Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దాన ధర్మాలు
#1
0 60 9 1.            2207b2-5.
151023-7.
???????????


                  *దాన ధర్మాలు*
                  ➖➖➖✍️

*మీరు 'దాన ధర్మాలు ' అనే మాటను వినే ఉంటారు. అయితే ఈ దానానికి ధర్మానికి మధ్య నున్న అవినాభావ సంబంధం ఏమిటో మీకు తెలుసా? అలాగే నీ తలరాతను కూడా మార్చగలిగే నీ దాన - ధర్మాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..*

     *రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక వ్యాపారి ఒక పచారి దుకాణాన్ని నడిపిస్తున్నాడు. అతడు తన దుకాణం ముందుకు వచ్చిన ఏ బిచ్చగాడికైనా తన దుకాణంలో తన చేతికి అందిన ఏ వస్తువునైనా దానం చేసేవాడు. అది ధన రూపంలోనో, వస్తు రూపంలోనో, బియ్యం రూపంలోనో, పండ్ల రూపంలోనో   అలా తన చేతికి దొరికిన దాన్ని దానంగా ఇచ్చేవాడు. అలా తన దుకాణం ముందుకు వచ్చిన ప్రతి బిచ్చగాడికి తప్పనిసరిగా అతడు దానం చేసేవాడు. అలా రామయ్య దుకాణం ముందు దానం కోసం వచ్చే బిచ్చగాళ్లలో రంగయ్య అనే బిక్షగాడు ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నాడు. అదేమిటంటే అతడు తాను రోజంతా భిక్షం రూపంలో తాను పొందినది అది ఏదైనా సరే ఆ మొత్తాన్ని ఆరోజు తనకు అవసరమైనంత మాత్రమే తన వద్ద ఉంచుకుని మిగిలిన దాన్ని    ఊరి చివరన చెట్టుకింద ఉంటూ స్వతహాగా తాము ఏమీ సంపాదించుకోలేని కుంటి, గుడ్డి వాళ్లకు, అనాధలకు దానంగా ఇచ్చేసేవాడు.*

  *రంగయ్య చేస్తున్న ఈ పనిని రామయ్య దుకాణంలో పనిచేసే ఒక గుమస్తా అనుకోకుండా ఈ సంఘటనను ఒకసారి చూడడం జరిగింది. తాను చూసిన ఈ విషయాన్ని ఆ గుమస్తా తన యజమాని అయిన రామయ్యతో వివరంగా చెప్పాడు.*

*అందుకు రామయ్య, అతడు తన వద్ద అదనంగా ఉన్న బియ్యాన్ని వారికి ఇచ్చి అందుకు బదులుగా వారి నుండి ఎంతో కొంత చిల్లర తీసుకొని ఉంటాడు అని అనగా, లేదు లేదు అతను ఏ ప్రతిఫలం ఆశించకుండా, ఏమీ బదులు తీసుకోకుండానే వారికి అతడు వాటిని దానంగానే ఇచ్చేశాడు అని అనగా, ఆశ్చర్యపోయిన రామయ్య ఇది నిజమా కాదా అని పరీక్షించాలి అనుకున్నాడు. అలా రామయ్య మరుసటి రోజు తానే స్వయంగా వెళ్లి అక్కడ జరుగుతున్న విషయాన్ని చూసి ఆశ్చర్యపోయి అలా ఎందుకు చేస్తున్నాడో బిక్షగాడినే అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు.* 

*మరుసటి రోజు బిక్షం అడగడానికి వచ్చిన రంగడికి ఒక అరటి పండును దానంగా ఇస్తూ ‘ఈ అరటి పండును నీవు ఏం చేస్తావు?’   అని అడిగాడు రామయ్య. అందుకు రంగడు ఈ పండును నేను సగం తిని మిగతా సగాన్ని బిక్షం ఎత్తుకోలేని ఇంకొకరికి "ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే " దానంగా ఇస్తాను అన్నాడు. * 

*అయితే మరి ఒక అరటి పండు నీకే కడుపు నింపదు కదా అలాంటి అరటి పండులో తిరిగి సగం ఎందుకు దానం చేస్తున్నావు అని అడిగాడు.*

   *అందుకు రంగడు నేను రోజంతా భిక్షం ఎత్తుకోగా వచ్చిన దానిలో నుండి తప్పనిసరిగా సగభాగాన్ని దానం చేస్తాను. అది నా యొక్క 'ధర్మం ' అన్నాడు.* 

*అందుకు రామయ్య ‘అలా చేయడం వల్ల నీకు వచ్చే లాభమేమిటి?’ అని అడుగగా…* 

*’ఒకరోజు నేను బిక్షం అడగడానికి ఈ వీధి చివర వున్న ఒక పెద్దాయన ఇంటి ముందు నిల్చొని భిక్షం అడిగాను. నా కేక విన్న ఆ ఇంటి పెద్దాయన ‘ఏమేవ్.. ఇదిగో "మూడు జన్మల బిచ్చగాడు " వచ్చాడు వాడికి ఎంతో కొంత భిక్ష ఇచ్చి పంపు!’ అని అన్నాడు. అది విన్న నాకు ఆశ్చర్యం వేసి అదే విషయాన్ని ఆయనతో అడిగాను, ‘అయ్యా ! ఎందుకు మీరు నన్ను "మూడు జన్మల బిచ్చగాడు " అని అంటున్నారు?’ అని అడుగగా, అందుకు ఆ పెద్దాయన ఇలా సమాధానం ఇచ్చాడు, ‘నీవు గత జన్మలో కూడా బిక్షగాడివే. ఆ జన్మలో నీవు నీకు భిక్షంగా వచ్చిన దాన్ని మొత్తాన్ని ఎవరికీ దానం చేయకుండా నీవు నీ కడుపుకు మాత్రమే తినడం జరిగింది. అది మహాపాపం, అందువల్లనే ఈ జన్మలో కూడా తిరిగి నీవు బిక్షవాడిగానే పుట్టావు.*
*మరి ఈ జన్మలో కూడా నీ కొచ్చిన బిక్షాన్ని మొత్తంగా నీవు మాత్రమే తింటున్నావు, కాబట్టి రాబోయే జన్మలో కూడా నీవు తిరిగి బిక్షగాడి గానే పుట్టబోతావు. అందుకే నేను అలా నిన్ను "మూడు జన్మల బిక్షగాడు " అని అనడం జరిగింది!’ అని తెలియజేశాడు.* 

*అంటే "ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉండీ కూడా ఇతరులకు సహాయం చేయకపోవడం మహాపాపం!" అని నాకు అర్థం అయింది. అందుకే అప్పటి నుండి నేను సంపాదించిన దేనినైనా సగభాగాన్ని దానంగా ఇస్తూ దానినే నా ధర్మంగా భావిస్తూ ఆ ధర్మాన్ని నేను ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాను!’ అని చెప్పాడు.* 

*చూశారా ఇదే 'దాన ధర్మాలు ' అనేదానికి అర్థం పరమార్థం. కాబట్టి మిత్రులారా ! మీరు కూడా స్థోమత కలిగిన వారైతే తప్పని సరిగా అవసరమైన వారికి తప్పని సరిగా దానం చేస్తూ ఇతరులకు సాయం చేసే 'ధర్మాన్ని ' ఆచరించండి. అలా మీ జన్మను సార్థకం చేసుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్..*✍️

                      ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                    ▪️〰️▪️
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)