Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసు పలికింది ఈ మాట BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#1
మనసు పలికింది ఈ మాట

పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
యూనివర్సిటీ లో చదువుకునే నలుగురు విద్యార్థుల మధ్య సాగే కథ. ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ. సాధారణంగా ప్రేమ కథలని ఇష్టపడని పాఠకులుండరు....   
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
#3
మనసు పలికింది ఈ మాట
అన్నెపూ
అచ్యుత్ చాలా టెన్షన్తో వైజాగ్ బీచ్ రోడ్ మీదుగా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వెనుక భూమి కదిలిపోతోందా అన్న కంగారుతో నడుపుతున్నాడు. స్పీడోమీటర్ లో ముల్లు విరిగిపోతుందా అన్న వేగంతో దూసుకుపోతున్నాడు. వైజాగ్ బీచ్ రోడ్ కి పక్కగా ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్స్ లో ఉంటున్న రాజీవ్ ఇంటికి వెళ్తున్నాడు. బీచ్ కనపడేలా ఉంటుంది రాజీవ్ బెడ్ రూమ్.  కంగారుపడుతునే కాలింగ్ బెల్ మోగించాడు. రాజీవ్ తల్లి తలుపు తీస్తూ "నువ్వా అచ్యుత రావు , రా! " అంది లోపలికి దారి ఇస్తూ.  "అచ్యుత్ అనండి ఆంటీ " అంటూ లోపలికి నడిచాడు.  పేర్ల వెనకాల ‘రావు’ వాళ్ళ వంశానికి తరతరాలుగా వస్తున్న ఆనావయితి. అచ్యుత్ నాన్న పేరు ఆనందరావు, తాత పేరు సుబ్బారావు. ముత్తాత పేరు అప్పారావు. తనకు కొడుకు పుడితే వెంకటేశ్వర రావు అని పెట్టేద్దామని డిసైడ్ చేసేసారు. కొంచెం మోడరన్ యుగంలో గడుపుతున్న అచ్యుత్ ఇంకా తన వంశంలో ‘రావు’ ని రానీయకూడదని పెద్ద ఉద్యమమే చేస్తున్నాడు. అందుకే అచ్యుతరావు కాస్త అచ్యుత్ గా మార్చుకున్నాడు.  సరాసరి రాజీవ్ గది లోకి వెళ్లి పడుకుని ఉన్న రాజీవ్ పొట్టమీద ఎక్కి కూర్చుని"ఒరేయ్ లేరా, లేరా బాబు కొంపలంటుకు పోతున్నాయ్"అన్నాడు.  “పక్కనే సముద్రం ఉంది. కావలిసినన్ని నీళ్ళు, పట్టికెళ్ళి ఆర్పుకో" అంటూ నిద్ర మత్తుతోనే ఉచిత సలహా పారేసాడు.  "అబ్బ, లేరా. ప్లీజ్ ర, నా లైఫ్ ర!"  "ఏంటిరా పొద్దు పొద్దున్నే గోల "  "పొద్దు పొద్దున్నే ఏంటిరా టైం పది అయిందిర "  “ఓ అవునా!" మళ్ళిదుప్పటి ముసుగేసాడు.  "ఒరేయ్ లేరా! ఈ రోజు చైతన్యకి పెళ్లి చూపులటర.వాళ్ళ మామ్మ ఎవరో బకెట్ తన్నేయడానికి రెడీగా ఉందట. మనవరాలి పెళ్లి చూడాలనేది ఆఖరి కోరికట. అందుకే సడన్ గా ఈ పెళ్లి చూపులటర" అంటూ ఏడుపు కొట్టు మొహం తో ఏడుపు లేకుండా చెప్పాడు.  రాజీవ్ "అయితే ఇప్పుడు ఏమంటావ్?" అన్నాడు దుప్పటి ముసుగులోంచి.  "నేనింత టెన్షన్ పడుతుంటే ... ఏమైనా ఐడియా ఇవ్వర, పడుకోకురా " అంటూ మంచం మీంచి కిందకు లాగేసాడు.  "నీయబ్బ, ! నడుం విరిగిపోయింది "  "నాకు ప్రాణం పోయేట్టు ఉంది. మతిపోతోందిర, ఏమైనా ఐడియా చెప్పరా ప్లీజ్ "  "సరే ఏం చేద్దాం? చెడగొట్టేయాలా?" అన్నాడు రాజీవ్.  ఒక వెర్రి నవ్వు నవ్వేడు ఆ ఏడుపు కొట్టు ముఖంతోనే . "అవునురా, ఏమి చేద్దాం?"  రాజీవ్ నెమ్మదిగా పైకి లేస్తూ "ఇంతకి వాళ్ళ మామ్మ ఎక్కడుంది?"  "హాస్పిటల్ ఐ.సి,యు లో ...."  "పెళ్లి చూపులు ఎన్నిటికి?"  "సాయంత్రం 5 కి... ఏంటిరా ఈ ప్రశ్నలు?"  "ఐడియా కావాలా? వద్దా?" ఇప్పుడు తను తప్ప ఇంకెవ్వడు అచ్యుత్ని ఆదుకోలేడన్న ధీమాతో .  ఒకసారి ఫై నించి కిందవరకు చూసి "కావాలి "అన్నాడు అచ్యుత్,  బీచ్ వైపు చూస్తూ "సాయంత్రం సరిగ్గా పెళ్లి చూపుల టైంకి వాళ్ళ మామ్మకి సీరియస్ అని చైతన్య ఇంటి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి చెప్పు. ప్రస్తుతానికి బయట పడచ్చు." అంటూ సలహా ఇచ్చాడు.  ఎగిరి గెంతేసాడు పెళ్లి చూపులు ఎలా అయిన ఆపేయగలననే ఆనందంతో. 
*************
[+] 4 users Like LUKYYRUS's post
Like Reply
#4
"ఒరేయ్! ఊరికి వెళ్ళేది చదువుకోవడానికే, ప్రేమలు గీమలు అంటూ ఇంట వంటా లేని పనులు చేయకు. ఆ తర్వాత నీ ఇష్టం." కొడుక్కి చెప్పింది జానకి.  "అబ్బబ్బ, మొదలెట్టావా? చదువుకోవడానికే వెళ్తున్నాను. కొత్త ఐడియాలు ఇవ్వకు" చెప్పాడు అరవింద్.  "జాగ్రత్తర మరి" కొంచెం ప్రేమతో, కొంచెం భయంతో,ఇంకొంచెం హెచ్చరిస్తున్నట్టుగా చెప్పింది.  "సరే, రేపు సాయంత్రమే నా ప్రయాణం. ఒకసారి ప్రమోదని కలిసి వస్తాను." అంటూ బయటకు వెళ్ళాడు.  పచ్చని పొలాల మద్యలో ఉంది ప్రమోద ఇల్లు. ప్రమోద తండ్రి ఓ చిన్నకారు రైతు. ప్రమోద డిగ్రీ వరకు చదివింది.అదే ఊళ్లో టీచర్ గా పనిచేస్తింది. అరవింద్ ప్రమోదలు చిన్నప్పటి నుండి స్నేహితులు. ఇంటి బయట కూర్చుని ఉన్న ప్రమోద తండ్రిని నవ్వుతు పలకరిస్తూ లోపలి నడిచాడు. ఆయన అరవింద్ ని చూసి "ప్రమోదా!! అరవింద్ వచ్చాడు చూడు. " అంటూ బయటనుండే అరిచాడు.  "ఇక్కడికి రా అరవింద్. పనిలో ఉన్నాను" అంది ప్రమోద పెరట్లో నుండి. పెరటిలోకి వెళ్లి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. "మ్! ఏంటి సంగతులు?" మొక్కలకి అంటు కడుతూ అడిగింది  "పి.జి అయింది కదా, పిహెచ్.డి కోసం వైజాగ్ వెళ్తున్నాను" అన్నాడు.  "అలాగేర, మొత్తానికి డా.అరవింద్ అవ్వబోతున్నావ్ అనమాట" అంది నవ్వుతు.  "మ్, అది సరే గాని. నీ సంగతేంటి?"  "నాకా టీచర్ జాబు చాలు. పిహెచ్.డి లు అవసరం లేదు. చదివే ఓపిక అంతకంటే లేదు" అంది చేతులు కడుగుకుంటూ.  "పోనీ నువ్వు కూడా వైజాగ్ వచ్చేయచ్చుగా. అక్కడే జాబు చేసుకోవచ్చు" మగ్గుతో ఇంకొంచెం నీళ్ళు అందిస్తూ అన్నాడు.  "మ్ ...! చూద్దాంలే! ఇప్పుడేమంత ఇంట్రెస్ట్ లేదు. అమ్మతో చెప్పావా?" అడిగింది చీరకొంగుతో చేయి తుడుచుకుంటూ.  "చెప్పాను. ఏ తల్లి అయినా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తుంది. కానీ మా అమ్మ మాత్రం అమ్మాయిలతో జాగ్రత్త అని చెప్పింది" అన్నాడు.  ఒక నవ్వు నవ్వి "అవును. అమ్మాయిలు అణుబాంబులతో సమానం. జాగ్రత్తగానే ఉండాలి." అంది  "ఒక అణుబాంబు చాలులే నాకు" అన్నాడు  "దొంగ సచ్చినోడ "అంటు వీపు మీద చెళ్ళుమనిపించింది.  "సరే!సరే! రేపు సాయంత్రమే నా ప్రయాణం. మళ్ళి వచ్చినపుడు కలుస్తాను." అన్నాడు కొంచెం దిగులుగా.  "అలాగేరా. ఇప్పుడు సినిమాలోలాగ నువ్వు డల్ గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళు. నేను అలా కళ్ళల్లో నీళ్ళతో వెళ్తున్న నీకేసి చూస్తూ ఉంటాను. కాసేపయ్యాక సన్నగా గాలి వీస్తుంది. ఆగి వెనక్కి తల తిప్పి నన్ను చూస్తావు. నేను చేయి ఊపుతూ టాటా చెప్తూ ఉంటాను. నువ్వు అలానే నడుస్తూ చేయి ఊపుతూ...."  "ఊపుతూ ... వెళ్లి అక్కడి గొయ్యిలో పడిపోతాను దరిద్రం వదిలిపోతుంది"  "హ.. హ... హ.. చాలా అందంగా నవ్వి, ఏదో ఫీల్ ఉంటుందని అలాచెప్పనురా. అయినా నీకంత సీన్ లేదు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న నీ స్థానం నీదే" అంది  "ఓకే. వస్తాను. అమ్మని చూసుకోవాల్సిన భాద్యత నీదే" అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు అరవింద్.  అనుకున్నట్టుగా ఆ తర్వాత రోజు బయలుదేరి వైజాగ్ చేరుకున్నాడు.యూనివర్సిటీకి దగ్గరగా రూమ్ తీసుకుందాం అని చాలా సేపు తిరిగాడు. యూనివర్సిటీకి కొంచెం దూరంలో ఒక ఇంటి ముందు టూలేట్ బోర్డు చూసి "సార్...ఎవరైన ఉన్నారా?" అని పిలిచాడు.  "ఎవరూ?" అంటు బయటకు వచ్చాడో పెద్దమనిషి.  "టూలేట్ బోర్డు ఉంది కదా గది ఏమైనా అద్దెకు ఇస్తారేమో అని " అన్నాడు.  "చదువుకుంటూన్నావా?" కళ్ళజోడు ఫైనుండి చూస్తూ అడిగాడాయన.  "అవునండి.పిహెచ్.డి చేయడానికి వచ్చాను"  "పెళ్లి అయిందా?"అడిగాడాయన.  "లేదండి. ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వాలి "అన్నాడు సిగ్గుపడుతూ.  "అయితే ఇవ్వటం కుదరదు " అన్నాడు ఆ పెద్దాయన.  "సార్, సార్ అలా అనకండి సార్. మూడు గంటల నుండి వెతకగా ఇదొక్కటే దొరికింది.ప్లీజ్ సార్, మీ షరతులు ఏమైనా సరే పర్వాలేదండి" అన్నాడు ప్రాదేయపడుతూ.  ఇంతలో ఆ ఇంట్లోంచి ఓ అమ్మాయి బయటకు వచ్చింది. చాలా అందంగా ఉంది.ఆ అమ్మాయి వైపు తిరిగాడు. ఏదో తెలియని ఆలోచన కదలాడింది. ఆమెకేసి అలా చూస్తూ ఉండిపోయాడు.  "అందుకే ఇవ్వనన్నాను" అన్నడా పెద్దమనిషి కొరకొర చూస్తూ .  తేరుకుని "అయ్యో! సార్ ప్లీజ్ సార్. మీరు నన్ను అపార్ధం చేసుకున్నారు. మంచివాడినండి. ఏ చెడు అలవాట్లు లేవు. బుద్ధిమంతుడు 001 అంటారండి మా ఊరిలో నన్ను. మీరు కాదంటే ఈ రోజు నా పరిస్థితి ఫుట్ పాత్ " అన్నాడు బ్రతిమాలుతూ.  అరవింద్ మాటలు విని "నాన్న, అద్దెకు ఇవ్వండి "అని చెప్పింది ఆ అమ్మాయి.  కూతురివైపు చూసి "సరే, మా అమ్మాయి చెప్తోంది కాబట్టి ఇస్తున్నాను" అని చెప్పి అద్దె వివరాలు చెప్పి అడ్వాన్సు పుచ్చుకున్నాడు,  ఆ అమ్మాయితో "థాంక్స్ అండి. మీరు కనక చెప్పకపోతే ఈ రాత్రి నా బ్రతుకు బస్టాండ్లోనే" అని అన్నాడు  ఆమె మాత్రం ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. 
* * *
[+] 4 users Like LUKYYRUS's post
Like Reply
#5
యూనివర్సిటీ మెయిన్ గేటులోకి అడుగుపెట్టాడు అరవింద్. గట్టిగా గాలి పీల్చి అంతా పరికించి చూసాడు. అక్కడ ఎప్పుడు గాలి వీస్తూ పచ్చని చెట్లు మధ్యన రోడ్ ఉంది. కార్లు, మోటార్ వెహికల్స్ ఎప్పుడు అటుఇటు వెళ్తూ ఉన్నాయి. ప్రోఫేసేర్స్ అందరు దాదాపుగా కార్లలో వస్తున్నారు. స్టూడెంట్స్ బస్ మీదుగా వస్తున్నారు. కొంతమంది బైక్ ఫై వస్తున్నారు. అరవింద్ కి ఒక చిన్న ఊరిలా అనిపించింది. అరవింద్ బయోకెమిస్ట్రీ లో పి.జి చేసాడు. పిహెచ్.డి కోసం యూనివర్సిటీలో సీట్ సంపాదించాడు. తను బయోకెమిస్ట్రీ డిపార్టుమెంటుకి వెళ్ళాలి. అక్కడే ఉన్న రూట్ మ్యాప్ ని చూసాడు. అదెప్పుడో పెయింటింగ్ వేయిన్చినదేమో సరిగా అర్ధం కాలేదు. చాలా నిశితంగా పరిశీలించిన అర్ధం చేసుకోవడం అరవింద్ వల్ల కాలేదు.  అటుగా వెళ్తున్న ఓ అమ్మాయితో "ఎక్స్ క్యూస్ మి" అని పిలిచాడు. ఆమె ఆగి అరవింద్ వైపు చూసింది.  "నేను బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి. కొంచెం దారి చెప్తారా?"అనడిగాడు.  "నేను అటే వెళ్తున్నాను.నాతోపాటు రండి" అని ముందుకి నడిచింది...  "ఏరా ఫోన్ చేసావా? ఏమైంది?" అడిగాడు రాజీవ్.  "చేశాను, కానీ ఫెయిల్ అయింది"అన్నాడు అచ్యుత్.  "ఏం ఫెయిల్ అయింది?"  "పెళ్లి చూపులు. మన ప్లాన్ కుడా. రెండు అట్టర్ ఫ్లాప్"  "అదేంటిరా?"  "ఏం చేయమంటావ్? నాకు దరిద్రం దారుణంగా పట్టేసింది. నా మీద నాకే జాలేసేస్తోంది. ప్రపంచంలో ప్రేమించిన అమ్మాయిలకు అన్నయ్యలు ఉండచ్చు కానీ బావలు ఉండకూడదు"  "అంటే...."  "అవునుర వాడు చైతన్య బావట. ఏదో పేరుకు పెళ్లి చూపులు పెట్టారంతే. ఆ డెత్ బెడ్ ఫై ఉన్న ముసల్ది ఎప్పుడో డిసైడ్ చేసేసింది అంట, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడవు అని,, అది బ్రహ్మ ముడి కాదని ఈ ముసల్దాని ముడని డిసైడ్ చేసేసిందిర" అన్నాడు అచ్యుత్ ఇరిటేటింగ్ ఫీల్ అవుతూ.  "మరిప్పుడెలా?"  "ఎలా ఏంటి ? నా బొంద. నాకేం తెలుసు ప్రేమించడం తప్ప" అన్నాడు.  "అందుకే చెప్పాను. ప్రేమలు గీమలు వద్దని. అనవసరమైన టెన్షన్స్. ఎందుకు చెప్పు మనకివన్నీ?" అన్నాడు రాజీవ్  "బాబు... .."అంటు దండం పెడుతూ "ప్రేమ నాది. టెన్షన్ నాది. ఆపుతావా ఇంకా?" అంటు తలెత్తి చూసాడు.  కొంచెం దూరం నుండి చైతన్య రావడం గమనించాడు. అచ్యుత్ వైపు చూసి వెనక్కి తిరిగాడు రాజీవ్."వీడెవడురా చైతన్యతో పాటు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాడు" అనడిగాడు చైతన్య పక్కనే ఉన్న అరవింద్ వైపు చూస్తూ.  "చైతన్య బావేమోర" అన్నాడు రాజీవ్  పొలమారినంత పని అయింది అచ్యుత్ కి "భయపెట్టకుర" అంటు వాళ్ళ వైపు చూసాడు.  అరవింద్ వైపు చూస్తూ"బావున్నాడు కదరా" అన్నాడు రాజీవ్. ముఖం మాడ్చేసిన మూకుడులా పెట్టి, కొంచెం కోపంతో రాజీవ్ వైపు చూసి, మళ్ళి అరవింద్ వైపు చూసాడు.  "అవునురా నా కంటే బాగున్నాడు." అన్నాడు అరవింద్ వైపు చూస్తూ.  "అయినా నువ్వేం కంగారుపడకు. అందం ముఖ్యం కాదు. గుణం, మంచితనం ముఖ్యం."అన్నాడు ధైర్యం చెపుతున్నట్టుగా  "ఓ! అవునా! అలా అయితే వాడికి అందం+మంచితనం+గుణం ఉన్నాయనుకో అప్పుడు?"  "అంతే, నువ్వు సింగల్ ఇడ్లీగా మిగిలిపోతావ్"  "ఒరేయ్, వాడు ఎవరో తెలుసుకోవాలిరా" అన్నాడు అచ్యుత్ ఏడుపుకొట్టు ముఖంతో.  అరవింద్, చైతన్యలిద్దరు బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి వెళ్లారు. దారిలో అరవింద్ తాను పిహెచ్.డి కోసం వచ్చానని చెప్పాడు. కాస్త పరిచయంతోనే అరవింద్ ని అన్నయ్య అని పిలిచింది. చైతన్య పి.జి చేస్తున్నట్టు అరవింద్ కి చెప్పింది. చైతన్య స్వతహాగా మంచి సంస్కారవంతురాలు,గుణవంతురాలు,నెమ్మదస్తురాలు అవడం చేత అబ్బాయిలను అంతగా పట్టించుకోదు. తన చదువు తన ఇల్లు తప్ప వేరే లోకం లేదు తనకి. సింపుల్ గా చెప్పాలంటే చైతన్య తెలుగింటి ఆడపడుచు.అరవింద్ వెళ్లి ప్రొఫెసర్ ని కలిసాడు. సాధారణంగా ప్రొఫెసర్స్ పి.హెచ్.డి కోసం వచ్చిన స్టూడెంట్స్ చేత నానా చాకిరి చేయించుకుంటారని నానుడి. కానీ అది చాలా వరకు తప్పు. అరవింద్ కి అలాట్ చేసిన ప్రొఫెసర్ మాత్రం మంచివాడు. మితభాషి. కానీ కొంచెం మూడిస్ట్. మూడ్ బాగుంటే మంచు ముక్క లేకపోతే నిప్పు కణిక. అరవింద్ అదృష్టం కొద్ది ఆ రోజు ఆయన మూడ్ బాగుంది.  "వారం రోజుల తర్వాత నీ కోర్స్ స్టార్ట్ చేస్తాను. నేను నేకు గైడ్ లైన్స్ మాత్రమే ఇస్తాను. మిగిలినవన్నీ నువ్వే చూసుకోవాలి" చెప్పాడాయన.  "ఓకే సార్. థాంక్ యు సార్" చెప్పి బయటకు వచ్చాడు.  రాజీవ్, అచ్యుత్ లు అరవింద్ కోసం బయట కాపు కాసారు. బయటకు వచ్చిన అరవింద్ ని చూస్తూ "ఒరేయ్ వీడు చైతన్య బావో కాదో? అసలీడెవాడో? ఇక్కడేం పనో? ఎలా అయినా తెలుసుకోవాలి" అన్నాడు అచ్యుత్.  రాజీవ్ "అలాగే" అని రెండడుగులు ముందుకు వేసి వెనక్కి తిరిగి వచ్చేసి "ఇప్పడు కాదు. తర్వాత కనుక్కుందాం" అంటు బండి స్టార్ట్ చేసాడు.  "అదేంటిరా?" అనడిగాడు అచ్యుత్.  "వెనక్కి చూడు" అన్నాడు, నవ్య నడుచుకుంటూ వస్తోంది "రాజీవ్...... "అని పిలుస్తోంది.  "ఏరా పాపం నిన్ను తను ప్రేమిస్తోంది కదరా " అన్నాడు అచ్యుత్.  "బాబు, నాకిష్టంలేదు. పెద్ద నసలా తయారైంది. నాతో మాట్లాడాలి. నాతో టైం స్పెండ్ చేయాలి అంటు. నేను వెళ్తున్నాను" బయలుదేరి వెళ్ళిపోయాడు.  రాజీవ్ వెళ్ళిపోవడం గమనించింది నవ్య. వీడి భాద వీడిది అని అనుకున్నాడు అచ్యుత్. 
* * *
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#6
సూర్యోదయం అవుతోంది."బ్రహ్మ స్వరూపముదయో మద్యాహ్నేతు మహేశ్వరం  సాయంధ్యాయేత్సదే విష్ణుం త్రిమూర్తించ దివాకరం" అంటు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుంటున్నాడు నిరంజన్.  నిరంజన్ సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. రోజు గాయత్రి పూజ చేసుకుంటాడు. ప్రతి పని నియమ నిబద్దలతో చేస్తుంటాడు.  తరతరాలుగా వస్తున్న ఆచారాలను, సాంప్రదాయాలను మోడరన్ యుగంలో కూడా క్రమం తప్పకుండ పాటిస్తాడు.మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు.ముక్కి సూటిగా మాట్లాడడం అతనికి అలవాటు. తన మతం ఎంత గొప్పదో ఇతరుల మతాలు కూడా అంతే అని భావిస్తాడు.మతం అంటే మనుషులు మంచి మార్గంలో ఎలా బ్రతకాలో తెలిపే విషయమే అని భావిస్తాడు. మనిషిని మనిషిగానే గుర్తిస్తాడు. మతంతో పోల్చడు. ప్రతి మతాన్ని గౌరవించే నిరంజన్ అంటే ఇరుగు పొరుగు వాళ్లకు ఎనలేని అభిమానం. క్రిస్టమస్ పండుగ వేడుకలలోను, రంజాన్ పర్వదినాలలోను వారితోపాటు ఎంజాయ్ చేస్తాడు. దేవుడు ఒక్కడే ధర్మం ఒక్కటే అని నమ్మే మనస్తత్వం కలవాడు.  నిజానికి నిరంజన్ కరకుగా కనిపించే ఆత్మీయుడు. ప్రతి మాటలోనూ ఎంతో అంతర్లీనమైన విశ్లేషణ, అనుభవం లేకపోవు. ఆచితూచి అడుగు వేసే నిరంజన్ అంటే ఇంట్లో కూడా గౌరవం ఉంది. తల్లి, తండ్రి,చెల్లెలు స్వాతి తో కలిసి అ0ద్దె ఇంట్లో ఉంటున్నాడు, తండ్రి పౌరాహిత్యం చేస్తూ ఉంటాడు. పిల్లల ఇష్టానుసారమే వాళ్ళను పై చదువులు చదివిస్తున్నాడు.  "స్వాతి, టిఫిన్ పట్టుకురామ్మ?" చెల్లెల్ని పిలిచాడు.  "వస్తున్నాను అన్నయ్య" అంటు టిఫిన్ తెచ్చి ఇచ్చింది.  "బాగా చదువుతున్నావా?" ప్రశ్నించాడు.  "చదువుతున్నాను అన్నయ్య"  "పరీక్షలు ఎప్పుడు?"  వచ్చే నెలలో, ఐనా అవేమంత ముఖ్యం కాదు" అంది మాములుగా.  చెల్లెలు వైపు చూసి "మరెందుకు కండక్ట్ చేస్తున్నారు?" అనడిగాడు.  "ఏదో ఫార్మాలిటీ కోసం" అంది చెట్నీ వడ్డిస్తూ.  "ఎవరలా ఫార్మాలిటీ కోసం కండక్ట్ చేస్తోంది? నేనొచ్చి మాట్లాడాలా?" కొంచెం సీరియస్ గానే అడిగాడు.  స్వాతి కంగారు పడింది. "అది కాదు అన్నయ్య, మిడ్ ఎగ్జామ్స్ కదా అని అలా అన్నాను" అంది.  "ప్రతి పరీక్ష ఫైనల్ పరీక్ష అనుకుని చదవాలి. వ్రాయాలి. అప్పుడే చదివిన దానికి ఫలితం ఉంటుంది" చెప్పాడు.  "అలాగే అన్నయ్య" అంది .  "అమ్మా! ఎదురురా, యూనివర్సిటీ కి వెళ్లి వస్తాను" అని తల్లిని పిలిచాడు.  తల్లి ఎదురు వచ్చింది. యూనివర్సిటీ కి బయలుదేరాడు. నిరంజన్ మైక్రోబయాలజీలో పిహెచ్.డి చేస్తున్నాడు.నిరంజన్ మొబైల్ కి మెసేజ్ వచ్చింది" బస్ స్టాప్ దగ్గర ఉండు , వస్తున్నాను." అని . ఆ మెసేజ్ మానస పంపించింది. మానస నిరంజన్ లు ప్రేమించుకుంటున్నారు.  దాదాపు 15 నిమిషాలు వెయిట్ చేసాడు "ఇంకా ఎంతసేపు?" మెసేజ్ పంపాడు.  "ఆన్ ది వే " రిప్లై ఇచ్చింది.  "నేను ఎంత టైం పడుతుంది అని అడిగాను" అని రిప్లై ఇచ్చాడు.  "వెనక్కి తిరిగి చూడు" రిప్లై ఇచ్చింది.  ఆరంజ్ కలర్ డ్రెస్ లో మానస చాలా అందంగా నడుచుకుంటూ వస్తోంది. బండి స్టార్ట్ చేసి "ఎక్కు,ఇప్పటికే లేట్ చేసావ్." అన్నాడు. మానస నిరంజన్ భుజంపై చేయి వేసి ఎక్కి కూర్చుంది.  "నీ బండి ఏమైంది ఈరోజు?" అనడిగాడు.  "కావాలనే తేలేదు. నీతో పాటు వెళ్దామని " అంది  "ఈ రోజు ఏమి క్లాసెస్ నీకు?" అనడిగాడు.  "అడిగావా? ఇంకా చదువు గురించి అడగలేదేంటా అనుకున్నాను. మాథ్స్ క్లాసు " చెప్పింది  "ఆ తర్వాత?" అన్నాడు.  "అబ్బ! నా టైం టేబుల్ నేకు రాసి ఇస్తాను.నన్ను అడగకు ప్లీజ్, చిరాగ్గా ఉంటుంది నాకు. కాస్త ప్రేమగా మాట్లాడుదాం అని ఏంలేదు నీకు? కనీసం ఏమైనా తిన్నావా అని అడుగుతవేమో అని చూస్తాను" అంది కొంచెం అలిగినట్లుగా. మానసను మాథ్స్ క్లాసు దగ్గర దించేసి తన డిపార్ట్మెంట్ కి తను వెళ్ళిపోయాడు. తన క్లాసు ముగించుకుని బయటకు వచ్చేసరికి అచ్యుత్ సంజీవులు అక్కడ కనిపించారు.  వాళ్ళ దగ్గరకు వెళ్తూ "ఏరా, క్లాసుకి వెళ్ళలేదా?" అనడిగాడు నిరంజన్.  "వెళ్లాం బాబు. ఇప్పుడు ఖాళి" అన్నాడు అచ్యుత్.  "మరిక్కడెం చేస్తున్నారు?" ప్రశ్నించాడు  "మనవాడి ఫాన్స్ కోసం వెయిటింగ్" చెప్పాడు రాజీవ్.  "ఓ చైతన్య కోసమా?" అన్నాడు నిరంజన్. అవునన్నట్టు తలూపాడు అచ్యుత్.  చైతన్య మళ్ళీ అరవింద్ తో పాటు నడుచుకుంటూ వస్తోంది. "వీడెవడురబాబు. చైతన్య ఎక్కడ ఉంటే అక్కడే ఉంటున్నాడు" అన్నాడు అచ్యుత్ కొంచెం భయంతో. అరవింద్ కేసి చూసారు ముగ్గురు.  "ఏమైందిరా?" అనడిగాడు నిరంజన్. జరిగిన విషయం అంతా చెప్పాడు రాజీవ్. అంతా విని "అయితే ఇతను చైతన్య బావ కాకపోవచ్చు" అన్నాడు నిరంజన్.  "నిజంగానా?" వెర్రి ఆనందంతో అడిగాడు అచ్యుత్.  "వాడు కాకపోవచ్చు అన్నాడు. పూ...ర్తి...గా... కాదు అని అనలేదు" ఫీజు పీకేసాడు రాజీవ్.  "ఉండు నేను కనుక్కుంటాను" అని అడుగు ముందుకు వేసాడు నిరంజన్.  లాటరీ టికెట్ నెంబర్ రేడియోలో వింటున్నంత టెన్షన్ పడ్డాడు అచ్యుత్.  "ఏం అవదురా.. కంగారుపడకు" అన్నాడు రాజీవ్.  నిరంజన్ అరవింద్ వైపుగా నడవడం ప్రారంభించాడు...అప్పుడే అరవింద్ కి ఇంటి ఓనర్ కూతురు కనిపించింది. చైతన్యకు బాయ్ చెప్పేసి "హలో, ఏమండి?" అని పిలిచాడు ఆ అమ్మాయిని. ఆమె వెనక్కి తిరిగి చూసింది.  "ఒక్క నిమిషం.." అంటూ ఆమె వైపుగా అడుగులు వేసాడు అరవింద్. నిరంజన్ వీరిద్దరికేసి చూసాడు. తన పనిని విరమించుకుని వెనక్కి వచ్చేసాడు.  "ఏరా ఏదో వీరుడిలా వెళ్ళావ్. మడమ తిప్పావేంటి?" అన్నాడు అచ్యుత్  "ఛ! అంతలేదు. 99.9% వాడు చైతన్య బావ అయితే కాదు. నా అంచనా నిజమైతే అతను యూనివర్సిటీకి కొత్త స్టూడెంట్ అయి ఉంటాడు. మేఘనను పిలుస్తూ అటు వెళ్ళాడు" చెప్పాడు నిరంజన్.  "మేఘననా?" అన్నారు ఇద్దరు ఒక్కసారిగా వాయిస్ లో వాల్యూం పెంచుతూ."పాపం ఏ జన్మలో ఏ పాపం చేసాడో ?" అనుకున్నారు ముగ్గురు నవ్వుకుంటూ .అరవింద్ మేఘన దగ్గరకు వెళ్ళాడు."హాయ్ అండి. ఏంటండి మీరు అసలు ఎవ్వరితోను మాట్లాడరా?" అనడిగాడు. ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ నుంచుంది. అరవింద్ కుడా ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉండిపోయాడు. అస్సలు చూపు తిప్పలేదు."ఏంటి అలా చూస్తున్నావ్?" కళ్ళు పెద్దవి చేస్తూ వచ్చాయామాటలు మేఘన నుండి."హమ్మయ్య, మాట్లాడారా. థాంక్స్. నా పేరు అరవింద్. మీ పేరు?" అనడిగాడు.సమాధానం లేదు మేఘన నుండి. " చెప్పండి" అన్నాడు నవ్వుతు."మేఘన" అని చెప్పింది.మేఘన తనలో తానే అనుకుంటూ "చాలా బాగుంది మీ పేరు" అన్నాడు " మీరెంటండి ఇక్కడ?" అని అడిగాడు మళ్ళీ."నాకు క్లాసుకి టైం అయింది.నేను వెళ్ళాలి" అని చెప్పి వెళ్ళిపోయింది. తను చెప్పదలచుకున్నది డైరెక్ట్ గా చెప్పదని, ఈమెది టిపికల్ మెంటాలిటీ అని "తను ఇక్కడ చదువుకుంటున్న విషయం, ఇక నన్ను వదులుతావ అన్న మాటను కలిపి ఒకే మాటలో "నాకు క్లాసుకి టైం అయింది.నేను వెళ్ళాలి" అని చెప్పిందని అర్ధం చేసుకున్నాడు. వెళ్తున్న ఆమెకు దారి ఇచ్చాడు ..ఆలోచనలను ఆపు చేస్తూ!! అలానే ఆమె వైపు చూస్తూ!!కొంతకాలం అందరి జీవితాలు మాములుగానే గడిచిపోయాయి. అందరికంటే అరవింద్ జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుందని అరవింద్ కి తెలియదు."భవిష్యత్తు తెలిసిపోతే అది జీవితం కాదు. గతం మరిచిపోతే భవిష్యత్తుకి పునాది లేదు"ఓ రోజు ఉదయం కళ్ళు తెరుస్తూ పిల్లి పాలు తాగేయడం చూసాడు అరవింద్. ఉష్ ఉష్ అని పిల్లిని తరిమాడు. అది దాదాపుగా అన్ని పాలు తాగేసి మూతి నాకుకుంటూ వెళ్ళిపోయింది. ఇదేం కర్మరా బాబు అని అనుకున్నాడు. కిందకు వెళ్లి "ఏమండి మేఘనగారు" పిలిచాడు. తను బయటకు వచ్చింది."పిల్లి పాలు తాగేసిందండి" అని చెప్పాడు.కోపంతో చూసింది 'దానికి నన్నేం చేయమంటావ్' అన్నట్టుగా. మేఘన కళ్ళల్లో అంతరార్ధం అర్ధమయి "అంటే మీ ఇంట్లో పాల ప్యాకెట్ ఉంటే ఇవ్వండి. సాయంత్రం కొనేసి ఇస్తాను" అన్నాడు."లేవు" అని చెప్పి లోపలి వెళ్ళిపోయింది. తిరిగి మేడ మీదకు నడిచాడు."అదేంటమ్మ, పాల ప్యాకెట్ ఇవ్వచ్చుగా" అంది తల్లి."ఈ రోజు పాల ప్యాకెట్, రేపు టిఫిన్, ఎల్లుండి భోజనం అంటాడు. కందిపప్పు నుండి జీడి పప్పుదాక అరువులు ఇవ్వాలి. ఇదో కిరణా దుకాణం అయిపోతుంది."అంది మేఘన. కూతురి మనస్తత్వం తెలిసిన తల్లి ఏమి మాట్లాడకుండా తలూపి ఊరుకుంది. మేఘన మాటలు విని నవ్వుకున్నాడు అరవింద్. ఆశ్చర్యపోయాడు కుడా!!ఒకసారి ఇలానే ప్రమోద పాలు లేవని వెళ్తే కాఫీ పెట్టి ఇచ్చింది. వేరేగా పాలు కాచి తోడు చుక్క వేసి ఉంచింది. సాయంత్రం కాలేజీ నుండి వచ్చాక ఆ పెరుగు ఇచ్చింది. ఆ విషయాన్నీ తలచుకుంటూ ఆ ఆలోచనలతో ఇంటి నుండి బయట పడ్డాడు.యూనివర్సిటీ లో సెంట్రల్ కాంటీన్ ఉంది. అక్కడకు వెళ్లి టీ ఆర్డర్ ఇచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. "ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ సార్" అరిచాడు టోకెన్ ఇచ్చేవాడు. వెళ్లి టీ తెచ్చుకుని అదే కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయ్. అరవింద్ టీ తాగుతుండగా నిరంజన్, రాజీవ్, అచ్యుత్ లు ముగ్గురు అక్కడకి వచ్చి ఆ మూడు కుర్చీల్లో కూర్చున్నారు. ఏమి మాట్లాడకుండా అలానే అరవింద్ వైపు ఎగాదిగా చూసారు. వాళ్ళ వైపు చూసి "ఎవరు మీరు ? ఏమి కావలి?" అనడిగాడు అరవింద్."చైతుకు నీకు సంబంధం ఏంటి?" అడిగాడు అచ్యుత్."చైతు ఎవరు? " ప్రశ్నించాడు."నాటకాలా? మొన్న కూడా నిన్ను చైతన్యతో చూసాం" అన్నాడు రాజీవ్."ఓ తనా? మంచి అమ్మాయి. నాకు తెలుసు" అన్నాడు అరవింద్."ఏం తెలుసు?" చాలా చిరాగ్గా అడిగాడు అచ్యుత్."అబ్బ, ఎందుకండీ కంగారు పడుతున్నారు. మీరేమైనా బ్రిడ్జి కడుతున్నారా. అదే ప్రేమ వంతెన" అనడిగాడు అరవింద్."అవును" అన్నాడు అచ్యుత్ కొరకొర చూస్తూ."అలా అయితే కంగారుపడకు బావ" అన్నాడు అరవింద్ నవ్వుతూ. అరవింద్ అలా బావ అని పిలిచేసరికి అచ్యుత్ కి పట్టరాని ఆనందం వచ్చేసింది. లాటరీ టికెట్ తగిలేసినంత ఉత్సాహం, గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టేసినంత సంతోషం అనిపించింది. "థాంక్స్ బాస్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ "అచ్యుత్" అని పరిచయం చేసుకున్నాడు. రాజీవ్ నిరంజన్ లు కూడా తమని తాము పరిచయం చేసుకున్నారు. అందరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.నలుగురు నవ్వుతూ లేవబోతుండగా ఒకడు కంగారుగా పరిగెత్తుకుంటూ కాంటీన్ లోకి వచ్చి వీళ్ళ నలుగురి వెనకాల నుంచున్నాడు. సుధీర్ హాకి స్టిక్ పట్టుకుని ఇంకో నలుగురు కుర్రాళ్ళతో కలిసి కాంటీన్ లోపలి ప్రవేశించి "ఒరేయ్!ఎక్కడ దాక్కున్నావ్ ర? దమ్ముంటే బయటకు రారా. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలికి లవ్ లెటర్ ఇస్తావురా? చంపేస్తానుర నిన్ను." అని అరుస్తూ వీళ్ళ వైపు తిరిగి "ఇప్పుడే ఒకడు ఇటుగా పరిగెత్తుకొచ్చాడు నువ్వేమైన చూసావా?" అని అరవింద్ ని అడిగాడు."అన్న ప్లీజ్ అన్న ఎలా అయిన నన్ను కాపాడు అన్నా" అని వెనకన ఉన్నవాడు బ్రతిమాలాడు.అరవింద్ ముందుకు అడుగు వేయబోయాడు. నిరంజన్ అరవింద్ భుజం పట్టుకుని ఆపి వద్దు అన్నట్టుగా తలూపి " వాడు ఇక్కడ పెద్ద రౌడి, గొడవలొద్దు" అని హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు. అరవింద్ నిరంజన్ వైపు చూసి "నాకు క్లాసు కి టైం అయిందిరా" అన్నాడు. ముగ్గురు నిర్ఘాంతపోయారు. సుధీర్ మనుషులందరినీ పరికించి చూసి వాళ్ళ దగ్గరకు వెళ్లి అతను అలా బోటనీ డిపార్ట్మెంట్ వైపుకి వెళ్ళిపోయాడు అంటూ తప్పుదారి పట్టించాడు. వాళ్ళందరూ అటువైపుగా వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి నవ్వేడు. వాళ్ళు కూడా నవ్వుకున్నారు ఆశ్చర్యంలోంచి తేరుకుంటూ.సాయంత్రం అందరు అదే కాంటీన్ లో కలుసుకున్నారు. నిరంజన్ మానసను పరిచయం చేసాడు. "కాని ఉదయం నీ బిల్డ్ అప్ చూసి యాక్షన్ సీన్ ఎక్స్పెక్ట్ చేసాను" అన్నాడు రాజీవ్. అరవింద్ "అవునా" అన్నాడు నవ్వుతు. "ఇంతకి ఎవరా సుధీర్?" అడిగాడు టీ గ్లాస్ అందుకుంటూ."వాడో వేస్ట్ గాడు . స్టూడెంట్ లీడర్. వాడికో చెల్లెలు ఉంది.అదంటే వాడికి ప్రాణం. ఆమెకు ఏమైనా అయినా, ఎవరైన ఆమెను ఏమైనా అన్నా చావగొట్టడం వాడికి అలవాటు" చెప్పాడు అచ్యుత్ ప్లేట్ లో బిస్కెట్ తీసుకుంటూ ."చెల్లెలుపై ఆ మాత్రం ప్రేమ ఉండటం మంచిదేగా" అన్నాడు అరవింద్."మంచిదే కాని ఆమె సరిగ్గా ఉండాలి కదా. ప్రపంచంలోకెల్లా తనే అందగత్తేనని ఆమె ఫీలింగ్" అంది మానస."ఆడవాళ్ళ మనస్తత్వం అంతేగా మరి" అన్నాడు టీ తాగుతూ."అయిన ఇప్పుడు నీకు చెప్పిన అర్ధం కాదులే. ముందు ముందు నీకే తెలుస్తుంది" అంది మానస."సరేలే , ఇంతకి ఆమె పేరు ఏంటి?" "మౌనిక….." చెప్పాడు నిరంజన్.
* * *
[+] 4 users Like LUKYYRUS's post
Like Reply
#7
ఆ తరువాత రోజు మాములుగా యూనివర్సిటీ కి బయలుదేరాడు అరవింద్.మేఘన కూడా అప్పుడే బయలుదేరడం గమినించాడు. కానీ ఏమి పట్టనట్టుగా మెట్లు దిగి బయటకు నడిచాడు. మేఘన అరవింద్ వెనకాల నడుచుకుంటూ వెళ్తోంది. మేఘన నీడ అరవింద్కి దగ్గరగా ఉంది కాని కొంచెం వెనకగా ఉంది. అలా కొంతదూరం నడిచాక కొంతమంది కుర్రాళ్ళు అటుగా పోతు మేఘన వైపు అరవింద్ వైపు చూస్తూ ఏవో కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది గమనించిన మేఘన నడక ఆపేసింది.అరవింద్ ఆగిన నీడను చూసి వెనక్కి తిరిగి గుడ్లు మిటకరించి చూస్తున్న మేఘనతో "ఏమయిందండి?" అని అడిగాడు. అలానే అరవింద్ వైపు చూస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా అరవింద్ ని దాటుకుని వెళ్ళాక తాను నడవడం ప్రారంభించింది. ఈ సారి అరవింద్ నీడ మేఘనను ఫాలో అవడం మొదలయింది. మళ్ళి కొంతమంది కుర్రాళ్ళు ఇటుగా వెళ్తూ వాళ్ళని చూస్తూ ఏవో కామెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నడవడం ఆపేసి వెనక్కి తిరిగి చూసింది సీరియస్ గా."మళ్ళీ ఏమైందండి?, ఏమైనా ప్రాబ్లెమా?" అని అడిగాడు."నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావ్?"అని అడిగింది."నాన్ సెన్స్ . నేను ఫాలో అవడం ఏంటి? మీరే కదా నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్లారు?" అన్నాడు"నా వెనకాల రాకండి అంతే" అంది"చుడండి. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు" అన్నాడు కొంచెం కోపంతోనే. అలానే అరవింద్ వైపు చూస్తూ రోడ్ అటు వైపు కి దాటుకుంటూ వెళ్ళింది. అరవింద్ కి చాలా చిరాకుగా అనిపించింది."ఏంటిరా బాబు ఇది" అనుకున్నాడు మనసులో. తను ఏమి జరగనట్టు నడవడం మొదలెట్టింది. రోడ్ కి ఇరువైపుల సమాంతరంగా వెళ్తున్నారు ఇద్దరు. మద్యలో ఎందుకో ఆదమరపుగా మేఘన్ వైపు చూసాడు . ఆమె కూడా చూసింది."ఏంటలా చూస్తున్నావ్?"అడిగింది. సమాధానం ఇవ్వకుండా నవ్వుకున్నాడు. రాజీవ్ అటుగా వెళ్తూ వీళ్ళని గమనించి అరవింద్ దగ్గర బండి ఆపి "ఎక్కు అరవింద్." అన్నాడు. అరవింద్ బండి ఎక్కి వెళ్ళిపోయాడు.బండి మీద వెళ్తూ "ఇంతకి చెప్పనే లేదు ఎక్కడ ఉంటున్నావు?" అనడిగాడు రాజీవ్."అదే మేఘన ఉందే, మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఫై పోర్షన్ లో అద్దెకు ఉంటున్నాను" చెప్పాడు."చచ్చావ్ పో " అన్నాడు రాజీవ్."ఏం? ఎందుకు?" అని అడిగాడు అరవింద్."అదో మెంటల్ కేసు. ఎప్పుడెలా ఉంటుందో దానికే తెలీదు. దాని ఇంట్లో ఉండే బదులు ఏ అండమాన్ జైలులోనో, తీహార్ జైల్లోనో ఉంటే కొంతలో కొంత హ్యాపీగా ఉండచ్చు"చెప్పాడు రాజీవ్."అవును. ఆమెది టిపికల్ మెంటాలిటీ. నేను గమనించాను" అన్నాడు అరవింద్."ఎందుకు చెప్తున్నానో అర్ధం చేసుకో. ఆ ఇల్లు ఖాళి చేసేయ్. మా ఫ్రెండ్స్ ఇంతకు ముందు అలానే ఉండేవారు. ఒకరోజు పాపం ఒకడికి మోషన్స్ పట్టుకున్నాయ్. మాటి మాటికి బాత్రూంకి వెళ్తున్నాడు నీళ్ళు అయిపోతున్నాయని బాత్రూం తలుపు తాళం పెట్టేసింది. పిచ్చిది. పాపం వాడు అగ్గగ్గలాడిపోయాడు. వాడి బాధ వర్ణనాతీతం. గోడలు పట్టుకుని నడిచాడంటే నమ్ము. తర్వాత వాళ్ళ నాన్నే పాపపరిహారంగా హాస్పిటల్ లో చేర్పించి వైద్యం చేయించాడు." అని చెప్పాడు రాజీవ్.యూనివర్సిటీ చేరుకొని ఎవరి క్లాసు కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం క్లాస్లు ముగించుకుని లంచ్ టైం కి అందరు కాంటీన్ లో కలిసారు. "హాయ్ మౌనిక!" అని పిలుపు వినిపించింది అందరికి.అరవింద్ తల తిప్పి చూసాడు......యూనివర్సిటీ చేరుకొని ఎవరి క్లాసు కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం క్లాస్లు ముగించుకుని లంచ్ టైం కి అందరు కాంటీన్ లో కలిసారు. "హాయ్ మౌనిక!" అని పిలుపు వినిపించింది అందరికి.  అరవింద్ తల తిప్పి చూసాడు.  అందాల బొమ్మ, దేవలోకం నుండి అప్సరస దిగి వచ్చినట్టుంది. ఒక్కొక్క సొగసు ఒక్కొక్క వింతలా అనిపించాయి. రెప్ప వేయలేని అందం ఆమెది. బ్రహ్మ దేముడు 10 ఏళ్ల పాటు అన్నపానియాలు మానేసి తయారుచేసాడేమో అనుకున్నాడు. ఆమెను వర్ణించడానికి తెలుగులో పదాలు లేవు. పాలరాతి శిల్పం అనాలో, పాలతో కడిగిన ముత్యం అనాలో తెలియడం లేదు అరవింద్ కి. "అబ్బ ఏం అందం? ఎవడు చేసుకుంటాడోగాని” అని ప్రతి మగాడు అనుకేనేట్టుగా ఉంది ఆ అమ్మాయి అందం.  "ఇంక చాలు" అన్నాడు రాజీవ్.  "చూస్తున్న కొద్దీ ఏదో కొత్తదనం ఉందిరా ఆమెలో" అన్నాడు అరవింద్.  "ముందు అలానే ఉంటుంది వాళ్ళ అన్నకు తెలిస్తే అప్పుడుంటుంది. వెళ్దామా?" అంటూ లేచాడు నిరంజన్. అందరు అక్కడినుండి బయలుదేరారు.  అరవింద్ ఇంటికెళ్ళేసరికి రాత్రి 9 అయింది. గేటు తీసుకుంటూ లోపలికి వెళ్తుంటే మేఘన గమనించి బయటకు వచ్చి "ఏంటి లేటుగా వచ్చావు?" అని అడిగింది. కొంపతీసి నాకోసం ఎదురుచుస్తోందా ఏంటి? అని అనుకున్నాడు మనసులో.  "రాజీవ్ కి ఏదో డౌట్ అంటే వాళ్ళింటికి వెళ్లి చెప్పి వస్తున్నాను" అని చెప్పాడు.  "భోజనం చేశావా" అని అడిగింది.  ఆశ్చర్యపోయాడు తను సరిగ్గానే విన్నాడా లేక తప్పుగా విన్నాడా అని. కానీ వెంటనే తేరుకుని "లేదండి" అన్నాడు. మేఘన ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అరవింద్ మాములుగా మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుని తువ్వాలు దండెంఫై వేయడానికి బయటకు వచ్చాడు. మెట్లు ఎక్కుతూ మేఘన రావడం గమనించాడు.  ఆమె చేతిలో క్యారేజి ఉంది. "ఏంటండి ఇది ?" అనడిగాడు.  "మీరు ఏమి తినలేదన్నారుగా, అందుకే భోజనం పట్టుకొచ్చాను" అంది.  ఆ రోజు పిల్లి పాలు తాగేసింది అంటే పాల ప్యాకెట్ ఉన్న లేదని చెప్పింది. ఈ రోజు అడగకుండా భోజనం తెచ్చిందేమిటి. ఏది ఏమైనా మనసులో ఆమెపై అభిమానం కలిగింది."కూర, పులుసు, పెరుగు కూడా తెచ్చాను తినండి" అంటూ బల్లపై పెట్టి వెళ్లిపోబోతున్న మేఘనతో "మేఘన గారు, కంపెనీ ఇవ్వచ్చుగా మీకు అభ్యంతరం లేకపోతేనే" అన్నాడు. కాసేపు ఆలోచించి అలాగే అని అంది. ఆరుబయటే భోజనం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆమెకు కూడా కుర్చీ వేసి కూర్చోమని చెప్పి, లోపలికి వెళ్లి కంచం మంచినీళ్ళు తెచ్చుకుని కూర్చున్నాడు. వెన్నెల పిండారబోసినట్టుగా ఉంది.ఆ సమయoలో మేఘన చాలా అందంగా కనిపించింది. ఆమె అహంకారం, అర్ధం కాని మనస్తత్వం కనిపించలేదు. భోజనం చేయడం మొదలెట్టాడు. కూరలో ఉప్పు లేదు. పులుసు కూడా అంత రుచిగా లేదు. పెరుగు పులిసిపోయింది. అయిన కిక్కురుమనకుండా తిన్నాడు. రుచుల గురించి ప్రస్తావిస్తే మళ్ళి ఎలా రియాక్ట్ అవ్తుందో అనే భయంతో ఊరుకున్నాడు. కడుపునిండా తిని చేయి కడుగుకుని "థాంక్స్ అండి" అన్నాడు మనస్పూర్తిగా.  "పరవాలేదు" అంది. చల్లటి గాలి వీస్తోంది. పిట్టగోడకు కాలు ఆన్చి "ఇంకేంటి విశేషాలు?" అని అడిగాడు.  "ఉదయం నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు?" అనడిగింది.  "ఎప్పుడు?"  "యూనివర్సిటీకి వెళ్ళేటపుడు" గుర్తు చేస్తున్నట్టుగా చెప్పింది.  ", అసలు మీరు నాతో నడవడానికే ఇబ్బంది పడ్డారు కదా?" అని అడిగాడు.  "నేను ఇబ్బంది పడ్డాను అని నీతో చెప్పనా?" అని ప్రశ్నిచింది.  "మరి అన్ని సార్లు ఆగి చూడటం ఎందుకు? నన్ను దాటి ముందుకు నడవడం ఎందుకు? రోడ్ కి అవతల పక్కకి వెళ్లి మరీ నడవడం ఎందుకు?"  "నా ఇష్టం" అంది సింపుల్ గా.  అరవింద్ కి ఏమనాలో తెలియలేదు. కాసేపాగి "సరే రేపటినుండి కలిసే వెళ్దాం" అన్నాడు. మేఘన నవ్వుతూ ఫ్రెండ్స్ అంటూ చేయి చాపింది. నవ్వుతూ ఆమెకు కరచాలానం ఇచ్చాడు.  "ఓకే గుడ్ నైట్ " అంది  "గుడ్ నైట్ " అన్నాడు.  మెట్లదాకా వెళ్లి "గిన్నెలు కడిగేసి రేపు ఇచ్చేసేయ్" అని చెప్పి వెళ్ళిపోయింది. అయోమయంలో నవ్వుకున్నాడు. గిన్నెలు కడిగేసి పడుకున్నాడు.  తరవాత రోజు ఇద్దరు కలిసి యూనివర్సిటీకి బయలుదేరారు. దారిలో "అరవింద్, నీకు బ్లూ కలర్ టి షర్టు బాగుంటుంది. అదే ఆ రోజు అద్దె కోసం వచ్చినపుడు వేసుకున్నావ్ చూడు ఆ షర్టు." అంది.  "నీకు బ్లూ కలర్ నటే ఇష్టమా?" అనడిగాడు.  "మ్.. అవును. ఆ ఆకాశం నీలం. ఆ సముద్రం నీలం. ఆ రాముడు నీలం. అసలు ఈ ప్రపంచమంతా నీలంగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!" అంది.  మేఘన ఇలా మాట్లాడడం మొట్టమొదటిసారో కాదో తెలీదు కాని అరవింద్ వినడం మాత్రం మొదటిసారి. ఆమె అందానికి తగ్గట్టుగా మాటలు వస్తుంటే అవి ఆమె మనసుకి అద్దం పడుతున్నట్టుగా ఉన్నాయి.  "ఇంకా?" అని అన్నాడు తను మాట్లాడితే వినాలనిపించి.  "నువ్వు ఆదివారం ఫ్రీనా?" అని అడిగింది.  "ఎస్, ఫ్రీగానే ఉంటాను.ఏం?" అని అడిగాడు.  "అప్పుడు చెప్తాను" అంది.  ఇంతలో ఒక స్కూటీ బండి వచ్చి అరవింద్ ని డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది.  అరవింద్ పడిపోతు తనని తాను ఆపుకునే ప్రయత్నంలో రోడ్ అరచేతిలో కొట్టుకుపోయింది. గుద్దేసిన మనిషి కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎవరనేది గుర్తించలేకపోయాడు. బండి నెంబర్ చూసాడు. మేఘన కంగారు పడుతూ “ఏమవలేదు కదా” అంది. “పర్లేదు” అన్నాడు.  మద్యాహ్నం క్లాస్ అయ్యాక ఆ బండి కోసం యూనివర్సిటీ అంతా తిరిగాడు.చివరికి ఆర్ట్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ బండి ఉంది. వెళ్లి దానిపై కూర్చున్నాడు ఆ బండి యజమాని కోసం. బండి అద్దంలో తన గడ్డం చూసుకుంటూ ఉండగా వెనక నుంచి ఏవో నవ్వులు వినిపించాయి. తిరిగి చూసాడు.తెలుపు చుడిదార్ వేసుకుని మెరుపు బొట్టు పెట్టుకుని ఉన్న ఓ అమ్మాయి అక్కడ ఉన్న చిన్నపిల్లలతో ముద్దాడడం చూసాడు. ఆమె కళ్ళు చిన్నగా ఉన్నాయి. కోలా ముక్కు. తెల్లటి ముఖం. ఎర్రటి పెదాలు. సూటిగా చూసే ఆమె చూపు తల తిప్పుకోనివ్వదు. కోటి చంద్రుల కాంతి ఆమె ముఖంలో. కోటి సూర్యుల కాంతి ఆమె మేనిలో. ప్రకృతి ఎంత విచిత్రమైనది. కొన్ని ప్రతి రూపాలను ఇలా అమ్మాయిల రూపంలో తయారుచేస్తుందేమో?! సినిమాల్లో చూపించినట్టుగా కొన్ని సందర్భాలు ఊహాతీతం. దూరంగా ఉన్న సముద్రం హోరు వినిపించింది. ఆకాశం ప్రశాంతతను సంతరించుకుంది. చల్లటి మలయ మారుతం వీచింది. ఏవేవో అర్ధంపర్ధం లేని ఆలోచనలు..అలా ఆ అమ్మాయి ఆ పిల్లల్ని ముద్దాడి ఒక్కసారిగా అరవింద్ వైపు తిరిగింది. అంతే, ఒక్కసారిగా అరవింద్ ఆలోచనలు స్తంబించిపోయాయి. ప్రళయం జరుగుతుంది అనుకుంటే ప్రేమ పుడుతుందా? అనిపించింది. ప్రాణంతో ఉన్నప్పుడే ఇన్ని ఫీలింగ్స్ ఉంటాయా? ఇదంతా ఆమెపై నాకు కలిగిన ఆకర్షణా! అసలు ఆకర్షణతోనే ప్రేమ మొదలౌతుందా? లేక ప్రేమ తర్వాత ఆకర్షణ పెరుగుతుందా? మరి స్నేహం పరిస్థితి ఏంటి? నిజంగా 25 ఏళ్ల కుర్రాడికి రావాల్సిన రకరకాల ఆలోచనలు అన్ని కరెక్ట్ గా ఆమెను చూసినపుడు కలిగాయి.  మొట్టమొదటిసారి మేఘనని చూసినప్పుడు, రెండోసారి మౌనికని చూసినపుడు,ఇప్పుడు ఈ అమ్మయిని చూస్తున్నప్పుడు అన్నిటిలోనూ ఒకే అలజడి!!ఆమె దగ్గరగా వచ్చి ఎదురుగా నుంచుని "ఎక్స్ క్యూస్ మి" అంది.  పక్కకు జరిగి నుంచుని "హాయ్, నా పేరు అరవింద్" అంటూ చేయి ఇచ్చాడు.  ఆమె మాములుగా "హాయ్, ఐ యామ్ అంజలి" అంది చేయి కలుపుతూ. చేతికి దెబ్బ ఉండటం వలన అరచేయి మండి "స్ స్ ...అబ్బ "అని వెనక్కి తీసేసుకున్నాడు.  "ఏమైంది?" అని అడిగింది.  "ఉదయం మీరు నన్ను గుద్దేసి వెళ్ళిపోయారు కదా , దానికి సాక్ష్యం."అన్నాడు చేయి చూపిస్తూ.  కొంచెం భయపడుతూ "ఐ యామ్ సారీ" అంది  "పరవాలేదులెండి"  "కాల్ మి అంజలి" అంది నవ్వుతూ.  "ఓకే అంజలి, బాయ్" అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు.  "దెబ్బ ఎలా ఉంది?" అని అడిగింది మేఘన.  "పర్లేదు" చెప్పాడు.  "భోజనం చేసావా?"  "చేసాను" అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు."ఒరేయ్ , ఈరోజు ఎలా అయిన చైతన్యకి నా ప్రేమ గురించి చెప్పేస్తాను. మంచి ముహూర్తం చూడు" అన్నాడు అచ్యుత్.  "ఈరోజు చెప్తాను అని మళ్ళి ముహూర్తం ఏంటిరా?" అని అడిగాడు నిరంజన్.  "నా బొంద చెప్తాడు. గత 3 ఏళ్లుగా ఇదే అంటున్నాడు" అన్నాడు రాజీవ్.  "డోంట్ డిస్కరేజ్మి ర, అసలు నీలాంటి ఫ్రెండ్స్ ఉండటం వల్లే ఇంతకాలం చెప్పలేకపోయాను" అన్నాడు నిందను రాజీవ్ పై వేస్తూ.  "అనరా, నన్నే అను. నేనే కనక నీకు హెల్ప్ చేయకపోయుంటే ఇప్పటికీ ఆమె పేరు కూడా నేకు తెలిసేది కాదు" అన్నాడు రాజీవ్.  అరవింద్ వస్తు "ఏంటి మంచి డిస్కషన్ లో ఉన్నారు?" అని అడిగాడు.  "అంతా లేదు రోజు ఉండే బాగోతమే. వీడు ప్రోపోస్ చేస్తాను అనడం. వాడిని ముహూర్తం పెట్టమని అడగడం. వీడు చెప్పకపోవడం."అన్నాడు రాజీవ్.  "ఏం అచ్యుత్ ఇప్పటివరకు ఒక్కసారికూడా నువ్వు చైతన్యతో మాట్లాడలేదా?" అని అడిగాడు అరవింద్.  "అంతలేదు వీడికి" హేళనగా అన్నాడు రాజీవ్.  "నువ్వు ఉండరా. వాడిని కనీసం మన ముందైన మాట్లాడని" అని ఇంకొంచెం అందిచాడు నిరంజన్.  "వాళ్ళ మాటలకేంగాని నువ్వు మాట్లాడతావా? మాట్లాడాలని ఉందా?" అని అడిగాడు.  "ప్రేమించిన అమ్మాయి ముందు రెండు నిమిషాలు భయపడకుండా నిలబడటమే కష్టంర, నా ఆల్ టైం రికార్డు 8 సెకన్లు. ఎందుకో చైతన్య కనిపిస్తే పక్షవాతం వచ్చినట్టు అయిపోతాను"అన్నాడు నిరాశగా.  "అలా ఏమి ఉండదు. నువ్వు మాట్లాడుతాను అంటే నేను ఏర్పాటు చేస్తాను" అన్నాడు నవ్వుతూ.  ఏదో చిన్న ఆశ చిగురించింది. అరవింద్ పై నమ్మకం అనిపించి, ఓ మూల కొంచెం భయంతోనే సాలోచనగా "సరే" అన్నాడు. "అబ్బ! సార్ డిసైడ్ అయ్యారు" అన్నాడు రాజీవ్ వెటకారంగా.  "ఓకే. గుడ్ , తొందర్లోనే మాట్లాడుతావు. నువ్వు చైతన్య మంచి ఫ్రెండ్స్ అవుతారు" అన్నాడు మాట ఇస్తున్నట్టుగా.  నవ్య అటుగా వెళ్తూ "రాజీవ్" అని పిలిచింది. రాజీవ్ నవ్య వైపు తిరిగి చూసి ఏమి మాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు. "ఎంటిరా వీడు?" అనడిగాడు అరవింద్. "పాపం నవ్య వేడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది. వీడికి ఇష్టం లేదు. వీడో మూర్ఖుడు" అన్నాడు అచ్యుత్.  ఆమె దగ్గరకు వెళ్లి "హాయ్ ఐ యామ్ అరవింద్" అన్నాడు.  "హాయ్ అన్నయ్య" అంది.  "నీకు రాజీవ్ అంటే అంత ఇష్టమా?" అనడిగాడు. తలొంచుకునే తలూపింది.  "నీకు మాట్లాడాలని ఉందా?"  అవునన్నట్టుగా తలూపుతూ ఎలా అన్నట్టుగా చూసింది. నవ్య చేయి పట్టుకుని "నీ అన్నయ్య ఉన్నాడుగా, కంగారుపడకు" అన్నాడు అరవింద్.ఓ రోజు సాయంత్రం నిరంజన్ భోజనం చేసి "స్వాతీ, చదువుకుంటున్నావా?" అంటూ చెల్లెలు గదిలోకి వెళ్ళాడు. స్వాతీ కంగారుపడుతూ చదువుతున్న పుస్తకం మూసేసే ప్రయత్నం చేసింది. అది గమనించి "ఏంటది?" అని అడిగాడు.  "ఏమి లేదు అన్నయ్య?"  "ఏది ఇలా ఇవ్వు..." అంటూ ఆ పుస్తకాన్ని లాక్కుని తెరిచి చూసాడు. "ఐ లవ్ యు అశోక్" అని రాసి ఉంది.  "ఎవరే అశోక్?" అని అడిగాడు.  "అదీ ... అదీ ..." చాలా భయపడిపోయింది.  "రేపు సాయంత్రం వీడిని మన ఇంటికి రమ్మని చెప్పు "  "అతను రాడు అన్నయా"  "ఏం? ఎందుకు రాడు?"  "అతనికి ఈ విషయం తెలీదు" చెప్పింది నిదానంగా.  "వన్ సైడ్ లవ్వా?" మాములుగా అడిగాడు.  "అతనంటే నాకు ఇష్టం అన్నయ్య" ధైర్యం కూడగట్టుకుని చెప్పింది.  "ఏం చేస్తుంటాడు?" అని అడిగాడు.  "మా కాలేజీ. మా క్లాసుమేటు." సమాధానం ఇచ్చింది.  "పరీక్షలమీద దృష్టి పెట్టు ముందు. ఇలాంటివేమీ పెట్టుకోకు" చెప్పి వెళ్ళిపోబోయాడు.  "నేను అతన్ని ప్రేమించాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను" కొంచెం గొంతు పెంచుతూ చెప్పింది.  వెళ్తున్న వాడు ఆగి "ఇప్పుడు నీకు చెప్పినా అర్ధం కాదు స్వాతీ " అన్నాడు కోపాన్ని దిగమింగుతూ.  "నాకు అర్ధం కావాల్సింది ఏమి లేదు. నువ్వు మానసను ప్రేమిస్తే లేదుగాని నేను ప్రేమిస్తే ఆంక్షలా?"  ఇద్దరి మాటలు తూటాల్లా పేలుతున్నాయి."గట్టిగా అరవకు స్వాతీ!" అన్నాడు పళ్ళు పిండుకుంటూ.  "ఏం? నాన్నకు తెలుస్తుందని భయమా?" అంది  "బెదిరిస్తున్నావా ఏం?" కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు.  "కాదు, నా నిర్ణయం చెప్తున్నాను" అంది తల తిప్పుకుంటూ.  "మానస విషయం వేరు నీ విషయం వేరు. అన్నింటిలోను ఆరిందానిలాగా మాట్లాడకు" అన్నాడు కోపంగా.  "నాకు ఇప్పుడు 20 ఏళ్ళు. మేజర్ ని. నాకు తెలుసు ఏది తప్పో? ఏది ఒప్పో?" అంది అంతే కటువుగా.  "ఒక వైపే ప్రేమిస్తూ ఇంత రాద్ధాంతం ఎందుకు?. హా?"  "నాకు నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు. అది నాకు ఇష్టం లేదు"  "సరే, అశోక్ తో నేను మాట్లాడతాను. నాన్నగారికి టైం చూసుకుని అశోక్ గురించి నేనే చెప్తాను" అన్నాడు.  "నువ్వేమి అశోక్ కి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను చాలా మంచి వాడు." అంది  నిరంజన్ కి అసహ్యం వేసింది. చాలా అవమానంగా తోచింది. ఇంకా స్వాతితో మాట్లాడి వేస్ట్ అనుకుని వెళ్లిపోతు గుమ్మం దగ్గర ఆగి "నీ ప్రేమని కాదనే హక్కు నాకు లేదు. నీ జీవితం నీఇష్టం. సమస్యను జటిలం చేయడం నాకు ఇష్టం లేదు. ఇంత జరిగాక నీ ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. జోక్యం చేసుకోను కూడా! ఎప్పుడైనా పరిస్థితులు బాగోకపోతే నీకు ఈ అన్నయ్య ఉన్నాడని గుర్తుంచుకో చాలు" అని చెప్పాడు.  "ఆ అవసరం నాకు రాదు" అంది స్వాతి.  ఆ మాటనగానే నిరంజన్ మనసు చివుక్కుమంది."చూడు స్వాతి నోట్ బుక్ లో ఐ లవ్ యు అని రాసినంత ఈజీ కాదు ఆ మనిషితో జీవితాంతం గడపడం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.  నిరంజన్ మనసు కకావికలమైపోయింది. చెల్లెలు అలా మాట్లాడుతుందని కలలో కూడా ఉహించలేదు. తన క్షేమం కోరినా అపార్ధం చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. మద్యలో అనవసరంగా మానస పేరు తేవడం ఇంకా బాధనిపించింది.  మొబైల్ తీసుకుని మానసకు మెసేజ్ పంపాడు "ఏమి చేస్తున్నావ్?" అంటూ .  ఇంట్లో సోఫాలో కుర్చుని టి.వి చూస్తున్న మానస మెసేజ్ చదివి "హాయ్ ఏంటి సడన్ గా గుర్తొచ్చాను? ఏమి లేదు టి.వి చూస్తున్నాను " రిప్లై ఇచ్చింది.  "ఏమి లేదు మాట్లాడాలనిపించింది" రిప్లై ఇచ్చాడు.  "అబ్బ! అలా అయితే కాల్ చేయచ్చు కదా. ఉండు, నేను కాల్ చేస్తాను. బట్ ఒక కండిషన్ చదువుగురించి మాట్లాడకూడదు" అని మెసేజ్ పంపింది.  "ఓకే " అని చెప్పాడు.  పది నిమిషాల తర్వాత మానస ఫోన్ చేసింది." చెప్పురా ఏంటి?" అని అడిగింది.  "ప్చ్.. ఏమి లేదు ." అన్నాడు  "ఏమి అయింది? అంతా ఓకే కదా? "సమాధానం ఇవ్వలేదు. "ఏమైందో చెప్పరా నువ్వు డల్ గా ఉంటే నాకు నచ్చదు " అంది మళ్ళి. మౌనం వహించాడు. హలో అని పిలిచింది. "మ్... అని ''కొట్టాడు.  "ఏమైంది??” మళ్ళి అడిగింది. " అబ్బ! ఏమైంది నీకు, ఐ లవ్ యు రా బుజ్జి చెప్పరా కన్నా ప్లీజ్ రా " అని ప్రేమగా బ్రతిమాలింది.  "స్వాతి ఫస్ట్ టైం ఎదురించి మాట్లాడింది. అర్ధం చేసుకోకుండా ఏవేవో అనేసింది. చాలా బాధ అనిపించింది" అంటూ జరిగిందంతా చెప్పుకొచ్చాడు. చెప్పినదంతా విన్నాక "ఓస్ ఇంతేనా. ఒకసారి నువ్వే అశోక్ తో మాట్లాడు" అంది.  "నాకు దాని విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు" నిర్ణయం తీసేసుకున్నట్టుగా చెప్పాడు.  "సరే, ఏమి ఆలోచించకుండా హాయిగా పడుకో. రేపు యూనివర్సిటీ లో కలుద్దాం" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.  ఆ తర్వాత రోజు నిరంజన్ చాలా డల్ గా కనిపించాడు. ఎవరు అడిగినా ఎవరికీ ఏమి చెప్పలేదు. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండిపోయాడు. మానస రాగానే తనతో కలిసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న నిరంజన్ ని చూస్తూ "ఏంటిరా, ఏమైంది నిరంజన్ కి ఈ రోజు అలా ఉన్నాడే "అని అడిగాడు అరవింద్. తెలీదు అన్నట్టుగా తలూపారు ఇద్దరు.  కనుచూపు మేరలో మౌనిక రావడం చూసి "ఎలా పుడతారురా బాబు. కనుచూపు మేరలో మౌనిక రావడం చూసి "ఎలా పుడతారురా బాబు ఇంత అందంగా?" అన్నాడు అరవింద్. రాజీవ్ అచ్యుత్ లు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.  నవ్య అటుగా రావడం గమనించిన సంజీవ్ "ఓకే ఐ యామ్ లీవింగ్, బాయ్" అని చెప్పి వెళ్ళిపోయాడు. మౌనిక తో పాటుగా అటుగా వెళ్తున్న మేఘన కలిసి ఇద్దరు నడచుకుంటూ రావడం గమనించాడు.  "ఏంటి వీళ్ళిద్దరూ స్నేహితులా?" అని అడిగాడు ఆశ్చర్యపోతూ. 
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#8
"కాదని ఎవరన్నారు" చెప్పాడు అచ్యుత్.  వాళ్ళు దగ్గరగా వచ్చాక "హాయ్ మేఘనా" అని మేఘనని పలకరించాడు.  మేఘన ఏమి పట్టనట్టు పలకరించకుండా వెళ్ళిపోయింది. అరవింద్ కి అర్ధం కాలేదు.  రాత్రి ఇంటికెళ్ళాక అడిగాడు. "ఏంటి ఫ్రెండ్స్ అన్నావ్? పలకరించినపుడు తెలీనట్టు వెళ్లిపోయావ్?" అని అడిగాడు.  "నువ్వు నన్ను ఎందుకు పలకరించావో నాకు తెలుసు" అంది మేఘన.  "ఎందుకు?" అనడిగాడు... "పక్కన నా ఫ్రెండ్ ఉంది కదా. దాన్ని పరిచయం చేయడం కోసం" అంది  "వాట్???" అరిచాడు.  "వద్దు, చెప్పకు. మీ అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు" అంది  "ఏం తెలుసు?” ప్రశ్నించాడు.  "నాకు అన్ని తెలుసు" అంది సూటిగా చూస్తూ.  "నా ఫ్రెండ్ పేరు మౌనిక. ఆమె అన్న పేరు సుధీర్, కాలేజీ లీడర్. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. చాలా? ఇంటి అడ్రెస్స్ కూడా చెప్పాలా?" అంది తనే మళ్ళి.  "నాకు ఆమె పేరు వరకు తెలుసు" అన్నాడు.  "మరెందుకు కన్ఫర్మేషన్ కోసమా?" అంది  అరవింద్ కి మేఘనతో ఎలా మాట్లాడాలో తెలియలేదు. "అది కాదు మేఘనా నేను నిజంగానే నిన్ను పలకరిద్దామనే హాయ్ చెప్పాను" అన్నాడు.  "అవసరం లేదు" అంది పదునుగా.  "ఏంటి మీ ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ చేయకూడదా?" అని అడిగాడు  "అదేమంత ఈజీ కాదు. అది అందరితోను ఫ్రెండ్షిప్ చేయదు. నాలాగా బాగా సెలెక్టివ్. అయినా నీకంత సీన్ లేదు" అంది  "ఛాలెంజ్ చేస్తున్నావా?" అని అడిగాడు  అరవింద్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ "తనతో ఫ్రెండ్ షిప్ చేస్తావా? చేయాలని ఉందా?" అని అడిగింది.  "నాకంత సీన్ ఉందో లేదో చూపిస్తాను. చూస్తావా?" అన్నాడు  "చేయ్ చూద్దాం!, నీ చదువు అయ్యేలోపు అది నీకు ఫ్రెండ్ అయితే చాలు. టేక్ యువర్ ఓన్ టైం" అంది ధీమాతో.  "15 రోజులు చాలు నాకు. పందెం?" అని అన్నాడు  "సరే నీ ఇష్టం. ఓడిపోతే?" అని అడిగింది.  "నీ ఇష్టం... " అని చెప్పాడు.  "ఓకే 15 రోజుల్లో ఆమె నీతో ఫ్రెండ్ షిప్ చేయాలి. నీకోసం వెయిట్ చేయాలి. నీకోసం నన్ను కూడా ఇగ్నోర్ చేసేంతలా చేయాలి. నేను ఓడిపోతే నువ్వేమి చెప్తే అది చేస్తాను. నేను గెలిస్తే నేను ఏమి చెప్తే అది నువ్వు చేయాలి".అంది మేఘన.  "ఓకే. ఫైన్. ఈ విషయం మనిద్దరి మద్యనే ఉండాలి" అన్నాడు అరవింద్.  "సరే" అంది  "అల్ ది బెస్ట్ చెప్పు మరి నాకు" అన్నాడు  అరవింద్ ని పైనుంచి కిందవరకు చూసి వెళ్ళిపోయింది. 

* * *
"ఏంటోరా జీవితం అంతా చాలా రొటీన్ గా గడిచిపోతోంది. సినిమాలోలాగా చేసులు, ఉరుకులు, పరుగులు, కత్తులు ఇలా ఒక్కరోజైనా ఉండాలనిపిస్తోంది" అన్నాడు అచ్యుత్.  "ఏరా, బాగున్నావా? రాత్రి ఏమైనా కరిచిందా?" అడిగాడు రాజీవ్.  "అదేం లేదురా.. నిజంగా ఒక్కసారైనా ఆ యాంగల్ చూడాలని ఉంది" అన్నాడు అచ్యుత్.  అరవింద్ అప్పుడే అక్కడికి వస్తు" మీ కలలు పండే రోజు దగ్గర పడింది " అన్నాడు నవ్వుతు.  "ఏంటీ!!!!!" అరిచారు ఇద్దరు కంగారు పడుతూ.  అరవింద్ "అదేరా చైతన్యతో మాట్లాడాలి అన్నావుగా" అన్నాడు ప్రశాంతంగా.  "అవునా ఎప్పుడు?" ఆత్రుతగా అడిగాడు.  "వచ్చేవారం ప్రయత్నిస్తాను. లేకపోతే ఆపై వారం ఖచ్చితం" అన్నాడు దృడంగా. చాలా ఆనందపడిపోయాడు.  "ఇంతకి ఏమి చేయబోతున్నావ్?" అని అడిగాడు రాజీవ్.  రాజీవ్ వైపు చూసి "సస్పెన్స్.. అది సరే ఇంతకి నిరంజన్ ఏడి?" అని టాపిక్ మార్చేశాడు అరవింద్.  "వాడు క్లాసు లో ఉంటాడు. వెళ్ళు." చెప్పాడు అచ్యుత్.  నిరంజన్ మైక్రోబయాలజీ ల్యాబ్ వర్క్ లో ఉన్నాడు. అరవింద్ బయట నుండే పిలిచాడు. ల్యాబ్ అయ్యాక కలవమని చెప్పి వెళ్ళిపోయాడు. ల్యాబ్ వర్క్ అయ్యాక ఇద్దరు కలిసి యూనివర్సిటీ ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్ళారు. పర్మిషన్ తీసుకుని లోపలకి వెళ్లి "గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అరవింద్. మీతో ఒక విషయం మాట్లాడుదామని వచ్చాము" అన్నాడు." చెప్పండి, దేని గురించి " అని అడిగి మళ్ళి "వెయిట్ ఎ మినిట్" అని చెప్పి కూర్చోమన్నట్టుగా సైగ చేసాడు.  ప్రిన్సిపాల్ సన్నగా నల్లగా ఉన్నాడు. ఉన్న నాలుగైదు ఉంగరాల వెంట్రుకలతో బట్టతలను కవర్ చేసాడు. ముక్కు సూదిగా ఉంది. ఆ ముక్కుదాకా గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు వదిలేసాడు. మొదటి రెండు పళ్ళ మధ్యన గుండు సూది పట్టేంత గ్యాప్ ఉంది. రెండు చేతుల ఉంగరం వేళ్ళు బంగారంతో వాచాయి. బ్లూ కలర్ కోటు వేసుకున్నాడు. అదో రకమైన సెంట్ వాసన గుప్పుమని వస్తోంది. ఆయన టేబుల్ అద్దం కింద వివేకానందుని సూక్తుల ఫోటోలు, జీసస్ 10 సూత్రాలు ఉన్నాయి. అరవింద్ ఇవ్వన్ని గమనిస్తూ కూర్చున్నాడు.  ప్రిన్సిపాల్ "ఇప్పుడు చెప్పండి" అన్నాడు పెన్ కేప్ మూస్తూ.  "మేము ఇక్కడ పిహెచ్.డి చేస్తున్నాం సార్. నేను బయోకెమిస్ట్రీ. ఇతను నా ఫ్రెండ్ నిరంజన్ మైక్రోబయాలజీ. మాకో ఆలోచన వచ్చింది సార్. దానిని మీతో చెప్దామని వచ్చాము" అన్నాడు అరవింద్.  "ఏంటా ఆలోచనా ?" అని అడిగాడు ప్రిన్సిపాల్ ముందుకు వాలుతూ.  "మన యూనివర్సిటీ రూల్ ప్రకారం ప్రతి సెకండ్ ఇయర్ లైఫ్ సైన్సు స్టూడెంట్ తప్పని సరిగా ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వాటికి కుడా మార్కులు కేటాయించిన విషయం మీకు తెలిసిందే. అందుకోసం స్టూడెంట్స్ బయటకు వెళ్లి ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలా కాకుండా పిహెచ్.డి చేస్తున్న మా దగ్గర వాళ్లకు సరిపోయేటట్టు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిని మన యూనివర్సిటీలోనే మన ప్రొఫెస్సొర్స్ ఆద్వర్యంలో చేయడం వల్ల వాళ్లకు మేలు కలుగుతుంది. అలాగే మన యూనివర్సిటీకి మంచి ప్రాజెక్ట్స్ చేసిన రికార్డు ఉంటుంది." అని చెప్పాడు.  నిరంజన్ అందుకుంటూ "అంతే కాదు సార్, ఇలా చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది. రికార్డు బైండింగ్ తో సహా అన్ని పనులు ఆన్ టైం లో పూర్తి అవుతాయి. ఆ తరువాత మిగిలిన సమయంలో వాళ్ళు సెమినార్ కి ప్రిపేర్ అయ్యి బాగా ప్రెసెంట్ చేస్తారు. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ అండ్ బయోకెమిస్ట్రీ వంటి అన్ని డిపార్ట్మెంట్ల స్టూడెంట్స్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రాజెక్ట్ ని మూడు పార్ట్శ్ కింద విడగొట్టి దానిని ముగ్గురు వేర్వేరు డిపార్ట్మెంట్ల స్టూడెంట్స్ కి ఇస్తాము. దానిని వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత అంతా కలిపి వాళ్ళ థీసెస్ లో పెట్టుకుంటారు. వాళ్ళు చేసినదే కాకుండా మిగిలిన వాటిలో కూడా అవగాహన ఏర్పడుతుంది." ముగించాడు. అరవింద్ కొనసాగిస్తూ " స్టూడెంట్స్ అందరు ఇలా చేయడానికి సిద్ధంగానే ఉంటారని నా అబిప్రాయం. మీరు ఒప్పుకుంటే అమలు చేద్దామని ఉంది సార్. దీనికి సంబందించిన వివరాలు, ప్రోటోకాల్స్, ప్రొసీడింగ్స్ అన్నీ ఈ డాక్యుమెంట్ లో ఉన్నాయి " అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ అందిచాడు.  ప్రిన్సిపాల్ దానిని అందుకుని ఆ డాక్యుమెంట్ ని చూసి "మీ ఆలోచన చాలా బాగుంది. కాని ఈ విషయంపై డిపార్ట్మెంట్ హెచ్.ఓ.డిలతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడి ఏ విషయం చెప్తాను" అన్నాడు.  "సరే సార్ " అంటూ ఇద్దరు లేచారు.  "ఓకే" అన్నాడు ప్రిన్సిపాల్.  "థాంక్ యు సార్ " అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చాక "అదేం కంపురా బాబు కడుపులో తిప్పేసింది" అన్నాడు నిరంజన్. "నాక్కూడా , చెప్పాలనుకున్న చాలా పాయింట్స్ మర్చిపోయాను." అన్నాడు అరవింద్.  "వర్క్ అవుట్ అవుతుందా మరి?"  "ఎందుకవదు? తప్పకుండా అవుతుంది. ప్రాజెక్ట్స్ మనవి అన్నాం కనక మన ప్రొఫెసర్స్అందరు భారం అంతా మనపై పాడేస్తారు. వాళ్ళు రిలాక్స్ అయిపోతారు"  "అది ఓకే రా , డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ కలిసి చేయడం కుదురుతుందా?"  “అది కూడా సమస్యేం కాదు, ప్రొఫెసర్స్ చెప్పాక చేయను అనకూడదు. ఒప్పుకోవాల్సిందే.




[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#9
లేకపోతే తరవాత పరిణామాలకు భాద్యత వహించాల్సొస్తుంది."  "సరే పద వెళ్దాం " అని అక్కడినుండి కదిలారు. దారిలో అంజలి ఎదురైంది.  "హాయ్ అంజలి" పలకరించాడు నిరంజన్.  "హాయ్ నీర్ .. ఎలా ఉన్నావ్?"  "బాగున్నాను" చెప్పాడు.  "హాయ్" అని విష్ చేసాడు అరవింద్. గుర్తు తెచ్చుకున్నట్టుగా "మీరూ...!!"అంది..  "అదేంటి, అప్పుడే మర్చిపోయారా? ఇదిగో నువ్వు ఇచ్చిన గిఫ్ట్" అంటూ అరచేయి చూపించాడు.  "ఓ సారీ సారీ అరవింద్ మర్చిపోయాను" అంది నవ్వుతు.  "ఈ దెబ్బే లేకపోతే సాక్ష్యం లేకపోయేది నాకు" అన్నాడు.  "అదేం లేదులే ఈ సారి మర్చిపోను. చిన్న పని ఉంది వస్తాను, పెయింటింగ్ కాంపిటిషన్ గురించి ప్రిన్సిపాల్తో మాట్లాడాలి" అని చెప్పి వెళ్ళిపోయింది. ఇద్దరు తనకి దారి ఇచ్చారు.  "నీకు అంజలి తెలుసా? అనడిగాడు అరవింద్ .  "ఎందుకు తెలీదు. తను ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ స్టూడెంట్. బొమ్మలు బాగా వేస్తుంది. మన బయాలజీ డయాగ్రామ్ చార్ట్స్ కొన్నింటిని తనతోనే వేయిన్చుకుంటూ ఉంటాను. మంచి పెయింటర్ " చెప్పాడు నిరంజన్.  మళ్ళి తనే కొనసాగించాడు" తనకి చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి. ఒకసారి వీధి బాలల కష్టాలను చూపిస్తూ ఒక పెయింటింగ్ వేసింది. అది చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే నమ్ము. అంత అద్భుతంగా గీస్తుంది." అన్నాడు.  "అయితే ఈమెను కూడా మన ప్రాజెక్ట్స్ లోకి తీసుకుందామా?" అన్నాడు అరవింద్.  "సైన్సు ప్రాజెక్ట్స్ కి ఆర్ట్స్ అమ్మాయా? నిజం చెప్పు నీ ఉద్దేశ్యం ఏంటి?" అని అడిగాడు భుజం తడుతూ.  "అబ్బే! అలాంటిదేమీ లేదు. సరదాగా అన్నాను" అన్నాడు  "సరే పద కాంటీన్ కి వెళ్దాం" అని అనుకుని కాంటీన్ కి వెళ్తుంటే మానస ఎదురైంది.  నిరంజన్ తో "ఏంటి బాస్ ప్రిన్సిపాల్ తో పనా?” అని అడిగింది.  "అవును" అన్నాడు.  "ఎప్పుడు చదువులేనా? ఎంజాయ్ చేయాలని ఉండదా? నీలంటివాడిని ప్రేమించాను చూడు నాది తప్పు" అంది. నిరంజన్ నవ్వుతూ "ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయాలి. ఇప్పుడే చదువుకోవాలి. తరువాత చదువుదామన్నా ఇంట్రస్ట్ ఉండదు" చెప్పాడు.  "అదే నేను చెపుతున్నాను ఇప్పుడే ఎంజాయ్ చేయాలి ఆ తర్వాత ఇంటరెస్ట్ ఉండదు అని" అంది.  దానికి అరవింద్ "పోనీ మాథ్స్ వాళ్ళని కుడా మన ప్రాజెక్ట్స్ లోకి చేర్చుకున్దామా?" అని అడిగాడు సరదాగా.  ",, హ...ఇంకా ప్రాజెక్ట్స్ ఏమి కదలవు" అని నవ్వుకున్నాడు నిరంజన్. అరవింద్ కూడా నవ్వేడు.  "ఏంటి?" అని అడిగింది మానస. అరవింద్ ప్రాజెక్ట్ ఐడియా చెప్పాడు. అది విని "వద్దు బాబు, మాములుగానే చదువు చదువు అని చంపుతాడు. మీతో కలిస్తే ఇతన్ని భరించడం నా వల్ల కాదు" అంది నిరంజన్ వైపు చూసి. ముగ్గురు నవ్వుకున్నారు. 
* * *
"ఒరేయ్ ఈ రోజు ఎలా అయినా చైతన్యకు నా ప్రేమ విషయం చెప్పేస్తాను. ముహూర్తం పెట్టు" అని అచ్యుత్ మళ్ళి అడిగాడు.  "చంపేస్తున్నావురా బాబు... నీయంకమ్మ ఇంకోసారి ఆ డైలాగ్ అంటే చంపేస్తాను" అన్నాడు రాజీవ్.  కనుబొమ్మలు పైకి ఎత్తి కళ్ళు రెప్పలేయకుండా సీరియస్ గా రాజీవ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ "ఈ రోజు చెప్పేస్తే నాకేంటి ఇస్తావ్?" అని అడిగాడు అచ్యుత్.  "ఏమి కావాలంటే అది ఇచ్చేస్తాను. ఆఆ..ఆ…. నా పేరు మీద హైదరాబాద్ లో ఫ్లాట్ ఉంది అది రాసిచ్చేస్తాను" అన్నాడు ఎలాగో అచ్యుత్ చెప్పాలేడన్న ధీమాతో, జీవితంలో అచ్యుత్ ఆ పని చేయేదన్న నమ్మకంతో. అచ్యుత్ లేచి నిలబడి"అయితే సరే, రెడీగా ఉండు. రాసిచ్చేయడానికి" అన్నాడు.  రాజీవ్ "వీడేంటి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు. కొంపతీసి చెప్పేస్తాడా? వెధవ గోల!! అనవసరంగా మాట ఇచ్చేసానా? ఇల్లు నా పేరు మీద కుడా లేదు ఏదో ఫ్లోలో అలా అనేసాను కాని అది మా నాన్న పేరుమీద ఉంది. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అని అనుకున్నాడు మనసులో. అయినా ధైర్యం నటిస్తూ "అదిగో చైతన్య వస్తోంది వెళ్లి ప్రేమిస్తున్నాను అని చెప్పు" అన్నాడు చైతన్యను చూపిస్తూ.  అచ్యుత్ వెనక్కి తిరిగి చూసాడు. అందమైన నెమలిలా నెమ్మదిగా అటు ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్న చైతన్యని చూస్తూ ఉండిపోయాడు. కాలం ఆగిపోయినట్టింది..... అంతే అలా చూస్తూనే ఉండిపోయాడు. ఇంకేమి చేయలేదు."ఏరా చెప్పేస్తాను పొడిచేస్తాను అని బిల్డప్ ఇచ్చావ్" అని వెక్కిరిస్తూ అడిగాడు రాజీవ్ కొంత విజయ గర్వంతో. రాజీవ్ వైపు చూసి "నాకు పరాయివాళ్ళ ఆస్తులు ఊరికనే తీసుకోవడం ఇష్టం లేదు. ఏదైనా స్వయంకృషితోనే సంపాదించాలి. అది ఆస్తులయినా సరే ప్రేమైనా సరే" అన్నాడు అచ్యుత్.  "ఈ కబుర్లకేమి తక్కువ లేదు" అన్నాడు రాజీవ్.  "ముందు పరీక్షల మీద దృష్టి పెట్టండి" అన్నాడు నిరంజన్. అరవింద్ అక్కడ జరిగేదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.  "వీడొకడు .. చదువు.. చదువు.. నీకేంటి బాబు! నీకు మానస ఉంది. నా బాధ ఎవడికి చెప్పుకోను?" అన్నాడు అచ్యుత్. నిరంజన్ పక్కనే ఉన్న మానస "ఎందుకు నేను ఉన్నానంతే! అంతకంటే ఏమి లేదు. నీకు లేక బాధ. నాకు ఉండి బాధ" అంది. పక్కున నవ్వేడు అరవింద్. అరవింద్ తో పాటు అందరు కలిసి నవ్వారు. నిరంజన్ నవ్వకురా ప్లీజ్ అన్నా కూడా పగలబడి నవ్వుకున్నారు. అప్పడే నవ్య అక్కడికి వచ్చి నవ్వుతు "హాయ్ అరవింద్ అన్నయా" అని అరవింద్ ని పలకరించింది. నవ్యని చూసి రాజీవ్ అక్కడినుండి వెళ్ళిపోబోయాడు. వెంటనే నవ్య రాజీవ్ తో "హలో నేనేం నీకోసం రాలేదు. అరవింద్ అన్నయ్య కోసం వచ్చాను" అని అంది. సౌండ్ లేదు రాజీవ్ కి. మౌనంగా నవ్య కళ్ళలోకి చూసాడు. నవ్య కుడా రాజీవ్ కళ్ళలోకి క్షణం పాటు చూసి అరవింద్ వైపు తిరిగి నవ్వింది పెదాలు సాగదీస్తూ. రాజీవ్ అరవింద్ వైపు చూసి "నాకు పని ఉంది, ఐ యమ లీవింగ్" అని చెప్పి వెళ్ళిపోయాడు కోపంగా.  "హేయ్! నవ్య , నువ్వేనా.. సూపర్ డైలాగ్ సౌండ్ లేదు వేస్ట్ గాడికి" అన్నాడు అచ్యుత్ వెళ్ళిపోతున్న రాజీవ్ వైపు చూస్తూ.  "వేస్ట్ గాడు ఏంటి?" అంది చాలా కోపంతో. ఈసారి అచ్యుత్ కి సౌండ్ లేదు. "మైండ్ యువర్ లాంగ్వేజ్ " అంది మళ్ళి.  "హేయ్, కూల్. మేమందరం ఫ్రెండ్స్" అన్నాడు అరవింద్.  "అయినా సరే నా ముందు రాజీవ్ ని ఏమైనా అంటే నేను ఒప్పుకోను" అంది కొంచెం ఫీల్ అవుతూ.  "సరే సరే ఏమనంలే అన్నాడు అరవింద్. మానస నిరంజన్ లు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. నవ్య తన తొందరపాటు తెలుసుకుని అచ్యుత్ కి సారి చెప్పింది. పరవాలేదులే అన్నాడు నవ్వుతు.  అరవింద్ పెట్టిన ప్రపోసల్ ని ప్రొఫెసర్స్ముందు ఉంచాడు ప్రిన్సిపాల్. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, మంచి ఆలోచన అని నిరంజన్ ని అరవింద్ ని మెచ్చుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే భారం అంతా వాళ్ళపై వదిలేసారు. మీటింగ్ కి అందరు స్టూడెంట్స్ తప్పకుండా హాజరు కావాలని అన్ని డిపార్ట్మెంట్లకి నోటిసులు వెళ్ళాయి. ఆ రోజు స్టూడెంట్స్ అందరు అటెండ్ అయ్యారు. మూడు డిపార్టమెంట్లు కలిపి 120 మంది వరకు స్టూడెంట్స్ వచ్చి కూర్చున్నారు. అరవింద్ ఆ గుంపులో మౌనిక కోసం వెతికాడు. అలా చూస్తూ ఉండగా మేఘన కనిపించింది. మాట రాకుండా పెదాలు కదుపుతూ 'మౌనిక' అన్నాడు. 'ఇంటికి వెళ్ళింది' అన్నాట్టుగా రెండు చేతులతో సైగ చేస్తూ చెప్పింది. 'ఎందుకు' అన్నాట్టుగా బొటనవేలు చూపించాడు. 'ఏమో' అన్నాట్టుగా కింద పెదవి విరిచింది. మళ్ళి స్టూడెంట్స్ అందరి వైపు తిరిగి నవ్వుతు మీటింగ్ స్టార్ట్ చేసాడు.  డియర్ స్టూడెంట్స్,  మనమందరం ఇక్కడ మీట్ అవడానికి ఒక కారణం ఉంది. మీ ప్రాజెక్ట్స్ గురించి యూనివర్సిటీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మీరు మీ ప్రాజెక్ట్స్ కోసం బయటకు వెళ్ళనక్కర లేదు. మన యూనివర్సిటీలోనే మీరు పూర్తిచేసుకోవచ్చు. ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా ఫీజు కూడా లేదు. కాకపోతే కెమికల్స్ కి కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదేమంత ఎక్కువ ఖర్చు కాదు అని నా అబిప్రాయం. మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఒక వారంలోగా ఏవిషయం అనేది చెప్పండి. మీరందరూ దీనికి ఒప్పుకుంటారనే ఆశిస్తున్నాను. మనమందరం కలిసి ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తే మన యూనివర్సిటీకి, మన యూనిటీకి మంచి పేరు వస్తుంది. ప్రాజెక్ట్ వివరాలు నిరంజన్ చెప్తాడు” అని ముగించాడు.  నిరంజన్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ చెప్పాడు. ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#10
వాటి గురించి వివరించి చెప్పాడు. కాని వాళ్ళు కావాలనే డిపార్ట్మెంట్ల స్టూడెంట్స్ ని కలుపుతున్నాం అనే విషయాన్ని అక్కడ ప్రస్తావించలేదు. అంతా విన్నాక చాలా మంది స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధపడ్డారు. కొంతమంది తర్వాత చెప్తామని చెప్పారు. ఏది ఏమైనా చివరికి అందరు ఒప్పుకున్నారు.  "మొత్తానికి మౌనికకు దగ్గరవడానికి మంచి ఐడియానే వేశావ్" అంది మేఘన అరవింద్ తో.  "అప్పుడే ఏమి చూసావ్ కధ మొదలైంది ఇప్పుడే కదా" అన్నాడు నవ్వుతు.  "నాకు ఎందుకో ఆల్ ది బెస్ట్ చెప్పాలని ఉంది" అని ఆల్ ది బెస్ట్ అంది  "థాంక్స్" అన్నాడు. కాని ఆల్ ది బెస్ట్ చెప్పిన మేఘన అంతరంగాన్ని మాత్రం అర్ధం చేసుకోలేకపోయాడు.  "అవును. నువ్వు అన్నట్టుగానే కధ ఇప్పుడే మొదలైంది" అంది  "అంటే"అని అడిగాడు.  "అర్ధం అవుతుందిలే నీకే ముందు ముందు" అని చెప్పి వెళ్ళిపోయింది. అంతుచిక్కని ఆలోచనలు ఉంటాయని అరవింద్ కి అప్పుడర్ధమైనది. 
* * *
ఓ రోజు అచ్యుత్ ఆటోకోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు. ఎంతసేపు చూసినా ఆటో రాకపోయే సరికి "ఛి! టైంకి బండి పాడవడం ఏమిటో, ఇంత పెద్ద వైజాగ్ నగరంలో ఆటో కరువు రావడం ఏమిటో, పొద్దున్న తొమ్మిదింటికి ఈ ఎండ ఏమిటో " అని విసుక్కుంటుడగా ఓ ఆటో అటుగా రావడం చూసి హమ్మయ్యా అనుకుని దానిని ఆపాడు. ఆటో డ్రైవర్ తో "యూనివర్సిటీకి వెళ్ళాలి" అని చెప్పి ఆదమరపుగా వెనక సీట్ వైపు చూసాడు. సముద్ర కెరటం ఉవ్వెత్తున ఎగసిపడింది. వెనక సీట్లో చైతన్య కూర్చుని ఉంది. ఒక్కనిమిషం గుండె ఆగి కొట్టుకుంది. "ఎక్కండి సార్" అన్నాడు డ్రైవర్. అతని మాటలకు తేరుకుని చైతన్య పక్కన కూర్చున్నాడు. మనసులో ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.  చైతన్య పక్కన కూర్చోవడం. తనతో కలిసి ప్రయాణించడం. ఆనందం పట్టలేకున్నాడు. బయట సముద్రం చూస్తూ ఉన్న చైతన్యని అద్దంలో చూస్తూ మురిసిపోయాడు. అతనికా క్షణాలు చాలా విలువైనవి.  "సార్ దిగండి" అన్నాడు ఆటోవాడు.  "యూనివర్సిటీ వెళ్ళాలి బాబు" అన్నాడు అచ్యుత్.  "యూనివర్సిటీ వచ్చేసింది సార్" చెప్పాడా డ్రైవర్. అప్పుడే వచ్చేసిందా అని అన్నాడు నిరాశగా. దిగి 20 రూపాయల నోటు ఇచ్చాడు. చైతన్య 100 నోటు ఇవ్వబోతే "చిల్లర లేదు మేడం, మీ పది రూపాయలు సార్ కి ఇచ్చేయండి మేడం" అంటూ ఉచిత సలహా ఇచ్చాడా డ్రైవర్. అప్పుడు చూసింది చైతన్య మొట్టమొదటిసారి అచ్యుత్ ముఖాన్ని. ఇబ్బందిగా కదిలాడు. ధైర్యం కూడగట్టుకుని పదాలు పేర్చుకుంటూ"..పరవాలేదులెండి. నేను ఇక్కడే చదువుతున్నాను. తర్వాత నాకిద్దురు..." అని అన్నాడు. ఆ మాటలు విని చైతన్య దిగింది. అప్పుడే యూనివర్సిటీ కి వస్తున్న అరవింద్ ని చూసి "అన్నయ్యా" పిలిచింది. అరవింద్ ఇద్దరిని చూసాడు. అచ్యుత్ ముఖమైతే మతాబులా వెలిగిపోతోంది. "ఏంటి అచ్యుత్ ?" అని ముందుగా కావాలనే అచ్యుత్ ని పలకరించాడు.  "నీకు ఇతను తెలుసా?" అని అడిగింది అరవింద్ ని.  "తెలుసు నీకు పారలల్, మైక్రోబయాలజీ, పేరు అచ్యుత్" అని పరిచయం చేస్తున్నట్టుగా చెప్పాడు.  "ఓ అవునా! నైస్ టు మీట్ యు. ఓకే. చేంజ్ తర్వాత ఇస్తాను" అని చెప్పి వెళ్ళిపోయింది.  "ఏంటిరా కలిసి వచ్చారు. ఏంటి సంగతి." అనడిగాడు అరవింద్ భుజంపై చేయి వేస్తూ.  "ఏమి లేదు.. బండి రిపేర్,, ఆటోకోసం వెయిట్ చేస్తుంటే చైతన్య ఉన్న ఆటో వచ్చింది. ఎక్కాను." చెప్పాడు.  "ఓ గుడ్, ఎలా ఉంది జర్నీ" అని అడిగాడు నడుస్తూ.  "ఫస్ట్ టైం మా ఇంటికి దూరంగా యూనివర్సిటీ ఉంటే బాగుండును అనిపించింది" చెప్పాడు.  దానికి అరవింద్ నవ్వుతూ అప్పుడే ఏమైంది? కలిసి ప్రాజెక్ట్ చేయబోతున్నారు, ముందు ముందు చాలా ఎంజాయ్మెంట్ ఉంది" అని అన్నాడు.  "అవునా? నిజంగానా?"అడిగాడు అచ్యుత్ ఆనందంతో  "నిజం. నువ్వు చైతన్యని ప్రేమించినంత నిజం" అని అన్నాడు అరవింద్.  "థాంక్యు... థాంక్యు సో మచ్...నీ ఋణం ఉంచుకోను" అని అన్నాడు  "అంత పెద్ద మాటలు ఎందుకులే పదా..."అని చెప్పి మీటింగ్ హాల్ లోకి ఎంటర్ అయ్యారు.  స్టూడెంట్స్ అందరు మీటింగ్ కి హాజరు అయ్యారు. "అందరు నా మాట విని కలిసి ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యు వెరీ మచ్. ప్రాజెక్ట్స్ విషయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి మేము సిద్ధం. మేము రాన్డంగా కొన్ని పేర్లను సెలెక్ట్ చేసాము. టీం కి ముగ్గురు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో డిపార్ట్మెంట్ స్టూడెంట్ అయి ఉంటాడు. పేర్లు చదవడం మొదలు పెడుతూ ముందు బయోటెక్నాలజీ-మైక్రోబయాలజీ-బయోకెమిస్ట్రీ ఈ వరసలో పేర్లు పిలుస్తాను. అందులో లీడర్ని కూడా మేమే నిర్ణయించాము. ఇందులో ఎటువంటి పార్షియాలిటీ లేదు" అని చెప్పి పేర్లు చదవడం ప్రారంభించాడు. కొన్ని పేర్లను చదివాక అచ్యుత్ ఏ టైం కోసమైతే ఎదురుచూస్తున్నాడో ఆ టైం రానే వచ్చింది.  చైతన్య-అచ్యుత్-భార్గవి. లీడర్-చైతన్య అని చెప్పాడు. అచ్యుత్ ఆనందానికి అవధుల్లేవు.  మళ్ళి కొన్ని పేర్లు చదివాక,  నవ్య-రాజీవ్-రాకేశ్. లీడర్-నవ్య చెప్పాడు. రాజీవ్ అరవింద్ ని కోపంతో చూసాడు. నవ్య నెమ్మదిగా రాజీవ్ వైపు చూసింది భయంతో. అలానే చూస్తూ “ నాకిష్టం లేదు యూనివర్సిటీ లో ప్రాజెక్ట్ చేయడం" అని చెప్పాడు.  "అది ముందు చెప్పాలి" అన్నాడు నిరంజన్.  "నాకు తెలియలేదు, నువ్వు అరవింద్ కలిసి ఇలా చేస్తారని,, లేకపోతే అప్పుడే ఇష్టం లేదని చెప్పేవాడిని" అన్నాడు రాజీవ్.  "నిన్ను ప్రాజెక్ట్ చేయడం కోసం సెలెక్ట్ చేసాం అంతకంటే ఏమి లేదు. అంతకంటే మనసులో ఏమైనా ఉద్దేశ్యాలు ఉంటే తీసేయి" అన్నాడు అరవింద్.  నవ్య వైపు చూస్తూ "నాకే ఉద్దేశ్యాలు లేవు" అన్నాడు రాజీవ్ .  "అలాంటపుడు మారు మాట్లాడకుండా ప్రాజెక్ట్ చెయ్" అన్నాడు నిరంజన్  "సరే, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రాజెక్ట్ చేయమను"అని చెప్పి వెళ్ళిపోయాడు రాజీవ్. అలా అనేసరికి నవ్యకి బాధనిపించింది."అంత ఇష్టం లేకపోతే తనతో చేయడం నాకు ఇష్టం లేదన్నాయ్య" అంది అరవింద్ తో. "నువ్వు ఇలాంటివేమీ మనసులో పెట్టుకోకుండా ప్రాజెక్ట్ చేయ్. ప్రేమని చూపించకు, చూపిస్తున్నట్టు కూడా ఎక్కడా కనపడనివ్వకు. వాడికి డౌట్ రావాలి, ఆ తర్వాత కధ నేను నడిపిస్తాను " అని దగ్గరగా వచ్చి చేయి పట్టుకుని "ప్రేమకు నిరీక్షణ అవసరం" అని చెప్పాడు అరవింద్. సరే అన్నాట్టుగా తలూపింది నవ్య. 
* * *
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#11
"హుర్రే !!! గట్టిగా అరిచాడు అచ్యుత్. "నమ్మలేకపోతున్నాను. నేను చైతన్యతో టైం స్పెండ్ చేయబోతున్నాను. చైతన్యతో రోజు ఉంటాను. చైతన్య చైతన్య అంటూ పిలుస్తుంటాను. దగ్గరగా చూస్తూ ఉంటాను. ఏమో అనుకున్నాను కాని కొద్దో గొప్పో నేను అదృష్టవంతుడినే. నాపై నాకెప్పుడు నమ్మకం లేదు అరవింద్. అలాంటింది నిన్ను నమ్మాను. నాకు అదృష్టం కలగజేసింది నువ్వే. నా ప్రేమను చైతన్యకి ఎలా చెప్పాలా అని అనుకునేవాడిని. ఇప్పుడు అవకాశంవచ్చింది. ప్రాజెక్ట్ చేసేంత కాలం తనకి మంచి ఫ్రెండ్ లా ఉంటాను. తన ఇష్టాఅయిష్టాలన్నీ తెలుసుకుంటాను. ప్రాజెక్ట్ ఆఖరి రోజు నా ప్రేమ గురించి చెప్తాను. ఆ తర్వాత నా తలరాత ఎలా ఉంటే అలా..." అంటూ ఆనందంతో ఊగిపోతున్నాడు.  "సరే సరే, జాగ్రత్త. ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్స్ చేయడం కన్నా ఆమెకు నీపై నమ్మకం కలిగించడం ఇంపార్టెంట్" అన్నాడు నిరంజన్. "తప్పకుండా" అన్నాడు అచ్యుత్ నవ్వుతు.  ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్ళాక మేఘన అడిగింది "అంతా బాగానే ఉంది కాని , మౌనిక పేరు చదవలేదేంటి?" అని.  "తను నాతో ప్రాజెక్ట్స్ చేస్తుంది నా గైడెన్స్ లో " చెప్పాడు అరవింద్.  "దేవాంతకుడివే!!" అంది మళ్ళి "కాని ముగ్గురు స్టూడెంట్స్ అన్నావుగా?" అని అడిగింది.  "అవును, అందరిని గ్రూప్స్ కింద విడగొట్టగా ఇద్దరు మిగిలారు. ఒకరు మౌనిక, ఇంకొకడు పేరు మాధవ్. ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అని విన్నాను" అని చెప్పాడు.  "ఓ ఐడియా బాగుంది" అంది  "సరే, రేపు మౌనిక యూనివర్సిటీ వస్తే నన్ను కలవమని చెప్పు" అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.  ఆ తరవాత రోజు మౌనిక యూనివర్సిటీ కి వచ్చి నోటీసు బోర్డు లో తనతో పాటు ప్రాజెక్ట్ చేసేవాడి పేరు చూసి మేఘనతో "మాధవ్ ఎవరే?" అని అడిగింది. "బయోటెక్నాలజీ స్టూడెంట్ ఇర్రెగ్యులర్ అని వినికిడి." చెప్పింది మేఘన. "మరి ఎలా?" అంది  "నిన్ను అరవింద్ ఒకసారి కలవమన్నాడు. వెళ్లి కలు" అని చెప్పింది మేఘన.  సరే అని చెప్పి అరవింద్ ని కలవడానికి డిపార్ట్మెంట్ కి వెళ్ళింది. ల్యాబ్ వర్క్ చేసుకుంటూ బిజీ గా అరవింద్ ని పిలిచి "ఇక్కడ అరవింద్ అంటే?" అని అడగబోయింది. "నేనే చెప్పండి" అన్నాడు ఏమి తెలియనట్లు."నా పేరు మౌనిక. ప్రాజెక్ట్ కోసం కలవమన్నారట.” అంది.  "ఓకే, ఓకే . మీతోపాటు ఇంకో స్టూడెంట్ ఉండాలే అతనేడి?" ప్రశ్నించాడు.  "ఏమో అతనెవరో నాకు తెలిదు. ఇర్రెగ్యులర్ స్టూడెంట్ అని మా ఫ్రెండ్ చెప్పింది" అని చెప్పింది.  "ఓ అలాగా. డోంట్ వర్రీ, ఐ విల్ హెల్ప్ యు" అన్నాడు. థాంక్యు అని చెప్పి నిష్క్రమించింది. కాసేపయ్యాక ఒక వ్యక్తి అరవింద్ దగ్గరకి వచ్చి "అరవింద్ అంటే...."అన్నాడు. "నేనే అన్నాడు" అరవింద్. అతను పొట్టిగా ఉన్నాడు. గడ్డం ఒత్తుగా ఉంది. కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయ్. మనిషి నల్లగా ఉన్నా కళగా ఉన్నాడు."నా పేరు మాధవ్" అన్నాడు. నిర్ఘాంతపోయాడు అరవింద్. తమాయిన్చుకుంటూ "ఓ నువ్వేనా. నువ్వు ఇర్రెగ్యులర్ అని విన్నాను. ప్రాజెక్ట్ చేసేటపుడు కూడా అలా వస్తే ఒప్పుకోను" మొదటిలోనే అతనిపై అధికారం చేలయిద్దాం అన్నట్టుగా అన్నాడు అరవింద్.  చిరునవ్వుతో "సరే , వస్తాను మానకుండా?" చెప్పాడతను  "నీ బ్యాచ్ మేట్ ఎవరో తెలుసా" అని అడిగాడు  “తెలుసు. మౌనిక " అన్నాడు కూల్ గా.  "ఓకే ఫైన్. రేపు షార్ప్ 10 కి వచ్చేసేయ్. " ఆర్డర్ వేసాడు.  "సరే, తప్పకుండా" చెప్పి వెళ్ళిపోయాడతను.  "వీడేంటిరా సడన్ ఎంట్రీ ఇచ్చాడు అని అనుకున్నాడు మనసులో. కాని అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కాని ఎక్కడ చుసాడనేది గుర్తుకురాలేదు. ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. ఇంటికెళ్ళాక మేఘన అడిగింది "కలిసావా మౌనికని "అని. "కలిసాను ఆ మాధవ్ కూడా వచ్చాడు. అవునా మరీ అంత నిరాశగా పలుకుతున్నావ్ ఏంటి అతను వచ్చాడని?" అని అడిగింది.  "అదేం లేదు కాని అతన్ని ఎక్కడో చూసాను , కాని గుర్తుకు రావడం లేదు, ఎంత ఆలోచించినా" అని అన్నాడు.  "ముందు పందెం గురించి ఆలోచించు" అంది  "ఏంటి నేను నెగ్గాలని కోరుకుంటున్నావా?" ఎదురు ప్రశ్న వేసాడు.  "అబ్బే లేదు. డైవెర్ట్ అవుతున్నావేమో అని" అంది  ఏదో సందేహం బయలుదేరింది అరవింద్కి. తను గెలవాలని మేఘన కోరుకోవడం ఏంటి అని....కాని దానికి అంతగా పట్టించుకోకుండా " డైవర్ట్ అవడం లేదు. కొంచెం క్లారిటీ కావాలి" అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అతన్ని ఎక్కడ చూసానా అని.  నిజానికి మేఘనకి మౌనికపై ఈర్ష్య ఉంది. ఆమె తనకంటే అందంగా ఉంటుందని అసూయ. అందుకనే అరవింద్ ద్వారా తన అహం శాంతపరుచుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. ఇద్దరిని కలిపి ఓ టైములో విడగొట్టేస్తే మౌనిక కృంగిపోతుంది. అప్పుడుమౌనికని ఓదార్చి తన విలువను ప్రకటించుకునే ప్రయత్నం చేయదలచుకుంది. ఆ బాధలో మౌనిక ఎవరో ఒకరితో ఎడ్జస్ట్ అయిపోయే స్టేజి కి తీసుకెళ్ళిపోయి, ఆమె కంటే తాను పైస్థాయిలో ఉండడం కోసం తన ముందే మరో మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తన అహాన్ని పూర్తిగా శాంతపరచుకుని ఆనందిద్దాం అని అనుకుంది.అందం విషయంలో అమ్మాయిలకు, అధికారం కోసం అబ్బాయిలకు కోల్డ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి.కాని తన ప్రయత్నం దెబ్బ కొడుతుందని మేఘన ఊహించలేదు. ఇంకా ఆలోచనలో ఉన్న అరవింద్ తో "ఏంటి ఆలోచిస్తున్నావ్?" అని అడిగింది మేఘన.  "ఏమి లేదు కాని , నాకు మౌనికగురించి చెప్పు " అని అన్నాడు.  మేఘన చెప్పడం ప్రారంభించింది." మేఘన అందరిలాంటి అమ్మాయి కాదు. చాలా డబ్బు ఉన్న అమ్మాయి. వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. తల్లి మహిళా మండలి అధ్యక్షురాలు. తనకు ఈ డబ్బు మీద, అధికారాల మీద ఎటువంటి ఇష్టం లేదు. వాళ్ళింట్లో తాను పూర్తిగా విరుద్ధం.పంజరంలో చిలుక లాంటిది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయలన్ని పాపం దానిపై రుద్దుతూ ఉంటారు. అందుకే తనపై అధికారం చేసే వాళ్ళన్న, అజమాయిషీ చేసే వాళ్ళన్న తాను అస్సలు ఇష్టపడదు.జీవితంలో ప్రతీది కొత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అంత ఈజీగా ఎవరిని నమ్మదు." ముగించింది.  ఆరోజు ప్రశాంతంగా గడిచింది. పెనుతుఫానులకు ముందు ఆకాశం నిశబ్దంలా........ఏదో సందేహం బయలుదేరింది అరవింద్కి. తను గెలవాలని మేఘన కోరుకోవడం ఏంటి అని,.. కాని దానికి అంతగా పట్టించుకోకుండా " డైవర్ట్ అవడం లేదు. కొంచెం క్లారిటీ కావాలి" అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. అతన్ని ఎక్కడ చూసానా అని.  నిజానికి మేఘనకి మౌనికపై ఈర్ష్య ఉంది. ఆమె తనకంటే అందంగా ఉంటుందని అసూయ. అందుకనే అరవింద్ ద్వారా తన అహం శాంతపరుచుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. ఇద్దరిని కలిపి ఓ టైములో విడగొట్టేస్తే మౌనిక కృంగిపోతుంది. అప్పుడుమౌనికని ఓదార్చి తన విలువను ప్రకటించుకునే ప్రయత్నం చేయదలచుకుంది. ఆ బాధలో మౌనిక ఎవరో ఒకరితో ఎడ్జస్ట్ అయిపోయే స్టేజి కి తీసుకెళ్ళిపోయి, ఆమె కంటే తాను పైస్థాయిలో ఉండడం కోసం తన ముందే మరో మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అలా తన అహాన్ని పూర్తిగా శాంతపరచుకుని ఆనందిద్దాం అని అనుకుంది.అందం విషయంలో అమ్మాయిలకు, అధికారం కోసం అబ్బాయిలకు కోల్డ్ వార్స్ జరుగుతూనే ఉంటాయి.కాని తన ప్రయత్నం దెబ్బ కొడుతుందని మేఘన ఊహించలేదు. ఇంకా ఆలోచనలో ఉన్న అరవింద్ తో "ఏంటి ఆలోచిస్తున్నావ్?" అని అడిగింది మేఘన.  "ఏమి లేదు కాని , నాకు మౌనికగురించి చెప్పు " అని అన్నాడు.  మేఘన చెప్పడం ప్రారంభించింది." మేఘన అందరిలాంటి అమ్మాయి కాదు. చాలా డబ్బు ఉన్న అమ్మాయి. వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. తల్లి మహిళా మండలి అధ్యక్షురాలు. తనకు ఈ డబ్బు మీద, అధికారాల మీద ఎటువంటి ఇష్టం లేదు. వాళ్ళింట్లో తాను పూర్తిగా విరుద్ధం.పంజరంలో చిలుక లాంటిది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అభిప్రాయలన్ని పాపం దానిపై రుద్దుతూ ఉంటారు. అందుకే తనపై అధికారం చేసే వాళ్ళన్న, అజమాయిషీ చేసే వాళ్ళన్న తాను అస్సలు ఇష్టపడదు.జీవితంలో ప్రతీది కొత్తగా ఉండాలి అని అంటూ ఉంటుంది. అంత ఈజీగా ఎవరిని నమ్మదు." ముగించింది.  ఆరోజు ప్రశాంతంగా గడిచింది. పెనుతుఫానులకు ముందు ఆకాశం నిశబ్దంలా....  మౌనిక , మాధవ్లు ఇద్దరు వచ్చారు. అరవింద్ ప్రాజెక్ట్స్ గురించి పూర్తిగా వివరించి చెప్పాడు. మాధవేమి అనుకున్నాట్టుగా అంత అడ్డం ఏమి రాలేదు. కాని రెగ్యులర్గా మాత్రం వచ్చేవాడు. కాలం గడిచేకొద్ది మౌనిక అరవింద్లు మంచి స్నేహితులు అయ్యారు. పేర్లు పెట్టి పిలుచుకునేత స్నేహం ఏర్పడింది. అందరు చెప్పినట్లు తనేమి అందగత్తె అని ఏమి ఫీల్ అవదు. చూసేవాడు అలా అనుకుంటాడు అంతే !! కాని తాను కూడా సగటు అమ్మాయిలా ఉంటుంది. మాట్లాడుతుంది. అలుగుతుంది. నవ్వుతుంది. సెన్సిటివ్ గా ఉంటుంది. ఎందుకో అరవింద్ కి మౌనిక పై నిజంగా ప్రేమ కలిగింది. మాటల్లో అప్పుడప్పుడు ఆమె ఇంట్లో తననేలా ట్రీట్ చేస్తారో చెప్పుకొచ్చేది కుడా..  ఓ రోజు మౌనికతో "నేను ఒకటి అడుగుతాను , ఏమనుకోవుగా" అన్నాడు.  "అడుగు" అంది  "నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా?"  "ఎందుకలా అడిగావు?"  "ఏమో అడగాలనిపించింది"  "ఉన్నాను అంటే ఉన్నాను లేను అంటే లేను" అంది.  "అంటే..."  "అంటే.... అంతే.. "  రెండు సెకెన్ల తరవాత "ఐ లవ్ యు " అన్నాడు. మౌనిక ముఖం కంద గడ్డలా మారిపోయింది. "వాట్ ???" అరిచింది. "ఎస్ , నేను నిన్ను ప్రేమిస్తున్నాను.పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు" అన్నాడు కూర్చున్న వాడు లేస్తూ.  "ఆలోచించుకోవడానికేమి లేదు. ఐ యామ్ సారీ" తానూ కూడా లేచి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న మౌనికని చూస్తూ ఉండిపోయాడు.  అరవింద్ ప్రోపోస్ చేసిన విషయం మౌనిక అన్నయ్య సుధీర్ కి తెలిసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి అరవింద్ ని కొట్టాడు. చేయి విరిగింది. అందరికి మెట్లమీంచి పడ్డానని చెప్పాడు. రెండు రోజుల తర్వాత మౌనికకు విషయం తెలిసింది. వెళ్లి అన్నయ్యను నిలదీసింది, "నీకేమైనా పిచ్చా అన్నయా?? ఎవరిని పడితే వాళ్ళని అలానే కొట్టేస్తావా? మొన్న ఈ మద్యన కూడా ఎవరో నాకు లవ్ లెటర్ ఇచ్చారని విని నిజానిజాలు తెలుసుకోకుండా కొట్టేయడానికి వెళ్లావు. అది నాకు వచ్చిన లెటర్ కాదు అని తెలుసుకున్నాక ఊరుకున్నావ్.. అరవింద్ నాకు గైడ్ లాంటివాడు. ఫ్రెండ్ లాంటి వాడు. అంతే." అంది ఆవేశంగా.  "లాంటివాడు ... లాంటివాడు.. ఏంటి?, నిజం చెప్పు ఎలాంటివాడో?" అని అడిగాడు.  "ఫ్రెండ్ అన్నానుగా" అంది గట్టిగా.  ఆ తరువాత మౌనిక వచ్చి పలకరించినా అరవింద్ ఏమి మాట్లాడలేదు. మాములుగా ప్రాజెక్ట్ లో హెల్ప్ చేసి వెళ్ళిపోయేవాడు. ఇలా వారం రోజులు గడిచాక...  ఓ రోజు "నీతో మాట్లాడాలి అరవింద్" అంది వెళ్తున్నవాడికి అడ్డం పడుతూ.  "నాకు లేదు" అన్నాడు దారి చూసుకుంటూ.  "అరవింద్, ప్లీజ్, నా మాట విను. నేనేమి మా అన్నతో చెప్పలేదు. ఎవరో చెప్పారు. నాకసలు ఏమి తెలిదు" అంది అరుస్తూ. ఆగి వెనక్కి తిరిగి "నాకు దెబ్బలు తగిలినందుకు నేనేమి బాధపడటం లేదు. నీకోసం ఎన్ని దెబ్బలైనా తింటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మౌనికా. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు కనీసం నాగురించి ఒక్కసారైనా ఆలోచించి అప్పుడు నీ నిర్ణయం చెప్పు. అప్పుడు కూడా నీకు ఇష్టం లేదంటే నేనేమి అడగను...నీకోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాను. నువ్వు తప్ప నా భార్యగా వేరొకరిని ఊహించుకోలేను." అని చెప్పి వెళ్ళిపోయాడు. మౌనిక మౌనంగా ఉండిపోయింది. ఆమెకు అరవింద్ పై ఆలోచనలు మరింత ఎక్కువయ్యాయి. రాత్రి పది అవుతుండగా మేఘనకు ఫోన్ చేసింది. మేఘన ఫోన్ లిఫ్ట్ చేసి "హలో, ఏంటే ఈ టైం లో" అనడిగింది.  "ఏమి లేదు...అరవింద్ వచ్చాడా?" అడిగింది మౌనిక  "అతని గురించి అడుగుతున్నావేంటే? ఇంకా ఇంటికే రాలేదు"  "రాలేదా? ఇంతసేపు ఏం చేస్తుంటాడు?"  "ఏమో? నాకెలా తెలుస్తుందే? "  "సరే ఉంటాను" ఫోన్ పెట్టేసి, మళ్ళి గంట తరువాత ఫోన్ చేసింది "అరవింద్ వచ్చాడా?" అంటూ..  మేఘన నిద్ర మత్తుతోనే "లేదు. ఇంకా రాలేదు. ఏమైందే?" అని అడిగింది.  "ఏమి లేదు. ఓకే . ఉంటాను. గుడ్ నైట్ .” కట్ చేసేసింది మౌనిక.  అరవింద్ కోసం ఆరాత్రి అంతా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలీదు. ఉదయం 5 గంటలకు మెలకువ వచ్చింది. వెంటనే లేచి మేఘనకు ఫోన్ చేసింది. పొద్దున్నే ఎవవరురా అనుకుంటూ లిఫ్ట్ చేసింది మేఘన. "నేను మౌనికని. అరవింద్ వచ్చాడా?"  "ఇప్పుడేమిటి రాత్రే వచ్చాడు"  "ఇప్పుడెం చేస్తున్నాడు? రాత్రి ఏమైనా తిన్నాడో లేదో అడిగావా?"  "ఏమో నేను అడగలేదు. ఇప్పుడు ఏమి చేస్తుంటాడో కూడా నాకు తెలీదు, చూసొచ్చి చెప్పానా?"  "వద్దులే" ఫోన్ పెట్టేసింది. మేఘన బద్ధకం తీర్చుకుని మేడపైకి వెళ్ళింది. అరవింద్ బయట కుర్చీని చదువుకుంటున్నాడు.  "ఏంటి మేఘనా? పొద్దున్నే" అన్నాడు అరవింద్  "నీకేమి చెప్పాను నువ్వేమి చేస్తున్నావ్? అనిదిగింది.  "దేనిగురించి"  "పందెం"  "ఓ.. ఏమైందని ఇంకా మూడు రోజులుంది కదా"  "నీకోసం రాత్రి మౌనిక రెండు సార్లు ఫోన్ చేసింది. ఇప్పుడు కూడా"  "ఎందుకు?"  "తన మాటల బట్టి చూస్తుంటే రాత్రంతా నీగురించే ఆలోచించింది అని అనిపిస్తోంది.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#12
ఏమో అనుకున్నాను నువ్వు తనను మార్చేసావు"  "అంటే"  "ముందు ఈ వారం రోజులు నువ్వేం చేసావో చెప్పు"  "ఐ లవ్ యు అని చెప్పాను" అన్నాడు కూల్ గా.  అదిరిపడింది "ఏంటీ???" అంది సాగదీస్తూ.  "అవును. పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పాను. కాని ఇవన్ని పందెం నగ్గడానికి కాదు. నిజంగా తనని ప్రేమిస్తున్నాను." చెప్పాడు. ఉలుకుపలుకు లేకుండా నిలబడిపోయింది. అరవింద్ చెప్పుకుంటూ పోతున్నాడు తన ధోరణిలో "ఈ క్రెడిట్ అంతా నీదే మేఘన. నువ్వే మా ఇద్దరిని ఇండైరక్ట్ గా కలిపావు. తను నిన్ను ఇగ్నోర్ చేయడం కాదు. నేను చూపించే ప్రేమ వల్ల నిన్ను మర్చిపోవచ్చు కూడా అంటూ నవ్వేడు. నాజీవితంలో ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదేమో" అని ముగించాడు. 
* * *
ఆరోజు అరవింద్ యూనివర్సిటీ లో అందరితోపాటు ఉండగా మౌనిక వచ్చి "హాయ్ అరవింద్" అని పలకరించింది. అక్కడున్న అందరు ఆశ్చర్యపోయారు. "హాయ్"అన్నాడు అరవింద్. "రా,నా ఫ్రెండ్స్ ని అందరిని పరిచయం చేస్తాను అని అందరిని పరిచయం చేసాడు. అచ్యుత్ నవ్వుతు "నువ్వు మాకందరికీ ముందే తెలుసు, మేమే నీకు తెలియదు. నిజానికి నిన్ను అరవింద్ కి చూపించింది మేమే, మళ్ళి మాకు కొత్తగా నిన్ను పరిచయం చేస్తున్నాడు" అని అన్నాడు.  చైతన్య, అచ్యుత్ ని "టైం అయింది వెళ్దామా? అని అడిగింది చైతన్య వైపు చూసి నవ్వుతు అరవింద్ కేసి చూసి చైతన్య వెనకాల అడుగులు వేసాడు. అరవింద్ వల్ల వాళ్లిద్దరు మంచి స్నేహితులైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక అరవింద్ "ఏరా నీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది?" అం అడిగాడు రాజీవ్ ని.  "అవుతోంది" అని పొడిగా సమాధానం ఇచ్చాడు.  "మీ లీడర్ నవ్యఎలా ఉంటోంది?" అని మరో ప్రశ్న వేసాడు.  "ఉంటోంది..."అన్నాడు నవ్యవైపు చూస్తూ.  "వెళ్దామా?!" అని అడిగింది నవ్య రాజీవ్ ని.  "నువ్వు వెళ్ళు. నేను తరువాత వస్తాను" అన్నాడు. తాను మౌనంగా కదిలింది.  అందరు వెళ్ళిపోయాక మౌనిక అరవింద్ తో "సాయంత్రం బీచ్ కి వెళ్దామా?" అని అడిగింది.తన వైపు నవ్వుతు చూస్తూ "సరే" అన్నాడు. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసాడు.  పౌర్ణమి రోజు కావడం వలన చందమామ నిండుగా ఉంది. అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అలా సముద్రాన్ని చూస్తూ కూర్చున్నారు ఇద్దరు. చల్లటి గాలి వీస్తుండగా నిశబ్దాన్ని భగ్నం చేస్తూ "మౌనిక" అని పిలిచాడు.  "ఉ ..."అంది.  "నీకా చందమామని చూస్తుంటే ఏమనిపిస్తోంది?" అని అడిగాడు చందమామని చూస్తూ.  "మ్.. నాకు గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టాలనిపిస్తోంది" అంది. ఆ మాట అంటున్నపుడు మౌనిక కళ్ళల్లో వెలుగుని చూస్తూ ఉండిపోయాడు. తాను కూడా అరవింద్ ని చూస్తూ ఉండిపోయింది. శరీరం అదుపుతప్పిన ఫీలింగ్. ఇద్దరు ఒక్కసారిగా తమాయించుకుని సిగ్గుతో ముఖాలు తిప్పేసుకున్నారు. కాసేపయ్యాక "నీకు నేనంటే ఇష్టమా?"అని అడిగింది.  "అవును" అన్నాడు.  "ఎంత ఇష్టం?" అని అడిగింది.  "ఈ సముద్రమంత" చెప్పాడు  "అంతేనా?" మళ్ళి అడిగింది ఇంకా ఇష్టం ఉంటే బాగుండుననే ఉద్దేశ్యంతో.  "ఈ ఆకాశమంత, ఈ సముద్రమంత" చెప్పాడు మళ్ళి  "అంతేనా???" కావాలనే రెట్టించింది.  "మ్... మా అమ్మ అంత, మా ఫ్రెండ్ ప్రమోద అంత " అన్నాడు చివరగా.  "ప్రమోద ఎవరు?" అని అడిగింది ఒక్కసారిగా.  "ఓ , నీకు చెప్పలేదు కదా, చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఆడుకున్నాం, కొట్టుకున్నాం. తను నాకు మంచి స్నేహితురాలు. అమ్మాయి అంటే అలా ఉండాలి" అన్నాడు. మౌనికకి తరువాత ఏ ప్రశ్న అడగాలో అడగాలో అర్ధం కాక "వెళ్దామా?" అంది.  "అప్పుడేనా?ఇప్పు డే కదా వచ్చాం." అన్నాడు.  "లేదు వెళ్దాం"అంది ముభావంగా.  "అర్ధమైంది. ప్రమోదకు నాకు సంబంధం ఏమిటి అని ఆలోచిస్తున్నావా?"  "లేదు" అని అబద్ధం చెప్పింది. "నీకు ఏమైనా అనుమానాలుంటే నన్ను డైరెక్ట్ గానే అడుగు మౌనిక, నీ మనసులో ఉంచేసుకోకు!. ప్రమోద అంటే నాకు గౌరవం, అభిమానం. అంతే, ఇంకేమి లేదు. కాని నువ్వు అంటే నాకు ఇష్టం, ప్రేమ ఉన్నాయి." అన్నాడు  అరవింద్ ని కౌగలించుకుని "ఐ లవ్ యు "అంది. అతని ఆనందానికి అవధుల్లేవు. తన ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకుని "నన్ను నమ్ము మౌనిక. మహారాణిలా చూసుకుంటాను" అన్నాడు.  అరవింద్ మౌనికను ముద్దు పెట్టుకోవడం అంజలి చూసింది. వాళ్లిద్దరూ బయటకు వస్తుండగా అరవింద్ ని అడిగింది "ఏంటి అరవింద్, పప్పన్నం ఎప్పుడు?" అని.  "హాయ్ అంజలి" పలకరించాడు.  "నేను అంతా చుసానులే, ఏంటి లవ్వా? ముద్దు పెట్టేసావ్ పబ్లిక్ గా?" అని అడిగింది నవ్వుతూ. మౌనిక సిగ్గు పడింది. "మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం"అని చెప్పాడు మౌనిక వైపు చూస్తూ.  "నచ్చావ్ అరవింద్, ప్రేమించుకుంటున్నాం అనలేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నావ్.,మీ పెళ్ళికి సాక్షి సంతకం కావాలంటే చెప్పు. నేను పెడతాను" అంది నవ్వుతూ.  "అలాగే, తప్పకుండా, సరే వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు.  దార్లో "ఏంటి నీకు అమ్మాయిలు తప్ప అబ్బాయిలు ఫ్రెండ్స్ తక్కువనుకుంటాను " అంది మౌనిక. సమాధానంగా నవ్వాడు. మౌనికని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి తను రూమ్ కి వెళ్ళిపోయాడు.  
* * *
స్వాతి సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయింది.  "ఇలా ఫెయిల్ అవడం మన ఇంటా వంటా లేదు. నీకు ఇష్టం ఉండే కదా డిగ్రీ చేస్తున్నావు. మరెందుకు ఫెయిల్ అయ్యావు" ప్రశ్నించాడు స్వాతి తండ్రి. యూనివర్సిటీ నుండి నిరంజన్ అప్పుడే ఇంటికి వస్తూ తండ్రి మాటలు విని లోపలికి వచ్చి "ఏమైంది నాన్నగారు?" అని అడిగాడు.  "ఏమవుతుంది.. స్వాతి పరీక్ష తప్పింది" అని చెప్పాడు కోపంతో. ఏమి మాట్లాడకుండా నేల చూపులు చూస్తున్న స్వాతికేసి చూసి, "నేను మాట్లాడుతాను నాన్నగారు" అన్నాడు సద్ది చెప్పుతూ. తండ్రి నిరంజన్ మాట విని అక్కడి నుండి వెళ్లిపోతూ "మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవకూడదు. నీ చదువేదో అయితే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఫెయిల్ అయ్యి పరువు తీయకు " అన్నాడు హెచ్చరిస్తూ.  "చదువుకు పెళ్ళికి ముడి పెడతారేంటి నాన్న" అని ఎదురు ప్రశ్న అడిగింది.  "ఏమిటే!! కొత్తగా ఎదురు మాట్లాడుతునావ్ ..ఆ ...?" గర్జించాడు తండ్రి.  "నాకు ఇంకా చదువుకోవాలని ఉంది" అని చెప్పింది భయపడుతూ.  "ఇలా ఫెయిల్ అయి కూర్చుంటే పై చదువులేం చదువుతావ్?" అడిగాడు  " పరీక్ష కట్టి పాస్ అవుతాను. అయినా ఇప్పుడేమంత కొంపలు ములిగిపోలేదు. ఆ రోజు పరీక్ష కష్టంగా ఇచ్చాడు. మళ్ళీ రాస్తాను. పాసవుతాను. నాకిష్టం లేకుండా పెళ్లి సంబంధాలు చూడటం చేయకండి" చెప్పింది  "ఎప్పుడేమి చేయాలో నాకు తెలుసు. నువ్వు నాకు నేర్పనక్కర్లేదు. చెప్పనక్కర్లేదు. ముందు ఇక్కడి నుండి ఆతలికి పో" అని అరిచాడు తండ్రి. అసహనంతో అందరికేసి చూసి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. నిరంజన్ స్వాతి గదిలోకి వెళ్లి భోజనానికి రమ్మని పిలిచాడు. నాకు ఆకలిగా లేదు అని చెప్పింది. అన్నం కలిపి తనగదిలోకి తీసుకెళ్ళాడు. "కొంచెం తిను స్వాతి, అమ్మ మీద అన్నం మీద అలగకూడదు" అన్నాడు బ్రతిమాలినట్టుగా. "వద్దు. నాన్న ఎందుకు మాటిమాటికి పెళ్లి పెళ్లి అంటారు. నా ఇష్టాఇష్టాలు మీకు వద్దా? నాకేం కావాలో కూడా మీరే నిర్ణయిస్తారా?" అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. "అది కాదు స్వాతి, నువ్వు ఫెయిల్ అయ్యావనే బాధలోనో, కోపంతోనో నాన్న అలా అనుంటారు. నువ్వు చదువుకుంటానంటే ఎవరు కాదంటారు చెప్పు? అయినా నీపై కోప్పడింది పరాయివాళ్ళు కాదుగా, నాన్నే కదా! నాన్న నిన్ను ఏమి అనకూడదా? "అనడిగాడు శాంతంగా నచ్చచెపుతున్నట్టుగా. "అనకూడదు అని నేను అన్నానా? అయినా నాన్న అలా అనడం నాకు నచ్చలేదు" అంది. నిరంజన్ కోపంతో "బుద్ధిలేకుండా మాట్లాడకు స్వాతి. నాన్న ఏమి చేసినా నీ మంచి కోరే చేస్తారు. నీ ఇష్ట ప్రకారమే చేస్తారు. ముందు భోజనం చేయి" అని కంచం పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టాడు. “నాకు వద్దని చెప్పానుగా” అంటూ కంచం పక్కకు జరిపేసింది. అది బల్లపైనుండి కింద పడిపోయింది. నిరంజన్ కి పట్టరానంత కోపం వచ్చింది. "అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారే, ఎవడికోసమో ఆలోచనలు పెట్టుకుని చదువుని చెంకనాకేలా చేసుకుంది నువ్వు. చేసిన తప్పుకు తండ్రి కోప్పడితే అలా మాట్లాడడం నచ్చలేదు అంటూ వితండవాదం చేస్తుంది నువ్వు. ఈ మద్యన నీ ప్రవర్తన అసలేం బాగుండటం లేదు స్వాతి. నువ్వు ఇంతకు ముందులా లేవు" అన్నాడు "ఇంకా చాలు అన్నయ్య! నువ్వు నీ లెక్చర్స్. చిన్నప్పటి నుండి విని విని విసుగెత్తిపోయాను. అవును. నేను ఆలోచనలు పెట్టుకునే ఫెయిల్ అయ్యాను. నా జీవితం, నా చదువు, నా ఇష్టం." అంది పొగరుగా. చాచి పెట్టి చెళ్ళుమనేలా చెంపదెబ్బ కొట్టాడు. "ఛి! నా చెల్లెలువేనా నువ్వు? ఇలా తయారయ్యావేమిటే మొండిదానిలాగా? ఒకసారి ఆలోచించు, నీ ప్రేమను నేను కాదన్నానా? అడ్డు పడ్డాన? అసలేం లోటు చేసానే నీకు? చదువుకోమని చెప్పడం కూడా తప్పేనా? ఏం, ఆ మాత్రం అర్హత కుడా లేదా మాకు" అరిచాడు స్వాతి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంది." పో! నువ్వు నాతో మాట్లాడకు. నేను నీతో మాట్లాడను. అసలు నువ్వు నా అన్నయ్యవే కాదు" అంది. చలించిపోయాడు. కోపంలో చేయి చేసుకున్నానని బాధపడి "అది కాదు స్వాతి ....' అంటూ దగ్గరికి వెళ్ళబోయాడు. "గె....ట్... అ....వు...ట్ ....." అని అరిచింది. దయం అయింది. "ఏరా నిరంజన్, స్వాతి ఏది ఉదయంనుండి కనపడలేదు" అని అడిగాడు తండ్రి. కంగారుపడిపోయాడు నిరంజన్. ఇల్లంతా వెతికాడు."అమ్మా!స్వాతి ఏది?" అని తల్లిని అడిగాడు. "మేడ మీద గదిలో ఉందేమోర, పొద్దున్నించి కనిపించలేదు" అంది తల్లి పనిచేసుకుంటూ. పరిగెత్తుకుంటూ స్వాతి గాదిలోకి వెళ్ళాడు. రీడింగ్ టేబుల్ పై ఓ ఉత్తరం గాలికి ఎగురుతూ ఉంది. అందులో అమ్మా! నేను ఇంటిలోనుండి వెళ్ళిపోతున్నాను. నేను అశోక్ అనే అబ్బాయిని ప్రేమించాను. అతను కుడా నన్ను ప్రేమిస్తున్నాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ప్రేమని మీరు ఒప్పుకోరని నాకు తెలుసు. ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి పరాయి కులం వాడిని పెళ్లి చేసుకుంటానంటే ఖచ్చితంగా ఒప్పుకోరు. ఆచారాలు కట్టుబాట్లు అంటూ నన్ను కట్టి పాడేస్తారు. అందుకే వెళ్ళిపోతున్నాను. మీ స్వాతి నిరంజన్ కి ఉత్తరం చదివాక తల తీసేసినట్టైంది. తండ్రి తలపట్టుకుని స్తంభానికి ఆనుకుని కూర్చుండిపోయాడు.ఎంత పని చేసిందిరా అంటూ తల్లి శోకాలు పెట్టింది. నిరంజన్ తండ్రి దగ్గరకు వెళ్లి "నన్ను క్షమించండి నాన్నా! స్వాతి ప్రేమ సంగతి నాకు ఇంతకు మునుపే తెలుసు. మీకు చెబితే ఏమైనా అంటారేమో అని చెప్పలేదు. తరువాత వీలుచూసుకుని మీతో మాట్లాడదాం అని అనుకున్నాను. కాని ఇంతలోనే ఇది ఇంత పని చేస్తుందనుకోలేదు.ఈ విషయం మీదే స్వాతికి నాకు గొడవ అయింది. అవన్నీ మీకు చెప్పి బాధపెట్టడం ఎందుకు అని చెప్పలేదు...." కాసేపాగి తానే కొనసాగించాడు. "మీరు చెప్పండి నాన్న ఏమి చేద్దాం ఇప్పుడు? ఆ అశోక్ ని బాది చెల్లెల్ని ఈడ్చుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పాడేయమంటారా? వాళ్ళ ప్రేమని ఒప్పుకుని ఇంటికి ఆహ్వానిద్దాం అంటారా? లేక ఇవన్నీ ఎందుకు నీళ్ళు వదిలేసుకోమంటారా? చెప్పండి నాన్న చెప్పండి అంటూ కూర్చుని ఉన్న తండ్రి భుజంపై వెనక నుండి చేయి వేసాడు. తండ్రి పక్కగా ఒరిగిపోయాడు. "నాన్నా ........!!!!" పెద్దగా అరిచాడు. "నాన్న...... నాన్న....." అంటూ కంగారుగా కదిపాడు. కూతురు పరువు తక్కువ పని చేసిందనే మాట వినగానే ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఆ గుప్పెట గుండె బద్ధలైపోయింది. నిరంజన్ తండ్రిని పట్టుకుని ఏడ్చాడు. భర్త పోయేసరికి నిరంజన్ తల్లి ఉలుకుపలుకు లేకుండా బిగుసుకుపోయింది. మెంటల్గా బాగా అప్సెట్ అయిపొయింది. తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా!అమ్మా! అని పిలిచాడు. ఆమె అలానే భర్త వైపు చూస్తూ ఉండిపోయింది. వెంటనే రాజీవ్ అచ్యుత్ లకు ఫోన్ చేసాడు. జరిగినదంతా కంగారుపడుతూ ఏడుస్తూ చెప్పాడు. అంబులెన్సు తో సహా హుటాహుటిన అక్కడికి వచ్చారు ఇద్దరు. డాక్టర్ తల్లిని పరీక్షించి "బాగా షాక్ కి గురి అయ్యారు. తగిన చికిత్స అవసరం. హాస్పిటల్ లో చేర్పించండి. తొందరపడకపోతే ఈమెకు కూడా అపాయం." అని చెప్పి ఆమెను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు. రాజీవ్ తోడుగా వెళ్ళాడు. అపస్మారక స్థితిలో శవంలా పడి ఉంది. మరో పక్క తండ్రి శవం... విషయం వీధి నుండి ఊరికి, ఊరు నుండి బంధువులందరికీ పాకింది. బంధువులందరూ ఒక్కొక్కరుగా వచ్చారు. అందరు స్వాతి వెళ్ళిపోయిన విషయమే మాట్లాడుకుని రగిలిపోయారు. నిరంజన్ కి సానుభూతి ప్రకటించడం తప్ప ఇంకేమి చేయలేకపోయారు.
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#13
కార్యక్రమాలన్నీ జరిపించాడు. విషయం తెలుసుకుని నిరంజన్ దగ్గరకు మానస వచ్చింది. పక్కన కూర్చుని నిరంజన్ భుజంపై చేయి వేసింది. ఒక్కాసారిగా ఉలిక్కిపడి లేచి "పో! ఇక్కడి నుండి" అరిచాడు పెంకులెగిరిపోయేలా. నిర్ఘాంతపోయింది మానస. "పో! నువ్వూ వద్దు నీ ప్రేమా వద్దు. అసలీ ప్రేమలే వద్దు. స్వాతి ప్రేమ వల్ల నా తండ్రి ప్రాణం పోయింది. నా ప్రేమ వల్ల నా తల్లికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నాకు ఎవ్వరూ వద్దు, ఏమీవద్దు." అన్నాడు. "ఏమి మాట్లాడుతున్నావో అర్ధం అవుతోందా? పాపం మానస ఏమి చేసిందిరా?" అని అడిగాడు అచ్యుత్. "తనేం చేయలేదు, కాని తన వల్ల నా తల్లికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నా ప్రేమ నా తండ్రితోనే సమాధి అయిపోయింది." అన్నాడు నిరంజన్. అచ్యుత్ మళ్ళీ ఏదో చెప్పబోయాడు, చూపుడు వేలు చూపిస్తూ "మరో మాట మాట్లాడకుండా దాన్ని ఇక్కడినుండి పొమ్మను" అన్నాడు నిరంజన్. నిరంజన్ అలా అనేసరికి మానస క్రుంగిపోయింది. కళ్ళు జలదారలైయ్యాయి. గుండె బరువెక్కిపోయింది. నిల్చున్న చోట నిప్పులున్నాయా? .. ప్రేమ ఉన్న చోట ప్రాణం లేదు. ప్రాణం ఉన్న చోట ప్రేమ లేదు. తన ప్రాణం పోయినంత బాధతో ఏడ్చుకుంటూ బయటకు పరిగెత్తింది. అరవింద్ మానసను చూసుకుంటూ లోపలికి ప్రవేశించాడు. జరిగిన విషయం అంతా అచ్యుత్ అరవింద్ కి చెప్పాడు. అది తగిన సమయం కాదని అరవింద్ ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాడు. రెండు రోజుల తర్వాత స్వాతి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లి ఇంకా హాస్పిటల్లోనే ఉంది. "నాన్నా!... నాన్నా!..." అంటూ ఇంట్లోకి వెళ్తున్న స్వాతిని విసురుగా నడుచుకుంటూ వచ్చి గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు నిరంజన్. "ఇంకెక్కడి నాన్న? నాన్న బ్రతికుండగానే నువ్వు రాసిన డెత్ సర్టిఫికేట్ తీసుకుని అందరిని వదిలేసి వెళ్ళిపోయారు, దరిద్రం....! " అనరాని మాట అన్నాడు. నీ వల్ల అమ్మ పరిస్థితి కూడా రేపో మాపో అన్నట్టుగా ఉంది. పోవే... పో.. వద్దనుకుని పోయావుగా! ఇంకెన్ని ప్రాణాలు తీస్తావు? ఇంకెన్ని గుండెలు బద్దలు కొడతావు? ఛి! ఛి! నువ్వు నా చెల్లివి అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. ఇంకా నిలబడ్డావేంటి? పో!!!! " అని అరుస్తూ మెడ పట్టుకుని వీధిలోకి నెట్టేసాడు. అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన అరవింద్ కింద పడిన స్వాతిని లేపుతూ "ఒరేయ్! నువ్వేం చేస్తున్నావో తెలుస్తోందా? స్వాతి నీ ....." అని చెప్పబోతుంటే, "ఇది నా కుంటుంబ సమస్య. నీకనవసరం" అని తెగేసి చెప్పాడు నిరంజన్. మరో మాట లేదు అరవింద్ కి. ఆ మాట కొరడా దెబ్బలా తగిలింది. నిరంజన్ తలుపులు మూసేసాడు.  స్వాతిని తీసుకుని అక్కడినుండి తన రూం కి వెళ్ళాడు. రాజీవ్ ని అచ్యుత్ ని తన రూం కి రమ్మని పిలిచాడు. అందరు తన ఇంటికి రావడం మేఘన గమనించింది. స్వాతికి మంచి నీళ్ళు ఇచ్చాడు అరవింద్. అచ్యుత్ రాజీవ్ లు మౌనంగా నిలబడ్డారు. తలొంచుకుని కూర్చున్న స్వాతిని "ఎందుకిలా చేసావు స్వాతి? ఒకమాటైన నిరంజన్ కి చెప్పాల్సింది. వాడు నిన్ను అర్ధం చేసుకునే వాడు కదా! ఇంతకి అశోక్ ఏడి? " అని ప్రశ్నించాడు అరవింద్. "అన్నయ్యను అర్ధం చేసుకోకుండా నేనే తొందరపడ్డాను" అంటూ ఏడ్చింది. అశోక్ ఏడి?" మళ్ళీ ప్రశ్నించాడు అరవింద్. "మా పెళ్లి అవలేదు" అంది. ఆకాశం బద్ధలైనంతగా అదిరిపడ్డాడు. రాజీవ్ అచ్యుత్ లు స్థాణువులయ్యారు. అందరి ఊపిరి బిగిసింది. "ఏం మాట్లాడుతున్నావ్ స్వాతి?" అని అడిగాడు అరవింద్. "మా పెళ్లి అవలేదు" అంది. ఆకాశం బద్ధలైనంతగా అదిరిపడ్డాడు. రాజీవ్ అచ్యుత్ లు స్థాణువులయ్యారు. అందరి ఊపిరి బిగిసింది. "ఏం మాట్లాడుతున్నావ్ స్వాతి?" అని అడిగాడు అరవింద్.... "అవును అరవింద్ అన్నయ్యా, తాను కూడా ఏవో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని నాలానే చెప్పకుండా బయటకు వచ్చేసాడు. కాని మా పెళ్లి జరిగే సమయంలో వాళ్ల బంధువులంతా వచ్చి అశోక్ ని కొట్టి సిగ్గులేని పని చేస్తున్నావ్ అంటూ లాక్కెళ్లిపోయారు. నన్ను ఒంటరిగా వదిలేసారు. దిక్కు తోచని స్థితిలో ఎటు వెళ్ళాలో తెలియక, తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే అందరూ చీదరించుకుంటూ చూడటం, తండ్రిని పొట్టన పెట్టుకుంది అంటుంటే చాలా భయం వేసింది. నాన్నకేమైనదో అని పరిగెత్తుకుంటూ వచ్చాను. నాన్న చనిపోయారని అన్నయ్య చెప్తేగాని నాకు తెలీదు. నాన్న ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదన్నయ్యా. ఇప్పుడు నాకు ఎవరు దిక్కు?" అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.  జరిగిన పరిణామాలు విని అరవింద్ తనని అక్కడే ఉండమని చెపుదామనుకున్నాడు. స్వాతి చాలా బాధలో ఉంది. అటు పెళ్లి జరగక, ఇటు తండ్రిని కోల్పోయి, మరోపక్క కుటుంబానికి దూరమయి, అందరూ ఉండి ఎవరికీ ఏమి కాని ఏకాకిలా మిగిలిపోయిన స్వాతిని చూస్తే జాలేసింది. తనకు ఇప్పుడు ఓదార్పు కావాలి. ఓ అన్నగా ధైర్యం చెప్పి, అండగా ఉండాలనుకుని అరవింద్ " ఇప్పుడు నిరంజన్ చాలా కోపంతో ఉన్నాడు. ఎవరేమి చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. అంతా సద్దుకున్నాక నేనే వెళ్లి వాడితో మాట్లాడుతాను. కచ్చితంగా వాడు ఒప్పుకుంటాడు. అంతవరకు నువ్వు ఇక్కడే......" మాట్లాడుతుండగా అక్కడే ఉండి అంతా వింటున్న మేఘన " అరవింద్...." అంటూ పిలిచింది. అందరు బయటకు చూసారు.  "ఒకసారి..." అంది. అచ్యుత్ వెళ్లి స్వాతి పక్కన కూర్చున్నాడు. అరవింద్ బయటకు వచ్చాడు. రాజీవ్ కూడా అరవింద్ తో పాటు బయటకు వచ్చి అరవింద్ వెనకాల నుంచున్నాడు.  "మీ మాటలైపోతే తొందరగా స్వాతిని వెళ్లిపొమ్మను" అంది మేఘన.  చేతులు కట్టుకుని చూస్తున్న రాజీవ్ అవి విప్పుతూ కోపంతో మేఘనవైపు చూసాడు.  " ఏం? ఎందుకు మేఘన? తను ఇప్పుడు చాలా కష్టంలో ఉంది. అర్ధం చేసుకో మేఘన, ప్లీజ్.. ఇప్పుడు మనం తప్ప తనకెవరున్నారు చెప్పు ? అన్నాడు బ్రతిమాలుతూ.  "వాళ్ళ నాన్న పోయి రెండు రోజులైంది. మైలు మనుషులు ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి మంచిది కాదు" అంది.  రాజీవ్ పట్టరాని కోపంతో " చదువుకున్నదానివేనా నువ్వు? అందరు కాదని గెంటేస్తే మంచి మనసుతో వాడు ఆదుకుంటాను అంటే అడ్డుకుంటున్నావు?" అన్నాడు.  "అవన్నీ అనవసరం. ఆదుకోవడానికి ఇదేమి అరవింద్ ఇల్లు కాదు. నీ ఇల్లు అంతకన్నా కాదు. నా ఇల్లు. ఇంక మాటలు అనవసరం తొందరగా వెళ్తే పసుపు నీళ్ళు జల్లుకుంటాను" అంది.  "ఛి! నువ్వసలు మనిషివేనా?" అన్నాడు రాజీవ్ అసహ్యించుకుంటూ.  "నీకంత జాలిగా ఉంటే వెళ్లి నీ ఇంట్లో పెట్టుకో" అంది.  "తనకు నేను షెల్టర్ ఇస్తాను. అది మా ఇంట్లోనా వేరే ఇంట్లోనా అనేది వేరే విషయం. అసలు ఇలాంటి ఆలోచనలతో ఈ ఇల్లే మైలు పడిపోయింది. పసుపునీళ్లు కాదు కదా అగ్గిపుల్ల వేసి తగలేట్టేసినా ఆ మైలు పోదు. నువ్వు నాతోరా స్వాతి నీకు మేము ఉన్నాము." అని స్వాతిని తీసుకెళ్ళిపోయారు. అరవింద్ కి కూడా మేఘనపై అసహ్యం వేసింది.  వైజాగ్ ఆర్.కె బీచ్ లో కూర్చున్నారు ముగ్గురు. స్వాతి కొంచెం దూరంలో కూర్చుని సముద్రాన్ని చూస్తోంది. అందరి మెదడులు మొద్దుబారిపోయాయి. అచ్యుత్ ఆ నిశబ్దాన్ని చేదిస్తూ " మేఘన మనస్తత్వం మనకు తెలుసు. అలాగే మన ఇళ్ళల్లో కూడా ఆలోచిస్తార్రా. సెంటిమెంట్లు, మూడనమ్మకాలు, దోషాలు అన్నీ ఒకేసారి కనిపిస్తాయిరా ఎదుటివాడి కష్టం, బాధ కన్నా!" అని అన్నాడు స్వాతివైపు చూస్తూనే.  "ఏమంటున్నావురా?" అని అడిగాడు రాజీవ్.  "మేఘన అన్నట్లుగానే మన ఇంట్లో కూడా అనరని నమ్మకం ఏంటిరా?" అని అడిగాడు అచ్యుత్. మౌనం వహించాడు రాజీవ్. ]తనకి తెలుసు మనిషి ఎంత ఆధునిక యుగంలోకి వెళ్ళిన తానూ నమ్ముకున్న కొన్ని విషయాలను చచ్చేవరకు పట్టించుకుంటాడు. చచ్చినా పట్టించుకుంటాడు. అది ఒక ప్రోటోకాల్ లాగ ప్రతి మనిషి జీవితాలలో ఫాలో అవుతూ వస్తున్న పధ్ధతి. దానికి అడ్డుకట్ట వేయాలంటే మరో సంఘసంస్కర్త ఆజన్మాంతం పోరాడితేనే సాధ్యం అవుతుంది. అది కూడా పూర్తిగా సమసిపోతుంది అని చెప్పలేము. కందుకూరివారు బాల్య వివాహాలను అరికట్టారు అని పుస్తకాలలో చదువుకుంటాము. కానీ 'పూర్తిగా' అరికట్టారు అని కాదు. ఇప్పటికి ఏదో ఒకమూల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. పరిష్కారం తోచలేదు ముగ్గురికి. " చీకటి పడుతోందిరా " అన్నాడు రాజీవ్. ఇంతలో ఓ చిన్న కుర్రాడు అటుగా వచ్చి "అన్నా! ఒక రూపాయి ఉంటే ఇవ్వన్నా. ఆకలేస్తోందన్నా. పొద్దున్నించి ఏం తినలేదన్నా" అంటూ బిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ కుర్రాడు వైపు చూసాడు అరవింద్. చిరిగిపోయిన చొక్కా, మాసిపోయిన జుట్టు, అరిగిపోయిన చెప్పులతో చాలా దీన స్థితిలో ఉన్నాడు. అరవింద్ తన దగ్గరున్న డబ్బులు తీసి అతనికి ఇచ్చాడు. ఆ కుర్రాడు దండం పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మరుక్షణంలో అరవింద్ కి మెరుపులాంటి ఆలోచన మెదిలింది., వెంటనే "అంజలి" అన్నాడు. ఆ కుర్రాడిని చూసాక ఎప్పుడో నిరంజన్ వీధిబాలల బొమ్మగురించి, అంజలి ప్రతిభ గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. మళ్ళీ "అంజలి" అన్నాడు సమస్యకు పరిష్కారంగా.  "అవునురా, అంజలి హాస్టల్ లో ఉంటోంది. తన దగ్గర ఉంచుదాం స్వాతిని" అన్నాడు రాజీవ్ పట్టుదొరికినట్టు.  "కాదురా, ఈ మద్యనే వాళ్ళ అమ్మగారు వచ్చేసారు. ఇద్దరు కలిసి వేరేగా ఇల్లు తీసుకుని ఉంటున్నారు" అన్నాడు అచ్యుత్. కొంచెం నిరాశపడ్డారు, " కాని ప్రయత్నం చేద్దాంరా, తను ఒప్పుకోవచ్చు" అన్నాడు అరవింద్ ఆశతో. స్వాతిని తీసుకుని అంజలి ఇంటికి వెళ్ళారు. ఇంటి తలుపు కొట్టి బయట నుంచున్నారు. వైజాగ్ ఆర్.కె బీచ్ లో కూర్చున్నారు ముగ్గురు. స్వాతి కొంచెం దూరంలో కూర్చుని సముద్రాన్ని చూస్తోంది. అందరి మెదడులు మొద్దుబారిపోయాయి. అచ్యుత్ ఆ నిశబ్దాన్ని చేదిస్తూ " మేఘన మనస్తత్వం మనకు తెలుసు. అలాగే మన ఇళ్ళల్లో కూడా ఆలోచిస్తార్రా. సెంటిమెంట్లు, మూడనమ్మకాలు, దోషాలు అన్నీ ఒకేసారి కనిపిస్తాయిరా ఎదుటివాడి కష్టం, బాధ కన్నా!" అని అన్నాడు స్వాతివైపు చూస్తూనే.  "ఏమంటున్నావురా?" అని అడిగాడు రాజీవ్.  "మేఘన అన్నట్లుగానే మన ఇంట్లో కూడా అనరని నమ్మకం ఏంటిరా?" అని అడిగాడు అచ్యుత్. మౌనం వహించాడు రాజీవ్.  తనకి తెలుసు మనిషి ఎంత ఆధునిక యుగంలోకి వెళ్ళిన తానూ నమ్ముకున్న కొన్ని విషయాలను చచ్చేవరకు పట్టించుకుంటాడు. చచ్చినా పట్టించుకుంటాడు. అది ఒక ప్రోటోకాల్ లాగ ప్రతి మనిషి జీవితాలలో ఫాలో అవుతూ వస్తున్న పధ్ధతి. దానికి అడ్డుకట్ట వేయాలంటే మరో సంఘసంస్కర్త ఆజన్మాంతం పోరాడితేనే సాధ్యం అవుతుంది. అది కూడా పూర్తిగా సమసిపోతుంది అని చెప్పలేము. కందుకూరివారు బాల్య వివాహాలను అరికట్టారు అని పుస్తకాలలో చదువుకుంటాము. కానీ 'పూర్తిగా' అరికట్టారు అని కాదు. ఇప్పటికి ఏదో ఒకమూల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. పరిష్కారం తోచలేదు ముగ్గురికి. " చీకటి పడుతోందిరా " అన్నాడు రాజీవ్. ఇంతలో ఓ చిన్న కుర్రాడు అటుగా వచ్చి "అన్నా! ఒక రూపాయి ఉంటే ఇవ్వన్నా. ఆకలేస్తోందన్నా. పొద్దున్నించి ఏం తినలేదన్నా" అంటూ బిక్షం ఎత్తుకుంటున్నాడు. ఆ కుర్రాడు వైపు చూసాడు అరవింద్. చిరిగిపోయిన చొక్కా, మాసిపోయిన జుట్టు, అరిగిపోయిన చెప్పులతో చాలా దీన స్థితిలో ఉన్నాడు. అరవింద్ తన దగ్గరున్న డబ్బులు తీసి అతనికి ఇచ్చాడు. ఆ కుర్రాడు దండం పెట్టి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన మరుక్షణంలో అరవింద్ కి మెరుపులాంటి ఆలోచన మెదిలింది., వెంటనే "అంజలి" అన్నాడు. ఆ కుర్రాడిని చూసాక ఎప్పుడో నిరంజన్ వీధిబాలల బొమ్మగురించి, అంజలి ప్రతిభ గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. మళ్ళీ "అంజలి" అన్నాడు సమస్యకు పరిష్కారంగా.  "అవునురా, అంజలి హాస్టల్ లో ఉంటోంది. తన దగ్గర ఉంచుదాం స్వాతిని" అన్నాడు రాజీవ్ పట్టుదొరికినట్టు.  "కాదురా, ఈ మద్యనే వాళ్ళ అమ్మగారు వచ్చేసారు. ఇద్దరు కలిసి వేరేగా ఇల్లు తీసుకుని ఉంటున్నారు" అన్నాడు అచ్యుత్. కొంచెం నిరాశపడ్డారు, " కాని ప్రయత్నం చేద్దాంరా, తను ఒప్పుకోవచ్చు" అన్నాడు అరవింద్ ఆశతో. స్వాతిని తీసుకుని అంజలి ఇంటికి వెళ్ళారు. ఇంటి తలుపు కొట్టి బయట నుంచున్నారు.  అంజలి తలుపు తీసి "హాయ్, ఏంటి ముగ్గురు సడన్ గా? ఇలా..?" అంది నవ్వుతూ.  "మాకో సహాయం చేయాలి" అన్నాడు అరవింద్. వాళ్ళందరి వెనకన ఉన్న స్వాతిని చూసింది అంజలి. "ఏమైంది స్వాతి?" అంది దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేస్తూ. అంజలి అలా అడగగానే అప్పటివరకు గొంతులో నొక్కిపెట్టిన బాధనంతా బయటపెట్టేసింది. అచ్యుత్ జరిగిన విషయం అంతా చెప్పి " ఇప్పుడు మా దగ్గర ఉంచుదాం అంటే కొంచెం ప్రాబ్లం, అందుకనే నువ్వేమైనా సాయం చేస్తావని..." అన్నాడు.  అంజలి అందరి వైపు చూసి, "మరి ఇంతలా అడగాలా? తను నా దగ్గరే ఉంటుంది. నిరంజన్ ఇలా రియాక్ట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. కానీ అతని కోపంలోను న్యాయం ఉంది. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. స్వాతి నా దగ్గర క్షేమంగా ఉంటుంది" అని భరోసా ఇచ్చింది.  ముగ్గురు ఆనందపడ్డారు. అందరి కళ్ళు తడిసాయి."థాంక్స్ అంజలి, చాలా థాంక్స్, నీ ఋణం ఎలా తీర్చుకోవాలో" అన్నాడు రాజీవ్ కన్నీళ్ళతో. "అంత పెద్ద మాటలెందుకు? నిరంజన్, స్వాతిలు నాకు ఫ్రెండ్స్ . ఒక ఫ్రెండ్ చెల్లెలి కోసం మీరు ఇంత తాపత్రయ పడుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది" అంది. స్వాతికి బాయ్ చెప్పి అక్కడి నుండి ముగ్గురు బయలుదేరారు.

* * *





[+] 4 users Like LUKYYRUS's post
Like Reply
#14
రోజులు గడుస్తున్నాయి..... ఓ రోజు అరవింద్ రాజీవ్ తో " రాజీవ్, నువ్వు సాయంత్రం ఫ్రీ అయితే నీతో కొంచెం మాట్లాడాలి" అన్నాడు. "ఓకే, ఎక్కడ కలుద్దాం?" "బీచ్ దగ్గర...." "సరే, " అన్నాడు రాజీవ్. ఇద్దరు కలిసి రాజీవ్ బండిపై యూనివర్సిటీ నుండి బయలుదేరారు. సంధ్యా సమయంలో బీచ్ చాలా అందంగా ఉంది. బండి పార్క్ చేసి ఒక రాయిపై కూర్చున్నారు. అలలు వచ్చి ఆ రాయికి కొట్టుకుని వెనక్కి వెళ్తున్నాయి. కనికరించని ప్రియుడి గుండె రాయి అయితే, ప్రియురాలు అలలై ఆ రాయిని కదిలించడానికి కన్నీటితో దరిచేరుతున్నట్టుగా ఉంది. అరవింద్ తన జేబులోంచి మొబైల్ తీసి రాజీవ్ కి ఇచ్చాడు. రాజీవ్ దాన్ని అందుకుంటూ "కొత్త మొబైలా?" అని అడిగాడు. " విషయం అది కాదు. ఇన్ బాక్స్ ఓపెన్ చేసి చూడు " అన్నాడు అరవింద్. రాజీవ్ ఇన్ బాక్స్ ఓపెన్ చేసాడు. నవ్య పంపిన మెసేజ్ ఉంది. అందులో " హాయ్ అరవింద్ అన్నయ్య, నేను రాజీవ్ తో కలిసి ఉంటున్నానే కాని అస్సలు దగ్గరవలేకపోతున్నాను. తనని ప్రేమిస్తున్న విషయం తనికి తెలిసినా కూడా ఎందుకు ఇష్టపడటం లేదో నాకు అర్ధం కావడం లేదు. ఒక అమ్మాయి ఇంతలా సిగ్గు విడిచి చెప్తున్నా సరే రాజీవ్ ఎందుకలా దూరం చేస్తున్నాడో తెలియడం లేదు. నాలో ఏమి నచ్చలేదో ఒక్కటి చెప్పమను అన్నయ్యా , తనకోసం ఏమైనా మార్చుకుంటాను. ఇంతలా అతన్నే ఎందుకు కోరుకుంటున్నావు అంటే నా దగ్గరున్న ఒకే ఒక్క సమాధానం అతన్ని నేను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను" అని ఉంది. దాదాపు నాలుగున్నర పేజీల ఫోన్ మెసేజ్. చదివిన తర్వాత అరవింద్ కి మొబైల్ ఇచ్చాడు. ఏమి మాట్లాడకుండా సముద్రంకేసి చూస్తూ నుంచున్నాడు రాజీవ్.  "ఏమి చెప్పమంటావ్?" అని ప్రశ్నించాడు అరవింద్.  "చచ్చిపొమ్మను...." అన్నాడు రాజీవ్ బదులుగా. పెద్ద అల వచ్చి ఆ రాయికి కొట్టుకుని చెల్లాచెదురైపోయింది. చిన్న చిన్న నీటి తుంపరలు వాళ్ళని తడిపేసాయి. అరవింద్ కనుబొమ్మలు దగ్గరయ్యాయి.  క్షణం తర్వాత "అంతకంటే ఇంకేం చేస్తారు ప్రేమించినవాడు కాదంటే " అన్నాడు రాజీవ్ మళ్ళీ.  "ఫూలిష్ గా మాట్లాడకు రాజీవ్ " కీచుమంది అరవింద్ గొంతు.  "కాకపోతే ఏంటి అరవింద్? నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఇంకా ఏమి ఆశించి నా వెంట పడుతోంది. ఓకే, ఇంతవరకు వచ్చింది కాబట్టి నీకో నిజం చెప్తాను. నిరంజన్, అచ్యుత్ లకు కూడా తెలియని నిజం. అది విన్నాక నువ్వే నవ్యకి నచ్చచెప్పు, నాకు తనకు కుదరని పని అని" అన్నాడు రాజీవ్.  "ఏంటా నిజం?" ప్రశ్నించాడు అరవింద్.  రెండు నిమిషాలు పాటు మౌనం వహించాడు రాజీవ్. గట్టిగా శ్వాస తీసి " మేఘన నా ఎక్స్-గర్ల్ ఫ్రెండ్. తను నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాం" అన్నాడు. పెద్ద అల వచ్చి ముఖంపై కొట్టినట్టైంది అరవింద్కి.  "అవునా ? ఇదంతా ఎప్పుడు? " అనడిగాడు అరవింద్. "ఏంటా నిజం?" ప్రశ్నించాడు అరవింద్.  రెండు నిమిషాలు పాటు మౌనం వహించాడు. గట్టిగా శ్వాస తీసి " మేఘన నా ఎక్స్-గర్ల్ ఫ్రెండ్. తను నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాం" అన్నాడు రాజీవ్. పెద్ద అల వచ్చి ముఖంపై కొట్టినట్టైంది అరవింద్.  "అవునా ? ఇదంతా ఎప్పుడు? " అనడిగాడు.  "సంవత్సరం క్రితం. తనో మూడిస్ట్. ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. అస్సలు అర్ధమయ్యేది కాదు. ఒకసారి అతి ప్రేమ.. ఒకసారి అతి ద్వేషం. ఒక్కోసారి నేనెవరో తెలీనట్టు ప్రవర్తించేది. ఇంట్లో ఒక్కత్తే అవడం వల్ల తను చెప్పిందే వేదం, ఏలిందే రాజ్యం అన్నట్టుగా ఉండేది. అవన్నీ నాపై రుద్దాలనుకునేది. తను నుంచోమంటే నుంచోవాలి. కూర్చోమంటే కూర్చోవాలి. తన ప్రేమ కోసం ఏది కాదనేవాడిని కాదు. రాత్రి 11 గంటలకు కాల్ చేసి నిన్ను చూడాలని ఉంది అనేది తీరా తను చెప్పిన చోటుకు వెళ్లి ఆమెకు ఫోన్ చేస్తే సారీ నిద్ర పట్టేసింది అనేది. తన బర్త్ డే మర్చిపోయానని నా చేత తన పుట్టిన రోజు తేదిని 1000 సార్లు రాయించింది. తీరా రాసాక నాకు బ్లాక్ ఇంకు అంటే ఇష్టం ఉండదని తెలుసుగా, మరి బ్లాక్ పెన్ తో ఎందుకు రాశావ్ అని అలిగేది. తనతో రెండు మూడు సార్లు వారించాను. మళ్ళీ నేనే సారీ చెప్పేవాడిని. ఇగో ప్రొబ్లెమ్స్, పంతాలు... చిన్న చిన్న మనస్పర్ధలు... కోపాలు.. చివరకు గొడవలు వరకు వెళ్లి ఇంక తనని భరించలేక విడిపోయాము" అన్నాడు.  అరవింద్ అంతా విని సాలోచనగా "మరి నవ్యకి ఈ విషయం చెప్పేయచ్చు కదా?" అనడిగాడు.  "ఎందుకు చెప్పాలి? పి.జి లో మళ్ళీ మేము కలిసే వాళ్ళమే. కాని నవ్య వచ్చి నన్ను ప్రేమిస్తున్నట్టు ముందుగా వెళ్లి మేఘనకు చెప్పింది. ఆ తర్వాత నేను ఒకటి రెండు సార్లు నవ్యతో మాట్లాడడం చూసి మేఘన పూర్తిగా దూరమైపోయింది. మేఘనకు ఎక్స్-బాయ్ ఫ్రెండ్ గా చెలామణి అవడం నాకిష్టం లేదు. అలాంటి అమ్మాయిని వీడేలా ప్రేమించాడు అనే సానుభూతి నాకొద్దు. అందుకే చెప్పలేదు. అందుకే నిన్ను తన ఇంట్లో నుండి ఖాళి చేయమని అడిగాను. నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను ఎక్కడ సాధిస్తుందో అని, " ముగించాడు రాజీవ్.  రాజీవ్ మాటలు పూర్తిగా విన్న అరవింద్ "ఒక రకంగా మేఘనే నీకంటే క్లారిటీతో ఉందిర. ఇంకా చెప్పాలంటే నీ మెంటాల్టినే చాలా తేడాగా ఉంది. ఏమి అనుకోకురా రాజీవ్ ఇలా అంటున్నానని , నువ్వు మంచివాడివా? చెడ్డవాడివా? అని ఆలోచిస్తే నీకే ఆన్సర్ ఉండదు. రెండింటికి మద్యలో కూడా లేవు. నువ్వు వేరే ఏదో! ఒకమ్మాయి నిజంగా ప్రేమనిస్తున్నప్పుడు తీసుకోలేని చేతకానివాడివి. అందుకున్న ప్రేమను నిర్భయంగా చెప్పుకోలేని పిరికివాడివి. అసలు ఎందులోనూ క్లారిటీ లేనివాడివి. ఒక్క విషయం చెప్తాను రాజీవ్, బస్సు మిస్ అవ్వచ్చు. ట్రైన్ మిస్ అవ్వచ్చు. కాని జీవితం మిస్ అవకూడదు. నిన్ను కోరి ఒక అమ్మాయి నీకోసం అన్నీ మార్చుకోడానికి, ఏమైనా వదులుకోవడానికి సిద్ధపడిందంటే అది నీ అదృష్టం. అది అందరికి దక్కదు. నీకోసం జీవితం అంతా ఎదురు చూడమన్నా ఎదురు చూసేంత స్వచ్చమైన పిచ్చి ప్రేమ నవ్యకి ఉంది. అలాంటి ప్రేమని మిస్ అయ్యావంటే నీ అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఒక్కసారి నవ్య ప్రేమని ఇవ్వడం ఆపేసిందంటే నువ్వు వెయ్యి జన్మలెత్తినా అలాంటి ప్రేమను పొందలేవు. నీకు ఎక్కడా దొరకదు కూడా!!" ముగించాడు అరవింద్. రాజీవ్ మౌనం వహించాడు. ఇద్దరు అక్కడి నుండి బయలు దేరారు. 

* * *





[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#15
ఆ తరవాత రోజు అచ్యుత్ అరవింద్ ని పలకరిస్తూ " హాయ్ అరవింద్, యు నొ వాట్ రేపు చైతన్య పుట్టిన రోజు" అన్నాడు ఆనందంతో.  ", గుడ్, గుడ్. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా?"  "అలాంటిదేమీ లేదుగాని, తనని ప్రేమిస్తున్నప్పటినుండి ప్రతి సంవత్సరం తన పుట్టిన రోజు తెల్లవారుజామునే తన ఇంటికెళ్ళి ఒక గులాబి మొక్క, గ్రీటింగ్ కార్డు, చాక్లెట్ పెట్టడం అలవాటు. ఈసారి కూడా అదే చేయబోతున్నాను" చెప్పాడు అచ్యుత్.  "ఇంటరెస్టింగ్" అన్నాడు అరవింద్ నవ్వుతూ.  "కాని రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళింటి దగ్గరకు వెళ్లి చూస్తాను. అక్కడ గులాబి మొక్క ఉండదు. తనా గ్రీటింగ్ తీసుకుంటుందో లేదో కూడా నాకు తెలీదు." అన్నాడు దిగులుగా.  "అంతేకదా.. ఈ విషయం తననే అడుగు" అన్నాడు అరవింద్  "ఎవరిని? చైతన్యనా? నీకెలా తెలుసు ఇవన్ని అంటే?"  "అబ్బా, అలా డైరెక్ట్ గా అడగమనలేదు. ఇన్ డైరెక్ట్ గా అడుగు "  "ఎలా?"  "ఆలోచించుకో. నేను చెప్పను "  "అదేంటి అరవింద్ , ప్లీజ్ చెప్పు" బ్రతిమాలినట్టుగా అడిగాడు అచ్యుత్.  "లేదు చెప్పను. బట్ నీకో ఇంటరెస్టింగ్ విషయం చెప్పనా! నేను మౌనిక ప్రేమించుకుంటున్నాం" అన్నాడు అరవింద్.  "అవునా? ఆశ్చర్యంతో ఇది ఎప్పటినుండి? నువ్వు మామూలు వాడివి కాదు అరవింద్ యు అర్ గ్రేట్ " అన్నాడు అచ్యుత్.  "నథింగ్ గ్రేట్ ఇన్ ఇట్. తను నాకు నచ్చింది ప్రోపోస్ చేసాను. ఒప్పుకుంది."  "ఎనీవే కంగ్రాట్స్. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు అరవింద్, నా లవ్ కూడా సక్సెస్ అవ్వాలని " అన్నాడు.  "ఆల్ ది బెస్ట్ " అన్నాడు అరవింద్ నవ్వుతూ.  ఆ రోజు తెల్లవారుజామునే లేచి చైతన్య ఇంటికెళ్ళి గుమ్మం దగ్గర గులాబీ మొక్క, గ్రీటింగ్ కార్డు, టెడ్డి బేర్, చాక్లెట్ అన్ని పెట్టేసి వచ్చాడు అచ్యుత్. ఏమి ఎరగనట్టు మాములుగా యూనివర్సిటీకి వెళ్ళాడు. ఆరోజు చైతన్య లేటుగా వచ్చింది. ఎందుకో డల్ గా ఉంది. తన దగ్గరకు నడుచుకుంటూ వస్తున్న చైతన్యని చూసిఅచ్యుత్ ఆనందంతో "హేయ్, ఏంటి కొత్త బట్టలా?" అడిగాడు ఏమి తెలియనట్టు.  "అవును. ఈ రోజు నా బర్త్ డే" చెప్పింది.  "అవునా? అంత నీరసంగా చెప్తావేంటి. విష్ యు మెనీ మెనీ మెనీ మెనీ మెనీ ఇన్ఫినిటీ మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే " అన్నాడు నవ్వుతూ విప్పారిన మొహంతో.  "థాంక్ యు " అంది ముభావంగా.  "ఏంటి అంత డల్ గా ఉన్నావ్? ఒంట్లో బాగోలేదా?" అని అడిగాడు ఆందోళనగా.  "అలాంటిదేమీ లేదు. ఐ యామ్ ఫైన్ " అంది  "మరి?"  "ఏమి లేదులే"  "నాకు చెప్పకూడదు అంటే వద్దులే"  "అదేమీ లేదు అచ్యుత్, ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజుకి ఎవరో గులాబీ మొక్క, గ్రీటింగ్ కార్డు, చాక్లెట్ పెట్టి వెళ్తున్నారు. ఈసారి కూడా అలానే పెట్టి వెళ్ళారు. వాటితో పాటు ఈసారి టెడ్డి బేర్ కూడా ఉంది. నిశ్చితార్ధం అయిన నేను ఎందుకు ఈ విషయాన్ని తనతో చెప్పలేదని, ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకోలేదని మా బావ నన్ను తిట్టాడు. అప్పటికి నేను చెప్పాను ఆ మొక్కని ఆ గ్రీటింగ్ కార్డు ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను అని. అయిన నాకు ముందు చెప్పి ఉండాల్సింది అని నాపై కోప్పడ్డాడు. నాకు నా బావ అంటే చాలా ఇష్టం అచ్యుత్. చిన్నప్పటి నుండి అన్ని తనే. అతను ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. బహుసా ఆ వ్యక్తి ఎవరో నన్నుఇష్టపడుతున్నాడు అనుకుంట. నాకిలా పెళ్లి కుదిరిందని తెలిస్తే అతను ఈ పనులన్నీ మానుకుంటాడు కదా!! ఎందుకు చెప్పు అందని వాటికోసం ఆరాటపడటం. చూడు అచ్యుత్ , ప్లీజ్ నువ్వు నాకు మంచి ఫ్రెండ్ వి, అందుకే చెపుతున్నాను. నాపై అలాంటి ఆలోచనలు ఉంటే తుడిచేయ్. నీ స్నేహం పాడు చేసుకోవడం నాకిష్టం లేదు. నువ్వు ఆ మొక్కను పెట్టి వెళ్ళడం నేను చూసాను." చివరగా అచ్యుత్ కి చెప్పాల్సింది చెప్పేసింది.అచ్యుత్ గుండె పగిలిపోయింది. అతని కళ్ళల్లో నీళ్ళు చెంపలను తాకాయి. గొంతు డిక్కట్టేసింది. ముక్కు ఎర్రబడింది.  "నేనంటే నీకు ఇష్టం లేదా చైతన్యా?" అని అడిగాడు గద్గదమైన గొంతుతో.  "ప్లీజ్ అచ్యుత్ ఫ్రెండ్స్ గా ఉందాం" అంది. అంతే, అటువైపు తిరిగి పరిగెత్తాడు. రొమ్ములెగసేంత ఆయాసంతో రోడ్ పైకి వచ్చాడు. అలానే పరిగెత్తుకుంటూ రాజీవ్ దగ్గరకు వెళ్ళాడు. అరవింద్ కూడా అక్కడే ఉన్నాడు. పరిగెత్తుకొస్తున్న అచ్యుత్ ని చూసి కంగారుపడ్డారు ఇద్దరు. "ఏంటిరా ఏమైందిరా?" అని అడిగారు.  "ఐ లాస్ట్ మై లైఫ్ " అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు పిచ్చివాడిలా. "ఏమైందిరా ?" అని అడిగాడు అరవింద్ పక్కన కూర్చుంటూ. ఏడ్చి ఏడ్చి కందిపోయిన మొహంతో ఎర్రబడ్డ కళ్ళతో “చైతన్యకు నిజం తెలిసిపోయింది. రాత్రి నన్ను చూసేసింది. నా ప్రేమను ఒప్పుకోవడం లేదు” అంటూ జరిగిన విషయం చెప్పాడు.  "ఏంటిరా ఇది చిన్నపిల్లాడిలాగా?" అంటూ కళ్ళు తుడిచాడు అరవింద్. అచ్యుత్ లేచి నిలబడి రెండు చేతులతో కళ్ళు తుడుచుకుని " కొంతకాలం నన్ను వదిలేయండిరా..." అని వెళ్ళిపోబోయాడు. రాజీవ్ కంగారుగా "ఒరేయ్ ఆగు, ఎక్కడికెళ్తావ్?" అని ఆపాడు.  వెళ్తున్న వాడు ఆగి వెనక్కి తిరిగి " చచ్చిపోనులేరా! ప్రేమించాను అని చెప్పేంత ధైర్యం లేదు. ఇక చచ్చేంత ధైర్యం అసలే లేదు. మీరు కంగారు పడకండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.అరవింద్ గుమ్మం దాక వచ్చి వెళ్ళిపోతున్న అచ్యుత్ ని చూసాడు. ఇంతలో అరవింద్ మొబైల్ రింగ్ అయింది. మౌనిక కాల్ చేసింది. "నీతో మాట్లాడాలి ఈవినింగ్ కలుద్దాం" అంది. సరే అని సాయంత్రం బీచ్ లో కలిసారు.  చాలా సేపు ఏమి మాట్లాడుకోలేదు. "ఏంటి ఈ మౌనం?" అనడిగాడు.  అరవింద్ వైపు తిరిగి " మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. " అంది.  "ఏంటి సడన్ గా ?"  "ఎవడో ఎమ్.పి కొడుకు నన్ను చూసాడట. వాడికిచ్చి చేసేద్దామని చూస్తున్నారు" అంది. ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.  "ఏంటి మాట్లాడవు?" అని అడిగింది భుజం నెట్టుతూ.  "ఆలోచిస్తున్నాను, వచ్చేవారం మా ఊరు వెళ్తున్నాను. మా ఫ్రెండ్ ప్రమోద పెళ్లి. అప్పుడు అమ్మతో మన గురించి మాట్లాడుతాను. అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది. నిన్ను చూస్తే అస్సలు వదులుకోదు. ప్రమోద పెళ్లి అవగానే మనం రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుందాం. నాకు అమ్మ సంతకం పెడుతుంది. అంజలి, అచ్యుత్, రాజీవ్ వీళ్ళు కూడా సాక్షి సంతకాలు చేస్తారు. నువ్వేం దిగులు పడకు" అంటూ మౌనిక చేయిని పట్టుకున్నాడు ధైర్యం చెపుతున్నట్టుగా.  మౌనిక అరవింద్ భుజంపై వాలి " నాకు ఎందుకో భయంగా ఉంది. నిన్ను మిస్ అవుతానేమో అని " అంది.  "అలాంటిది ఏమి జరగదు. నన్ను నమ్ము సరేనా" అన్నాడు. కాని తాను ఒకటి తలిచాడు విధాత మరొకటి రచించాడు...వారం తర్వాత ఊరు వెళ్ళాడు అరవింద్. ఇంటికి వెళ్లి బాగ్ పెట్టేసి డైరెక్ట్ గా ప్రమోద దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతికి గోరింటాకు పెట్టుకుని ఉంది.  "ఓయ్! ఎలా ఉన్నావ్?" అని అడిగాడు. అరవింద్ ని చూసి చూడనట్టు ప్రవర్తించింది. "ఓయ్! ఏంటి కోపమే?" అని అడిగాడు.  "నాతో మాట్లాడకు, పంది. ఇంతకాలం తర్వాత గుర్తుకు వచ్చానా?" అంది  "నిన్ను మర్చిపోయాను అని ఎలా అనుకుంటున్నావ్?"  "ఈ మాటలకేం తక్కువ లేదు. ఒక్కసారైనా ఫోన్ చేశావా?, మీ అమ్మకు చేసేవాడివికాని"  "అవును. అప్పుడు నీ గురించి అడిగేవాడిని. అప్పుడు నువ్వు అందుబాటులో లేకపోతే అది నాదా తప్పు"  "పోరా!!!"  "ఎందుకంత కోపం? పెళ్లి అయిపోతోంది. ఆ తర్వాత కలుస్తామో కలవమో"  "ఏం, కలవమని అనుకుంటున్నావా?"  "చెప్పలేము కదా, అత్తారింటికి వెళ్ళాక నువ్వెంత గుర్తు పెట్టుకుంటావో??"  "నేను నీలా కాదురా "  "సరే ఇంతకి పెళ్ళికొడుకు ఏమి చేస్తాడు?"  "సాఫ్ట్ వేర్ "  "అబ్బో! టీచర్ కి సాఫ్ట్ వేర్, బాగుంది"  "సర్లే గాని , నీ సంగతులేంటి? "  "నాదో పెద్ద కధ. ఇప్పుడు కాదుగాని తర్వాత తీరికగా చెప్పుకుందాం"  "సరే, అమ్మని కలిసావా?"  "అదేం ప్రశ్న, ఇంటికెళ్ళాకనే ఇక్కడికి వచ్చాను. పెళ్లి ఎప్పుడు 18 న కదా, అంటే 18వ తారీఖు ఉదయం 4:32 నిమిషాలకు నీ ఇంటి పేరు మారిపోబోతోందన్నమాట!" నవ్వేడు.  పెళ్లి రోజు రానే వచ్చింది. ప్రమోద తండ్రి ఉన్నంతలో అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాడు. అరవింద్ ఆ రోజంతా ప్రమోద దగ్గరే ఉన్నాడు.ప్రమోదతో క్లోజ్ గా మూవ్ అవడం చుసిన పెళ్ళికొడుకు ప్రమోదని "ఎవరతను?" అని అడిగాడు.  "ఫ్రెండ్" అని చెప్పింది.  "ఫ్రెండ్ అంటే ??" ఆరా తీస్తున్నట్టుగా అడిగాడు. సూటిగా అతనివైపు చూసింది.  "ఏమైనా అడగాలని ఉంటే డైరెక్ట్ గా అడుగు" అంది కోపాని నిగ్రహించుకుంటూ.  "రిలేషన్ ఏంటి?" అని అడుగుతున్నాను అన్నాడు.  "అనుమానిస్తున్నావా?" అంది.  "లేదు , జస్ట్ కన్ఫర్మేషన్ కోసం. అంతే " అన్నాడు.  ఇంతలో అరవింద్ అటుగా వచ్చి " ఇదిగో, అంటూ చీర చేతిలో పెడుతూ అమ్మ ఇచ్చింది. పెళ్ళికి కట్టుకో. బాగుంటావు" అని పెళ్ళికొడుకు వైపు తిరిగి "హాయ్ సర్, నా పేరు అరవింద్. ప్రమోద ఫ్రెండ్ ని. తను చాలా మంచిదండి. అమాయకురాలు. జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పాడు చనువుగా.  "కెన్ ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్?" అన్నాడు ఆ పెళ్ళికొడుకు.  "అడగండి సర్ " అన్నాడు అరవింద్ నవ్వుతూ.  "నీకు ప్రమోదకు సంబంధం ఏంటి? నాముందు కూడా ఈ క్లోజ్ నెస్ ఏంటి? నేను ముక్కు సూటి మనిషిని. ఇంతకు ముందు రెండు మూడుసార్లు చూసాను. నువ్వు తనను ముట్టుకుంటున్నావ్. మీద చేతులు వేస్తున్నావ్. ఎందుకలాగా? దీనిని ఏమంటారు ?" అని ప్రశ్నించాడు.  "అయ్యో, మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారు" అన్నాడు .  "నాకు సమాధానం కావాలి. సముదాయించడం కాదు" చెప్పాడా పెళ్ళికొడుకు.  "మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ నేనే మీ సమస్య అయితే నేను ఇక్కడినుండి వెళ్ళిపోతాను " అన్నాడు అరవింద్.  "థెన్ లీవ్ , పో " అన్నాడు ఆ పెళ్ళికొడుకు. ప్రమోద వైపు చూసి తలదించుకుని వెళ్ళిపోయాడు. ప్రమోద చాలా బాధ పడింది. ఏడ్చింది. కాని తండ్రి మాటను కాదనడం తనకిష్టం లేదు. కూతురు పెళ్లి చేస్తున్నాడనే ఆనందంలో ఉన్నాడాయన. ఇలాంటి వాటిని సమాజం స్నేహం అంటే నమ్మదు. అలాంటి సమాజంలోని వాడే ఆ పెళ్ళికొడుకు. స్నేహానికి కామానికి ఒకే అర్ధం తీసే సాధారణ మగాడు. అమ్మాయి అబ్బాయిల స్నేహాన్ని ఎవరు సరిగ్గా అర్ధం చేసుకోలేరు. అది తరతరాలుగా వస్తున్నా సమాజ నీతి. ఎదురు మాట్లాడలేకపోయింది. తనకే కనక అవకాశం ఉంటే ఆ పెళ్ళికొడుకుని చెప్పుతో కొట్టి కోపం చల్లార్చుకోవాలనేంత ఆవేశం తనలో ఉంది. కాని దిగమింగుకుంది....తెల్లారింది. పెళ్లి జరుగుతోంది. ఎక్కడో దూరంగా నిలబడి చూస్తున్నాడు అరవింద్. ముహూర్తానికి ఇంకా పావుగంట ఉందనగా పెళ్లి కొడుకు తండ్రి కట్నం గొడవ లేవనెత్తాడు. తానూ అంతా ఇచ్చేసానని చెప్పుకొచ్చాడు ప్రమోద తండ్రి. ఇంతలో అరవింద్ తల్లి కలగజేసుకుని "మీరిలా చేయడం ఏమి బాగోలేదండి" అంది పెళ్ళికొడుకు తండ్రితో. "నువ్వెవరమ్మా ఈ విషయం చెప్పడానికి? నీకు వీళ్ళకు సంబంధం ఏంటి?" అని అడిగాడు ఆ పెద్దమనిషి.  అరవింద్ తల్లి సూటిగా "అయితే ఇప్పుడు కట్నం ఇవ్వకపోతే పెళ్లి జరగదంటావ్.. అంతేనా?"  "అవును " అన్నాడు.  చాచి పెట్టి ఆ పెద్దాయన చెంప చెళ్ళుమనిపించింది. పెద్ద పెద్ద అంగాలు వేస్తూ పెళ్లి కొడుకు మెడలో ఉన్న తుండు పట్టుకుని పీటలమీంచి బయటకు లాగి, "పొండిరా అయితే" అంది. అమాయకుడయిన ప్రమోద తండ్రి అంతా చూసి కంగారు పడుతూ "ఏమిటమ్మ నువ్వు చేస్తున్నది" అని అడిగాడు.  "ఎందుకన్నయ్యా ఇలాంటివాడి కోసం ఊగిసలాడతావు. ఇందాక నేను చూసాను. వీడికి అనుమానం. ప్రమోదకు అరవింద్ కు ఏంటి సంబంధం అని అడిగాడు. ఇదిగో వీడికి డబ్బు పిచ్చి. ఇలాంటి మూర్ఖులు వెధవలు ఉన్న చోట మన పిల్ల ఎలా సుఖంగా ఉంటుందన్నయ్య. నువ్వేం కంగారు పడకు. నీ కూతురు పెళ్లి ఇక్కడే ఇప్పుడే ఈ ముహుర్తానికే జరుగుతుంది నా కొడుకుతో…." మాట ఇచ్చేసింది. రామ బాణం విడిచిపెట్టేసింది. అరవింద్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు.  "అమ్మా! నువ్వేం చేస్తున్నావో నీకు అర్ధం అవుతోందా?" అని అడిగాడు కంగారుపడుతూ.  "నువ్వేం మాట్లాడకు. నా మాట కాదంటే నా మీద ఒట్టే " అంది  "అమ్మ, అది కాదు అమ్మ నేను చెప్పేది విను " అన్నాడు. తల్లి కోపంతో చూసి " వెళ్లి తాళి కట్టు" అంది ఆజ్ఞాపిస్తున్నట్టుగా. " అమ్మ, ప్లీజ్" అన్నాడు బ్రతిమాలుతూ..  "వెళ్ళమన్నానా.... ఇది ప్రమోద జీవిత సమస్య ..." అంది ఆ పెళ్లి మండపం హోరెత్తేలాగా. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. పెళ్లి పీటలపై కన్నీళ్ళతో కూర్చుని ఉన్న ప్రమోదవైపు చూస్తూ మౌనంగా పెళ్లి పీటలెక్కాడు. "పంతులుగారు మీరు మంత్రాలు చదవండి" అని గర్వంతో ఆజ్ఞాపించింది అరవింద్ తల్లి.  'మాంగల్యం తంతు......" మంత్రం చదవడం ప్రారంభించారు పంతులుగారు. భజంత్రీలు శబ్దాలు ఆ మంత్రాలతో పాటు శ్రుతి కలిపాయి. ....మాంగల్యధారణ సుముహుర్తోమస్తు" తాళి కట్టాడు అరవింద్.  ప్రమోద అరవింద్ భార్య అయింది. కానీ అరవింద్ ప్రమోదకు........????  ఊళ్ళో కొందరు అరవింద్ తల్లి చేసిన పనికి హర్షించారు. కొందరు తిట్టుకున్నారు. అది వారి వారి మనస్తత్వాలను బట్టి ఏర్పడిన అబిప్రాయం. ఏది ఏమైనా ప్రమోద తండ్రి మాత్రం చాలా సంతోషించాడు. ప్రమోద అరవింద్ తల్లిని పట్టుకుని ఏడ్చింది. కాలం ఎప్పుడు ఏది నిర్ణయిస్తుందో ఎవరికీ తెలియదు. నిర్ణయం తీసుకున్నాక అది మారేది లేదు. మార్చేది లేదు. అదే దైవ నిర్ణయం....అనుకున్నట్టుగా అరవింద్ ప్రమోదల శోభనం ఏర్పాట్లు మొదలెట్టింది అరవింద్ తల్లి.  "అమ్మ! ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమి పెట్టకు" చాలా ఇబ్బంది పడుతూ చెప్పాడు అరవింద్.  "ఏరా, ప్రమోద అంటే నీకిష్టమే కదా" అంది నవ్వుతు.  "ఆ ఇష్టం వేరు. ఈ ఇష్టం వేరు. నాకిష్టం లేదు ఇప్పుడు" అన్నాడు మాటలు కూడగట్టుకుని.  "ఏమి ఇష్టం లేదు?" కొంచెం గొంతు పెంచుతూ అడిగింది.  "శోభనం" టూకీగా చెప్పాడు.  "నోర్ముసుకో !!!" అని అక్కడినుండి వెళ్ళిపోయింది. తల్లి మూర్ఖత్వానికి కోపం తన్నుకొచ్చింది. కాని ఏమి అనలేకపోయాడు. చిన్నప్పటినుండి అన్ని తానై అంతా తానై పెంచింది.  అరవింద్ మంచం దగ్గర నుంచున్నాడు. శోభనం గది చాలా అందంగా అలంకరించబడి ఉంది. ప్రమోద గదిలోపలికి వచ్చి తలుపు గడియ వేసింది. నిజానికి ప్రమోదకు అరవింద్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. చిన్నప్పటినుండి ఉన్న స్నేహం "ఏరా" అని పిలిచేంత చనువు. లైఫ్ ఇంత హ్యాపీగా మారుతుందని అనుకోలేదు. కాని మౌనిక గురించి తెలిస్తే ఇంత ట్రాజెడీ ఉంటుందని ఆమె ఉహించలేదు. పాల గ్లాస్ అరవింద్ కి ఇవ్వబోయింది. అరవింద్ అస్సలు కంఫోర్టబుల్ గా లేడు. అసలు అలాంటి సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. చాలా ఇబ్బందిగా తోచింది. గ్లాస్ అందుకోకుండా నెమ్మదిగా కిటికీవైపు నడిచాడు. ప్రమోద కూడా మాట్లాడకుండా అరవింద్ వైపు చూస్తూ నుంచుంది.  "నీకు ఈ పెళ్లి ఇష్టమేనా?" అని అడిగాడు చాలాసేపు తర్వాత మౌనాన్ని విరమిస్తూ.  "నీకు ఇష్టం లేదా?" ఎదురు ప్రశ్న అడిగింది.  "నా ప్రశ్నకు నీ ప్రశ్న సమాధానం కాదు" అన్నాడు.  "ఇష్టమే...." అంది. ప్రమోద వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ "కాని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను నిన్ను ఎప్పుడు అలా చూడలేదు " అన్నాడు.ప్రమోద వైపు తిరిగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ "కాని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను నిన్ను ఎప్పుడు అలా చూడలేదు " అన్నాడు.  నిజమే తను కూడా అరవింద్ ని ఎప్పుడు అలా చూడలేదు. పరిస్థితులు అతన్ని తన భర్తని చేసాయి. ఇప్పుడు తన మనసులో అరవింద్ భర్త స్థానంలో ఉన్నాడు. కాని అతను స్నేహితుడు. ఆడుకుంటున్నప్పుడు, పోట్లాడుకుంటున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు , అనారోగ్యం చేసినపుడు, ఆనందిన్చినపుడు, దుఖిన్చినపుడు, ఇలా అన్ని విషయాలలో తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇలా జీవిత భాగస్వామి అయ్యాడు. భర్త హోదాలో నిలబడి ఉన్న స్నేహితుడు.  పాల గ్లాస్ బల్లపై పెట్టి "ఇప్పుడేం చేద్దాం?" అని అడిగింది.  వెంటనే సమాధానం ఇవ్వకుండా తన దిండు తీసుకుని సోఫా దగ్గరకి నడిచాడు. సోఫాలో పక్క సద్దుతూ "నువ్వు నా భార్యవి కావు. నేనలా అనుకోవడం లేదు" అన్నాడు. ఆమె కన్నీరు చెంప మీంచి జారి కాలి మెట్టెలపై పడింది. ఆమె ఆనందం నీరుగారిపోయింది. సంతోషం పటాపంచలైపోయింది. అరవింద్ తో సంబంధం ఏమిటో నిజంగా తెలియని పరిస్థితి ఏర్పడింది.  ఆ సోఫాలో పడుకుని కళ్ళుమూసుకుని నువ్వే ఆ రోజు అన్నావుగా "దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నా స్థానం నాదే అని. నేను నీ స్నేహితుడు అని.." గుర్తుచేసాడు. ప్రమోద బదులివ్వలేదు. అటు తిరిగి పడుకుంటూ "నాకీ పెళ్లి ఇష్టం లేదని అమ్మకు తెలియనివ్వకు " చివరి మాటగా చెప్పి నిద్రకు ఉపక్రమించాడు. ప్రమోదకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. 
* * *
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#16
ఎకడమిక్ ప్రాజెక్ట్ పనులు చివరికి రావడంతో నవ్య రికార్డు వర్క్ తో బిజీ ఉంది. ఇంతలో తన మొబైల్ కి మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే బ్లాంక్ మెసేజ్, రాజీవ్ పంపించాడు.  నవ్యకి ఒక్కసారిగా ఆనందం అనిపించింది. "ఏమిటి బ్లాంక్ మెసేజ్ " రిప్లై ఇచ్చింది.  "ఏమి లేదు" రిప్లై ఇచ్చాడు.  "ఏమి చేస్తున్నావ్?" అడిగింది.  "ఏమి చేయడం లేదు" చెప్పాడు.  "అన్నం తిన్నావా?"  "ఇంకా లేదు"  "మన ప్రాజెక్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసేసాను.నువ్వేం చేయనవసరం లేదు. చేసిన వర్క్ ఒకసారి చదువు. ఏమైనా యాడ్ చేయాలంటే చేద్దాం" అని చెప్పింది.  "సరే" అన్నాడు ముభావంగా.  "ఏంటి ఒంట్లో బాగోలేదా?"  "బాగానే ఉంది."  "...ఇంకా ఏంటి?"  "చెప్పాలి నువ్వే!!"  "ఏమైనా మాట్లాడాలా?" అని మెసేజ్ పంపింది. బదులుగా బ్లాంక్ మెసేజ్ పంపాడు.  "నువ్వలా బ్లాంక్ మెసేజ్ పంపితే నాకేం అర్ధమవుతుంది" అని రిప్లై ఇచ్చింది.  "అరవింద్ మొబైల్ లో నీ మెసేజ్ చూసాను" బోల్డ్ లెటర్స్ లో టైపు చేసి రిప్లై ఇచ్చాడు.  ఈ సారి నవ్య బ్లాంక్ మెసేజ్ పంపింది ఏం రిప్లై ఇవ్వాలో తెలియక.  "నేనంటే ఎందుకంత ప్రేమ నీకు?" అడిగాడు  "తెలీదు" చెప్పింది.  “నిన్ను నేను అంతలా అవైడ్ చేస్తున్నానని తెలిసినా నాపై నీకు కోపం రాలేదా?"  "లేదు"  “నేను నిన్ను చాలా బాధ పెట్టాను , ఐ యామ్ రియల్లీ సారీ నవ్య"  "సారీ ఏమి వద్దు"  "మరి ఏమి కావాలి?"  "నీకు తెలియదా?"  "ఇచ్చే పరిస్థితిలో నేను ఉన్నాను. తీసుకునే స్థితిలో నువ్వు ఉన్నావా?, నిర్ణయం నీదే!"  "నా నిర్ణయం ఎప్పుడు ఒక్కటే!" రిప్లై చదివేసరికి రాజీవ్ చాలా ఆనందపడ్డాడు.  "నీతో ఒకవిషయం చెప్పాలి. ఆ తర్వాత నీ ఖచ్చితమైన నిర్ణయం నాకు చెప్పు" అని రిప్లై చేసాడు  "సరే, ఎక్కడ కలుద్దాం?"  " రేపు యూనివర్సిటీలో డిసైడ్ చేద్దాం "  "ఓకే, ఐ మిస్ యు రాజీవ్ " రిప్లై ఇచ్చింది  "ఐ .........." అని రిప్లై పంపాడు. 

* * *
"జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం కాదు. జరిగిందేదో జరిగిపోయింది. ఒకరి తప్పుకి మరొకరికి శిక్ష వేయడం భావ్యం కాదు నిరంజన్. స్వాతి తప్పుకి మానస ఏం చేసిందిరా? అంతమందిలో అవమానించావు. కోపంలో పొమ్మన్నావు. నిదానంగా ఆలోచించు. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కూడా బాగానే ఉంది కదా. ఒకసారి వెళ్లి మానసతో మాట్లాడు.తను నిన్ను తప్పకుండా అర్ధం చేసుకుంటుంది. మనిషి ఉన్నప్పుడు విలువ తెలీదు. దూరమైనపుడే తెలుస్తుంది. సమయం ఏమి మించిపోలేదు నిరంజన్, మానసతో మాట్లాడు." చెప్పాడు అచ్యుత్.  అచ్యుత్ చెప్పిన మాటలను మౌనంగా విన్నాడు నిరంజన్. లేచి నిలబడుతూ "ఆ రోజు ఎందుకలా ప్రవర్తించానో నాకే అర్ధం కావడం లేదు. నాన్న పోయిన బాధతోనో, చెల్లెలు పనికిమాలిన పని చేసిందనే కోపంతోనో, అమ్మకేమైనా అవుతుందనే బెంగాతోనో అలా మాట్లాడేసాను. అలాంటి పరిస్థితుల్లో నాకెందుకో నా ప్రేమ కనిపించలేదు. మానసను చాలా బాధ పెట్టాను" గుండె పొరల్లోంచి తన్నుకొచ్చిన మాటలను కన్నీటి సాక్షాలుగా అన్నాడు నిరంజన్.  అచ్యుత్ స్నేహపూర్వకంగా భుజంపై చేయి వేసి " మానసతో ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా మాట్లాడు" అని చెప్పాడు. "ఇంతకీ నా చెల్లెలు ఎక్కడ ఉంది?" అని ప్రశ్నించాడు నిరంజన్.  "అంజలి ఇంట్లో... " చెప్పాడు అచ్యుత్.  " మరి అశోక్?‘"  "ఇబ్బంది పడుతూ స్వాతికి అశోక్ కి పెళ్లి జరగలేదట. " అన్నాడు మెల్లిగా. ఆకాశం ఊడిపడ్డట్టు అదిరి పడ్డాడు నిరంజన్.  "ఏం మాట్లాడుతున్నావ్ అచ్యుత్" అని అడిగాడు కంగారుపడుతూ.  "అవును,.అశోక్ బంధువులు అతన్ని కొట్టి పెళ్లి మండపం మీంచి లాక్కెళ్ళిపోయారట. ఏమి తోచని స్థితిలో మళ్ళీ ఇంటికొస్తే నువ్వూ పొమ్మన్నావు. అప్పుడు అరవింద్ ఆలోచనతో మేము స్వాతిని అంజలి ఇంట్లో ఉంచాము. అక్కడ తను క్షేమంగానే ఉంది" చెప్పాడు అచ్యుత్.  "ఛ! ఎంత తప్పు చేసాను. కాని పరిస్థితులు అప్పుడలా మాట్లాడించాయిర. రేపే నా చీల్లెల్ని కలిసి ఇంటికి తీసుకొస్తాను. పాపం దానికి నేను తప్ప ఇంకెవరున్నారు" అన్నాడు కళ్ళల్లో నీళ్ళతో. 
* * *
అరవింద్ తల్లి దగ్గరకు వెళ్లి "అమ్మా, రేపు నేను వైజాగ్ బయలుదేరుతున్నాను" అన్నాడు.  "నేను ఏమిట్రా ? ప్రమోద రావడం లేదా నీతో ?" మాములుగా అడిగింది తల్లి.  "తర్వాత వస్తుంది. ఇప్పుడు కాదు " అని చెప్పాడు  "అలా ఏమి కుదరదు. తనని కూడా తీసుకెళ్ళు. అక్కడ అద్దె ఇల్లు తీసుకుని కలిసి ఉండండి" చెప్పింది.  "అమ్మ, ఇప్పుడు వద్దన్నానా?" గొంతు పెంచుతూ అన్నాడు.  "నీవాలకం చూస్తుంటే తేడాగా ఉంది. అక్కడేమైనా వ్యవహారం నడిపావా?" అని ప్రశ్నించింది. తల్లి ఒక్కసారిగా అలా అడిగేసరికి భయమనిపించింది అరవింద్ కి. నిజం చెప్పడానికి ధైర్యం చాలాలేదు. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. అబద్ధం ఆడటానికి ఆలోచన కావాలి. ఆలోచనతో "అబ్బే, అలాంటిదేమీ లేదు" అన్నాడు.  "నమ్మచ్చా?"  "నమ్ము నమ్మకపో. నేను చెప్పేది నిజం."  "అయితే ఇద్దరు కలిసి వెళ్ళండి"  "అది కాదమ్మా, నేను వెళ్లి ఇల్లు వెతికి మళ్ళి వచ్చి అప్పుడు ప్రమోదను తీసుకెళ్తాను. అంతవరకూ ఓపిక పట్టు " అన్నాడు నెమ్మదిగా  తల్లి సాలోచనగా "సరే, వచ్చేవారం ప్రమోద ఇక్కడ ఉండటానికి వీలు లేదు" అంది  "సరే,.." అన్నాడు అయిష్టంతో.  విసుగుతో తన గదిలోకి వెళ్ళాడు. ప్రమోద అరవింద్ బట్టలు సద్దుతోంది. దగ్గరకు వెళ్లి "నా పనులు నువ్వేమి చేయకు. నేను చేసుకుంటాను. " అంటూ ఆమె చేతిలో బట్టలు లాక్కుని ఎలా పడితే అలా బాగ్ లోకి విసిరేసి కుక్కుతూ " అసలు నిన్ను తీసుకెళ్లకూడదు అనుకున్నాను. మా అమ్మ పట్టుబడుతోంది. వచ్చేవారం వస్తాను. రెడీగా ఉండు" చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు. ప్రమోద ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. అరవింద్ తన మొబైల్ తీసుకుని రాజీవ్ కి ఫోన్ చేసాడు.  "హలో, చెప్పు అరవింద్? ఎలా ఉన్నావ్?"  "నేను రేపు వైజాగ్ వస్తున్నాను. డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తాను. సాయంత్రం ఆరు అవుతుంది.నిరంజన్ ని, అచ్యుత్ ని కూడా రమ్మని చెప్పు. మీతో మాట్లాడాలి."  "సరే" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు రాజీవ్ . రాజీవ్ వాళ్ళిద్దరికీ ఫోన్ చేసి విషయం చెప్పి తర్వాత రోజు సాయంత్రం ఇంటికి రమ్మన్నాడు. 
***
ఆ తరువాత రోజు మామూలుగా యూనివర్సిటీకి వెళ్ళాడు అచ్యుత్. చైతన్య గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని ఉంది.  ఆమె వైపు చూడలేకపోయాడు. ఆమె తన మనిషి కాదనే బాధతో తల తిప్పుకున్నాడు. ఏమి మాట్లాడలేదు.  "ఏంటి అచ్యుత్ నాతో మాట్లాడవా?" అని అడిగింది...... "..... నీతో మాట్లాడడం కోసమే ఇంతకాలం తపించిపోయాను. ఇప్పుడు మాట్లాడటానికి మాటలు లేని పరిస్థితి". మౌనం వహించాడు.  "ఏంటి మౌనం , నామీద కోపం వచ్చిందా?" అని అడిగింది.  ".... కోపం ఎందుకు?, నీపై ప్రేమ తప్ప కోపం ఉంటుందా? అసలు అలాంటి అవకాశమే లేదు". మౌనంగానే ఉన్నాడు.  "ఇంకా నాగురించే ఆలోచిస్తున్నావా?" అని మరొక ప్రశ్న అడిగింది.  ".....నాగురించే ఆలోచిస్తున్నావా!, అవును నీగురించే నా ఆలోచన. గత నాలుగేళ్ళుగా నీగురించే ఆలోచించాను. నిజంగా ప్రేమను వ్యక్తపరచనపుడు చెట్టు చాటునుండో, దూరంగా నిలబడో, ఆదమరపుగానో నిన్ను చూస్తూ ఆనందించడమే బాగుంది. ఇప్పుడు నువ్వు ఇంత దగ్గరగా ఉన్న నీవైపు చూసే ధైర్యంలేదు". మౌనంగానే ఉండిపోయాడు.  చైతన్య అచ్యుత్ చేయి పట్టుకుని "ఏమి మాట్లాడవేంటి అచ్యుత్? నువ్వు అలా ఉంటే నాకు నచ్చలేదు" అంది. ".... ఎలా ఉండాలి? మళ్ళీ మామూలుగా మాట్లాడాలంటే నా వల్ల కాని పని చైతన్య". సమాధానం ఇవ్వలేదు.  "నేను నీకు చెప్పాను కదా అచ్యుత్. నాకు నా బావ అంటే ప్రాణం అని. ఇంకా ఎందుకు దక్కని వాటి గురించి, అందనివాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటావు? ఇలా ఆలోచించి ప్రయోజనం లేదు. నీకు మంచి జీవితం ఉంది అచ్యుత్ , ప్లీజ్ నార్మల్ గా ఉండు" అని అచ్యుత్ గడ్డం పట్టుకుని అతని ముఖాన్ని తనవైపు తిప్పుకుని “ప్లీజ్…” అంది ఆమె కళ్ళని చిన్నవిగా చేస్తూ బ్రతిమాలినట్లుగా.  నాకు నువ్వంటే ప్రాణం అందామనుకున్నాడు. నీకోసం ఆలోచించిన ప్రతి నిమిషం నాకు చాలా విలువైనది అని చెపుదామనుకున్నాడు. మంచి జీవితం అంటే నువ్వు ఉంటేనే అని అనాలనుకున్నాడు. కాని అవి అని ప్రయోజనంలేని మాటలు. అనాలనిపించలేదు అచ్యుత్ కి. కాని నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు. లేచి నుంచుని రెండు అడుగులు ముందుకు నడిచి "నేను మాట్లాడే విషయాలు ఏమి లేవు. మన ప్రాజెక్ట్ అవగానే నేను వెళ్ళిపోతాను. నేను మళ్ళీ నీ జీవితంలోకి రాను. నావల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదు. కాని నీగురించి ఆలోచించకుండా ఉండే శక్తి నాకు లేదు. ఎందుకంటే నిన్ను చూసిన క్షణం నుండి అన్ని నువ్వే అనుకున్నాను.కాని ఇప్పుడు.... కళ్ళల్లో నీళ్ళు సుడులై తిరిగాయి., కళ్ళు తుడుచుకుని నీకు దూరమైపోతాను అని తెలిసినప్పట్టినుండి తట్టుకోలేకపోతున్నాను చైతన్య!!!!, నిన్ను బ్రతిమాలాలని ఉంది. నన్ను ప్రేమించమని ప్రాధేయపడి అడగాలని ఉంది. మరొక నిమిషంలో ప్రాణం పోతుంది అని తెలిస్తే పడే బాధ నాది. గొప్ప చిత్రకారుడికి సడెన్ గా కళ్ళు పోతె పడే వ్యధ నాది. చెప్పినా నీకు అర్ధం కాదు. ఆపాడు. మళ్ళీ తానే కొనసాగిస్తూ “ఒక్క విషయం చెప్తాను చైతన్య, నువ్వు కాకపొతే నాకు భార్యగా మరొకరు వస్తారు. కాని కచ్చితంగా నువ్వు లేని లోటు ఫీల్ అవుతాను. సింపుల్ గా చెప్పాలంటే అనుకున్న బస్సు మిస్ అయితే తరువాత ఉండే బస్సు ఎక్కడమే!! ప్రయాణం ఆగదు. గమ్యం చేరేవరకు. ఇష్టం ఉన్న లేకున్నా పయనం సాగించాల్సిందే...ఆఖరి కట్టె కాలేవరకు." చెప్పి వెళ్ళిపోయాడు. చైతన్యకు కూడా ఆమెకు తెలియకుండా కన్నీళ్లు వచ్చాయి. 
* * *
యూనివర్సిటీలో రాజీవ్ నవ్యని కలిసాడు. అతను మాట్లాడేవరకు తానూ మాట్లాడకూడదు అని అనుకుంది. చాలాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. నెమ్మదిగా పెదాలు కదుపుతూ "సాయంత్రం బయటకు వెళ్దామా?" అని అడిగాడు రాజీవ్.  "ఎక్కడికి?" అని అడిగింది.  "నీ ఇష్టం" అన్నాడు.  "గుడికి వెళ్దాం " అని చెప్పింది.  "సరే, షార్ప్ 5 కి మీ ఇంటి దగ్గరకు వస్తాను" అని చెప్పి క్లాస్ కి వెళ్ళిపోయాడు.  ఏ రోజుకోసమైతే నవ్య ఇంతకాలం ఎదురు చూసిందో ఆ రోజు రానే వచ్చింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. సాయంత్రానికల్లా రెడీ అయి పాట పాడుకుంటూ అద్దంలో తన అందాన్ని చూసుకుంది. తన మెరుపు బొట్టు సద్దుకుంది. చిన్నగా నవ్వుకుని, సిగ్గుపడుతూ కళ్ళు ఎత్తి తన అదృష్టాన్ని అద్దంలో మరోసారి చూసుకుని మురిసిపోయింది. కురులు ఒకటికి రెండు సార్లు సవరించుకుంది. కూల్ కూల్ అని పదే పదే చెప్పుకుంది. ఈలోపులో బయట నుండి హారన్ వినిపించింది. పరిగెత్తుకుంటూ గుమ్మం వరకు వెళ్ళింది. రాజీవ్ ని చూసి పొంగిపోయింది. అతను ఆమెవైపు చూసాడు. నెమ్మదిగా వెళ్లి బండి ఎక్కి కూర్చుంది. వాళ్ళ ప్రయాణం ప్రారంభమయింది.........  మెల్లిగా మొహమాట పడుతూనే అతని భుజంపై చేయి వేసింది. బండి నడుపుతూనే ఆ చేతిని చూసాడు. అతనికి చాలా భయంగా ఉంది. ఇప్పుడు తానూ చెప్పబోయే విషయం విన్న తరువాత నవ్య ఎలా ఉంటుందో అని చాలా భయంతో ఉన్నాడు.  అది ఒక అమ్మవారి గుడి. ఆ దేవతను ఏమి కోరుకున్న అది నెరవేరుతుందని దారిలో నవ్య చెప్పింది. కళ్ళు మూసుకుని " అమ్మా! నేను ఎప్పుడు గుడికి వెళ్ళలేదు. మొట్టమొదటిసారిగా వచ్చాను. మొట్టమొదటి కోరిక కోరుకుంటున్నాను. నేను కావాలనుకుంది నాకు దక్కేలా చేయి" అని ప్రార్ధించాడు. ఆమె అతనివైపు చూస్తూ నుంచుంది, అతను కళ్ళు తెరిచాక "బొట్టు పెట్టుకో" అంది. అక్కడున్న కుంకుమ తీసి పెట్టుకున్నాడు. "నాకు కూడా పెట్టు " అంది నవ్వుతూ. ఆమె నుదిటిపై పెట్టాడు. అప్పుడు ఆమె ఆనందం ఆమె పెదవుల్లో కదలాడింది. ఉద్వేగం ఆమె కళ్ళల్లో మెదిలింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని కళ్ళలోకి చూసింది. ప్రసాదం పుచ్చుకుని మెట్లదగ్గర పక్కగా కూర్చున్నారు.  రాజీవ్ విషయం చెప్పడానికి సంకోచిస్తుండగా "ఏదో మాట్లాడుతాను అన్నావ్?" అని అడిగింది. జంకుతూనే "ఏమి లేదు నవ్య .. నేను....." అంటూ నీళ్ళు నమిలాడు.  "ఏంటో చెప్పు" అంది మాములుగా. ఇంతలో మేఘన అక్కడికి వచ్చింది. వాళ్ళిద్దరిని చూసి అదిరిపడింది. రాజీవ్ కూడా ఖంగుతిన్నాడు. మేఘనను చూస్తూ లేచి నుంచున్నాడు. ఇద్దరిని చూసి తానూ కూడా లేచి నుంచుంది నవ్య. నవ్య " హేయ్, మేఘన," అంటూ దగ్గరకు వెళ్లి " రాజీవ్ నా ప్రేమను అంగీకరించాడు" అంది పట్టరాని సంతోషంతో.  "నేను కాదన్నాను. నిన్ను ఒప్పుకున్నాడు " అంది అక్కసుతో.  నవ్య కళ్ళు పెద్దవయ్యాయి. గుడిలో గంటలు గణ గణ మ్రోగాయి. ఒక అడుగు వెనక్కి వేసి ఇద్దర్ని చూస్తూ ఉండిపోయింది నవ్య. రాజీవ్ తలవంచుకుని నుంచున్నాడు. అతనికి దగ్గరగా నడిచి " నువ్వు నాకోసం తిరిగి వస్తావని ఇంతకాలం ఎదురుచుసాను రాజీవ్. నా నమ్మకాన్ని వమ్ము చేసావు. నా ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేసావు. నన్ను మోసం చేసావు. నన్ను మోసం చేసావు...." అంటూ గొంతు నరాలు తెగిపోయేలా అరిచింది మేఘన. నవ్యకి అక్కడ ఉండాలనిపించక బాధతో అక్కడినుండి బయటకు పరిగెత్తింది. నవ్యా అని పిలిచాడు. పట్టించుకోలేదు."ఆగు నవ్య…… !!! ప్లీజ్... " అంటూ అరిచాడు. ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి మేఘనవైపు చూసి "ఎదురు చూసావా? ఎప్పుడైనా నాకోసం ఆలోచించావా? నువ్వు నీ మూర్ఖత్వంతో నన్ను కట్టిపడేసావేగాని, నీతో జీవితం సాగించడం కన్నా ఆ సముద్రంలో దూకడం నయం. ఇప్పుడు చెపుతున్నాను విను, నేను పెళ్లి అంటూ చేసుకుంటే నవ్యనే చేసుకుంటాను. ఎవరు అవునన్నా కాదన్న,, ఆ అమ్మవారిమీద ఆన" బయటకు కదిలాడు. 
* * *





[+] 4 users Like LUKYYRUS's post
Like Reply
#17
అరవింద్ వస్తున్న విషయం మౌనికకు కూడా చెప్పాడు అచ్యుత్. తను కూడా వస్తానని చెప్పింది. సాయంత్రం 5 గంటలకే అందరు రాజీవ్ ఇంట్లో కలిసారు. నిరంజన్, రాజీవ్ లకు మౌనిక కూడా వస్తున్న విషయం చెప్పాడు అచ్యుత్. "ఎందుకు ?" అని అడిగారు. "అరవింద్ కోసం" చెప్పాడు అచ్యుత్. ఆశ్చర్యపోయారు ఇద్దరు. "అవునుర, బహుసా ఈ విషయం చెప్పడానికే ఇంటికి రమ్మని ఉంటాడు. వాడు ఊరు వెళ్లి తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించి ఉంటాడు. మౌనికని ప్రేమిస్తున్న విషయం ముందు నాకు చెప్పాడు. మీకు చెపుదాం అంటే ఎవరి ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు." పూర్తి చేసాడు అచ్యుత్.  వాళ్ళు మాటల్లో ఉండగానే సుధీర్తో పాటు కలిసి మౌనిక వచ్చింది. సుదీర్ రావడంతో కొంచెం కంగారు పడ్డారు. లోపలికి వస్తూనే సుధీర్ "హాయ్" అని పలకరించి " నా చెల్లెలు నాకు అంతా చెప్పింది. నా చెల్లెలుకు ఇష్టమైతే నాకు ఇష్టమే" అంటూ అడగకుండానే కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అందరు లోపల కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. అరవింద్ కోసం అందరి ఎదురుచూపు.  అరవింద్ వైజాగ్ వచ్చి డైరెక్ట్ గా రాజీవ్ ఇంటికి బయలుదేరాడు. దారిలో ఉండగా మౌనికకి కాల్ చేసాడు. కాని మౌనిక మొబైల్ ఇంట్లో మర్చిపోయింది. రెండు మూడు సార్లు ప్రయత్నించి విరమించుకున్నాడు.  అరవింద్ మనసు పరిపరివిధాల ఆలోచిస్తోంది. అదొక విచిత్రమైన స్థితి. స్నేహం నుండి పెళ్లి అనే పెద్ద అడుగు వేసిన గతం అది. ప్రేమ అనే అడుగు వదిలేసి ఏడు అడుగులు నడిచిన దారి అది. స్నేహాన్ని మరొక కోణంలో ప్రతిక్షేపించిన పరాధీన వ్యవస్థ అది.ప్రమోదతో పెళ్లి జరిగిన క్షణం నుండి అరవింద్ కి మతిపోతోంది.మౌనిక తన సొంతం అవుతుందని ఎన్నో అందమైన కలలు కన్నాడు. ఆకాశంలో చుక్కలు చూసి ఆనందించడంలాంటి విషయం అవుతుందని తరువాత తెలిసి వచ్చింది.  ఇప్పుడు ప్రమోద తన జీవితంలో పూర్తి స్థానాన్ని ఆక్రమించింది. గుండెల్లో ఉన్న మౌనిక మాత్రం ఎంతకాలం ఆ ఇరుకులో కొట్టుమిట్టాడుతుంది. నిజం తెలిస్తే తనే బయటకు వెళ్ళిపోతుంది, లేదా భార్య అనే హక్కుతో ప్రమోదే మౌనికని బయటకు నెట్టేస్తుంది.అనామకుడులా , చేతకాని వాడిలా చూస్తూ ఉండాలే కాని ఏమి చేయలేని అచంచలమైన స్థితిలో ఉన్నాడు.  ఆలోచనలు మారినట్టే ప్రదేశాలు మారి రాజీవ్ ఇంటికి చేరాడు అరవింద్...బయట ఆటో శబ్దం వినిపడగానే అందరు బయటకు చూసారు. లోపలికి నడుచుకుంటూ వస్తున్న అరవింద్ ని చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా కౌగిలించుకుంది. మౌనికని అక్కడ చూసేసరికి షాక్ అయ్యాడు.  "ఎన్ని రోజులైంది చూసి? ఎలా ఉన్నావ్? వెళ్ళాక ఒక్కసారే కాల్ చేసావు, మళ్ళీ చేయలేదేంటి? యు నో వాట్ మా అన్నయ్య కూడా మన ప్రేమని ఒప్పుకున్నాడు. ఇంట్లో వాళ్ళను ఒప్పించే డ్యూటీ కూడా వాడిదే. సో తొందరలో మన పెళ్లి " సంతోషం పట్టలేకపోతోంది.  ఆమె మాటలన్నీ విని " నువ్వెంటిక్కడ?" అని ప్రశ్నించాడు.  "నేనే రమ్మని చెప్పానురా" వెనకనుండి వస్తూ అన్నాడు అచ్యుత్. అచ్యుత్ వైపు చూసాడు. ఆ చూపుల్లో అర్ధం ఏమిటో గ్రహించలేకపోయాడు అచ్యుత్.  "సరే ప్రయాణం చేసానుగా, కొంచెం అలసటగా ఉంది. రెస్ట్ తీసుకుంటాను. మనం రేపు కలుద్దాం" అని అన్నాడు అరవింద్. మౌనిక అరవింద్ మూడిగా ఉండటం గమనించినా అది ప్రయాణం బడలికే కారణం అయ్యుంటుందని "సరే నీ ఇష్టం" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మౌనిక వెళ్ళిన అరగంట తరువాత "ఏమైందిరా? వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అదోలా ఉన్నావు. అంతా ఓకే కదా?" అడిగాడు నిరంజన్.  "లేదురా.. ఏదీ ఓకే కాదు. నాకు పెళ్లి అయిపోయింది" చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు అరవింద్.  ఒక్కసారిగా కింద భూమి కంపించిపోయింది. ఎవరి ముఖాల్లోనూ నెత్తురు చుక్క లేదు. కరెంటు షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయారు అందరు. తలవంచుకు కూర్చున్న అరవింద్ దగ్గరగా నడిచి భుజంపై చేయి వేసాడు నిరంజన్. తడిసిన కళ్ళతో చూసి " నాకు పెళ్లి జరిగిపోయిందిర, " అంటూ జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చాడు. ఇది చెప్దామనే నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అని చెప్పాడు.  "ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్? " అని అడిగాడు రాజీవ్.  "ఏమో తెలియదు. వచ్చేవారం ప్రమోదను ఇక్కడకు తీసుకురావాలి. ఆ తరువాత ఏమి జరిగితే అది" చెప్పాడు అరవింద్.  "ఇలా జరుగుతుందనుకోలేదు" అన్నాడు అచ్యుత్.  "నేను అస్సలు ఊహించలేదు. అతిధిగా వెళ్లాను. పెళ్లి పీటలెక్కాను. ఒక్కోసారి దేవుడు ఇంతలా పరీక్షలెందుకు పెడతాడో తెలీదు. నేను ఎప్పుడు ప్రమోదను ఆ విధంగా చూడలేదు కాని నా భార్యను చేసాడు. నేను ఇప్పుడు ప్రమోదకు అన్యాయం చేయలేను. మౌనికను మోసం చేయలేను. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం ఆ భగవంతుడే నిర్ణయించాలి" అని చెప్పాడు అరవింద్.కష్టాలు తెచ్చేది భగవంతుడే కష్టాలు తీర్చేది భగవంతుడే... మనిషై పుట్టాక కష్టాలు వచ్చినపుడు ఆ దేముడిని తిట్టుకుని మళ్ళి అవన్నీ తీర్చమని అతడినే అడగడం చాలా విచిత్రమైన విషయం!!!అరవింద్ మాట్లాడడం పూర్తయ్యాక రాజీవ్ నెమ్మదిగా తన గురించి చెప్పడం మొదలు పెట్టాడు.  "నేను నవ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" చెప్పాడు రాజీవ్. అచ్యుత్, నిరంజన్ లు ఆశ్చర్యపోయారు. అరవింద్ కి విషయం తెలుసు కనుక మామూలుగానే " మంచి నిర్ణయం తీసుకున్నావు " అని చెప్పాడు. రాజీవ్ చిన్నగా నవ్వి "అవునురా మీతో ఒక విషయం చెప్పలేదు. మేఘన నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాము. తరువాత మనస్పర్ధలు వచ్చి విడిపోయాము. ఆ తరువాత నవ్య నా జీవితంలోకి వచ్చింది. తను నన్ను ప్రేమిస్తోందని తెలిసికూడా నేను మేఘన కోసం ఆలోచించో, భయపడో, సిగ్గుపడో, పరువుపోతుందనో ఇంతకాలం వెనకడుగు వేసాను. మేఘన నా జీవితంలో ఉంటే నాకు రోజు నరకమే. కాని నవ్య ఉంటే నేను చాలా ఆనందంగా ఉండగలను. ఆవిషయం చెపుదామనే తనతోపాటు గుడికి వెళ్లాను. కాని ఆ సమయంలో మేఘన అక్కడికి వచ్చింది. మమ్మల్ని చూసి నవ్యతో " నేను కాదన్నాను. నిన్ను ప్రేమించాడు" అంటూ మాట వదిలేసింది. దాని అహం సంతృప్తి చెందడానికి ఏమైనా చేస్తుంది. "నన్ను మోసం చేసావు" అంటూ కేకలు పెట్టింది. ఇదంతా చుసిన నవ్య ఏడ్చుకుంటూ నా మాట పట్టించుకోకుండా నేను పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్లిపోయిందిరా.... " అని కాసేపు ఆగి ఊపిరితీసుకుని, “ప్రేమ ఇస్తున్నపుడు పుచ్చుకోలేదు. ఇప్పుడు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాను. నవ్య లేకుండా నేను బ్రతకలేను. ఆ మాటే మేఘనతో నిర్మొహమాటంగా చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు నవ్యతో మాట్లాడాలి. తన నిర్ణయంపైనే నా జీవితం ఆధారపడి ఉంది." ముగించాడు.  "నవ్య తప్పకుండా నిన్ను అంగీకరిస్తుంది.కంగారుపడకు" అంటూ ధైర్యం చెప్పాడు అచ్యుత్. అచ్యుత్ వైపు జాలిగా చూసాడు అరవింద్. వెంటనే తల పక్కకు తిప్పుకుని " జీవితంలో ఏమైనా వద్దనుకున్నపుడు వస్తుంటాయిరా , కాని వాటితోనే మన ఆనందం ఉంటుందని అప్పుడు మనకి తెలియదు. మరొకదాని కోసం వెంపర్లాడడంతో సమయం అంతా వృధా అయిపోతుంది. ఇంతలో ఇది కూడా దూరమయ్యాక తెలుస్తుంది సమయం విలువ , ఆ మనిషి విలువ.." అని అన్నాడు.  "నేను కూడా మానసతో మాట్లాడుతాను. తనని చాలా బాధ పెట్టాను. తనని మిస్ అవడం నాకు ఇష్టం లేదు." అని అన్నాడు నిరంజన్.  అచ్యుత్ “భలే మలుపులు తిరిగాయి మన జీవితాలు. ఎంత విచిత్రమో చూడు. మానస నిరంజన్లు మొట్టమొదటి నుండి ప్రేమికులు కాని ఇప్పుడు విరహ వేదనలో ఉన్నారు. వీడేమో ఒకప్పుడు నవ్యని కాదన్నాడు. ఇప్పుడు తనలేకుండా ఉండలేను అంటున్నాడు. వీడు మౌనికని ప్రేమించాను అని పరిస్థితుల వాళ్ళ ప్రమోదను పెళ్లి చేసుకున్నాడు. ఎటొచ్చి నేనే అప్పుడు ఇప్పుడు ఒంటరివాడిలాగానే ఉన్నాను. బలవంతంగా కన్నీళ్లు ఆపుకోబోయాడు. నేను చైతన్యాని మిస్ అవుతున్నానురా అంటూ ఏడ్చాడు. వెంటనే తేరుకుని ప్రతి కధకి ఒక ముగింపు ఉంటుంది. మన కధకి కూడా అందమైన ముగింపు ఉండి తీరుతుంది. ఎవరు కోరుకున్న తీరాలకు వారు తప్పకుండా చేరుతారు. ఇది సత్యం. జీవితం అంటే సుఖ ధుఖ్ఖాల సారం. అనుభవాల మణిహారం. చివరకు అందరం గెలవడం ఖాయం" అని ముగించాడు.
* * *
అరవింద్ వేరే ఇల్లు తీసుకున్నాడు. ప్రమోదతో కలిసి అక్కడే ఉన్నాడు. కాని యూనివర్సిటీలో వాళ్ళ నలుగురికి తప్ప మరెవరికి తెలియదు అరవింద్ కి పెళ్లి జరిగిందని!! ప్రమోద తండ్రి అరవింద్ కి మోటార్ సైకిల్ కొని ఇచ్చాడు. ఇద్దరు బండిపై గుడికి వెళ్లి బండి పూజ చేయించారు. ఇద్దరు దైవ దర్శనం చేసుకుని ఇంటికి తిరిగొచ్చారు. ఇలా చేయమని అరవింద్ తల్లి ఆర్డర్. చేయక తప్పలేదు. కాని అరవింద్ ప్రమోదతో ఏమి మాట్లాడలేదు. ఆమె కూడా మాట్లాడటానికి ప్రయత్నించలేదు. ఆమెను ఇంటి దగ్గర దించేసి అలానే బండిపై యూనివర్సిటీకి వెళ్ళాడు. కావాలనే లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోయాడు. యూనివర్సిటీలోకి వెళ్తుండగా మౌనిక కనిపించింది. బండి ఆపి పలకరించాడు.  "ఏంటి కొత్త బండా?"  "అవును"  "నేను ఎక్కనా?"  "ఎక్కు"  బండి ఎక్కి కూర్చుని " బహుసా నేనే అనుకుంట నీ వెనక కూర్చున్న మొదటి వ్యక్తిని" అంది భుజంపై చేయి వేస్తూ. ఏమి మాట్లాడకుండా చిన్నగా నవ్వేడు. మౌనిక కూడా నవ్వింది.  ఒక్కొక్కసారి చిరునవ్వు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. కాని నిజానికి సరైన సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే చిరునవ్వు సమాధానంగా ఉంటుంది. అరవింద్ మౌనికలను ఈసారి యూనివర్సిటీ మొత్తం చూసేసింది. కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు ఈర్ష్య పడ్డారు. కొందరు జంట బాగుందనుకున్నారు. కొందరి గుండెలు బద్ధలైపోయాయి. అలా ఈర్ష్య పడిన జాబితాలు రెండు రకాలు. మొదటిరకంలో అంత అందమైన అమ్మాయిని ప్రేమలో పడేసినందుకు కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారు. ఇక రెండో రకంలో తన ప్రేమ ఓడిపోయినా వ్యధలో, పక్కవాడు సంతోషంగా ఉండినందుకు కలిగిన ఈర్ష్య. ఇలా ఈర్ష్య పడింది మేఘన. వాళ్ళిద్దరిని చూసిన ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి.  "హాయ్ మేఘన" బండిమీంచే పిలిచి " అరవింద్, అటువైపు పోనీయ్" అని అంది మౌనిక. మేఘన ముఖంలో మార్పు లేదు. " హాయ్, ఎలా ఉన్నావే?" అని అడిగింది బండి దిగుతూ.  "నాగురించి ఎందుకే ? నువ్వు బాగున్నావుగా అది చాలు" అంది మేఘన, అరవింద్ వైపు చూసి "మొత్తానికి పందెం గెలిచావుగా" అంది . కంగారు పడ్డాడు అరవింద్.  "ఏం పందెం?" అని అడిగింది మౌనిక.  "అరవింద్ నే అడుగు" అంది మేఘన.  "ఏంటి?" అంది మౌనిక నవ్వుతూనే.  "ఏమిలేదు , తరువాత చెప్తాను " అన్నాడు  "ఏం భయమేస్తోoదా? పోనీ నేను చెప్పనా?" అంది మేఘన. అరవింద్కి పట్టరానంత కోపం వచ్చింది. దాన్ని అణుచుకుంటూ "ప్లీజ్ నీ పని నువ్వు చూసుకో" అన్నాడు.  "మౌనిక నీకు ప్రియురాలు కాకముందు నుండి నాకు ఫ్రెండ్. తన విషయం అంటే నాకు అది విషయమే" సమాధానం ఇచ్చింది మేఘన. అరవింద్ మౌనికతో " నేను వెళ్తున్నాను మౌనిక" అన్నాడు.  "ఏంటిది?" అంది మౌనిక ఏమి అర్ధంకాక.  "నువ్వు వస్తావా?రావా? " అని అడిగాడు.  "అది రాదు. నువ్వు వెళ్ళొచ్చు" మౌనిక వైపునుండి వకాల్తా పుచ్చుకుని మేఘనే చెప్పింది. బండి స్టార్ట్ చేసి "ఐ యామ్ గోయింగ్" అన్నాడు. "నేను వస్తాను, సారినే ఏమనుకోకు..." అని బండి ఎక్కేసింది మౌనిక. మేఘన కళ్ళల్లోకి సూటిగా చూసి బండి కదిలించాడు అరవింద్. మేఘనకు తల తీసేసినట్టైంది. అవమానభారంతో రగిలిపోయింది. ఆరోజు అరవింద్ తో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.  "15 రోజుల్లో ఆమె నీతో ఫ్రెండ్ షిప్ చేయాలి. ఆమె నీకోసం వెయిట్ చేయాలి. నీకోసం నన్ను ఇగ్నోర్ చేసేంతగా చేయాలి. నేను ఓడిపోతే నువ్వేమి చెప్తే అది చేస్తాను. నేను గెలిస్తే ..." మాటలు అంతవరకే గుర్తుకు వచ్చాయి. తాను ఓడిపోయింది. ఆ రోజు పంతంగా కాసిన పందెం ఇలా పరువు తీస్తుందనుకోలేదు. ఇప్పుడు అరవింద్ ఏమి చెప్తే అది చేయాలి . నిజంగా అతను చెప్తే చేసేరకమైతే కాదు. కాని ఇది చాలా అవమానంగా ఉంది ఆమెకు. తన అహం చాలా దెబ్బతింది. పగ తీర్చుకోవాలనిపిస్తోంది. ఆలోచనలు పాదరసంలా కదలాడాయి. దెబ్బకు దెబ్బ తీయాలి. ఈసారి కొట్టే దెబ్బకు జీవితాంతం కోలుకోకూడదు. ఆజన్మాంతం పుట్టుమచ్చలా ఉండిపోయేలాంటి ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోవాలి. 'మేఘన' అనే పేరు వింటే వణికిపోవాలి. మేఘన దృడ నిశ్చయంతో ఉంది ఎలాగైనా అరవింద్కి తానేమిటో చూపించాలాని...  అందరి ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి. ఇలానే ప్రతి సంవత్సరం చేయాలని ప్రిన్సిపాల్ చెప్పారు. రెండు నెలలలో నిరంజన్, అరవింద్ లకు మొదటి సంవత్సరం పూర్తి అవుతుంది. మిగిలిన వాళ్ళందరికీ పి.జి పూర్తవుతుంది.
* * *
[+] 4 users Like LUKYYRUS's post
Like Reply
#18
నిరంజన్ మానసతో మాట్లాడటానికి ఆమె ఇంటికెళ్ళాడు. ఇంట్లో అంతా సందడిగా ఉంది. లోపలికి వెళ్లి "మానస ఉందాండి?" అని అడిగాడు అక్కడున్న ఒక పెద్దమనిషిని.  "ఉంది బాబు" అన్నాడాయన.  "ఒకసారి మాట్లాడాలండి" అన్నాడు.  "ఈరోజు అవదు బాబు. వేరే ఎప్పుడైనా మాట్లాడు. ఈరోజు మానస పెళ్లి చూపులు కదా, " చెప్పాడాయన.నుంచున్న చోటనే భూమి బీటలు వారింది.అప్పుడే అందంగా అలంకరించుకుని నడుచుకుంటూ వస్తున్నా మానసను చూసి "మానసా..." అని పిలిచాడు గట్టిగా. తలెత్తి చూసింది. అందరు నిరంజన్ వైపు చూసి కూర్చున్న వాళ్ళల్లో కొంతమంది లేచి నుంచున్నారు. మానస తండ్రి దగ్గరకు గబగబా వెళ్లి "సార్, నా పేరు నిరంజన్. పిహెచ్.డి చేస్తున్నాను. నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాము. పెళ్లి చేసుకోవాలనుకున్నాము." అని అన్నాడు.  "ఎవడ్రా నువ్వు?" అరిచాడు అక్కడున్నో వ్యక్తి.  "కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి సార్, మీ అమ్మాయి మీకు భయపడో, మీపై గౌరవంతోనో, ఈ పెళ్లి చూపులకు ఒప్పుకుని ఉండవచ్చు సార్. కాని ఇష్టంతో కాదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను సార్. అంత పిచ్చి ప్రేమ ఉంది నాకు" అన్నాడు వివరణ ఇస్తూ.  "బయటకు పోరా ....." విసురుగా దగ్గరికి వస్తూ అరిచాడు ఆ వ్యక్తి.  "మీరెవరు?" అని అడిగాడు.  "నేనెవరైతే నీకెందుకు రా??" అంటూ ఇంకా ముందుకు అడుగువేసి కోపంతో నిరంజన్ గుండెలపై తన్నాడు.  వెన్నక్కి పడబోయి ఆపుకుని " మానస నా సొంతం. కాదని ఎవడైనా అడ్డు వస్తే ప్రాణాలు తీసేస్తాను" కసిగా అని మానసవైపు చూసి "ఏమి మాట్లాడవేం?" అని అడిగాడు.  "మానస ఇష్టప్రకారమే ఈ పెళ్లి చూపులు జరుగుతున్నాయి" చెప్పాడు మానస తండ్రి నెమ్మదిగా.వెన్నక్కి పడబోయి ఆపుకుని " మానస నా సొంతం. కాదని ఎవడైనా అడ్డు వస్తే ప్రాణాలు తీసేస్తాను" కసిగా అని మానసవైపు చూసి "ఏమి మాట్లాడవేం?" అని అడిగాడు.  "మానస ఇష్టప్రకారమే ఈ పెళ్లి చూపులు జరుగుతున్నాయి" చెప్పాడు మానస తండ్రి నెమ్మదిగా.  "లేదు సార్" అన్నాడు నిరంజన్  "మానస చెప్పమ్మా" అన్నాడు తండ్రి.  మానస నడుచుకుంటూ వచ్చి నిరంజన్ కేసి చూసి చెంప చెళ్ళుమనిపించింది. అదిరి పడ్డాడు నిరంజన్. కాసేపు గుండు సూది పడితే వినపడేంత నిశబ్ధం. చెంపపై చేయి ఉంచి మానసను చూస్తూ ఉండిపోయాడు. నిరంజన్ కాలర్ పట్టుకుని " ఎందుకు ఆ రోజు పొమ్మన్నావు? ఎందుకు ఆ రోజు ప్రేమలొద్దు అన్నావు? నన్ను అంతగా ప్రేమించి ఎందుకు నాపై అరిచావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని తెలిసికూడా ఎందుకు నా చెయ్యి విడిచావు?" అంటూ ఏడ్చింది. గడ్డం కింద చేయి పెట్టి తల పైకి ఎత్తి కన్నీళ్ళు తుడిచి " సారిర, తప్పు చేసాను. నువ్వు లేకుండా బ్రతకలేను. నన్ను క్షమించవా ప్లీజ్ " అన్నాడు అనురాగంగా. అలానే కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.  "ప్లీజ్ సార్,మమ్మల్ని విడదీయకండి " అన్నాడు వేడుకోలుగా. ఆ పెద్దమనిషి " ఏంటిరా నువ్వు నా ఇంటికి వచ్చి ...." అంటూ మానసను వెనక్కి లాగి మళ్ళి గుండెలపై తన్నాడు. నిరంజన్ వెనక్కి పడిపోయాడు. వెంటనే లేచి నిలబడి " జంధ్యం వేసుకున్నాడు. జాతకాలు చెప్పుకుంటూ ఉంటాడు అనుకుంటున్నారేమో, నా మానసను నాకు కాకుండా చేయాలని చూస్తే మీ జాతకాలు మారిపోతాయి. మీ తలరాతలు తిరగబడిపోతాయి" అంటూ అరుచుకుంటూ ముందుకు అడుగేసి గట్టిగా రెండు చేతులతో ఆ పెద్దమనిషి కాలర్ పట్టుకుని ముందుకు గుంజి కళ్ళల్లో కళ్ళు పెట్టి కన్నెర్ర చేస్తూ చూసాడు. బెదిరిపోయాడా మనిషి. కాలర్ వదిలేసి గుమ్మందాకా నడిచి " మానసకోసం ఎంతకైనా తెగిస్తాను. నాకు మానసకు పెళ్లి జరిగి తీరితుంది. ఆపాలని చూస్తే ఆయుష్షు అంతమైపోతుంది. జాగ్రత్త " అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పెళ్లి వారు కూడా వెళ్ళిపోయారు. మానస తల్లిదండ్రులు తలపట్టుకున్నారు. మానస తల్లైతే "పరువు తీసావు కదటే" అంటూ కొట్టింది. ఏది ఏమైనా నిరంజన్ తిరిగి వచ్చి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడం మానసకు సంతోషానిచ్చింది.   నిరంజన్ అక్కడినుండి నేరుగా అంజలి ఇంటికి వెళ్ళాడు. బయట కూర్చుని ఉన్న స్వాతిని చూసి ఎదురుగా నుంచున్నాడు. అన్నయ్యను చూసేసరికి బాధ తన్నుకొచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నయ్యను పట్టుకుని ఏడ్చింది. "పద వెళ్దాం మనింటికి " అన్నాడు తల నిమురుతూ.  "నన్ను క్షమించు అన్నయ్య , నా వల్లే నాన్న చనిపోయారు" అంటూ ఏడ్చింది.  "జరిగిందేదో జరిగిపోయింది. నాన్నకు అలా జరిగేసరికి నీ పరిస్థితి అర్ధం చేసుకోకుండా ఇంట్లోంచి పొమ్మన్నాను. క్షమించు " అన్నాడు తడిసిన కళ్ళతో. అప్పుడే అంజలి వస్తూ" నీకోసమే ఎదురుచూస్తోంది నిరంజన్. నిన్ను చాలా మిస్ అయింది. పాపం అందరు ఉండి ఇలా పరాయింట్లో ఉండాల్సివచ్చింది." అంది.  "అదేం లేదులే నువ్వు పరాయిదానివి ఎలా అవుతావు. నువ్వు నాకు చెల్లెలులాంటిదానివే. కారణాలు ఏమైనా నా చెల్లెలుని జాగ్రత్తగా చూసుకున్నందుకు థాంక్స్ " అన్నాడు. స్వాతిని తనతోపాటు ఇంటికి తీసుకెళ్ళాడు.  "ఉదయం బాక్స్ మర్చిపోయి వెళ్ళిపోయావు " అంది ప్రమోద.  "మర్చిపోలేదు. కావాలనే వదిలేసాను."చొక్కా విప్పుతూ సమాధానం ఇచ్చాడు అరవింద్. ఆమె ఏమి మాట్లాడలేదు. "నువ్వు నా కోసం ఏమి వండాల్సిన అవసరం లేదు. నా పనులు నేను చేసుకుంటాను." చెప్పాడు తువ్వాలు భుజంపై వేసుకుని బాత్ రూంవైపు నడుస్తూ. స్నానం చేసి వచ్చి వంట గదిలోకి వెళ్లి అన్నం వండుకుందామని బియ్యం కదిగాడు.  "అన్నం రెడీగా ఉంది" అంది  "చెప్పానుగా, నా వంట నేను చేసుకుంటాను"  "ఈరోజుకి తినేసేయ్, రేపటినుండి నీ ఇష్టం "  వచ్చి కంచం పెట్టుకుని వడ్డించుకుని తిన్నాడు. భోజనం చాలా రుచిగా ఉంది. కడుపునిండా తిని "థాంక్స్" అన్నాడు. నిజానికి మానస అరవింద్ కోసం ఎదురు చూసింది కలిసి తిందామని, తాను తినేసి బయట గదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు. ఆమె ఏమి తినకుండా పడుకుంది. కనీసం"నువ్వు తిన్నావా?" అని కూడా అడగలేదు. చాలా బాధతో పడుకుంది.  ఉదయం లేచి స్నానం చేసి పాలు కాచుకుని టీ పెట్టుకుని తాగాడు. ప్రమోద కనిపించలేదు. ఇల్లంతా వెతికాడు. కనిపించలేదు. చాలా కంగారు పడ్డాడు. ఇంతలో ప్రమోద లోపలి రావడం చూసి కాస్త కుదుటపడ్డాడు.అరవింద్ ని చూసి విషయం అర్ధం చేసుకుని "గుడికెళ్ళాను" అని చెప్పి "ప్రసాదం" అని ఇవ్వబోయింది. అది అందుకోకుండా నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను అని చెప్పిబయలుదేరిపోయాడు.  అరవింద్ సరిగా మాట్లాడకపోయేసరికి ప్రమోదకు నరకంలా తోచింది. తాను చేసిన తప్పేంటి అని నిలదీయాలనిపించింది. కాని ధైర్యం చాలాలేదు. చివరికి ప్రాణ స్నేహితుడికి భయపడాల్సి వస్తుందనుకోలేదు, ఇలాంటి విషయాన్ని రోడ్డుకీడ్చి తన తండ్రిని బాధ పెట్టడం అస్సలిష్టం లేదు. కాని సమస్యను ఎలా అయినా పరిష్కరించుకోవాలి. అరవింద్ తనతో కాపురం చేయకపోయినా పరవాలేదు. కనీసం ఎప్పటిలాగా మామూలు స్నేహితుడిలా ఉంటే చాలు అని అనుకుంది. ఆమె మనసు చాలా వ్యాకులతగా ఉంది.  యూనివర్సిటీ కి వెళ్ళకుండా కైలాసగిరికి వెళ్ళాడు. అక్కడే ఒంటరిగా మెట్లదారిలో కూర్చున్నాడు. ఆ దారిలో చాలా మంది ప్రేమికులు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంతమంది ఒకరి ఒళ్లో ఒకరు పడుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది చెట్టు చాటున ఎవరికీ కనపడని ఏకాంతంలో గడుపుతున్నారు. కొంతమందిని చూస్తే అరవింద్ కి జుగుప్స కలిగింది. అక్కడ ప్రశాంతత లేదు. "నిజమైన ప్రేమ చెట్టు చాటున ఉండదు" అక్కడి నుండి లేచి పైకి నడవడం ప్రారంభించాడు. పైకి ఎక్కేసరికి ఆయాసం అనిపించి అక్కడో షాప్ లో వాటర్ బాటిల్ తీసుకుని తాగాడు. ముందు నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న పార్వతి పరమేశ్వరుల విగ్రహాలను చూస్తూ నుంచున్నాడు. ఇంతలో ఎవరో వచ్చి భుజం తట్టినట్టైంది. వెనక్కి తిరిగి చూసాడు.  అంజలి "హాయ్ అరవింద్" అంది.  "హాయ్ అంజలి" అన్నాడు  " నువ్వేంటి ఇక్కడ?" అనడిగింది.  "ఏమి లేదు మామూలుగా"  "మౌనిక రాలేదా నీతోపాటు?"  "రాలేదు"  "ఒక్కడివే వచ్చావా?"  "అవును"  "అదేంటి? ఏమైంది?"  "ఏమి అవలేదు అంజలి. అంతా మామూలే"  "ఆర్ యు ష్యూర్"  "ఆఫ్ కోర్స్"  "నాకలా అనిపించడం లేదు"  "మరెలా అనిపిస్తోంది"  "ఏదో బాధలో ఉన్నావనిపిస్తోంది"  "నీకు ఫేస్ రీడింగ్ తెలుసా?"  "తెలిదు. కాని నీ కళ్ళు చెపుతున్నాయి."  "ఓ! ఐ రీడింగ్ తెలుసా ?"  "కాదు. నిజం చెప్పు ఏమైంది?"  "చెప్పాను కదా. ఏమి అవలేదు అదే నిజం"  "సరే, సరే, రా! ఏమైనా తిందాం. నేను ఒక్కద్దాన్నే వచ్చాను"  "ఏం? ఒక్కద్దానివే రావడం దేనికి?"  "నాకు ఈ ప్లేస్ అంటే ఇష్టం. అందుకే వచ్చాను. సో ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను"  ఇద్దరు తినడానికి ఆర్డర్ ఇచ్చి అక్కడే ఉన్న చైర్స్ లో కూర్చున్నారు ఎదురెదురుగా.  "ఈ దేవుళ్ళని మెచ్చుకోవాలి. ఎలా ఇద్దరు భార్యలతో జీవించారో!!" అన్నాడు  "దేవుళ్ళు కనుక ఏమి చేసినా చెల్లింది. కాని మనకలా కుదరదు. అయినా నీకిలాంటి డౌట్ ఎందుకొచ్చింది?"  "మామూలుగానే అడిగాను. ఆ శివుడిని చూసాక అడగాలనిపించింది."  "ఓ!! అలాగా, అంతే కదా"  "అది సరేగాని, నువ్వు ఎవరినైనా ప్రేమించావా?"  "నిజం చెప్పనా? అబద్దం చెప్పనా?"  "నీ ఇష్టం"  "మ్... అయితే ఈ రెండు వేళ్ళలో ఒకటి పట్టుకో " అంటూ వెళ్ళు చూపించింది.  చూపుడు వేలు ముట్టుకున్నాడు. "సారి, అబద్దం చెప్పాలి నీతో" అంది  "చెప్పు" అన్నాడు.  " తెలీదు" అంది  "మరి నిజం ఏమిటి?"  "మ్.. ప్రేమించానేమో!!?"  "అంటే?"  "నాకే క్లారిటీ లేదు"  "అదేంటి?"  "ఏమో?..."  "నువ్వు నన్ను కన్ఫ్యూస్ చేస్తున్నావు"  "లేదు. నాకే క్లారిటీ లేదు అంటున్నాను"  "ఇంతకీ ఎవరతను?"  "చెప్పను పర్సనల్"  "సరే, అతనికా విషయం తెలుసా?"  "అబ్బా! నాకే క్లారిటీ లేనపుడు అతనికేలా తెలుస్తుంది" అది నిజమే అన్నట్టుగా తల పరికించి, ఇద్దరు అక్కడి నుండి కదిలారు.
[+] 5 users Like LUKYYRUS's post
Like Reply
#19
"అవును, ఇంతకీ ఎక్కడుంటున్నావు? మేఘన ఇల్లు ఖాళి చేసేసావట కదా? అని అడిగింది. "అవును. వేరే చోట ఉంటున్నాను." చెప్పాడు. తరువాత ఇద్దరు మద్యాహ్నం వరకు కాలక్షేపం చేసి, సినిమాకు వెళ్లి, అంజలిని దించేసి సాయంత్రానికి ఇంటికెళ్ళాడు. ప్రమోద మెట్లపై కూర్చుని అరవింద్ కోసం ఎదురు చూస్తోంది.  అరవింద్ రాగానే,"అరవింద్.." అని పేరు పెట్టి పిలిచింది. లోపలికి వెళ్ళేవాడు ఆగి ప్రమోదవైపు చూసాడు. "నీతో మాట్లాడాలి" అంది. చెప్పు అన్నట్టుగా చూసాడు.  "ఇప్పుడొద్దులే, ఫ్రెష్ అప్ అవ్వు. టీ తాగుతూ మాట్లాడుకోవచ్చు" అంది. అరవింద్ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి ముఖం కడుగుకుని టీ పెట్టడానికని వంటింట్లోకి వెళ్ళాడు.  "నాకు కూడా టీ పెట్టు" అని చెప్పింది. ఇద్దరికీ టీ ప్రిపేర్ చేసాడు. చెరో కప్పులో పోసి పట్టుకెళ్ళి ప్రమోదకు ఇవ్వబోయాడు. తాను అందుకోకుండా "అక్కడ పెట్టు" అంది. అరవింద్ కి విషయం అర్ధమైంది. కింద పెట్టాడు. ఆ కప్ ని తీసుకుని కొంచెం టీ తాగి " మూడు రోజులు " అంది. ప్రమోద కళ్ళల్లోకి చూసాడు.  "సరే, నేను వండుతాలే" అన్నాడు.  ప్రమోదకు చాలా ఆనందమనిపించింది. ఆమెకు విడిగా కంచం, మంచి నీళ్ళు, గ్లాస్ తీసి ఉంచాడు. తాను బయటకు వెళ్తే తినడానికి బ్రెడ్, పళ్ళు కొని ఏర్పాటు చేసాడు. విడిగా బొంత చాప దుప్పటి సద్ది పెట్టాడు. ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంటే , తానే తనకు గాలి తగిలేలా ఏర్పర్చాడు. ఆమె స్నానానికి వెళ్తే ముందుగానే బాత్ రూమ్ హంగర్ కి తువ్వాలు తగిలించేవాడు. ఉదయానే లేవడం, ప్రమోదకు కాఫీ కలిపి ఇవ్వడం. టిఫిన్ తాయారు చేసి అదే చేత్తో అన్నం కూర వండేసి అవన్నీ ఆమె దగ్గర సద్దేసి తాను యూనివర్సిటీకి వెళ్ళిపోయేవాడు. తిరిగి సాయంత్రం వచ్చి టీ కాచి ఇచ్చి మళ్ళీ అన్నం కూర వండేసి ఆమెకు వడ్డించేవాడు. మూడు రోజులు ఇలానే గడిచాయి.  ఆ తరువాత ఆమె మైలు స్నానం చేసి బయట ఎండలో తలారబెట్టుకుంటోంది. ఆమెను చూసాడు. నిజానికి ప్రమోద కూడా చాలా అందగత్తె. స్నేహం అనే ముసుగులో చూసాడు ఇప్పటివరకు. కాని ఇప్పుడామె తలారబెట్టుకుంటున్నప్పుడు అతనిలో ఆమె తన భార్య అనే ఆలోచన కదలాడింది. వెనక నుంచి వెళ్లి గట్టిగా కౌగిలించుకోవాలనుకున్నాడు. కాని నిగ్రహించుకున్నాడు. బండి మీద వెళ్తూ ఆలోచించుకున్నాడు. ఎందుకిలా తన మనసు పరిపరివిధాల పరుగులు తీస్తోంది? కోరిందొకటి!. అందిందొకటి! అందింది వద్దనుకుంటూనే కావాలనుకుంటున్నాను. కోరింది కావాలనుకుంటూనే వద్దనుకుంటున్నాను. తాను చేసేది. చేస్తున్నది. చేయాలనుకుంటున్నది మూడు కూడా పూర్తిగా విభిన్నమైన దారులు. ఒకరకంగా ప్రమోద తన భార్య, కానీ ఒకప్పుడు మంచి స్నేహితురాలు. ఇప్పుడు తాను భర్త హోదాలోను ఇమడలేకపోతున్నాడు. స్నేహితుడుగాను ఉండలేకపోతున్నాడు. ఏదో ఇరుకు దారిలో ప్రయాణంలా తోచింది. మరోపక్క ఒకప్పుడు మౌనిక తనకు ప్రేయసి, ఇప్పుడు కూడా .. కాని ఆ స్థానం అక్కడితో ఆగిపోయింది. కాళ్ళు చేతులు కట్టేసి నూతిలో పడేస్తే ఆ ఇరకాటంలోంచి బయటపడే తాపత్రయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. జీవితం ఒక చదరంగం. ప్రతి ఎత్తుకు పైఎత్తు ఉండి తీరుతుంది. గెలవాలంటే కొంత సైన్యాన్ని త్యాగం చేయాలి. ఇప్పుడు తాను గెలవాలంటే ఎవరిని త్యాగం చేయాలి.  ప్రమోదనా?  మౌనికనా?  తన ప్రేమనా?  తన స్నేహాన్నా?  అసలు ఎవరిని త్యాగం చేస్తే వచ్చేది 'నిజమైన గెలుపు?'.  యూనివర్సిటీకి వెళ్లేసరికి అక్కడ నిరంజన్, రాజీవ్ లు కనిపించారు. వాళ్ళ దగ్గరకు నేరుగా వెళ్లి పలకరించాడు. "ఏంటిరా ఎలా ఉంది ప్రమోద?" అని అడిగాడు నిరంజన్.  "బావుంది" చెప్పాడు అరవింద్.  "మరి నువ్వు??" అని అడిగాడు  సమాధానం ఇవ్వకుండా మౌనంగా చూసాడు. నిరంజన్ చెల్లెల్ని ఇంటికి తీసుకొచ్చిన విషయం, మానస ఇంటికెళ్ళి మాట్లాడిన విషయం చెప్పాడు. ఇంతలో అచ్యుత్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ "అశోక్ కి ఈ రోజు పెళ్లంటరా, అన్నవరంలో, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. మనం వెళ్లి ఆ పెళ్లిని ఎలా అయినా ఆపాలి" అన్నాడు.   "నువ్వు చెప్పేది నిజమేనా?" అని అడిగాడు నిరంజన్.  "నిజంరా, మనం వెంటనే బయలుదేరాలి. మరో విషయం ఎందుకైనా మంచిది మనం కూడా జాగ్రత్తగా ఉండాలి." అన్నాడు అచ్యుత్.  "పదండి ముందు" అని నిరంజన్ అరవింద్ లు ఒక బండిపైన , రాజీవ్ అచ్యుత్ లు మరో బండిపైన బయలుదేరారు. గంటలో అన్నవరం చేరుకున్నారు. గుడిలో పెళ్లి అని తెలిసి మెట్లద్వార గుడిలోకి వెళ్ళారు. నలుగురు నాలుగువైపులా వెళ్లి వెతికారు. ఎక్కడా అశోక్ కనిపించలేదు. చాలాసేపటి వెతుకులాట తరువాత అశోక్ కనిపించాడు. రాజీవ్ అశోక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి "ఏం చేస్తున్నావో నీకు అర్ధమవుతోందా?" అని ప్రశ్నించాడు.  "ఏమి చేస్తున్నాను?" అని అడిగాడు అశోక్  "పెళ్లి చేసుకుంటున్నావుగా?" అని అరిచాడు రాజీవ్  "పెళ్ళా? ఎవరు చెప్పారు? అయినా నేనెందుకు రెండో పెళ్లి చేసుకుంటాను. సత్యనారాయణ స్వామి వ్రతానికని ఫ్యామిలీతో పాటు వచ్చాను. " అని అన్నాడు అశోక్.  అరవింద్ వస్తూ ఆ మాట విన్నాడు. వెనకనే నిరంజన్, అచ్యుత్ లు కూడా వచ్చారు. నిరంజన్ ని చూస్తూ "హాయ్ నిరంజన్ బాగున్నావా?" అని అడిగాడు అశోక్.  "నీకు పెళ్లైపోయిందా?" అని ప్రశ్నించాడు అరవింద్. ఆ మాట వినగానే నిరంజన్ కి పట్టరాని కోపంతో అశోక్ మీదకు వచ్చాడు. ఆగు నిరంజన్ ఆపాడు అరవింద్.  "అయిపోయింది. అదిగో నా భార్య అటుగా వెళ్తున్న అతని భార్యని పిలిచాడు. ఆమెకు 'నా ఫ్రెండ్స్' అని పరిచయం చేసాడు. నీతో మాట్లాడాలి అన్నాడు అరవింద్ అశోక్ తో. "సరే పదండి" అని అందరు పక్కకు వెళ్లారు.  "నువ్వు నా చెల్లెలు స్వాతిని ప్రేమించాలేదా? పెళ్లి చేసుకోవాలనుకోలేదా?" అని అడిగాడు నిరంజన్  "ప్రేమించాను...."  "మరెందుకు పెళ్లి చేసుకున్నావు?"  "చేసుకోవాల్సి వచ్చింది" అన్నాడు అశోక్.  "ఎందుకు? ఏమైంది?" అని అడిగాడు అరవింద్.  "వద్దు అరవింద్, వదిలేయండి. అయ్యిందేదో అయిపోయింది." అన్నాడు అశోక్.  "అయ్యిందేదో అయిపోవడం ఏంటిరా? అంటూ కాలర్ పట్టుకుని ఏం జరిగిందో చెప్పు ! " అని కసిగా అడిగాడు నిరంజన్. అరవింద్ నిరంజన్ ని వెనక్కి లాగి "స్వాతి నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకిలా చేసావు? ఇప్పుడీ విషయం తెలిస్తే తనేమైపోతుందో ఆలోచించావా?" అని అడిగాడు అరవింద్  నిరంజన్ వైపు చూసి " నిజం చెప్తాను. కాని మీకు ఈ విషయం తెలుసని స్వాతికి చెప్పకండి" అన్నాడు అశోక్.  "ఏంటా నిజం?" అని అడిగాడు నిరంజన్.  "నన్ను ఈ పెళ్లి చేసుకోమని స్వాతియే చెప్పింది. ఈ విష యం ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేయించుకుంది." అన్నాడు. అందరు నిర్ఘాంతపోయారు. “అసలెందుకిలా చేస్తోంది ?" అని అనుకున్నాడు నిరంజన్.  అశోక్ " స్వాతి ,నేను ప్రేమించుకోవడం నిజం..\, కాని, జరిగింది ఏమిటంటే... "ఒకరోజు తనకు తలనొప్పి వస్తోందని చెప్పింది. టాబ్లెట్స్ ఇచ్చాను. రెండు మూడురోజులైనా తగ్గకపోయేసరికి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. బ్రెయిన్ స్కాన్ తీయించమంటే తీయించాము. ఆ రిపోర్ట్స్ చూసి స్వాతికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, అడ్వాన్స్డ్ స్టేజి అని ఎంతోకాలం బ్రతకదని డాక్టర్ చెప్పారు .అప్పటినుండి నన్ను వేరే పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. నేను ఎంత చెప్పినా వినలేదు. తను చనిపోయేలోపు నాకు పెళ్లి జరిగిన విషయం వినాలనేది తన ఆఖరి కోరికని బ్రతిమాలింది. ఆరోజు నా ఒళ్లో పడుకుని ఏడ్చింది. నాతో ఈ ఒట్టు వేయించుకుని ఎటైనా వెళ్లిపోదామనుకుంది. అందుకే నాతో పెళ్లి అంటూ ఉత్తరం రాసింది. కాని తనకు మిమ్మల్ని వదలడం ఇష్టం లేకపోయింది. “నేను ఇంటికి తిరిగి వెళ్తాను కనీసం చివరి రోజులైనా అన్నయ్య, అమ్మానాన్నలతో గడుపుతాను” అని తిరిగి బయలుదేరింది.  తప్పుడు నిర్ణయం బ్రతికుండగానే చంపుతుంది అని తరువాత తెలిసింది.  మీరు తనను ఎంతగా ప్రేమిస్తారో తెలుసు. తనకు ఏమైనా అయితే తట్టుకోలేరని అలా అయిష్టంగా, పొగరుగా నటించింది. ప్రతిరోజూ నాకు చెప్పుకుని బాధపడేది. "అన్నయ్యని అనరాని మాటలంటున్నాను" అంటూ ఏడ్చేది. తన పరీక్ష ఫెయిల్ అవడానికి కారణం తన ప్రేమ కాదు. తన అనారోగ్యం. పరీక్షల టైములో తనకు విపరీతమైన తలనొప్పి వచ్చింది. చదవలేకపోయింది. తను చాలా మంచిది నిరంజన్. నేను కూడా ఏమి హ్యాపీగా లేను. తనను చూడాలని ఉంటుంది. కాని నాకు పెళ్లైయ్యాక ఇక జీవితంలో కలవకూడదు అని ఒట్టు వేయించుకుంది. తనకు నువ్వంటే చాలా ఇష్టం నిరంజన్, మా అన్నయ్య ఇది, మా అన్నయ్య అది అంటూ చెప్తూ ఉండేది. తను ఒకసారి నాతో ఏమందో తెలుసా " మా అన్నయ్య ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను.మన పెళ్లి అయినా సరే" అని. అంత విలువ ఇస్తుంది నీకు. నువ్వు తనకో రోల్ మోడల్ అని చెప్తూ ఉంటుంది. కలిసిన ప్రతిసారి నీ గురించి మానస గురించి మాట్లాడుతూ ఉండేది. మా వదిన ఎంత మంచిదో తెలుసా, మా అన్నయ్య ఎంత అదృష్టవంతుడో తెలుసా అంటూ ఏవేవో కబుర్లు చెప్పేది.  తనకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసినప్పటి నుండి తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అందుకే కావాలనే గొడవలు పెట్టుకునేది. కావాలనే ఆరోజు నువ్వు రావడం గమనించి నా పేరు పుస్తకంలో రాసింది. ఇదంతా తనని తానూ కోల్పోతున్న బాధతో, మిమ్మల్ని విడిచిపోతున్న బెంగతో, .. తనకోసం కాదు మీకోసం" ముగించాడు అశోక్ అశ్రునయనాలతో.  అంతా విన్న నిరంజన్ వెక్కి వెక్కి ఏడ్చాడు. మిగిలిన వాళ్ళ గుండెలు కూడా చెరువులయ్యాయి. నిరంజన్ ని ఓదార్చడం ఎవ్వరి వల్ల కాలేదు. అశోక్ దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేసి " మీకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే తను తట్టుకోలేదు. తనను ప్రేమగా చూసుకో నిరంజన్" అని చెప్పాడు.  నిరంజన్ కి స్వాతి మాటలు గుర్తొచ్చాయి ".....అవును, నేను ఆలోచనలు పెట్టుకునే ఫెయిల్ అయ్యాను. నా జీవితం. నా చదువు. నా ఇష్టం....." అందరికి ఆమెపై అపారమైన అభిమానం, గౌరవం కలిగాయి. కాసేపు ఎవరు ఏమి మాట్లాడుకోలేదు. అకస్మాత్తుగా ఓ వ్యక్తి కూర్చున్న రాజీవ్ తలపై ఇనుప రాడ్ తో బలంగా బాదాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రాజీవ్. అందరు ఉలిక్కిపడ్డారు. అరవింద్ వెంటనే అతని గుండెలపై తన్నాడు. ఇంకో నలుగురు ఆయుధాలతో వాళ్ళపై విరిచుకు పడ్డారు. అరవింద్ భుజంపై కత్తివేటు వేసాడొకడు. రెండోసారి కూడా పొడవబోతుంటే నిరంజన్ ఆపడానికి ప్రయత్నించగా అరచెయ్యి కోసుకుపోయింది. నిరంజన్ ఆ మంటకు వెర్రెత్తిపోయాడు. కోపంతో ఊగిపోయి అతన్ని పట్టుకుని దూరంగా విసిరేశాడు. అరవింద్ మెరుపు వేగంతో మరొకడి ముఖంపై పిడి గుద్దులు గుద్దాడు. అచ్యుత్ రాజీవ్ ని ఎత్తుకుని పరిగెడుతూ అశోక్ వెళ్ళిపో అని అరిచాడు. అందరు పరుగులెత్తారు. గుడి చుట్టూ చాలా మంది మనుషులు వాళ్ళపై దాడి చేయడానికి సిద్దంగా కాచుకుని ఉన్నారు.  అందరిని కొట్టుకుంటూ, తోసుకుంటూ, కిందకి పరుగులు తీసారు. రాజీవ్ కి శోష తప్పిపోయింది. అడ్డొచ్చిన వాళ్ళందరిని నెత్తురోచ్చేటట్టు చితక బాదారు. అచ్యుత్ రాజీవ్ ని సరాసరి హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. నిరంజన్ అరవింద్ లు రెచ్చిపోయారు. మీదకు వస్తున్న ఒకరి కాలర్ పట్టుకుని కిందకి ఈడ్చి తలను ఒక రాయికేసి కొట్టాడు నిరంజన్. ఫాట్ మని శబ్దం వచ్చింది. మరొకడు పరిగెడుతుంటే చొక్కా పట్టుకుని గుంజి వెనక్కి లాగి పడేసి పొత్తి కడుపులో, డొక్కల్లో తన్నాడు అరవింద్ " చెప్పరా, ఎవడ్రా మిమ్మల్ని పంపించింది?" అని అలానే తంతూ అడిగాడు. వాడు ఆ బాధను తట్టుకోలేక అరవింద్ కాళ్ళు పట్టుకుని "మేఘన .. మేఘన మేడం" అని చెప్పాడు. వాడి ముఖంపై తన్నాడు నిరంజన్.  రాజీవ్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసారు. నిరంజన్, అరవింద్ లు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి చేరుకున్నారు. ప్రమాదమేమి లేదని డాక్టర్స్ చెప్పారని అచ్యుత్ వాళ్లతో చెప్పాడు. వాళ్ళ మనసు అప్పుడు కుదుట పడింది. ఇద్దరు కట్లు కట్టించుకున్నారు. "అది ఇంత పని చేస్తుందనుకోలేదు. దాన్ని బ్రతకనివ్వను. కొద్దిలో తప్పింది లేకపోతే మన రాజీవ్ పరిస్థితి.." అన్నాడు అచ్యుత్.  "జరింగేదో జరిగిపోయింది. ఆమెకు వార్నిగ్ ఇద్దాం. ఈ విషయాన్ని మర్చిపోండి. ఇది పెద్దది చేసి అనవసరంగా ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయద్దు" చెప్పాడు అరవింద్. సాయంత్రం అందరు ఇంటికి వెళ్ళిపోయారు. రాజీవ్ ని అచ్యుత్ తీసుకెళ్ళాడు. 

* * *





[+] 4 users Like LUKYYRUS's post
Like Reply
#20
అరవింద్ ఇంట్లోకి వెళ్తూ టి.వి చూస్తున్న ప్రమోదతో " కొంచెం వేడి నీళ్ళు పెడతావా?" అని అడిగాడు.  "మ్.. సరే" అని టి.వి ఆఫ్ చేసి వంటింట్లోకి వెళ్లి స్టవ్ ఆన్ చేసి నీళ్ళ గిన్నె పెట్టింది. గదిలోకి వెళ్లి చొక్కా విప్పాడు. కట్టు కనపడకుండా తువ్వాలు భుజంపై వేసుకున్నాడు. దాచుదాం అంటే దాచేంత చిన్న దెబ్బ కాదు. నెమ్మదిగా ప్రమోద దగ్గరకు నడిచి "కొంచెం నాకోసం ఏమైనా వండుతావా? బాగా నీరసంగా ఉంది" అన్నాడు. సరే అన్నట్టు తల పంకించింది. నెమ్మదిగా నీలుగుతూనే నీతో ఒక విషయం చెప్పాలి. అమ్మతో చెప్పనని మాట ఇవ్వు అని చేయి చాచాడు. "ఏంటా విషయం?" అని అడిగింది.  "ముందు మాట ఇవ్వు " అంటూ తనవైపు తిప్పుకున్నాడు.  "ఏమో ! తరువాత నిలుపుకోకపోతే?"  "అంత పెద్ద దేవ రహస్యం కాదులే .."  "సరే చెప్పు." అని చేతిలో చేయి వేసింది.  భుజంపై ఉన్న తువ్వాలు తీసాడు. కట్టు చూసి " అయ్యో, ఏమైంది..?.. ఇంతలా ఎలా తగిలింది" దాదాపుగా ఏడ్చేసింది కంగారుపడుతూ.  "చిన్నదేలే .." అన్నాడు సముదాయిస్తూ  "చిన్నదేమిటి! నీకేమైనా బుద్ధి ఉందా? ముందు వెనక చూసుకోవచ్చుగా, ఎంత నెత్తురు పోయుంటుందో!!" చాలా బాధతో వస్తున్న మాటలవి.  "లేదు ప్రమోద.... " అంటూ జరిగిన విషయం చెప్పాడు.  "నీ పని ఒకటి చూసుకోవడం రాదుగాని, అందరి బాగోతాలు కావాలి నీకు. చూడు ఎంత పెద్దగా తగిలిందో.!! ఎంత లోపలికి తెగిందో.!! ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు. చిన్నప్పుడు కూడా అంటే ఏదో ఒక దెబ్బ తగిలించుకుని వచ్చేవాడివి. ఎందుకురా ఇలా చేస్తుంటావు అన్ని ?" కళ్ళల్లో నీళ్ళు సుడులై తిరిగాయి.  "అబ్బా! అంత కంగారుపడాల్సింది ఏమి లేదు. నువ్వు ఇలానే కంగారుపడిపోయి అమ్మకు చెప్పేస్తావు. కాల్లో ముల్లు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకున్నంత రాద్దాంతం చేస్తావు. అలానే అమ్మకి చెప్తావు." అన్నాడు.  "పోరా!! నీతో నాకు మాటలేమిటి. ఒక్కసారైనా జాగ్రత్తగా వ్యవహరిస్తావేమోనని చూస్తాను. కాని నువ్వు ఉండవు. ముందు ఆ దెబ్బ చుట్టూ చిన్నగా గోరువెచ్చటి నీటితో కాపడం పెడతాను. ఆ తరువాత నీ స్నానానికి సాయం చేస్తాను. ఆ తరువాత తిందాం." అంది.  ఆ కాగిన నీళ్ళతో నెమ్మదిగా కాపడం పెట్టింది. ఆ గాయం తడవకుండా ప్లాస్టిక్ కవర్ కట్టింది. తరువాత వీపు రుద్దింది. అరవింద్ స్నానం చేసి వచ్చిన తరువాత దేవుడికి దండం పెట్టుకోమంది. అతను కళ్ళుమూసుకుని దండం పెట్టుకుంటున్నప్పుడు కుంకుమ తీసి నుదుటన పెట్టింది. అన్నం కంచంలో వడ్డించి తానూ తింటూ అరవింద్ కి తినిపించింది. అరవింద్ పరమానందభరితుడైయ్యాడు. భోజనం అయ్యాక మందులు ఇచ్చి వేసుకోమంది. పడుకునే ముందు దిష్టి తీసి, కాళ్ళు చేతులు కళ్ళు నీళ్ళతో తుడిచింది. పడుకునే ముందు " అమ్మతో చెప్పవు కదా" అని అడిగాడు నెమ్మదిగా.  "చెప్పనులే..." అంది "కాని నువ్వు జాగ్రత్తగా ఉండు, ప్లీజ్"  "సరే , ఉంటాను" చెప్పాడు. కాసేపు ఇద్దరు ఏమి మాట్లాడుకోలేదు. చాలా రోజుల తరువాత అరవింద్ తో ఇంత చనువుగా ప్రవర్తించింది. చాలా కాలం తరువాత కడుపునిండా భోజం చేసింది. అరవింద్ బయటపడలేదుగాని అతడి మనసు కూడా హాయిగా తోచింది. అది ఒక మధురానుభూతి. మనసనే కొలనులో స్వేచ్చగా విహరించినట్టుంది. 

* * *
అచ్యుత్ వెళ్లి మేఘన ఇంటి గేటును బలంగా తన్నాడు. మేఘన తండ్రి బయటకు వస్తు "ఎవడ్రా నువ్వు?" అనడిగాడు.  "ముందు నీ కూతురిని బయటకు రమ్మని చెప్పు" అన్నాడు.  "మర్యాదగా మాట్లాడు"  మేఘన రావడం చూసిన అచ్యుత్ ఆ పెద్దాయన్ని తోసుకుని ముందుకు వెళ్లి "నువ్వసలు ఆడదానివేనా?" అని అడిగాడు.  "తాగోచ్చావా ? గొడవ చేస్తున్నావు " అనడిగాడు మేఘన తండ్రి.  "కూతురిని పెంచడం రాదు. నీతో నాకు మాటలేంటి? " మేఘనవైపు తిరిగి  "ప్రేమంటే ఇవ్వడమే. రాజీవ్ నీ ప్రేమని కాదన్నాడని వాడిని చంపించాలాని చూస్తావా? కాస్తలో ప్రమాదం తప్పింది. వాడికేమైనా అయి ఉంటే నీ ప్రాణాలు ఈపాటికి గాలిలో కలిసిపోయేవి. ఛి! నీలాంటిదాన్ని నేనెక్కడా చూడలేదు" చాలా చీదరింపుతో అన్నాడు. రాజీవ్ కి తగిలిందనగానే మేఘన కంగారుపడింది.  మేఘనకి రాజీవ్ పై పగేమి లేదు. వాళ్ళు తెలీక అరవింద్ అనుకుని రాజీవ్ ని కొట్టారు.  "చూడు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈసారిగాని ఇలాంటిది రిపీట్ అయ్యిందో, ఆడదానివని కూడా చూడను. గుర్తుంచుకో." చెప్పి వెళ్ళిపోయాడు.  తండ్రి వెనక్కి తిరిగి మేఘన చెంప చెళ్లుమనిపించాడు. "ఇంత విషం ఇచ్చి చంపేయవే మమ్మల్ని కూడా! ప్రతి అడ్డమైనవాడితో మాటలు పడాల్సి వస్తుందనుకోలేదు. గారం చేయడం వల్లనే ఇలా తయారయ్యావు" అని విసురుగా లోపలి వెళ్ళిపోయాడు.  "క్షమించమనే అర్హత కూడా కోల్పోయావే" అంది తల్లి , కూతిరిని ఇంకేమి అనలేక. 
* * *
రాజీవ్ ని చూడటానికి నవ్య పరిగెత్తుకుని వచ్చింది. నీరసంగా మంచంపై పడుకుని ఉన్న అతని గదిలోకి వెళ్లి పక్కన కూర్చుంది. నెమ్మదిగా రాజీవ్ తల నిమిరింది. ఆమె కళ్ళు అప్పటికే తడిసి ఆ కన్నీటి చారలు బుగ్గలపై ఉన్నాయి. ఆమె స్పర్శకి రాజీవ్ కళ్ళు తెరిచి చూసాడు. ఆమెను చూసి చిన్నగా నవ్వడానికి ప్రయత్నించాడు.  "నాకేమైనా అయితేగాని రావాలనిపించాలేదా?" అని మాటలు తెచ్చుంటూ మెల్లగా అడిగాడు,  "ఐ యామ్ సారీ " అంది.  ఆమెవైపు అలానే చూసి "ఐ లవ్ యు " అని చెప్పాడు.  అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. కాసేపాగి "ఎలా ఉంది?" అని అడిగింది అతని కళ్ళల్లో చూస్తూ.  "నొప్పా? ముద్దా?"  ఆమె నవ్వుతూ "రెండూ .."  "ముద్దు పెడుతున్నప్పుడు నొప్పి తెలియలేదు "  "దొంగా..." అంది చిలిపిగా.  "మళ్ళీ ఎప్పుడు?" అని ప్రశ్నించాడు  "ఏంటి ముద్దు గురించా? మళ్ళీ నేను రావడం గురించా?" అనడిగింది.  "రెండు..."  "రోజూ వస్తుంటాను. ముద్దు....... ఏమో!!!!" అంది.  "నువ్వు ముద్దు పెట్టకపోతే తగ్గదేమో తొందరగా"  నవ్వుతూ " నువ్వు తొందరగా కోలుకుంటే అదే చాలు " అని అతని చేయిని ఆప్యాయంగా తడిమింది.  "థాంక్స్ " అన్నాడు  "ఎందుకు?" అనడిగింది  "ఊరికనే, చాలా ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ కలవవేమో అనుకున్నాను" అన్నాడు  "నేను నిన్ను కలవకుండా ఉండలేను రాజీవ్" అంది.  "నాకు తెలుసు . కాని కొంచెం భయం కూడా ఉంది"  "ఇంకేమి భయం లేదు. నిన్ను విడవను"  మనస్పూర్తిగా నవ్వేడు .. ఆమె కూడా నవ్వింది. 
* * *
అందరి గాయాలు మానాయి. అరవింద్ మనసుకు తగిలిన గాయం ఇంకా మారలేదు. అది ఇంకా పెరుగుతోందే తప్ప, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలో అని సతమతమావుతున్నాడు. ఇలా ఆలోచనలో ఉండగా అంజలి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసి "హలో" అన్నాడు.  "హలో ఎలా ఉంది ఇప్పుడు?"  "పరవాలేదు. తగ్గింది"  "ఒకసారి మా ఇంటికి రాగలావా?"  "సాయంత్రం వస్తాను" చెప్పి ఫోన్ పెట్టేసాడు.  సాయంత్రం బయటకు వెళ్ళే ముందు "గంటలో వస్తాను" అని ప్రమోదకు చెప్పి వెళ్ళాడు.  అంజలి చేతిలోంచి కాఫీ అందుకుంటూ " చెప్పు, ఏంటి రమ్మన్నావు? ఏంటి విషయం?" అని అడిగాడు.  "ఏమి లేదు. పెయింటింగ్ కాంపిటిషన్ కి వెళ్తున్నాను. నా దగ్గరో ఐడియా ఉంది. కాని అది వర్క్ అవుట్ అవుతుందో లేదో అని "  "ఎందుకవదు? తప్పకుండా వర్క్ అవుట్ అవుతుంది. "  "ఐడియా చెప్పనా?"  "నాకేమి అర్ధమవుతుంది చెప్పు. బొమ్మ వేసాక చూపించు. నేనేమి పెయింటర్ ని కాను"  "అలా ఏమి కాదు. విను. సింపుల్ ఐడియా. చాలా మందికి అన్నం లేక రోడ్ల పక్కన ఖాళి కడుపులతో పడుకుంటూ ఉంటారు. మరోవైపు గొప్పింటి పెళ్ళిళ్ళలో చాలా ఫుడ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళకు అన్నం విలువ తెలియదు. వాళ్ళ స్టేటస్ కోసం అంతంత వండించడం. మిగిలినదంతా పాడేయడం పాపం కదా! ఆకలి అన్నవాడికి కాస్త పెడితే ఎంత బాగుంటుంది. అదే పెయింటింగ్లో చెప్పబోతున్నాను. భారతదేశ దుస్థితిని చెప్పాలి. ఇవ్వాలనిపించడం వేరు. ఇవ్వడం వేరు. చేయాలనిపించడం వేరు. చేయడం వేరు. అందరికి ఇవ్వాలని చేయాలని ఉంటుంది. కాని చాలామంది అక్కడే ఆగిపోతారు. అదే చెప్పబోతున్నాను." ముగించింది .   "చాలా చాలా బాగుంది ఐడియా. నువ్వు బొమ్మ గీయి. నీకే ప్రైజ్" అన్నాడు.  "ప్రైజ్ ఏమి వద్దు. ఒక్కడైనా ఫీల్ అయి మారితే చాలు" అంది. మెచ్చుకోలుగా నవ్వేడు. బయలుదేరి ఇంటికి వచ్చేసాడు.  ఆ రాత్రి బాగా ఆలోచించాడు. తన జీవితంలో ఏదో నిర్ణయానికొచ్చినట్టుంది అతని ముఖం. వెంటనే లేచి ఫోన్ తీసుకుని అంజలికి ఫోన్ చేసాడు. చాలా రింగ్స్ తరువాత లిఫ్ట్ చేసి హలో అంది.  "హలో, అంజలి. పడుకున్నావా?" అనడిగాడు.  "ఇప్పుడు టైం 2 అయింది. మరేం చేస్తాను?" అంది నిద్ర మత్తులో  "సారీ, నీతో ఒక విషయం మాట్లాడాలి. నాకొక సాయం చేయాలి" అన్నాడు  "ఏంటది?"  "రేపు చెప్తాను"  "ఆ మాత్రం దానికి ఇప్పుడెందుకు ఫోన్ చేసావు.. స్టుపిడ్ " కట్ చేసేసింది.  ఉదయం అంజలి కోసం ఎదురు చూస్తుండగా ఆమె వచ్చింది.  " ఏంటి? ఏదో చెప్పాలన్నావ్?" అనడిగింది.  "ఇక్కడ కాదు. ఎక్కడికైనా బయటకు వెళ్దామా?"  "ఎక్కడికి?"  "నీ ఇష్టం.."  "రుషి కొండ బీచ్ "  "ఓకే,.." ఇద్దరు బండిపై బయలుదేరారు. వెళ్తున్న ఇద్దరినీ మౌనిక గమనించింది. అరవింద్ కి ఫోన్ చేసింది. అరవింద్ కట్ చేసాడు.  సముద్రపు హోరు వింటూ కూర్చున్నారు. చాలా సేపటి మౌనం తరువాత "నాకేమి పాలుపోవడం లేదు" అన్నాడు.  "ఏమైంది?"  "నాకొక సాయం చేయగలవా?, అది నువ్వొకదానివే చేయగలవు" అన్నాడు సముద్రంవైపు చూస్తూ "ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను" అంటూ తిరిగాడు.  "ఏమిటది?"  "నేను మౌనికను పెళ్లి చేసుకోలేను. ఆ విషయం తనకు నువ్వే చెప్పాలి" అన్నాడు. కెరటం వచ్చి కొట్టినట్టైంది.  "ఎందుకు? అసలేమైంది?" ప్రశ్నించింది.  "నాకు పెళ్లై పోయింది .." నిలకడగా అన్నాడు. పెద్ద ఉప్పెన భయంకరమైన హోరుతో ఎగసి పడింది. ఒంట్లో రక్తం ఒక్కసారిగా ఎగబాకింది.  "ఏం మాట్లాడుతున్నావ్? నేను నమ్మలేకున్నాను" అంది. ఆమెకు జరిగిన విషయం అంతా చెప్పి "తప్పనిసరి పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ప్రమోదకు అన్యాయం చేయదల్చుకోలేదు. తను ఇప్పుడు నా భార్య. నేనే లోకంగా బ్రతుకుతోంది. విడిపోయే బంధం కాదు కదా మా ఇద్దరి మద్యన ఉన్నది! నువ్వే ఏదో ఒకటి చేయాలి అంజలి అంటూ ఆమె చేయి పట్టుకుని బ్రతిమాలాడు అర్ధిస్తున్నట్టుగా.  అంజలి గాలి పీల్చుకుని "ఇప్పుడు నేనేం చేయాలి ?" అనడిగింది.  "మౌనిక మనసు విరగొట్టేయాలి. నాపై అసహ్యం కలిగేలా చేయాలి" అన్నాడు.  "అలాంటివి సినిమాల్లో వర్క్ అవుట్ అవుతాయి. జీవితంలో కాదు" అంది  "మరి ఏమి చేద్దాం?"  "ఆలోచిస్తాను. తరువాత ఏ విషయం చెప్తాను.  "తొందరగా నిర్ణయం తీసుకుని ఏదో ఒకటి చేయి"  "మ్.. బయలుదేరుదామా?"  ఇద్దరు అక్కడినుండి బయలుదేరారు. అంజలిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తానూ ఇంటికెళ్ళాడు. తీరం అంచుల్లో రాసిన పేర్లు వచ్చే అలలకు చెదిరిపోయినట్టైంది.. 
* * *





[+] 4 users Like LUKYYRUS's post
Like Reply




Users browsing this thread: