Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*మైక్రోగ్రీన్స్‌లో పోషకాలు భేష్‌!*
#1
0411x2-9.0805y3-8.
280923-9.
???????????145.
*మన ఆరోగ్యం…!


        *మైక్రోగ్రీన్స్‌లో పోషకాలు భేష్‌!*
                   ➖➖➖✍️

*ఆకుకూరలు ఆరోగ్యానికి అపురూప కానుకలు. *

*కానీ అంతకు మించిన పోషకాల గనులు ‘మైక్రో గ్రీన్స్‌’. అంటే ‘బుల్లి మొక్కలు’.*

*అలాగని మొలకలు(స్ర్పౌట్స్‌) కావు. దాని తరువాత దశ.  *

*రెండు మూడు అంగుళాల పొడవు, చిన్ని చిన్ని ఆకులున్న ఈ ‘మైక్రో గ్రీన్స్‌’ను పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండా ఇంట్లోనే పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం రండి...*

*మొత్తం ఇది ఏడు రోజుల ప్రక్రియ. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలతో   ‘మైక్రో గ్రీన్స్‌’  చేసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు పెసలు తీసుకుందాం…*

*మొదటి రోజు: *
*చెంచాడు పెసలు తీసుకొని, ఓ కప్పు నీళ్లలో వేయండి. దాన్ని మూసేసి, ఒక రోజంతా ఉంచండి.*

*రెండో రోజు: *
*పెసల పైనున్న పొట్టు పెగలడం మొదలవుతుంది. పళ్లెంలో తడి గుడ్డ వేసి, వాటిని పరచండి. నల్లని వస్త్రంతో దాన్ని కప్పండి. వెలుతురు లేని చీకటి ప్రదేశంలో ఒక రోజుపాటు పెట్టండి. *

*మూడో రోజు: *
*పెసలు మొలకెత్తడం మొదలవుతాయి. ఇప్పుడు రెండు అరలున్న (డబుల్‌ కేస్‌) కంటైనర్‌ తీసుకోండి. పై అరకు రంధ్రాలు ఉండాలి. కింది అరలో నీళ్లు పోయాలి. డబుల్‌ కేస్‌ కంటైనర్లు మీకు మార్కెట్‌లో దొరుకుతాయి. రెండు మూడు రోజులకొకసారి నీళ్లు మారుస్తుండాలి. మొలకలను పై అరలో వేయండి. సూర్యరశ్మి అందేలా చూసుకోండి. అలాగని మండే ఎండలో పెట్టకూడదు. *

*నాలుగో రోజు:*
*మొలకలు క్రమంగా వేళ్లు, ఆకులు సంతరించుకోవడం గమనించవచ్చు. *

*ఐదో రోజు: *
*మీరు వేసిన మొలకలు మొక్కలుగా మారడం మొదలవుతాయి. ఎంత సేపు సూర్యరశ్మిని గ్రహించాయన్న దానిపైన వాటి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎండ తీవ్రంగా ఉంటే కంటైనర్‌ను నీడలోకి మార్చండి. లేదంటే చిగురుటాకులు మాడిపోతాయి. *

*ఆరో రోజు: *
*పెసలు ఇప్పుడు ఓ చక్కని మొక్కలా రూపాంతరం చెందుతూ, ఆరోగ్యవంతమైన వేర్లతో కనిపిస్తాయి. *

*ఏడో రోజు: *
*ఏడు లేదా ఎనిమిదవ రోజు... మీరు వేసిన పెసలు ‘బుల్లి మొక్కలు’గా ఎదిగి నవనవలాడుతుంటాయి. వేర్ల పైభాగం నుంచి వాటిని కట్‌ చేసి, ఉడకబెట్టుకొని, మీకు నచ్చిన సూప్స్‌, సలాడ్స్‌, డ్రై కర్రీ్‌సలో వేసుకొని తినవచ్చు. పచ్చిగా కూడా తీసుకోవచ్చు. అయితే వేర్లు మాత్రం తినకూడదని గుర్తుంచుకోండి. *    

*శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు ‘మైక్రో గ్రీన్స్‌’లో పుష్కలంగా లభిస్తాయి. *

*జింక్‌, సెలీనియం, క్యాల్షియం, ఐరన్‌, విటమిన్‌-సీ తదితర ఎన్నో పోషక విలువలు ఈ చిగురాకుల్లో ఉంటాయి. ఆకుకూరల్లో కంటే 40 శాతం, మొలకల కంటే ఎన్నో రెట్ల అధిక పోషకాలు ‘మైక్రో గ్రీన్స్‌’ అందిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.*

*స్టార్‌ హోటళ్లలో ‘మైక్రో గ్రీన్స్‌’ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తారు. ఇప్పుడిది వాటి మెనూలో తప్పనిసరి. *

*ఆవాలు, *
*పెసలు,*
 *రాగులు, *
*సజ్జలు, *
*పొద్దుతిరుగుడు,*
 *క్యాబేజీ, *
*ఆల్ఫాల్ఫా, *
*గోధుమలు, *
*మెంతులు... *
*ఇలా ఎన్నింటినో ‘మైక్రో గ్రీన్స్‌’గా పండించుకోవచ్చు.*
*ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే నాకు 9502173744 ఫోన్ చెయ్యండి. పౌష్టికాహరపరముగా  సలహాలు సూచనలు ఫోన్ ద్వారా గాని sms గాని తెలియ పరుస్తాను.*
*సుధాబాల.మానేపల్లి*
*వెల్నెస్ కోచ్ _న్యూట్రిషనిస్ట్.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

   ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)