Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చాలా బాగుంది, కాని చాలా తొందరగా ముగించారు
[+] 1 user Likes venki/6000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(10-12-2019, 04:33 PM)arkumar69 Wrote: yourock banana banana banana mahesh bro we are very  very unhappy about the end of this story you should have included some new characters and continue the story for some more episodes now also it's not late  our humble request is continue the story  party flamethrower

Please kindly tell me how to send comments in our mother tongue telugu fròm android phone

May be future . And thank you sooooooo much.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
మహేష్ బ్రో TWINS కథని ఇంత త్వరగా ముగింపు ఇస్తారని అనుకోలేదు అమ్మమ్మ తో కూడా శృంగారం ని జోడించి ఉంటే బాగుండేది, కానీ ఇది మీ కథ కాబట్టి మీరు ఎలా రాసిన మాకు సంతోషమే.

త్వరలో మరో కొత్త కథతో అలరిస్థారని ఆశిస్తున్నాము.


ఇట్లు మీ అభిమాన
Rohan-Hyd
[+] 1 user Likes Rohan-Hyd's post
Like Reply
(11-12-2019, 09:48 AM)Mahesh61283 Wrote: Update super &mugimpu sukantham

Thank you so much.
Like Reply
(11-12-2019, 08:02 PM)akhil akki Wrote: మిత్రమా మహేష్..
ఏమని వర్ణించమంటావ్ ని వర్ణనా గురించి పదాలు కూడా దొరకడం లేదు ..
ట్విన్స్ కథని తొందరగా ముగించావ్ ఇంకా చాల ఉంటుంది అని అనుకున్న ..
కానీ ఇంకో కథ తో మా ముందుకు వస్తునవని తెలిసి చాల ఆనందంగా ఉంది..

all the best fr ur nxt story mithrama...

చాలా చాలా చాలా............ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
(12-12-2019, 02:31 PM)ravi Wrote: Meenunchi 3some 4some expect chesanu mahesh garu ee story lo, it's ok you very much

May be future లో కంటిన్యూ చెయ్యొచ్చేమో .............
 Thank you.
Like Reply
(13-12-2019, 12:10 PM)Vinay smart Wrote: Keka bro
U r good good

Thank you so much bro.
Like Reply
(14-12-2019, 10:35 PM)venki/6000 Wrote: చాలా బాగుంది, కాని చాలా తొందరగా ముగించారు

చాలా చాలా ధన్యవాదాలు.
Like Reply
(15-12-2019, 07:50 AM)Rohan-Hyd Wrote: మహేష్ బ్రో TWINS కథని ఇంత త్వరగా ముగింపు ఇస్తారని అనుకోలేదు అమ్మమ్మ తో కూడా శృంగారం ని జోడించి ఉంటే బాగుండేది, కానీ ఇది మీ కథ కాబట్టి మీరు ఎలా రాసిన మాకు సంతోషమే.

త్వరలో మరో కొత్త కథతో అలరిస్థారని ఆశిస్తున్నాము.

చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా ............, 
ఫ్రెండ్స్ అంతా మీలానే కోరుకుంటున్నారు , భవిష్యత్తులో కచ్చితంగా అక్కడనుండి మొదలుపెడతాను.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
రేపు ఉదయం " జీవిత గమ్యం " తొలి అప్డేట్ తో మీముందు ఉంటాను . అంతవరకూ have a good day ఫ్రెండ్స్ అండ్ బ్రోస్.
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply
Thank you so much bro waiting for your update
Like Reply
Eagerly waiting for your new story bro
Like Reply
మిత్రమా మహేష్..
నూతన కథ తో మమ్మల్ని ఊహలలో తేలిపోయేలా చేయాలి
ఎప్పటి లనే మీ కథ వర్ణన అద్భుతంగా ఉంటుంది అని తెలుసు కానీ కొత్త కొత్త సీనులతో అదిరిపోయే ట్విస్ట్లతో  మమ్మల్ని మీ కథకి బానిసలని చేసుకుంటారని ఆసిస్తూ మీ అభిమాని...
[+] 1 user Likes akhil akki's post
Like Reply
(16-12-2019, 05:01 PM)akhil akki Wrote: మిత్రమా మహేష్..
నూతన కథ తో మమ్మల్ని ఊహలలో తేలిపోయేలా చేయాలి
ఎప్పటి లనే మీ కథ వర్ణన అద్భుతంగా ఉంటుంది అని తెలుసు కానీ కొత్త కొత్త సీనులతో అదిరిపోయే ట్విస్ట్లతో  మమ్మల్ని మీ కథకి బానిసలని చేసుకుంటారని ఆసిస్తూ మీ అభిమాని...

మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి మిత్రమా.
Like Reply
జీవిత గమ్యం

అది తిరుపతి రైల్వే స్టేషన్ , సమయం రాత్రి 8:15 , కొండపై స్వామివారి దర్శనం చేసుకుని , ఒక వ్యక్తి తల నీలాలు మొక్కుగా సమర్పించినట్లు గుండుతో తన భార్య మరియు సుమారు 20 సంవత్సరాల కూతురుని కంగారుపెడుతూ ఒసేయ్ ట్రైన్ బయలుదేరాడానికి 15 నిమిషాలు మాత్రమే ఉంది త్వరగా అంటూ లాగేజీతోపాటు పరుగులు తీస్తూ ఫ్లాట్ ఫారం మీదకు చేరుకున్నారు . 

ముందే రిజర్వేషన్ చేసుకోవడంతో తమ బోగీ వెతుకుతూ ఒక్కొక్క బోగీ దాటుతూ ఇదే అంటూ బయట అతికించిన లిస్ట్ లో తమ పేర్లను ఆ వ్యక్తి చూస్తుంటే , ట్రైన్ ఎక్కడ బయలుదేరుతుందోనని ఒక 8 ఏళ్ల పిల్లాడు ఒక చేతిలో టిఫిన్ పొట్లాల బాక్స్ మరియు మరొక చేతిలో టీ క్యాన్ పట్టుకొని కంగారుపడుతూనే పెదాలపై చిరునవ్వుతో పరిగెడుతుండటం చూస్తున్న తల్లీ కూతుళ్లు జాగ్రత్త అనేంతలో కాలుకి ఏదో తగిలినట్లు ధడేల్ మంటూ కిందపడిపోయి అమ్మా అని కేక వేసాడు .

 ట్రైన్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది అని హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా , ఇద్దరూ పరుగునవెళ్లి మొదట పిల్లవాణ్ణి లేపి ప్లాట్ ఫారం బెంచ్ పై కూర్చోబెట్టి బాబు దెబ్బలేమైనా తగిలాయా అంటూ చూస్తుంటే తన తల్లి బాక్స్ మరియు టీ క్యాన్ తీసుకొచ్చి పిల్లవాడి ప్రక్కన పెట్టి , తల్లి పిల్లాడికి ఏమీ కాలేదు కదా అని అడుగుతుండగానే , నామాటాలు మీకు వినిపించడంలేదా అంటూ ఆ వ్యక్తి వచ్చి ఇద్దరినీ లాక్కుని వెళ్లిపోతుంటే , నాన్న పాపం చిన్నపిల్లాడు చేతివెంట రక్తం కారుతోంది........ . ఈ ట్రైన్ వెళితే వెల్లనీ అంటూ పిల్లవాడివైపు బాధతో చూస్తుంటే , అమ్మో ఇంకేమైనా ఉందా చూస్తుంటే వాడు ట్రైన్ లో టిఫిన్ అమ్ముకునేవాడులా ఉన్నాడు వాడికి ఇవన్నీ అలవాటేలే అంటూ ట్రైన్ ఎక్కమని ఆర్డర్ వేసాడు . పిల్లాడు చేతులను దులుపుకుని రక్తం కారుతున్న రెండుచేతులతో వాటిని పట్టుకొని పరుగున వెళ్ళిపోవడం చూసి బాధతో కళ్ళవెంట నీళ్లు కార్చారు .

మరు క్షణమే ఫ్లాట్ ఫారం పై ఎక్స్ప్రెస్ బయలుదేరాడానికి సిద్ధం అని అనౌన్స్ జరగడంతో  హమ్మయ్యా .........అని ఊపిరిపీల్చుకుని ఎలాగోలా సరైన సమయానికే చేరిపోయాము అంటూ వారి సీట్ల దగ్గరకు చేరుకుని లాగేజీని చైన్స్ తో లాక్ చేసి కింద జాగ్రత్తగా పెట్టేసారు .ఏమండీ ఆలస్యం అవ్వడానికి మీరు కూడా కారణమే కదా ట్రైన్ లో ఫుడ్ దొరుకుతుందని తెలిసినా బయటే హోటల్లో పార్సెల్ తీసుకునేదగ్గర గంట సమయం వృధా చేశారు . ఇక్కడ ఫుడ్ కాస్ట్ ఎక్కువ మరియు టేస్ట్ కూడా ఉండదు అందుకే బయట తీసుకున్నది , నేను బాత్రూం కు వెళ్ళొస్తాను తిని పడుకోవాలి అని వెళ్ళాడు.

కొన్ని నిమిషాల తరువాత ట్రైన్ కదిలినా కూతురు మాత్రం ఇంకా బాధపడుతూనే కిటికీలో నుండి రెండువైపులా పిల్లాడి కోసం చూస్తోంది . తల్లి ఇంకా ఆ పిల్లాడి గురించే ఆలోచిస్తున్నావా ........... నొప్పిలేనట్లు పరిగెత్తుకుంటూనే వెళ్ళిపోయాడు కదా నువ్వు బాధపడొద్దు అని తన చీర కొంగుతో తన కూతురి కన్నీళ్లను తుడిచింది . 

ఎందుకో అమ్మా చిరునవ్వులు చిందిస్తున్న వాడిని చూడగానే ఇక్కడ ఎంత సంతోషం వేసిందో ...........వాడు పడిపోగానే నాకు నొప్పివేసినట్లు గుండె కొన్ని క్షణాలపాటు ఆగిపోయింది . నాకు తమ్ముడు కానీ ఉండి ఉంటే వాడిలాగే ఉండేవాడేమోనని అనిపించింది అని మరింత బాధతో తల్లి గుండెలపై వాలిపోయింది . అవును తల్లినాకు కూడా అలానే అనిపించింది , ఈ క్షణం కానీ ఆ పిల్లాడు మన ముందర  ఉంటే నేరుగా పిల్లవాణ్ణి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకెళ్లి నా కొడుకుగా దత్తత తీసుకుని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేస్తాము మావెంట పంపుతారా అని కాళ్ళమీదైనా పడి బ్రతిమాలేదాన్ని , నీకు తమ్ముడు లేడని ప్రతి రోజూ ఎంత బాధపడుతున్నావో నాకు తెలీదా తల్లి , వాడి అక్కడితో నీకు తమ్ముడు లేని లోటునీ, నాకు కొడుకు లేని లోటునీ తీరిపోయేది అని తన కూతురితో పాటు కన్నీరు కార్చింది.

తన తల్లి మాటలకు బాధతో కన్నీరు కారి వెంటనే కోపంతో ఇప్పుడా ఆమాట చెప్పేది , తమ్ముడు అమ్మా అంటూ తల్లడిళ్లిపోతుంటే , క్షమించు తల్లి అంటూ మనసారా గుండెలకు హత్తుకొని ఇద్దరూ చాలా బాధపడ్డారు .

తండ్రి ట్రైన్ టాయిలెట్ నుండి వచ్చి బాధపడుతున్న ఇద్దరినీ చూసి ఏమైంది అని అడిగారు .
ఏమండీ పిల్లాడి గురించి నా బంగారుతల్లి బాధపడుతోంది . మనకు పుట్టిన బిడ్డ చనిపోకుంటే మన కొడుకు ఇప్పటికే అంత వయసులో ఉండేవాడు . 
మనకు ఒక బిడ్డ చాలు అని నేను ముందే చెప్పాను , నువ్వే వినలేదు అలా జరిగింది . నాకు సంతోషమే అని ఫుడ్ ప్యాకెట్ తీసి సంతోషంతో తినడం చూసి , 
ఇద్దరూ కోపంతో చూసి మరింత బాధపడ్డారు . ఆ పిల్లాడు మళ్లీ కనిపిస్తే మీకు ఇష్టమైన కాకపోయినా , నా బంగారుతల్లికి వాడిని తమ్ముడిని చేస్తాను అని ఎర్రటి కళ్లతో చెప్పింది .
తన భర్తకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా , ఆ పిల్లవాడు మళ్లీ కనిపించినప్పుడు కదా , వాడు ప్లాట్ ఫోరమ్ మీద టీ అమ్ముకుంటూ అక్కడే ఆగిపోయి ఉంటాడు అని రాక్షస నవ్వు నవ్వుతూ తింటున్నాడు.
మరింత కోపంతో అతడివైపు చూసి ఇద్దరూ కళ్ళుమూసుకుని రెండు చేతులను జోడించి పిల్లాడికోసం మనసారా ప్రార్థించారు .

నెక్స్ట్ మినిట్ ఆ బోగీలో మాత్రమే పవర్ కట్ అవ్వడం ప్రార్థిస్తున్న అమ్మాయి ఎందుకో అమ్మా అని నొప్పివలన అరవడం , మరు క్షణమే పవర్ on అయ్యి తనతోపాటు అటూ ఇటూ కొంతమంది మహిళలు తనలానే కేకలు వేస్తూ గొంతుపై నొప్పివలన చేతితో రుద్దుకుంటున్నారు .
స్స్స్.......అమ్మా అంటూ తను కూడా రాసుకుంటుంటే తల్లి ఎర్రగా గీసుకుపోయింది , ఏదీ చూడనీ అంటూ చూస్తుంటే ,
అమ్మా మెడ లో ఏదో లాగేసినట్లు అనిపించింది అమ్మా ........, తల్లి మీ నానమ్మ బంగారు హారం .........
చేతులతో తడుముకుని అవునమ్మా చైన్ లాగడం వలన కలిగిననొప్పివలనే కేక వేసాను అంటూ లేచి కింద పడిందేమో అని చూస్తుంటే , తమతోపాటు రెండువైపులా ఉన్న మహిళలు కూడా మెడలో చైన్స్ కనిపించడం లేదని ,సెక్యూరిటీ అధికారి సెక్యూరిటీ అధికారి .......అని అరవడం విని దొంగతనం జరిగిందని ఒకరికొకరు చూసుకుంటుంటే ,
10 తులాల చైన్ పోగొట్టుకున్నావా ...........అంటూ తింటున్నవాడు వచ్చి తన కూతురిని , భార్యను కోపంతో కొట్టినంతపనిచేశాడు . అది మా అమ్మ గుర్తు అని బాధపడుతున్నాడు . 
ఏమండీ మన ఒక్క చైన్ మాత్రమే కాదు బోగీ లోని చాలా మందివి ప్లాన్ ప్రకారం కరెంట్ తీసేసి క్షణాల్లో లాగేసుకొని వెళ్లిపోయినట్లున్నారు . 
ఇంతలో ట్రైన్ లో ఉన్న ఒకే ఒక సెక్యూరిటీ అధికారి వచ్చి విషయం తెలుసుకుని 60 -80 km వేగంతో వెళుతున్న ట్రైన్ లోనుండి ఖచ్చితంగా దూకే ధైర్యం చేసి ఉండరు , ఈ స్లీపర్ బోగీలలోనే ఉంటారు అని వెతుకుతూ వెళ్ళాడు . 
అర గంట , గంట అయినా సెక్యూరిటీ అధికారి గురించి జాడ లేకపోవడంతో అందరూ వాళ్ళ చైన్స్ పై ఆశలు వదులుకుని నిద్రలోకి జారుకున్నారు . 
కానీ అమ్మాయి తండ్రి మాత్రం మీకు ఏమాత్రం జాగ్రత్త లేదు , రెస్పాన్సిబిలిటీ కూడా లేదు అని కోపంతో ఊగిపోతూ తిడుతూనే ఉన్నాడు . 
నాన్న నానమ్మ చైన్ అంటే మీకంటే మాకు చాలా చాలా ఇష్టం . మనల్ని వదిలివెళ్లిపోయేముందు ప్రేమతో నా మెడలో వేసింది . నానమ్మ గుర్తుగా ఇప్పటివరకూ దానిని నానుండి తియ్యలేదు అంటూ తన తల్లిని కౌగిలించుకుని బాధపడుతుంటే ............

అయినా ఆపకుండా అతడు భార్యను , కూతురును కోపంతో మాటలు అంటూనే ఉండటంతో , ఇద్దరూ సైడ్ సీట్లో తల దించుకు కూర్చుని మౌనంగా మాటలు పడుతున్నారు .
తన కళ్ళ ముందు చైన్ కనిపించడం చూసి , అమ్మా ......నానమ్మ చైన్ అంటూ తలెత్తి చూస్తే , అదే పిల్లవాడు అక్కా ఈ చైన్ మీదే కదా అంటూ చిరునవ్వుతో అందించాడు. 
చైన్ దొరికింది అన్న ఆనందం కంటే పిల్లాడు కనిపించాడనే అమితానందంతో అమ్మా............ఆ దేవుడు మనల్ని కరుణించాడు . ఇక చూడలేమనుకున్న తమ్ముడిని మన దగ్గరకు చేర్చాడు అంటూ ఆనందబాస్పాలతో అమాంతం కౌగిలించుకుంది .
స్స్స్..........అంటూ నోటి నుండి మూలుగు రావడంతో , ఏమైంది తమ్ముడూ ........అంటూ మోచేతులపై గీసుకుపోయి ఉండటం చూసి , కళ్ళల్లో చెమ్మతో కంగారు కంగారుగా అమ్మా...........రక్తం ఇంకా కారుతోంది అంటూ తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని నొప్పిగా ఉందా తమ్ముడు అంటూ తనే నొప్పిని ఫీల్ అవుతున్నట్లు బుగ్గలను అందుకొని ప్రేమతో స్పృశిస్తూ , ఏమైనా చేయమ్మా ........అని బాధతో చెప్పింది . 
వాళ్ళ నాన్న చైన్ చూసివచ్చి పిల్లాడి చేతిలోనుండి లాక్కుని హమ్మయ్యా ..........దొరికింది అంటూ వెంటనే లాకర్ ఉన్న సూట్ కేస్ లో భద్రపరిచేసి , ఎక్కడ ఆ పిల్లవాణ్ణి తమతోనే ఉంచుకుంటారేమోనని వాళ్ళవైపు ఒకరకమైన ఫేస్ పెట్టి చూస్తున్నాడు .
తన తల్లి మరొక బ్యాగులో నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చింది .
అమ్మా ఇంటిదగ్గర ప్రయాణంలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకమ్మా అని కోప్పడ్డాను ,లవ్ యు అమ్మా ..........అంటూ అందుకొని కాటన్ పై డేటాల్ అంటించి గాయాలను శుభ్రం చేసి రెండు మోచేతులకు కట్లు కట్టి , తమ్ముడూ ఇంకా ఎక్కడైనా దెబ్బలు తగిలాయా , కాళ్లకు అని సున్నితంగా తాకుతూ అడిగింది .
పిల్లవాణ్ణి తమ్ముడు అన్న ప్రతిసారి ఇప్పటివరకూ ఆప్యాయతతో ఇలాంటి పిలుపు నోచుకోకున్నట్లు వాడి హృదయం సంతోషంతో పొంగిపోయి , వొళ్ళంతా జలదరిస్తూ కళ్ళల్లో చెమ్మ చేరుతోంది . 
ఏమైంది తమ్ముడూ అంటూ పైటతో కన్నీళ్లను తుడిచింది .

ఏమీ లేదండీ ..........ఎక్కడ పుట్టానో తెలియదు , ఊహ తెలిసేటప్పటికి ఈ రైల్వే స్టేషన్ లో పడ్డాను . ఏ పొట్లాలు , టీ అమ్ముకుంటూనే స్టేషన్ లోనే పడుకుంటాను . అందరూ ఒరేయ్ , రేయ్ ...........అని పిలుపు తప్ప ఆప్యాయతతో తమ్ముడు అని పిలుపు వినడం ఇదే తొలిసారి , నా గాయాలను చూసి జాలిపడను కూడా పడలేదు మీరు ప్రక్కనే కూర్చోబెట్టుకొని కట్టు కట్టారు మేడం , అందుకే కన్నీళ్లు ఆగడం లేదు . నా జీవితాంతం ఋణపడిఉంటాను అని రెండుచేతులతో మొక్కాడు .
తమ్ముడు అంటూ కళ్ళల్లో చెమ్మతో గాయాలకు తగలకుండా గుండెలపై హత్తుకొని , అంటే నీకు ..........
ఎవ్వరూ లేరు మేడం అదేదో అన్నారు .........ఆ గుర్తొచ్చింది అనాథ .........
ఈక్షణం నుండి నువ్వు అనాధవి కాదు నాన్న మా బిడ్డవు , మావెంట వస్తావా నిన్ను ప్రేమతో చూసుకుంటాము , కాలేజ్ లో చేర్పిస్తాము ..........అని అమ్మాయి తల్లి పిల్లాడి తలపై ప్రేమతో నిమిరి చెప్పింది .
నామాటాలు విని వారినే చూస్తున్న తన భర్తకు విపరీతమైన కోపం వస్తున్నా , తానే కదా మళ్లీ కలిసినప్పుడు ..........అని మాట్లాడింది అని కంట్రోల్ చేసుకుని దుప్పటి , దిండు తీసుకుని పైకి ఎక్కేసాడు .
నాకు అంత ఆశ లేదు మేడం , మీరు తమ్ముడు అని పిలిచారు అదిచాలు నేనేవరినో , ఎలాంటివాన్నో కూడా మీకు తెలియదు . నేను అనాదని రైల్వే స్టేషన్ మరియు ట్రైన్ లలో ఇలా అమ్ముకునేవాడిని అని చెబుతుంటే .......
తమ్ముడూ నీ పేరు తెలియకపోయినా నువ్వు మా గుండెల్లో స్థానాన్ని ఆక్రమించేశావు, ఒకే ఒక్క మాట అడుగుతాను నువ్వు నా తమ్ముడిగా , అమ్మకు కొడుకుగా మావెంట రావడానికి ఇష్టమా కాదా ..........అని అడిగి , please please ...........తమ్ముడూ ఇష్టమని చెప్పవా ........అన్నట్లు పిల్లవాడివైపు ప్రాణంలా చూస్తోంది .
మీరు అడుగుతున్నది ఇష్టం కాదు మేడం , ప్రపంచంలోనే , నా జీవితంలోనే అత్యంత విలువైన వరం , అదృష్టం ............, దానిని ఎవరైనా వధులుకుంటారా ......కానీ వద్దు మేడం చాలా మంది మీపైన వేలెత్తి చూపిస్తారు . నాకు అది ఇష్టం లేదు అని బాధతోనే చెప్పాను .
తమ్ముడూ .........ప్రక్కవాడి గురించి పట్టించుకోని ఈ ప్రపంచం గురించి మాకు అనవసరం , సూటిగా నిన్నే అడుగుతున్నాను ఈ అక్కయ్యా , అమ్మ వెంట రావడం నీకు ఇష్టమేనా .........మాకైతే నువ్వంటే ప్రాణం తమ్ముడూ........
మేడం తమ్ముడూ........అని అంత ప్రేమతో పిలవకండి ఇక్కడ తట్టుకోవడం నావల్ల కావడం లేదు అంత ఆనందం కలుగుతోంది అని గుండెను చూపించి మాట్లాడుతుంటే ..........
అమ్మా తమ్ముడికి ఇష్టమే .........అంటూ ప్రేమతో హత్తుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
ఒక అనాధను దేవతలాంటి అమ్మ , ప్రాణంలా చూసుకునే అక్కయ్య ప్రేమతో తమ వెంట పిలిస్తే ఏ భక్తుడైనా ఎందుకు వెళ్ళడు నేను మీ వెంట వస్తాను మేడం , మీరు ఏమిచెప్పినా చేస్తాను , ఎలా ఉండమంటే అలా ఉంటాను , ఒక పనివాడిలా ఉంటాను అని చెప్పాడు .
తమ్ముడూ ...........ఇంకెప్పుడూ అలా మాట్లాడకు అంటూ నోటిని ఆపి , నిన్ను మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము . అమ్మకు నేనెంతో నువ్వుకూడా అంతే ...........తల్లి నీకంటే నాకు వాడే ఎక్కువ అని తన తల్లి చెప్పడంతో పిల్లాడు ఆనందంతో నవ్వడం చూసి , 
తమ్ముడూ నిన్ను ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండేలా చూసుకుంటాము సరేనా .........
సరే మేడం...........
ఇప్పటికీ మేమంటే నీకు ఇష్టం లేనట్లుంది , మేడం అనే పిలుస్తున్నావు ...........అమ్మా , అక్కయ్యా ........అని ఒకసారి పిలు తమ్ముడూ అని ఆశతో కోరింది .
అక్క........య్యా , ఆ.......మ్మా..........అక్కయ్యా , అమ్మా..........అని పిలువగానే ,
ఇద్దరూ ఆనందబాస్పాలతో పిల్లవాణ్ణి ప్రాణంలా హత్తుకున్నారు .
ఆ పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా ఆపకుండా అక్కయ్యా , అమ్మా అక్కయ్యా అమ్మా ...........అని పెదాలపై చిన్నగా పలుకుతూనే ఉన్నాడు . 

అమ్మా మన చైన్ తోపాటు ఇక్కడ పోగొట్టుకున్న అందరి నగలు కూడా దొరికింటే బాగుండేది ప్చ్.........అని బాధపడుతుంటే ,
అక్కయ్యా ..........ఇదిగో అంటూ కర్చీఫ్ ముడివిప్పి నగల కుప్పను చూపించి , మీ చేతులతోనే అందరికీ పంచి వాళ్ళ సంతోషాన్ని ఎంజాయ్ చెయ్యండి అని చెప్పాడు .
తమ్ముడూ ..........ఈ నగలన్నీ ఎలా ఆ దొంగల నుండి తీసుకొచ్చావు . వాళ్ళు నిన్ను ఏమీ చెయ్యలేదు కదా అని కంగారుపడుతూ దెబ్బలేమైనా తగిలాయా అని ముఖం పై , తలపై , వీపుపై సున్నితంగా తడిమి చూస్తుంటే ......... 
నాకేమీ కాలేదక్కా ............ఎవరో కొంతమంది స్లీపర్ క్లాస్ చివరి భోగీకి వచ్చి కంగారు పడుతున్నారు . ఏమిటా అని చూస్తే వెనుకే సెక్యూరిటీ అధికారి ఒక్కొక్కరి క్యాబిన్ లో , టాయిలెట్లలో చెక్ చేస్తూ వస్తున్నారు . 
వారి ముఖాలు భయంతో చెమటపట్టి ఏమి చెయ్యాలో తెలియక ఇడ్లీ ఇడ్లీ టీ టీ .......అని అమ్ముకుంటూ వస్తున్న నా పొట్లాల బాక్స్ లోకి ఈ కర్చీఫ్ మూటను వేసి , రేయ్ అంటూ వాళ్ళ మొబైల్ లో నా ఫోటో తీసుకుని , మళ్లీ వచ్చి తీసుకుంటాము పొలుసుని దాటి వెళ్లిపో అని చెప్పి ఏమీ తెలియనట్లు డోర్ దగ్గర నిలబడ్డారు . 
వాళ్ళు చెప్పినట్లుగానే అమ్ముకుంటూ పొలుసుని దాటి వచ్చేసాను . సెక్యూరిటీ అధికారి వాళ్ళ దగ్గరకువెళ్లి టికెట్ చూపించమని అడిగాడు . 
స్టేషన్ వచ్చినట్లు ట్రైన్ నెమ్మదించడంతో పొలుసుని కిందకు తోసేసి తలుపు తెరిచి నెమ్మదిస్తున్న ట్రైన్ లో నుండి దుంకేశారు . సెక్యూరిటీ అధికారి లేచి వెళ్ళేసరికి వాళ్ళు చీకటిలో కనుమరుగైపోయారు .
ఇంతకీ కర్చీఫ్ మూటలో ఏముందో చూద్దామని కిందపెట్టి చూస్తే ధగధగమంటున్న నగలు , అప్పుడు అర్థమయ్యింది వాళ్ళు దొంగలు అని , వెంటనే పోలుసుకి అప్పజెబుతామని కేక వెయ్యబోయి , ఒక ప్రత్యేకమైన నగను చూసి మీదే అని అనుమానంతో భోగీలన్నీ వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాను . మీరు కనిపించారు .
అయినా ఇది నాదేనని నీకెలా తెలుసు తమ్ముడూ .......   
తిరుపతి స్టేషన్ లో నేను కిందపడినప్పుడు వచ్చి లేపి కూర్చోబెడుతున్నప్పుడు మా అక్కయ్య మెడలో చూసాను . ఇప్పుడు ఉన్న నగలలో ప్రత్యేకంగా ఉండటంతో చూడగానే కనిపెట్టాను . 
అవును తమ్ముడూ మా ముత్తాతలు వంశపారంపర్యంగా ఆ ప్రత్యేకమైన హారాన్ని బహుకరిస్తూ వస్తున్నారు . మా నానమ్మ చనిపోయే ముందు నా మెడలో వేశారు . అది పోగొట్టుకున్నానని పైనున్న నాన్న నన్ను కోపంతో తిడుతుంటే , దేవుడిలా వచ్చావు , మా తమ్ముడు బంగారుకొండ అంటూ హత్తుకొని పట్టరాని సంతోషంతో నుదుటిపై గట్టిగా ముద్దుపెట్టింది.
తమ్ముడూ అందరూ పడుకున్నారు ఎలా ఇచ్చేది అని అడిగింది . తల్లి వాళ్ళ నగల కోసం ఎప్పుడు నిద్ర లేపినా సంతోషిస్తారు , ఏమంటావు నాన్నా అని పిల్లాడిని అడిగారు . అంతే అమ్మా .........ఎన్నోసార్లు విన్నాను ఆడవాళ్లు నగల కోసం ఏమైనా చేస్తారు అని బదులివ్వడంతో , అందరూ నవ్వుకున్నారు .

ఈ మాటలన్నింటినీ దుప్పటి కప్పుకొని వింటున్నట్లు ఆతృతతో కిందకుదిగి , ఏమేవ్ ఇవి మనదగ్గర ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు . ఎవరైనా విని చెప్పినా మన హారం కూడా పోయింది కాబట్టి నమ్మరు . వీటిని వెంటనే దాచేసామంటే మనవే అయిపోతాయి అని చెబుతుంటే ,
తల్లీ కూతుళ్ళిద్దరూ అతనివైపు కోపంతో చూసి , ఏమండీ మనకు ఉన్న ఆస్తి సరిపోదా ........పరుల సొమ్ముకోసం ఆశపడితే చాలా పాపం . నా కూతురు నాకుడుకు ఇష్టప్రకారం ఎవరివి వాళ్లకు చేరేలా చేస్తాను మీరు వెళ్లి పడుకోండి అని చెప్పింది .
తల్లి నువ్వైనా చెప్పు నీకు నగలంటే ఇష్టం కదా ..........నాన్న ఇక ఒక్కమాట కూడా మాట్లాడకండి , మన కస్టార్జీతంతో లభించిన నగలంటే ఇష్టమే ఎందుకంటే అవి మనవి కాబట్టి , ఇలా పరుల సొమ్ముకోసం ఏ ఆడది ఆశపడదు అని కోపంతో బదులిచ్చింది . 
బాబు నువ్వైనా మీ........... (నోటివెంట పిలుపు రాకపోయినా నగల కోసం) మీ అక్కయ్యకు నువ్వైనా చెప్పు అని చిన్నగా బ్రతిమిలాడుతుంటే .........
ఏమండీ అది తప్పండి , మా అమ్మ , అక్కయ్య ఇష్టమే నాఇష్టం అని చెప్పడంతో ,
పిల్లాడిపై మరింత కోపంతో కిముక్కుమనకుండా పైకివెళ్లి పడుకున్నాడు.
Like Reply
తమ్ముడూ , నాన్నా థాంక్యూ sooooo మచ్ అంటూ ఇద్దరూ ఒకేసారి హత్తుకొని ముద్దులతో ముంచెత్తి , అందరికీ వాళ్ళది వాళ్లకు చేరేలా చేద్దాము పదా అని వెళుతూ ,

అమ్మా.......... నగలను చూపించగానే అందరూ మాది మాది అంటూ అక్కయ్య మీద పడిపోతేనూ అని పిల్లాడు చెప్పాడు .

అవును తల్లీ అదీ నిజమే , నా బుజ్జి నాన్నకు అక్కయ్య అంటే ఎంత ముందు జాగ్రత్త అని ముద్దుపెట్టింది .

అక్కయ్యా నాకొక ఐడియా వచ్చింది అని వివరించాడు . ముగ్గురూ బోగీలు వెతుక్కుంటూ వెళ్లి పోలుసుని కలిసి నగలను చూపించి , జరిగింది మొత్తం వివరించారు .

చాలా సంతోషం పబ్లిక్ ఇలా ఉంటే సమాజంలో ఎటువంటి అన్యాaయం జరుగదు . వెంటనే నెక్స్ట్ స్టాప్ రైల్వే సెక్యూరిటీ అధికారి స్టేషన్ లో అందించి , పోగొట్టుకున్నవాళ్ళందరికీ అందేలా చూద్దాము అని బదులిచ్చారు .

మాకు నమ్మకం లేదు సర్ , మేమిచ్చిన కంప్లైంట్ మీదగ్గరే ఉందికాబట్టి , వీటిలో ఎవరి నగనో డీటెయిల్స్ కూడా ఉన్నాయి , వాళ్ళు కూడా ఇంకా ట్రైన్ లోనే ఉన్నారు . వాళ్లకు వాళ్ళది ఇప్పటికిప్పుడు అందజేస్తే వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ .......ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతారు . ఎటువంటి పబ్లిసిటీ ఆశించకుండా ఇంత మంచి పని చేసినందుకు మీకు ప్రమోషన్ కూడా రావచ్చు అని పిల్లాడి మాటలకు ,

 సెక్యూరిటీ అధికారి తోపాటు అమ్మా , అక్కయ్యా నోరుతెరిచి ఆశ్చర్యపోయి అలా చూస్తుండిపోయారు . 

సర్ ఏమంటారు ok నా , ఆ నగలను పట్టుకున్నది మీరే అని కాస్తలో దొంగలు మిస్ అయ్యారని నేను ముందుకువచ్చి చెబుతాను . మాకు ఎవరివి వాళ్లకు చేరితే చాలు అని సెక్యూరిటీ అధికారి భుజం తడిమాడు . 

సరే పదండి అని కంప్లైంట్ లిస్ట్ తీసుకుని ముందు TC ని కలిసి అతనితోపాటు మా బోగీలోకి వచ్చాము . 

కంప్లైంట్ లో సీట్ నెంబర్ కూడా తీసుకోవటం వలన , పర్టీకులర్ ఆ సీట్ వాళ్ళ దగ్గరకువెళ్లి TC ద్వారా లేపి , వాళ్ళు చెప్పిన ఆనవాళ్లు మరియు నగలతో ఫోటోలు ఏమైనా ఉంటే చూసి వాళ్ళ నగలను వాళ్లకు చేరేలా చేసాడు . 

అంతే అందరూ సెక్యూరిటీ అధికారి చుట్టూ చేరి అభినందించారు . పిల్లాడు చెప్పిన ప్రకారమే ఫోటోలు తీసి అప్పటికప్పుడు ఫేస్బుక్ , ట్విట్టర్ , వాట్సాప్............. లలో పోస్ట్ చేసి ఫేమస్ చేసేసారు . కొంతమంది వెల్లిమరీ సెల్ఫీలు దిగారు .

సెక్యూరిటీ అధికారి అదృష్టం బాగుండి ఒక రిపోర్టర్ ట్రైన్ లో అదే బోగీలో ప్రయాణిస్తున్నాడు . ఫోన్లో మాట్లాడుతూ ఎడిటర్ గారు నేను ఇంతకు ముందు సెండ్ చేసిన పీక్స్ మరియు స్టోరీని కిల్ ఇట్ సర్ , ట్రైన్ లో ఉన్న సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ చేసిన గంటలో నగలను ఎవరిది వారికి చెందేలా చేసేసారు . మరికొద్దినిమిషాల్లో పూర్తి డీటెయిల్స్ పంపిస్తాను అని సెక్యూరిటీ అధికారి దగ్గరకువెళ్లి , sorry సర్ అంత పెద్ద దొంగతనం జరిగినా రైల్వే పొలుసులు ఏమాత్రం పట్టించుకోలేదని పేపర్లో న్యూస్ వచ్చేది . ఒక్కరే ఇంత తొందరగా మొత్తం అందరి నగలను రికవరీ చేసి వారికే అందించారు . ఇంతకీ ఇది ఎలా సాధ్యమయ్యింది అని మొబైల్ లో రికార్డ్ చేస్తున్నాడు .



ఇది నా ఒక్కడి వల్లనే సాధ్యపడలేదు . అదిగో ఆ చిన్న పిల్లాడు మరియు ఆ అమ్మాయి ధైర్యసాహసాల వలన ఎవరివి వారికి చేర్చడం జరిగింది . ఎవరు అంటూ అందరూ అక్కా తమ్ముడు వైపు చూసి ఆశ్చర్యపోతుంటే , అవును వాళ్ళిద్దరి ప్లాన్ వల్లనే ఇదంతా సాధ్యపడింది . రిపోర్టర్ సెక్యూరిటీ అధికారి తోపాటు వాళ్లదగ్గరకు వచ్చి బాబు ఏమి జరిగిందో అందరికీ వివరించగలవా అని అడిగారు . 



అందరితోపాటు మా అక్కయ్య చైన్ కూడా ఇలాగే దొంగతనం జరిగింది . మేమిద్దరమూ సెక్యూరిటీ అధికారి వెనుకే ప్రతి క్యాబిన్ వెతుకుతూ వెళ్ళాము . చివరి స్లీపర్ బోగీలో ఆ దొంగలంతా స్టేషన్ ఎప్పుడు వస్తుందా దిగి జారుకుందామని తలుపు దగ్గరే కంగారుపడుతూ వేచి చూస్తున్నారు . మన సెక్యూరిటీ అధికారి సర్ వాళ్లే అని పసిగట్టి ఒక్కరే ఆంతమందినీ ఎదుర్కోవడానికి దైర్యంగా ముందుకు వెళుతున్నారు , నిజం చెబుతున్నాను ఆ ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే వారితో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో కూడా సర్ కు తెలియదు ప్రాణాలకు తెగించారు , మా అక్కయ్య సర్ అని పిలిచి , మీరు ఆంతమందినీ అడ్డుకోగలరు కానీ మనకు నగలు కూడా కావాలి , నగలతో ఉన్నవాడు తుర్రుమంటే వాళ్లే దొంగతనం చేశారు అనటానికి సాక్ష్యం ఉండదు కాబట్టి నాతో ఒక ప్లాన్ ఉందని వివరించారు . 



నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ లో ఇన్ని కిలో మీటర్ల దూరంలో ట్రైన్ దుంకి దొంగలు పారిపోబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి , నన్ను వాళ్ళ దగ్గరకు పంపించారు . నేను  వెళ్లి సెక్యూరిటీ ఆఫీసర్లకు మీరే దొంగలని తెలిసిపోయింది , మీతో ఉన్నవన్నీ ఇచ్చెయ్యండి , మిమ్మల్ని వెతికి వెళ్ళాక మీకు ఇచ్చేస్తాను అనిచెప్పడంతో , నమ్మి నాచేతుల్లో పెట్టేసారు . తరువాత ఇంతకీ నువ్వెవరురా మేము నీకు ఎందుకు ఇచ్చాము అని లాక్కోబోతుంటే సర్ సింగం లా వాళ్ళమీదకు పరుగున వస్తుంటే అది చూసి భయపడి ట్రైన్ లో నుండి దూకి వెళ్లిపోయారు , అప్పుడు తగిలిన దెబ్బలే ఇవి , వెంటనే సెక్యూరిటీ అధికారి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వడంతో మా అక్కయ్య కట్లు కట్టారు . ఈపాటికి ఇంఫార్మ్ చేసిన పోలుసులకు దొరికిపోయి ఉంటారు . 



నేను అక్కయ్యను మరియు సర్ ను హైలైట్ చేస్తుంటే ఇద్దరూ నోరుతెరిచి నావైపు చూస్తూ కదలకుండా అలా నిలబడిపోయారు . ఆడవాళ్ళంతా అక్కయ్యను చుట్టేసి థాంక్స్ అంటూ సంతోషంతో పైకెత్తేశారు . మగవాళ్ళు సర్ ను మరియు నన్ను అభినందిస్తుంటే ..........రిపోర్టర్ పిక్స్ తీసుకున్నారు .



బాబు మనం స్టేషన్ కు ఇంఫార్మ్ చెయ్యలేదుకదా ...........

సమయం మించిపోలేదు , వేగంగా వెళుతున్న ట్రైన్ లోనుండి దూకారు దెబ్బలు తగిలి ఎక్కువ దూరం వెళ్లి ఉండరు , ఇప్పుడు స్టేషన్ కు ఇంఫార్మ్ చెయ్యండి సర్ మీకు తెలియంది కాదు అని చెప్పడంతో , రిపోర్టర్ కు ఒక్క నిమిషం అనిచెప్పి ప్రక్కకువెళ్లి కాల్ చేసివచ్చి డన్ అంటూ వేలిని చూపించి సంతోషిస్తున్నారు . 



మీవలన మా నగలు దొరికాయి లేకపోతే మా ఇంట్లో , మా అత్తయ్య గారు .........ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క sad స్టోరీని అక్కయ్యకు వివరించి థాంక్స్ చెప్పి సంతోషంతో చేతులు కలిపారు . 



రిపోర్టర్ వచ్చి పెన్నుతో రాసుకుంటూ బాబు నీ పేరు మీ సిస్టర్ పేర్లు ఏంటి అని అడిగారు .

నన్ను అందరూ బాబు అని పిలుస్తారు , మా అక్కయ్య పేరు పేరు .......అంటుంటే వాసంతి అని తన అక్కయ్యే చెప్పింది . వాసంతి .........బాగుంది అక్కయ్యా ....అంటూ చిరునవ్వుతో చూసాను . అక్కయ్య అయితే ప్రాణం కంటే ఎక్కువైన చూపుతో నన్నే చూస్తోంది . 



అర్ధరాత్రి కావస్తుండటంతో అందరూ వాళ్ళ వాళ్ళ సీట్ల దగ్గరికి అక్కా తమ్ముడు గురించే మాట్లాడుతూ వెళ్లారు . రిపోర్టర్ అక్కడ ప్రింటింగ్ ఆగిపోయింది . ఇది సెక్యూరిటీ అధికారి - పబ్లిక్ కలిసి చేసిన ఆపరేషన్ కాబట్టి మా పేపర్ కే కాదు అన్ని పత్రికలకూ పంపాలి బై అనిచెప్పి వెళ్లిపోయారు . 



బాబు ఇందులో ఏమాత్రం involvement లేని నన్ను హీరోని చేసావు . నా పేరు విశ్వ నా నెంబర్ రాసుకోండి , ఎలాంటి సహాయం కావాలన్నా నాకు కాల్ చెయ్యండి మీకు జీవితాంతం ఋణపడిఉంటాను అని వెళ్లారు .



అక్కయ్య తన మొబైల్ లో విశ్వ సర్ అని సేవ్ చేసుకుని , అమితమైన సంతోషంతో తమ్ముడూ అంటూ మోకాళ్లపై కూర్చుని మనసారా తనని హత్తుకొని ముద్దులతో ముంచెత్తి , తమ్ముడూ ఆకలివేస్తోంది .........నీకు , నువ్వుకూడా తినలేదు కదా ......., అయ్యో నాకు బుద్ధిలేదు అంటూ తలపై మొట్టికాయ వేసుకొని , రా తిందాము అని సీట్ల దగ్గరికి పిలుచుకొని వెళుతుంటే , అమ్మచూసి సంతోషంతో పొంగిపోతూ నా ప్రాణమైన పిల్లలకు అందరి దిష్టి తగిలిందేమో అని దిష్టి తీసి , మా బాబు బంగారం అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , ముందు భోజనం చేద్దాము అని కూర్చున్నారు . 

అమ్మా నాకు తమ్ముడి టిఫిన్ పొట్లమే కావాలి అని తీసి తమ్ముడూ నీకు తినిపించాలని ఆశగా ఉంది అని అడిగింది .

అంతే బాబు కళ్ళల్లో చెమ్మతో ఆనందబాస్పాలతో నోరు తెరిచాడు . లవ్ యు తమ్ముడు అంటూ తినిపించింది . అమ్మవైపు కూడా చూడటంతో లవ్ యు నాన్నా అంటూ తినిపించింది . జీవితంలో తొలిసారి ఇలా తిన్నందుకు వాడి ఆనందానికి అవధులు లేవు .

తమ్ముడూ ఇంతకీ నీ పేరు ఏంటి అని వాళ్ళ అక్కయ్య అడిగింది .

అందరూ బాబు అని పిలిచేవారు అక్కా ..........నాకు పేరు కూడా ఎవరూ పెట్టలేదు అని ఆకలిగొన్నట్లు తింటున్నాడు .

తమ్ముడూ అంటూ ప్రేమతో కళ్లలో చెమ్మతో హత్తుకొని తన తల్లివైపు చూసింది . అర్థమైంది తల్లి అంటూ మొబైల్ తీసి అలా ముందుకువెళ్లి 10 నిమిషాలు మాట్లాడి వచ్చింది .



ముగ్గురూ కడుపునిండా తిన్న తరువాత మధ్య సీట్ పైకెత్తి అమ్మా నువ్వు ఇక్కడ పడుకో అని తన తల్లికోసం arrange చేసింది . 

తమ్ముడూ మనిద్దరమూ కిందసీట్లో పడుకుందాము అని సర్దుతుంటే , అక్కయ్యా............మీరు హాయిగా సీట్లో పడుకోండి నేను పేపర్లు వేసుకుని కింద నేలపై పడుకుంటాను అని బదులిచ్చాడు . 

తమ్ముడూ ఇద్దరికీ కాదంటే చెప్పు నువ్వు సీట్లో పడుకో నేను కింద నేలపై పడుకుంటాను , అంతేకానీ నా ప్రాణమైన తమ్ముణ్ణి నేలపై పడుకొనిస్తానా..........., తమ్ముడు ఇన్నిరోజులు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క , నా తమ్ముడి స్థానం ఇక్కడ అని ప్రేమతో తన హృదయాన్ని చూపించింది .

వాడి కళ్ళల్లో ఆనందబాస్పాలతో ........అధికాదు అక్కయ్యా , ఉదయం నుండి స్టేషన్ లోనే పనిచేయడం వలన చెమట వాసన వస్తోంది అని తలదించుకొని చెప్పాడు .

అంతే అమాంతం తన తమ్ముడిని కౌగిలించుకుని , నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి ,  ఒంటి వాసనను ఘాడంగా పీల్చి నా తమ్ముడి కష్టపడటం వలన పట్టిన చెమట వాసన కూడా నాకు సుగంధభరితమే ..........చెప్పాము కదా తమ్ముడు ఈ క్షణం నుండి నీ స్థానం ఇక్కడ అని మళ్ళీ నుదుటిపై ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకొని , ఇప్పటికే ఆలస్యం అయ్యింది , మరొక 4 గంటల్లో మన ఊరు చేరుకుంటాము అంతవరకూ మీ అక్కయ్య ప్రక్కన హాయిగా పడుకో , కావాలంటే మీ అక్కయ్యను హత్తుకొని పడుకోమని చెప్పింది . 

నాకెందుకు నా కొడుకుని ప్రేమతో హత్తుకొని జోకొడుతూ నిద్రపుచ్చాలని అనిపించలేదు , తల్లి నువ్వు అదృష్టవంతురాలివి ..........ఊరికి వెళ్ళాక ఆ కోరిక తీర్చుకుంటాను అని చెప్పి మురిసిపోతోంది.

 అమ్మ మాటలకు పిల్లాడు కళ్ళల్లో చెమ్మతో తల ఎత్తి ఇద్దరివైపు ప్రేమతో చూస్తున్నాడు.

ఏమైంది తమ్ముడూ అంటూ బుగ్గలను అందుకొని ప్రేమతో అడిగింది .

ఇప్పటివరకూ ఒంటరిగా స్టేషన్ లో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకునేవాణ్ణి , అసలు ఆత్మీయుల స్పర్శ ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెరిగాను . ఇప్పుడు ఏకంగా మా అమ్మ , మా అక్కయ్య నన్ను జోకొడుతూ నిద్రపుచ్చటానికి పోటీపడుతుంటే , ఎలా స్పందించాలో తెలియక ఇలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అక్కయ్యా ............., నాకు వెంటనే ఆ మధురమైన అనుభూతిని పొందాలని ఉంది అని మాట్లాడాడు . 

 ఇక జీవితాంతం అమ్మ ,నేను రోజూ నిన్ను ప్రేమతో జోకొట్టి నిద్రపుచ్చుతాము , నువ్వు కోల్పోయిన ప్రేమను అందిస్తాము అంటూ తన గుండెలపై కౌగిలించుకుని , తమ్ముడూ నీ ఇష్టం చెప్పు మొదట నాతో పడుకుంటావా , అమ్మతో పడుకుంటావా ...........అని రెండు లడ్డూలలో ఏది కావాలి నాయనా అని తన అక్కయ్య ఆడింది .

అమ్మవైపు , అక్క వైపు ..........మార్చి మార్చి ఆశతో చూస్తూనే ఉండటంతో , 

ఒసేయ్ నీ తమ్ముడుని ఇప్పుడు నాదగ్గరకు పంపించవని తెలుసుకాని , నాటకాలు ఆడకుండా ప్రేమతో నా బుజ్జి నాన్నను జోకొడుతూ నిద్రపుచ్చు అని తియ్యని కోపంతో  అమ్మ చెప్పింది . 

లవ్ యు అమ్మా ...........అంటూ సంతోషం పట్టలేక తమ్ముడిని మరింత ప్రాణంలా హత్తుకొని తలపై ముద్దుపెట్టి , తమ్ముడూ పడుకో అని అటువైపు మూలను చూపించింది . 

అక్కయ్యా ............మీరు అటువైపు పడుకోండి నేను చివరన పడుకుంటాను అని చెప్పాడు . 

తమ్ముడూ నిద్రలో కింద పడిపోతే , అందుకే నా ప్రాణం కంటే ఎక్కువైన మా అక్కయ్యను అటువైపు పడుకోమని చెప్పింది . నాకు ఇలాంటివి మామూలే అక్కయ్యా పడినా ఏమీ కాదు అనిచెప్పాడు .

తమ్ముడూ నీకు ఏమీ కాదు , కానీ నా హృదయం తట్టుకోలేదు అని చెప్పింది . అందుకే అక్కయ్యా .........అని చెప్పబోయి తన అక్కయ్య మరింత బాదపడుతుందని అక్కడితో ఆపేసి , అక్కయ్యా నేను చెప్పిన ప్రకారం అయితే మీరు నన్ను జాగ్రత్తగా పడుకోకుండా పట్టుకుని పడుకోవచ్చు అని చెప్పాడు . 

అవును కదా నా ప్రాణమైన తమ్ముడిని మనసారా గట్టిగా హత్తుకొని పడుకోవచ్చు , నాకు కూడా ఇదే కరెక్ట్ అనిపిస్తోంది అని మూలన పడుకోబోతుంటే , తల్లి ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చి నువ్వు నా సీట్లో పడుకో అని అమ్మ ఉత్సాహం చూపిస్తుంటే , అమ్మో నేను వధులుకుంటానా తమ్ముడూ తొందరగా పడుకుందాము రా చాలామంది దిష్టి కలిగేలా ఉంది అంటూ ఇద్దరమూ నవ్వుకుంటూ ప్రక్కప్రక్కనే వాలిపోయారు .



తమ్ముడూ పడిపోతావు నావైపు రా అంటూ లాక్కుని ఇద్దరికీ భుజాలవరకూ దుప్పటి కప్పి నా చుట్టూ ఒకచేతినివేసి మరింత తనవైపుకు లాక్కుని ఆఅహ్హ్గ్......... తమ్ముడూ వెచ్చదనంతో హాయిగా ఉంది , నాతమ్ముడి చెమట వాసన కూడా బాగుంది అంటూ చెవిలో ముసిముసినవ్వులతో గుసగుసలాడి నా గుండెలపై సున్నితంగా జోకొట్టింది .

అంతే కళ్ళల్లో నుండి ఆపకుండా నీళ్లు రావడం , వెంటనే తుడుచుకుని అదేచేతిని తన అక్కయ్యపై వేసి తన గుండెలపై అదుముకున్నాడు . 

ఏమైంది తమ్ముడూ............

మా అక్కయ్య జోకొడుతుంటే నాకు మాటల్లో చెప్పలేనట్లు ఏదో అయిపోతోంది అక్కా .............., జీవితంలో ఇప్పటివరకూ ఏమి కోల్పోయానో అర్థం అయ్యింది. ఇక జీవితాంతం మా అక్కయ్య , మా అమ్మలను సేవించుకుంటూ ఇలాగే ప్రేమను పొందుతూ ఉండిపోతాను అని బదులిచ్చాడు . 

చెంపపై సున్నితంగా దెబ్బవేసి , ఇంకొకసారి ఆ మాట అన్నావంటే గట్టిగా కొట్టేస్తాను . మా అక్కయ్య ప్రేమతో నన్ను కొట్టడమే నాకు కావాలి . నా ప్రాణమైన అక్కయ్య నుండి ప్రేమ మాత్రమే కాదు , కోపం కూడా అనుభవించాలి , తిట్లు పడాలి , అప్పుడప్పుడూ దెబ్బలు తినాలి .............ఇంకా ఇంకా ..........అన్నింటినీ అనుభవించి , రాత్రికి మాత్రం ఇలా మా అక్కయ్య కౌగిలిలో కానీ , అమ్మ కౌగిలిలో కానీ హాయిగా నిద్రపోవాలి అని చెప్పాడు . అక్కయ్య సంతోషంతో ముసిముసినవ్వులు నవ్వుతూ లవ్ యు sooooooo మచ్ తమ్ముడూ అంటూ మరింత దగ్గరకు హత్తుకొని వెనుక తలపై ప్రాణమైన ముద్దుపెట్టింది .

అంతటి ప్రేమకు పిల్లవాడు వొళ్ళంతా తియ్యదనంతో జలదరించి తన అక్కయ్య చేతిని రెండు చేతులతో విడిపోనట్లు బిగించి పట్టేసుకొని , అక్కయ్యా ............. నేనెవరో తెలియదు , కలిసి కొన్ని గంటలు కూడా కాలేదు , నేను కనిపించగానే మా అక్కయ్య మాటల్లో వర్ణించలేని ప్రేమతో తమ్ముడూ అని , అమ్మ అయితే కళ్ళల్లో చెమ్మతో నాన్నా.........అని పిలిచారు . మీకు తమ్ముడంటే అంత ఇష్టమా...........,



కళ్ళల్లో చెమ్మతో అవును తమ్ముడూ ...........అంటూ మరొక చేతితో ప్రేమతో తమ్ముడి కురులను నిమురుతూ , నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాకు ఆడుకోవడానికి , ప్రేమను పంచడానికి తమ్ముడు కావాలి తమ్ముడు కావాలి అని ఏడ్చేదాన్ని , దేవుణ్ణి ప్రార్థించేదాన్ని . నెక్స్ట్ సంవత్సరమే నాకు తమ్ముడు పుట్టాడు . ఎంత సంతోషం కలిగి ఉంటుందో ఊహించుకో కానీ నెలలు నిండకముందే పుట్టినందువలన నేను నాకళ్ళతో చూడకుండానే దేవుడు తీసుకెళ్లిపోయారు . ఎంత ఏడ్చానో ఆ దేవుడికి , అమ్మకు మాత్రమే తెలుసు , దేవుణ్ణి తిట్టుకున్నాను కూడా ..........



కాలేజ్ కి వెళితే నా ఫ్రెండ్స్ తన తమ్ముళ్లు అన్నయ్యలతో సంతోషంతో లంచ్ చెయ్యడం , ప్రాణంలా చూసుకోవడం చూసి నాకు కూడా తమ్ముడు కావాలని ప్రార్థించని రోజు , క్షణం లేదనుకో ...........ఇదిగో ఇన్ని సంవత్సరాలకు నా తమ్ముడు ఈ అక్కయ్య కౌగిలిలో చేరాడు . ఉదయం కొండపై దేవుడిపై కూడా ఇన్ని సంవత్సరాల కోరికను కూడా తీర్చవా , నేనేమైనా ఆస్తులు అడిగానా , డబ్బు , నగలు ఆడిగానా ............ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడానికి బుజ్జి తమ్ముడిని అదికూడా తీర్చలేవా అని ఆడిగేసాను . అలా నా స్వచ్ఛమైన కోరికను కోరానో లేదో రైల్వే స్టేషన్లో నా ప్రియమైన తమ్ముడు కనిపించాడు . 



తమ్ముడూ అని పిలిచేంతలో నువ్వు పడిపోయావు . నా హృదయమెంత తల్లడిల్లిపోయింది , చేతులకు రక్తం చూసి వొళ్ళంతా జలదరించింది .మళ్లీ నువ్వు కనిపించేంతవరకూ హృదయం నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనేఉన్నాయి అని విని తన అక్కయ్యవైపు తిరిగి , తొలిసారి లవ్ యు అక్కయ్యా ...........అంటూ కళ్ళల్లో చెమ్మతో రెండుచేతులతో హత్తుకొని గుండెలపై వాలిపోయాడు . 

లవ్ యు తమ్ముడూ ...........అంటూ తన కన్నీళ్లను తుడుచుకుని , ఇక ఎక్కడ తిడతానో అని మా బుజ్జి బాబుని నా తమ్ముడిగా మళ్లీ కనిపించేలా ఇంతటి దొంగతనం నాటకం ఆడి మనమిద్దరినీ ఒకదగ్గరకు చేర్చాడు అని నవ్వుతూ చెప్పి నుదుటిపై ముద్దుపెట్టింది .

తన అక్కయ్య చిరునవ్వుని చూసి పిల్లాడు నవ్వి అక్కయ్యా మీరెప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి , దానికోసం మీ తమ్ముడు ఏమైనా చేస్తాడు . దేవుడా మా అక్కయ్య కోరికను తీర్చినందుకు మరియు మా అక్కయ్య పెదాలపై ఎల్లప్పుడూ చిరునవ్వు చిగురించేలా చేస్తే మళ్లీ తిరుపతికి వచ్చే అవకాశం వస్తే తలనీలాలు సమర్పించుకుంటాను అని మొక్కుకున్నాను .

లవ్ యు తమ్ముడూ ........అంటూ తన గుండెలపై హత్తుకొని ముద్దుపెట్టి , ఉదయం నుండి చాలా కష్టపడినట్లున్నావు హాయిగా నిద్రపో , రేపు మాట్లాడదాము . గాయాలు ఇంకా నొప్పిగానే ఉందా అని అడిగింది . 

మా అక్కయ్య ప్రాణమైన కౌగిలికి నొప్పి ఎప్పుడో హుష్ కాకి అని బదులివ్వడంతో ...........

నవ్వుకుని గుడ్ నైట్ కిస్ పెట్టి బుగ్గపై ఒక చేతితో వీపు వెనుక మరొక చేతితో ప్రేమతో స్పృశిస్తూ ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు.
Like Reply
తమ్ముడు దొరికాడన్న ఆనందంలో నిద్ర ముంచుకొస్తున్నా కళ్ళు మూసుకోకుండా ఉన్న ఆకాస్త వెలుగులోనే హాయిగా నిద్రపోతున్న తన తమ్ముడి ముఖాన్నే చూస్తూ తియ్యదనంతో నవ్వుతూ ప్రాణమైన ముద్దులను నిదుటిపై పెడుతూ , ఒసేయ్ మీకు తమ్ముళ్లూ అన్నయ్యలూ ఉన్నారని ఎంత ఫోజ్ కొట్టేవాళ్ళు రేపటి నుండి చూడండి , నా తమ్ముడిని ప్రపంచానికి అంగరంగవైభవంతో పరిచయం చేసి ఎంత ఎంజాయ్ చేస్తామో అని తన ఫ్రెండ్స్ ను తలుచుకొని , ప్రేమతో నిద్రపోతున్న తన తమ్ముడితో మాట్లాడుతూ మురిసిపోతోంది .



3:30 కు పెట్టిన అలారం చప్పుడు వినిపించడంతో తన వెనుక ఉంచిన మొబైల్ అందుకొని ఆఫ్ చేసింది .

తల్లి వచ్చేసామా .........అని మధ్య సీట్లో పడుకున్నా తల్లి అడిగింది .

అవునమ్మా అర గంటలో గుంటూరు చేరుకుంటాము అని బదులిచ్చింది .

నా బుజ్జి నాన్నను డిస్టర్బ్ చెయ్యకు నేను లగేజీ తీస్తాను అని నెమ్మదిగా కిందకు దిగి , హాయిగా తన అక్కయ్య గుండెలపై నిద్రపోతున్న పిల్లాడి బుగ్గపై ముద్దుపెట్టి, చైన్స్ అన్నింటినీ తీసేసి బ్యాగులన్నింటినీ ఒక దగ్గరకు చేర్చింది .

 చేతితో దుప్పటి లాగి ఏమండీ కొద్దిసేపట్లో గుంటూరు అని చెప్పడంతో , ఆతృతతో లేచి దుప్పటి మడిచి బ్యాగులో పెట్టేసి టాయిలెట్ వైపు పరిగెత్తాడు .

అమ్మా అప్పుడే గుంటూరు రావాలా .............తమ్ముడు అలసిపోయినట్లు ఘాడమైన నిద్రలో ఉన్నాడు ఇంటి దగ్గర కూడా నిద్రపోవడానికి లేదు ఫంక్షన్ కోసం పనులు స్టార్ట్ అయిపోయి ఉంటాయి అని బాధపడుతోంది .

ఒకే ఒక్క పూట తల్లి ఫంక్షన్ అవ్వగానే మీరూంలోకి వెళ్ళిపోయి మీఇష్టం రేపు ఉదయం వరకూ నిద్రపోండి అని చెప్పడంతో ..........

లవ్ యు అమ్మా ..........అని , తమ్ముడూ తమ్ముడూ...........అని ప్రేమతో పిలువగానే , 

అక్కయ్యా ............ఏమి కావాలి చెప్పండి చేసేస్తాను అంటూ లేచి కూర్చున్నాడు .

తల్లి నీ మాటే నా బుజ్జికి వేదం లా ఉంది అని , ఏమీలేదు నాన్న మనం దిగే స్టాప్ వచ్చేస్తోంది అందుకే మీ అక్కయ్య నీ నిద్ర డిస్టర్బ్ చెయ్యలేక బాధపడుతోంది . 

వచ్చేసామా .........అమ్మా లగేజీ ఎక్కడ అన్నింటినీ నేనే మోసుకుని వస్తాను అని చెప్పాడు .

నువ్వు అంతిటివాడివే తమ్ముడూ ...........నీ ధైర్యం , పరాక్రమం నిన్నే చూసాము కదా అంటూ సంతోషంతో లేచి తన తమ్ముడి భుజం పై వాలిపోయి , తమ్ముడూ నువ్వు ప్రక్కన ఉంటే నాకు ఇంకేమీ అవసరం లేదు అనిపిస్తోంది . నువ్వు ఒక్క క్షణం నాకు కనపడకపోతే ఈ హృదయం తట్టుకోలేదేమో , నన్ను విడిచి ఎక్కడికీ వేళ్ళను అని ప్రామిస్ చెయ్యి అంటూ చేతిని చాపి బుగ్గపై ముద్దుపెట్టింది .

నా జీవితం మా అక్కయ్యకే అంకితం , మా అక్కయ్య సంతోషమే నా సంతోషం ,మా అక్కయ్య కోసం ఏమైనా చేస్తాను అంటూ చిరునవ్వులు చిందిస్తూ ప్రామిస్ చేసాడు .

తమ్ముడూ నువ్వు నవ్వుతుంటే నా వొళ్ళంతా సరిగమలు పలికినట్లు ఉంది అంటూ రెండు చేతులతో చుట్టేసి , బుగ్గపై ఆపకుండా ముద్దుల వర్షం కురిపిస్తూనే ఉంది .

మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నా దిష్టినే తగిలేలా ఉంది ఇంటికి వెళ్ళగానే ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తాను , ఈ క్షణం నుండి ఎప్పుడూ ఇంతే సంతోషంతో ఉండండి అని ఇద్దరి తలలపై ముద్దులుపెట్టడం , టాయిలెట్ నుండి వచ్చిన తన భర్త జీర్ణించుకోలేక , కూర్చుంది ఇక చాలు ట్రైన్ స్టేషన్ లో ఎక్కువసేపు ఆగదు లగేజీ తీసుకుని తలుపు దగ్గరకు రండి అంటూ రెండు బ్యాగులను తీసుకుని కోపంతో వెళ్ళిపోయాడు .

మీ నాన్న , మీ నాన్నకు మరొక బిడ్డ అంటే ఇష్టం లేదు . ఆయన ఏమి అన్నా బాధపడకు కావాలంటే నాన్న అని కూడా పిలవాల్సిన పనిలేదు , నిన్ను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటాము అని అమ్మ చెప్పింది .

అమ్మా............అదంతా నేను చూసుకుంటాను కదా , నాన్న పిలుస్తున్నారు లగేజీ ఎక్కడ వెళదాము అని పిల్లాడి మాటలకు ఇద్దరూ సంతోషంతో నవ్వి , నా తమ్ముడు నా బుజ్జి బంగారుకొండ అంటూ ముద్దులతో ముంచేసి ,

అమ్మా నాకు తమ్ముడిని ఇలాగే కౌగిలించుకునే ఉండాలని ఉంది , వదల బుద్ధి కావడం లేదు అని బుగ్గపై మరొక ముద్దుపెట్టి భుజం పై వాలిపోయింది .

నా బంగారుతల్లి మిమ్మల్ని ఇక ఆ భగవంతుడు కూడా వేరుచెయ్యలేడు , స్టేషన్ బయటవరకూ మాత్రమే , క్యాబ్ ఎక్కాక మీఇష్టం , నీ తమ్ముడిని నీ గుండెలపై హత్తుకునే కూర్చో అని చెప్పడంతో , ఇక తప్పదు గనుక సరే అమ్మా అంటూ , పట్టరాని సంతోషంతో పరవశించిపోతున్న తన తమ్ముడి బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మా ట్రైన్ స్పీడ్ తగ్గేంతవరకూ ఇలాగే కూర్చుంటాము please అమ్మా ,నా తమ్ముడిని ఇలా హత్తుకుంటే నాకు సేఫ్ గా ఉంది .

అలాగే తల్లి , అయితే నేను బ్యాగులను తలుపు దగ్గరకు తీసుకెళ్లి ఉంచుతాను అని బ్యాగు అందుకుంది .

అక్కయ్యా .............అమ్మకు నేను కూడా సాయం చెయ్యనా , బ్యాగులు బరువున్నట్లున్నాయి ,

నా బుజ్జి బంగారం అంటూ వెంటనే కోపంతో చూస్తున్న తన కూతురిని చూసి , లేదు లేదు బుజ్జి నాన్నా.............తలుపు వరకే కదా , మీ అక్కయ్య చూడు నన్ను కొట్టేలా ఉంది . నేను పెట్టి వస్తానులే అంటూ సులభంగానే ఎత్తుకుని వెళ్ళింది . అలా రెండుసార్లు వచ్చి ఉన్న రెండు బ్యాగులను తీసుకువెళ్లింది . 

తమ్ముడూ నువ్వేమీ బాధపడకు , తిరుపతిలో ఉన్న రెండు రోజులు ఆ బ్యాగులను నేనే మోసాను , మీ అమ్మ ఎంజాయ్ చేసేలా చేసాను . 

అది నిజమే బుజ్జి అంటూ ప్రక్కనే కూర్చుని తన పిల్లలని కనులారా చూసి మురిసిపోతోంది . 

ఇంతలో ట్రైన్ స్టేషన్ కు దగ్గరైనట్లు వేగం తగ్గించడంతో , ప్చ్.........అంటూ తన తమ్ముణ్ణి మరింత చుట్టేసి బాధపడుతోంది . 

అక్కయ్యా ............నాన్న చెప్పినది నిజమే ఎక్స్ప్రెస్ ఎక్కువసేపు ఆగదు .

సరే తమ్ముడూ నాచేతిని వదిలి గుంపులో ఎక్కడికీ వెళ్లకు అను అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి లేచి చెయ్యి అందుకొని తమ్ముడినే చూస్తూ తలుపు దగ్గరకు చేరుకున్నారు.



మరు నిమిషంలో ట్రైన్ ఆగింది . వాళ్ళకంటే ముందు తలుపు దగ్గరకు చేరుకున్నవారు దిగిన తరువాత తలుపు దగ్గరకు చేరుకుని అప్పటికే బయట విశ్వ సర్ బాబుకు ఎదురుచూస్తున్నారు. అక్కయ్య చేతినిపట్టుకునే కిందకు దిగాడు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అనిచెప్పి , ఏదైనా నా అవసరం పడితే కాల్ చెయ్యండి అని చెప్పారు . అలాగే సర్ బై అనిచెప్పి జనాలతోపాటు బయటకు చేరుకున్నారు .

తమ్ముడూ చలి అంటూ దగ్గరకు హత్తుకుంది . 

ఏమండీ చలి ఎక్కువగా ఉంది పిల్లలు కూడా వణుకుతున్నారు , తొందరగా వెహికల్ మాట్లాడి పిలుచుకొని రండి అని చెప్పడంతో , లగేజీ అక్కడే పెట్టేసి పార్కింగ్ చేసిన వాహనాల దగ్గరకువెళ్లి బేరమాడి చాలాసేపటికి ఒక కారుని పిలుచుకొనివచ్చారు .

తన భర్త గురించి తెలిసీ కోపంతో ఏమీ మాట్లాడకుండా పిల్లలూ ముందు మీరు ఎక్కండి అని వెనుక ఎక్కించింది . 

ఎక్కి తమ్ముడూ వెచ్చగా ఉంది , నీకు నిద్రవస్తే పడుకో అని చెప్పింది . 

లేదు లేదు మా అక్కయ్య గుండెలపై ఇలాగే వాలిపోయి మాట్లాడుతూ వెళ్లాలని ఉంది అని బదులిచ్చాడు .

తమ్ముడూ నా కోరిక కూడా అదే రా అంటూ గుండెలపై వాల్చుకొని రెండుచేతులతో చుట్టేసి వెచ్చని ముద్దులుపెట్టింది . 

లాగేజీని వెనుక సెట్ చేసి నాన్న ముందర , అమ్మ తమ ప్రక్కనే కూర్చుని మా బంగారం అంటూ నా తలపై ముద్దుపెట్టి , ప్రేమతో తలపై స్పృశిస్తోంది . 

అక్కా ఇల్లు ఎంత దూరం అని పిల్లాడు అడిగాడు .

మనది గుంటూరుకు 15 km దూరంలో ఉన్న పల్లెటూరు . అర గంటలో వెళ్లిపోతాము . మన పల్లె మొత్తం ఎటుచూసినా పచ్చని పొలాలతో అందంగా ఉంటుంది . మనకు ఒక తోట కూడా ఉంది నువ్వే చూస్తావుకదా అంటూ ముద్దుపెట్టి ఊరి గురించి మాట్లాడుతూ అర గంట తరువాత కారు ఆగింది. 

ఇదే మన ఇల్లు తమ్ముడూ అంటూ విండో లోనుండి చూపించింది.



ఆశ్చర్యమైన సంతోషంతో అక్కయ్యా .........ఎంతపెద్ద ఇల్లు , 

ఈరోజు నుండి నా తమ్ముడిది కూడా అంటూ డోర్ తీసుకుని దిగారు , ఇంటి కాంపౌండ్ లో వేస్తున్న షామియానా చూసి అక్కయ్యా.........ఏదైనా ఫంక్షనా అని పిల్లాడు అడిగాడు . 

ఒక ఫంక్షన్ కాదు తమ్ముడూ రెండు ఫంక్షన్ లు ఒకటి తరువాత ఒకటి అంగరంగవైభవంతో మన ఊరి ఆత్మీయులందరి సమక్షoలో జరగబోతున్నాయి , అందుకోసం మా తమ్ముడిని రెడీ చెయ్యాలి అని నుదుటిపై ముద్దుపెట్టి , రంగయ్యా ...........అమ్మ చెప్పినవాళ్ళందరినీ పిలిపించావా .......,



ఇదిగోండి అమ్మాయిగారు ఫంక్షన్ ఏర్పాట్లవాళ్ళు వాళ్లపని వాళ్ళు చేసుకుపోతున్నారు , మంగలి వాడు , బట్టల దుకాణం వాడు ............ఇలా మీరు కోరిన వాళ్ళందరూ వచ్చారు అని బదులిచ్చి ,

 మరొక ఇద్దరు మనుషులు వచ్చి ముగ్గురినీ పలకరించి లగేజీ తీసుకువెళ్లారు . 

అమ్మ వెళ్లి ఇంటి తాళం తెరువడంతో లోపల పెట్టారు . 



మంగలివాడి దగ్గరకువెళ్లి మొబైల్ లో స్టైలిష్ హెయిర్ స్టైల్ చూపించి బాబుకి అలా హెయిర్ కట్ చెయ్యమని చెప్పి , మొబైల్ ఇవ్వబోతే ........అమ్మగారు ఒక్కసారి చూస్తే చాలు అని పిల్లాన్ని కాంపౌండ్ వెనుక లైటింగ్ ఉన్న ప్రదేశానికి పిలుచుకువెళ్లి మొదలుపెట్టాడు .

తమ్ముడూ నేను నీ ఎదురుగానే ఉంటాను అనిచెప్పి కాస్త ముందుకువెళ్లి , ఊరిలోని మరియు గుంటూరులో తనతోపాటు చదువుకుంటున్న కాలేజ్ ఫ్రెండ్స్ కు , అంత ఉదయమే వాళ్ళు నిద్రపొతున్నా మళ్లీ మళ్లీ ఎత్తేంతవరకూ కాల్ చేస్తోంది .

ఫస్ట్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకుని ఒసేయ్ ఏంటే ఇంత పొద్దున్నే చేస్తున్నావు .........anyway happy birthday అని విష్ చేసింది .

అంతే ఆశ్చర్యంతో అవునుకదా .........ఈరోజు నా పుట్టినరోజు , తమ్ముడు వచ్చిన ఆనందంలో నాతోపాటు అమ్మకూడా నా birthday మరిచిపోయింది , థాంక్స్ వే .......ఎందుకు కాల్ చేశానంటే అంటూ విషయం చెప్పి అందరూ వచ్చెయ్యండి అనిచెప్పింది  , సరేలేవే మమ్మల్ని నిద్రపోనివ్వు బై అంటూ చిరుకోపంతో కట్ చేసేసింది . 

ఇడియట్ అని చిరునవ్వు నవ్వి , రెండు ఫంక్షన్ లు కాదు ఏకంగా మూడు ఫంక్షన్ లు అని లోపల ఉన్న తన తల్లి మొబైల్ కు కాల్ చేసి విషయం చెప్పింది .

అయ్యో తల్లి............నిన్న రైల్వే స్టేషన్ లో అడుగుపెట్టేంతవరకూ గుర్తుంది , పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి అనిచెప్పింది . 

లవ్ యు అమ్మా .............కాబట్టి దీనితో కలిపి మూడు ఫంక్షన్ లు అని సంతోషంతో చెప్పింది .

అవునుతల్లి స్నానం చేసి వెంటనే అందరి ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించాలి అనిచెప్పింది . 

లవ్ యు అమ్మా ........అంటూ ముద్దుపెట్టి , బట్టల దుకాణం వాడి దగ్గరకువెళ్లి , తెచ్చిన 8 ఏళ్ల వయసు చాలా డ్రెస్ లలో తన తమ్ముడు అందంగా కనిపించే కొన్ని డ్రెస్ లను తీసుకుని ఇప్పటికి చాలు రేపు సిటీకి వెళ్లి మోడరన్ డ్రెస్ లు తీసుకుందాము ఆనుకొని , పిలువగానే వచ్చినందుకు థాంక్స్ చెప్పేసి ఆడిగినదానికంటే ఎక్కువ డబ్బే ఇచ్చి పంపింది . 



అంతలోపు హెయిర్ కట్ పూర్తవ్వడంతో చూసి wow తమ్ముడూ హెయిర్ స్టైల్ అదిరిపోయింది . స్నానం చేద్దువుగాని ఇంట్లోకి పదా అని తన రూం కు పిలుచుకొనివెళ్లి , బాత్రూం చూపించి షాంపూ , సబ్బు టవల్ అందించి ఎంతసేపయినా పర్లేదు శుభ్రన్గా స్నానం చేసి బెడ్ పై పెట్టిన కొత్తబట్టలు వేసుకో అంతలోపు నేను వస్తాను అని రూమ్ బయటకువచ్చి , ఒక అన్నయ్యను పిలిచి డబ్బు ఇచ్చి సిటీకివెళ్లి కేక్ ఆర్డర్ ఇచ్చి దానిపై ఈ పేపర్లో ఉన్నది రాయించి ఎంత తొందర వీలైతే అంతలోపు వచ్చేయ్ , టిఫిన్ కూడా అక్కడే చేసేయ్ అంటూ మరింత డబ్బు ఇచ్చింది . 

అలాగేనండి అమ్మాయిగారు అంటూ అప్పుడే తెల్లవారుతుంటే ఆటోలు వెళుతుంటాయి వెళతాను అని పరిగెత్తాడు.

హాల్ లో సోఫాలో కూర్చుని ఫ్రెండ్స్ ఒక్కొక్కరికే ఎత్తకపోయినా పదే పదే చేసి ఫంక్షన్ కు ఆహ్వానించింది. 

తల్లి నేను కూడా వెళ్లి అందరినీ ఆహ్వానిస్తాను అని చెప్పింది .

అమ్మా ఒంటరిగా వెళుతున్నావా ..........

లేదు బంగారు , ఫంక్షన్స్ గురించి మీ నాన్నకు వివరించి ఒప్పించేసాను . ఇద్దరమూ వెళుతున్నాము . బుజ్జి నాన్న రెడీ అవ్వగానే నువ్వు కూడా రెడీ అవ్వు అనిచెప్పింది.

లవ్ యు sooooooo మచ్ అమ్మా అంటూ కౌగిలించుకుంది.
Like Reply
సరే తల్లి మేము వెళ్ళొస్తాము నీ తమ్ముడికి పాలు కాచి బూస్ట్ కలిపి ఇవ్వు అనిచెప్పింది .

అవునమ్మా మరిచేపోయాను లవ్ యు అంటూ పరుగున వంటింట్లోకివెళ్లి , అప్పుడే స్టవ్ దగ్గర పాల బాటిల్ ఉండటం చూసి పాత్రలో పోసి కాచి బూస్ట్ కలుపుకుని , ఫ్రిడ్జ్ లోని బ్రెడ్ తీసుకుని తన రూంలోకి వెళ్ళింది .

అప్పటికే పిల్లాడు స్నానం చేసి టవల్ చుట్టుకొని రూంలోకివచ్చి బెడ్ పై తనకోసం చాలా బట్టలు ఉండటం చూసి సంతోషించి లవ్ యు అక్కయ్యా .........అని తలుచుకొని తనకు ఇష్టమైన షర్ట్ ప్యాంటు వేసుకుని అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుని కళ్ళల్లో చెమ్మతో మురిసిపోతున్నాడు .

ఆ దృశ్యాన్ని అప్పుడే లోపలికి ఎంటర్ అయిన తన అక్క చూసి బూస్ట్ టేబుల్ పై ఉంచి , నెమ్మదిగా తమ్ముడు వెనుకకువెళ్లి అద్దంలో చూసి , wow తమ్ముడూ బ్యూటిఫుల్ అంటూ వెనుక నుండి హత్తుకొని తలపై ప్రాణం కంటే ఎక్కువైనముద్దుపెట్టి , ముందుకువచ్చి అమ్మమ్మా............ఇక నా తమ్ముడి కళ్ళల్లో ఆనందం తప్ప కన్నీళ్ళకు చోటే ఉండటానికి వీలులేదు అంటూ చేతులతో కన్నీళ్లను తుడిచి హత్తుకుంది .

అలాగే అక్కయ్యా అంటూ నవ్వడంతో .........,

 దువ్వెన తీసుకుని చిరునవ్వులు చిందిస్తూ వెంట్రుకలను దువ్వి పౌడర్ అద్ధి స్ప్రే కొట్టి మరింత అందంగా మార్చి ఇప్పుడు చూసుకో తమ్ముడు అంటూ అద్దం వైపు చూపించింది . 

అక్కయ్యా .........ఇప్పుడు మీ తమ్ముడిలా ఉన్నాను అని బదులిచ్చాడు . 

నవ్వుకుని రా తమ్ముడూ బూస్ట్ తాగు అని సోఫాలో కూర్చోబెట్టి బ్రెడ్ బూస్ట్ అందించి , తాగి నిద్రవస్తే బెడ్ పై నిద్రపో నేను అంతలోపు స్నానం చేసి వస్తాను , ఎక్కడికీ వెళ్లొద్దు అని నుదుటిపై ముద్దుపెట్టి చెప్పింది .

మన ఇంట్లో ఫంక్షన్ ఉంది కదక్కా.........నేనెలా నిద్రపోతాను , మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా ఏదైనా చెప్పండి చేసేస్తాను అని తాగుతూనే చెప్పాడు .

మా తమ్ముడు బంగారుకొండ అంటూ అమితమైన ఆనందంతో నుదుటిపై ప్రేమతో మరొకముద్దుపెట్టి , ప్రక్కనే కూర్చుని తల నిమురుతూ మధ్యమధ్యలో ముద్దులుపెడుతూ , తమ్ముడూ ఇంతకీ ఫంక్షన్ ఏమిటో తెలుసా అని అడిగింది .

ప్చ్......     మన ఇంటి ఫంక్షన్ అనిమాత్రం తెలుసు ...........

నవ్వుకుని మరికొద్దిసేపట్లో నీకు కూడా తెలుస్తుంది , నిద్రపోకపోతే టీవీ చూస్తూ ఉండు అని టీవీ on చేసి రిమోట్ చేతికి అందించి ముద్దుపెట్టి , టవల్ మరియు తన బట్టలు అందుకొని బాత్రూం లోకి వెళ్ళింది .



బాత్రూం లోపలికి వెళ్లేంతవరకూ వెనక్కు తిరుగుతూ తన తమ్ముణ్ణి చూస్తూ ఆనందం పొందింది . తమ్ముడినే తలుచుకుంటూ సుమారు గంటపాటు స్నానం చేసి కొత్తబట్టలు ధరించి తడిచిన వెంట్రుకలను తుడుచుకుంటూ బయటకు వచ్చి చూస్తే , టీవీ చూస్తూ చూస్తూనే తన తమ్ముడు నిద్రపోయి ఉండటం చూసి , పెదాలపై చిరునవ్వుతో ప్రక్కనే వచ్చి కూర్చుని , మెల్లగా తన ఒడిలో పడుకోబెట్టుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి జోకొడుతూ తమ్మున్నే చూస్తూ అలాగే ఉండిపోయింది . 



ఊరిలోని ఆత్మీయులందరినీ ఆహ్వానించి వచ్చి తన కొడుకు తన కూతురి ఒడిలో హాయిగా నిద్రపోతుండటం చూసి సంతోషించి చప్పుడు చెయ్యకుండావచ్చి ప్రక్కనే కూర్చుని ప్రేమతో స్పృశించి ముద్దుపెట్టింది . 

అమ్మా ...........మన వాళ్ళను వారం ముందు పిలిస్తేనేగాని రారు ఈరోజు ఫంక్షన్ కు ఇప్పుడు పిలిస్తే వస్తారంటావా అని బాధపడుతూ అడిగింది .

తల్లి అందరినీ పేరుపేరునా ఆహ్వానించాము , చూద్దాము అని గుసగుసలాడి పూజ ఏర్పాట్లు చూసుకోవాలి అని మరొక ముద్దుపెట్టి ఎలావచ్చిందో అలా వెళ్ళిపోయింది .



**************



ఉదయం లేవగానే ఊరివాళ్ళంతా టీ కొట్టుకు చేరి అప్పుడే వచ్చిన అన్ని న్యూస్ పేపర్లను తిరగేస్తూ ఒక ఫోటో మరియు న్యూస్ దగ్గర ఆగిపోయి , రేయ్ సోము రాము ...........ఈ వార్త చూసావా మన గోవిందరాజు గారి కుమార్తె వాసంతి ఫోటో పేపర్లో పడింది .........

రేయ్ తిమ్మప్పా.........ఈ పేపర్లో కూడా పడింది , మన ఊరు పేరు కూడా రాశారురా...........అంటూ వచ్చిన నాలుగు రకాల పేపర్ లలో న్యూస్ చదివి , 

రేయ్ ట్రైన్ లో నగల చోరీ జరిగింది , సెక్యూరిటీ అధికారి సహాయంతో అక్కా తమ్ముళ్లు వారి చాకచక్యంతో నగలను దొంగల నుండి చేజిక్కించుకుని అప్పటికప్పుడు ఎవరివి వారికి చెందేలా చేశారట , ట్రైన్ లో ఉన్నవాళ్ళంతా అక్కాతమ్ముళ్లను పెద్దఎత్తున అభినందనలతో ముంచెత్తారు .

వాసంతికి మన ఊరంటే ఎంత అభిమానం రా .........మన ఊరి గొప్పతనం , మంచితనం గురించి కూడా చెప్పింది అని సంతోషించారు .

రేయ్ సోమయ్యా .........గోవిందరాజుకు కొడుకు లేడు కదా ఇక్కడ వాసంతి తన తమ్ముడు గురించి గొప్పగా చెప్పినట్లు రాశారు , పిల్లాడి ఫోటో కూడా ఉంది .

రేయ్ భార్యాభర్తలు ఇంటికివచ్చి తమకు తిరుపతిలో ఆ భగవంతుడే కొడుకుని ప్రసాధించాడని ఫంక్షన్ చేసుకుంటున్నామని ఇంటింటికీ వచ్చి సాదరంగా పేరుపేరునా ఆహ్వానించారు ఎక్కడికివెళ్ళావురా అని చెప్పాడు .

అవునురా నిద్రపోతుంటే మాటలు వినిపించాయి , అయితే అందరమూ వెళదామురా .........మన ఊరుపేరు పేపర్ లో పడేలా చేసిన అక్కాచెల్లెళ్లను అభినందించాలి అని అందరూ రెడీ అవ్వడానికి వెళ్లి , 9 గంటలకల్లా వాసంతి ఇంటికి చేరుకుని గోవిందరాజు గర్వపడేలా కూతురిని , ఇప్పుడు దేవుడు ప్రసాదించిన కొడుకు వచ్చాడు అని అభినందనలతో ముంచెత్తి , అర గంటలో ఊరుమొత్తం చేరుకుని అమ్మగారు మన ఊరి పేరుని రాష్ట్రమంతా తెలిసేలా చేసిన మీపిల్లలను చూడాలని ఉంది అని ఉత్సాహం చూపిస్తుంటే ,



ఆనందంతో పొంగిపోయి చాలా సంతోషం అనిచెప్పి , మొదట వంట చేస్తున్న దగ్గరకువెళ్లి పనివాళ్లకు జనాలందరినీ చూపించి అందరికీ వండమని ఆర్డర్ వేసి , పరుగున పైకివెళ్లి తన పిల్లలిద్దరూ సోఫాలోనే నిద్రపోతుండటం చూసి తల్లి కొంతమందైనా వస్తారా అని బాధపడ్డావు ఒకసారి బయటకువచ్చిచూడు మిమ్మల్ని అభినందించడం కోసం ఊరు ఊరు తరలివచ్చింది అని చెవిలో గుసగుసలాడింది .



సడెన్ గా లేచి నిజమా అమ్మా..........,

పేపర్ లోని న్యూస్ చూపించి , ఇది చూసి ఫంక్షన్ కోసం , మిమ్మల్ని అభినందించడం కోసం వచ్చేసారు తల్లి అని పిల్లలిద్దరి నుదుటిపై ముద్దుపెట్టింది .

మేము ఫ్రెష్ అయ్యి వస్తాము అమ్మా పూజ ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడిగింది .

తల్లి మీరు వస్తే పూజ మొదలెట్టడానికి పంతులు కూడా అన్ని ఏర్పాట్లు చేసేసారు అనిచెప్పి సంతోషంతో పొంగిపోతూనే బయటకువెళ్లింది .



హాయిగా నిద్రపోతున్న తమ్ముడిని మురిసిపోతూ చూస్తూ నిద్ర ఎలా లేపడం అని ఆలోచిస్తుంటే , సడెన్ గా లేచి అక్కయ్యా ..........sorry నిద్రపట్టేసింది , ఫంక్షన్ మొదలైందా అని అడిగాడు .

నా బంగారo అంటూ ఓడిలోపడుకున్న తన తమ్ముడుని అలాగే గుండెలకు హత్తుకొని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , నా బుజ్జి తమ్ముడు లేకుండా ఫంక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది అని గర్వపడుతూ చెప్పింది .

ఇదిగో అక్కయ్యా రెండు నిమిషాలలో ఫ్రెష్ అవుతాను అని లేచి ఒకసారి తన అక్కయ్యను ప్రేమతో హత్తుకొని లవ్ యు అక్కా అనిచెప్పి బాత్రూమ్లోకి వెళ్లి వచ్చాడు , తమ్ముడూ పడుకోవడంవలన డ్రెస్ మడతలు పడింది మరొక కొత్త డ్రెస్ వేసుకో అనిచెప్పి .



తన ఆనందానికి అవధులు లేనట్లు , తన తమ్ముడుకి నేనంటే ప్రాణం అని పరవశించిపోయి , కొత్త చీరను తీసుకుని తను కూడా బాత్రూమ్లోకివెళ్లి ఫేస్ వాష్ చేసుకుని చీర కట్టుకుని రూంలోకి వచ్చింది .



టీవీ చూస్తున్న పిల్లాడు సంతోషంతో లేచి అక్కయ్యా .........చీరలో దేవతలా ఉన్నారు అని ఆనందిస్తుంటే ,

లవ్ యు sooooooo మచ్ తమ్ముడూ అంటూ మురిసిపోతూ వచ్చి మనసారా గుండెలకు హత్తుకొని , తమ్ముడూ ఈరోజు మీ అక్కయ్య పుట్టినరోజు అని తియ్యని సిగ్గుతో చెప్పింది .

అక్కయ్యా.........పుట్టినరోజు శుభాకాంక్షలు అని నడుముని గట్టిగా చుట్టేసి చెప్పి , మా అక్కయ్యకు తొలి గిఫ్ట్ నేనే ఇవ్వాలి , ఏమి ఇవ్వాలి ట్రైన్ లోనైనా చెప్పలేదు అని నిరాసపడుతుంటే ,

తమ్ముడూ నువ్వు ఉన్నావు కదా .........నువ్వే నా విలువైన గిఫ్ట్ అంతకంటే నాకు ఏమికావాలో అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది .

అక్కయ్యా...........అంటూ జేబులో నుండి ఆంజనేయుడు డాలర్ ఉన్న చైన్ తీసి , అక్కయ్యా నేను పుట్టినప్పటి నుండి ఈ బంగారు చైన్ నాదగ్గరే ఉంది , బహుశా నన్ను కన్న నాతల్లి మెడలో వేసి ఉంటుంది , అదే నా ధైర్యం, ప్రాణం పోయేంతవరకూ నాదగ్గరే ఉంచుకోవాలని అనుకున్నాను . నా ప్రాణం కంటే ఎక్కువైన మా అక్కయ్య దగ్గర ఉండటం నాకు మరింత ఆనందం , ఇది మీ దగ్గర ఉంటే ఎటువంటి అపాయం రాదు , happy birthday అక్కయ్యా ...........అని అందించాడు . 

కళ్ళల్లో చెమ్మతో మోకాళ్లపై కూర్చుని లవ్ యు లవ్ యు .......తమ్ముడూ అంటూ ముద్దులతో ముంచెత్తి , ప్రాణంలా హత్తుకొని నా ప్రాణమైన తమ్ముడి తొలి బహుమతిని కాదనకూడదని తీసుకుంటున్నాను . నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు ఇచ్చేస్తాను అనిచెప్పి , నువ్వే అలంకరించమని చిరునవ్వుతో చెప్పింది .

లవ్ యు అక్కా .........happy birthday అంటూ మెడలో అలంకరించాడు .

డాలర్ మొక్కి గుండెలకు హత్తుకొని తమ్ముడూ this is the best gift of my life అంటూ గుండెలకు హత్తుకొని , అందరూ నా తమ్ముడి కోసం ఎదురుచూస్తున్నారు వెళదామా అని నుదుటిపై ముద్దుపెట్టి రెడీ అయ్యి ఒకరిచేతులు మరొకరు పట్టుకొని బయటకు వచ్చారు.
Like Reply
హాల్ లో ఏర్పాట్లు arrange చేసి పంతులు గారు అమ్మానాన్నలతో పూజ జరిపిస్తున్నారు .

అక్కాతమ్ముళ్లను చూసి లోపల ఉన్న వారందరూ వచ్చి చుట్టేసి , పిల్లాడిని సంతోషంతో పైకెత్తేసి , ఊరిలో అడుగుపెట్టడమే ఊరికి మంచిపేరు తీసుకొచ్చాడు అని సంతోషంతో అభినందించారు . బయట ఉన్నవాళ్లు పిల్లాడిని చూడటానికి మెయిన్ డోర్ దగ్గర ఎగబడుతున్నారు . 

వాసంతి ఫ్రెండ్స్ రావడంతో అమ్మాయిలందరినీ లోపలకువదిలారు , ఏంటే పేపర్లో పడ్డావు , తమ్ముడుని కూడా దేవుడి దయ వలన పొందావు , నీ పుట్టినరోజు ......ఇలా ఎన్ని సంతోషాలే నీకు అంటూ అభినందనలతో ముంచేశారు .

వాడేనా ........ఊరి అంతటికీ హీరో అయిపోయినట్లున్నాడు అని సంతోషంతో చెప్పడంతో , 

గుండెలపై చేతినివేసుకొని అవును నా తమ్ముడు హీరో అని పొంగిపోయింది .



తల్లి పూజకు ఆలస్యం అవుతుంది . నీ ప్రాణమైన నా బుజ్జిని పీలుచుకొనిరా అని చెప్పడంతో , పిల్లాన్ని కిందకు దించారు . 

తమ్ముడూ........అని పిలిచి చేతిని పట్టుకుని పూజ కోసం కూర్చున్న అమ్మానాన్నలు దగ్గరకు వెళ్లి అమ్మ అక్కయ్య మధ్యలో పిల్లాడు కూర్చున్నాడు . 

తన ఫ్రెండ్స్ అందరినీ కూర్చోమని వెనుక చూపించింది .



 పంతులు గారు బాబు అంటూ పిలిచి బొట్టుపెట్టి , నామకరణోత్సవం మొదలెడదాము అంటూ మంత్రాలు చదువుతూ పూజ మొదలుపెట్టారు . అక్కయ్యా..........ఎవరికి పేరు పెడుతున్నారు అని అమాయకంగా అడిగాడు .

ఫంక్షన్ ఏమిటి అని ఆడిగావు కదా ........మొదటిది నా బుజ్జి ప్రియమైన తమ్ముడి నామకరణోత్సవం అని చెప్పగానే , 

అక్కయ్యా ........అంటూ తన చేతిని గట్టిగా పట్టేసుకొని తన కళ్ళల్లోకే చూస్తున్నాడు.



అమ్మా ..........బాబుని ఎవరైనా ఒడిలో కూర్చోబెట్టుకోండి అని చెప్పడంతో , అమ్మ , అక్కయ్యా ఇద్దరూ పోటీపడటంతో , పిల్లాడు తల దించుకుని ఉండిపోయాడు. 

బుజ్జి నాన్నా నీకు మీ అక్కయ్య అంటేనే ఇష్టం కదా తన ఓడిలోనే కూర్చో అని చెప్పడంతో , 

థాంక్స్ అమ్మా అంటూ లేచి కూర్చున్నాడు .

లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి గట్టిగా హత్తుకుంది .

వాసంతి ఏమి పేరు పెట్టబోతున్నావో ప్లేట్ లో ఉన్న బియ్యం పై రాసి తన చెవిలో చెప్పమ్మా .........అని పంతులు గారు చెప్పారు .

తమ్ముడి చెయ్యి అందుకొని వేలితో మ .........హే.........ష్  అని రాయించి , తమ్ముడూ నీ పేరు మహేష్ అని పెదాలపై చిరునవ్వుతో చెప్పింది . 

మహేష్ ...........దేదీప్యమానం అంటూ ఆశీర్వదించి పూలు అక్షింతలు చల్లి , అమ్మానాన్నలను అందించి వేయించిన తరువాత , క్షణాలలో అందరికీ తెలిసి మహేష్ మహేష్ ............అంటూ మారుమ్రోగి అక్షింతలతో ఆశీర్వదించారు .



పంతులు గారు మహేష్ పేరుమీద అంటే నా పేరుమీద పూజలన్నింటినీ జరిపించి , ఇప్పుడు దత్తత కార్యక్రమం అంటూ మొత్తం ఏర్పాటు చేసుకుంటున్నారు .

ఏమిటో అర్థమయ్యి అక్కయ్యవైపు ప్రేమతో చూసాను .

నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ఊరి జనాలందరి సాక్ష్యంలో అమ్మకు కొడుకుగా , నాకు బుజ్జి తమ్ముడిగా దత్తత స్వీకారోత్సవం రెండవ ఫంక్షన్ తమ్ముడూ అని చెప్పగానే ,

నాకళ్ళల్లో ఆనందబాస్పాలతో అక్కయ్య వైపు చూస్తూనే ఉన్నాను .



బాబు మహేష్ వచ్చి అమ్మానాన్నల మధ్యలో కూర్చో అని పంతులు గారు చెప్పారు .

వెల్లనా అక్కయ్యా ........అని అడిగాను .

లవ్ యు తమ్ముడూ కొద్దిసేపే కదా వెళ్లు అని నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి తలపై పడిన అక్షింతలను మెల్లగా తీసేసి పంపించింది . 

ఊరందరి సమక్షంలో సాంప్రదాయం ప్రకారం దత్తత స్వీకారోత్సవం జరిపించి , లేచి దేవుడికి నమస్కరించి , బుజ్జి నాన్నా ఈరోజు నుండి నేను నీకు అమ్మ , ఈయన మీ నాన్న , అది నీ ప్రియమైన అక్కయ్య అని చెవిలో చెప్పి ఊరి జనాలందరికీ తమ కొడుకుగా నన్ను పరిచయం చేసారు .

లవ్ యు అమ్మా అంటూ కళ్ళల్లో చెమ్మతో కౌగిలించుకుని వెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చుని చేతిని చుట్టేసాడు .

అమ్మచూసి ఆనందంతో పొంగిపోయి ఇలాగే జీవితాంతం సంతోషంతో ఉండండి అని ఇద్దరికీ ముద్దులుపెట్టి , పంతులు గారు దానికోసం కూడా పూజ జరిపించండి అని చెప్పడంతో , మరొక 10 నిమిషాలు పూజ జరిపించి తథాస్తు అని అక్షింతలు వేసి పూజ ముగించారు . 

ఊరిలోని ఒక్కొక్క కుటుంబం కుటుంబం వచ్చి సంతోషంతో ఆశీర్వదించి అభినందించి బయట భోజనాలు చెయ్యడానికి వెళ్లారు .



అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ లేచి ఉదయం పంపించిన వ్యక్తి కేక్ తీసుకురావడంతో మొత్తం arrange చేసి రావే అని పిలిచారు .



తమ్ముడూ , అమ్మా అంటూ రెండు చేతులతో పట్టుకుని arrangements దగ్గరకు వెళ్లి టేబుల్ ముందు నిలబడి బాక్స్ తెరిచారు . 



కేక్ పై " happy birthday to my lovely brother మహేష్ " అని రాసి ఉండటం చూసి నాతోపాటు అమ్మ ఆశ్చర్యపోతుంటే , 

అవునమ్మా ..........నా ప్రాణమైన తమ్ముడి పుట్టినరోజును కూడా ప్రతి సంవత్సరం నా birthday రోజునే జరుపుతాను అని , కళ్ళల్లో చెమ్మతో అక్కయ్య పట్టుచీరని బిగిపట్టి పట్టుకున్న నన్ను ముందుకు పిలిచి చేతికి కత్తి అందించింది .



చాలా చాలా సంతోషం తల్లి అంటూ అమ్మ మాఇద్దరినీ కౌగిలించుకుని బుజ్జి నాన్నా , తల్లి ఇద్దరికీ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఆనందబాస్పాలతో ముద్దులుపెట్టింది .



అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ happy birthday వాసంతి , happy birthday మహేష్ ...............అని విష్ చేశారు.



తమ్ముడూ కేక్ కట్ చేసి నీకు ప్రియమైన వారికి తినిపించు అని ముసిముసినవ్వులతో చెప్పింది .

అమ్మ అక్కయ్య వైపు తియ్యని కోపంతో చూస్తుంటే , ఇద్దరమూ నవ్వుకుని కేక్ కట్ చేసాను . 

మాపై పూల వర్షం కురిపించి స్ప్రే కొట్టి గట్టిగా విష్ చేశారు .

కేక్ చేతితో తీసుకుని happy birthday అక్కయ్యా..........అని నోటికి అందించాను .

నా తమ్ముడికి నేనంటే ప్రాణం అంటూ మురిసిపోయి కేక్ అందుకొని తినిపించి ,నా ప్రాణమైన ప్రియమైన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని నుదుటిపై ముద్దుపెట్టింది .

అంతే కళ్లల్లో చెమ్మతో లవ్ యు అక్కా............అంటూ రెండు చేతులతో చుట్టేసాను. ఒక్క రోజులో అనాథ నుండి ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే అక్కయ్యా , అమ్మ మరియు ఆప్యాయంగా పలకరించే ఊరి జనం తనకు లభించడం ఇంతకన్నా జీవితంలో ఇక ఏమీ వద్దు అని ఆనందంతో పొంగిపోయాను.............
Like Reply
Bagundhi mahesh garu new story e sari mahesh ni china pilla vadini chesi chupincharu. Mi narration mundhu mundhu ela untundho chudali mari .......
[+] 1 user Likes Saradhi41's post
Like Reply




Users browsing this thread: 14 Guest(s)