Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భర్తృహరి శృంగార శతకము
#21
శృంగార శతకం


·        స్త్రీ ప్రశంసా
 
·        సంభోగ వర్ణనము
 
·        కామినీ గర్హణము
 
·        సువిరక్త పద్ధతి
 
·        దుర్విరక్త పద్ధతి
 
·        ఋతు వర్ణన పద్ధతి
 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
వైరాగ్య శతకం

·        తృష్ణా దూషణము
 
·        విషయ పరిత్యాగ విడంబనము
 
·        యాచ్ఞా దైన్య దూషణము
 
·        భోగా స్థైర్యవర్ణనము
 
·        కాలమహిమాను వర్ణనము
 
·        యతినృపతి సంవాద వర్ణనము
 
·        మనస్సంబోధన నియమనము
 
·        నిత్యానిత్య వస్తు విచారము
 
·        శివార్చనము
 
·        అవధూత చర్య
 
Like Reply
#23
శృంగార శతకము

దేవతా స్తుతి

మొదట మన నమస్కా రరూప మైనమంగళమును జేయుచు మన్మథునికి నమస్కారము ఈవిదంగా గావించెను......

1

శంభు స్వయంభు హరయో హరిణేక్షణానాం
యేనాక్రియంత సతతం గృహకర్మదాసాః ।
వాచామగోచర చరిత్ర విచిత్రితాయ తస్మై
నమో భగవతే మకర ధ్వజాయ ॥

శివ-బ్రహ-విష్ణువులు,మన్మథున్మి చేత లేడికన్ను లవంటి కన్నులు గల పార్వతీ సరస్వతీ లక్షులకుఎల్ల పుడు ఇంటిపని బానిసవాండ్రు గా చేయఁబడిరో,అట్టి యనిర్వాచ్య మైన వింత యగు చరిత్ర గలవాఁడు గనుక నైశ్వర్యవంతుఁ డగ పూవిల్లునికి నమస్కారము.

ఈశ్వరుఁడు పార్వతిని తనయర్ధాంగమున నుంచుకొని యుండుటచేతను, విష్ణువు లక్ష్మిని దనఱోమ్ముననే దాల్చియు న్నందును, బ్రహ సరస్వతిని తన వాక్కునందే యుంచుకొనియుండుట చేతను అని,భర్తృహరి శృంగార శతక కృతికర్త మన్మథునికి నమస్కారము గావించెను.....
Like Reply
#24
2

“స్మితేన భావేన చ లజ్జయా భియా
పరాఙ్ముఖైరర్ధ కటాక్ష వీక్షణైః
వచోభిరీర్య్షా కలహేన లీలయా
సమస్త భావైః ఖలు బంధనం స్త్రియః”



(స్త్రీలు చిరునవ్వులచేతను, హావభావముల చేతను, సిగ్గు పడుచును, భీతి చెందుచును, పెడమొగము చేతను, కడకంటి అరచూపులతోను, మాటల చేతను, చిఱు కోపములతోను – ఇట్లే అనేక చేష్టలతోను పురుషులను బంధిస్తారు) అన్నాడు.

ఈ లక్షణాలు స్త్రీ ప్రకృతికి సహజభూషణాలౌతూ, పురుషుల పాలిటి ఆయుధాలౌతాయి. (ఇంతకు ముందే చెప్పినట్లుగా ఇది స్త్రీ నింద కాదు. స్త్రీ వ్యామోహనింద). ఇంతటి శక్తివంతమైన లలనా కటాక్షాలకు మోహపడనివాడు. ప్రాజ్ఞుడే. ధీరుడే.


[ ప్రతి పదార్ధం  


స్మితేన = మంద స్మితమైన మోముతో (చిరునవ్వుతో) - భావేన = హావ భావాలతో (చేస్టలతో)

చ = కాకుండా - లజ్జయా = సిగ్గుతో (సిగ్గును అభినయిస్తూ) - భియా = భయం తో

పరాజ్ముఖై = అందమైన నగుమోము ను ప్రక్కకు త్రిప్పి చూపించీ చూపించ కుండా

అర్ధ = అర్ధంతో - కటాక్ష = దయగల, కరుణారసస్పూర్తిని కలిగించే - వీక్షనైః = చూపులుగలదై


భావార్ధం & వివరణ 

మందస్మిత మోము తో ప్రేమైక భావాలతో నునుసిగ్గుల తో స్వల్పభయా భినయం తో, ముఖారవిందాన్ని కొంచెం ప్రక్కకి త్రిప్పి చూపించటానికి అయిష్టత అభియనిస్తూ, కడగంటి చూపులతో, వాక్చమత్కార -చాతుర్యంతో, ఈసునసూయలు నిండిన చేష్టలతో, ప్రేమ నిండిన శ్లెషపూర్వక పలుకులతో, నవరసాభినయ హావభావాల సమ్మిళితమైన ప్రదర్శనతో పురుషుణ్ణి కట్తిపదేయటం స్త్రీలకు సులభమై విద్యే ...
ఇదంతా నటనే సుమా!]



[శూరులలో మహాశూరుడు ఎవడు? – మన్మథబాణములతో వ్యథితుడు కానివాడు.

మన్మథుడు స్త్రీ , పురుషులలో పరస్పరము కామోద్దీపనను కలిగించు శక్తి కలవాడు. ఆయనకు అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము అను ఐదు బాణాలున్నాయనీ, అవి ఎంతటి సంయమినైనా కామానికి లోబడేటట్లు చేయగలవని అనేక పురాణగాథలలో తెలుపబడింది. 


అలాంటి కామాన్ని అభ్యాసం ద్వారా జయించిన వాడు మహావీరుడని చెప్పటంలో సందేహం లేదు. జిత మన్మథుడు ధీరుడు. మన్మథ విజితుడు యోగ పతితుడు.]
Like Reply
#25
'శ్రవణానందం ' కావ్యంలో ఒక స్త్రీకి తిరుపతి వేంకట కవులు ఎంత విలువ కట్టారో చూడండి.




సీllపలుకొక్కటియే సేయు పదివందల వరాలు

వాలు చూపులు రెండు వేలు సేయు

నగవొక్కటియెసేయు నాల్గువేల వరాలు

విర్రవీగుట లారువేలు సేయు

పదమొక్కటియె సేయు పదివేల వరహాలు

లావణ్యమది యొక లక్ష సేయు

బలుసోయగమె సేయు పది లక్షల వరాలు

కులుకు నడక తీరు కోటి సేయు

ముద్దు గుల్కెడు నెమ్మోము మూడుకోట్లు

నాస సొబగెన్న డెబ్బది నాల్గు కోట్లు

నుదుటి సింధూర నామమ్ము నూరు కోట్లు

నీకు వెల జెప్ప శక్యమే నీలవేణి!!౨.
Like Reply
#26
raji garu chala manchi pani chesaru bathruhari gari sathakalu gurinchi maku parichayam chesi,vikram arudu katha gurunchi intha vivaram ga nenu eppudu chadavaledu.Chandra varnudi nunchi modalupetti vikramarkudi jnanam a vidhamga jarigindho baga teliya jesaru.e vidhamga inka cheppandi bathruhari sathakala gurinchi
Like Reply




Users browsing this thread: 1 Guest(s)