Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*ఇచ్చుటలో వున్న హాయి…*
#1
2107b1.2307B1.2️⃣0304ఆ2-8.
080823-7.
???????????

     *ఇచ్చుటలో వున్న హాయి…*
               ➖➖➖✍️


 *మోటివేషన్... మంచి కథ..... సంతృప్తి కథ* 

*ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను.* 

 *బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను.* 

 *పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.* 

       *అప్పుడే.. ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.* 
 
      *హమ్మయ్య.. అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.* 

      *నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది.* 

 *ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.* 

         *ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.* 
     
 *ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.* 

      *‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.* 

     *అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమీ చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.* 

     *"కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు.* 

 *ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు, ఈ తృప్తి చాలు.* 

 *ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.* 

      *నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే...* 

 *ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయినా ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.* 

    *మనం ధనవంతులం, స్థితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు.* 

 *ఇచ్చే మనసున్న ఎవరైనా "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను.* 

 *ఒకరికి ఇవ్వడంలో గల "సంతృప్తి", మరెందులోనూ రాదని అర్థమైంది* 

*”ఇచ్చుటలో వున్న హాయి వేరెచటనూ లేనే లేదని..” పాట గుర్తొచ్చింది.*

 *మిత్రులారా దయచేసి* 

 *సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి.* 

 *మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం.!* 

 *"మానవసేవే మాధవసేవగా తరిద్దాము." *✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)