Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కొంతమంది *నేటి యువత!* *పుట్టుకతో వృద్ధులా?*
#1
2809.     1-4.     2803c 3-7.
291023-4
???????????
*కొంతమంది…*

               *నేటి యువత!*
                 ➖➖➖✍️
           *పుట్టుకతో వృద్ధులా?*

*అప్పుడప్పుడు నాకు వీధుల్లో నడుం వంగిపోయిన ముసలమ్మ, ముసలయ్యలు కర్ర పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లడం కన్పిస్తుంది.* 

*నడుం వంగిపోవడం వల్ల వాళ్ల విజన్ కేవలం వాళ్లు నిలుచున్న చోటి నుండి రెండు మూడు అడుగులు మాత్రమే కన్పిస్తుంది. దూరంగా చూడాలంటే నడవడం ఆపేసి తల పైకెత్తి చూడాలి.*

*అలాగే నాకు అప్పుడప్పుడూ 20-30 ఏళ్లు కూడా నిండకుండానే కాస్త దూరం నడవడానికి ఆపసోపాలు పడే యువతరం కూడా కన్పిస్తూ ఉంటారు. అడుగులు వేసే కొద్దీ వాళ్ల మొహంలో రకరకాల హావభావాలు మారుతూ ఉంటాయి. అబ్బ, అయ్య అనుకునేలా మూతి ముప్ఫై వంకర్లు తిరుగుతూ ఉంటుంది, ఆయాసం కూడా వస్తూ ఉంటుంది.*

*ఈ రెండు దృశ్యాలకూ మధ్య నాకు పొంతన కుదరదు. అసలు ఎప్పుడూ ఫోన్లు చేతిలో పెట్టుకుని గేమ్స్ ఆడుకుంటూ, ఛాటింగ్ చేసుకుంటూ తమకి   ఓ శరీరం ఉందనీ, దానికి అప్పుడప్పుడు పని చెప్పాలని, ఒళ్లొంచాలనీ కూడా మర్చిపోయి... అదేమంటే "మేము యూత్" అని ఫోజులు కొట్టే యువతని ఏమనాలో కూడా అర్థం కాదు. సరిగ్గా నాలుగడుగులు కూడా వెయ్యలేరు. గంటసేపు ఓచోట స్థిరంగా కూర్చుని పనిచెయ్యలేరు. నిముషానికి పది distractions. కోరుకున్నవన్నీ కొంటున్నా, ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నా బోర్.. బోర్ అంటూ చికాకు మొహం పెట్టేస్తారు. అది చూడలేక చావాలి. వీళ్ల కన్నా రేపో ఎల్లుండో చావు దగ్గరపడుతున్నా ఓపికగా తమ పనులు తాము చేసుకుంటున్న పెద్ద వాళ్లు వంద రెట్లు నయం.* 

*అసలు కొన్నిసార్లు అన్పిస్తుంది.. ఇలాంటి సత్తువ లేని యువతరం రేపు 40, 50, 60 ఏళ్లు వచ్చేసరికి ఎలా ఉంటారో ఊహకు కూడా అందదు!*

*తిండి లేదా అంటే కడుపు నిండా తింటారు. బిర్యానీలూ, పేస్ట్రీలూ, పిట్జాలూ, చికెన్ లెగ్ పీస్‌లూ, పానీపూరీలూ.. కన్పించిందల్లా తినేస్తూనే ఉంటారు. కానీ ఓపిక ఉండదు. శరీరంలోనే కాదు, మనస్సులోనూ బద్ధకం, నిస్సత్తువ. ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ జీవితం అనుకునే బాపతు. మాటల్లో ఎనర్జీ ఉండదు, చూపులన్నీ జీవం కోల్పోయి కనీసం లూబ్రికేషన్ కూడా లేకుండా ఎండిపోయి ఇవ్వాళో రేపో టపా కట్టేటట్లుంటాయి.*

*బాడీ లాంగ్వేజ్‌లో డైనమిజం ఉండదు.*

*ఇది కాదు లైఫ్! చెమటలు దిగగారేలా కష్టపడండి.. ఏమీ అవ్వదు! కలర్ తగ్గిపోతామనీ, టాన్ అయిపోతామనీ.. ఒళ్లునొప్పులు వస్తాయనీ భయపడిపోయే సుకుమారపు జీవితం వదిలిపెట్టండి. సమ్మర్‌లో గాలి ఆడక తప్పించి ఈ మధ్య కాలంలో ఇంటెన్షనల్‌గా కష్టపడి ఎంతమంది మీ చెమటని మీరు కళ్లారా చూశారు? ఒళ్లంతా చెమటలు దిగగారేటప్పుడు శరీరం, మనస్సూ ఫీలయ్యే ఓ లయబద్ధమైన హార్మోనీ ఎంతమంది ఈ మధ్య కాలంలో చవిచూశారు?*

*తిండి తినడం... ఫేస్‌బుక్, వాట్సప్‌లో కబుర్లు చెప్పుకోవడం, నిద్రపోవడం మాత్రమే కాదు. ఇవన్నీ లేనప్పుడు శరీరానికి ఉన్న ఫిజికల్ యాక్టివిటీని గుర్తు తెచ్చుకుని.. ఫోన్ పక్కన పడేసి కాస్త కష్టపడండి. లేదంటే.. 80 ఏళ్లకు కాదు, 35-40 ఏళ్లకు వంగబడి, స్పాండి‌లైటిస్‌తో తల అటూ ఇటూ తిప్పలేక, ఓ పదినిముషాలు నిలబడితే lower back కలుక్కుమంటూ, కాస్త నడిస్తే మోకాళ్లు, మజిల్ పెయిన్స్ వస్తూ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోతారు! ఇదా క్వాలిటీ లైఫ్? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.*✍️
           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                      ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
కొంతమంది *నేటి యువత!* *పుట్టుకతో వృద్ధులా?* - by Yuvak - 03-11-2023, 08:53 AM



Users browsing this thread: 1 Guest(s)