Thread Rating:
  • 57 Vote(s) - 3.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
#1
సమయం  ఉదయం 11:30
 ఆగకుండ ఒకటే పనిగా మొగుతున్న ఫోన్ సౌండ్ కీ నిద్రలో  చిరాకుగా ఫోన్ అందుకొని నిద్రమత్తులో "హలో "అనగానే

అవతలి వైపునుండి "నానా ఎలా ఉన్నావ్ రా, ఇంక నిద్ర లేవలేదా "అన్నా తండ్రి మాటలు వినిపించగానే ఉలిక్కిపడి లేచికుర్చున్న  తడబడుతూ
 "లే లే లేదు నాన్న ఎప్పుడో లేచాను"

"సరేలే కానీ ఏమైపోయావ్ అస్సలు ఫోన్ కూడ చేయట్లేదు అక్కడ అంత బాగానే ఉంది కదా "

"హా అంత బాగానే ఉంది నానా కొంచెం పనిలో బిజీ గా ఉండటం వల్ల ఫోన్ చేయలేకపోయాను, అమ్మా చెల్లి అందరూ బాగున్నారా ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది "

"అందరూ బాగున్నారు మీ అమ్మా ఐతే ఎప్పుడు ని మీదనే బెంగ ఎలా వుంటున్నావో అని, నానా నందు అక్కడ ఇబ్బంది గా ఉంటే ఇక్కడికి వచ్చేయ్ రా మనకు ఉన్న దంట్లోనె బతుకుదాం ఎందుకు రా అక్కడ అన్ని ఇబ్బందులు పడుకుంటూ "

"నాన్న నాకు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు బాగానే ఉన్న మీరేం బాధపడకండి "

"సరే రా జాగ్రత్త ఏదేనా అవసరం ఉంటే ఫోన్ చెయ్"

"సరే నాన్న అమ్మా ని చెల్లి ని అడిగినట్టు చెప్పండి ఆరోగ్యం జాగ్రత్త bye"

ఫోన్ కట్ చేసి ఫోన్ ని అలానే చూస్తూ ఉండిపోయాను......

నా పేరు నందు మాది అనకాపల్లి పక్కన ఒక చిన్న పల్లెటూరు,నాకు ఒక అక్క ఒక చెల్లి, అక్కకీ మంచి సంబంధం వస్తే ఉన్న పొలం కొంత అమ్మి, కొంత అప్పు తీసుకొని పెళ్లి చేసాము ఇప్పుడు అక్కకి ఇద్దరు కొడుకులు, ఇంక చెల్లి డిగ్రీ రెండొవ సంవత్సరం చెల్లికి కూడ సంబంధాలు చుస్తున్నాం,ఒకప్పుడు మాది బాగా బతికిన కుటుంబమే కానీ కష్టాలు, అవసరాలు ఏదో అద్భుతం జరిగినట్టు పిడుగు పడినట్టు ఒకేసారి మీద పడ్డాయ్,  నాన్నగారికి ఆరోగ్యం బాగోలేక గుండె ఆపరేషన్ జరిగింది ఒక సంవత్సరం క్రితం వరకు కూడ  బెడ్ మీదనే ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ చాలా ఖర్చు అయ్యింది నాన్నగారుకీ నయం అవ్వటానికి, అప్పులు బాగా పెరిగిపోయాయి, నాన్నగారు బెడ్ మీదనే ఉండటం తో అప్పటి వరకు ఎ బాధ్యత లేని నా మీద బాధ్యతలు  పడ్డాయి. నేను కాలేజీ కీ వెళ్తూనే మా పొలం పనులు చూసుకునే వాడిని అలా మా నాన్నగారికి నయం అయ్యే వరకు నేనే చూసుకున్న. ఇప్పుడు నా చదువు ఐపోయి కూడ ఒక సంవత్సరం అయ్యింది

ఒకరోజు మా ఉరి సర్పంచ్ సోమయ్య మా ఇంటి  మీదకొచ్చి గొడవ పెట్టుకున్నాడు అక్క పెళ్లికీ తీసుకున్న అప్పు కట్టలేదని ఇష్టం ఒచ్చినట్టు మాట్లాడాడు , సోమయ్య ఎన్ని మాటలు అన్నా ఏం చేయలేక డబ్బు కట్టలేక మోనంగా ఉండిపోయాడు నాన్న ,ఆ రోజు మా నాన్న  చాలా బాధపడ్డారు. అలా నాన్నని చూసి తట్టుకోలేక పోయా ఇంక నేను కూడ ఏదో ఒక ఉద్యోగం చేసి నాన్నగారికి సహాయపడాలి అనుకున్న, అనుకున్న విధం గానే నేను నా ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చాము. ఇద్దరం కలిసి ఒక సింగల్ బెదురూమ్ ఇల్లు అద్దె కీ తీసుకొని ఉంటున్నాం


హైదరాబాద్కీ   ఉద్యోగం కోసం వచ్చి ఇప్పటికీ 4 నెలలు కానీ జాబ్ లేదు ఏదో పార్టీ టైం జాబ్ చేసుకుంటూ ఇంటర్వ్యూ కీ అటెండ్ అవుతున్నాం......

"రేయ్ మామ ఏం ఆలోచిస్తున్నావు రా ఎంత పిలిచినా పలకటం లేదు "అనే మాటలకూ ఈ లోకం లోకి వచ్చి నా ఎదురుగా చేతిలో రెండు సంచులతో నిల్చున్న నా ఫ్రెండ్ శేఖర్ కనిపించాడు, వాడ్ని చూడగానే ఎందుకో వింతగా కనిపించాడు

"ఏం లేదులే కానీ ఏంటి చేతిలో ఆ బాగ్స్, డబ్బులు ఎక్కడివి, ఏంటి ఈ సామాను అంత "అంటు లేచి హాల్ లోకి నడిచాను

"ఏంటి నందు డబ్బులు ఎక్కడివి  అంటున్నవ్ నైట్ ఏం జరిగిందో గుర్తులేదా "అంటు నా వైపు అయోమయం గా చూస్తున్నాడు

సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ " హా నైట్ ఏం జరిగింది పుట్టినరోజు అని బొంగులో  పార్టీ అని ఉన్న డబ్బంతా తాగుడికి పెట్టావ్ , ఇప్పుడు ఒక్కరూపాయి లేదు ఆ ఓనర్ గాడు  రెంట్ కోసం వస్తాడు వాడికి ఏం చెప్తావో చెప్పు "అంటు చిరాకుగా ఫోన్ చూసుకుంటున్న

వాడు చిన్నగా నవ్వుతు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తు"వాడికి రెంట్ మొత్తం కట్టేసాలే నువ్వేం కంగారు పడకు "అంటు బీర్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు

శేఖర్  అలా చెప్పగానే  కొంచం షాక్ అయ్యి  వాడు ఇచ్చిన బీర్ తీసుకొని వాడ్ని ఆ బీర్ ని మార్చి మార్చి చూస్తూ "ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రెంట్ కట్టావా, రెండు నెలల రెంట్ కట్టావా అస్సలు డబ్బులు ఎక్కడివి, అస్సలు ఈ బీర్ ఎక్కడిది, ఆ సామాన్లు ఏంటి మన దగ్గర డబ్బులు లేవు కదా రాత్రి మొత్తం ఐపోయాయి కదా "

నా ఎదురుగా కూర్చొని బీర్ తాగుతూ "ఐతే నైట్ ఏం జరిగిందో నీకు గుర్తులేదు అన్నమాట , ఏం లేదు మామ నైట్ మనం రూమ్ కీ వస్తుంటే మనకి చిన్న ఆక్సిడెంట్ అయ్యింది....."

"ఏంటి ఆక్సిడెంట్ ఆ  నువ్వు నేను బాగానే వున్నాం కదా "అని నన్ను మొత్తం చూసుకొని" ఎవరికి ఏం కాలేదు కదరా అస్సలు ఆక్సిడెంట్ ఎలా జరిగింది " అంటు కంగారుగా చితిలో ఉన్న బీర్ మొత్తం ఒకేసారి లేపేశాను

 వాడు నన్ను అలా చూసి నవ్వుతు "మనకు ఏం కాలేదులే నాకే చేతికి రాసుకుపోయింది కాకపోతే బైక్ కీ కొంచం డామేజ్ అయ్యింది "
"ని యబ్బ ఏం మాట్లాడుతున్నావ్ రా బైక్ కీ ఏం అయ్యింది దానికి ఏమైనా అవ్వాలి ని సంగతి చెప్తా "అని వేగంగా పరిగెత్తి బయటికీ వచ్చి నా బైక్ ని దగ్గర నుండి మొత్తం చూసా కానీ ఏం కాలేదు అంత బాగేనే ఉంది

 నేను అయోమయం గా వాడి వైపు చూస్తే వాడు పళ్ళు బయటపెట్టి "మామ చెప్పేదాకా వినవా, ఆక్సిడెంట్ అయ్యింది నిజమే బైక్ కీ కూడ డామేజ్ అయ్యింది నేనే మార్నింగ్ తీసుకెళ్లి మొత్తం కొత్తవి వేసి తీసుకొచ్చా కావాలంటే చూడు అని వాడు చూపిస్తుంటే కొంచం జాగ్రత్తగా గా చూడగా కొత్తగా ఉన్నాయి

"ని గురించి నాకు తెలుసు కదా మామ ఈ బైక్ కీ ఏమైనా ఐతే నా ప్రాణం తీస్తావ్ అని "నవ్వుతున్నాడు

నాకు అంత అయోమయం గా ఉంది "అస్సలు ఏంట్రా ఇదంతా మనకి ఆక్సిడెంట్ జరగటం ఏంటి అస్సలు నీకు ఇంత మనీ ఎక్కడ నుండి వచ్చాయి "అని కొంచం కోపం గా చిరాకుగా అడిగేసరికి

"ఉచ్చ ఆగదు కదరా నీకు ప్రతిదానికి తొందరే చెప్పేదాకా వినవా పద లోనికి కూర్చొని మాట్లాడుకుందాం "అంటు లోనికి నడిచాడు వాడి తో పాటు నేను కూడ వెళ్ళాను

"నువ్వు నేను బార్ లో తాగి వస్తుంటే మన ఇంటికి వచ్చే టర్నింగ్ లో ఒక కార్ వచ్చి గుదింది టర్నింగ్ అవ్వటం వల్ల కార్ నెమ్మదిగానే రావటం తో మనకి ఏం కాలేదు  బైక్ కీ డామేజ్ అవ్వటం తో  నువ్వు చేసిన రచ్చ మామూలుది కాదు డబ్బులు ఇచ్చేవరకు వదిలి పెట్టలేదు, వాళ్ళను కొట్టావ్ కూడ"

"ఏంట్రా డబ్బులు ఇచ్చే వరకు విడిచిపెట్టాలేదా పైగా కొట్టనా రేయ్ చెప్తే నమ్మేలా ఉండాలి "

"అయ్యా...సారూ అక్కడ మిమ్మల్ని చూసి నేనే నమ్మలేదు కానీ  నాకర్ధం కానీ విషయం ఏంటంటే నువ్వు కొట్టిన కూడ ఆమె నిన్ను ఒక్కమాట కూడ ఏం అనలేదు నన్ను మాత్రం చెంప పగలకొట్టింది "

"ఏంట్రా ఏం అంటున్నవ్ నేను కొట్టింది అమ్మాయి నా "

" అంత ఆశ్చయార్యపోకు నువ్వు కొట్టింది అమ్మాయి నె, కానీ మామ అబ్బా  అమ్మాయి వుంటది రా ఏం అన్నా అందమా అలాంటి అందాన్ని ఇప్పటి వరకు చూడలేదు అంటే నమ్ము, నువ్వు చూస్తే మాత్రం అస్సలు ఆగవు రా అలా ఉంటుంది కానీ అదొక పెద్ద రాక్షసి అందం తో పాటు పొగరు బలుపు కూడ ఎక్కువే , బలిసినోళ్లు ఇలానే ఉంటారేమో, నువ్వు డబ్బులు అడిగితే ఏదో చిల్లర ఇచ్చినట్టు గా ఒక కట్ట ఇచ్చింది రా నేను ఐతే షాక్ అస్సలు"

"దాని అందం గురించి ఎందుకు కానీ డబ్బులు కట్ట ఇచ్చిందా"

"హ ఆవును మామ ఆమె ఇచ్చిన వాటితోనే ఇవన్నీ"

"అబ్బా మంచి పని చేసావ్ రా ఇప్పుడు రెంట్ కట్టాలనే టెన్షన్ లేదు సరే కానీ ఇంక ఏమైనా అందా ఆ అమ్మాయి "

"లేదు మామ  అస్సలు తను ఒక్కమాట కూడ మాట్లాడలేదు మొత్తం నువ్వే వాగావ్, మనం వెళ్లే దాకా అక్కడే ఉంది "

"హో... సరే లే ఐతే మిగిలిన డబ్బులు అలానే వుంచు ఈ నెల వాటితోనే ఉన్న డబ్బులు అన్ని నైట్ ఐపోయాయి కాబట్టి జాగ్రత్త గా ఖర్చుపెట్టు "

"అబ్బా మామ నాకు తెలుసులే ఆమె చాలానే ఇచ్చింది  లే  రా కానీ ముందు మందు ఎదం పట్టు పొద్దున్నే వైన్స్ తెరవగానే మనదే ఫస్ట్ బోణి  ఈ రోజు కరువు తీరా తాగాలి ఎన్ని రోజులు ఐయ్యింది రా కడుపు నిండా తాగి "అంటు బీర్ తాగటం మొదలు పెట్టాడు

"నువ్వు పెద్ద తాగుబోతుడివి రా "అంటు నేను తాగటం మొదలు పెట్టాను

"ఆహా అవునా నానా నువ్వు నన్ను అంటున్నావా చాల్లే ఆపు "

నేను వాడి వైపు చిన్న నవ్వు నవ్వి మొత్తం బీర్లు కాళీ చేసే పనిలో పడ్డాను

అలా ఆ రోజు గడిచిపోయింది, తరవాత రోజు యాదవిధిగా మా ఉద్యోగాలా వేట మొదలు పెట్టాం. నేను b. Tech కంప్లీట్ చేశా వాడు కూడ అంతే కానీ మా మార్కులు చూసి ఒక్కడు జాబ్ ఇవ్వటం లేదు కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఎప్పటికి ఐనా జాబ్ వస్తుంది అనే ఆశతో ప్రయత్నిస్తూనే వున్నాం అలా మా జీవితం కొనసాగుతూనే ఉంది

ఒక వారం తరువాత

పోస్టుమెన్ రావటం తో నేను వాడు ఇద్దరం తీసుకొని చూస్తే ఇద్దరం షాక్ అస్సలు ఎందుకంటే మా ఇద్దరికి జాబ్ వచ్చింది, ఇక్కడ ఇంకో పెద్ద షాకింగ్ విశయం ఏంటంటే మేము ఈ కంపెనీ కీ అప్లై నె చేయలేదు ఎందుకంటే చిన్న చిన్న కంపెనీ లే మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాయి అలాంటిది అంత పెద్ద కంపెనీ లో మమ్మల్ని గేట్ కూడ తాకనివ్వరు అని చేయలేదు కానీ ఇప్పుడేమో అదే కంపెనీ లో మాకు జాబ్ వచ్చింది  నేను ఐతే ఫుల్ హ్యాపీ కానీ వాడు మాత్రం కొంచం బాధగా కనిపించాడు

"రేయ్ ఏంట్రా జాబ్ వస్తే సంతోషం గా ఉండాలి కానీ నువ్వెంటి మొకం అలా పెట్టావ్ ఇన్ని రోజులు జాబ్ కోసమే కదా ఎదురుచూసింది ఇది బాధ పడే సమయం కాదు మొకం మార్చు "

నేను అలా అనగానే నా చేతిలో వాడి అప్పోయింట్మెంట్ లెటర్ పెట్టాడు చదవమని నేను వాడి వైపు వింతగా చూస్తూ చదవటం మొదలు పెట్టా అప్పుడు అర్ధం ఐయ్యింది మనోడి బాధ  వాడికి పోస్టింగ్ బెంగళూరు మెయిన్ బ్రాంచ్ లో ఇచ్చారు అదే వాడి బాధ నాకు కూడ బాధగానే ఉంది కానీ తప్పదు.

ఇద్దరం కొద్దిసేపు సైలెంట్ వున్నాం ఇంక నేనే "అరేయ్ శేఖర్ మన మోకాలకి జాబ్ రావటం నె ఎక్కువ ఇప్పుడు మంచి జాబ్ వచ్చింది మనం కల్లో కూడ అనుకోము రా ఇలాంటి కంపెనీ లో జాబ్ వస్తుంది అని అందుకే ఎక్కడో ఒక దగ్గర చేయాల్సిందే రా "

"నాకు బెంగళూరు లో ఒచ్చింది అని బాదేం లేదు రా ఇంక చెప్పాలంటే సంతోషం గానే ఉంది కానీ ఇన్ని రోజులు కలిసి వున్నాం దూరం అవుతుంటే కొంచం బాధ మళ్ళీ రేపటి లోపు అక్కడ ఉండాలి అందుకే రా మావ"

"హో ఆదా విషయం ఏం ఉంది రా వీకెండ్ ఎలాను మనకు సెలవే కదా ఒక వారం నువ్వు రా ఇంకో వారం నేను వస్తాను ఆ విషయం గురించి వదిలేయ్ రేపటిలోపు అంటే ఈవెనింగ్ కీ వెళ్ళిపోవాలి కాబట్టి అన్ని రెడీ చేసుకొని వెల్దువ్ పద "

ఇంక నేను అలా చెప్పగానే వాడు సరే అని అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు  ,అలా ఈవెనింగ్ కీ వాడ్ని బస్సు ఎక్కించా

ఇద్దరం కలిసి ఉన్న ఈ ఇంట్లో ఒక్కడికి కొంచం బోర్ గా అనిపించింది కానీ తప్పదు ఇంక అలవాటు చేసుకోవాలి అనుకోని జాబ్ వచ్చిన ఆనందం లో ఫుల్ గా తినేసి రేపు పొద్దున్నే ఆఫీస్ కీ వెళ్లాలని ఆనందం గా నిద్రపోయా.....................
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 09-09-2023, 08:35 PM
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM



Users browsing this thread: 3 Guest(s)