Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
Wow థాంక్స్ ప్రెసిడెంట్ అనిచెప్పి ఇంట్లోకి వెళ్ళాము . అన్నయ్యా ఫ్రెష్ అయ్యివస్తాను అని పైకివెళ్ళింది . వెంటనే బయటకువచ్చి కారులోని కూల్ కేక్ తీసుకొని లోపలికివచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాను . మరునిమిషం అన్నయ్యా పైకిరా అని పిలిచింది . వస్తున్నా రా బంగారు అంటూ పైన రూంలోకి వెళ్లి ఎక్కడ ఉన్నావురా ......., అన్నయ్యా బాత్రూమ్లో ........లోపలికి వెళితే tap వాటర్ వదిలింది కానీ చేతులకు గోరింటాకు వలన ఫేస్ వాష్ ఎలాచేసుకోవాలో తెలియక దీనంగా నిలబడిపోయింది . 



నాకు కూడా ఏమిచెయ్యాలో తెలియక సొల్యూషన్ కోసం ఆలోచిస్తున్నాను . అన్నయ్యా ఇంకా అలా నిలబడ్డావే సబ్బు అందుకొని ఇప్పుడు నువ్వే నాకు ముఖం కడగాలి అని చెప్పింది . నా ఏంజెల్ గోరింటాకు ఘాడతతో పండటం కోసం ఏమైనా చేస్తాను అంటూ మొదట తన భుజాల చుట్టూ టవల్ చుట్టి నవ్వుతూ వొంగమని చెప్పడంతో , మూసిముసినవ్వులు నవ్వుతూ అలాగే అన్నయ్యా అంటూ వొంగి ముఖం నాకు చూపించింది . చెల్లెమ్మా కళ్ళుమూసుకొమ్మని చెప్పి నీటితో తడిపి సబ్బు పట్టించి మళ్లీ నీటితో వాష్ చేసాను . నీళ్లు ఒంటిపై పడకుండా వెంటనే టవల్ అందుకొని తుడిచి ముఖం పై పడిన వెంట్రుకలను చెవుల వెనక్కు తోసాను . అన్నయ్యా నేను చెప్పినట్లు చెయ్యి అంటూ ఎలా అలంకరించమంటే అలా చేసాను . అద్దం లో చూసుకొని ఉమ్మా........మా అన్నయ్య నన్ను ఎంత అందంగా మార్చేసాడో అంటూ మురిసిపోయి నా గుండెలపై వాలింది . 



నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను ఇద్దరమూ కలిసి టీవీ చూద్దాము అనిచెప్పి వెళ్లి రెడీ అయ్యి వచ్చేటప్పటికి చెల్లి కింద హాల్ లో సోఫాలో కూర్చుంది . టీవీ on చేసి తన ప్రక్కన కూర్చోగానే నాచేతిని చుట్టేసి భుజాలపై వాలిపోయి కామెడీని ఇద్దరమూ పగలబడి నవ్వుకుంటూ ఎంజాయ్ చేసాము . గంటలు నిమిషాల్లా గడిచిపోయాయి . మొబైల్ మ్రోగడంతో చూస్తే ప్రెసిడెంట్ డిన్నర్ గుర్తుకువచ్చి సమయం చూసి అప్పుడే 8 అయ్యిందా అని ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయి కాల్ ఎత్తాను . మహి మహేష్ డిన్నర్ రెడీ వచ్చెయ్యండి అని చెప్పింది . 



అప్పటికి కానీ ఆకలి గుర్తుకురాలేదు చెల్లెమ్మా ఆకలి అంటూ నవ్వుకుని ఇద్దరమూ బయటకు వచ్చాము . గేట్ బయట ఉదయం వచ్చిన వెహికల్ ఉండటంతో నా పిలుపు కోసం wait చేస్తున్నారని , చెల్లిని కారులో కూర్చోబెట్టి ఒక్కనిమిషం రా అనిచెప్పి బయటకువచ్చి , అన్నా one hour మాక్సిమం అని చెప్పాను . అందుకే చాలామందిమే వచ్చాము ఆ సమయం చాలు అని చెప్పడంతో , థాంక్స్ అన్నా అంటూ కారులో ప్రెసిడెంట్ ఇంటికి చేరుకున్నాము . 



కారు సౌండ్ వినిపించి ప్రమీలా మరియు తన పేరెంట్స్ బయటకువచ్చి కారు దిగగానే మహేష్ అంటూ అంకుల్ కౌగిలించుకొని , నేనే స్వయంగా వచ్చి అభినందించాల్సింది అర్జెంట్ క్యాంప్ పడటం వల్ల వెళ్ళిపోయి ఇంతకుముందే వచ్చాను . ఇలా మీరు డిన్నర్ కు వస్తున్నారని మావాళ్లు చెప్పడంతో చాలా సంతోషించాను అంది లోపలకు , ఇంతకీ మహిఫౌండషన్ చైర్మన్ ఎక్కడ అని అడిగారు . ఒసేయ్ గోరింటాకు తీసేసావా అంటూ ప్రమీలా కారు డోర్ తెరిచి ఇంకా ఉండటం చూసి ఇంకో రెండు గంటలయినా ఉండాలి అంటూ నేను హెల్ప్ చేస్తాను రా అంటూ అందుకొని లోపలికి పిలుచుకొనివెళ్లింది . 



నాన్నగారు సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఉండండి డైనింగ్ టేబుల్ పై సెట్ చేసి పిలుస్తాను అనిచెప్పి చెల్లితోపాటు వెళ్ళింది . అంకుల్ అమరావతి ఫంక్షన్ దగ్గర నుండి కాలేజ్ ఫంక్షన్ వరకూ ప్రతిఒక్కటీ గుర్తుచేసుకొని మాఇద్దరినీ ఆపకుండా పొగుడుతూనే ఉన్నారు . నేను కదలకుండా థాంక్స్ థాంక్స్ అంటూ ఉండిపోయాను . ఇంతలో ప్రెసిడెంట్ డిన్నర్ కు పిలవడంతో హమ్మయ్యా థాంక్స్ అంటూ డైనింగ్ టేబుల్ లో చెల్లి ప్రక్కనే కూర్చున్నాను నోరూరించే వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ పెద్ద ప్లేట్ నిండా నింపేయ్యడంతో wow అంటీ మాకోసం ఇన్ని వంటకాలు వండారు thank యు soooo మచ్ అంటూ ఉత్సాహంతో చెల్లివైపు చూసాను . 



అన్నయ్యా అంటూ గోరింటాకు చూపించడంతో నేనున్నాను కదరా అంటూ ముద్దకలిపి మొదట తనకు తినిపించాను . అంకుల్ వాళ్ళు చూసి ట్విన్స్ అంటే ఇలాగే ఉండాలి అంటూ సంతోషించారు . అన్నయ్యా బిరియాని బాగుంది నువ్వు కూడా తిను అని తింటూనే చెప్పడంతో అందరమూ నవ్వుకుని తిని అంటీ సూపర్ మా అమ్మ గుర్తుకువచ్చింది అని వెంటనే అమ్మకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారో తెలుసుకొని ప్రమీలా వాళ్ళింట్లో డిన్నర్ చేస్తున్నాము అని అంటీకి మొబైల్ అందించాను . తృప్తిగా చెల్లి ఇక చాలు అన్నయ్యా తినేంతవరకూ తినిపించి తిన్నాను . అంకుల్ తోపాటు కాంపౌండ్ లోకి వచ్చి చల్లని వాతావరణంలో కాలక్షేపం చేసాము . 



సుమారు 9:30 సమయంలో decoration ఓవర్ రిమోట్ ను కేక్ టేబుల్ పై ఉంచాను . ఒక్కసారి రిమోట్ చూస్తే నీకే అర్థమైపోతుంది . మేము వెళుతున్నాము ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి 12 గంటలవరకూ నీకోసం మేల్కొనే ఉంటాను అని చెప్పడంతో , అన్నా మీకు థాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు అని చెప్పాను . 



చెల్లి కూడా అంటీవాళ్ళతో బయటకు రావడంతో అంకుల్ 9:30 అవుతోంది వెళ్ళొస్తాము అనిచెప్పి ఇంటికి చేరుకున్నాము . చెల్లిని ఎత్తుకొని రేపు birthday సెలెబ్రేషన్స్ ఫ్రెండ్స్ తోపాటు ఎంజాయ్ చేద్దాము అని లోపలికివచ్చి దించి ఇంటికి తాళం వేసి , ఉదయం నుండి అలసిపోయాము , రేపు ఉదయమే లేచి రెడీ అవ్వాలి  కాబట్టి వెంటనే నిద్రపోవాలి చెల్లెమ్మా అని చెప్పాను . 



చెల్లి కాస్త నిరాశతో అయితే నైట్ సెలెబ్రేషన్స్ లేవా అని , అన్నయ్యకు ఏది ఇష్టమైతే అదే నాకు కూడా ఇష్టం కాబట్టి రేపు ఉదయమే సెలబ్రేట్ చేసుకుందామని తలదించుకొని మనసుతో మాట్లాడుకోవడం చూసి తియ్యదనంతో నవ్వుకుని , నా బంగారుచెల్లి నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికోసం బాధపెడుతున్నాను లవ్ యు sooooo మచ్ రా అని మనసులో ఆనుకొని , బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , నా చెల్లెమ్మ వెచ్చటి కౌగిలిలో నిద్రపోవాలి అని చెప్పాను .



మురిసిపోయి ఒక్క నిమిషం నువ్వు పైకి వచ్చెయ్యి అంటూ పరుగున పైన బాత్రూమ్లోకివెళ్లి గోరింటాకు చేతులను కడుక్కొని ముందు అన్నయ్యకే చూపించాలి అని చేతులను వెనుక దాచేసుకొని రూంలోకివచ్చి , అన్నయ్యా అంటూ కళ్ళుమూసుకుని అర చేతులను చూపించింది . అన్నయ్యా ok నా బాగా పండిందా అని doubt తో అడిగింది .



ముందుకువెళ్లి అరచేతులపై చెరొక ముద్దుపెట్టి ఎర్రగా భలే పండింది చెల్లి , మా చెల్లెమ్మ అదృష్టవంతురాలు అంటూ మురిసిపోతుండటం కళ్ళుతెరిచి చేతులను మరియు నా సంతోషాన్ని చూసి , ఆనందబాస్పాలతో అన్నయ్యా ........అని చిన్న బుజ్జాయిలా అరిచి నా కౌగిలిలో వాలిపోయింది . నా బుజ్జి చెల్లాయికి కాకుండా ఎవరికి పండుతుంది అని తలపై ముద్దుపెట్టి , రాకున్నా ఆవలించినట్లు నటించడంతో , అన్నయ్యా నిద్రవస్తున్నట్లుంది పడుకుందాము అని నా గుండెలపై వాలిపోయి ఛాతీపై సున్నాలు చుడుతూ చుడుతూ నిద్రలోకి జారుకుంది .



చెల్లి నిద్రపోయేంతవరకూ నిద్రపోయినట్లు నటించి , తను నిద్రలోకి జారుకోగానే కళ్ళుతెరిచి చెల్లినే చూస్తూ చేతితో సున్నితంగా జోకొడుతూ నుదుటిపై , కురులపై తియ్యటి ముద్దులుపెట్టాను . మ్మ్మ్.........ఆ.....న్న..... య్యా......అంటూ నన్ను మరింత చుట్టేసి హాయిగా నిద్రపోతోంది . 



11 గంటలకు చెల్లిని డిస్టర్బ్ చెయ్యకుండా బెడ్ పై పడుకోబెట్టి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి ,తన మొబైల్ లో 12 గంటలకు 5 నిమిషాల ముందు అలారం మ్రోగేలా సెట్ చేసి, చప్పుడు చెయ్యకుండా ఫ్రిడ్జ్ లోని కేక్ తీసుకొని మేడ మీదకువెళ్లి మొబైల్ టార్చ్ వెలుగులో టేబుల్ పై ఉంచిన రిమోట్ మొత్తం చూసి ఒకసారి పరీక్షిద్దామని మొదటి బటన్ నొక్కాను అంతే కళ్ళు జిగేల్ మనేలా టాప్ తోపాటు ఇల్లుమొత్తం రంగురంగుల లైట్స్ తో వెలిగిపోయింది . ఇక పూలతో కేక్ కట్ చేసే స్థలంలో అలంకరించారు , ఆశ్చర్యపోయి నానోటిని తెరిచి షాక్ లో అలా నిలబడిపోయాను. 



సమయం తక్కువ వుండటం వల్ల తేరుకొని అన్నా పిచ్చెక్కించారు అని మనసులో ఆనుకొని , పూలు మరియు పెద్ద మొత్తంలో క్యాండిల్స్ తీసుకొని రూమ్ లోని బెడ్ దగ్గర నుండి కేక్ వరకూ పని పూర్తి చేశాను . ఇంకా ఏమేమి చెయ్యాలో పూర్తిచేసి 10 నిమిషాల ముందు కేక్ క్యాండిల్ కత్తి అందంగా అలంకరించిన టేబుల్ పై ఉంచి లైట్స్ మొత్తం ఆఫ్ చేసేసాను . చంద్రుడి వెన్నెల మాత్రమే ప్రకాశిస్తోంది . 



ఇక్కడ రూంలో 11:55 కు అలారం చప్పుడుకు చెల్లికి మెలకువ వచ్చి లేచి నాకు ఎక్కడ నిద్ర డిస్టర్బ్ అవుతుందో అని ఆఫ్ చేసేసి , నేను ప్రక్కనే లేకపోవడంతో అన్నయ్యా అంటూ ఎడమవైపుకు తిరుగగానే , తెల్లని పూల దారి దారికి ఇరువైపులా క్యాండిల్స్ వెలుగుతుండటం చూసి ఆశ్చర్యపోయి , 



అన్నయ్యా .........అంటూ ఆనందిస్తూ పూల మరియు క్యాండిల్ దారిలో రెండుచేతులతో నోటికి అడ్డుపెట్టుకొని మురిసిపోతూ దారి ఎక్కడికి తీసుకెళ్తుందో అటువైపు అడుగులువేస్తూ మేడ మీదకు వస్తున్న చప్పుడు వినిపించి , తలుపు ప్రక్కమే నిలబడి చెల్లి మేడ మీద అడుగుపెట్టగానే , మొత్తం ఎన్ని బటన్స్ ఉంటే అన్నింటినీ ప్రెస్ చేసాను .



ఫస్ట్ చీకటిని తరిమికొట్టేలా వెలుగులు జిగేల్ మన్నాయి . ఒక్కసారి ఆ వెలుగులకు కళ్ళను చేతికి అడ్డుపెట్టుకొని మరుక్షణమే ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తోంది .



ఆ వెంటనే వందల సంఖ్యలో ఫ్లైయింగ్ sky lanterns వందల సంఖ్యలలో ఆకాశం లోకి ఎగురడం చూసి చెల్లి తన చేతులను బుగ్గలపై వేసుకొని తలెత్తి కన్నార్పకుండా చూస్తోంది . చెల్లితోపాటు నేను కూడా ఆశ్చర్యపోయి ఇవి ఎక్కడ నుండి వచ్చాయి అని కిందకు చూస్తే చాలామందితోపాటు అన్నయ్య ఉండటం చిపోసాను . 



ఆ వెంటనే గుంపులు గుంపులు బలూన్స్ చెల్లి చుట్టూ  గాలిలోకి లేచాయి , wow అంటూ చెల్లి చేతులను పైకెత్తి చుట్టూ చూస్తూ ఆనందంలో మునిగితేలుతోంది . 



ఇక చివరన ఒక్కసారి భుగ్ భుగ్............మంటూ క్రాకర్స్ ఆకాశంలోకి వెళ్లి వైజాగ్ మొత్తం వెలుగులను విరజిమ్మాయి . నిమిషం పాటు చుట్టూ చూస్తూ ఎంజాయ్ చేసి ప్రకాశిస్తున్న కళ్లతో వర్ణించలేని సంతోషంతో వెలిగిపోతున్న ముఖంతో అన్నయ్యా , అన్నయ్యా .........అంటూ , పారవశ్యంలో మునిగితేలుతున్న చెల్లి వెనుకే వెళ్లి చెవిలో తియ్యదనంతో ,



నా ప్రాణానికి ప్రాణమైన చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాను .



ప్రపంచాన్ని జయించినంత సంతోషంతో నావైపు తిరిగి నా కళ్ళల్లోకే ప్రాణంగా చూస్తూ ,



నా ప్రాణం కన్నా ఎక్కువ అయిన మా అన్నయ్యకు ఈ చెల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు అనిచెప్పి , లవ్ యు లవ్ యు లవ్ యు .........soooooo మచ్ అన్నయ్యా అంటూ నా గుండెలపై వాలిపోయింది . 



రిమోట్ చివరి బటన్ నొక్కగానే మాఇద్దరి పై పూల వర్షం కురిసింది . చెల్లి పూలను చేతులతో ఎగరేసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో , అన్నయ్యా నాకు అప్పుడే తెలుసు అన్నయ్యా నువ్వు నైట్ సెలబ్రేషన్ లేదన్నప్పుడు .......అంటూ తియ్యని కోపంతో నా గుండెలపై ఒకచేతితో మొబైల్ తోనే సున్నితంగా కొట్టింది . నా హృదయ దేవతకు సర్ప్రైజ్ అంటే ఇలా ఉండకపోతే ఎలారా అంటూ రెండుచేతులతో బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి మరొకసారి విష్ చేసి , ఇలాగే జీవితాంతం సంతోషన్గా ఉండాలిరా అని కోరిక కోరాను . నాకొరిక కూడా అదే అన్నయ్యా మా అన్నయ్య ఏది కోరితే అది జరగాలి అని నన్ను అమాంతం కౌగిలించుకొని గుండెలపై ఘాడమైన తియ్యటి ముద్దుపెట్టింది .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 10-10-2019, 09:54 AM



Users browsing this thread: 68 Guest(s)