికి మధ్యలో ఉన్నదని చెప్పాడు భట్టు...
కానీ శాతకర్ణి త్రికోణాకృతి పైన తురియా స్థితి లో ఉన్నాడు...


ఇంతలో బ్రహ్మి ముహూర్తం సమీపించింది...
ఆకాశం లో నుండి నీలకాంతి పుంజం శాతకర్ణి
మీద పడింది...




వెంటనే అతని మెడ లో ఉన్న సోమవజ్రం మరో సూర్యుడి లా వెలుగుతోంది...
త్రికోణాకృతి మొత్తం వజ్రం లా మెరుస్తోంది...
లోపలికి వెళ్ళి చూసాడు భట్టు..
లోపల కాంతి పుంజాలు ఒకదానితో ఒకటి కలిసి త్రికోణాలుగా నేల మీద పడ్డాయి....
కొన్ని వందల త్రికోణాలు కలసి ఒక ఆకారం ఏర్పడింది...






భట్టు ఆ ఆకారాన్ని చూసి...ఓం అని గట్టిగా అరిచాడు...


ఆ శబ్దం ప్రతిధ్వనించింది బిగ్గరగా.....భూమి కంపించినత పని అయ్యింది....
భట్టు కి శ్రీచక్రం కనిపించింది....
పరమానందం పొందిన భట్టు శాతకర్ణి కోసం చూసాడు బయటకు వచ్చి...పైకి ఎక్కాడు భట్టు...ఇంతలో శాతకర్ణి కి
మెలుకువ వచ్చింది.అతని చుట్టూ వెలుగు వచ్చింది..తాను తురియాతీత స్థితి కి చేరానని చెప్పాడు భట్టుకు...ఇక్కడ ఏదో అతీంద్రియ శక్తి ఉందని చెప్పాడు శాతకర్ణి...

శ్రీ చక్రం పడిన చోట చుట్టూతా కాలువ పువ్వు రకాల ఆకారం లో కట్టడం చూపించాడు భట్టు శాతకర్ణికి .

అంటే మన భారతదేశం లోనే ఈ కలువపువ్వులు ఉన్నాయి .ఈ కట్టడానికి మనకు ఏదో సంబంధం ఉంది అని అన్నాడు .

అప్పుడు భట్టు ఈ కట్టడం శ్రీచక్రం ఆధారం గా సువర్ణ రేఖ ప్రాతిపదికన నిర్మించారు అని చెప్పాడు...


ఈ కట్టడం సరిగ్గా భూమికి మధ్యలో ఉంది..భూమి యొక్క చుట్టుకొలత ఈ రాత్రి కనుగొన్నాను...అలాగే భూమి సూర్యుని చుట్టూ 365.65 రోజుల్లో తిరుగుతుందని ఈ కట్టడాలను బట్టే నాకు తెలిసింది...
అంటే ఈ కట్టడం శ్రీచక్రం బాగా తెలిసిన వారు రూపకల్పన చేశారు...ఎవరో తెలుసుకోవాలి అన్నాడు...పక్కనే సింహపు ముఖం ఉన్న విగ్రహం ఎర్రగా అయ్యింది....
త్రికోణాకృతి లో నుండి వెలుగు భూమి లోకి వెళ్ళింది...
అంటే భూమికి ఈ కట్టడానికి ఎదో సంబంధం ఉంది అని ఇద్దరు లోపలికి వెళ్లారు.....
త్రికోణాకృతి కి కింద వలయాలు గా ఉన్న సొరంగ మార్గం వెలుతురులో కనపడింది.
లోపలికి వెళ్లారు ఇద్దరు.
బయటకు ఇరువైపులా నది ఉంది. .
నది లో ద్రవం నిప్పులు గ్రక్కుతోంది.
నది లోంచి విష సర్పాలు వచ్చాయి వీరి మీదకు..
తన మెడలో ఉన్న సోమవజ్రం చూపించగానే వెళ్లి పోయాయి...
ద్వారం ఒకటి కనపడింది.
దాన్ని తియ్యడానికి సాతకర్ణి ప్రయత్నించాడు..
వీలు కాలేదు..
భట్టు కు సాతకర్ణి సీసపు పెట్టె లో అద్దాలు అమర్చి తాను ...ఆవు కొమ్మును కోసిన ఉదంతం చెప్పాడు...


సీసం నదిలో మరుగుతోంది.... నది లో ఇసుకను పోసాడు భట్టు...
నిప్పుల కొలిమి లాంటి నదిలో ఇసుక కరిగి అద్దాల మాదిరి పలకలు తయారయ్యాయి...అవితేలుతూ... పక్కనే ఉన్న జలపాతం వద్ద ఆగాయి..... గడ్డకట్టించే జలపాతం చల్లదనానికి అద్దాలు తయారయ్యాయి...
అద్దాలు ఒక పెద్ద పెట్టె లా తయారు చేసి బయట సీసం పుసాడు భట్టు...
మధ్యలో సోమ వజ్రం పెట్టాడు...
భళా మిత్రమా అని సాతకర్ణి అని నేను ఇలాగే చేశాను... దీని లో మర్మం ఏమిటి అన్నాడు..
అప్పుడు మిత్రమా వజ్రం చూసావా ఇది ఎలా మెరుస్తుందో తెలుసా...లోపల కాంతి విభిన్న కోణాల్లో ఆవర్తనం చెంది శక్తి పెరుగుతోంది.
ఈ పెట్టె లో వెలుగుతున్న సోమవజ్రం పెట్టి అద్దాలు లో కాంతి ఆవర్తనానికి శక్తి దేదీప్యమానం గా వేల రెట్లు పెరుగుతుంది.. అన్నాడు భట్టు..




ఆ శక్తి ని ద్వారం వైపు చూపించాడు శాతకర్ణి.
పాతాళ లోకం తెరుచుకుంది.
అప్పుడు అనుకున్నారు పాతాళ లోకం కు దారి ఈ త్రికోణాకృతి వద్ద ఉందని...
లోపలకు వెళ్లి చూస్తే లోపల పాతాళ లోక రాజ ప్రసాదం ఉంది...
అక్కడకు వెళ్లారు ఇద్దరు...
లోపల సింహాసనం పక్కన బలి చక్రవర్తి.. సింహాసనం మీద హనుమంతుని పుత్రుడు మత్సవల్లభుడు ఉన్నారు...
వారిరువురు రారా శాతకర్ణి అన్నారు..

అప్పుడు శాతకర్ణి వారికి నమస్కరించి ఈ త్రికోణాకృతుల రహస్యాన్ని చెప్పమన్నాడు.

వారు ఇరువురి సాహస కృత్యాలను కొనియాడారు.

వెంటనే సింహం విగ్రహం చీకట్లోనుండి కనపడింది సోమవజ్రం వెలుతురు వల్ల .....అప్పుడు దగ్గరకు వెళ్లి పరికించి అది నరసింహుని విగ్రహం ఉంది. ఎదురు గా పంచముఖ ఆంజనేయ విగ్రహం ఉంది.

ఇరువురికీ అర్ధం అవ్వలేదు ....

అప్పుడు బలి చక్రవర్తి నాయనా నన్ను నువ్వు కొడంగళ్లురు లో చూసావు కదా ...అది విష్ణు మూర్తి వామన అవతారం లో నన్ను పాతాళం లోకి వెళ్ళమన్న చోటు. ..

భట్టు చెప్పినట్టు ఈ ప్రదేశం భూమికి మధ్యలో ఉంది ...

ఈ విశ్వాఅంతరాళం లో ఉన్న శక్తి ని భూమి తట్టుకోలేక చిన్నాభిన్నమవుతూ ఉండేది

ఒక ఉల్కాపాతం భూమిని ఢీకొట్టడం వల్ల ప్రాణసృష్టి ఏర్పడింది ......

ఆ బ్రహ్మపదార్దo నల్ల రాయి కింద ఏర్పడింది ......అదే శివలింగం .

ఆ శివ లింగం భూమి లోతుల్లోకి వెళ్లి భూమికి స్థిరత్వాన్ని ,ప్రాణుల్ని ఇచ్చింది.

అంటే ఈ సకల చరాచర జీవులు ఈ బ్రహ్మ పదార్థం నుండే వచ్చాయి .భూమి ఉపరితలానికి పాతాళానికి వారధి ఈ శివలింగం ....

యుగాలు మారే కొద్దీ ఈ లింగం కరుగుతూ వస్తుంది .

ఈ శివలింగానికి శక్తినిచ్చేలా ఆకాశం లో నుండి గణాలు తాము సముపార్జించిన శక్తిని ఇందులోకి త్రికోణం ద్వారా విడుస్తాయి.

ఈ లింగానికి ఆది ఆకాశం లోను అంతం సముద్రం లోను ఉన్నది .

నువ్వు చూసే ఈ త్రికోణాకృతి మానవమాత్రులకు కనిపించేది ...ఇప్పుడు నా దివ్య శక్తి తో చూడండి ...

అప్పుడు త్రికోణాకృతి పైన పెద్ద నీల పర్వతం ఆకాశం లోకి ఎగసిపడుతూ కనిపించింది .పర్వతం పాతాళ లోకం అడుగున ఉన్న సముద్రం వరకు ఉన్నది ......మధ్యలో ఒకచోట శివలింగం భద్రం గా ఉన్నది. ఇది చూడగానే భట్టు పరమానంద భరితుడై ...ఇదే మహామేరు పర్వతం అని

అరిచాడు.





అప్పుడు బలి చక్రవర్తి ఇలా అన్నారు. .
[+] 4 users Like Kittyboy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
excellent bro
[+] 1 user Likes Venrao's post
Like Reply
#3
(18-12-2019, 09:51 AM)Venrao Wrote: excellent bro

Thanks andi
[+] 1 user Likes Kittyboy's post
Like Reply
#4
Good information sir
[+] 1 user Likes Mnlmnl's post
Like Reply
#5
Extraordinary story bro...
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 1 user Likes The Prince's post
Like Reply
#6
Super story bro
[+] 2 users Like giri143435@'s post
Like Reply
#7
(18-12-2019, 03:05 PM)giri143435@ Wrote: Super story bro

Thanksgiving
[+] 1 user Likes Kittyboy's post
Like Reply
#8
(18-12-2019, 01:59 PM)The Prince Wrote: Extraordinary story bro...

Thanks prince
[+] 1 user Likes Kittyboy's post
Like Reply
#9
(18-12-2019, 01:38 PM)Mnlmnl Wrote: Good information sir

Thanks
[+] 1 user Likes Kittyboy's post
Like Reply
#10
Excellent story line bro keepit up
[+] 1 user Likes Satya9's post
Like Reply
#11
(18-12-2019, 08:21 PM)Satya9 Wrote: Excellent story line bro keepit up

Thanks
[+] 1 user Likes Kittyboy's post
Like Reply
#12
I'm Waiting This Story. At Last Given Update Thank U Sir. Complete Story
[+] 1 user Likes munabai786's post
Like Reply
#13
(19-12-2019, 05:13 PM)munabai786 Wrote: I'm Waiting This Story. At Last Given Update Thank U Sir. Complete Story

Inka vundi..thanks
[+] 1 user Likes Kittyboy's post
Like Reply
#14
కథచాలా బాగుంది కొన సాగించండి
[+] 1 user Likes Satya9's post
Like Reply
#15
Is this fiction ? it is not sounding like that . Based on some ancient knowledge few bits of fiction added it seams.  Good line bro , keep writing.
[+] 1 user Likes Knowledge1's post
Like Reply
#16
?????
[+] 1 user Likes Rajarani1973's post
Like Reply
#17
చాలా బాగుంది కొనసాగించండి. అన్ని నిజాలు గా అనిపిస్తుంది.
[+] 1 user Likes Knowledge1's post
Like Reply




Users browsing this thread: