Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఎదురీత...santhosh
#1
Heart 
                  ఎదురీత
[Image: 71799671-2388084564787553-1898312524776865792-o.jpg]
                                  ...santhosh
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ముందు మాట
ఒక మనిషి గమ్యాన్ని నిర్దెషించెది ఏది ?
తన మనుగడను ప్రశ్నించేది ఏది?
సృష్టి లొ గొప్పధి ఎధి..?
ఎవరిని అడిగినా ఎవరు సరిగ్గా సమధానం చెప్పలెధు….
ఒకరు విధి అన్నారు... ఇంకొకరు తలరాతా అన్నారు.. మరొకరు పూర్వ జన్మ ఫలం అన్నారు. చాలా మంధి ధేవుడు అన్నారు.. కాని ఎవరు సరీగ్గా నన్ను త్రుప్థి పరిచే సమాధానం చెప్పలెక పొయారు
ఎప్పుడొ ఎవరొ చెప్పగా విన్నాను. ప్రతి మనిషి లో కూడా ఎదొ ఒక శక్తి ఉంటుంధి అని.. కాని అది మన లొ ఉండే బలహీనతల వలన బయటి కి రాలేదు అని.. ఎమో నిజమే కావొచ్చు.
ఏధి ఎమైనా ఈ ప్రశ్నలు అన్నిటికి సమాధానము మాత్రం ఒక అంతు చిక్కని ప్రశ్న గా మిగిలి పొయింధి.
ఒక పెద్దమనిషి.. నా శ్రేయోభిలాషి.. ఒక మాట చేప్పారు.. ప్రతి మానవ సంబంధం అర్ధికపరమైన సంబంధం అని. అర్ధికం అంటే అది కెవలం డబ్బై కానక్కర లేదు.. ఏదైనా ఆశించినా కుడా అది అర్ధికమే..అది ఎంత వరకు నిజమో మరి.. ఈ కదకి మూలం కూడా అదే .
వీడెంటి నిజమో కాదో అని.. ఈ కధ కి మూలం అంటున్నాడు అనుకుంటున్నారా. ముందుముందు మీకె తెలుస్థుంది.
మన లేదా మన చుట్టు ప్రక్కల మనం చూసే చాల మనుష్యులు చాలావరకు మీకు ఈ కధలొ కనిపిస్తారు. ఏమో మీకు మీరె అనిపించవచ్చు.. అవన్ని మీకు సంధర్బానుసారం ఎధురు రావచ్చు. ప్రతి ఒక్కరికి ఎన్నొ ఆశలు.. ఎన్నెన్నొ కొరికలు..కాని అవ్వన్ని నెరవేరుతాయి అన్నధి గ్యారంటి లేని మిలియన్ డాలర్ల ప్రశ్న...
కాని ఎంత మంది వాళ్ల అశలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మంది గమ్యం చేరుకునే
ప్రయత్నం లొ చతికిల పడుతున్నారు. ఇంకెంతమంది దిశను మార్చుకున్న దిక్సుచిలా వల్ల ప్రయాణాన్ని సాగిస్థున్నారు.
అపుడెపుడొ అత్రెయ మహా కవి చెప్పాడు .. సుడీ లొ మునిగి ఎదురీదక మునక మేలనుకోవొయ్.
కాని ఈ కధ లో ఎన్నొ ఆటు పొట్లకి ఎధుర్కొని ధైర్యంగా పరిస్తుతులకి ఎధురొడ్ది, ఎదురీది, పొరాడీ గెలిచిన క్రిష్ణ ప్రసాద్,
పరిస్థితుల ప్రభావం వలన, తన చుట్టూ ఉండే మనుష్యుల ప్రభావం వలన,,పరిస్తుతులకి ఎదురీద లేక తనకి అంటూ ఎమి లేకుండా నలుగురి తొ నారాయణా అని తన జీవితాన్ని ఎలాగొ ఒక లా సాగిద్ధాం అని అనుకునే కుమార్,
చంచలమైన మనస్తత్వం కలిగి,కొరికలకి ఎదురీద లేక..మంచిదో కాదో తెలియని ఒక అమాయకంగా కనిపించే వేధిక,
మనం మాత్రమే కాధు మనతొ పాటు అంతా బాగుండాలి అని కొరుకునే ఏడుకొండలు.,వేణు,,
మోసపొయి ఎలాఅయిన తన జీవితం లొ గమ్యం అనే ఒక ఒడ్డు కి ఎదురీదుతూ ఒంటరి పొరాటం చేసే ఉమ.
స్వార్దానికి, ఆసుయాకి మారు పేరు అయిన కవిత..
ఇలా మన చుట్టూ,, మీ చుట్టూ... ఉండే మనుష్యులు మీకు కనిపిస్తారు.
ఒకవేళ వీళ్ళంతా ఒకె చోట కలిసి ఉంటే.
మనుష్యులలొ.. మనసులలొ... ఉండే కొపాలు.. ప్రేమలు..స్వార్ధాలు....ద్వేషం... కోరికలు.. ఇలా అవన్ని ఒకచొట ఉంటే ఎలా ఉంటుంది..
అలాంటి.. మనస్థస్థ్వాల కలియికె..నా ఈ ఎదురీత..
ధన్యవాధములు.
Like Reply
#3
సాయంకాలం సూర్య అస్థమయం ఎంత బాగుంటుంది..అనుకుంటూ అలా అలలు ఎగసి పడుతుంటే వాటినె చూస్తూ ఉండి పొయాడు కుమార్.
జనాలు అంతా ఎవరి ఆనందం లొ వాళ్ళు ఉన్నారు. కొత్త జంటలు కాబొలు... చాలా సరదాగా ఒకరి కౌగిలి లొ ఒకరు వాలి పొయి ఈ ప్రపంచాన్ని సైతం మర్చిపొయి వారి వారి సరదాల్లొ మునిగి తెలుతూ ఉన్నారు. కాలేజి పిల్లలు జంటలు జంటలు గా ఎవరితొ మాకు సంబంధం లెధు అన్నట్లూగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
పిల్లలు ఇసుకలొ గూళ్ళు కట్టుకుంటున్నారు.
అవన్ని చూస్థున్న కుమార్ స్వగతం లా అనుకున్నాడు.
ఓ సాగర తీరమా..
ఎన్నొఆటు పొటులతొ నిరంతరం శ్రమిస్థున్నా...మా అడుగుల ప్రతి రూపాల్ని అందంగా తనలో దాచుకుంటూ ..
మన మాటలతో పాటుగా తన అలల జోరుని జత చేస్తూ ..
ఎదురు చూపులతో ఒంటరిగా ఉన్న ఎన్నో మనసులకు నేనున్నా మీ జతగా అంటూ తన అలలతో ఆప్యాయంగా పాదాల్ని స్పృశిస్తూ మండే హ్రుధయాలకి తన చల్లని చిరుగాలులతో సేద తీరుస్తూ ..
ఆరుణొదయాన్ని.. అస్తమించే అగ్ని గొళాన్ని తనలో దాచుకుంటూ మన కనులకు మాత్రం అందగా చూపిస్తూ ఉండే ఓ సాగర తీరమా అంతులేని కధలకి .. ఎన్నో జ్ఞాపకాలకి ప్రతీరూపంగా ఉన్న నీకు నా జోహార్లు ..
అనుకొకుండా టైమ్ చుసుకున్నాడు. అప్పటికె 7.30 దాటింధి. ఇంటికి వెళ్ళాలి అనుకుని లేచాడు. కారు స్టార్ట్ చెయ్యబొతుండగా క్రిష్ణ ప్రసాద్ ఫొన్ వఛింధి.. ఈ టైమ్ లొ ఫోన్ చేసాడు ఎంటి అని లిఫ్ట్ చేసాడు.హలొ చెప్పు అన్నా ...”
“ఎక్కడ ఉన్నావురా..” అడిగాడు ప్రసాద్
ఇంటికి వెళ్ధాం అని అలొచిస్థున్నా.” చెప్పు ఎదైనా పని ఉంధా.
“ఎమి లెధురా.. ఎలా ఉన్నావ్ అని ఫొనె చెసాను. అడ్వాన్సె హ్యపి బర్త్ డే.”
‘’ ఒహ్హ్ థాంక్స్ అన్నా.. రీయల్లీ చాలా థ్యాంక్స్ ...’’ అని ఫొన్ పెట్టే సాడు.
అవును.. రేపు తన పుట్టిన రోజు .. ఎలా ఉండెంది చిన్నపుడు , కాలేజి రొజుల్లొ …. ఎంత సరదాగా ఉండేది.
ఇంటికి బయలుదేరాడు.
ట్రాఫిక్ లొ ఇంటికి చెరెసరికి 10.00 అయ్యింధి. ఈ రొజు ఎమి వినాల్సి వస్థుంది అనుకుని ఇంట్లో కి ప్రవేశించాడు.
హాల్లొ ఒక లైట్, బెడ్ రూం లొ ఒక లైట్ వెలుగుతూ ఉన్నాయి .గది లొ తన 3 ఎళ్ల కొడుకు తన తల్లి పక్కన హాయి గా నిద్రపొతూ ఉన్నాడు . అపురూపంగా కొడుకుని చూసుకుని హల్లొ కి వచ్చాడు.
అమ్మా నాన్న వాళ్ళ గదిలొఉన్నారు నిద్రపొతు ఉన్నారు.
నిరాశగా బోజనం పెట్టుకుని తినబొయాడు. కాలిగా ఉన్న కుర్చిలు తన ఒంటరితనాన్ని వెక్కిరిస్థున్నట్టు గా అనిపించింధి. అన్నం సహించటం లేదు . కంచం లొ చేతులు కడిగి విశ్రాంతి గా సొఫా లొ కూర్చున్నాడు . ఒక్కసారిగా తన జ్జ్నాపకాలు చుట్టుముట్టాయి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
Like Reply
#4
జీవితంఎప్పుడూ ఒకేలాఉండదు. దాన్నిమనంఎధుర్కొవాలి. కాబట్టీమనం దెన్నీ ఈజీగాతీసుకొకూడధు.” చెప్పుకుంటూపోతున్నాడుషణ్ముకం.
“ఒరెయ్ మామా అపరానీగొలఎప్పుడూచెప్పింధె చెప్పిచంపకురా. ఇప్పుడు ఎమంటావ్. ఈరొజు మూవికి డబ్బులు లెవు అనెకధనీబాధ. చూద్దాం ఎవడొఒకజూనియర్గాడు దొరక్కపోడు. అంతగా కాకపోతెఎలాగుమన దాన వీరుడులెకపొలెధుకధా” అన్నాడు శంకరం..
“అదికాదు మామఈరొజు ఒక్కకుబేరుడుకూడదొరకలెధు.. ఉదయంకాలేజికివెల్ధాంఅనుకునిబయలుదేరనా.. మధ్యలోకొత్తకల్లువాసనమత్తెక్కించింది అనుకో .. ఈరొజుఎలాఅయినాఒక పట్టుపడదాంఅనిఅనుకుంటేనువ్వేమోదివాళాతీసినధియెటర్ఒనర్లా చెతులుఎత్తెసావ్. ఏమీచెయ్యాలొ తెలియటం లెధురా”. అన్నాడు షణ్ముకం తెగబాదపడుతూ.
“అమ్మ నాకొడకా .. నీబాధఇంధుకా.. నల్లపంధిమాంసంకింధనీమాంసంఅమ్మెయ్యగలను.. తారుడబ్బాలొ స్నానంచేసిన ఫేసునువ్వు... మూవి చూసిమజా చేసుకోవడానికిడబ్బులు ఎలా అని నేను అలొచిస్తుంటే మందు తాగడానికినువ్వుప్లాన్చెస్థున్నవా.. నువ్వుకేకమామ.” అనిచెయ్యెత్తబొయాడు శంకరం.
“ఒరెయ్నువ్వుఊరుకో .. నీకుమూవికావాలి ... నీకు మందు కావాలి. అంతే కధా.. నేనుచెప్పినట్టు చెయ్యండిమనకిరెండూ వస్థాయి”.. అంటూ బయటికిబయలుదేరాడుసత్తి.
“చెప్పినట్టుచెయ్యమనిబయటికిపోతున్నాడుఏంటిరా”.. అనుకుని తెగ ఫీల్ అవ్వసాగాడుషణ్ముకం
“ఒరెయ్నల్లపందిపిల్లలకి తండ్రిపంది, వాడువెల్తుంటే మనల్నికుడా రమ్మనిఅర్ధం”. అనిసత్తివెనుకపరిగెట్టాడు.
కాలేజిహాస్టల్* కిరాగానేవాళ్ళకిఎధురుగా కుమార్* వస్తూకనిపించాడు.... ఒక్కసారిగాసత్తిబలంగా షణ్ముకంకడుపులోగుద్దాడు... షణ్ముకంనొప్పితో అరవగానే
“ఇదేకంటిన్యూచెయ్” అని.. కుమార్* దగ్గరికిపరిగెత్తాడు.
“ ఒరేయ్* కుమార్కొంచెంఅర్జెంట్రా . వీడినిహాస్పిటల్కి తెసుకువెళ్ళాలి. కొంచెంసాయంచెయ్యరా ” అనికుమార్* కి ఎధురువెళ్ళాడు
“ఎమైంధిమామ ఏంటి ప్రాబ్లం. ” అనిపరిగెత్తుకుంటూవచ్చాడు.
“తెలియదురా .ఉదయం నుండి ఇలానేఉన్నాడు. కొంచెంహాస్పిటల్వరకు రాగలవా.. మంత్ఎండింగ్కధరా మనీకుడా లెధు. “
“లేదు మామా డ్యూటీకి టైమ్అయ్యింధి. లెదంటెవచెవాడిని. నాదగ్గర 200 ఉన్నయి. వీడినిహాస్పిటల్కి తీసుకువెళ్ళండి. నేనువఛ్హిచూస్థాను. ” అనితనదగ్గర ఉన్న డబ్బులు ఇచ్చిమౌనంగా సాగిపోయాడు.
“ అలాగేరా నిన్నుతరువాతకలుస్థా.” అనిషణ్ముకంని తీసుకుని పోయారుఆముగ్గురు.
అలా నడుచుకుంటూ సిటీ వరకువచ్చాడు. ఎధురుగా శ్రీక్రిష్ణవేణిస్టార్హోటల్* కనిపించింధి.
నెమ్మదిగాఅందులొ ప్రవేసించాడు. నేరుగాస్టాఫ్రూంలొకివెల్లి డ్రెస్మార్చుకుని వైయటర్ రూపంలొ బయటకువచ్చాడు. డ్యూటీసూపర్వైజర్నికలిసిఈరొజుతనడ్యూటీ ఎక్కడోతెలుసుకుందాంఅనివెతకసాగడు. రిసెప్సన్లొసుజన అందంగానవ్వింది.

“ ఏంటిసర్ ఈరొజు లేట్గా వఛినట్టుఉన్నారు. ఏంటికధ. “ అనిదగ్గరగావచింది.
“ఏమీలెధుకొంచెం కాలేజిలొలేట్అయ్యిందిఅంతే. మీరు ఈరొజుత్వరగా వచినట్టుఉన్నారు. చాలాహుసారుగాఉన్నారుఏంటివిషయం?” అనిరిజిస్టర్లొసంతకంపెడుతూ అడిగాడు.
“ సార్గారు ఈరొజులేట్అనితెలియక త్వరగావచ్చాను. తెలిసుంటేదారిలొ కాపు కాసిఎత్తుకుపొయేదాన్ని.” అనికవ్వింపుగా నవ్వసాగింది.
Like Reply
#5
చూడండి సుజన గారు మీకు చాలా సార్లు చెప్పాను. నాకు ఇలాంటివి నచ్చవు అని. మన స్నెహాన్ని ఎంధుకు ఇలాంటి మాటల తొ పాడు చేస్తారు.. నా పని నన్ను చెసుకొనివ్వండి.. మీ పని మీరు చూసుకోండి.” అని అక్కడ నుండి కదలి వెల్లసాగాడు.
సుజన వెంటనే చెయ్యి పట్టుకుని “ చూడండి కుమార్ మీ మీధ నాకు చాలా గౌరవం ఉంది. అందుకే మీతొ ఇంత ఫ్రీ గా మాట్లాడ గలుగుతున్నాను. మీరంటె నాకు చాలా ఇష్టం. ఆ విషయం మీకు చాలా సార్లు చెప్పాను. కాని మీరు ఇప్పటి వరకు నా మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పటికి అయినా మీ నోట నేను అంటే ఇష్టం ఆనే మాట వింటాను అన్న నమ్మకం నాకు ఉంది. ప్రస్తుతానికి మిమ్మల్ని వదిలి వెయ్యాలి అంటే నాకు ఒక మంచి కాఫీ ఇప్పించండి. మిమ్మల్ని వదిలేస్తా.”
“అయనే ఉంటే మంగలి ఎంధుకు అని.. ఆ డబ్బులె ఉంటే ఇక్కడ పని చెయ్యల్సిన అవసరం ఎముంది. మన ఇద్దరం ఇక్కడ కాఫీ తాగే డబ్బులు నా సగం నెల జీతం. ఎదొ ఇలా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ నా మానన నేను ఉన్నాను.. ఇలా మన ఇద్దరిని సూపర్ వైజర్ చూస్తే అంతే. కాబట్టి మహా తల్లి నన్ను వదిలెయ్” అని అక్కడ నుండి పరిగెత్తాడు.
కుమార్ వెల్లిన వైపు చూసి నవ్వుకుంటూ తన వర్క్ లొ మునిగిపోయింది.
సాయంత్రం డ్యూటీ అవ్వగానే కుమార్ కొసం ఎధురు చుస్తూ ఉంది.
సుజన ని చూడగానే తప్పించు కొవాలని ట్రై చెయసాగాడు.
“ అయ్యో మహానుభావా మిమ్మల్ని నేను ఎమి తినను గాని.. ఇంటికి వెళ్ళడానికి తోడు కొసం చుస్తున్నా. వస్తే కలిసి వెల్ధాం అని చుస్థున్నా”. అని తన దగ్గరికి వచింది.
“ అదేమి లేధండీ ఎవరో పిలిచినట్టు అనిపిస్తేనూ.” అని “వెల్ధాం రండి అని బయలుదేరాడు.
“ ఈ రొజు ఈ రూట్ లొ వద్దు. న్యూ బ్రిడ్జి మీధ నుండి వెల్ధాం అక్కడి వాతావరణం బాగుంటుంది. మీతొ కలిసి వెళ్ళాలని ఉంది. ప్లీజ్ నాకోసం .నో అని చెప్పకుండా రండి.” అని బ్రతిమాలసాగింది.

ఇక తప్పదు అని ‘ సరే అయితే కాని. త్వరగా వెళ్ళాలి. మళ్లీ నాకు ప్రెస్ కి లేట్ అవుతుంది.” అన్నాడు
“ఒహ్హ్ తప్పకుండా” అని ఇద్దరూ నడవ సాగారు.

పది నిముషాలు నడిచే సరికి బ్రిడ్జ్ ఎదురైంధి. రాత్రి 10 కావస్థుంధి. నిండు గర్బిని లా అకాశం లొ చందమామ బారంగా కదులుతుంది. పల్లె పడుచుల నడకంత వయ్యరంగా నాగవళి నది ఒంపులు తిరిగి పారుతుంది. నవంబర్ నెల లొ చలిగాలులు పసిపాపల నవ్వుల్లా గిలిగింతలు పెట్టసాగాయి. అప్పుడే మంచుకురవటం మొదలైంధి. వేగంగా నడవసాగాడు కుమార్.
“ మీరు అలా నడుచుకుంటూ ఒక్కలె వెళ్ళే దానికి నాతొ తోడు రావడం ఎంధుకు.. నాకు కంపెనీ ఇవ్వరా.. ఒక్కదానినే నడవడానికి భయం స్వామి.” అని కొపంగా అరిచింది సుజన.
అప్పుడు గమనించాడు అవును తనని వదిలేసి చాలా దూరం వచ్చేసాడు కుమార్.
రోడ్ మీధ ఎవరు లేరు.. అంతా నిర్మానుష్యంగా ఉంది... అలా వచ్చేసినందుకు తనలో తాను తిట్టుకున్నాడు.
“ త్వరగా రండి.. లేట్ అవుతుంది” . అని ఆగి తన కొసం వైయిట్ చెయ్యసాగాడు.
అప్పటి కే తను బ్రిడ్జ్ మద్యలొ ఉన్నాడు. నెమ్మదిగా తనని చెరుకుంది సుజన.
“ నాకు కొంచెం అలసటగా ఉంది. కొంచెం సెపు కూర్చుంధామా ఇక్కడ.. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్.” అని కుమార్ సమాధానం కొసం చూడకుండా బెంచ్ పై కుర్చిండి పొయింది. చేసేది ఎమి లెక తను కుడా అలానే కూర్చిండి పొయాడు.
“ అయినా నిక్షెపంగా ఆటో లొ వెళ్ళి పొక మీకు ఎంధుకు ఈ శ్రమ”.. అని చిరాకు పడ్డాడు.
“ ఆ సంగతి అలా ఉంచండి.. మీకు ఇప్పుడు ఈ టైమ్ లొ ఎమనిపిస్తుంది” అని చిరునవ్వుతొ తన చెతిని ఆమె చేతిలో తీసుకుంటూ అడిగింధి.
“ప్రెస్ కి లేట్ అవుతుంది.. అక్కడ సూపర్ వైజర్ తిడతాడు అని అనిపిస్తుంది.” అని మ్రుదువుగా తన చెతిని విడిపించుకొవడానికి ట్రై చెస్థూ.
అతని చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని దగ్గరా లాక్కుంది.
తన ముఖాన్ని దగ్గరగా తీసుకుని కళ్ళలొ కి సూటి గా చూడసాగింది. ఆ చూపులకి ఇబ్బంది పడ్డాడు.
తనని పరిశిలనగా చూసాడు.
నది గాలికి ఆమె ముంగురులు ఎగరి పడసాగయి. వెన్నెల కాంతి ఆమె కళ్ళలో వింతగా కనిపించసాగింది. సహజంగా అందంగా ఉండే ఆమె సొగసు ఆ కాంతి లొ ఇంకా అంధంగా కనిపించింధి.
ఆమె తన గుండెలపై తల వాల్చుకుని కావలించుకుని. నిశభ్ధంగా ఉండిపోయింది.
ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ కలగసాగింది. ఆమె లో, తన లో కలుగుతున్న మార్పులు తనకే కొత్తగా అనిపించసాగయి. తన శరిరం వేడెక్కడం తెలుస్తుంది. అంత చలిలో కూడా అరచేతులు చెమటలు పట్టసాగాయి.
ఒక్కసారిగా తన ముఖంపై వెలుతురు పడగానె ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డాడు. ఒక లారీ వెగంగా వెల్లిపొయింది.
తనని ఒక్కసారిగా విదుల్చుకుని.. దూరంగా లేచి నిలబడ్దాడు.
“ఐ యఁ సొరీ... టైమ్ అవుతుంది. ఇక వెళ్దామా.” అని అడిగాడు.
సొరీ .. అని లేచి నడవసాగింది. పది నిముషాల్లో వాళ్ళ ఇంటికి దగ్గరకి చేరుకున్నారు.
“ఉంటాను గుడ్ నైట్ రేపు కలుద్ధాం”..అని వెనక్కు తిరిగాడు.
“ కుమార్ ఒక్క నిముషం .. నీతొ మట్లాడాలి.”
“ ఇప్పటికె లేట్ అయ్యింధి.. రేపు మట్లాడదాం”
“ ఒక్క నిముషం “ అని గట్టిగా కౌగిలించుకొని ఇంట్లొ కి పరిగేత్తింధి.
కుమార్ కి బుర్ర పనిచెయటం మానేసింది.
అక్కడికి దగ్గరలొ ఉన్న రూం కి బయలుదేరాడు. అంతలొ ప్రెస్ కి వెళ్లాలి అని గుర్తుకు వచ్చి అటువైపు వెళ్ళాడు.. ఈ అమ్మాయి తొ జాగ్రత్తగా ఉండాలి అని గట్టిగా అనుకున్నాడు.
డ్యూటి ముగించుకుని రూం చేరే సరికి టైం 1.30 దాటింది..
రూం లొ తన జూనియర్ వర్మ ముసుగుతన్ని పడుకున్నాడు..
తనకి కూడా అలసట గా అనిపించి పడుకున్నాడు.
Like Reply




Users browsing this thread: 1 Guest(s)