Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పరాయి శ్రీమతి BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#1
పరాయి శ్రీమతి

పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
పరాయి శ్రీమతి
జీవితం రైలు ప్రయాణం లాంటిది. ఓ కలయిక, ఓ వీడ్కోలు” అన్నారెవరో?
ఆ మాటలు నిజమనిపించేలా జరిగిందా సంఘటన. తన చెల్లి పెళ్లి సన్నాహాల నిమిత్తం ఓ వారం ముందుగా విశాఖకు బయల్దేరిన శ్రీమతిని ఆ సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కించి అలా వీడ్కోలు చెప్పి ఇలా వెనక్కితిరిగానో లేదో…. నవ్వుతూ కనిపించింది వైదేహి.
"నువ్వేంటిక్కడ?" ఇద్దరినోటా ఒకేమాట.
"శ్రీమతిని రైలెక్కించేందుకు...." నేచెప్తున్న వాక్యం పూర్తి కాకుండానే, ఆత్రుత ఆపుకోలేక వైదేహి కూడా అనేసింది- "హజ్బెండ్కి వీడ్కోలు చెప్పేందుకు". "నువ్వెలాగున్నావు?"
"ఇదిగో.... ఇలా!" ఏకకాలంలో మా ఇద్దరి నుంచి మళ్లీ ఓ ప్రశ్న.... ఓ సమాధానం.
ఏకవచనం ప్రయోగించుకునే చనువు మా ఇద్దరికీ ఉంది. కారణం, ఒకప్పుడు ఒకే ఊరిలో, ఒకే కాలనీలో కలిసి తిరిగాం, ఒకే స్కూల్, ఒకే కాలేజీ కాకున్నా ఒకే క్లాసు చదువుకున్నాం. అవసరాలకనుగుణంగా క్లాస్ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకున్నాం. ‘కంబైన్డ్ స్టడీస్' పేరుతో కొన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. సబ్జెక్ట్లకు సంబంధించి సందేహాలు తీర్చుకుంటూ వార్షిక పరీక్షలు రాశాం. ఉత్తీర్ణత సాధించినప్పుడు ఉప్పొంగిపోయాం. అంతేకాదు.... భవిష్యత్తులోనూ ఇలాగే కలిసిమెలిసి జీవితం సాగించాలని ఎన్నో కలలు కన్నాం. అనూహ్యంగా ఆ కలలన్నీ కల్లలు కావడంతో “ఎవరికి వారే యమునా తీరే....” అనుకుంటూ ఇప్పుడిలా విడివిడిగా బతికేస్తున్నాం.
మొదట్లో మేమిద్దరమూ కేవలం స్నేహితులమే. ఆ తర్వాత్తర్వాతే.... స్నేహానికి మించిన మ్యాజిక్ మా మధ్య "సమ్థింగ్ స్పెషల్”గా సాగుతోందని తెలిసి వచ్చింది. సరిగా అప్పుడే.... ఎప్పుడెప్పుడు కలుసుకుంటామా? అనే ఎదురు చూపులు కలుసుకోలేని పరిస్థితుల్లో పిచ్చిచూపులు. కలుసుకున్న వెంటనే.... కలుసుకున్నామనే ఆనందం అరక్షణమైనా మాలో మిగలకుండా కాసేపట్లో విడిపోతామనే బెంగ భయం. దిగులు.
అంతేనా! కలుసుకున్న ప్రతిక్షణంలోనూ చుట్టూ ఉన్న లోకాన్ని మరిచి కళ్లల్లో కళ్ళు పెట్టి చూసుకోవడం, ఒకరి చేతిని మరొకరు ఆత్మీయంగా సృశిస్తూ అనిర్వచనీయానందాన్ని ఆహ్వానించడం, అంతలోనే గమ్మత్తుగా పెదాలపై ముద్దుల ముద్ర లేయడం, గాఢమౌన కౌగిళ్లలో ఒడుపుగా, ఒద్దికగా ఒకరికొకరు ఒదిగిపోవడం.
ఆ జాపకాలు తలచుకున్న కొద్దీ ఇప్పటికీ ఒళ్లంతా థ్రిల్లింతే!
కలుసుకున్న ప్రతి సందర్భంలోనూ తప్పని ఓ వీడ్కోలు. విడిపోయేముందు గుండెల్నిండా బాధ. దూరమవుతూ... చేతులూపుతూ ‘బైబై….’ చెప్తుంటే శరీరంలోని అతి విలువైన భాగమేదో కోల్పోతున్నట్లు కళ్లను కమ్మేస్తూ నీటి తెర ఫలితం... ఎదుటి దృశ్యాలన్నీ మసకబారి పోవడం, ఆపై కళ్లు తుడుచుకుంటూ తను కనిపించేదాకా చూపులు సారించడం.
ఆ ప్రేమపిచ్చిలో తలమునకలవుతూ మాలో
మేం సంబరపడుతుండగానే వైదేహి పెళ్లి హఠాత్తుగా జరిగిపోయింది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని కాదనే దైర్యం తనకి లేక. ఎదురుపడి నచ్చచెప్పే సాహసం నేను చేయలేక అలా చేష్టలుడిగిన సమయంలోనే తను పెళ్లి కూతురైపోయింది. "కనీసం కలిగి బతుకుదామం’టూ నిక్కచ్చిగా ఓ నిర్ణయాన్ని గట్టిగా ప్రకటించలేక…. లేచి పోదాం రారమ్మని చేయందించలేక\... ఓ పక్క నేను నరక యాతన అనుభవిస్తున్న సమయంలోనే తల వంచి ఆమె తాళి కట్టించేసుకుంది.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#3
నిద్ర బరువుతో కన్రెప్పలు వాలిపోతున్న ఓ అర్ధరాత్రి వేళలో వైదేహీ వివాహ వేడుకకి ఓ అతిధిగా, ఓ ఆహ్వానితుడిగా వెళ్లి గుండెల విసేలా మౌనంగా రోదించిన దృశ్యం ఇప్పటికీ నా మనోఫలకం నుంచి చెదిరిపోలేదు.
కొత్త పెళ్లికొడుకు చేయిపట్టుకుని కొత్త జీవితాన్ని అనుభవించేందుకు ఉన్న ఊరుకి, చిన్ననాటి స్నేహితులకి వీడ్కోలు చెప్తూ ఓ సాయంత్రం నా దగ్గరికి వచ్చింది వైదేహి, అప్పుడు మా ఇద్దరి మధ్య మౌనం తప్ప మాటలు లేవు. గుండెల్లో దిగులు తప్ప మరో అనుభూతి లేదు. ‘ఇక వెళ్లివస్తానంటూ’ నా జీవితం నుంచి శాశ్వతంగా సెలవు పుచ్చుకుంది వైదేహి.
సరిగ్గా అప్పుడే ‘ఇకపై జీవితంలో మరెప్పుడూ కలుసుకో కూడదనే నిర్ణయం తీసుకున్నాం. కాకపోతే... ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకరికొకరు తారస పడితే ముఖాలు మాడ్చుకోకుండా చిర్నవ్వులతో పలకరించుకోవాలని ఒట్టు వేసుకున్నాం.
అంతదుఃఖంలోనూ వీడ్కోలు చెప్పే ముందు మా ఇద్దరి మధ్య ఓ ఆత్మీయ స్పర్శ.... ఓ చిన్నిహగ్….. అనిర్వచనీయం.... అత్యద్భుతం.
అదంతా జరిగిన అయిదేళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకి ఇలా.... ఈ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ఫ్లాట్ ఫారాంపై గోదావరి ఎక్స్ప్రెస్ సాక్షిగా అనుకోకుండా ఒకరి కొకరం ఎదురుపడ్డాం... చిర్నవ్వులతో పలకరించుకుంటూ.
ఈ అయిదేళ్లకాలం వైదేహిలో కించిత్ మార్పు కూడా తీసుకురాలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా పెళ్లయిన వెంటనే కొంత మంది ఆడపిల్లలు బొద్దుగా మారిపోతారు. కానీ... అప్పట్లాగానే సన్నజాజితీవెకు చీరకట్టినటు అందం గానే ఉంది వైదేహి.
"నువ్వేం మారలేదు" నేను.
"నువ్వూనూ అదే హెయిర్ స్టయిల్తో అంతే సన్నగా" తను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కొద్ది క్షణాల మౌనం.
***
"పిచ్చిపిచ్చిగా ఉంది" అన్నాను నేను. ఆమె కనిపించిన సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాక.
"నాకూ అలాగే ఉంది" అంది తను కళ్లల్లో మెరుపులు గుమ్మరిస్తూ. "అనుకోకుండా భలే కలిశాం!" ఇద్దరిలోనూ ఆనందం, ఆశ్చర్యం.
"ఇవాళెందుకో.... ఆయనతో స్టేషన్కి రావడం మంచిదే అయింది. నువ్వు కనిపించావు" చెప్పింది.
వైదేహి.
"ఔను ఇవాల్టి రోజునే గోదావరి ఎక్స్ప్రెస్కి శ్రీమతి టికెట్ రిజర్వ్ చేయడం ఇంకా మంచిదైంది. నిన్ను చూశాను" అన్నాను నేను. ఆమెని చూస్తుంటే గుండె గూటికి పండుగొచ్చింది. ట్రైన్ వెళ్లిపోయినా ఫాట్ ఫారం నిండా జనాలే. నవ్వుతూ, తుళ్లుతూ, కబుర్లు చెప్తూ, మేమిద్దరం ఇలా కలుసుకున్నందుకు వేడుక చేసుకుంటున్నట్లు సందడి సందడిగా స్టేషన్.
"ఒక్కసారి నీ చేయి పటుకోవచ్చా?" ఆ హడావుడిలోనే ఆమె కళ్లలోకి చూస్తూ కాస్త మొహమాటంగానే ఆ మాట అడిగేశాను. కనిపించిన వెంటనే చిర్నవ్వులు రువ్వుతూ ఆత్మీయ కరచాలనం చేసుకోవడం ఒక్కటే మాకు ముందు నుంచీ తెలిసింది. అందుకు భిన్నంగా చాన్నాళ్లకు కలిసిన వైదేహిని అస్సలు తాకకుండా మాట్లాడుతుంటే నాలో ఏదో వెలితి. అందుకే... ఆమె ఏమనుకుంటుందోననే సంకోచాన్ని సైతం పక్కకునెట్టి నిస్సిగ్గుగా మనసులో మాటని బయట పెట్టేశాను.
"పట్టుకోవాలనుందా?" అడిగింది తను.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
#4
"ఔను.... ఒక్కసారి. ఒకే ఒక్కసారి" అన్నాను బతిమాలుతున్నట్లు గతంలో ఇలాంటి ఫార్మాలిటీ లేకుండా

ఒకర్నొకరం మట్టుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు మా ఇద్దరి మధ్యా ఎవ్వరూ లేకున్నా... కనిపించని తెర ఏదో మా సాన్నిహిత్యాన్ని అడ్డుతున్న ఫీలింగ్.
నవ్వింది తను. ఆ నవ్వుకు అర్థం తెలీలేదు నాకు.
"పర్మిషన్ కావాలా?"
"పరాయి సొత్తవి కదా!" అన్నాను నేను. నిజానికి, పెళ్లి.... ఓ ఆడను, ఓ మగను ఒకటిగా చేస్తుంది. కానీ, అదే పెళ్లి ఇద్దరు స్నేహితుల్నీ వేరు చేస్తుందనడానికి మేమిద్దరమే సాక్ష్యం.
అంటే?”
"మరొకరి శ్రీమతివి".
"ఔనా..? ఫ్రెండ్వనుకున్నాను. అందుకే ఈ స్టేషన్లో ఇంతమంది ఉన్నా నీ దగ్గరికి వచ్చి ‘హలో…!' చెప్పాను" అంది తను.
"అది తెలుసు." అన్నాను నేను.
"సరే... నువ్వన్నట్లే నేను ఇంకొకరి శ్రీమతిని. నా చేయి పట్టుకోవాలంటే మరి, నా పర్మిషన్ ఎందుకు? ఆ అడిగేదేదో ఆయన్నే అడుగు" అంది వైదేహి మూతి సున్నాలా చుట్టి. తను ఎప్పుడూ అంతే!మూతి సున్నాలా పెట్టి రెచ్చగొడుతుంటుంది.
"ఎవర్ని... మీ ఆయన్నా? బాగుంటుందా?"
"ఏంటి బాగుండేది?"
"అదే.... ఒక్కసారి పర్మిషనిస్తే మీ ఆవిడ చేయి పట్టుకుంటానని మీ ఆయన్ని అడగడం ఏమైనా బాగుంటుందా? అని" చిన్నగా నవ్వాను.
"పిచ్చిమొద్దూ! నిజంగా చేయి పట్టుకోవాలనిపిస్తే పర్మిషన్ అక్కర్లేదు. ఇదిగో... ఇలా పట్టేసుకోవడమే" అంటూ చొరవగా తనే నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని పెదాలతో ముద్దాడింది.
ఆకలై అంబలి అడిగితే ఏకంగా అమృతాన్నే చిలకరించిన దేవతలా కనిపించింది వైదేహి ఆ క్షణంలో నాకు. నిజానికి, మనింట్లో విరగగాసిన జామపండు కన్నా. గోడ దూకి పక్కింటి పెరట్లో దొంగిలించిన పండుకే తీపి ఎక్కువన్న సంగతి అప్పుడే కొత్తగా అవగతమవుతోంది నాకు.
"ఈ చిలిపి నేస్తం ఇక ఎప్పటికీ నాది కాదంటూ ఆమె మెడలోని తాళి నావంక చూస్తూ ఎగతాళి చేస్తున్నా. ఆమె ఇచ్చిన చనువు నాలో అంతులేని సంబరాన్ని నింపింది. తనూ నాలాగే ఆలోచిస్తోందేమో? అనిపించింది నాకు. నా చేతిని కాసేపు ఆమె చేతిలో అలా ఉంచాను. అది తప్పనిపిస్తున్నా…. ఎంతో బాగుంది. అప్పట్లో ఒకర్నొకరు ఇష్టపడుతున్న దశలో…. ఏ ఒక్కటీ ఒప్పుకోకుండా అన్నీ పెళ్లయ్యాకేనంటూ తప్పించుకు తిరిగింది తను. కాస్త చొరవ తీసుకుని అప్పుడప్పుడూ ఇచ్చిపుచ్చు కున్న ఎంగిలి ముద్దులు.... దొంగచాటు కౌగిళ్ళు తప్ప ‘అసలు కార్యం’ అలా’.... కలలా మిగిలిపోయింది. ఆ కల సాకారమయ్యే ముహూర్తం వరించి రానుందా? ఆకాశాన్ని తాకుతున్న ఆశలు. అయినా.... తనకూ నాకూ ఆకాశానికీ, నేలకూ మధ్య ఉన్నంత వ్యత్యాసం. ఆమెని అందుకోగలడా? హృదయానికి హత్తుకుని ఓ రాత్రంతా సేదతీరగలడా? ఆలో చిస్తూ ఆమె వంకే అలా చూస్తున్నాను.
ఆ తర్వాత కొద్ది క్షణాలకు - "ఇక్కడే ఇలా ఈ స్టేషన్లోనే ఉండిపోదామా?" మరోసారి ఇద్దరి నోటినుంచి ఒకే మాటలు.... టీవీ చానెల్స్లో ఒకే సారి ఇద్దరి మాట్లాడే చర్చల మాదిరి.





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply
#5
దాంతో తనేమైనా మాట్లాడుతుందేమోనని నా మాటలకి కొద్దిసేపు విరామం ప్రకటించాను.

సరిగా అదే పంధాను అనుసరించిందేమో..? తనూ నిశ్శబ్దానాశ్రయించింది.
కాసేపటి తర్వాత ఇద్దరం ఒకేసారి "వీలైతే నాలుగు మాటలు.... కుదిరితే కప్పు కాఫీ" అంటూ మళ్లీ మాటలు కలిపాం.
అరగంట క్రితం శ్రీమతి జతగా స్టేషన్లోకి అడుగు పెట్టాను. అది చాలా రొటీన్. ఇప్పుడు వైదేహి తోడుగా బయటికి వస్తున్నాను. ఇది వెరైటీ ఓ దేవత చేయి పట్టుకుని నడిచొస్తున్న ఆ క్షణాలు జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ క్షణాలే.
***
"ఒకేమాట.... ఒకేబాట.... ఒకే గమ్యం" అన్నాను నేను. దగ్గర్లోని కాఫీడేలో ఇద్దరం కూచుని "వన్ బై టూ" కాఫీని షేర్ చేసుకుంటుండగా.
"రెండు గమ్యాలు. రెండు జీవితాలు" అంది తను చటుక్కున నా మాటల్ని విబేదిస్తూ.
ప్రశ్నార్థకంగా ఆమె వంక చూస్తే, "నిజం…. మన మిద్దరం మరో ఇద్దరితో రెండు వేర్వేరు దారుల్లో ఇక్కడికి చేరుకున్నాం. నీ వైఫ్ని రైలెక్కించడానికి నువ్వూ…. ఆఫీస్ టూర్ కెళ్తున్న నా హజ్బెండ్తో కలిసి నేనూ ఈ స్టేషన్కొచ్చిన సంగతి మరిచిపోతే ఎలా సారూ" అంది వైదేహి.
'ఎలా సారూ?’ అంటూ అప్పుడప్పుడు నన్ను తను ఓ రేంజ్లో ఆటాడుకున్న దృశ్యాలు చటుక్కున కళ్ల వాకిళ్లలో ఒక్కసారిగా మెదిలాయి. అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మారు మాట్లాడకుండా కాఫీ సిప్ చేస్తుంటే మళ్లీ తనే అంది- "ఒకప్పుడు ఇద్దరం ఒకటవ్వాలనుకున్నా మరో ఇద్దరు ప్రవేశించడంతో నలుగురయ్యాం. మన జీవితాల్లోకి నీకో పెళ్లాం, నాకో మొగుడు వచ్చి చేరారు".
ఆ మాటలన్న తర్వాత భారంగా నిటూర్చిందో... అది నా భ్రమో తెలీక తికమకపడుతూనే - "పెళ్లి వరకూ దారి తీయని ప్రేమకథగా మిగిలిపోయాం" అన్నాను.
"అనుకోకుండా మళ్లీ ఇలా కలిశాం, జీవితం అంటే ఇదేనేమో. ఓ కలయిక... ఓ వీడ్కోలు" అంది వైదేహి. ఆమె కనిపించిన మొదటి క్షణంలోనే నాలో నేను అనుకున్న మాటల్నే మళ్లీ తన నోట వింటుంటే పట్టరానంత ఆనందంగా ఉంది.
ఆ తర్వాత టాపిక్ డైవర్డ్ చేస్తూ వైదేహి - "చాలా సీరియస్గా మాట్లాడేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పు…. ఎక్కడుంటున్నావు. ఏం చేస్తున్నావు? " అడి గింది.
ఆ తర్వాత ఆమె అడిగిన ప్రశ్నలు, నే చెప్పిన జవాబులను బేరీజు వేసుకుంటే... మేమిద్దరం మళ్లీ ఒకే కాలనీలో పక్క పక్క వీధుల్లోనే ఉన్నట్లు తెలిసింది. భర్త ఉద్యోగ బదిలీ రీత్యా నెల్లాళ్ల క్రితమే వైదేహి ఈ ఊరొచ్చింది.
అంటే... మళ్లీ మనం తరచూ కలుస్తుండవచ్చన్న మాట..." అంది నవ్వుతూ.
మళ్లీ అదేంటీ?”
"ప్రతి కలయిక తర్వాత ఓ వీడ్కోలు తప్పని సరి. ఇప్పుడిలా కలుసుకున్నాం. విడిపోకుండా ఇక్కడే... ఇలాగే ఉండిపోతామా? కదలమా?" అంటూ టేబుల్ పై గిరాటేసిన తన వ్యానిటీ బ్యాగ్ని భుజాన వేసుకుని తను లేచింది.
"అప్పుడే?"
"నాకూ వెళ్లాలనిలేదు. అయితే, ఇంటిదగ్గర మా ఆడపడుచు ఎదురు చూస్తుంటుంది. బాధ్యత"
అంది వైదేహి ముఖం గంటుపెట్టుకుని మరీ.
ఇక నేనూ లేవక తప్పలేదు.





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
#6
"మళ్లీ ఎప్పుడు.... ఎక్కడ?" ఆమె ఆటో ఎక్కబోతుండగా అడిగాను. "రేపు మధ్యాహ్నం తను వాళ్ల అత్తగారింటికి వెళ్తుంది. ఆ తర్వాత ఫుల్ ఫ్రీడమ్ అన్నట్లు, నీ నంబర్ నా దగ్గర ఉంది కదా! ఫోన్ చేస్తా నా కాల్ కోసం ఎదురుచూసే నీలోని పిచ్చిప్రేమికుడిని తట్టి లేపుతా” నవ్వుతూ అంది.
ఆ తర్వాత - "మరీ అంత సస్పెన్స్ భరించలే నేమో? ఓ పని చేద్దాం. రేపు సాయంత్రం మనం మా ఇంట్లోనే కలుద్దాం" ఆమె చెప్తుండగానే ఆటో తుర్రు మంది.
****
వాల్ క్లాక్లో పెద్దముల్లు, చిన్నముల్లు ఒకే ముల్లుగా కనిపించే అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ. ఒకరి ఊపిరి వేడికి మరొకరు మన్మధుడిలా కాలి బూడిదవుతూ ఒకే కౌగిట్లో ఒక్కటిగా ఇద్దరం పెనవేసుకుపోతున్నాం. రక్తం కారేలా ఒకరి పెదాలు ఒకరు కొరుకుతూ... యుగయుగాల తనివి తీరేలా ఒకర్నొకరు గిలుతూ, గిచ్చుతూ ఏ సగమేదో తెలీని రసజగంలో తేలియాడుతున్నాం.
"ఇంకా..." అంది వైదేహి నన్ను మరింత గట్టిగా హత్తుకుంటూ.
"ఇంకా…. ఇంకా?" అన్నాను నేను మత్తుగా.
"ఊ...." అంది తను గమ్మత్తుగా.
గదిలోని వాతావరణం శోభనరాత్రిని తలపించేలా ఉంది. మల్లెల హారాలతో అలంకరించిన పందిరి మంచంపై పాల వెన్నెలాంటి తెల్లటి దుప్పటి. ఆ దుప్పటిపై ఎర్రెర్రని గులాబీ రేకలతో తీర్చిదిద్దిన హృదయాకారం. మధ్యలో బాణం గుర్తు చుట్టూ ఉన్న గోడలపై నిలువెత్తు ఖజూరహో శిల్పసౌందర్యాలు. పక్కనే టీపాయ్ పై గ్లాసుడు పాలు, పళ్ళు మిఠాయిలు.
"ఏమిటిదంతా?" అడిగాను నేను ఆ సాయంత్రం రాగానే.
నువ్వొస్తున్నావనీ…."
"వస్తే...."
"ఏకాంతవేళ…. ఏకాంత సేవ" జలతరంగిణి మోగినట్లు మధురంగా నవ్వింది వైదేహి. ఆ తర్వాత యాపిల్ పండొకటి తీసుకుని ముక్కలుముక్కలుగా తరిగి ఓ ముక్కను నోటికందించింది. సగం ముక్కని నేను కొరకగా.... మిగిలిన ముక్కను తన నోట్లో పెటుకుంది.
"ఎంగిలి" అనబోయాను నేను.
"అమృతం" అనేసింది తను.
"ఇన్నాళ్లూ ఇంత ప్రేమను ఎక్కడ దాచుకున్నావు?" అడిగాను నేను.
"ఇదిగో.... ఇక్కడ” అంటూ తన పైట తప్పించి జాకెట్ చాటు ఎత్తయిన గుండెల్ని చూపించింది. ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చుని ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కదిలే కాలాన్ని అస్సలు పట్టించుకోలేదు.
"ఆకలేయట్లేదా?" అడిగింది కాసేపటి తర్వాత వైదేహి.
"ఆకలుండదు... దప్పికుండదు... నిన్ను చూస్తుంటే" అన్నాను కవితాత్మకంగా నేను.
"అలాగా…. అయితే, అయ్యగారికి ఇవాళ పస్తే మరి" అంది తను నవ్వుతూ.
"నీ సహవాసంలో ఉపవాసం వల్ల కూడా కడుపు నిండుతుంది"
"భోంచేదాం...." అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకి దారి తీసింది తను. ఆమె వెనుకనే నేను. భోజన పదార్ధాలు చూస్తేనే ఆకలి తీరిపోయేలా ఉంది. పప్పు, కూర, రోటిపచ్చడి, సాంబారు, రసం, పెరుగుతో పాటుగా పచ్చగా పులిహోరా, పరమాన్నం.
ఏవిటివన్నీ?”
పండుగలా వచ్చావు.. అందుకే" అంటూ నా చెయ్యి గిచ్చింది.
కొసరికొసరి తను వడ్డిస్తుంటే పీకలదాకా తిని ‘బ్రేవ్’మని తేన్చాను.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
#7
ఇక… సెలవా? అన్నాను నేను రాత్రంతా తనతో గడపాలనే కోరిక గుండెల్లో బుసకొడుతున్నా.

"ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తావు?" అడిగింది తాను.
"ఇంకెక్కడికి….. మా ఇంటికే?" పక్క వీధిలోనే కదా!" అన్నాను నేను.
"నువ్వక్కడ... నేనిక్కడ ఒంటరిగా ఉండటం ఎందుకు?" అంది తను/
అంటే…?”
"పిచ్చి మొద్దూ.... అర్థం కాలేదా? జంటగా మనిద్దరం ఈ రాత్రి ఇక్కడే గడుపుదాం" అంటూనే బెడ్రూంలోకి తీసుకెళ్లి పక్క పై తోసేసి మల్లెపూల చెండులా తను నాపై ఒరిగింది. చేతుల్తో తనని చుట్టేస్తుంటే. తను ముద్దుల్తో మురిపిస్తోంది. చొక్కా గుండీలు తీసి ఛాతీపై ఒక్కో వెంట్రుకని చటుక్కున లాగేస్తోంది. ఆ క్షణంలో ఆ సన్ననైన నొప్పి కూడా మధురంగానే ఉంది. అలా అలా ఒకరితో ఒకరు ఆటాడుతుండగానే.... వాల్ క్లాక్లో పెద్దముల్లు చిన్నముల్లుని ఆబగా కబళించేసింది.
ఇక్కడ ఏకశయ్యపై కూడా జరుగుతున్న తంతు అదే.
ఒకర్నొకరు అల్లుకుంటూ, గిల్లుకుంటూ తమకంలో తేలిపోతున్న తరుణంలో గాలి అలలు తేలియాడుతూ. డిస్టర్స్ చేస్తూ - ‘నీ జతగా నేనుండాలి…’ అంటూ పాట వినిపిస్తోంది. ఉలిక్కిపడి లేచిచూస్తే... పక్కనే టీపాయ్ మీద సెల్ ఫోన్ రాగాలు పోతోంది.
శ్రీమతి చేసిన కాల్ అది. నిద్రమత్తు వదిలించుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాను.
నేను నా గదిలో, నా బెడ్ పైన... అంటే ఇంతసేపూ వైదేహితో నేను? అది కలా? ముఖంపై చల్లని నీళ్లు చల్లినట్లయింది. రేపు సాయంత్రం వైదేహిని కలుస్తాననే ఆలోచనల్లో వేగిపోతూ ఇంటికొచ్చి అలా పక్క
మీద వాలిపోయి అన్నిగంటలూ గాఢనిద్రలో మునిగిపోయి…. వైదేహిని సొంతం చేసుకోవాలనే ఒకే ఒక కోరిక అంతశ్చేతనలో అలజడి సృష్టించిన ఫలి తమే... ఆ కల.
"చాలాసార్లు మీ పోన్కి ట్రై చేశాను. ట్రైన్ జర్నీలో ఉన్నా కదా! సిగ్నల్స్ అందలేదేమో? ఇప్పుడే ట్రైన్ విజయవాడ చేరుకుంది. అర్ధరాత్రి అయింది కదా!" ఒక్క క్షణం ఊపిరి కూడా తీసుకోకుండా శ్రీమతి ప్రేమ గలగలా మాట్లాడేస్తోంది.
"నన్నే తలచుకుని ఆకలిదప్పుల్లో అలా ఉండి పోకండి. వేళకింత తినండి. మనిద్దరం కాకుండా ముందుగా నే బయల్దేరి తప్పు చేశానేమో? అక్కడ మీరు ఒంటరిగా ఉన్నారనే భావన నన్నొక్క క్షణం నిలువనీయడం లేదు. రిజర్వేషన్ చేయించుకున్న దగ్గర్నుంచీ జర్నీ డేట్ ఎప్పుడెప్పుడా? అని ఎంతో ఆశగా ఎదురుచూసిన నేను.... ట్రైన్ బయల్దేరిన దగ్గర నుంచీ మిమ్మల్ని విడిచి వెళ్తున్నాననే ఆలోచనతోనే సతమతమవుతున్నాను. ట్రయిన్ దగ్గర మీరు వీడ్కోలు చెప్తుంటే.... మళ్లీ ఎప్పుడు కలుస్తామా? అనే ఆలోచనతో కన్నీటిచుక్కొకటి చటుక్కున చెక్కిలి పై జాలు వారింది. నిజమండీ..... ఒక్కక్షణం మిమ్మల్ని విడిచి ఉండలేను. పెళ్లికి ముందు సంగతేమో కానీ.... పెళ్లి తర్వాత ఎప్పుడూ ఒంటరిగా పక్కమీద పడుకోలేదు కదూ! భార్యతో కొన్నిరాత్రులు గడిపిన అనుభవాలు గుర్తొస్తూ మీరు ఇబ్బంది పడుతున్నారా? ఓ పని చేయండి. ఆఫీసులో ఆ ఇన్స్పెక్షనేదో వేగంగా కంప్లేట్ అయిందనిపించేసుకుని... . మీరూ ఇక్కడికి వచ్చేయండి. అలుడుగారొచ్చా రంటూ మా వాళ్లు హడావుడి చేస్తారు….." నవ్వు తోంది ప్రేమ.





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
#8
"ఓ నాలుగు రోజులు గడిపేస్తే. పెళ్లికి ఎలాగూ రావాల్సిందే కదా!" అన్నాను నేను. విజయవాడ స్టేషన్నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ కదిలేదాకా తను మాట్లాడుతూనే ఉంది. ఆ మాటల్లో ఇద్దరం కలిసి తొలిసారి చూసిన సినిమా, తొలిసారి వెళ్లిన హోటల్ తొలిసారి చేసుకున్న దైవదర్శనం. మధ్యలో తేనెవెన్నెల జుర్రుకుంటూ గడిపిన హనీ మూన్ ట్రిప్. ఇలా అనేకానేక సంగతుల్ని ప్రస్తా విస్తుంటే ఆమెతో సాహచర్యం కమనీయ, రమణీయ కావ్యంలా తోచింది.

"నిజానికి, ఒంటరిగా నేనెక్కడికి వెళ్తున్నాను. ఇన్నాళ్లూ మీరు పంచిన మధురక్షణాల్ని జాపక సుమాలుగా సిగలో ముడుచుకుని... . ఆ పరిమళాల్ని అగ్రణిస్తున్నాను. అక్కడ మీరు కూడా నాలాగే ప్రతి క్షణం నన్నే తలచుకుంటున్నారు కదూ!” అడుగుతుంటే నా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. స్టేషన్లో తనకలా పేర్వెల్ చెప్తూనే.... కలలా కనిపించిన ఒకనాటి నేస్తంతో కబుర్లలో మునిగిపోయాననే పచ్చి నిజాన్ని చెప్పనా?
"చెప్పండి..." రెట్టించి మరీ అడుగుతోంది ప్రేమ.
"మాటిమాటికీ నువ్వే గుర్తొస్తున్నావు" అన్నాను నేను గొంతు పెగల్చుకుని.
"ఆ సంగతి నాకు తెలుసండి. పెళ్లి మంత్రాల్లో ఏ మహత్తుందో కానీ. ఓ ఆడా, ఓ మగా భార్యా భర్తలైన క్షణం నుంచీ శరీరాలు రెండైనా ఒకే ప్రాణమైపోతారు. ఒకే జీవితమవుతారు. ఒకేమాట.... ఒకే బాట.... ఒకే గమ్యంగా సాగిపోతారు. వీలైనంత తొందరగా మీరు రండి. మీ మరదలికి అక్షింతలు వేయడమే కాదు. క్షణమొక యుగంగా విరహంతో వేగిపోతున్న మీ ప్రియ శ్రీమతికి ఓదార్పు ఇచ్చేందుకు కూడా మీరు తొందరగా రావాలి. మీ రాక కోసం నిలువెల్లా కన్నులై ఎదురుచూస్తున్నాను. ఇక. సెలవా?" అంది ప్రేమ.
ఒకే తప్పకుండా వస్తాను. బెంగపడకు” అన్నాను నేను. ఆ క్షణం నుంచీ నాలో అపరాధ భావన. వైదేహి కనిపించగానే ఎంత తప్పుగా ఆలోచించాడు తను తలొంచి తాళి కట్టించుకుని. ఇంటి గడప తొక్కిన శ్రీమతి కాస్త పక్కకు వెళ్లగానే మనసావాచాకర్మేణా ఆమె పంచిన మధురాను భవాలన్నీ మరిచిపోయి మరీ ఇలా పరాయి శ్రీమతి వైపు పరుగులు తీయడం ఎంతవరకు సమంజసం? చీ... . చీ నా మనసు పెడదోవ పట్టింది. ఇప్పుడు….. ఈక్షణంలో ప్రేమ పోన్ చేయడం మంచిదే అయింది. చేస్తున్నదీ....... చేయబోతున్నదీ పునరాలోచించుకుని ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం చిక్కింది. వైదేహి కనిపించిన ఆ క్షణం నుంచీ మనసు కల్లు తాగిన కోతిలా ఎన్ని గెంతులు వేసింది. ఎన్ని చిత్రాలు చేసింది. ఆలోచిస్తుంటే సిగేస్తోంది. ఇక వైదేహిని అస్సలు కలవకూడదు. ఒకవేళ తను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకూడదు అనుకున్నాను నేను.
****
తెల్లారి లేచిన వెంటనే సెల్ ఫోన్ చెక్ చేస్తే…. శ్రీమతి దగ్గర్నించి పది మిస్డ్ కాల్స్ బహుశా తను విశాఖ చేరి ఉంటుంది. ఆ సంగతి చెప్పేందుకు పోన్ చేసి ఉంటుంది అనుకుంటుండగానే ఇన్ బాక్స్లోకి ఓ మెసేజ్ వచ్చిపడింది.
ఆ మెసేజ్ వైదేహి దగ్గర్నుంచి.
ఏమై ఉంటుంది?" ఆలోచిస్తూ ఆ మెసేజ్ ఓపెన్ చేశాను. సుదీర్ఘమైన మెసేజ్ అది.
"నిన్న నువ్వు అనూహ్యంగా కనిపించావు. ఆనందమేసింది. ఆపుకోలేని ఉద్వేగానికి లోనై చనువుగా నీ చేతినందుకుని మరీ ముద్దాడాను. 'రారమ్మ’ని ఇంటికి కూడా ఆహ్వానించాను. ఆ తర్వాత ఆలోచిస్తే... . ఎప్పుడో విడిపోయిన బంధాన్ని ఇప్పుడు అతికించి ఏం ప్రయోజనం? నువ్వు కేవలం స్నేహి తుడివే అయితే ఫరవాలేదు. కాఫీ ఇచ్చి కాలక్షేపం చేయొచ్చు. కానీ…. స్నేహానికి మించిన ప్రేమ మన మధ్య ఉంది కదా! నువ్వూ నేనూ కలిసిన ఆ ఏకాంత క్షణాల్ని ఏంచేస్తాం? ఒంటరితనాన్ని వెలి వేసి జంటతనాన్ని ఆహ్వానించగలమా? ఆ తర్వాత నీ భార్యకీ, నా భర్తకీ తెలీకుండా ఆ రహస్యాన్ని దాచగలమా? అలా ఎన్నాళ్లు...... ఎన్నేళ్లు?





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
#9
మనిద్దరం కలిస్తే.... ఆ కలయికను బహిరంగంగా చెప్పుకోలేని స్థితిలో మరో అబద్దపు జీవితాన్ని ఆరంభించాలన్నమాట. అదిప్పుడు అవసరమా? రహస్యంగా కలిసి ఒకరికొకరు అర్పించుకున్నంత మాత్రాన జంటగా మారిపోగలమా? మనిద్దరం ఓ జంటని ఈ లోకం ముందు తలెతుకుని దర్గాగా ప్రకటించగలమా? అయినా…. మనం అనుభవించని సౌఖ్యమా అది? మనం ప్రేమికులుగా ఉన్నప్పుడు శరీరాల్లో కుతకుతలాడే వేడి నెత్తురు అలజడి సృష్టిస్తూ…. ‘ఆపోజిట్ సెక్స్’ గురించి ఆరాతీయమని ప్రావోక్ చేస్తుంటే తమాషాగానే ఉండేది.

కానీ….. ఎవరి జీవితాలు వాళ్లకి ఏర్పడిన ఇన్నాళ్ల తర్వాత, అప్పుడు మిస్సయిన అనుభవాలు ఇప్పుడు కావాలనుకోవడం ఆశించడం ఏ మాత్రం అభిలషణీయం? శారీరకంగా ఏకం కాని స్వచ్చమైన స్నేహం మనది. ఆ స్వచ్చత అలాగే ఉండనిదాం.
నిన్న స్టేషన్లో రైలెక్కిన దగ్గర్నుంచీ వరుస కాల్స్తో అనుక్షణం నన్నే తలచుకుంటున్న నా భర్తని తలచుకుంటే నాకు గర్వంగా ఉంది. సమక్షం లోనే కాదు, పరోక్షంలోనూ ఆయన మనసంతా నేనే నిండి ఉన్నానన్న భావనే నాకెంతో సంబరమనిపించింది. బహుశా నీ భార్య కూడా నీ గురించి ఇంతలా తపిస్తూనే ఉంటుందనిపిస్తోంది. అమాయకంగా మన జీవితాల్లోకి అలుకుపోయిన వారిద్దర్నీ విస్మరించి మనిద్దరం కలిసి ఏదో సాధించాలనుకోవడం స్వార్ణం. మోసం కదా! ఈ సాయంత్రం నువ్వు మా ఇంటికి రావద్దు. వచ్చినా నేనుండను. కారణం, ఈ మధ్యాహ్నమే నేను మా ఆడపడుచుతో వాళ్లింటికి వెళ్తున్నాను. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు. నిన్ను కలవకముందే తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఆ నిర్ణయాన్నే అమలు పరచాలనుకుంటున్నాను. ఊరు నుంచి మా ఆయన ఇంటికి రాగానే వీలైనంత త్వరగా ఈ కాలనీలోంచి సిటీలో మరెక్కడికైనా మారిపోవాలనుకుంటున్నాను. ఇది నీ నుంచి పారిపోవడం కాదు. మనసు మార్చుకున్నాను. జీవితమంటే ఓ కలయిక..... ఓ వీడ్కోలు...... మన కలయిక ‘కల’ ఇక. ఈ వీడ్కోలే శాశ్వతం. తప్పుగా భావించకు మిత్రమా! మళ్లీ మనం కలవద్దు - వైదేహి.


*** THE END  ***





[+] 6 users Like LUKYYRUS's post
Like Reply
#10
fantasic
Like Reply
#11
Fantastic superb story
 Chandra Heart
Like Reply
#12
Good story...
All the images that I post are collected from the Internet and not my own. In case of any discomfort to anyone, please contact me so that I can delete the content.
Like Reply
#13
Superbbb story bro... I really liked it...
Like Reply
#14
Good story
Searching for cuckold hubbys to chat and fun

Like Reply
#15
ఎప్పటిదో ఈ కథ.. ఈ రోజుల్లో ఇలాంటి కథలు ఎవరైనా రాస్తున్నారా?

ఏదేమైనా అద్భుతం...
Like Reply
#16
Excellent fantastic story
Like Reply
#17
Heart touched
Like Reply




Users browsing this thread: 1 Guest(s)