Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*మహనీయ దీపిక* ★★★★★★★ 'భారత రత్న' *ఆచార్య వినోబాభావే* 11-9-1895 15-11-1982
#1
*మహనీయ దీపిక*
★★★★★★★ 
'భారత రత్న'
*ఆచార్య వినోబాభావే*
11-9-1895     15-11-1982
●●●●●●●●●●●●●●
భారతీయ అహింస మరియు 
మానవహక్కులన్యాయవాదిగా,
స్వాతంత్ర్యసమరయోధునిగా, 
గాంధేయవాదిగా ప్రసిద్ధి చెందిన 
ఆచార్యవినోబా, మహారాష్ట్రలోని 
కొలాబా జిల్లా గగోరి లో
1895, సెప్టెంబర్ 11న 
ఒక సాంప్రదాయ చిత్‌పవన్ 
బ్రాహ్మణకుటుంబములో జన్మించారు. 
బాల్యములో ఈయన భగవద్గీత చదివి 
స్ఫూర్తి పొందారు.
ఈయన పూర్తి పేరు 
వినోబా నరహరి భావే.

1916లో గాంధీజీ శిష్యులైన తర్వాత 
సబర్మతీ ఆశ్రమంలో ఉపాధ్యాయులుగా
ఉండటం వలన అందరూ 
'ఆచార్య' అని పిలిచేవారు.
1937లో పౌనార్ లో ఆశ్రమం 
నిర్మించుకొన్నారు.
1951లో పాదయాత్ర చేస్తూ 
భారతదేశంలోని పల్లెలలో 
జీవించే సగటుజీవి 
అనుభవించే కష్టాలకు 
సమస్యలను అన్వేషించడంలో 
చాలా కృషిని సలిపారు. 
కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి 
సమంజసం అని కూడా భావించారు. 
ఈ ధోరణి క్రమేణా 
'సర్వోదయా ఉద్యమా'నికి దారితీసింది. 
వినోబాభావేతో మమైకం చెందిన 
మరొక మహత్తర కార్యక్రమం 
భూదానోద్యమం. 
ఈ నూతన తరహాలో నడచిన 
ఈ భూదానోద్యమ ప్రచారంలో 
భాగంగా, దేశం నలుమూలలు 
పాదయాత్ర చేశారు.

ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, 
తనను కొడుకుగా భావించి, 
కొంతైనా భూమిని ఇవ్వాలని ప్రార్థించారు.
అలా సేకరించిన భూమిని 
పేదలకు దానం ద్వారా పంచి పెట్టారు. 
అహింస, ప్రేమలను మేళవించిన 
విధానం ఆయన తత్వం. 
వినోబా అంటే వెంటనే స్ఫురించే 
అంశం - గోహత్య విధాన నిర్మూలనం.

ఈయన మహాత్మా గాంధీతో పాటు 
భారత స్వాతంత్ర్యోద్యమంలోపాల్గొని, 
బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలుకెళ్ళారు. 
జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన 
మరాఠీలో భగవద్గీతపై కొన్ని 
ఉపన్యాసాలిచ్చారు. 
అత్యంత స్ఫూర్తిదాయకమైన 
ఈ ఉపన్యాసాలే ఆ తరువాత 
'టాక్స్ ఆన్ ది గీత ' 
అన్న పుస్తకంగా వెలువడింది.
ఈ గ్రంథం లక్షలాది ప్రతులు 
అమ్ముడుపోయాయి.
'మహారాష్ట్ర ధర్మ పత్రిక'అనే 
మాసపత్రిక ను నడిపారు.

ఈ పుస్తకము దేశవిదేశాల్లో 
అనేక భాషల్లోకి అనువదించబడింది. 
వినోబా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, 
తన ఇతర రచనలు సమసిపోయినా 
ఈ ఉపన్యాసాల 
ప్రభావం మాత్రం ఎప్పటికీ 
ఉండిపోతుందని నమ్మారు.

వినోబా తన జీవిత చరమాంకం, 
మహారాష్ట్రలోని 'పౌనాఋ'లో 
నిర్మించుకున్న ఆశ్రమ 
వాతావరణంలో గడిపారు. 
ఇందిరాగాంధి విధించిన 
అత్యవసర పరిస్థితిని 
సమర్ధించిన వారిలో వినోబా ఒకరు. 
, ఆ కాలాన్ని 'అనుశాసన పర్వం'గా 
అభివర్ణించి, క్రమశిక్షణకు 
సరియైన సమయం అని 
వ్యాఖ్యానించారు. 
విమర్శల మధ్య వినోబభావే.

1958 లో వినోబాకు 
'సామాజిక నాయకత్వం'పై 
భారతీయ రామన్ మెగ్సయ్సాయ్ పురస్కారం లభించింది. ఈ పురస్కారంమొట్టమొదటి స్వీకర్త వినోభాబావే కావడం మనదేశానికి గర్వనీయం. 
1983 లో 'భారతరత్న' బిరుదుని 
వినోబాభావేకు ఆయన మరణాంతరం 
వెంటనే బహూకరించారు.

సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకథోరణి, కుష్టువ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, 
ఇలా ఎన్నో సేవలను అందించిన 
వినోబాభావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో 
ఒకరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

పీడిత, తాడిత,బడుగు, 
బలహీన, వర్గాల ప్రజల
సంక్షేమం కోసమే తన జీవితాన్ని 
నిస్వార్థంగా త్యాగం చేసిన,
ఆచార్యవినోబాభావే 
చివరి దశలో అన్నపానీయాలు,
ఔషధాలు తీసుకోకుండా,
స్వయంగా మృత్యువునుఆహ్వానించి,
1982 నవంబర్ 15 న,కీర్తిశేషులైనారు.

'కళాదీపిక'

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)