Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రోజూలాగే గ్రౌండ్ కు వెళ్ళడానికి తెల్లవారుఘామునే మెలకువ వచ్చినా , చెల్లి మేల్కొనేంతవరకూ కదలకుండా అందమైన ముఖాన్ని చూస్తూ ఒక చేతిని తన బుగ్గపై మరొక చేతిని చేతిపై వేసి సున్నితంగా జోకొడుతూ ఉండిపోయాను. మ్మ్మ్......అన్నయ్యా అంటూ నిద్రలోనే కదిలి పెదాలపై చిరునవ్వుతో మరింత హత్తుకొంది . తియ్యగా నవ్వుకున్నాను . 



6 గంటలకు వెచ్చటి నా కౌగిలిలో ఇంత సొందర్యంగా నిద్రపోలేదు అన్నట్లు పెదాలపై తియ్యదనంతో కళ్ళుతెరిచి తననే సంతోషన్గా చూస్తుండటం చూసి , గుడ్ మార్నింగ్ అన్నయ్యా అంటూ గట్టిగా రెండుచేతులతో హత్తుకొని చెప్పింది . లవ్లీ గుడ్ మార్నింగ్ రా అంటూ నుదుటిపై ముద్దుపెట్టగానే , సిగ్గుతో నా గుండెలపై తల దాచుకొంది . అన్నయ్యా రాత్రి నిద్రించినట్లుగా ఇప్పటివరకూ నిద్రించలేదు . స్వర్గంలో నిద్రపోయినట్లుగా ఉంది మా అన్నయ్య కౌగిలిలో అని మురిసిపోతూ చెప్పింది . ఇక రోజూ ఇలాంటి అనుభూతినే పొందుతావురా అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి చెప్పాను . లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా , నువ్వు గ్రౌండ్ కి వెళ్ళాలి కదూ అంటూ నా గుండెలపై తియ్యగా ముద్దుపెట్టి నానుండి లేచింది . అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను అని బదులిచ్చాను . వద్దు అన్నయ్యా రోజూలాగే వెళ్ళిరా నేను మా అన్నయ్య కోసం సంతోషన్గా wait చేస్తుంటాను అని చెప్పడంతో , లవ్ యు రా అంటూ చాలాసేపటి నుండి కంట్రోల్ చేసుకుంటూ బాత్రూం లోకి పరిగెత్తడం చూసి చెల్లి చిలిపిగా నవ్వుకొంది . 



దుప్పట్లు మడిచి నేను రాగానే టవల్ మరియు డ్రెస్ తోపాటు బాత్రూం లోకి వెళ్ళింది . నేను కిందకువెళ్లి అమ్మావాళ్లకు గుడ్ మార్నింగ్ చెప్పి గ్రౌండ్ లో రన్నింగ్ జిమ్ లో కసరత్తులు చేసి వొళ్ళంతా చెమటతో వచ్చి సోఫాలో వాలిపోయాను . 



చెల్లి చూసి తాగడానికి నీళ్లు తీసుకొచ్చి అందించి తన డ్రెస్ తో నా చెమటను తుడిచి అన్నయ్యా ఫ్రెష్ గా స్నానం చేసిరా వేడివేడిగా తిందువు అని చెప్పింది . అలాగే రా అంటూ లేచి కౌగిలించుకోబోయి వొళ్ళంతా చెమట వాసన వస్తుండటంతో వెనకడుగెయ్యడం తెలిసి , మా అన్నయ్య ఇలా ఎలా .....ఉన్నా నాకు ఇష్టమే లవ్ యు రా అంటూ గట్టిగా కౌగిలించుకొని చెమట వాసనను సంతోషన్గా ఆస్వాదించింది . లవ్ యు soooo మచ్ రా అనిచెప్పి పైకివెళ్లి బెడ్ పై టవల్ మరియు బట్టలు చూసి నవ్వుకుని శుభ్రన్గా షవర్ కింద తల స్నానం చేసి కిందకువచ్చాను . అందరమూ కలిసి తిన్నాము . 



అలా రోజంతా కృష్ణ దివ్యక్క , ఇంటికి వచ్చిన కాలేజ్ ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ మరియు ఫౌండేషన్ activeness గురించి చర్చిస్తూ , రాత్రికి చెల్లి నా గుండెలపై నిద్రపోవడం .......ఇలా వారం రోజులు ఏ టెన్షన్ లేకుండా గడిపేసాము . 



కాలేజ్ నుండి రోజూ కాల్స్ వస్తూ ఉండటంతో రాత్రి చెల్లి నా గుండెలపై వాలిపోయి అన్నయ్యా రేపు కాలేజ్ కు వెళదామా అని అడిగింది . డన్ అంటూ ముద్దుపెట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయాము . 



ఉదయం 9 గంటలకల్లా రెడీ అయిపోయి కారులో కృష్ణ ఇంటికి చేరుకున్నాము . అమ్మ , దివ్యక్క బలవంతంతో అక్కడ కూడా కొద్దిగా తినాల్సివచ్చింది . కృష్ణగాడు కుమ్మేస్తూ చెల్లెమ్మా ఇంత సడెన్ గా కాలేజ్ కు వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నావు . వారం రోజులు .........అయితే ఏంటి ఎంత ఎంజాయ్ చేసాము , అవన్నీ నీకు గుర్తురావట్లేదా అంటూ నిరాశగా చెప్పాడు . అన్నయ్యా కాలేజ్ కు వెళ్లినా మీరు చేసేపని ఇదే కదా అని చెప్పడంతో , చెల్లెమ్మా ఇలాంటివిషయాలు ఇంట్లో మాట్లాడకూడదు అంటూ టాపిక్ మార్చేశాడు . అందరమూ సంతోషన్గా తినేసి ముగ్గురమూ క్యాంపస్ సెలక్షన్ రెండవరోజు కాలేజ్ కు చేరాము .



కారు దిగగానే కొంతమంది చూడటంతో మన కాలేజ్ గ్రేట్ ట్విన్స్ వచ్చారు అంటూ క్షణాల్లో కాలేజ్ మొత్తం తెలిసిపోయి , ఫ్రెండ్స్ దగ్గర నుండి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వరకూ మా దగ్గరకు వచ్చి అభినందించారు . అందరికీ మనఃస్ఫూర్తిగా థాంక్స్ చెప్పేసి అన్నయ్యా గ్రౌండ్కేగా మీరు వెళ్ళండి నేను మన ఫ్రెండ్స్ తోపాటు ప్రిన్సిపాల్ ను కలిసి క్లాస్ కు వెళ్లిపోతాను అనిచెప్పింది . కళ్ళతోనే చుట్టూ ఉన్న మా ఫ్రెండ్స్ కు చెల్లి జాగ్రత్త అని సైగ చేసాను .



గ్రౌండ్ లోకి వెళ్ళగానే మహేష్ అంటూ కోచ్ అమాంతం కౌగిలించుకొని మాటల్లో పడిపోయాము . 



చెల్లి నేరుగా ప్రిన్సిపాల్ రూమ్ కు వెళ్ళింది . మహి వెల్కమ్ అంటూ అందరినీ లోపలకు పిలిచి కుర్చీలలో కూర్చోమన్నారు. ఒక ఫైల్ అందుకొని మహి నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూ కి అటెండ్ కాకపోయినా పెద్ద పెద్ద కంపెనీలు university మొత్తం హైయెస్ట్ ప్యాకేజీ నీకు ఆఫర్ చేసింది . ఈ ఫైల్ చూసి నీకు ఏ కంపెనీ నచ్చితే అది సెలెక్ట్ చేసుకుంటే చాలు మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పింది . 



చుట్టూ కూర్చున్న ఫ్రెండ్స్ అంతా కంగ్రాట్స్ మహి కంగ్రాట్స్ మహి we are sooooo happy అని విష్ చేశారు . ఫ్రెండ్స్ కొద్దిసేపు నాకోసం బయట ఉంటారా అని కోరడంతో , అలాగే మహి అంటూ బయటకు వెళ్లారు . సర్ నాకోసం మీరు తీసుకుంటున్న కేర్ కు చాలా చాలా థాంక్స్ , కానీ నన్ను క్షమించండి నేను నా ఫ్యామిలీని వదిలి ఎక్కడికీ వెళ్ళను అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో , కొద్దిగా నిరాసపడినా మహి నీ గోల్స్ ఏమిటో నేను అర్థం చేసుకోగలను , స్వయంగా వచ్చి చెప్పినందుకు చాలా సంతోషం . All the best for your bright future అని మనసారా విష్ చేసి ఈ ఫైల్ వాళ్లకు నేను రిప్లై పెట్టేస్తాను అని చెప్పడంతో , thank you soooo much సర్ అనిచెప్పి ఫ్రెండ్స్ తోపాటు క్లాస్ కు వెళ్ళింది .



నెక్స్ట్ నెల రోజులు ఇంటర్వూస్ మరియు క్లాస్ లతో గడిచిపోయాయి . ఆల్మోస్ట్ ఇంటరెస్ట్ ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు. నోటీస్ బోర్డ్ లో సెలెక్టెడ్ లిస్ట్ లో చెల్లి పేరు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయి కాలేజ్ మొత్తం అదే టాపిక్ డిస్కస్ చేసుకున్నారు . కొంతమంది అయితే ఈ విషయమై కనుక్కోవడానికి ప్రిన్సిపాల్ దగ్గరకు కూడా వెళ్లివచ్చారు.



మరో మూడు వారాల్లో ఫైనల్ exams షెడ్యూల్ కూడా రావడంతో ఫేర్వెల్ డే తోపాటు annual డే సెలెబ్రేషన్స్ ఒకేరోజు ఘనంగా నిర్వహించాలని , దానికి సీఎం ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలని మేనేజ్మెంట్ మరియు స్టాఫ్ నిర్ణయించుకొని , సీఎం గారు చెప్పిన మాటలను నన్ను పిలిచి గుర్తుచేశారు . 



సర్ ఆయన బిజీ మనకు తెలిసిందే అయినా సరే PA కు కాల్ చేస్తాను అని అక్కడే చేసాను . రెండు మూడుసార్లు చేసినా ఎత్తకపోవడంతో అందరమూ నిరాశ చెంది బయటకు వచ్చేస్తుండగా , PA నుండే కాల్ రావడంతో సర్ అంటూ అందరినీ పిలిచాను . మహేష్ ఇంపార్టెంట్ మీటింగ్ లలో మొబైల్ సైలెంట్ లో ఉంటుంది . మీటింగ్ అయిపోవడంతో చూసుకున్నాను ఏంటి అర్జెంటా ఏమిటి విషయం అని అడిగారు . 



కాలేజ్ సెలెబ్రేషన్స్ కు సర్ ను ఆహ్వానించాలని అనుకుంటున్నాము అని చెప్పాను . సర్ కు కూడా చాలా ఇంటరెస్ట్ ఉంది date చెప్పండి షెడ్యూల్ చూస్తాను అని అడిగారు . చుట్టూ నిలనడిన అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు . Date చెప్పాను . 5 నిమిషాలు లైన్లోనే ఉండమనిచెప్పి చెక్ చేస్తున్నారు . ఇక్కడ అందరిలో ఒకటే టెన్షన్. మహేష్ గుడ్ న్యూస్ ఆరోజు ఏమి లేవు . రేపు మధ్యాహ్నం లోపల సెక్రటేరియట్ కు వచ్చేసి సర్ ను స్వయంగా ఆహ్వానించండి చాలా సంతోషిస్తారు అని చెప్పడంతో చాలా చాలా .........థాంక్స్ సర్ అని కట్ చేసి ఎగిరి గెంతేశాము. మహేష్ 9 కల్లా అమరావతిలో ఉండాలి ఫ్లైట్ బుక్ చేస్తాను మేనేజ్మెంట్ , ప్రిన్సిపాల్ కొద్దిమంది స్టాఫ్ తోపాటు వెళదాము అని చెప్పారు .



చెల్లికి కారులో ఇంటికివెళుతూ ఇదే విషయం చెప్పాను . మళ్లీ రిటర్న్ ఎప్పుడురా అని బాధపడుతూ అడిగింది. My డియర్ లవ్లీ ఏంజెల్ తెల్లవారుఘామునే వెళ్లిపోయి 9 గంటలకు సర్ ను ఆహ్వానించి వెంటనే ఫ్లైట్ ఎక్కేయ్యాడమే అని బదులివ్వడంతో , అంతే కదా అంటూ నా గుండెలపై వాలిపోయింది . నా ఏంజెల్ ను చూడకుండా నేను ఉండగలనా ఫ్లైట్ దిగగానే నీ ముందు వాలిపోతాను అంటూ తలపై ప్రాణంగా ముద్దుపెట్టి , రేయ్ మామా నేను బయలుదేరి ముందే నువ్వు ఇంట్లో ఉండాలి , నేను వచ్చేవరకూ ఇల్లు కదిలావో .........రేయ్ మామా దివ్యక్కతోపాటు వచ్చి టిఫిన్ లంచ్ డిన్నర్ చేసిగానీ ఇల్లు కదలము అని బదులివ్వడంతో నవ్వుకుని ఇంటికి చేరుకున్నాము . ఆరోజు రాత్రి అర్ధరాత్రివరకూ చెల్లి ప్రేమతో నన్నే చూస్తూ మాట్లాడుతూనే ఉంది . 



నేను వెళుతుంటే చెల్లి బాధపడటం చూడలేక తెల్లవారాక ముందే లేచి స్నానం చేసి రెడీ అయ్యి కిందకువచ్చి , అమ్మమ్మా వచ్చేన్తవరకూ చెల్లి జాగ్రత్త అనిచెప్పి కృష్ణగాడు రావడంతో అదే కారులో ఎయిర్పోర్ట్ చేరుకొని సర్ వాళ్ళతోపాటు సరైన సమయానికే సెక్రటేరియట్ చేరుకున్నాము . సర్ అపాయింట్మెంట్ ఉందని మొబైల్ లో చూపించడంతో PA కు కాల్ చేసి విషయం చెప్పారు . ఆయనే స్వయంగా వచ్చి సర్ ఆఫీస్ లోకి పిలుచుకొనివెళ్లారు . అందరమూ సీఎం గారికి ఫ్లవర్స్ ఇచ్చి విషయం చెప్పి కార్డ్ ఆనందించాము . PA మొత్తం చూసుకుంటారు వస్తున్నాను మహేష్ అని చెప్పడంతో సంతోషించి , సర్ time ను వేస్ట్ చేయకూడదని సెలవు తీసుకొని బయటకువచ్చాము . ఏవిదంగా ఏర్పాట్లు చెయ్యాలో PA మొత్తం మేనేజ్మెంట్ కు వివరించారు . 



స్టాఫ్ సాయంత్రం వరకూ ఎంజాయ్ చేసి వెళదాము అని ప్రిన్సిపాల్ గారికి చెప్పడంతో సరే అన్నారు . సర్ మీరు ఎంజాయ్ చెయ్యండి మీ మధ్యలో నేనెందుకు నేను వెళతాను అని చెప్పడంతో , మహేష్ సేఫ్ గా వెళ్లు అనిచెప్పి టికెట్ బుక్ చేశారు . చెల్లికి మరియు దివ్యక్కకు లవ్లీ గిఫ్ట్ తీసుకొని చెల్లికి కాల్ చేసి 11 గంటలకు రిటర్న్ ఫ్లైట్ లో వైజాగ్ చేరుకున్నాను . 



నేను బయటకు రావడం ఆలస్యం అన్నయ్యా అంటూ కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం రెండుచేతులను నా నడుము చుట్టూ వేసి కళ్ళల్లో చెమ్మతో నా గుండెలపై వాలిపోయింది . వచ్చేసానుగా అంటూ కన్నీళ్లను తుడిచి కారు దగ్గరకు చేరుకొని , దివ్యక్కా ఎప్పుడు వచ్చారు అని అడిగాను . రేయ్ మామా నువ్వు కాల్ చేసిన మరుక్షణమే మాఇద్దరినీ ఇక్కడకు లాక్కొని వచ్చేసింది అని చెప్పాడు . లవ్ యు రా అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ఇద్దరినీ వెనుక కూర్చోబెట్టి డోర్ వేసి ముందు కూర్చుని . లవ్లీ గిఫ్ట్స్ ఫర్ my లవ్లీ సిస్టర్స్ అంటూ వెనుక కూర్చున్న ఇద్దరికీ అందించాను . 



లవ్ యు రా మహేష్ అంటూ ఇద్దరూ అందుకొని గిఫ్ట్ కవర్ తీసి చూసి wow లవ్లీ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . వారి సంతోషానికి మురిసిపోతుండగా డ్రైవ్ చేస్తూనే పదే పదే నావైపు చూస్తూ నాకేదిరా గిఫ్ట్ అని అడిగాడు . తలపై ఒక్క దెబ్బ వేసి చాలా ఇంకా కావాలా అని అడిగాను . చాలురారేయ్ చాలు వాళ్లకు ఇచ్చిన వాటికంటే చాలా బాగుంది అంటూ అందరమూ సంతోషన్గా నవ్వుతూ ఇంటికి చేరుకున్నాము .



 అమ్మమ్మా అన్నయ్య మాకోసం ఎంత మంచి గిఫ్ట్స్ తెచ్చాడో చూడు అని చూపించి మురిసిపోయింది . చెల్లి ఆకలి అని చెప్పడం ఆలస్యం కూర్చో అన్నయ్యా అని సోఫాలో కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్లి ప్లేటుతో పాటువచ్చి ప్రేమతో తినిపించింది . ఉదయం నుండి లేకపోవడంతో ఆరోజు ఒక్క క్షణం కూడా నా నుండి ప్రక్కకు వెళ్ళలేదు .



ఫేర్వెల్ డే రెండురోజుల ముందుగానే సీఎం గారి సెక్యూరిటీ కోసం పోలిసులు కాలేజ్ ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని ఐడెంటిటీ కదా ఉంటేనే లోపలకి పంపిస్తున్నారు . PA చెప్పిన ఏర్పాట్లను ముందురోజు సాయంత్రం లోపల హెలిపాడ్ తోపాటు పూర్తి చేసేసారు .



నెక్స్ట్ రోజు స్టూడెంట్స్ ఉత్సాహంగా కాలేజ్ కు చేరుకున్నారు . ఉదయం నుండే సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి . టిఫిన్ లంచ్ డిన్నర్ మొత్తం కాలేజ్ లోనే . గ్రౌండ్ లో పెద్ద స్టేజి arrange చేశారు , సీఎం వస్తుండటంతో university నుండి పెద్ద పెద్ద వాళ్లు వచ్చారు , రాజకీయ నాయకులు పిలవకపోయినా దిగిపోయారు , సెక్యూరిటీ మాత్రం పగడ్బంధీగా ఉంది . ముందుసారి జరిగిన తప్పులు ఏమాత్రం జరగకుండా చూసుకున్నారు . చెల్లిని మరియు తన ఫ్రెండ్స్ ను ఫంక్షన్ లో safest ప్లేస్ లో కూర్చోబెట్టి కృష్ణగాడిని అనుక్షణం చూస్తూ ఉండమని పదే పదే చెప్పాను. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు హెలికాఫ్టర్ ద్వారా సీఎం గారు కాలేజ్ లో ల్యాండ్ అయ్యారు . మేనేజ్మెంట్ ఘనంగా స్వాగతం పలికి స్టేజి దగ్గరికి తీసుకువచ్చారు . 



మా ప్రెసిడెంట్ స్టూడెంట్స్ అందరితరుపున పుష్ప గుచ్ఛం ఇవ్వడంతో స్టూడెంట్స్ కోలాహలంతో అరుస్తున్నారు . మహేష్ అంటూ ప్రక్కనే ఉన్న నన్ను కౌగిలించుకోవడం చూసి ప్రాంగణం మొత్తం మారుమ్రోగిపోవడం చూసి , మహేష్ నీ ఫాలోయింగ్ మామూలుగా లేదు అంటూ భుజం తట్టి స్టేజి మీదకు వెళ్లారు . సీఎం గారి ఘన సన్మానంతో మొదలైన ఫంక్షన్ సంబరంగా జరుగుతోంది . 



సీఎం గారిని సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫేర్వెల్ ఎంజాయ్ చెయ్యాలని మనఃస్ఫూర్తిగా కోరి స్టేజి ముందర సోఫాలలోకి ఆహ్వానించడంతో , మేనేజ్మెంట్ స్వయంగా సీఎం గారితోపాటు guests అందరినీ కిందకు పిలుచుకొనివెళ్లి సోఫాలలో కూర్చోబెట్టారు . 10 నిమిషాలపాటు మేనేజ్మెంట్ ఏర్పాటుచేసిన కూచిపూడి నాట్యాన్ని మా కాలేజ్ అమ్మాయిలు అద్భుతంగా అందరినీ తమ నాట్యంతో ముగ్ధులను చెయ్యడంతో సీఎం గారు లేచిమరీ చప్పట్లతో అభినందించారు . వారి ప్రాక్టీస్ కష్టాన్ని తెలుసుకొని సంతోషించి ఇంతటి నృత్యాన్ని చూసినందుకు నా జన్మ ధన్యం అంటూ మేనేజ్మెంట్ ను అభినందించారు .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 26-09-2019, 10:44 AM



Users browsing this thread: Sindhu Ram Singh, 11 Guest(s)