Thread Rating:
  • 5 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బ్రహ్మ జ్ఞానం
#61
(24-11-2019, 09:49 PM)kamal kishan Wrote: చాలా మంచి ప్రయత్నమండీ 

పైన గ్రహజాతుల్లో 

శని, కుజులను క్షత్రియులుగా....చంద్ర - వైశ్య 
ఎలా అనేది నాకు అర్ధం కాలేదు.
అలానే రాహువుని మ్లేచ్యునిగా భావించినప్పుడే ఫలితాలు కనపడ్డాయి.
లగ్నంలో అదీ తులా లగ్న జాతకులకు రాహువు ఉన్నట్లయితే విదేశాలలో సెటిల్ అయ్యారు. ఎలా అన్నది తెలియటం లేదు.
-----------------------------------------------------------------------------------------------------------------------------
TYPING MISTAKE SORRY FOR THAT, THANK U FOR UR FEED BACK
చంద్ర - వైశ్య YES ITS RIGHT.

check raahu degrees from lagna, if rahu signifies 12th house as per kp ayanamsa, yes possible.

FOR Foreign settlement, not only raahu, we can check multiple combinations.
[+] 1 user Likes dev369's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
పుష్పాలు-దోష నివృత్తి

ఈ క్రింది తెలిపిన పూవులు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే
దేవునికి గాని దేవత కు గాని ఈ క్రింది ఫలితాలు లదిస్తాయ.

జాజిపూలు

మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.

సంపెంగ పూలు

మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.

పారిజాత

కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.

రుద్రాక్షపూవును

అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.

మొగలిపూలను

అర్పిస్తే అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.

లక్కి పూవుతో పూజిస్తే

భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.

పద్మం లేదా కమలంతో పూజిస్తే

సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.

మల్లెపూవుతో పూజిస్తే

అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

కల్హర పుష్పంతో

పూజ చేస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.

గన్నేరు పూలతో

పూజిస్తే కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.

కలువ పూవుతో .

పూజ చేస్తే స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.

పాటలీ పుష్పంతో పూజ చేస్తే

వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.

కుంద పుష్పంతో

పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.

మల్లెపూవుతో

పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే - అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.

కనకాంబరం

పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే - జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.

మాధవీ పుష్పంతో

సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.

తుమ్మపూలతో

ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది.

నందివర్థనం పూలతో

శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.

కణగలె పుష్పం

దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది.

దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.

పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే - పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
[+] 2 users Like dev369's post
Like Reply
#63
ఓం శ్రీ మాత్రే నమః 
బావుందండీ మీరు చెప్పింది.
బీవీ రామన్ గారు చెప్పిన 300 combinations నాకు అనుభవం లోకి వచ్చాయి.
నాకు ఒకటే బాధ నా వల్ల తప్పు జరిగి అడిగిన వాళ్ళు అవస్థ పడకూడదని, ఇంకా చాలా ఉందండీ చూసి అనుభవంలో గ్రహించి చెప్పాల్సి ఉంది. నాకు తెలిసిన ప్రముఖ జ్యోతిష్యులు కేవలం కుండలి మాత్రమే చూసి చెబుతున్నారు.అయినా వాళ్లకి కూడా పరిష్కారం అనుగ్రహం లభిస్తున్నాయి. ఏమో ఈ చరాచర సృష్టిలో ఈశ్వరుని కంటే సద్గురువు. ఈశ్వరుని కంటే కారణభూతుడు. సకల సత్య స్వరూపుడూ ఎవ్వరూలేరు. 
ఒక నమస్కారం చేస్తున్నాం అంటే అది అమ్మవారికి అవ్వాలి అని నా అభిప్రాయం.
Like Reply
#64
(25-11-2019, 06:05 PM)dev369 Wrote: పుష్పాలు-దోష నివృత్తి
ఈ విషయం గురించి మొదటిసారి వింటున్నాను. ఆసక్తికరంగా ఉంది దేవ్369 గారు.
కణగలె, లక్కి, కల్హర, కుంద పుష్పాల గురించి ఎపుడు వినలేదు. అవి ఎక్కడ దొరకుతాయి ఎలా ఉంటాయి చెప్పగలరు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#65
(24-11-2019, 12:18 AM)lickerofpussy9 Wrote: panch koti yoga ante enti?

I dont know andi, meeku telisina telupa galaru
Like Reply
#66
(25-11-2019, 10:04 PM)k3vv3 Wrote: ఈ విషయం గురించి మొదటిసారి వింటున్నాను. ఆసక్తికరంగా ఉంది దేవ్369 గారు.
కణగలె, లక్కి, కల్హర, కుంద పుష్పాల గురించి ఎపుడు వినలేదు. అవి ఎక్కడ దొరకుతాయి ఎలా ఉంటాయి చెప్పగలరు.

pls, if u search in google images, u will find, there available
Like Reply
#67
(25-11-2019, 07:23 PM)kamal kishan Wrote: ఓం శ్రీ మాత్రే నమః 
బావుందండీ మీరు చెప్పింది.
బీవీ రామన్ గారు చెప్పిన 300 combinations నాకు అనుభవం లోకి వచ్చాయి.
నాకు ఒకటే బాధ నా వల్ల తప్పు జరిగి అడిగిన వాళ్ళు అవస్థ పడకూడదని, ఇంకా చాలా ఉందండీ చూసి అనుభవంలో గ్రహించి చెప్పాల్సి ఉంది. నాకు తెలిసిన ప్రముఖ జ్యోతిష్యులు కేవలం కుండలి మాత్రమే చూసి చెబుతున్నారు.అయినా వాళ్లకి కూడా పరిష్కారం అనుగ్రహం లభిస్తున్నాయి. ఏమో ఈ చరాచర సృష్టిలో ఈశ్వరుని కంటే సద్గురువు. ఈశ్వరుని కంటే కారణభూతుడు. సకల సత్య స్వరూపుడూ ఎవ్వరూలేరు. 
ఒక నమస్కారం చేస్తున్నాం అంటే అది అమ్మవారికి అవ్వాలి అని నా అభిప్రాయం.

[Image: Namaskar.png]
Like Reply
#68
Astro-secrets & KP Part2.pdf

http://www.mediafire.com/file/fzgydzofox...2.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply
#69
Karna pisachi sadhana in telugu

https://www.youtube.com/watch?v=wgohhHOfLRk
[+] 1 user Likes dev369's post
Like Reply
#70
1. గురువు పూర్ణ శుభుడు.
2. శుక్రుడు 3(త్రిపాద)పాదాలు శుభుడు
3. పూర్ణ చంద్ర = గురువు
4. 3/4 చంద్ర = శుక్రుడు
5. అర్ద చంద్ర = బుధ
6. క్షీణ చంద్రుడు ఒక పాద శుభుడు
7. శని కేతులు పూర్ణ పాపులు
8. కుజుడు త్రిపాద పాపి
9. రవి అర్ధ పాపి
10. క్షీణ చంద్రుడు త్రిపాద పాపి
11. పాప యుతి బుధ పూర్ణ పాపి
[+] 2 users Like dev369's post
Like Reply
#71
Astro-secrets & KP Part3.pdf

http://www.mediafire.com/file/r6061mzi4w...3.pdf/file
[+] 2 users Like dev369's post
Like Reply
#72
ఏ వ్యక్తి అయిన తాను చేసుకోగలిగే పనులకు ఇతరుల సహాయ సహకారాలు తీసుకోక తానే పూర్తి చేసుకొనుట మంచిది. అలా కాక, మనలో చాలా మంది, చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల సహాయం కోరుతుంటారు. దీని వలన మనకు నిజమైన అవసరం అయినపుడు సహాయానికి ఎవరు ముందుకు రాకపోవడానికి అవకాశం వుంటుంది.

ఉదా: మనకు ఆటొలో కానీ కాబ్ లో కానీ వెళ్ళే స్థోమత వుంది లిఫ్ట్ అడగడం.
Like Reply
#73
వర్జ్యం'

వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు.ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది.వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం.అశుభ సమయం.శుభకార్యాలు,ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది.జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం గాని,చంద్ర స్ఫుటం గాని,ఇతర గ్రహాలు గాని వర్జ్య కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ,అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి.

భారతీయులు నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా, మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతుంటారు. అటు దైవకార్యాలకి ... ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడటమనేది ప్రాచీనాకాలం నుంచి వస్తోంది. ముహూర్తం ఏ మాత్రం కాస్త అటుఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం వుండటం వలన, అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.

ఈ నేపథ్యంలోనే 'వర్జ్యం' అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. 'వర్జ్యం' అంటేనే విడువదగినది అని అర్థం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది. ''ఇప్పుడు వర్జ్యం వుంది తరువాత బయలుదేరుతాం'' ... '' కాసేపాగితే వర్జ్యం వచ్చేస్తుంది ... త్వరగా బయలుదేరండి'' అనే మాటలు మనం తరచూ వింటూ వుంటాం. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.

వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో ఏం చేస్తే బావుంటుందనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ వుంటుంది. ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.ఈ సమయంలో దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు.

వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ .. పారాయణం .. స్తోత్ర పఠనం .. సంకీర్తన .. భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటోంది. ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
[+] 1 user Likes dev369's post
Like Reply
#74
30 రకాల శివలింగాలు - ఫలితాలు ::-
***********

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం.

రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...

01. గంధలింగం :-

రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

02. పుష్పలింగం :-

నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

03. నవనీతలింగం :-

వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

04. రజోమయలింగం :-

పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.

05. ధాన్యలింగం :-

యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

06. తిలిపిస్టోత్థలింగం :-

నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

07. లవణలింగం :-

హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

08. కర్పూరాజ లింగం :-

ముక్తిప్రదమైనది.

09. భస్మమయలింగం :-

భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.

10. శర్కరామయలింగం :-

సుఖప్రదం

11. సద్భోత్థలింగం :-

ప్రీతిని కలిగిస్తుంది.

12. పాలరాతి లింగం :-

ఆరోగ్యదాయకం

13. వంశాకురమయ లింగం :-

వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

14. కేశాస్థిలింగం :-

వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

15. పిష్టమయలింగం :-

ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16. దధిదుగ్థలింగం :-

కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది

17. ఫలోత్థలింగం :-

ఫలప్రదమైనది

18. రాత్రిఫలజాతలింగం :-

ముక్తిప్రదం.

19. గోమయలింగం :-

కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

20. దూర్వాకాండజలింగం :-

గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

21. వైడూర్యలింగం :-

శత్రునాశనం, దృష్టిదోషహరం

22. ముక్తాలింగం :-

ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

23. సువర్ణనిర్మితలింగం :-

బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

24. రజతలింగం :-

సంపదలను కలిగిస్తుంది.

25. ఇత్తడి - కంచులింగం :-

ముక్తిని ప్రసాదిస్తుంది.

26. ఇనుము - సీసపులింగం :-

శత్రునాశనం చేస్తుంది.

27. అష్టథాతులింగం :-

చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

28. తుష్ణోత్థలింగం :-

మారణక్రియకు పూజిస్తారు.

29. స్పటిక లింగం :-

సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

30. సీతాఖండలింగం :-

పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.?
Like Reply
#75
VEDA PURAANAM BOOKS

https://vedpuran.net/2011/10/21/ved_puran/amp/
Like Reply
#76
ఒక తల్లి తన నిత్యపూజయైన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారునితో మాట్లాడిన సంభాషణలు ఈ విధంగా ఉన్నాయి.

అవి మీ, మా, మనందరికి ఎంతగానోఉపకరిస్తాయి.

తల్లి... నాయనా! పూజా పురస్కారాలైనాయా?

కుమారుడు... ఇలా చెప్పాడు. అమ్మా! నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. నీవు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినేవుంటావు. అలాంటి నేను పూజలు గట్రా ఏం బాగుంటాయి.

తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసురా. కానీ, అతను కనిపెట్టినవన్నీ మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా అన్నది.

కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.

అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. నీకు దశావతరాలు... అది మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా...

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు.. దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని ప్రశ్నించాడు.

అప్పుడు ఆ తల్లి... హా.. సంబంధం ఉంది. ఇంకా నీవు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను...

మొదటి అవతారం మత్స్య అవతారం. అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. ఇది నిజమా కాదా.

కొడుకు కొంచెం శ్రద్ధగా వింటున్నాడు.

తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.

మూడవది వరాహ అవతారం... అంటే పంది. ఇది అడవి జంతువులను అంటే బుద్ధి పెరగని జీవులు... అదే డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.

ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయని తెలుస్తుంది.

ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడైనా ఎంతో ఎత్తుకు పెరిగినవాడు. నీకు తెలుసుకదా మానవుల్లో మొదట హోమో మరియు హోమో సేపియన్స్ వున్నారు అని, వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు గా వికాసం చెందారని.

కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.

తల్లి.. కన్నా ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే.. ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవుల్లోని గుహల్లో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడని.

ఇక ఏడో అవతారం రామావతరం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచనాపరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు, సమస్త కుటుంబ బంధుత్వానికి ఆదిపురుషుడు.

ఇక ఎనిమిదవది అత్యంత ప్రముఖమైనది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు, పాలకుడు, ప్రేమించే స్వభావి. ఆతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజంలో ఉంటూ సుఖదుఃఖ, లాభనష్టాలు అన్నీ నేర్పినవాడు.

కొడుకు ఆశ్చర్యవిస్మయాలతో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణలకు మూలం.

ఇక చివరది అయిన కల్కి పురుషుడు. అతను నీవు ఏ మానవునికై వెతుకుతున్నావో అతనే ఇతను. అతను యిప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.

కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తూ.. ఆనందబాష్పాలతో అమ్మా హిందూ ధర్మం ఎంతో అర్థవంతమైన నిజమైన ధర్మమని అనడంలో సందేహించనక్కర్లేదని పేర్కొన్నాడు.

ఆత్మీయులారా!!! మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు,
ఇత్యాదివన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మాత్రం మారాలి. మీరు ఏ విధంగా భావిస్తే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మపరమైనవి కావచ్చు. శాస్త్రీయంతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా మేలుకోండి.. ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.

# మనం మారుదాం.. యుగం మారుతుంది #

గమనిక : సైన్స్ అంటే నిరూపణ మాత్రమే అని భావిస్తే... సనాతన ధర్మం, వేదాలు ఇత్యాదులన్నీ నిరూపణ చేయబడ్డవే.
Like Reply
#77
Astro-secrets & KP Part4.pdf

http://www.mediafire.com/file/mjvf5whi1h...4.pdf/file
[+] 1 user Likes dev369's post
Like Reply
#78
నువ్వుల నూనె :-

ఈ భూమిపై లభించే ఉత్తమమైన ఆహారాల గురించి మాట్లాడుకుంటే, అప్పుడు నువ్వుల నూనె పేరు ఖచ్చితంగా వస్తుంది. మరియు ఈ ఉత్తమ పదార్థం మార్కెట్లో అందుబాటులో లేదు. రాబోయే తరాలకు దాని గుణాలు కూడా తెలియదు.

ఎందుకంటే ఈ కొత్త తరం జనం, టీవీ వాణిజ్య ప్రకటనలను చూసిన తర్వాత మాత్రమే అన్ని వస్తువులను కొనుగోలు చేస్తుంది.
మరియు కంపెనీలు నువ్వుల నూనెను ప్రోత్సహించవు. ఎందుకంటే దాని లక్షణాలను తెలుసుకున్న తరువాత, మీరు ఆ కంపెనీల నూనె అని పిలువబడే ద్రవ కందెనను తీసుకోవడం మానేస్తారు.

నువ్వుల నూనెను నూనెలు నూనె అంటారు.

నువ్వుల నూనెకు చాలా బలం ఉంది, అది రాయిని కూడా చీల్చుతుంది.

మీరు ప్రయత్నించండి.

ఒక కొండ రాయిని తీసుకొని ఒక గిన్నెలాగ తయారు చేసి, ప్రపంచంలో నీరు, పాలు, ఆమ్లం లేదా ఆమ్లం ఉంచండి, ప్రపంచంలో ఏదైనా రసాయన, ఆమ్లం, అదే రాయిలో అలాగే ఉంటుంది.

కానీ… మీరు ఆ గిన్నెలో నువ్వుల నూనెను, ఆ గొయ్యిలో నింపండి .. 2 రోజుల తరువాత మీరు చూస్తే, నువ్వుల నూనె… రాయిలోకి ప్రవేశించి రాయి కిందకు వస్తుంది.
ఇది నువ్వుల నూనె యొక్క బలం. ఈ నూనెతో మసాజ్ చేయడం వలన, అది ఎముకలను దాటి, ఆ ఎముకలను బలపరుస్తుంది.

? నువ్వుల నూనెలో భాస్వరం ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఏదైనా శుద్ధమైన నువ్వుల నూనెను, భారతీయుడు కోరుకుంటే, కొంచెం ప్రయత్నంతో సులభంగా పొందవచ్చు. అప్పుడు అతను ఏ కంపెనీ నూనెను కొనవలసిన అవసరం లేదు.

నువ్వుల నూనెను ఏదైనా గానుగ నుండి కొనండి. కానీ, నువ్వుల నూనెను ఆడటానికి ముడి గానుగ (చెక్కతో చేసిన గానుగ) ను మాత్రమే వాడాలి.

తైలం అనే పదం *తిల్ అనే పదం నుండి వచ్చింది.
తిలల (నువ్వులు) నుండి బయటకు వచ్చే నూనెనే నూనె అంటారు. అంటే, నూనె యొక్క నిజమైన అర్ధం "నువ్వుల నూనె" అని అర్థం.

నువ్వుల నూనె యొక్క గొప్ప గుణం ఏమిటంటే, ఇది శరీరానికి ఎంతో శుభప్రదంగా పనిచేస్తుంది .. మీకు ఏ వ్యాధి ఉన్నా, దానికి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభిస్తుంది.

ఈ గుణము ఈ భూమి మీద ఇతర ఆహార పదార్థాలలోను కనుగొనబడలేదు.

100 గ్రాముల తెల్ల నువ్వులలో, 1000 మి.గ్రా కాల్షియం లభిస్తుంది. నువ్వులు, బాదం కన్నా 6 రెట్లు ఎక్కువ కాల్షియం కలిగి ఉంటాయి.
నలుపు మరియు ఎరుపు నువ్వులు, ఇనుముతో సమృద్ధిగా ఉంటాయి, ఇది రక్త లోపానికి చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.

నువ్వుల నూనెలో ఉన్న లెసిథిన్ అనే రసాయనం, రక్త నాళాలలో కొలెస్ట్రాల్ ప్రవాహాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

నువ్వుల నూనెలో సహజంగా , సీస్మోల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా చాలా త్వరగా క్షీణించటానికి అనుమతించదు.
ఆయుర్వేద చరక సంహిత లో, వంట చేయడానికి ఇది ఉత్తమమైన నూనెగా పరిగణించబడనది.

నువ్వుల నూనెలో, విటమిన్-C మినహా అన్ని అవసరమైన పోషక పదార్థాలు ఉన్నాయి, ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
నువ్వులు విటమిన్ -బి మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి.
ఇది మీథోనిన్ మరియు ట్రిప్టోఫాన్ అని పిలువబడే రెండు ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది, ఇవి పప్పు దినుసులు, వేరుశెనగ, బీన్స్, చోలాస్ మరియు సోయాబీన్స్ వంటి చాలా శాఖాహార ఆహారాలలో కనిపించవు.

ట్రిప్టోఫాన్‌ను ప్రశాంతమైన పదార్థం అని కూడా పిలుస్తారు, ఇది గాఢ నిద్రను కలిగించే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ఇది చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

మెథోనిన్ కాలేయాన్ని సరిచేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.

టిల్బీస్ జీవక్రియను పెంచే ఆరోగ్యకరమైన కొవ్వుల యొక్క పెద్ద మూలం.

ఇది మలబద్దకాన్ని కూడా అనుమతించదు.

? నువ్వు గింజల్లో ఉండే పోషక అంశాలు కాల్షియం, ఐరన్ వంటివి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.

నువ్వుల నూనెలో తక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది, కాబట్టి దీని నుండి తయారైన ఆహారాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ అర్ధం ఏమిటంటే, మీరు సేకరించిన స్వచ్ఛమైన నువ్వుల నూనెను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువ.

అనారోగ్యంతో లేనప్పుడు, చికిత్స అవసరం ఉండదు. ఇది ఆయుర్వేదం చెబుతోంది.

ఆయుర్వేదం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, సరైన ఆహారమే మాత్రమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అపుడు శరీరానికి చికిత్స అవసరం ఉండదు.

కొంతమంది ప్రజలు మార్కెట్లో నువ్వుల నూనె పేరిట మరికొన్ని నూనెలను విక్రయిస్తున్నారని గుర్తుంచుకోవాలి ..

ఇది గుర్తించడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీ ముందు తీసిన నూనెను మాత్రమే నమ్మండి. ఈ పని కొంచెం కష్టం, కానీ మొదటిసారి చేసిన ప్రయత్నంగా, ఈ స్వచ్ఛమైన నూనె మీకు అందుబాటులో ఉంటుంది.
[+] 1 user Likes dev369's post
Like Reply
#79
(01-12-2019, 10:12 AM)dev369 Wrote: 30 రకాల శివలింగాలు  -  ఫలితాలు  ::-
***********

సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలీని శివ లింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపురూపమైనవి. ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం. అందుకే వాటి గురించి తెలుసుకుందాం.

రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...

01.  గంధలింగం :-

రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

02.  పుష్పలింగం :-

నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

03.  నవనీతలింగం :-

వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.      

04.  రజోమయలింగం :-

పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.

05.  ధాన్యలింగం :-

యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

06.  తిలిపిస్టోత్థలింగం :-

నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

07.  లవణలింగం :-

హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

08.  కర్పూరాజ లింగం :-

ముక్తిప్రదమైనది.

09.  భస్మమయలింగం :-

భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.
                 
10.  శర్కరామయలింగం :-

సుఖప్రదం

11.  సద్భోత్థలింగం :-

ప్రీతిని కలిగిస్తుంది.

12.  పాలరాతి లింగం :-

ఆరోగ్యదాయకం

13.  వంశాకురమయ లింగం :-

వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

14.  కేశాస్థిలింగం :-

వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

15.  పిష్టమయలింగం :-

ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16.  దధిదుగ్థలింగం :-

కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది

17. ఫలోత్థలింగం :-

ఫలప్రదమైనది

18.  రాత్రిఫలజాతలింగం :-

ముక్తిప్రదం.

19.  గోమయలింగం :-

కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

20. దూర్వాకాండజలింగం :-

గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

21. వైడూర్యలింగం :-

శత్రునాశనం, దృష్టిదోషహరం

22. ముక్తాలింగం :-

ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

23.  సువర్ణనిర్మితలింగం :-

బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

24. రజతలింగం :-

సంపదలను కలిగిస్తుంది.

25. ఇత్తడి - కంచులింగం :-

ముక్తిని ప్రసాదిస్తుంది.

26.  ఇనుము - సీసపులింగం :-

శత్రునాశనం చేస్తుంది.    

27. అష్టథాతులింగం :-

చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

28.  తుష్ణోత్థలింగం :-

మారణక్రియకు పూజిస్తారు.

29.  స్పటిక లింగం :-

సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

30.  సీతాఖండలింగం :-

పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.?

అద్భుతం. పరమేశ్వరుని గురించిన మీ పోస్ట్ చాలా బాగుంది.

రసలింగం అంటే పాదరసంలా అలానే నర్మదా బాణ లింగం గురించి తెలియజేయగలరు.
Like Reply
#80
(03-12-2019, 07:01 PM)dev369 Wrote: ఒక తల్లి తన నిత్యపూజయైన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తన కుమారునితో మాట్లాడిన సంభాషణలు ఈ విధంగా ఉన్నాయి.

అవి మీ, మా, మనందరికి ఎంతగానోఉపకరిస్తాయి.
   
తల్లి... నాయనా! పూజా పురస్కారాలైనాయా?

కుమారుడు... ఇలా చెప్పాడు. అమ్మా! నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా అమెరికాలో  మానవ వికాసానికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నాను. నీవు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినేవుంటావు. అలాంటి నేను పూజలు గట్రా ఏం బాగుంటాయి.
 
తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసురా. కానీ, అతను కనిపెట్టినవన్నీ మన పురాతన ధర్మంలో ఉన్నవేకదా నాన్నా అన్నది.

కొడుకు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు.

అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది. నీకు దశావతరాలు... అది మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా...

కొడుకు ఆసక్తిగా అవును తెలుసు.. దానికి ఈ  జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని ప్రశ్నించాడు.

అప్పుడు ఆ తల్లి... హా.. సంబంధం ఉంది. ఇంకా నీవు నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను...
   
మొదటి అవతారం మత్స్య అవతారం. అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. ఇది నిజమా కాదా.
 
కొడుకు కొంచెం శ్రద్ధగా వింటున్నాడు.
 
తర్వాత రెండవది కూర్మ అవతారం. అంటే తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.

మూడవది వరాహ అవతారం... అంటే పంది. ఇది అడవి జంతువులను అంటే బుద్ధి పెరగని జీవులు... అదే డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.
 
ఇక నాలుగో అవతారం నృసింహ అవతారం. అంటే సగం మనిషి సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయని తెలుస్తుంది.

ఇక ఐదో అవతారం వామన .అంటే పొట్టివాడైనా ఎంతో ఎత్తుకు పెరిగినవాడు. నీకు తెలుసుకదా మానవుల్లో మొదట హోమో మరియు  హోమో సేపియన్స్ వున్నారు అని, వాళ్లలో హోమో సేపియన్స్ మనుషులు గా వికాసం చెందారని.

కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.

తల్లి.. కన్నా ఆరో అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే.. ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు తయారు చేసుకొన్నాడు. మరియు అడవుల్లోని గుహల్లో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడని.

ఇక ఏడో అవతారం రామావతరం. మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచనాపరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు, సమస్త కుటుంబ బంధుత్వానికి ఆదిపురుషుడు.

ఇక ఎనిమిదవది అత్యంత ప్రముఖమైనది కృష్ణ పరమాత్మ. రాజనీతిజ్ఞుడు,  పాలకుడు, ప్రేమించే స్వభావి. ఆతడు సమాజ నియమాలను ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజంలో ఉంటూ సుఖదుఃఖ, లాభనష్టాలు అన్నీ నేర్పినవాడు.

కొడుకు ఆశ్చర్యవిస్మయాలతో వింటున్నాడు.

ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ తర్వాత తొమ్మిదో అవతారం బుద్ధ అవతారం. ఆయన నృసింహ అవతారం నిండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటు చేసే ఆవిష్కరణలకు మూలం.

ఇక చివరది అయిన కల్కి పురుషుడు. అతను నీవు ఏ మానవునికై వెతుకుతున్నావో అతనే ఇతను. అతను యిప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.

కొడుకు తన తల్లివంక అవాక్కాయి చూస్తూ.. ఆనందబాష్పాలతో అమ్మా హిందూ ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మమని అనడంలో సందేహించనక్కర్లేదని పేర్కొన్నాడు.

ఆత్మీయులారా!!! మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు,
ఇత్యాదివన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం చూసే దృష్టి కోణం మాత్రం మారాలి. మీరు ఏ విధంగా భావిస్తే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మపరమైనవి కావచ్చు. శాస్త్రీయంతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. ఇకనైనా మేలుకోండి.. ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.

# మనం మారుదాం.. యుగం మారుతుంది #

గమనిక : సైన్స్ అంటే నిరూపణ మాత్రమే అని భావిస్తే... సనాతన ధర్మం, వేదాలు ఇత్యాదులన్నీ నిరూపణ చేయబడ్డవే.
ఇది నాక్కుడా దర్శనం అయ్యింది. అనుభవం అయ్యింది.
Like Reply

Users browsing this thread: 4 Guest(s)