23-10-2019, 09:04 AM
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు
కవ్వింత... by ramesh
|
23-10-2019, 09:04 AM
23-10-2019, 09:06 AM
మై డియర్ స్టాఫ్ మెంబర్స్, పే అటెన్షన్" అంటూ వచ్చాడు అమృత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎం.డి. అందరూ లేచి నిలబడ్డారు.
"టుడే ఐ యాం గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ మై వన్ అండ్ ఓన్లీ డాటర్ అండ్ ది మేనజింగ్ డైరెక్టర్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీస్ మిస్ అమృత" అంటూ తన కూతురిని పిలిచాడు. అందరూ చూస్తుండగా ఒక అమ్మాయి బ్లూ కలర్ చుడిదార్ లో దర్శనం ఇచ్చింది. చూడడానికి చాలా అందంగా ఉంది. తనని చూస్తే మూగవాడు కూడా కవితలు చెప్పేస్తాడు. అంత అందంగా ఉంది తను. ఆఫీస్ లో ఉన్న అమ్మాయిలకు ఈర్ష్య కలిగిస్తూ, అబ్బాయిలకు బాధను కలిగిస్తూ తను అలా నడుచుకుంటూ వెళుతూ తన డాడీ పక్కన నిలబడింది. "ఇక నుండి నా కూతురు కూడా మన ఆఫీస్ పనులు చూసుకుంటుంది" అన్నాడు కృష్ణమూర్తి. "ఇంతకాలం మీ కూతుర్ని పరిచయం చేయకపోవడానికి గల కారణం ఏంటి సార్?" అంటూ అడిగాడు మేనేజర్ గిరిధర్. "దానికి పెద్ద రహస్యాలు అంటూ ఏమి లేవండి. నేనే నా ఎం.బి.ఏ కోర్స్ పూర్తయ్యేదాకా వద్దు అని చెప్పాను" అంటూ బదులిచ్చింది. ఆ మాటలు వింటే చెవిటివాళ్లు చాలా దురదృష్టవంతులు అనిపిస్తుంది ఎవరికైనా. తన కూతురికి స్టాఫ్ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తున్నాడు కృష్ణమూర్తి. అందరినీ పరిచయం చేశాడు కానీ ఒక్క వ్యక్తిని పరిచయం చేయలేదు. అతడే అసిస్టెంట్ మేనేజర్ సాయి మహేష్. అతడి గురించి మేనేజర్ ను అడిగాడు. "ఇంకా రాలేదు సార్" అంటూ బదులిచ్చాడు గిరిధర్. "వీడికి ఆఫీస్ కన్నా సమాజమే ఎక్కువ" అంటూ నసిగాడు కృష్ణమూర్తి. "ఏమైంది డాడీ" "ఏం లేదు మేడం అసిస్టెంట్ మేనేజర్ మహేష్ ఇంకా రాలేదు. అందుకు సార్ కి కోపం వచ్చింది" అంటూ చెప్పాడు మేనేజర్. "కొపం ఏమి కాదమ్మా. మహేష్ వట్టి అమాయకుడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే తట్టుకోలేడు. అలాంటివారి పైన కోపం ఎందుకు ఉంటుంది?" "నిజమే ప్రేమ ఉంటుంది వీలైతే పెరుగుతుంది" అంటూ తండ్రికి వంత పాడింది. "తండ్రికి తగ్గ కూతురు. మహేష్ భలే ఛాన్స్ పట్టేశావ్" అంటూ మనసులోనే మహేష్ ని తిట్టుకోసాగాడు. "ఆ మహేష్ ని ఒకసారి చూడాలి డాడీ" "ఎక్కడికి పోతాడమ్మా? ఇక్కడికే వస్తాడు కదా. ఎంత లేట్ అయినా ఆఫీస్ కి వచ్చి పోవాలి అని వాడికి ఆర్డర్ వేశాను" "ఎందుకు?" "ఎందుకేమిటి? వాడ్ని చూడకపోతే నాకు కాళ్లు చేతులు ఆడవు. వాడు నాకో వ్యసనం" "మీరు మాత్రం వాడ్ని నమ్ముకుంటే నాశనం" మాళ్లీ గొణుక్కున్నాడు గిరిధర్. "వావ్...! మీరు సర్టిఫికేట్ ఇచ్చారంటే ఖచ్చితంగా చూసి తీరాలి" "అలాగే పదమ్మా. నా చాంబర్ చూపిస్తా" వారిద్దరితోపాటు మేనేజర్ గిరి కూడా కదలబోతుంటే మూర్తి అతడ్ని ఆపి "ఇక మీరు వర్క్ లోకి వెళ్లండి గిరిధర్" అని అతడ్ని పంపించేసి కూతురితోపాటు అతడి చాంబర్ వైపు కదిలాడు. ఇద్దరూ చాంబర్ లోకి వెళ్లిపోయారు. ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకునే సరికి లంచ్ టైం అయ్యింది. కృష్ణమూర్తి అతడి టెలిఫోన్ రిసీవర్ తీసుకుని ఏదో డయల్ చేసి "గిరి కం టు మై చాంబర్" అని ఆర్డర్ వేశాడు. "ఓకే సార్" అంటూ రెస్పాన్స్ ఇచ్చాడు గిరి. అర నిమిషంలో తన దగ్గరికి వచ్చాడు గిరి. "ఎస్ సార్" "మహేష్ వచ్చాడా?" "లేదు సార్" "అతడి ఫోన్ నంబర్ ఏదైనా ఉందా?" "ఒన్ సెకండ్ సార్" అంటూ రెసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి అతడి నంబర్ తెచ్చాడు. "దిస్ ఈజ్ హిస్ నంబర్ సార్" అంటూ మూర్తికిచ్చాడు. ఆ నంబర్ తీసుకుని తన మొబైల్ ఫోన్ నుండి డయల్ చేశాడు. కాసేపు రింగ్ అయిన తరువాత అటువైపు ఒక ఆడ గొంతు "హలో" అని వినిపించింది మూర్తికి. "అక్కడ మహేష్ ఉన్నాడా?" అడిగాడు ఆమెను. "అతడికి ఆక్సిడెంట్ అయ్యింది. ప్రస్తుతం స్పృహలో లేడు. మీరు కాసేపు ఆగి ఫోన్ చేయండి" "ఆక్సిడెంటా? ఎక్కడా? ఏ హాస్పిటల్ లో ఉన్నాడు?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మూర్తి. తండ్రి కంగారు చూసి అమృత కూడ కంగారు పడసాగింది. "కంగారు పడాల్సిన అవసరం లేదు. హి ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్" అంది. "ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?" అదే కంగారుతో మాట్లాడుతున్నాడు మూర్తి. "గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాడు" అంది. "మీరెవరు?" అంటూ ప్రశ్నించాడు మూర్తి. "నేను ఇక్కడే పని చేస్తున్న నర్స్ ని" అంది. వెంటనే కాల్ కట్ చేసి తన కూతురికి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లబోయాడు. "ఏమైంది డాడీ?" "మహేష్ కి ఆక్సిడెంట్ అయ్యిందంటా" "అయ్యో!" "కంగారు పడాల్సిన పనిలేదు. బాగానే ఉన్నాడట. నేను వెళ్లి ఒకసారి చూసి వస్తాను" అంటూ కదలబోయాడు. "ఆగండి డాడీ నేను వస్తాను" అంటూ వచ్చింది అమృత. "గిరి.... డ్రైవర్ కి కాల్ చేసి కార్ తీయమని చెప్పు" అంటూ తన కూతురితో సహా బయలుదేరాడు మూర్తి. కార్లోకి ఎక్కి "గవర్నమెంట్ హాస్పిటల్ కి పోనివ్వు" అంటూ డ్రైవర్ కి చెప్పాడు. ఏ.సి కార్లో కూడా తండ్రికి పడుతున్న చెమటలు చూసి "అతడికి ఏమి అవ్వదు డాడీ. హి విల్ బి ఆల్ రైట్" అంటూ తండ్రి చేతి పై తన చేయి వేసి ధైర్యం చెప్పింది. "నీకు తెలీదమ్మా. ఇలాగే ఒకసారి నాకు జరగాల్సింది. నన్ను కాపాడి వాడు వారం రోజులు మంచం పై ఉండిపోయాడు. వాడు కానీ లేకపోయి ఉంటే మీ నాన్న నీకు ఉండేవాడు కాదు" అంటూ తన కళ్లలో తిరుగుతున్న నీళ్లను కర్చీఫ్ తో తుడుచుకున్నాడు. "ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు?" "నువ్వు లక్నోలో చదువుకుంటున్నావు. నీకు చెప్పి నీ స్టడీస్ డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేక చెప్పలేదు బంగారం" అన్నాడు. కారు పది నిమిషాలలో గవర్నమెంటు హాస్పిటల్ కు చేరుకుంది. కారు దిగి వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న తండ్రితో పాటు నడవలేక పోతోంది అమృత. అతడు ఎంట్రెన్స్ లోకి వెళ్లగానే అతడికి ఎదురుపడ్డాడు మహేష్. చేతికి కట్టుతో, చిన్నగా కుంటుతున్నాడు. పరుగులాంటి నడకతో అతడి దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు మూర్తి. "మీరేంటి సార్ ఇక్కడ?" అంటూ మూర్తిని పలకరించాడు మహేష్. "నీకెలా ఉంది?" "నాకు బాగానే ఉంది సార్" "అయినా ఎక్కడికీ వెళ్తున్నావ్?" "వాళ్ల బాస్ కాల్ చేశాడని బయలుదేరాడు. మేము కదలకూడదు ఎంత చెబుతున్నా వినడంలేదు" అంటూ చెప్పింది పక్కనే ఉన్న నర్స్. అక్కడ జరుగుతున్నదంతా తండ్రి వెనకాల నడుచుకుంటూ వస్తున్న అమృత చూస్తోంది. కానీ తనకి తండ్రి అడ్డుగా ఉండటం వలన మహేష్ ఆమెకు కనిపించడం లేదు. "మీరెందుకు వచ్చారు సార్ ఇక్కడికి?" మహేష్ మళ్లీ అడిగాడు అతడి బాస్ ని. "నీకోసమే వచ్చాను" "నాకోసం మీరు రావడం ఏంటండి? మీరు వేసిన ఆర్డర్ నాకు గుర్తుంది" "నేనే కాదు నిన్ను చూడటానికి నా కూతురు కూడా వచ్చింది" అంటూ అమృతను చూపించాడు. అమృతను చూడగానే షాక్ లో ఉండిపోయాడు మహేష్. మహేష్ ని చూసిన అమృత పరిస్థితి కూడా అంతే. ఇద్దరికీ నోట మాట రాలేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు.
23-10-2019, 09:07 AM
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వస్తోంది అమృత. ఆమె షాక్ నుండి కోలుకోవడానికి చాలా తక్కువ సమయమే పట్టింది. కానీ మహేష్ మాత్రం ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. అమృత ముఖంలో చిన్నగా నవ్వు స్టార్ట్ అయ్యింది. అది గమనించిన మహేష్ భూమి కంపించినంతగా వణికిపోసాగాడు. తను అలా నడుచుకుంటూ వచ్చి "హాయ్ మహేష్ గారు" అని చేయి చాపింది.
అతడు ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. అది గమనించిన అమృత తనలో తానే నవ్వుకొని మళ్లీ "హాయ్ మహేష్ గారు" అంది. కానీ ఆమెకు చేతిని అందించే పరిస్థితిలో అతను లేడు (ఎందుకంటే చేతికి కట్టు కట్టారు కాబట్టి). అప్పటికి అర్థమయ్యింది అమృతకి అతడిని ఎటువంటి పరిస్థితుల్లో చూసిందో. వెంటనే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. "హాయ్ బట్ సారీ మేడం" అన్నాడు. "అదేంటయ్యా హాయ్ చెబితే సారీ చెబుతున్నావ్?" అన్నాడు మూర్తి. "తనకు చేయి అందించలేకపోతున్నందుకు సార్" అన్నాడు మహేష్. అతడు అన్న మాటలు మూర్తికి ఒక రకంగా, అమృతకి ఇంకో రకంగా అర్థమయ్యాయి. "దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావ్? నీ పరిస్థితి అలాంటిది" అన్నాడు మూర్తి. ఆ మాట అనగానే కొంచెం ధైర్యంగా అమృత వైపు చూశాడు మహేష్. అతడి చూపులను అర్థం చేసుకున్న అమృత వెంటనే "లేదు డాడీ ఎప్పటికైనా అతడి చేతిని అందుకుని తీరతా" అంది అమృత నవ్వుతున్న మహేష్ ని కోపంగా చూస్తూ. "ఏంటమ్మా?" అన్నాడు మూర్తి. "సార్ మీరు ఎక్కువ సేపు నిలబడకూడదు" అంది నర్స్. "ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటండి?" అని అడిగింది అమృత. "వారం రోజులు రెస్ట్ తీసుకోవాలి" "అప్పటివరకూ ఇక్కడే ఉండాలా?" "అవసరం లేదు. కానీ అతడికి ఎవరు లేరు అన్నాడు కాబట్టి ఇక్కడే ఉండి తీరాలి" "డాడీ మనం అతడిని మన ఇంటికి తీసుకెళదాం. అతడు ఎలాగూ ఆఫీస్ కి రాలేడు. మీరేమో అతడ్ని చూడకుండా ఉండలేరు. మనమే కేర్ తీసుకోవచ్చు" అంది అమృత మహేష్ ని చూస్తూ. "నిజమేనమ్మా" అన్నాడు మూర్తి తన కూతురి ఆలోచనని మెచ్చుకుంటూ. "మేము ఇతడ్ని మా ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటాం. వెంటనే డిశ్చార్జ్ చేయండి" అన్నాడు మూర్తి నర్స్ తో. "అలాగే సార్" అంటూ ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. "మీకెందుకు సార్ శ్రమ. నేను నా రూముకు వెళ్లిపోతాను" అన్నాడు మహేష్. "నువ్వింకేం మాట్లాడకు. మా అమ్మాయి చెప్పినట్లు చెయ్యి" అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లుగా. చేసేదేమి లేక నిస్సహాయంగా అమృత వైపు చూశాడు మహేష్. "హయ్యో... పాపం " అన్నట్లుగా మహేష్ వైపు చూసింది అమృత. "సార్ నేను చెప్పేది ఒకసారి వినండి" "అమృత ఇతడు ఇలాగే అంటుంటాడు గానీ పద" అన్నాడు అమృత వైపు చూసి. అక్కడినుండి మహేష్ చేయి అందుకుని చిన్నగా నడిపించుకుంటూ బయటకి వచ్చారు. పార్కింగ్ లో ఉన్న అతడి కారుని చూసి డ్రైవర్ కి రమ్మని సైగ చేశాడు. డ్రైవర్ వెంటనే కారులో వాళ్ల ముందుకి వచ్చేశాడు. ముందు మూర్తి ఎక్కి ఆ తరువాత మహేష్ ని రమ్మని పిలిచాడు. "నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను సార్" అంటూ డోర్ తెరవబోయాడు. వెంటనే అతడిని ఆపి "మరేం పర్లేదు వెనకాలే కూర్చో" అంది అమృత. "నువ్వేమి మొహమాట పడకు" అన్నాడు మూర్తి. అమృతని ఒకసారి చూసి కారులోకి ఎక్కాడు మహేష్. వెనకలే అమృత ఎక్కి మహేష్ పక్కన కూర్చుంది. మహేష్ కి కుడి వైపు మూర్తి, ఎడమ వైపు అమృత కూర్చున్నారు. అప్పుడప్పుడూ అమృతని చూస్తున్నాడు మహేష్. కానీ అమృత మాత్రం తననే చూస్తోంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది మహేష్ కి అమృత అలా చూస్తుంటే. మూర్తి వాళ్లింటికి వెళ్లాలంటే అరగంట సమయం పడుతుంది. ఇక్కడ మహేష్ కి ఒక్క క్షణం ఒక యుగం లాగా ఉంది. చిన్నగా అతడి ఎడమ చేతి మీద చేయి వేసి ఆమె వేళ్లతో అతడి వేళ్లను బంధించినట్లు పట్టుకుంది అమృత. కరెంట్ షాక్ కొట్టిన వాడిలాగ ఉలిక్కిపడ్డాడు మహేష్. అతడు ఉలిక్కి పడగానే "ఏమైందయ్యా?" అంటూ అడిగాడు మూర్తి. అమృత చేయి పట్టుకున్నట్లు కనిపించట్లేదు మూర్తికి. "అబ్బే ఏమి లేదు సార్" కుడి చేతికి కట్టు కట్టి ఉండడం వలన ఆమె చేతితో పోరాడలేక పోతున్నాడు. "ప్లీజ్ నా చేయిని వదలండి మేడం" అన్నాడు అమృతకు మాత్రమే వినిపించేట్టుగా. "మేడం ఏంటి? నన్ను ఎప్పటిలాగ పిలిస్తే వదిలేస్తా" అంది మహేష్ లాగే. "ఇప్పుడు మీరు నా బాస్ కూతురు" "అందుకే అడుగుతున్నాను" "ప్లీజ్ నా జీవితం తో ఆడుకోకండి" "ప్రపంచం చాల చిన్నది కదా" "అందరూ అంటుంటే విన్నాను. కానీ నాకూ ఇప్పుడే అర్థం అయ్యింది" "ఏమని?" అంది నవ్వుతూ. "ఇంత చిన్న ప్రపంచంలో నాకు గాలి కూడా ఆడట్లేదని" అలా అనగానే గట్టిగా నవ్వింది అమృత. ఆమె అలా నవ్వగానే "ఎమైందమ్మా?" అని అడిగాడు. "ఏమి లేదు డాడీ. మహేష్ మిమ్మల్ని తిట్టుకుంటున్నాడు" "ఏంట్రా? నన్నే తిట్టుకుంటున్నావా?" "అబ్బే లేదు సార్" అన్నాడు. "వీడు ఇలాగే అంటాడూ కానీ నువ్వు చెప్పమ్మా" అన్నాడు కూతురి వైపు చూస్తూ. తను ఏమి చెబుతుందోనని భయపడుతున్నాడు మహేష్. అంతలో అమృత "ఏమి లేదు డాడీ హాస్పిటల్లో మిమ్మల్ని చూసి మెడిసిన్స్ మర్చిపోయాడంట" అంది. "అవును నేను మర్చిపోయాను" అన్నడు మూర్తి. "మరేం పర్లేదు డాడీ మన రాఘవ్ అంకుల్ ని అడిగి తెచ్చుకుందాం" అంది అమృత. "థ్యాంక్స్" అన్నట్లు అమృత వైపు చూశాడు మహేష్. మహేష్ పరిస్థితి చూసి నవ్వుకుంది అమృత. "ఏమైతేనే? నువ్వు ఇవ్వాళ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావ్ నాకు" అన్నాడు మూర్తి అమృతతో. "అదేంటి సార్?" అన్నాడు మహేష్ ఆశ్చర్యంగా. "నిజమేనయ్యా...నా కూతురు తిరిగొచ్చి నెల రోజులవుతోంది. ఇప్పటివరకూ నవ్వింది కానీ ఆ నవ్వులో ఇంతకు ముందు ఉన్న వెలుగు లేదు. మళ్లీ నీవల్లే ఆ నవ్వు వచ్చింది" అన్నాడు మూర్తి. "మహేష్ ని చూడగానే చాలా ప్రశాంతంగా ఉంది డాడీ" అని మహేష్ కి దగ్గరగా జరిగి "నీవల్లే ఆ నవ్వు దూరమయ్యిందని చెప్పు. ఏం జరుగుతుందో చూద్దాం" అంది గుసగుసగా. మహేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇంతలో కారు మూర్తి ఇంటి దగ్గర ఆగింది. కాలింగ్ బెల్ కొట్టాడు మూర్తి. డోర్ తీయగానే చేతికి కట్టుతో ఉన్న మహేష్ ని చూసి గాయత్రి "ఏమైంది మహేష్ కి?" అని అడిగింది. "నీకు కూడా తెలుసా మహేష్?" అంది అమ్మను చూసి. "నాకు తెలియక పోవడం ఏంటి? మీ నాన్నను ఆక్సిడెంట్ నుండి కాపాడాడు కదా?" అంది. "అవన్నీ తరువాత బయటే నిలబెడతావా ఏంటి?" అన్నాడు మూర్తి భార్య వైపు చూసి. "ఎంత మాట?" అంటూ మహేష్ ని లోపలికి తీసుకెళ్లింది గాయత్రి. "వొద్దు అన్నా వినకుండా సార్, మేడం భయపెట్టి తీసుకొచ్చారు. మీరైనా చెప్పండి మేడం" అన్నాడు గాయత్రి వైపు చూసి. "సంతోషించు. మేము ఇంకా భయపెట్టాం. మీ మేడం అయితే కొట్టి మరీ తీసుకొచ్చేది" అన్నాడు మూర్తి. "నిజమే" అంది గాయత్రి. "అదేంటి మేడం" "మరి లేకపోతే ఏంటి? నిన్ను ఎన్నిసార్లు అడిగాను ఇంటికి రమ్మని. ఒక్కసారైనా వచ్చావా? ఇప్పుడు నువ్వు ఇలా ఉంటే ఎలా వదిలేస్తాను అనుకున్నావ్" అంది గాయత్రి. "మా ఫ్యామిలీ మొత్తానికి ఏమి మందు పెట్టావ్ రా" అనుకుంది అమృత. మహేష్ ని గెస్ట్ రూం లో పడుకోబెట్టి, గాయత్రి వంటింట్లోకి వెళ్లిపోయింది. మూర్తి అతనికి అలసటగా ఉందని వెళ్లి పడుకున్నాడు. మహేష్ తో పాటు అమృత అతని రూం లో ఉంది. ఆమె కళ్లలోకి చూడడానికి భయపడుతున్నాడు మహేష్.
23-10-2019, 09:08 AM
ఎక్కడికి పోతావు చిన్నవాడా" అని పాడుకుంటూ అమృత బయటికి వెళ్ళిపోతూ మహేష్ వైపు చూసి కొంటెగా నవ్వి "ఈసారి తప్పించుకోవాలని ట్రై చేయకు" అని వెళ్ళిపోయింది.
ఏం చేయాలో అర్థంకావడం లేదు మహేష్ కి. బాగా దెబ్బలు తగిలినందువల్ల అలా పడుకుండిపోయాడు. ********************************** ********************************** సాయంత్రం అతడు నిద్ర లేచే సమయానికి పక్కనే అమృత కుర్చీలో కూర్చుని ఉంది. "గుడ్ ఈవెనింగ్ సార్" "నేను మీకు సార్ ఏంటి మేడం?" "నీ పెర్ఫార్మెన్స్ తగలెయ్య....! ఇంట్లో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు" అంది లేచి నిలబడుతూ. "ఎక్కడికెళ్లారు?" అన్నాడు మహేష్ కూడా లేచి నిలబడి. "మమ్మీ డాడీ గుడికి వెళ్లారు" "మరి మీరు?" "నువ్వు ఒక్కడివే ఉంటావని నీకోసం ఉండిపోయా" "అయ్యో...!" "అయ్యో...! ఏంట్రా? నాలుగు సంవత్సరాల నుండి నీకోసం ఎదురు చూస్తున్నా. నా మీద కొంచెం కూడా జాలి కలగలేదా? ఎంత పిచ్చిగా ప్రేమించాను రా నిన్ను. నన్ను ఎలా వదిలెయ్యాలనిపించింది రా నీకు" "నా వల్ల నువ్వు సఫర్ అయినందుకు సారీ" "సారీలు కూడా చేబుతున్నావు. చాలా మారిపోయారండి మీరు" "అలా మాట్లాడకు అమృత. ఇట్ హర్ట్స్ మి" "నువ్వు హర్ట్ కూడా అవుతావా?" "అదేంటి? నేను మాత్రం మనిషిని కాదా?" "కాదు. నువ్వు మనిషివి కాదు. నన్ను మోసం చేసిన రాక్షసుడివి" "అర్థం చేసుకో అమృత. నాలుగు సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాను? ఇప్పుడెలా ఉన్నాను" "ఏం జరిగిందో నాతొ చెప్పకూడదా?" అడిగింది మహేష్ కాలర్ పట్టుకుని. "లేదు అమృత నా జీవితం ఛిన్నాభిన్నం అయ్యింది. ఒంటరి వాడిగా మిగిలిపోయాను. నా చేయి పట్టుకోవాలని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీకు మంచి భవిష్యత్తు ఉంది" అన్నాడు తన చేతుల నుండి కాలర్ ని విడిపించుకుంటూ. "నువ్వు లేకుండా నా భవిష్యత్తు బాగుంటుంది అని ఎలా అనుకున్నావురా?" "నేను లేకపోతేనే బాగుంటుంది" "అయినా నా గురించి నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వెవరు?" అలా అనగానే చాలా కోపం వచ్చింది మహేష్ కి.అమృతని కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోయాడు. కొడతాడు అని భయపడిన అమృత తల దించుకుని గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. అమృతని అలా చూడగానే ఆగలేకపోయాడు మహేష్. తనని కౌగిలించుకోవడానికి దగ్గరికి వచ్చాడు. కానీ ఎందుకో మళ్ళీ వెనక్కి తిరిగబోయాడు. అది గమనించిన అమృత వెంటనే వాడిని ఆపి కౌగిలించుకుంది.అమృత కళ్ళ నిండా నీళ్లు. ఏం చేయాలో తెలియడం లేదు మహేష్ కి. ఇక చేసేదేమి లేక అమృత ముఖాన్ని తన ఎడమ చేతిలోకి తీసుకోవాలని చూశాడు. కానీ అతడు చేయి పెట్టినప్పుడల్లా తన తలతోనే విదిలిస్తోంది అమృత. "నువ్వు ఏమి మారలేదు అమృత" అన్నాడు మహేష్ చిన్నగా నవ్వుతూ. దాంతో అమృత తల ఎత్తి మహేష్ ని కోపంగా చూసింది. "ఎందుకు మారలేదు. చూడు నీ మీద బెంగతో ఎంత చిక్కిపోయానో. కానీ నువ్వు మాత్రం పందిలాగా లావు అయ్యావు" "నీకు అలా కనిపిస్తున్నానా?" "మరి ఇంతకు ముందు నిన్ను హత్తుకుంటే నా కుడి చేయి నా ఎడమ మోచేయి దాకా వెళ్ళేది. ఇప్పుడు చూడు నా మణికట్టు దగ్గరే ఆగిపోయింది" "సరేలే ఇక వదులు" అన్నాడు తనని విడిపించుకుంటూ. ఇద్దరూ కౌగిలి నుండి విడిపడిపోయారు. "అయ్యో నీకొక విషయం చెప్పడం మర్చిపోయా" అంది అమృత తల మీద చేయి పెట్టుకుని. "ఏంటి?" అన్నాడు ఆశ్చర్యంగా. "దగ్గరికి రా" అన్నట్లు సైగ చేసింది. "నేను రాను. వస్తే ఏం చేస్తావో నాకు తెలుసు" "రాకపోయినా చేస్తా" అంటూ అతడి షర్ట్ పట్టుకుని గుంజి అతడి పెదాలపై చిన్నగా ముద్దు పెట్టుకుంది. ఐదు సెకన్లు ముద్దు పెట్టి "ఉమ్మా" అంటూ విడిచిపెట్టింది. ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం కాలేదు మహేష్ కి. ఇంతలో సిగ్గుతో అక్కడి నుండి పరుగెట్టబోయిన అమృత ని ఆపడానికి "అమ్ము" అని కేకేశాడు మహేష్. ఠక్కున వెనక్కి తిరిగి "గుర్తుందన్నమాట" అంది. "ఏంటి?" అన్నట్లు చూశాడు. "నా ముద్దుపేరు" అని మళ్ళీ మహేష్ దగ్గరకు వచ్చి ఈసారి బుగ్గపై ముద్దు పెట్టి పరుగెత్తుకుంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది. తాను కిందకి వెళ్ళగానే తన అమ్మా నాన్న కార్ సౌండ్ వినిపించింది అమృతకి. కాసేపటికి మూర్తి, గాయత్రీలు ఇంట్లో అడుగు పెట్టారు. "మహేష్ కి ఎలా ఉందమ్మా?" "నొప్పిగానే ఉందంట డాడీ. మీరు ఫోన్ చేసి రాఘవ్ అంకుల్ ని రమ్మని చెప్పండి" "అవునమ్మా. నేను అసలు ఆ విషయమే మరిచిపోయాను" అని రాఘవ్ కి కాల్ చేసి విషయం టూకీగా చెప్పి తన కిట్ తో ఇంటికి రమ్మని చెప్పాడు. "మహేష్ కి పాలు ఇచ్చావా?" అని అడిగింది గాయత్రి. "లేదమ్మా? అతను ఇంకా నిద్రపోతున్నాడు" "సరే నువ్వెళ్ళి చూసి రా. నేను పాలు కాచుతా" అని చెప్పి వంటింట్లోకి వెళ్ళిపోయింది గాయత్రి. తాను వెళ్లేసరికి అప్పుడే బాత్రూమ్ నుండి బయటకి వస్తున్నాడు. డోర్ మత్ పై కాళ్ళు తుడుచుకుని బెడ్ దగ్గరికి నడవబోతూ కింద పడబోయాడు. అది గమనించిన అమృత వెంటనే మహేష్ ని పట్టుకుని ఆపి ఆమె భుజం అతడి చేతిని వేసుకుని నడిపించుకుంటూ అతడిని బెడ్ పై కూర్చోబెట్టింది. "ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా?" అంది అమృత. "తెలియదు" అన్నట్లు తల ఊపాడు మహేష్. "పోనీ జరగబోతోందో తెలుసా?" "తెలీదు" "ఆక్సిడెంట్ బాగా డామేజ్ చేసినట్లుంది" "నీ మోకాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయా?" "తగిలాయి" విసుక్కుంటూ సమాధానం చెప్పాడు మహేష్. "అందుకే బ్రెయిన్ పని చేయడం లేదు అనుకుంటా?" అంది నవ్వుతూ. "నిన్ను చంపేస్తా" అంటూ లేవబోయాడు. అక్కడి నుండి అమృత నవ్వుకుంటూ తుర్రుమని పారిపోయింది. తాను వేసిన జోక్ కి మహేష్ కూడా నవ్వుకుని మళ్ళీ బెడ్ పై తల వాల్చాడు. ఇంతలో ఇందాక జరిగిన సంఘటన గుర్తుకొచ్చి చిన్నగా తన గతాన్ని నెమరు వేసుకోసాగాడు. ******************************* ******************************* ఆరు సంవత్సరాల క్రితం అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్. అందులో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు సాయి మహేష్. తన ఫ్రెండ్ గణేష్ తో పాటు కలిసి కాంటీన్ వైపు నడుచుకుంటూ వెళుతున్న అతడి కాలు పై తొక్కింది అమృత. అప్పుడే అమృతని మొదటిసారి చూశాడు మహేష్. "ఐ యామ్ సారీ అండి" అంది. "ఐ యామ్ సాయి మహేష్" అంటూ చేయి చాపాడు. అలా అనగానే అమృత పక్కన ఉన్న తన ఫ్రెండ్ కావ్య, మహేష్ పక్కన ఉన్న గణేష్ కిసుక్కున నవ్వుకున్నారు. అది చూసి అమృతకి కోపం వచ్చింది. "ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా?" అప్పుడే రెస్పెక్ట్ తగ్గిపోయింది తన పిలుపులో. "ఏ ఇయర్ మీరు?" అని అడిగాడు గణేష్ కోపంగా. "ఫస్ట్ ఇయర్ అంటూ భయపడుతూ సమాధానం చెప్పింది" కావ్య. "మరి సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా?" "నువ్వాగరా" అని గణేష్ ని ఆపి "హలో మిస్ నేనేమి అడ్వాంటేజ్ తీసుకోవాలని అలా అనలేదు. అయినా మీ ఫ్రెండ్ కి ఉన్న సెన్స్ అఫ్ హ్యూమర్ కూడా లేదే మీకు" అన్నాడు అమృతని చూస్తూ. "మీ దారిలో మీరు వెళ్ళండి, నేను నా దారిన పోతాను" అన్నాడు మహేష్ మళ్ళీ. "సార్ సార్" అంటూ ఆపింది కావ్య మహేష్ ని. "ఏం కావాలి? ఈసారి నువ్వు తిట్టాలని అనుకుంటున్నావా?" "అదేం లేదు సార్. మాకు థౌసండ్ రూపీస్ కి చేంజ్ కావాలి. మీ దగ్గరుంటే ఇస్తారేమోనని" "ఇంతకీ మీలో చేంజ్ ఎవరికీ కావాలి?" "తనకే సార్?" అంది కావ్య. "అయితే తననే అడగమను" అన్నాడు మహేష్. "అడగవే" అంది కావ్య అమృతతో. "సార్ నాకు థౌసండ్ రూపీస్ కి చేంజ్ కావాలి" అంది క్యూట్ గా. తన దగ్గర ఉన్న చేంజ్ తీసి తనకు ఇచ్చి థౌసండ్ రూపీస్ నోటు తీసుకున్నాడు మహేష్. ఆ డబ్బులు తీసుకుని తన ఫ్రెండ్ తో పాటు కాంటీన్ వైపు నడిచింది. "అమ్మాయి బాగుంది కానీ పొగరు అనుకుంటా?" అన్నాడు గణేష్ మహేష్ తో. అప్పటివరకు పట్టించుకోలేదు కానీ అప్పుడే చూశాడు మహేష్. బుంగమూతితో అందంగా ఉంది. "ఏయ్ నీ పేరేంటి?" అని అడిగాడు మహేష్. "సారీ" అని అరిచి నవ్వుకుంటూ అక్కడి నుండి చిన్నగా పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అమృత. "అమ్మనీ ఏం ఝలక్ ఇచ్చింది మామా" అన్నాడు గణేష్. "నీ అనుమానం నిజమే రా" అన్నాడు మహేష్. "ఏ అనుమానం?" "దానికి పొగరు ఉంది" అన్నాడు మహేష్ గణేష్ వైపు చూసి. ఇద్దరూ కాంటీన్ లోకి అడుగు పెట్టగానే అమృత కనిపించింది. కావ్య, అమృత ఇద్దరూ కాఫీ తాగుతూ కనిపించారు. "నువ్వెళ్ళి రెండు కాఫీ తీసుకురా" అని గణేష్ కి చెప్పి మరిత వైపు నడిచాడు మహేష్. మహేష్ తమ వైపు రావడం గమనించకుండా కాఫీ తాగుతున్నారు ఇద్దరు. ఒక చేతిలో కాఫీ కప్, ఇంకో చేతిలో పర్సు పట్టుకుని నిలబడి ఉంది అమృత. మహేష్ నేరుగా అమృతకి ఎదురుగా నిలబడి తన మేడలో ఉన్న ఐ డి కార్డు తీసుకుని "అమృత" అని తన పేరు చదివాడు. "ఒకే అమృత హావ్ ఏ నైస్ డే" అని అక్కడ నుండి గణేష్ దగ్గరకి వెళ్ళిపోయాడు. అప్పటినుండి మహేష్ కనిపించినపుడల్లా నవ్వుతూ ఉండేది. రోజుకు ఒక్కసారైనా మహేష్ ను చూసి వెళ్లిపోయేది. ఇలా కొన్ని రోజుల్లోనే మాటలు లేక పోయినా మంచి బాండింగ్ ఏర్పడింది. ఒకరోజు అమృత రెడ్ కలర్ చుడిదార్ వేసుకొని తన స్కూటీ పార్క్ చేసి క్లాస్ లోకి వెళ్ళబోతూ మహేష్ ని చూసింది. చాలా దూరంగా గణేష్ తో ఎదో మాట్లాడుతున్నాడు. అమృత దూరమైనా అతడి పక్క నుండే క్లాస్ కి వెళ్లాలని అటు వైపు నడుచుకుంటూ వెళుతోంది. తాను దగ్గరకి వచ్చాక చూసాడు మహేష్ అమృతని. "రేయ్ గణేష్...!" "చెప్పరా" "నీకో విషయం చెప్తే ఏమి అనుకోవు కదా?" "చెప్పి తగలడు" "నీకు ఈ రెడ్ కలర్ డ్రెస్ ఏమి బాగాలేదు రా" "ఎం మాట్లాడుతున్నావు రా? నీ కళ్ళనేమైనా కాకులు ఎత్తుకెళ్లిపోయాయా. ఇది బ్లూ కలర్ షర్ట్" "అటు చూడు" అన్నట్లు సైగ చేసాడు. అటువైపు అమృత నడుచుకుంటూ వెళుతోంది. తనని చూసి ఏమి మాట్లాడలేదు గణేష్. ఇంతలో మహేష్ "నేను చెప్పేది అదే నీకు బ్లూ కలర్ డ్రెస్ అయితే బాగుంటుంది" అన్నాడు అమృత వైపు చూసి. అమృత వారిద్దరినీ దాటుకుని నడిచి వెళ్లి మలుపు తిరిగే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. తననే చూస్తూ నవ్వుతున్నాడు మహేష్. అతడిని చూసి ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయింది. ఆ తరువాత రోజు ఏం జరిగిందో తెలీదు మహేష్ కి. ఎందుకంటే ఆ రోజు కాలేజ్ కి వెళ్ళలేదు మహేష్. మరుసటిరోజు కాలేజ్ కి వెళ్ళగానే తనకు ఎదురు పడింది అమృత. అతడిని చాల కోపంగా చూస్తోంది. "ఏంటి చంపేస్తావా?" అని అడిగాడు మహేష్. "అవును" "నేనేం చేశాను?" "నాకు బ్లూ కలర్ డ్రెస్ బాగుంటుందని చెప్పి, నేను అదే కలర్ డ్రెస్ వేసుకుని వస్తే నిన్న నువ్వు రాలేదు" "దానికి చంపేస్తావా?" తను సమాధానం చెప్పక ముందే అక్కడికి కొందరు సీనియర్స్ వచ్చారు. వాళ్లంతా మహేష్ క్లాస్మేట్స్. "ఎవర్రా తను?" "మన జూనియర్" "నీ పేరేంటి?" "అమృత అన్నయ్య" అంది. "ఎమ్మా మేమంతా నీకు అన్నయ్యలమా?" "అందరూ కాదు" అంది. "మరి ఎవరెవరూ?" "మహేష్ తప్పా అందరూ" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందరూ మహేష్ వైపు ఒక రకంగా చూసారు. ఇక అక్కడే ఉంటె డేంజర్ అనుకోని అక్కడి నుండి జంప్ అయ్యాడు. మరుసటి రోజు తన స్కూటీని పార్కింగ్ నుండి బయటకు తీయబోతూ పడిపోయింది అమృత. అక్కడే ఉన్న మహేష్ చూసి పైకి లేపి నిలబెట్టాడు. కానీ దెబ్బ కొంచెం గట్టిగా తగలడం వల్ల సరిగ్గా నడవలేకపోతోంది అమృత. తన చేతిని అతడి భుజం పై వేసుకుని తనని నడిపించుకుంటూ పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చోబెట్టాడు. అక్కడ అమృత ని వదిలి వెళ్లబోతుంటే అమృత "ఐ లవ్ యు సాయి" అంది. "ఇట్స్ ఒకే. యు ఆర్ వెల్కమ్" అని చెప్పి రెండుఁ అడుగులు వేసి వెనక్కి తిరిగి మళ్ళీ తన దగ్గరికి వచ్చి "ఏమన్నావు?" అని అడిగాడు. "ఐ లవ్ యు" అని చెప్పి వెనక్కి తిరిగింది. "మరి నా ఒపీనియన్ అవసరం లేదా?" "నువ్వు చచ్చినట్లు నన్నే ప్రేమించాలి. నీకు వేరే ఆప్షన్ లేదు" "నువ్వే ఫిక్స్ అయిపోయావా?" "అమృత ఇక్కడ" "ఐతే భయపడాలా?" సాయంత్రం అవ్వడం వల్ల పెద్దగా స్టూడెంట్స్ లేరు. "అదేంటి? నువ్వు ఇంకెవరినైనా లవ్ చేస్తున్నావా?" "అవును" గుండె పగిలినట్లు అనిపించింది అమృతకి. "'ఎవరిని?" "తను నీ క్లాస్ మేటే" "ఎవరూ?" "కావ్యా..........." అంటూ దీర్ఘం తీస్తుండగా "కావ్యనా?" అని అడిగింది. "కాదు. ఆ అమ్మాయి ఎప్పుడు కావ్య పక్కన తిరుగుతూ ఉంటుంది". అలా అనగానే ఆలోచనలో పడింది అమృత. "తనకు బాగా పొగరు" అన్నాడు. ఇంకా ఆలోచిస్తూనే ఉంది అమృత. "తను మొన్న బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చిందట. నేను చూడలేదని తిట్టింది" అనగానే అర్థం అయ్యింది అమృతకి మహేష్ ఎవరిని లవ్ చేస్తున్నాడో. చిన్నగా నవ్వి "నేను పొగరుబోతునా?" అని అడిగింది. "నేను నీ గురించి చెప్పట్లేదు. నేను ప్రేమిస్తున్న అమ్మాయి గురించి చెబుతున్నాను" అన్నాడు నవ్వుతు. "చంపుతా. కాసేపు టెన్షన్ పెట్టావు కదరా?" అంది రిలాక్స్ అవుతూ. "ఇదంతా నిజంగా నాపై ప్రేమేనా?" అన్నాడు నవ్వుతూ. "నీకు ఇప్పుడు తెలీదులే" అంది. "మరెప్పుడు తెలుస్తుంది" అని అడిగాడు. ***************************************************** ***************************************************** "బాబు మహేష్.....బాబు మహేష్......." అన్న పిలుపుతో మళ్ళీ వర్తమానంలోకి వచ్చాడు. ఎదురుగా గాయత్రి పాలు పట్టుకుని నిలుచుంది.
23-10-2019, 09:09 AM
ఏంటయ్యా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నావ్?" అంది చేతిలోని పాలని అతనికి అందిస్తూ.
"ఏం లేదు మేడం" అంటూ ఆమె చేతిలోని పాలు అందుకున్నాడు. "ఎలా ఉంది ఇప్పుడు?" "పర్లేదు మేడం. కొంచెం నొప్పి తగ్గింది" "కాసేపు ఆగు మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు" "నాకేం పర్లేదు మేడం. రేపు ఉదయనికంతా సెట్ అయిపోతుంది. పొద్దున్నే వెళ్ళిపోతాను" "ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఎన్ని చెప్పినా వారం రోజులు ఇక్కడ ఉంది తీరాల్సిందే" వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే అక్కడికి రాఘవేంద్ర మెడికల్ కిట్ తో వచ్చాడు. బెడ్ పై ఉన్న మహేష్ ని చూసి దగ్గరికి వచ్చి "అమ్మా గాయత్రీ...ఎక్కడ మహేష్?" అని అడిగాడు. అతడి వెనకాలే అమృత, మూర్తిలు కూడా వచ్చారు. "మీకు కూడా తెలుసా మహేష్?" అని అడిగింది అమృత రాఘవేంద్రని. "తెలుసమ్మా. మీ నాన్న దయ వల్ల" అని మహేష్ వైపు చూసి "హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ?" అని అడిగాడు మహేష్ ని. "నెవర్ బెటర్ డాక్టర్" అని బదులిచ్చాడు. కాసేపు అతడిని చెక్ చేసి, అతడి చేతికున్న కట్టుని మార్చి బయటకు వెళ్ళిపోయాడు. అతడి వెనకాల మూర్తి, మూర్తి వెనకాల గాయత్రీ బయటకు వెళ్లిపోయారు. కానీ అమృత మాత్రం వాళ్ళ వెనకాలే వెళ్లినట్లు వెళ్లి తలుపు కాస్త దగ్గరగా వేసి మహేష్ దగ్గరికి వచ్చింది. రూంలో అమృత ని చూసి మళ్ళీ ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యాడు మహేష్. "హ్మ్" అని నిట్టూర్చి అతడి పక్కనే కూర్చుంది అమృత. ఆమె అలా కూర్చోగానే టక్కున లేచి నిలబడ్డాడు మహేష్. "ఏమైంది?" అని అడిగింది అమృత. "ఏమి లేదు మేడం?" "అబ్బా మళ్లీనా? ఇందాకే కదా అమ్ము అని ముద్దుగా పిలిచావ్?" అని అడిగింది. "ఎంతైనా మీరు మా బాస్ కూతురు" "నేను నీకు బాస్ కూతురిగా పరిచయం అయ్యానా?" "కాదు. కానీ....." అంటుండగా అతడి సెల్ మోగింది. అతడికి దూరంగా ఉంది ఫోన్. మహేష్ అందుకునేలోపు అమృత వెళ్లి తీసుకుంది. చూస్తే "అరుణ కాలింగ్" అని ఉంది. ఫోన్ లిఫ్ట్ చేసి "హలో" అంది. "హలో ఎవరు?" అంది అటు వైపు నుండి. చాల స్వీట్ గా ఉంది ఆమె వాయిస్. "మీరెవరు?" అంది అమృత దబాయిస్తున్నట్లు. "మహేష్ లేడా?" అని అడిగింది. "మహేష్ తో ఏం పని?" అని అడిగింది. "ఇంకా ఇంటికి రాలేదు. అందుకని" "అయినా ఫోన్ చేసి అడగడానికి నువ్వు ఎవరు?" అంటుండగా మహేష్ ఆమె చేతిలోని ఫోన్ ని తీసుకుని "అరుణ నేను రావడం కుదరదు మీరు ఏం ఖంగారు పడకండి" అన్నాడు. "తానెవరు?" అని అడిగింది. "తాను మా బాస్ కూతురు. నేను తరువాత ఫోన్ చేస్తాను" అని కాల్ కట్ చేసాడు. "రేయ్ ఎవర్రా అది? వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్లడం ఏంటి?" అని ఆరా తీయసాగింది. "తను మా ఇంటి ఓనర్ కూతురు" "ఇంటి ఓనర్ ఏంటి?" "మీకు ఇక్కడ ఇల్లు ఉంది కదా?" "లేదు అమృత. మా డాడీ కి బిజినెస్ లో లాస్ రావడం తో అన్ని అమ్మేసి ఆత్మహత్య చేసుకున్నాడు" "మరి మీ మమ్మీ" "ఆయన చనిపోయిన బాధ తట్టుకోలేక పది రోజుల్లో అమ్మ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది" "అయ్యో...! ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు. ఎక్కడో మారుమూల వ్యక్తి లాగా ఎందుకు ఉంటున్నావ్?" "అన్నీ విషయాలు అందరూ చెప్పుకోలేరు. అయినా నేను బతకడమే కష్టం అయ్యింది నాకు. అటువంటి పరిస్థితుల్లో నిన్ను ఎలా పోషించగలను" "అందుకని దూరం అయ్యావా?" "అవును" అన్నాడు తల దించుకుంటూ. చెంప పై గట్టిగా ఒకటి కొట్టి "నీ సుఖాలు నాటో పంచుకుంటుంటే నీ బాధలను కూడా అలాగే షేర్ చేసుకుంటావ్ అనుకున్నాను. కానీ నన్ను పరాయి దాన్నిచేస్తావ్ అనుకోలేదు" "నేను అలా ఆలోచించలేదు. నా కష్టాలు..." "నాకు చెప్పి నన్ను బాధపెట్ట కూడదు అనుకున్నావ్. అంతేనా" అంది అతడి మాటలకు అడ్డుపడి. "అవును" అన్నట్లు తల ఊపాడు మహేష్. "ఏమనుకున్నావ్ రా నా గురించి" అంది అతడి కాలర్ పట్టుకుని. "ప్లీజ్ అమృత మన మధ్య జరిగింది మర్చిపో" "మర్చిపోయి?" "నీకు మంచి భవిష్యత్తు ఉంది" "మళ్ళీ మళ్ళీ అదే పాట పడొద్దు సాయి" "నన్ను అర్థం చేసుకో అమృత" "ఇంక నేనేమి వినను. నువ్వు కూడా నాకేమి చెప్పకు" అతడిని కౌగిలించుకుంటూ. మహేష్ ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు అమృత. అప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే మొండిగా ఉంది. "నీ మొండితనం నీదేనా? నా మాట వినవా?" అన్నాడు మహేష్. "నువ్వు దూరం అవుతానంటే నీ మాటేంటి నా మాట కూడా వినను" అంది ఆమె కౌగిలిలో అతడిని ఇంకా బంధిస్తూ. "ప్లీజ్ అమృత నిన్ను, నన్ను సార్ ఇలా చూస్తే నా ఉద్యోగం పోతుంది" "సార్ కాదు మావయ్య" "సర్లే ఆయన్ని సార్ అని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు. అలాంటిది మావయ్య అని పిలవడమా? నో వే" "ఏయ్...! మా ఆయన్ని ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడవనుకో..." అంది అమృత మహేష్ కాలర్ పట్టుకుని. "ఆయనెవరు?" "నీకెందుకు?" "సర్లే ఇక వెళ్ళు" అన్నాడు ఆమె చేతులలో నుండి అతడి కాలర్ విడిపించుకుని. "ఇప్పుడు కాదు నీ పని అందరు నిద్రపోయాక చెబుతా" అంది కొంటెగా. ఆమె అన్న విధానానికి మహేష్ కి కూడా నవ్వు వచ్చేసింది. మహేష్ అలా నవ్వుతుంటే చూస్తూ ఉంది అమృత. "ఏంటమ్మా మహేష్ అంతగా నవ్వుతున్నాడు?" అంటూ లోపలికి వచ్చాడు మూర్తి. "ఏం లేదు సార్ మేడం జోక్ వేస్తె నవ్వుతున్నాను" అన్నాడు అమృత వైపు చూసి. "అతడిని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వమ్మా. నువ్వు నీ రూమ్ కి పద" అంటూ పిలిచాడు. "అలాగే డాడీ వస్తున్నా పద" అంది. అక్కడి నుండి వెళ్ళిపోయాడు మూర్తి. అమృత వెళ్తూ మహేష్ నడుము పై గిచ్చి "ఇంకోసారి మేడం అన్నావో చంపేస్తా" అని చిన్నగా కన్ను గీటి వెళ్ళిపోయింది. కెవ్వుమని అరవబోతు అతడి నోటికి తన చేతిని అడ్డు పెట్టుకుని మేనేజ్ చేసాడు మహేష్. అమృత తన రూం లోకి వెళ్లి బెడ్ పై వాలిపోయి మహేష్ నే తలచుకోసాగింది. ********************************* ********************************* ********************************* ఆరోజు సండే. కాలేజీకి సెలవు. కానీ ఇంట్లో అమృతకి దిక్కు తెలియడం లేదు. వెంటనే మహేష్ కి ఫోన్ చేసింది. "చెప్పు" అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే. "ఏం చేస్తున్నావ్ బంగారం" అంది ముద్దుగా. "ఖాళీగా ఉన్నా బంగారం" అన్నాడు వెటకారంగా. "ఏంటి ఎగతాళిగా ఉందా?" "ఇప్పుడు నేనేం అన్నాను?" "నన్ను ఇమిటేట్ చేస్తున్నావు" అంది కంప్లైంట్ చేస్తున్నట్లు. "పిచ్చి...నువ్వు కూడా నాకు బంగారం రా" అన్నాడు. "బయటకి వెళ్దామా?" "ఎక్కడికి వెళ్దాం?" "సినిమాకి వెళ్దాం" "ఆ తరువాత?" "ఒకటి నేను చెప్పాను. ఇంకోటి నువ్వు చెప్పు" "సరే అయితే సస్పెన్స్" "వావ్...ఇంప్రెస్సివ్" అంది ఎక్సయిటింగ్ గా. "నిన్ను ఆల్రెడీ ఇంప్రెస్స్ చేసాను" "సర్లే...షార్ప్ టెన్ థర్టీ కి అలంకార థియేటర్ దగ్గరికి వచ్చేసేయ్" "హే...మార్నింగ్ షోకి వెళ్దామా?" "అవును నాకు ఇంట్లో చాలా బోరింగ్ గా ఉంది. ప్లీజ్ మార్నింగ్ షో కే వెళ్దాం" "సరే అయితే. నేను రెడీగా వచ్చేస్తాను. డిలే చేయకుండా నువ్వు కూడా వచ్చే" "సో స్వీట్. ఇదిగో ఇప్పుడే బయల్దేరుతాను" అంటూ మరో అరగంటలో థియేటర్ దగ్గర ఉంది అమృత. ఆమె వెళ్లేసరికి అక్కడే చేతిలో టికెట్స్ పట్టుకుని ఉన్నాడు మహేష్. నా కంటే ముందుగా వచ్చి అప్పుడే టికెట్స్ కూడా తీసావా?" అని అడిగింది. "హ హ" అన్నాడు అతడి జుట్టుని ఎగరేస్తూ. "ముద్దొస్తున్నావ్ రా" అంది మహేష్ బుగ్గలు పిండుతూ. "సరే పద" అంటూ ఇద్దరూ థియేటర్లోకి నడిచారు. "అవును ఇంట క్రౌడ్ లో టికెట్స్ ఎలా సంపాదించావ్?" అని అడిగింది అమృత. "ఈ థియేటర్ మేనేజర్ మన గణేష్ మావయ్య. వాడే రెచొమ్మెంద్ చేసాడు" అన్నాడు మహేష్. "పర్లేదు దొరగారు బాగానే మెయింటైన్ చేస్తున్నారు" "ఏంటి?" "సర్కిల్" "ఏదో మీ దయ" అన్నాడు నవ్వుతూ. అతడు ఆలా నవ్వగానే అమృత కూడా నవ్వేసింది. సినిమా స్టార్ట్ అయ్యింది. పది నిమిషాల తరువాత మహేష్ అమృత వైపు చూస్తున్నాడు. "ఏం చేస్తున్నాడో" అనుకుంటూ అమృత కూడా మహేష్ ని చూసింది. ఆమెనే చూస్తున్న మహేష్ ని చూసి "ఏంటి?" అన్నట్లు సైగ చేసింది. 'ఏం లేదు?" అన్నట్లు మహేష్ కూడా సైగ చేసి సినిమా చూడటం ప్రారంభించాడు.
23-10-2019, 09:11 AM
అలా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని సినిమా చూస్తున్నారు. ఇంతలో అమృత మహేష్ భుజం పై తల వాల్చింది.
కాసేపటి తరువాత మహేష్ ఆమె తల పై తల వాల్చి ఉండిపోయాడు. కాసేపటికి ఇంటర్వెల్ ఇచ్చారు. అమృత లేద్దామనుకుంటే మహేష్ లేవడం లేదు. "సాయి" అని పిలిచింది. అతను పలకలేదు. అతడి ముఖం పై చిన్నగా తట్టింది. టక్కున లేచాడు. లేచి కళ్ళు తుడుచుకుంటున్నాడు. "ఏమైంది?" అని అడిగింది. "ఏమి లేదు. కొంచెం నిద్ర పోయాను" అని జవాబిచ్చాడు. "నిద్ర పోయావా?" "అవును" "నా పక్కన ఉన్నా కూడా నీకు నిద్ర పట్టిందా?" "అదేంటి? అలా అడిగావు?" అన్నాడు మహేష్. "ఏమిలేదు" అంటూ లేచింది. "ఇప్పుడు ఏమి జరిగిందని అంట సీరియస్ గా ఉన్నావ్?" అన్నాడు అతడు కూడా లేచి. "ఏమి జరగలేదనే సీరియస్ గా ఉన్నాను" అంది బయటకి నడుస్తూ. "ప్లీజ్ అమ్ము చెప్పొచ్చు కదా" అన్నాడు మహేష్ కూడా ఆమె వెనకే నడుస్తూ. "ఈరోజు మొత్తం నాతో మాట్లాడకు" అంటూ మహేష్ ఎంత పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది. ఆ సంఘటన జరిగిన తరువాత మహేష్ చాల సార్లు కాల్ చేసాడు. కానీ అమృత లిఫ్ట్ చేయలేదు. చాల సార్లు "సారీ" అని మెసేజ్ లు పెట్టాడు రిప్లై లేదు. మరుసటిరోజు మామూలుగానే కాలేజీ కి వచ్చింది అమృత. కానీ తనకు మహేష్ కనిపించలేదు. ఎంత వెదకినా కనిపించలేదు. ఇక ఆగలేక ఫోన్ చేసింది. చాల సేపు రింగ్ అయ్యింది కానీ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ట్రై చేసింది. ఈసారి రెండు రింగులకే లిఫ్ట్ చేసాడు మహేష్. "సారీ అమృత. ఐ యామ్ రియల్లీ సారీ" అన్నాడు. "అది వదిలేయ్. ఎందుకు ఇవ్వాళ కాలేజీ కి రాలేదు?" అని అడిగింది. "నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు" అది వినగానే ఏడుపొచ్చేసింది అమృతకి. కానీ ఆపుకుని "ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్?" అని అడిగింది. "నేను మా ఇంట్లో ఉన్నాను" అన్నాడు. "సరే నేను రావొచ్చా?" అని అడిగింది. "నువ్వు పర్మిషన్ కూడా అడుగుతున్నావా?" "ఏయ్...నిన్ను చంపేస్తాను" "చంపాలనుకుంటే రావొద్దు" "అయితే ఊరికే కొడతానులే. ఇంటి అడ్రస్ చెప్పు" అంది. మహేష్ అతడు ఉంటున్న ఇంటి అడ్రస్ చెప్పాడు. "సరే అయితే ఒక అరగంటలో అక్కడికి వస్తాను" "సరే" అంటూ కాల్ కట్ చేసాడు మహేష్. ఒక అరగంటకు అయిదు నిముషాలు మిగిలి ఉండగానే అక్కడకు చేరుకుంది. అక్కడ తనని ఆ ఇంటి వాచ్ మాన్ వెళ్లనివ్వడం లేదు. వెంటనే మహేష్ కి కాల్ చేసింది. "ఏంటి అమృత ఇంకా రాలేదు?" అని అడిగాడు మహేష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే. "నేను వచ్చాను. మీ వాచ్ మాన్ నన్ను లోపలి రానివ్వడం లేదు" అంది. "ఓ సారీ. టూ మినిట్స్" అని కాల్ కట్ చేసాడు. ఒక రెండు నిమిషాల తరువాత వాచ్ మాన్ గేట్ ఓపెన్ చేసాడు. మహేష్ వాళ్ళ ఇల్లు చూసి షాక్ అయ్యింది అమృత. మహేష్ రోజు కాలేజీ బస్సు లో వస్తాడు కాలేజీ కి. కానీ అతడి ఇంటి ముందు రెండు కార్లు ఉన్నాయి. అమృత తన బైక్ దిగి ఇంటిలోకి నడవబోతుంటే ఆమెకి ఎదురుగా వచ్చాడు మహేష్. అతడిని చూస్తూ అలా ఉండిపోయింది. "లోపలికి రా అమృత" అని పిలిచాడు మహేష్. అయినా కూడా అమృత ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంది. మల్లె ఇంకోసారి లోపలికి పిలిచాడు మహేష్. ఈసారి అమృత తేరుకుని లోపలికి నడిచింది. చాల పెద్ద ఇల్లు అది. "మీ మమ్మీ, డాడీ లు లేరా?" అని అడిగింది. "వాళ్లు ఆస్ట్రేలియా లో ఉంటారు. నాకు అక్కడ ఉండడం నచ్చదు. అందుకే ఇక్కడే చదువుకుంటున్నాను" అన్నాడు తాపీగా. అమృతని అతడి గదిలోకి తీసుకెళ్లాడు మహేష్. అమృతని బెడ్ పై కూర్చోబెట్టి, పక్కనే ఉన్న కుర్చీని లాక్కొని ఆమెకి దగ్గరగా కూర్చున్నాడు మహేష్. "అవును నీ హెల్త్ బాగాలేదు అన్నావు కదా. ఎప్పటినుండి ఇలా ఉంది?" అని అడిగింది. "టూ డేస్ బ్యాక్ నుండి ఇలాగె ఉంది" "అంటే నిన్న థియేటర్ లో నిద్ర పోయింది కూడా అందుకేనా?" అని అడిగింది కోపంగా. "మే బి అయ్యుండొచ్చు" అన్నాడు. "కరెక్ట్ గా చెప్పు" అంది. "అందుకే నిద్రపోయాను" అన్నాడు తల దించుకుని. "హెల్త్ సరిగా లేదని చెప్తే నేను నిన్న అలా బిహేవ్ చేసేదాన్ని కాదు" అంటూ చిన్న గా ఏడవసాగింది. మహేష్ తల ఎట్టి చూసి "హే అమ్ము ఏమైందని ఇప్పుడు అంతగా బాధ పడుతున్నావు? ఐ యామ్ ఆల్రైట్" అన్నాడు నవ్వుతూ. "ఐ యామ్ సారీ సాయి. ఇంకెప్పుడు నీతో అలా బిహేవ్ చేయను" "అయినా అమ్ము నువ్వు ఆలా బిహేవ్ చేయడం వల్ల నాకు ఇంకా దగ్గర అయ్యావ్" అన్నాడు. అర్థం కానట్లు మహేష్ వైపు చూసింది. "నిజం అమ్ము. నాకు ఇక్కడ ఎవ్వరు లేరు. మమ్మీ, డాడీ లు చాల దూరంగా ఉన్నారు. నాతో ప్రేమగా మాట్లాడటానికి, నన్ను ఓదార్చడానికి, నాపై కోప్పడడానికి ఇక్కడ ఎవరు లేరు. కానీ నిన్న నువ్వు నాపై కోప్పడేసరికి నాకు చాల దగ్గర మనిషిలాగ అనిపించావ్" అన్నాడు. ఇక పొంగుతున్న ఏడుపును కంట్రోల్ చేయలేకపోయింది అమృత. వెంటనే కింద కూర్చొని మహేష్ మోకాళ్లపై పడి ఏడవసాగింది. మహేష్ లేచి తనని నిలబెట్టి గట్టిగ హత్తుకున్నాడు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నట్లు ఇంకా గట్టిగా హత్తుకుంది అమృత. ఇంకా ఏడుస్తూనే ఉంది అమృత. మహేష్ ఎంత చెబుతున్న అంతకంత ఎక్కువ ఏడవసాగింది. ఇక చేసేది లేక తనని బెడ్ పై కూర్చోబెట్టి పక్కనే గ్లాస్ లో వాటర్ పోసి అమృతకి ఇచ్చాడు. తను చిన్నగా ఏడుపు ఆపి నీళ్లు తాగింది. "ఏడ్చి ఏడ్చి బాగా అలసిపోయినట్లు ఉన్నావ్. కాసేపు పడుకో" అన్నాడు మహేష్. "ఉహూ" అంటూ తల అడ్డంగా ఊపింది. "మరి?" అన్నాడు మహేష్. "నేను ఇక్కడికి వచ్చింది నిద్ర పోవడానికి కాదు" "మరి ఏడవడానికి వచ్చావా?" అని అడిగాడు. "నిన్ను చంపేస్తా" అంటూ లేచింది. "అవును కదా నన్ను చంపడానికి వచ్చావ్ కదా?" అన్నాడు. "లేదు" అని మహేష్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాగింది. ************************************ ************************************ "అమృతా...అమృతా..." అంటూ గాయత్రీ పిలుపుతో తను మళ్ళీ ఈ లోకం లోకి వచ్చింది. "వస్తున్నా అమ్మా" అంటూ బదులిచ్చింది. అమృత వాళ్ళది రెండు అంతస్తుల బిల్డింగ్. అమృత ఉన్న రూమ్, మహేష్ ఉన్న రూమ్ పక్క పక్కనే ఉంటాయి. ఇక మూర్తి, గాయత్రిల రూమ్ కిందనే ఉంటుంది. గాయత్రి పిలవగానే కిందకి వెళ్ళింది అమృత. "వెళ్లి మహేష్ కి భోజనం ఇచ్చి రామ్మా?" అంది. "టైం ఎంత అమ్మా?" అని అడిగింది అనుమానంగా. "ఎనిమిది అయ్యింది" "అవునా?" అంది ఆశ్చర్యంగా. "ఉ" అని తల ఊపి తన చేతికి భోజనం ఇచ్చింది. "అతడికి ఇచ్చేసి నువ్వూ రా భోంచేద్దువు" అంది. "నేను కూడా వచ్చేస్తే అతడికి మధ్యలో ఏమైనా అవసరం అయితే ఎవరు చూస్తారు" అంది వాదిస్తున్నట్లు. "సరే అయితే నువ్వు తిను నేను వెళ్లి అక్కడే ఉంది. అతడు తిన్నాక వస్తాను" అంది. "ఇక్కడ నాన్నకు నువ్వు చూసుకో. నేను వెళ్తాను. నాకు ఎలాగూ ఆకలిగా లేదు" అంది అక్కడి నుండి భోజనం తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె అతడి రూంలోకి వెళ్లి చూస్తే హాయిగా నిద్ర పోతున్నాడు మహేష్. "సాయి...సాయి..." అంటూ నిద్ర లేపింది అమృత. అమృతని చూసి చిన్నగా లేచి కూర్చున్నాడు మహేష్. "ఏంటి బాగా నిద్ర పట్టిందా?" అని అడిగింది. "మేల్కొని బాధపడటం కన్నా నిద్రపోవడం మంచిది కదా?" అన్నాడు. "ఇప్పుడు నీకు అంత కష్టం ఏం వచ్చిందట?" అని అంది వెటకారంగా. ఈ ఇంట్లో ఇబ్బంది గా ఉంది" అన్నాడు. "ఈ ఇంటికి ఏమయ్యింది? వాస్తు బాగాలేదా?" అని అడిగింది. "వాస్తు ఇంటికి కాదు నా బాడీకి బాగాలేదు" అన్నాడు. "నీ బాడీకి ఏమయ్యింది?" "మీ నాన్న గారి ముందు ఒళ్ళు చలికాలాన్ని గుర్తుకు చేసుకుంటే, ఇక నీ ముందు కళ్ళు వర్షాకాలాని గుర్తు చేసుకుంటున్నాయి" అన్నాడు కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ. "కానీ నాకు మాత్రం నీ వల్ల వాతావరణం వసంతకాలం లాగ ఉంది" అంది. దానికి మౌనంగా ఉన్నాడు మహేష్. "ఏంటి ఏమి మాట్లాడవు?" అంది గోముగా. "ఒక్కొక్కసారి మౌనం చాలా గట్టిగా మాట్లాడుతుంది అమృత. దాని వినాలి" అన్నాడు. "నీ మౌనమే కాదు, నీ మాటలు కూడా అర్థం కావు. అదంతా వదిలేయ్. ఇప్పుడు తిను" అంది. అతడి నోటికి అన్నం కలిపి అందిస్తూ. "నేను తింటానులే. నువ్వు అక్కడ పెట్టి వేళ్ళు" "ఉహు..నువ్వు తినే దాకా ఇక్కడే ఉండి రమ్మంది అమ్మ" "తినిపించమని కూడా మేడం గారే చెప్పారా?" అన్నాడు. "కాదు మీ అత్తగారు చెప్పారు" అంది నవ్వుతూ. ఇక చేసేదిలేక తినేసాడు మహేష్. "అవును. నూవు తిన్నావా?" అని అడిగాడు మహేష్. "లేదు" అంది. "ఎందుకు ఇంకా తినలేదు?" అని అడిగాడు కోపంగా. "ఇండియన్ ట్రెడిషన్" అంది చిలిపిగా. "అదేంటి?" "అవును. ఇండియాలో భర్తలు తిన్నాకే భార్యలు తినాలి" అంది. సిగ్గు పడుతూ. "ఎందుకు?" "ముందు మీ కడుపు నిండాలి. తరువాతే మా కడుపు నిండాలి" అంది. "అదేం కాదు. ఫుడ్ పాయిజన్ అయ్యి మేము చనిపోతే, మీరు తినకుండా టెస్ట్ చేస్తారు?" అన్నాడు నవ్వుతూ. మహేష్ అలా అనేసరికి బుంగమూతి పెట్టుకుంది అమృత. "సారీ...సారీ" అన్నాడు తనని అలా చూసి. "నీ సారీ లు నాకేం వద్దు. తిను" అంది. ముద్దా నోటి దగ్గర పెడుతూ. ఏమి మాట్లాడకుండా తినసాగాడు మహేష్. "అంతా తినిపించి ముద్దలు పెట్టిన వారికీ ముద్దులు పెట్టి పంపించాలి తెలుసా?" అంది తన చేయి కడుక్కుంటూ. ఆ మాట వినగానే అదిరిపడ్డాడు మహేష్. "ఇది కూడా ఇండియన్ కాన్స్టిట్యూఎన్సీ లో ఉందా?" అని అడిగాడు. "కాదు. ఇది అమృత కాన్స్టిట్యూఎన్సీ అంది" తన కాలర్ ఎగరేస్తున్నట్లు. "ఇప్పుడు నా దగ్గర స్టాక్ లేవు. తరువాత ఇస్తాను" అన్నాడు. "నీతో మాట్లాడి గెలవలెను. అందుకే" అంటూ ఒంగి అతడి పెదాలపై ముద్దు పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయింది. "అమ్ము ఇంకా ఏమి మారలేదు" అనుకుంటూ. రాఘవ్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాడు
28-09-2021, 02:38 PM
స్టోరీ చాలా బాగుంది. మిగతా స్టోరీ ఉంటే పోస్ట్ చేయండి బ్రదర్.. ప్లీజ్..
28-09-2021, 06:05 PM
Good start
28-09-2021, 08:43 PM
Nice start...
29-09-2021, 02:42 AM
Nice story baagundi కొనసాగించండి
29-09-2021, 04:57 AM
Bagundi story malli start ceyandi
04-10-2021, 11:19 PM
Update please bro
|
« Next Oldest | Next Newest »
|