Thread Rating:
  • 5 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Hanuman ramayana
#1
అప్పుడు రామాయణాన్ని సంస్కృతంలో తన గోళ్ళతో గాజు పలకలపై రాశారు హనుమ. దాన్ని చూస్తూ ఆనందంగా ఉండేవారు మకరధ్వజుడు. ఇద్దరు కొన్ని ధర్మ విషయాలపై తర్కించేవారు. రాసిన వాటిని కొండలోని గుహలో భద్రపరిచేవారు మా తండ్రి.


ఇంతలో వాల్మీకి రామాయణం లవకుశుల ద్వారా చాలా ప్రాచుర్యం పొందింది. ఒకసారి ఆ కొండ వద్దకు వాల్మీకి మహర్షి వచ్చి "హనుమపుత్రా, నాన్నగారిని కలవాలి "అని అడిగాడు.

ఇద్దరూ హనుమంతుల వారి వద్దకు వెళ్ళారు. అప్పుడు వాల్మీకి, స్వామీ మీరు రచించిన రామాయాణాన్ని ఒకసారి చూడాలని మనసు కుతూహలంగా ఉంది అన్నారు. మకరధ్వజుడు ఆ రాతి పలకలను వాల్మీకికి చూపించాడు .
ఆ పలక లో ఇలా ఉంది...
"ఒకసారి సీతారాములు లక్ష్మణుని తో కలసి సరభాంగ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు.అప్పుడు ఆ ఆశ్రమం నుండి ఐరావతం మీద కోపం గా వెళ్లిపోవడం గమనించారు.
అప్పుడు లక్ష్మణుడు శరభాంగుడిని ఇంద్రుని కోపానికి కారణం అడిగారు. ఇంద్రుడు తన తపోశ్శక్తికి మెచ్చి స్వర్గప్రాప్తి అనుగ్రహిస్తే నేను తిరస్కరించాను అని అన్నారు..
అదేమి వింత..లోకులు స్వర్గం పరమావధి గా భావిస్తారు మీకు త్యజించారు..కారణం తెలుపండి ఋషివర్యా అన్నారు.
అప్పుడు శరభాంగుడు ఇలా సెలవిచ్చారు..
"స్వర్గం లో అన్ని కోరికలు తీర్చడానికి కల్పవృక్షం ఉన్నది..
కానీ దాని అధిపతి ఇంద్రునికి కల్పవృక్షం ఎప్పుడు ఎవరికి వసమవుంతుందో అని ఆందోళన ,భయం ఉన్నాయి.
ఏ ప్రదేశం లో అయితే ఆందోళన,భయం,కోరిక ఉండవో ఎక్కడైతే ఆత్మసంతుష్టo పొందుతారో ఆ దివ్యస్థానం నా ధ్యేయం."
అప్పుడు లక్ష్మణుల వారు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అని అడిగారు.
అప్పుడు శరభాంగుడు ఇలా అన్నారు.." కైలాసం అని..
నాయనా.. ఆ ప్రదేశం లో నంది పార్వతి దేవి యొక్క సింహాన్ని చూసి భయపడదు...శివుని మెడలో నాగరాజుకు కార్తికేయుని నెమలి అంటే జంకు లేదు.వినాయకుని మూషికానికి శివుని నాగు వలన ఆందోళన లేదు..
కైలాస భూమిలో పరస్పర వైరుధ్యం ఉన్న జీవులు సమైక్యం గా కలసి మెలిసి ఉండటానికి ఆత్మసంతుష్టo పొందటమే ..
అది నాకు కావలసిన స్థానం."
అప్పుడు రాముని సీత ఇలా అడిగారు.."మరి ఆ స్థితి ని పొందడానికి అవసరమయిన సహాయం ఎవరు చేస్తారు ".
అప్పుడు ఋషి విష్ణుమూర్తి ఆ కార్యం మనతో చేయిస్తారు అని అన్నారు.
అప్పుడు శ్రీరామ చంద్రుడు ఇలా అన్నారు...ఋషివర్యా.. నాకు అవగతము ఐనది..
శివుడు ,విష్ణుమూర్తి మనలోనే ఉన్నారు..
ఏ కోరిక లేని ఆత్మ సంతుష్ట యోగం శివుని స్థితి అయితే ఆ స్థితి ని చేరువ కావడానికి దారిలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మనకు ఉపయోగపడే మార్గమే విష్ణువు."
ఇది చదివిన వాల్మీకి కి కన్నీళ్లు ఆగలేదు తన్మయం తో..


సూర్యభగవానుని ప్రియశిష్యుడు, జ్ఞానభాండాగారం అయిన హనుమంతుల వారి పాండిత్యం వాల్మీకిని విస్మయపరిచింది. తన రామాయణం సాదాసీదాగా అనిపించింది. వెంటనే వాల్మీకి "స్వామి నా జీవితం మొత్తం వెచ్చించి రామాయణం రచించాను కానీ మీ రామాయణంలో రెండు పద్యాలు చదివాను నా జన్మ తరించిపోయింది. దీని ముందు నా రామాయణ రచన వృధా, దీన్ని ఇక్కడే ఉంచుతాను. మీ రామాయణం ప్రజలలోకి వెళ్ళాలి ఎందుకంటే అందులో ప్రాణం ఉంది "అన్నాడు.

హనుమ మకరధ్వజునితో "వాల్మీకి మహర్షి తన సర్వస్వాన్ని ధారపోసిన ఈ కావ్యం రాశాను. నేను మామూలుగానీ ఈ కావ్య౦ రాశాను, నా రామాయణం ఉన్నా లేకపోయినా నేను సీతమ్మ వరం వల్ల రామభక్తులను కాపాడుతూ చిరంజీవిగా ఉంటాను , కాబట్టి వాల్మీకి రామాయణం ప్రజలలోకి వెళితే అతని జీవితానికి సార్ధకత వస్తుంది "అన్నారు ప్రశాంతంగా .వాల్మీకి వద్దన్నా వినకుండా మా తండ్రి ఆ రామాయణ ఫలకాలను సముద్రునికి రాముని పేరుతో అంకితం చేశారు.

అప్పుడు వాల్మీకి "దేవా, మీరు కారణజన్ములు, నేను మళ్ళీ పుట్టి మీ రామాయణాన్ని వెలికితీసి అందరికీ ఆ మధురరసం రుచి చూపిస్తాను "అని వీడ్కోలు తీసుకున్నారు.
[+] 7 users Like Kittyboy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good story
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
Bagundi..ramayanam
Madhurilatha Heart
[+] 1 user Likes Madhurilatha's post
Like Reply
#4
చాలా బాగా చెప్పారు.రామాయణం లో ఈ భాగని నేను ఎక్కడ చదవలేదు...ఎవరన్నా చెప్పగా వినలేదు..చక్కగ చెప్పారు
[+] 1 user Likes అన్నెపు's post
Like Reply
#5
నేనూ ఇది వినలేదు, ఎక్కడా చదవలేదు. శివ విష్ణు మార్గాల గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#6
ఇదెప్పుడూ వినలేదు, ఇలా కూడా ఉందా
[+] 2 users Like Haran000's post
Like Reply
#7
Continue please  Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: