Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*మెంతులు*
#1
2006F1G1737.0304h3-8.
300923-8
???????????10.
*మన ఆరోగ్యం!*

                    *మెంతులు*
                    ➖➖➖✍️

*మెంతి కూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే మన ఆరోగ్యానికి తిరుగులేదు.*

*మెంతి పొడి, 5 నుండి 50 గ్రాముల మోతాదులో తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.*
 
*మధుమేహంతో  బాధపడుతున్న వ్యక్తుల్లో రక్త  గ్లూకోస్ స్థాయిలను తగ్గిస్తుంది.*

*మెంతి నీటిలో గాలక్టోమన్నన్ (galactomannan) ఉంటుంది, ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. *

*నీటిలో నానబెట్టిన మెంతులను రాత్రి పడుకునేముందు తీసుకుంటే అధికముగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.*

*ఇది మాత్రమే కాక రక్తపోటు స్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.*

*ఋతుస్రావం మొదటి మూడు రోజులలో వచ్చే కడుపు నొప్పి కి మెంతులు వాడటం వలన నొప్పిని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.*

*ఇది  ఋతు చక్రాలను క్రమబద్ధీకరించడంలో కూడా  సహాయపడుతుంది.*

*కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం వంటి వివిధ కడుపు సమస్యలను నివారించడానికి మెంతి విత్తనాలు సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు.*

*కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుభ్రం చేస్తాయి.*

*ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన, అవి మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు.*

*మెంతుల యొక్క పాలి ఇన్సురరేట్డ్ కొవ్వు ఆమ్లాలు (polyunsaturated fatty acids) అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.*

*ఈ కారణంగా కీళ్ళ నొప్పి తగ్గించడానికి మరియు ఆర్థిరైటిక్ వ్యక్తులలో వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.*

*మెంతి విత్తనాలను వివిధ జీర్ణ సమస్యలను నివారించడానికి ఉపయోగిస్తారు.*

*శరీరంలో వేడినొప్పి తగ్గించే ప్రభావం, మలబద్ధకం మరియు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.*

*రోజుకు కనీసం రెండుసార్లు మెంతిపొడిని తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది.*

*పైత్యం ఎక్కువగా ఉన్నపుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి దానికి ఒక చెంచా తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.*

*మెంతులు స్త్రీలలో వివిధ రకాల రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించబడతాయి.*

*మహిళల పాలిసిస్టిక్ అండాశయ వ్యాధి లేదా సిండ్రోమ్ యొక్క లక్షణాలను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది.*

*మెంతి విత్తనాల దీర్ఘకాలిక వినియోగం కూడా అండాశయ తిత్తులు మొత్తం పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.*

*మెంతికూర కు గాయాన్ని తగ్గించే మరియు వాపును నివారించే లక్షణాలు ఉండడం వలన దీనిని ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల లక్షణాల ప్రభావాన్ని తగ్గించేందుకు వినియోగిస్తారు.*

*మెంతులకి యాంటీ బాక్టీరియల్ మరియు యాంటివైరల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది శ్వాసకోశ వ్యాధులకు బాధ్యత వహిస్తున్న సూక్ష్మజీవులను నాశనం చేయడానికి సహాయపడుతుంది.*

*దీని ఉపశమనం కలిగించే చర్యలు శ్లేష్మ పొరను మెత్తగా చేసి కఫాన్ని పోగొడతాయి.*

*మెంతులను తీసుకోవడం వల్ల కిడ్నీ, మూత్రణాళ సభందిత సమస్యలు నయమవుతాయి.*

*ఇంకా శరీరంపై వేడి ప్రభావాలు, బ్రోన్కైటిస్ వంటి వివిధ శ్వాసకోశ రుగ్మతల లక్షణాల నుండి మరియు దగ్గు మరియు సాధారణ జలుబు వంటి సాధారణ అంటురోగాల నుండి ఉపశమనంలభిస్తుంది.*

*మెంతులు,  దాల్చినచెక్క, అల్లం లేదా మిరియాలతో చేసిన టీ ని తీసుకోవడం వలన మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు.*

*ఇది మీ ఇన్సులిన్ మరియు ఇతర నియంత్రిత ఔషధాలపై మీరు ఆధార పడడాన్ని తగ్గిస్తుంది.*

*మెంతి ఆకులను దంచి తలకు పట్టిస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వెంట్రుకలు నిగానిగలాడుతాయి.*

*ముఖం పై వైట్ హెడ్స్ ఉన్నవారు ఈ మెంతి ఆకు పేస్ట్ ని రాత్రి పూట అప్లై చేసి ఉదయం శుభ్రం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ఈ వైట్ హెడ్స్ సమస్య తగ్గుతుంది.*✍️
                    … సేకరణ.
                  ???

   ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)