Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*బ్యాక్ పెయిన్*
#1
1211.       1-   2402b3-8.
131023-8.
???????????98.
*మన ఆరోగ్యం…!

                   *బ్యాక్ పెయిన్*
                    ➖➖➖✍️

*"BACK PAIN RELIEF TIPS / వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చిట్కాలు"..*

*వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు.*

*ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం.. సరైన పద్దతిలో కూర్చోకపోవడం వలన వెన్నునొప్పి అధికంగా వేధిస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులను ఉపయోగిస్తుంటారు. ఈ నొప్పి రోజులు కాదు.. సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఇటీవల యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వైద్యులు ఈ ఆహారం వెన్ను నొప్పిని తగ్గిస్తుందని తెలిపారు. మన భారతీయ వంటకాలలో ఉపయోగించే అనేక రకాల ఆహార పదార్థాలు వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.*

*1. ట్యూనా చేప":*
*ఇందులో అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని ఇతర నొప్పి, మంటను తగ్గిస్తుంది.*

*2. "సాల్మాన్ చేప":*
 *ఇందులో కూడా అనేక రకాల పోషక విటమిన్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 ఉండడం వలన నొప్పి, మంటను తగ్గిస్తాయి. దీనికి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం మంచిది.*

*3. "క్యారెట్లు":*
 *ఇవి శరీరానికి మేలు చేసే అత్యంత పోషకాహారం. ఇది వెన్ను నొప్పిని తగ్గించడమే కాకుండా.. అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండడం వలన రోజూవారీ డైట్ లో తీసుకోవడం మేలు.*

*4. "చిలగడ దుంప":*
*చిలగడదుంపలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెన్ను నొప్పిని క్రమంగా తగ్గించడమే కాకుండా.. ఇతర సమస్యలను తొలగిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.*

*5. "నట్స్:"*
*ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో మంచి కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. బాదం, జీడిపప్పు ప్రతి రోజూ తీసుకోవడం వలన వెన్ను నొప్పి తగ్గుతుంది.*

*6. "గ్రీన్ టీ":*
*ఇది కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. కానీ దీంతో చాలా ప్రయోజనాలు న్నాయని ఎవరికీ తెలియదు. గ్రీన్ టీ కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో సహయపడుతుందని అనేక అధ్యాయనాల్లో తేలింది.*✍️
                              ….సేకరణ.
                      ???

   ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)