Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రానా సంగ్రామ్ సింగ్...by kittiboy
#1
Heart 
     రానా సంగ్రామ్ సింగ్
[Image: th-2.jpg]

                            ...by kittiboy
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
నేనొక బాటసారిని ...........నా దేశం పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా ఏమి చెయ్యాలో పాలుపోవటం లేదు.బాబర్ ఫిరంగుల మోత ఇంకా నా చెవుల్లో మార్మోగుతోంది. ఈ దేశం పరాయి పాలకులకు అప్పచెప్పడానికి ఒక దేశద్రోహి నడుం కట్టాడు. ..వాడి పేరే శిలహాది .వాడి వల్లే బాబర్ చేతిలో నేను ఓడిపోయాను. నేను ఏనాటికైనా ఈ పాలకులను వెనక్కి ప్రాలద్రోలుతాను .
నా పేరు రానా సంగ్రామ్ సింగ్.
నా గురించి నా వంటి మీద 80 గాట్లు, సోదరుని చేతిలో కోల్పోయిన నా కుడికన్నుని, చలనం లేని నా కుడి చెయ్యిని ,కుంటుతున్న నా కుడికాలు మీకు చెబుతాయి.
నాకు ఈ ప్రపంచo లో మిగిలింది ఏమిటి అంటే ఈ అరబ్బులను ఈ పుణ్య భూమి నుండి ప్రాలద్రోలాలి.
నా సంస్థానం పేరు మేవాడ్ .అసమాన ధైర్య సాహసాలకు పెట్టనికోట.
అసలేం జరిగిందంటే
Like Reply
#3
అసలేం జరిగిందంటే ఈ పుణ్యభూమి లో పరాయి దాడులకు రాజా జై సిoగ్ భాద్యుడు.
ఘాండవల రాజు రాజా జై సిoగ్ రాథోడ్ గారాలపట్టి సంయుక్త .అపురూప సౌందర్య రాశి .ఆమె సౌందర్యం కు ఆమె పరాక్రమం,మేధస్సు మరింత ఇనుమడింప చేసాయి.చెలికత్తెల ద్వారా ఆరడుగుల అందగాడు, అపజయం ఎరుగని యోధుడు ఐన పృద్విరాజ్ చౌహన్ గురించి తెలుసుకుంది. రాథోడ్ వంశానికి ,చౌహన్ వారికీ అంతర్గత విభేదాలు ఉన్నాయి.
అందువలన ఒకరి గురించి ఒకరికి తెలిసినా కలువలేక పోయారు .
కొంతమంది చెలికత్తెలు ప్రాణాలకు తెగించి ఇద్దరు కలుసుకునేలా చేసారు .ఇద్దరు ఒకరినొకరు చూసుకుని జీవితాంతం కలిసుండాలని నిశ్చయించుకున్నారు .నల దమయంతుల్ని మించిపోయారు.
వీరి రహస్య ప్రేమాయణం తెల్సిన రాజా జై సింగ్ ,కోపంతో ఉగిపోతూ హుటాహుటిన యువరాణికి స్వయంవరం ఏర్పాటు చేసాడు.
పృథ్వి రాజ్ చౌహన్ ను పిలవలేదు .పైపెచ్చు అతన్ని అవమానించడానికి ద్వారపాలకుని స్థానం లో పృథ్వి రాజ్ చౌహన్ విగ్రహం పెట్టాడు.
యువరాణి ని తనకు నచ్చిన వారి మెడలో వరమాల వెయ్యాలని ఆజ్ఞ .వెంటనే ఆమె విగ్రహం మెడలో వేసింది.
అంతలో పృథ్వి రాజ్ చౌహన్ ముసుగు తీసి సంయుక్త ని తీసుకుని కోటలోంచి పారిపోయాడు .
ఆగ్రహం తట్టుకోలేక పృథ్వి రాజ్ చౌహన్ ను ఎలాగైనా నాశనం చేస్తానని శపధం చేసాడు రాజా జై సింగ్ .

ఆగ్రహం తట్టుకోలేక పృథ్వి రాజ్ చౌహన్ ను ఎలాగైనా నాశనం చేస్తానని శపధం చేసాడు రాజా జై సింగ్ .
కానౌజ్ రాజ్యం ఖైబర్ కనుమ కు అనుకోని ఉంది .చాల దూరం వరకు నలుగురి కే సరిపోయే ఇరుకైన దారి అది .దానినుంచి గ్రీకు వీరుడు అలెగ్జాండర్ మన హిందూదేశం లోకి వచ్చాడు. పరాయి దేశాలకు మనకు ఇదే రక్షణ కవచం .వివేచన కోల్పోయిన జైసింగ్ పరాయి దేశం లో కరుడుకట్టిన నాయకుడైన ఘోరీ ని కొన్ని రాజ్యాలు ,సంపద ఆశ చూపి పృద్విరాజ్ చౌహన్ మీదకి పంపాడు ,ఎదురుగ అతనికి ఎదురొడ్డే ధైర్యం లేక .
పరాయి దేశం వారి యుద్ధనీతి వేరు .ఎడారి లో పుట్టిపెరిగిన వారి కి సస్యశ్యామలం గా సరస్వతి నది వరప్రసాదిని ఐన మన దేశాన్ని చూసి కన్ను కుట్టింది .తెలివైన ఘోరీ తన ఎడారి యుద్ధతంత్రం ఉపయోగించాడు . ఒక సాధువు ను తన దేశం నుండి పృథ్విరాజ్ చౌహన్ వద్దకు పంపించాడు.ఆయన చౌహన్ రాజ్యం బయట ఒక ఆశ్రమం కట్టుకొని తన ప్రవచనాల ద్వారా శిష్య గణాన్ని ఏర్పరిచాడు.
జైసింగ్ దగ్గర చౌహన్ రహస్యాలు అన్ని తెలుసుకొని యుద్ధం ప్రకటించాడు ఘోరీ .
టెర్రాయిన్ ప్రాంతం లో యుద్ధం మొదలైంది. ఘోరీ యొక్క సాయుధ దళానికి రాజపుత్రులు తల వంచారు. వారు మెల్లగా శక్తీ పుంజుకున్నారు .కానీ ఎక్కడో నీరసం ఆవహించింది వారికీ. ఇంతలో ఘోరీ సైన్యాన్ని ౩౦౦౦ ఏనుగులు చుట్టుముట్టి కకావికలు గావించాయి. పృథ్విరాజ్ విసిరిన బళ్ళెం ఘోరీ భుజం లో గుచ్చుకుంది .నాయకుడు పడిపోయిన తర్వాత సైన్యం జావకారిపోయింది. ఘోరీ ని పట్టుకుని పృథ్విరాజ్ చౌహన్ వద్దకు వచ్చారు . పృథ్వి రాజ్ జైసింగ్ గురించి తెలుసుకొని ,ఎడారి లోకి పోయి బతుకు ఫో అన్నాడు, మంత్రులు చంపేయమని వారిస్తున్నా కూడా .
ఘోరీ పారిపోయాడు.
పృద్విరాజ్ చౌహన్ సంయుక్త తో కలిసి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు. అందరు రాజు గారి స్త్రీలోలత్వం చూసుకొని తిట్టుకున్నారు. కానీ మధ్య మధ్య లో సమాచారం తెలుసుకొని ,రాజ్యం చుట్టూ పహారా, సైన్యం కట్టుదిట్టం చేసాడు.
కానీ రాజు గారి లీల లు చూసి అందరు సౌందర్యపోషకులు అయ్యారు.
అనుకున్నట్టు గా ఘోరీ మళ్ళీ రెండింతలు సైన్యం తో వచ్చాడు .
పృథ్విరాజ్ సైన్యం మళ్ళీ యుద్ధానికి సన్నద్ధం అయినది .౧౫౦ (150 ) మంది రాజపుత్ర రాజులను కలుపు కొని మళ్ళీ యుద్ధం మొదలెట్టాడు.
వేగుల ద్వారా పృథ్విరాజ్ బలం ముందే తెలుసుకున్నాడు ఘోరీ .కానీ మళ్ళీ కధ మొదటికి వచ్చింది .రాజపుత్రుల చేతిలో చావుదెబ్బ తిన్నారు ఘోరీ సేన. పారిపోతున్న సైన్యాన్ని వెంబడించారు పృథ్విరాజ్ సైన్యం .ఒక చోట సూర్యాస్తమయం తర్వాత సేద తీరారు సైన్యం. విజయసంబరాలు మిన్నుమింటాయి .ఇంతలో రాత్రి ఘోరీ సైన్యం ఘోరం గా చౌహా సైన్యం మీద పడింది ,.సైనికులు నీరసపడిపోయి, ఏమి చేయలేకపోయారు .వెనుక నుండి రాజ్యం నుండి వచ్చిన బలగాలు అక్కడున్న బలగాలను చూసి ఆశ్చర్యపోయాయి. ఏనుగులు నడవటం లేదు. గుర్రాలు రక్తం కక్కుకు చచ్చిపోయాయి. అప్పుడు మంత్రికి గుర్తుకు వచ్చింది సాధువు శిష్యులు అటువైపు వెళ్లడం.నీచులు నీళ్లల్లో విషం కలిపారు. పృథ్విరాజ్ అనుకున్నాడు ఆ సాధువును తన అమ్మ చెప్పినా చంపకుండా వదిలేసాను అని. ..రాజపుత్ర సైన్యం అంతా ఊచకోత కోయబడ్డది .ఇంకా పృథ్విరాజ్ ను పట్టుకొని ఘోరీ వద్దకు తీసుకువెళ్లారు .ఘోరీ కళ్ళు దించ మన్నాడు చౌహన్ ని ....అది వీరుల లక్షణం కాదు అన్నాడు పృద్విరాజ్ చౌహన్ .ఇంకా చేసేది లేక చౌహన్ కళ్ళు పొడిచేసి, అన్నాడు నిన్ను వదిలేయడనికి నేనేమి నీలాగా మూర్ఖుడిని కాదు అని. ...ఇంతలో ఆ సాధువు వచ్చాడు ....ఘోరీ అతనికి నమస్కరించాడు .సంయుక్త పరాయి వాళ్ళ వల్ల తన అభిమానభంగం కాకుండా నిప్పుల లోకి దూకింది.ఆమెను చెరచాలని చుసిన ఘోరికి శృంగభంగం అయ్యింది .ఈ విషయం విని జైసింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు .పృద్విరాజ్ ను తన స్థావరానికి తీసుకెళ్లాడు అరాచ అరాచక వధించాడు ఘోరీ. చౌహన్ తలను సాధువు కు బహూకరించాడు.
ఇది నా మాతృభూమి కన్నీటి వ్యధ.
Like Reply
#4
ఇలా మొదలైన పన్నాగాలపరంపర తో అరబ్బుల పాలన మన దేశం లో మొదలైనది.
నా తండ్రి రైమాల్ నుండి నాకు మేవాడ్ సంస్థానం దక్కింది. మన హిందూ దేశం ఇలా అస్తవ్యస్తం కావటానికి ప్రధాన కారణం ఐక్యత లేకపొవటం .అందువల్ల చిన్న రాజ్యాలన్నీ ఏకతాటి పైకి వచ్చేలా కృషి చేసాను .
నా గురించి తెలుసుకునే ముందు నా శత్రువు బాబర్ గురించి మీరు తెలుసుకోవాలి .అరబ్బు ఎడారిలో ఒక పేరున్న కిరాతక వీరుడు బాబర్. తన ధైర్యసాహసాల గురించి తన దగ్గర ఉన్న కవులతో గ్రంధాలు రాయించేవాడు బాబర్. బాబర్ యుద్ధ నీతి ఆటవికం గా ఉండేది.ఊచకోత తనకు ఆటవిడుపు. రాజ్యాల కోసం తోబుట్టువులను మట్టునపెట్టే చరిత్ర కలిగిన వారు.
ఇబ్రహీం లోడి ఢిల్లీ సంస్థానాధీశుడు ,ఇతను బాబర్ దండయాత్రను సమర్ధవంతంగా తిప్పి కొట్టాడు .వేల ఏనుగుల బలం కలిగిన లోడి బాబర్ తుపాకులను ,ఫిరంగులను లెక్క చేయలేదు .కానీ అతని మావయ్య ఆలం ఖాన్ లోడి సింహాసన కాంక్ష తో బాబర్ తో కలిసి పన్నాగం పన్నాడు .
పానిపట్టు దగ్గర యుద్ధం మొదలైంది ,బాబర్ తన కొడుకు హుమాయూన్ తో కలసి ౧౦, ౦౦౦ (10000 ) మంది ,ఫిరంగులు ,మందుసామాగ్రి తో వచ్చాడు. లొడి తన సామంతులు రహస్యం గా ౧, ౫౦, ౦౦౦ (150000 ) సైన్యం పోగయ్యింది .దీంతో బాబర్ హడలిపోయాడు .చేసేది లేక యుద్ధం మధ్యలో ఆలం ఖాన్ లోడి తన మేనల్లుడు ఇబ్రహీం లోడి ని వెనుక నుండి పొడిచాడు .రాజు చెనిపోయేసరికి సైనికులు మిన్నకుండిపోయారు .ఇంతలో బాబర్ చేతిలో ఇబ్రహీం లోడి చెనిపోయాడని పుకారు పుట్టించారు .దగాకోరు తనం తో ఢిల్లీ ని చేజిక్కించుకున్నాడు బాబర్ .
లోడి మీద యుద్ధానికి నేను బాబర్ కి సహాయం చెయ్యలేదని నేను తనని నమ్మకద్రోహం చేసానని పుకార్లు పుట్టించాడు .
ఇబ్రహీం లోడి ని నేను ధోల్పూర్,కటోలి యుద్ధాల్లో రెండు సార్లు ఓడించాను .

ఇబ్రహీం లోడి ని నేను ధోల్పూర్,కటోలి యుద్ధాల్లో రెండు సార్లు ఓడించాను .
ఇబ్రహీం లోడి కొన్ని వేల మంది సైన్యం తో నా మీదకు యుద్దానికి వచ్చాడు .వందల ఏనుగులు, బలమైన అశ్వదళం తో రాజపుత్రుల సహకారం తో వేళా సైన్యాన్ని తునాతునకలు చేశాను .కటోలి లో పోరాటం లో నా కుడిచెయ్యి పోగొట్టుకున్నాను.
బాణం వచ్చి గుచ్చుకోవడం తో నడక కుంటుబారింది .
తర్వాతి రోజు మేవార్ సంస్థానం లో సభ ఏర్పాటయింది.
నేను సభకు వచ్చి మంత్రుల మధ్యలో కూర్చున్నాను .అందరు ఆశ్చర్యపోయి మహారాజ ఏమిటిది అన్నారు .
నేను ఇలా బదులిచ్చాను "రాజు పరిపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే రాజ్యం ప్రజ్వరిల్లుతుంది ,నేను ఆ పరిస్థితి లో లేను ,కాబట్టి యోగ్యులకు రాజ్యాధికారం కట్టబెట్టండి అని చెప్పను. "
అప్పుడు సామంతులు అందరు ఇలా అన్నారు ,రాజా గుండెధైర్యం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు .అయినా మీరు మీకున్నది అవిటి తనం అనుకుంటున్నారు ,మేము యుద్దవీర సంకేతం అని అనుకుంటున్నాము. గుండెధైర్యం,పోరాటపటిమ మీ వద్ద పుష్కలం గా ఉంది ,అరబ్బులను నిలువరించి మాతృభూమి ని కాపాడ గల బెబ్బులి మీరే అని సింహాసనం మీద రాణా ని కూర్చోబెట్టారు .
ఇంతలో ధోల్పూర్ లో ఇబ్రహీం లోడి ,గుజరాత్ మరియు మాల్వా సుల్తానులతో కలసి సైన్యం తో దాడి చేసాడు .సైన్యం సమకూర్చుకోవడానికి సమయం లేక మాకు మూడింతలు ఉన్న సైన్యం తో కలబడ్డాము . ఒంటిచేత్తో మూడు పెద్ద రాజ్యాల సైన్యాల్ని మట్టికరిపించాను .అశ్వదళం యొక్క వేగాన్ని సుల్తానులు నిలువరించలేకపోయారు .దాంతో లోడి ఆక్రమించుకున్న రాజ్యాలన్నీ వారి రాజులకు అప్పగించాను.
ఇప్పటివరకు పక్కలో బల్లెం లాగా ఉన్న గుజరాత్ సుల్తానుని కూడా గర్వం అణిచి ప్రాణభిక్ష పెట్టాను.
ముందు అన్ని యుద్ధాలలో శత్రువుని ఓడించడం ఒకటే విజయం ల భావించాను,యుద్ధం తర్వాత వారిని గౌరవం గా సామంతులను చేసుకునేవాడిని .అది నా పూర్వికులు నేర్పిన పాఠం .యుద్ధం అంటే శత్రువుని జయించడం మాత్రమే, చంపడం కాదు అని. ఓడించిన రాజ్యాల ప్రజలను కూడా క్షమించి వదిలేసేవాడిని .అలా చేయడం వాల్ల వారిలో నాకు గౌరవం పెరిగింది .
ఉత్తరభారతం లో అందరి సుల్తానులను ఓడించాను ,నా గురించి వింటే బాబర్ కు వెన్నులో చలిపుట్టింది .వెంటనే నా మీద విజయం దక్కాలని మద్యం మాని వేసాడు .సైన్యం తో ఈ యుద్ధం పవిత్రమైనదని ,ఎలాగైనా గెలిచి స్వర్గసుఖాలు అనుభవించాలని మనోధైర్యం నూరిపోశాడు .
ఆ రోజు రానే వచ్చింది .

సంధి కోసం రైసెన్ రాజు శిలాహాది ని బాబర్ వద్దకు పంపాను.బాబర్ యుద్ధం అనివార్యం అని శిలాహాది చేత వార్త పంపించాడు .
నా వ్యూహం ఏమిటంటే కుడివైపు పటాలాన్ని బాబర్ కొడుకు హుమాయూన్ చూస్తున్నాడు .ఎడమవైపు అరబ్బు వీరులు ఉన్నారు . మధ్యలో బాబర్ ఉన్నాడు .
బాబర్ వద్ద ఫిరంగులు ఉన్నాయని వేగుల ద్వారా తెలిసి ఏనుగులకు చెవులచుట్టూ దొంతరలు కట్టాము .
కుడివైపు ఉన్న పటాలన్ని నేను అశ్వదళం తో దాడి చేశాను .ఫిరంగుల దెబ్బతో మా దళం కకావికలైనా ఎదురొడ్డి పోరాటం సాగించాము .
శిలాహాది ని మా కుటుంబం లో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఒప్పందం కుదుర్చుకున్నాము .కానీ నీచుడికి అది సరిపోలేదు .బాబర్ కి తొత్తు గా మారి నన్ను ముంచేశాడు .
ఎడమ వైపు వాడిని చూసుకోమని చెప్పాను ,౩౦౦౦౦ సైన్యం తో సరైన సమయం లో బాబర్ దగ్గరకు వెళ్ళిపోయాడు ,మాతృభూమి కి తీరని అన్యాయం చేసాడు ,రెండు వైపులా సైన్యం చుట్టుముట్టడం తో మా బలగం రక్తసిక్తం అయ్యి ఆత్మరక్షణ లో పడింది ,అప్పుడు బాబర్ సైన్యం కొత్త ఆయుధాన్ని తీశారు .చేతి లో ఒక గొట్టం తో పేలుస్తున్నారు ,నా సైన్యం లో ఒక్కొక్కరు నెలకొరుగుతున్నారు. ఇంతలో ఒక గుండు నాకు తగిలింది ,స్పృహ తప్పి పడిపోయాను .సైన్యం నన్ను అడవుల్లోకి తీసుకెళ్లింది.
నా పరాజయం నా మాతృభూమి కి అశనిపాతం అయ్యింది.
అడవుల్లో సైన్యాన్ని పోగుచేసాను ,మళ్ళీ బాబర్ పై యుద్ధభేరి మోగించడానికి ........
ఇంతలో తనను ఎక్కడ చంపుతానోనని శిలాహాది నన్ను విషప్రయోగం చేసి చంపేశాడు .........
నేను రాణా సంగ్రామ్ సింగ్ ఆత్మ ని ....చిత్తోర్గర్ కోట చుట్టూ తిరుగుతున్నాను ....ఎప్పటికైనా నా వారసులు వస్తారు అని ,నా కోరిక తీరుస్తారని ......
Like Reply
#5
నేను రాణా సంగ్రామ్ సింగ్ ఆత్మ ని ....చిత్తోర్గర్ కోట చుట్టూ తిరుగుతున్నాను ....ఎప్పటికైనా నా వారసులు వస్తారు అని ,నా కోరిక తీరుస్తారని ........

నా కుమారుల ధీరత్వం నా సామ్రాజ్యాన్ని వెనక్కు తీసుకురాలేకపోయింది .వారు బాబర్ సామంతులయ్యారు.

బహదూర్ షా రెండు సార్లు నా కోటమీద దండెత్తి సంపదనంతా కొల్లగొట్టాడు .

రెండవ సారి దండెత్తి వచ్చినప్పుడు బాబర్ కొడుకు హుమాయూన్ కి నా భార్య రాఖి పంపించి సహాయం అడిగింది .

బెంగాల్ దేశం మీద దండయాత్ర కు వెళ్లిన హుమాయూన్ సకాలం లో చేరుకోలేకపోయారు .దాంతో నా భార్య కర్ణావతి దేవి అగ్ని లో దూకి ఆహుతయ్యింది (జౌహర్ ).......

ఇదంతా చూసి నా ఆత్మ క్షోభించింది ........ఇంకో విషయం చూసి నా బాధ రెట్టింపైంది .....

నా కొడుకులను కాపాడమని నా భార్య పన్నా దాయి కి చెప్పింది. నేను బ్రతికున్నప్పుడే నలుగురు కుమారులను పోగొట్టుకున్నాను. తర్వాత విక్రమ్ సింగ్ తన మూర్ఖత్వం తో రాజ్యకాంక్ష ఉన్న బాన్వీర్ చేతిలో హతమయ్యాడు .ఇంక మిగిలిన ఒకే ఒక్క వారసుడు ఉదయ్ సింగ్ .

పసివాడైన ఉదయసింగ్ ను చంపడానికి వచ్చాడు బాన్వీర్ .ఇంతలో పన్నా దాయి తన కుమారుడిని రాకుమారుని స్తానం లో పడుకోబెట్టి ,ఉదయసింగ్ ను ఒక బుట్టలో పెట్టి నది దాటించి అడివి లో వేచి ఉండమని చెప్పింది.

బాన్వీర్ రాకుమారుడి స్తానం లో ఉన్న పన్నా దాయి కొడుకుని చంపేశాడు .

రాకుమారులిద్దరిని చంపివేసి ఇక రాజ్యానికి రాజుని నేనే అని ప్రకటించాడు బాన్వీర్.

కొడుకు కాలిపోతుంటే చూసి ఏడుస్తూ రాకుమారుడు ఉదయసింగ్ ను అడవి లోంచి కొండల్లోకి తీసుకుపోయింది .

అక్కడి బిల్లు తెగ వారివద్ద పెంచింది పన్నా దాయి .

ఆమె చేసిన త్యాగం తో నా వంశం నిలబడింది ......ఆమెకు నా వంశం రుణపడి ఉంది. ........

ఆమె త్యాగ ఫలితం గా ఉదయ్ సింగ్ నాలుగు సంవత్సరాల తర్వాత సైన్యం సమీకరించి బాన్వీర్ ని ఓడించి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని స్థిరం గా పాలించాడు .

కానీ బాబర్ మనుమడు అక్బర్ నా కోటను ముట్టడి చేసి కోటాలో ఉన్నవారందరిని ఊచకోత కోసి ,వారి పుర్రెలు మార్గమధ్యం లో వేలాడదీసాడు ...........

ఇదంతా చూసి నాకు నమ్మకం పోయింది ......నిరాశ నిస్పృహ ఆవహించాయి .............

కానీ నా మనుమడు పెద్ద పులి లా గాండ్రించి ,అష్ట కష్టాలు ఓర్చి నా కల నెరవేర్చాడు ..........

వాడే రానా ప్రతాప్ సింగ్


______________________________
Like Reply




Users browsing this thread: 2 Guest(s)