20-11-2018, 10:42 AM
నా ప్రేమ కథ
పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
నా ప్రేమ కథ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
|
20-11-2018, 10:42 AM
నా ప్రేమ కథ
పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ....... నా ప్రేమ కథ
అనుకోని టైం లో అనుకోని విధంగా పరిచయమైనా తను మరొ పక్క....
తనని ఎంత గానో ఆరాదించే ఇంకొకరు మరో పక్క.....
ఇద్దరి లొ ఎవర్ని ఎంచుకోవాలి అనే సందిగ్ధంలో తనుండగా.....
విధి తనకి సహాయం చేసిందా.....లేకా.......సమస్యల్లో తోసిందా.....???
ప్రతి క్షణం నీ తలపుల్లో బ్రతికే నేను...నీకెదురవ్వాలని పరితపిస్తున్నాను.....అది చదివడంతోనె ఒక్కసారిగా నిద్ర మత్తు వదిలింది అతనికి
ఉదయం 5:30
తలుపు చప్పుడు కావడం తో.....నిద్ర మత్తులొ తూలుతున్న...సిద్ధార్ద్....లేచి తన రూం తలుపు తెరిచాడు....ఎదురుగా తోటమాలి రామయ్య....నవ్వుతూ నిల్చున్నాడు....
"ఏంటి పెదనాన్న....ఇంత పొద్దున్నే నేను గుర్తొచ్చాను నీకు ?"అన్నాడు సిద్ధు...
"అది బాబు.....నీకొసం ఎదో కవర్ వచ్చినాది...."అని సిద్ధు చేతికి అందించి......అలానే నవ్వుతూ ఆయన వెళ్ళిపోయాడు..
ఏంటీ లెటర్ అని తేరిపారా చూసిన....సిద్ధు...ఆ లెటర్ ని చదవడానికి నిశ్చయిచుకున్నాడు....ఆఫీస్ లెటరయితే సిద్ధు లైట్ తీసుకునేవాడె కాని....అది రెడ్ కవర్లొ చాలా ఆకర్షణీయంగా కనిపించేసరికి...తెరచాడు ఆ లెటర్ చదవడం కోసం....
కవర్ లాగె అందులోని అక్షరాలు కూడా చూడముచ్చటగా వున్నాయి....
లెటర్....
హృదయాంతరాల్లొ నీ పేరు చెక్కుకున్న నేను.....
నీ మది లొ చోటు కోసం వేచివున్నాను.....
ప్రతి క్షణం నీ తలపుల్లో బ్రతికే నేను...
నీకెదురవ్వాలని పరితపిస్తున్నాను.....
నా కళ్లలొ నిన్ను నింపుకున్న నేను....
నీ నవ్వు లొ వుండాలనుకుంటున్నాను......
నా ఈ కోరికను మన్నిస్తావా ప్రియతమా?
ఆ లెటర్ చదవడంతోనె....మిగిలివున్న కొద్దొగొప్పొ నిద్ర కాస్త ఎగిరిపోయింది.....సిద్ధు కి
వామ్మొ ఎవరు రాసుంటారు ఇది.....?అని ఆలోచిస్తూనే స్నానం చేశాడు....ఆలొచిస్తునే టిఫిన్ తిన్నాడు...అలానె ఆపీసుకు వెళ్ళాడు....
ఏమి చేసిన ఆ లెటర్ గురించి ఆలోచించడం మానలేదు........
లంచ్ బ్రేక్ రానే వాచ్చింది.....
"ఎంటొయ్.....ఎండి గారు....దీర్ఘంగా అలోచిస్తున్నారు ఉదయం నుంచి.....?"అంటూ వచ్చాడు సిద్ధు జిగిరి దోస్త్ విశాల్....
"ఏమీ లేదు రా...."అని చెప్పి కూడా...వీడికి చెప్దామా వద్దా అని ఆలొచించసాగాడు...సిద్ధు
"ఎంట్రోయ్....కొంపదీసి....లవ్ లెటర్ కాని వచ్చిందా ఏంటి.....?"అనుమానంగా అడిగాడు విశాల్...
"నేను ఏమి చెప్పకుండానే వీడి కెలా తెలిసింది అబ్బా...?అంటె వీడె కావాలని నన్ను ఆటపట్టించడానికి ఇదంతా చేస్తున్నాడా ఏంటి?????"అని అనుకుని......అడక్కుండా ఆగి పోయాడు....
ఇంతలో సెక్రటరి వచ్చి..."కొత్త ప్రాజెక్ట్...కోసం స్టాఫ్.....కావలని....అందుకోసం ప్రకటన ఇస్తే 300 అప్లికేషన్లు వచ్చాయి అని చెప్పింది....."
20-11-2018, 10:44 AM
వామ్మో మనకి కావల్సింది 30 మంది...300 వచ్చాయా....తల పట్టుకుంటూ అన్నాడు...విశాల్....
"రే త్వరగా వాళ్ళని ఫైనలైజ్ చేయరా బాబు"....అని చెప్పేసి.....మళ్ళి ఆ లెటర్ గురుంచె ఆలోచించసాగాడు.....సిద్ధు "హా నేను కుస్తీలు పడుతుంట నువ్వు ఆరాంగా నీ లోకం లో నువ్వు వుండు....బాబూ ...మౌన ముని !కాస్త బయటకి రా నీ లోకం లొంచి అక్కడ.....మీ నాన్న గారు......గ్రోత్ ఏది ఏది ?అని సావగొడుతున్నారు...." "ఆయనంతేలే 200% గ్రోత్ కావాలంటారు....నువ్వెమి పట్టించుకోకు......"అని లైట్ గా చెప్పాడు సిద్ధు "నీకేమి బాబు నాకు కదా పడెది వార్నింగ్...లు....."అని లేచి తన క్యాబిన్ కెళ్ళాడు విశాల్.... కుర్చిలో వెనక్కి వాలి ఆలోచించసాగాడు సిద్ధు..... మరుసటి ఉదయం..... జాగింగ్ కని వెళ్తూ లెటర్ బాక్స్ లో చూశాడు సిద్ధు... నిన్నటి లాగే అక్కడొక లెటర్ కనిపించింది..... ఆ లెటర్ తీసుకుని కనీసం చదవకుండా....ఇవాళ ఎలాగైనా విశాల్ ని కడిగి పారేయాలి అని యమ స్పీడ్ గా జాగింగ్ స్పాట్ కెళ్ళాడు సిద్ధు..... ఆ తర్వాత ఏమైంది...? ఆ లెటర్ లెటర్ బాక్స్ లో చూడగానే వడి వడి గా అడుగులు వేస్తూ పార్క్ దగ్గరికి వచ్చాడు......అలా పార్క్ లోకి ఎంటర్ అయ్యాడు..... ఇలా ఒక పూలు అమ్ముకునే ఆవిడ....సిద్ధు వద్దకు వచ్చింది.... సిద్ధు కళ్ళు విశాల్ కొసం వెతుకుతున్నాయి....ఆ పూలావిడ కళ్ళు సిద్ధు ని చూస్తున్నాయి..... తననే తేరి పార చూస్తున్న ఆవిడ చూపులు ఇబ్బందిగా అనిపించడంతో.....ఆవిడ ని దాటి ముందుకు వచ్చాడు....సిద్ధు ఇంతలొ వెనక నుంచి ఆమె పిలిచింది అతణ్ని..... వెనక్కి తిరిగి చూశాడు సిద్ధు....ఆమే చేతిలొ సేం తన చేతిలొ వున్న లెటర్ లాంటిదే కనిపిచడం తో.....ఒక్క నిమిషం గుండె ఆగినంత పనయ్యింది సిద్ధు కి..... "కొంపదీసి ఈవిడ నన్ను లవ్ చేస్తుందా....?"అని కంగారు కూడా పడ్డాడు సిద్ధు... ఇంతలొ ఆమె సిద్ధు ని సమీపించి....బాబు నీకివ్వమని ఒకమ్మాయి ఈ లెటర్ ఇచ్చింది అని ఆ లెటర్ ఇచ్చి సిద్ధు సమాధానం కోసం కూడా చూడకుండా కనుమరుగయ్యింది ఇంతకు ముందు లెటర్ లా దాన్ని చదవకుండా వుండలేకపోయాడు సిద్ధు ఓపెన్ చేసి చూశాడు....I LOVE U SIDDHU అని వుంది ఆ లెటర్ లో.....అంతే.....అలా చూస్తూ నిలబడిపోయాడు.... ఇంతలొ అక్కడికి వచ్చిన విశాల్....సిద్ధు చేతిలోని పేపర్ లాక్కొని...దానిలోని మ్యాటర్ చిదివి..... "మిత్రద్రోహి!!!నాకప్పటికి కొడుతూనే వుంది....నాకు తెలీకుండా ఎదో చేస్తున్నావని...ఎవరు రా ఆ అమ్మాయి?నాకు పరిచయం చేస్తావు....?"అన్నాడు విశాల్ "అహా చాలు రా నీ వేషాలు ఆపు ఇంకా....పరాచకాలకు కూడా అడ్డు ఆపు వుండదా"....అరిచాడు సిద్ధు...
20-11-2018, 10:44 AM
"ఏం మాట్లాడుతున్నావ్ రా...బుర్ర గాని బాత్రూం లో పెట్టొచ్చావా......."అన్నాడు విశాల్
"ఆహా....పంచ్ లు నామీద తర్వాత వేద్దువు గాని....బాబు పురుషోత్తం ముందు ఈ లెటర్ కి సమాధానం చెప్పు....అని లెటర్ బాక్స్ లో కనిపించిన ఉత్తరాన్ని అందిచాడు"....విశాల్ కి సిద్ధు..... నువ్వే నా సమస్తం.... నువ్వే నా ప్రియ నేస్తం..... నీతోనే నా జీవిత పయనం..... నీ నవ్వే నాకు స్వర్గం... నువ్వు లేని ప్రతిక్షణం నాకు నరకం..... ఇంతగా అభిమానించే నా దరికి ఎప్పుడు నీ ప్రయాణం....? "బావ బట్టలు సర్దుకున్నావా....లేక హెల్ప్ చేయనా...?????"అడిగాడు విశాల్ "ఏం వాగుతున్నావ్ రా...లెటర్ చదవమంటె....బట్టలు అంటావేంటి రా.....!!!!!"కోపంతో వూగిపోయాడు సిద్ధు.... "అదే రా......చెల్లి .....నా దరికి ప్రయాణం ఎప్పుడూ అని అడిగింది గా......అందుకే బట్టలు సర్దుకున్నావొ లేదొ అని అడిగా....నువ్వు నన్ను ఎప్పుడు అర్ధం చేసుకున్నావ్ అని? "కన్నీళ్ళు తుడుచుకున్నాడు విశాల్.... "రేయ్ అపరా బాబు....నీ ఎదవ నాటకాలు.......అవసరమా రా నీకివన్ని......"అన్నాడు సిద్ధు "నువ్వు రా ఫ్రెండ్...అంటె.....నీ బట్టలు కూడా సర్దనివ్వను అన్నావంటే నీకు నేనంటే ఎంత కాదలొ (ప్రేమ)అర్ధమవుతుంది రా..కన్నా.....నువ్వె రా నా జాన్ జిగిరి......."ప్రేమ నిండిన కళ్ళతో అన్నాడు విశాల్ "కాదలా...?.... కరివేపాకా....ఆపరా రేయి......అవసరమా నీకివన్ని అంటే....అమ్మాయి నాకు లెటర్ రాయల్సినంత అవసరం ఏముంది నాయనా.....?అని..."అర్థం వివరించాడు సిద్ధు "నేను నీకు లెటర్ రాశానా....అంటె యూ మీన్ నేను ఇందాక చదివిన లెటర్ నీకు నేను రాశానని నువ్వనుకుంటున్నావా....???"కళ్ళు తేలేస్తూ అడిగాడు విశాల్ "అనుకోడం కాదు కన్ ఫర్ం...నువ్వె రాశావ్......ఇదేమి పోయే కాలం రా నీకు...వెదవ....."తిట్టాడు సిద్ధు "అపరా...బాబు....నాకంత కర్మ పట్టలేదు....చిటిక వేస్తె...100 మంది క్యూ లో నిలబడతారు నాకోసం...."గొప్పలు పోయాడు విశాల్ "అబ్బా ఛా అందుకేనా....నాకు లెటర్ రాశావ్...చీప్ గా......???"అడిగాడు సిద్ధు "రేయి....నిన్ను చంపేస్తాను రా....నేనె రాశాను అని ఏ ఆధారాలతొ చెపుతున్నావ్ నువ్వసలు....???"లాజిక్ లాగాడు విశాల్ "అదా.....నిన్న నేను ఈ లేటర్ గురించి ఆలోచిస్తుంటె కరక్ట్ గా నువ్వొచ్చి....లవ్ లెటర్ వచ్చిందా...అని అడిగావ్...? నువ్వు పంపకపోతే నీకెలా తెలుస్తుంది....చెప్పు రా చెప్పు....."వెటకారం గా అన్నాడు సిద్ధు. "అబ్బబ్బ ఏమి లాజిక్ లాగావ్ రా....నీ లాజిక్ తగలెట్టా నేనెదొ ఊరికే అన్నా రా బావ నన్ను నమ్ము రా ప్లీజ్.....నన్ను వెరేలా చూడకు రా....ప్ల్లిజ్ నేను రాయలేదు....రా.....ప్లీజ్ రా......"అభ్యర్ధించాడు విశాల్ "నిజమేనా నువ్వు చెబుతుంది....?నమ్మొచ్చా...?"డౌట్ గా అన్నాడు సిద్ధు "రేయ్ నిజం రా బావ సుహాసిని మీద ఒట్టు....."అన్నాడు విశాల్
20-11-2018, 10:45 AM
"సుహాసిని ఎవర్రా....?నాకెప్పుడు చెప్పలేదు....?"కూపి లాగుతూ అడిగాడు సిద్ధు
"తనా...నా చైల్డ్....హుడ్...క్రష్...నీకు తెలీదు లే గానీ......ఇంతకు నీకు లెటర్లు రాసె పిల్ల ఎవరో నీకు తెల్వదు కదా....?"అడిగాడు విశాల్ "హా తెల్వదు....నిన్న ఒక లెటర్ పంపింది....ఇవాళ 2.....పంపింది...."అన్నాడు ఆలోచిస్తూ "పాపం ఎవరొ ఆ టేస్ట్ లెస్ గాళ్....."బాధపడ్డాడు విశాల్ చాలు చాల్లే ఇక పద ఆఫీస్ కి.....అని ఇద్దరు ఆఫిస్ కి వెళ్ళారు ఆ రోజు సాయత్రం..... కార్ తీసి విశాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు....సిద్ధు.... ఇంతలో వర్షం స్టార్ట్ అయ్యింది....ఆ వర్షం లో ఒక పింక్ కలర్ డ్రస్ వేసుకున్న ఒక అమ్మాయి...గొడుగు పట్టుకుని...రొడ్డు కి అవతల వైపు వుంది....ఆమె ముఖాన్ని గొడుగు కవర్ చేసింది...ఆమె ఒక వైట్ కలర్ ఫ్రాక్ వేసుకున్న పాప కి....గులాబి పువ్వు ఇచ్చి ఏదొ చెప్పింది........ కొద్ది సేపటి కి ఆ పాప.....తన కార్ వైపు రావడం గమనించాడు....సిద్ధు..... ఆ పాప కార్ వద్దకు వచ్చి కిటికి అద్దం మీద కొట్టింది....గ్లాస్ ని కిందకి జరపడంతొ....ఆ పాప ముద్దు ముద్దుగా.... పింక్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూపించి....ఆ అక్క మీకు ఇవ్వమంది అని గులాబి పువ్విచ్చి....పరిగెత్తింది.... వెంటనే కార్ దిగిన....సిద్ధు.....ఆ పింక్ డ్రెస్ అమ్మయి వెళ్తున్న వైపు వెళ్ళాడు..... కొద్ది దూరం బాగానే వెంబడించిన.....సిద్ధు కి తను ఎటు పోయిందో కనిపించలేదు.....ఛా మిస్ అయ్యింది అని అనుకుంటుడగా.... ఇంతలో తన కార్ లాంటి కార్ ఎ అతణ్ని పాస్ అవుతూ ముందుకు వెళ్ళింది.... నా కార్ లా వుందె అని అనుకుంటూ చూడబొతే అది తన కారే .... ఎవరో తను దిగిన టైం చూసి సరిగ్గా కార్ కొట్టెశారు..... ఎవరు కార్ ని కొట్టెశారో సిద్ధు కి బాగా అర్ధమయ్యింది..... "పిల్ల కోసం పోతే కార్ పోయె టాం టాం...టాం......."అని పాడుతూ చప్పట్లు కొడుతున్న విశాల్ ని చిరాగ్గా చూశాడు...సిద్ధు "ఆ చూపుకి భయపడుతున్నట్టు నటిస్తూ అట్లా చూడమాకు సామి భయమేస్తుంది...."అన్నాడు విశాల్!! "అంత భయపడె వాడివే అయితే ఈ కోతి కొమ్మచి పాటలు పాడవులే నాయన...కాస్త నటించడం ఆపు...."అన్నాడు సిద్ధు చిరకుగా.... "చిల్ బావ పోలిస్ కంప్లయింట్ ఇద్దాం పద...."అన్నాడు లేస్తూ విశాల్ "ఎవరిమీద ఇద్దాం కార్ కొట్టెసింది అమ్మాయా అబ్బాయా అంటే ఎమి చెప్దాం?"అడిగాడు సిద్ధు "కార్ డ్రైవ్ చేసింది అబ్బాయి అని చెప్పావ్ గా.....మరి అలాంటప్పుడు అమ్మాయ్ ఎందుకు వచ్చింది మధ్యలో....?"అర్థం కానట్టు అడిగాడు విశాల్ "కొట్టెసింది అబ్బాయె కాని ప్లాన్ అమ్మాయి ది కదా సింపుల్ గా చెప్పాడు...."సిద్ధు "అయ్యా న్యూటన్ ఏమి చెప్పలనుకుంటున్నావొ సూటిగా చెప్పు....అక్కడికి నువ్వెదొ వాళ్ళ ప్లాన్ దగ్గరుండి గీయించినట్టు....ఆ ప్లాన్ అమ్మయిది అని ఎలా చెప్తావు?"అయోమయంగా అడిగాడు విశాల్ "నేను సూటిగా నే చెప్ప నీ కోడి మెదడు కే అర్థం కావట్లేదు....సరిగ్గా ఆలోచించు రా..బావ"అన్నాడు సిద్ధు సిద్ధు:అసలు కార్ ఎందుకు పోయింది....? విశాల్:నువ్వు కార్ దిగడం వల్ల సిద్ధు:నేను కార్ ఎందుకు దిగాను......??? విశాల్:ఆ పాప పువ్వు ఇవ్వడం వల్ల....పిల్ల కోసం....దిగావు..... సిద్ధు:exactly......ఇది ఆ అమ్మాయ్...ప్లాన్....కార్ కొట్టయడానికి....మాములుగా అయితె నేను కార్ దిగను అని......ఇలా పాప చేత పువ్వు పంపించి నా దృష్టి మరల్చింది....అందుకోసమే....ఈ స్కెచ్ వేసింది..... విశాల్:నాకలా అనిపించట్లేదు రా......కార్ కొట్టెయడానికే అయితె ఇవాళ పువ్వొక్కటే పంపేది గా....నిన్న....ఇవాళ ఆ లెటర్స్...అన్ని పంపాల్సిన అవసరం ఏంటి....?తనకి.... సిద్ధు:నీ కర్థం కాదు లే రా....ముందు నుంచి...నన్ను డైవర్ట్ చేస్తే తన పని సులువవుతుంది అనుకుందేమొ..... "నేను సూటిగా నే చెప్ప నీ కోడి మెదడు కే అర్థం కావట్లేదు....సరిగ్గా ఆలోచించు రా..బావ"అన్నాడు సిద్ధు సిద్ధు(మనసులో):నాక్కుడా నువ్వనుకునేది నిజం అయితే బాగుండు అనిపిస్తుంది....కాని అక్కడ జరిగిన సంఘటన ని చూస్తే నా థికింగ్ లో తప్పు లేదనిపిస్తుంది..... ****
23-11-2018, 08:08 PM
Nice story. Waiting for further updates
23-11-2018, 08:58 PM
ee katha ki anta responce ledani aapesanu updates ivvatam.....
24-11-2018, 12:58 AM
super
24-11-2018, 02:42 AM
Nice story
04-02-2020, 01:31 AM
Nice update
|
« Next Oldest | Next Newest »
|