Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అక్కడ మైకులో ఒక్కొక్క రంగంలో రాస్త్రాన్ని ఉన్నత స్థాయిలో నిలిపిన వాళ్ళను స్టేజి మీదకు పిలిచి శాలువాతో సన్మానించి అవార్డ్ తోపాటు పెద్ద మొత్తంలో నగదు బహుమతులను కూడా అందిస్తున్నారు . 



నెక్స్ట్ క్రీడారంగం అని మైకులో వినబడగానే అమ్మావాళ్ళంతా ఆక్టివ్ అయిపోయారు . అన్నయ్యా గెట్ రెడీ అంటూ సంతోషన్గా గుర్తుచేసి కీర్తితో నాగురించి చెబుతోంది . 



మొదటగా క్రీడల్లో యువతను రాణించేలా చేస్తున్న క్రీడా గురువులను అవార్డులతో సన్మానించి , నెక్స్ట్ ఇప్పుడు మనం స్టేజి మీదకు ఆహ్వానిస్తున్న స్పోర్ట్స్ హీరో గురించి చెప్పాలంటే ఒక్కరోజైనా పడుతుంది . స్కూల్ సమయంలో ఇలాంటి స్టేజి పైనే ఛాంపియన్ షిప్ అందుకున్నాడు . ఇప్పుడు ఏకంగా నేషనల్ క్రీడలలో అన్ని ఆటలలో మన రాష్ట్రాన్ని ఆల్మోస్ట్ ఉన్నత స్థానానికి చేర్చేందుకు అతడు పడిన కష్టం అంతా ఇంతా కాదు . టీవీల్లో మీరే చూసి ఉంటారు . మన స్టేట్ హీరో ఎవరో గెస్ చేయగలరా అని వినిపించగానే , యూత్ మొత్తం పైకి లేచి స్టేడియం మొత్తo దద్దరిల్లేలా మహేష్ మహేష్ మహేష్...............అని ఆపకుండా అరుస్తూనే ఉండటంతో ,



Yes yes yes ..............none other than MAHESH from vizag *********కాలేజ్ అంటూ మైకు పగిలిపోయేలా చెప్పడంతో , ( కాలేజ్ పేరు చెప్పడంతో మా ప్రిన్సిపాల్ మరియు మేనేజ్మెంట్ ఆనందానికి అవధులు లేవు) , అతడికి ఒక్కొక్క స్పోర్ట్స్ ప్రకారం ఒక్కొక్క పథకంతో సత్కరించాలన్నా ఒకరోజు పడుతుంది , మన CM గారు కూడా తనను కలవడానికి ఉత్సాహంగా కూడా ఉన్నారు . కేంద్ర క్రీడా విభాగం నుండి అతడికి అందివ్వమని వచ్చిన కోటి రూపాయల చెక్ ను మరియు రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 lakhs చెక్ ను మన గౌరవనీయులైన CM గారి చేతులమీదుగా అందుకోవడానికి మహేష్ ను హృదయపూర్వకంగా స్టేజి మీదకు ఆహ్వానిస్తున్నాము అని చెప్పడంతో , 



స్టేడియం మొత్తం లేచి ఎవ్వరు మహేష్ ఎక్కడ అని చుట్టూ మరియు వెనుక చూస్తుండటంతో మహివైపు చూసాను . వర్ణించలేని సంతోషంతో వెళ్లు అన్నయ్యా అని కళ్ళతోనే సైగ చెయ్యడంతో లవ్ యు రా అంటూ పరిగెత్తుకుంటూ స్టేజి మీదకు వెళుతున్నంతసేపు చప్పట్లతో అభినందించారు . 



CM గారు లేచిమరీ I am proud of you man అంటూ చేతులు కలిపారు . మైకులో చెప్పినట్లుగా అవార్డ్ , మెడలో మెడల్ మరియు అమౌంట్ చెక్స్ ఇచ్చి , రెండుమాటలు మాట్లాడాల్సిందిగా మైకు అందించారు . స్టేజి మీద పెద్దలకు నమస్కరించి , నేనీ స్థాయిలో ఉండటానికి కారణం మన రాష్ట్రం మరియు దేశం పై ఉన్న ప్రేమ మరియు మా అమ్మ , అమ్మమ్మా మరియు నా ప్రాణానికి ప్రాణమైన my twin సిస్టర్ మహి మరియు నాపై నమ్మకం ఉంచిన coaches వల్లనే , ఈ అవార్డ్స్ అన్నింటినీ వారికే అంకితం ఇస్తున్నాను అని చెప్పగానే రాష్ట్రం , దేశం గ్రేట్ అంటూ స్టేడియం మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది ,థాంక్స్ అంటూ CM గారు పర్మిషన్ ఒక్క నిమిషం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను please సర్ అని వినయంగా అడిగాను . 



మహేష్ సమయం లేదు అని మైకును నాచేతిలో నుండి అందుకోబోతుండగా , స్టేడియం మొత్తం లేచి మాట్లాడాలి మాట్లాడాలి............అని అరుస్తుండటంతో , CM గారు కూడా ఉండండి అంటూ ఆయనను ఆపి మహేష్ నీఇష్టం ఎంతసేపయినా మాట్లాడు అని పర్మిషన్ ఇవ్వడంతో , thank you soooo much sir అంటూ అందరివైపు తిరిగి , అక్కడ చివరలో చాలా మంది అనాధ పిల్లలు ఉన్నారు చూడండి అని చెప్పడంతో , ఎక్కడ ఎక్కడ .........అంటూ లేచిమరీ వెనక్కు చూస్తున్నారు . నేను ఇక్కడికి వచ్చి చెప్పేంతవరకూ ఎవ్వరికీ తెలియదు అదీకాక పిల్లల వెనుక ఉన్నవాళ్ళయితే ఆ పిల్లలను కనీసం పట్టించుకోకుండా తోసుకుంటూ ముందుకు వచ్చేస్తుంటే , మన సెక్యూరిటీ ఆఫీసర్ల వలన వాళ్ళు హాయిగా కూర్చున్నారు . ముందుగా నా తరుపున మనందరి తరుపున సెక్యూరిటీ ఆఫీసర్లకు నా మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు .



నిజంగా ఆ అనాధ పిల్లలు ఇక్కడకు రావాల్సిన పనిలేదు , మనలాగానే అనాధ శరణాలయంలో పెద్దవారు వచ్చి అవార్డు అందుకొని వెళ్లిపోవచ్చు . కానీ ఆ పెద్దవారే ఇక్కడ చాలా కష్టం అని చెప్పినా వినకుండా వారి కష్టాలను స్వయంగా తెలపడానికి ఆర్థికంగా అర్థించడానికి వచ్చారు . నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇప్పటివరకూ ఆ "అమ్మ అనాధ శరణాలయానికి " స్టేట్ నేషనల్ మరియు ఇంటర్నేషనల్ గా లెక్కలేనన్ని అవార్డ్స్ వచ్చాయని , అన్ని అవార్డ్స్ వచ్చిన ఆ ఆలయం ఎలా వెలుగొందాలి కానీ ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంటూ స్క్రీన్ పై చూపించమని చెప్పడంతో , 



ఆపరేటర్ వెంటనే సెర్చ్ చేసి స్క్రీన్ పై visuals మరియు అన్ని రకాల ఇబ్బందులు పడుతున్న మూగ , చెవిటి మరియు చూపు handicap పిల్లలను చూపించగానే స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దన్గా మారిపోయింది . ఇలాంటి అనాధ శరణాలయాలు మన రాష్ట్రం మొత్తం మరియు దేశం మొత్తం ఎన్ని ఉంటాయో వారి కష్టాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి బాధతో మాటలు కూడా రానట్లు నిలబడ్డాను.



నిశ్శబ్దన్గా ఉన్నంత మాత్రాన వారి సమస్య తీరదు . నేను కూడా మా ఇంటి దీపమైన నా ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు మహి పిల్లలను చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడుతూ (జాబ్ గురించి చెప్పినదాన్నీ వివరించి ) ఏదో ఒకటి చేయాలి అన్నయ్యా లేకపోతే మనం మనుషులుగా బ్రతికి వేస్ట్ ............అని చెప్పడంతో , నేను ఈ స్టేజీపై CM గారి ముందే ఆ పిల్లల కష్టాన్ని నావంతు కొద్దిగానైనా తీర్చడానికి " MAHI ఫౌండేషన్ " ను స్థాపిస్తున్నాను . ఫస్ట్ అమౌంట్ గా CM గారి చేతుల మీదుగా అందుకున్న ఈ 1 crore 50 lakhs మరియు నా పర్సులో ఉన్న డబ్బునంతా మహి ఫౌండేషన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను , ఇక్కడున్న బ్యాంకింగ్ రంగం సహకరిస్తే అకౌంట్ ఓపెన్ చేసి సీఎం గారి చేతులమీదనే అమ్మ శరణాలయం కు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పగానే ,



స్టేడియం మొత్తం లేచి కన్నీళ్లను తుడుచుకుంటూ చప్పట్లతో అభినందించడం చూసి అమ్మావాళ్ళవైపు మరియు మహివైపు చూసాను . అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలతో మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతో కీర్తి మీరు సాధించారు అంటూ ముద్దుల వర్షం కురిపించింది . లవ్ యు అన్నయ్యా అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది . 



అంతటి ప్రోత్సాహాన్ని చూసి సీఎం గారు లేచి నాదగ్గరకు వచ్చి భుజం చుట్టూ చెయ్యివేయ్యగానే , స్టేడియం మొత్తం సంతోషమైన అరుపులు చప్పట్లతో మారుమ్రోగిపోయింది .



భుజం తట్టి అభినందిస్తూ మరొక మైకు వారిద్వారా అందుకొని చిన్న పిల్లాడైనా బాగా మాట్లాడాడు . మహేష్ ను మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూ ప్రక్కనే ఉన్నవారి చెవిలో ఏదో చెప్పి పంపారు . మహి ఫౌండేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా గుర్తించడమే కాకుండా దాని అవసరాలను కూడా చూస్తుంది . మహేష్ ఇప్పుడే అన్నాడు కేవలం మాటల మరియు నిశ్శబ్దం వలన వారి సమస్య తీరదు అని , నేను మాటల నాయకున్ని కాదు చేతల మంత్రిని అందుకే బడ్జెట్ లోనుండి మన రాష్ట్రం లో ఎన్ని అనాధ శరణాలయాలు మరియు వృద్ధాశ్రమాలు ఉన్నాయో వాటన్నింటికీ ఒక్కొక్కటి చొప్పున 5 కోట్లను మహి ఫౌండేషన్ ద్వారా అందజేయాలని మహేష్ ను కోరుతున్నాను అంటూ ,



అంతలోనే టైప్ చేసుకొనివచ్చిన మహి ఫౌండేషన్ గుర్తింపును మరియు అన్ని బ్యాంకులలో అకౌంట్ ను మరియు మహి ఫౌండేషన్ తరుపున చెక్ బుక్ ను అందచెయ్యబోతున్నాను అంటూ అమౌంట్ ను కూడా ట్రాన్స్ఫర్ చేసేసారు , చేసినట్లుగా మొత్తం స్క్రీన్ పై అందరూ వీక్షించేలా AV వేశారు , అందరూ లేచి సీఎం సీఎం సీఎం...........అంటూ స్టేడియం దద్దరిల్లేలా కేకలు వేశారు , ఆయన ఆనందానికి అవధులు లేవు , మహేష్ అంటూ అమాంతం కౌగిలించుకొని కేవలం ఐదే ఐదు నిమిషాల్లో నన్ను వారి గుండెల్లోకి వెళ్లేలా చేసావు చాలా సంతోషం నీకు ఎలాంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ గా కలవు అంటూ అభినందించారు .నాచేతిని పైకెత్తి విజయ సంకేతం చూపి , ఇప్పుడు మహి ఫౌండేషన్ ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చెయ్యాలంటే నా సంతకం కూడా ఫోర్జరీ అయిపోతుంది అని అందరితో పాటు నవ్వుతూ ,



అమ్మా అనాధ శరణాలయానికి మొదటి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మహి ఫౌండేషన్ డైరెక్టర్ మహి గారిని మరియు ఆ పిల్లలందరినీ స్టేజి మీదకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అంటూ సీఎం గారే స్వయంగా పిలవడంతో , సెక్యూరిటీ ఆఫీసర్లు చాలామంది వచ్చి పిల్లలు మహి మేడం రండి అంటూ జాగ్రత్తగా పిలుచుకొని వచ్చారు . సీఎం గారు మహి చేతికి పూలమాల ఇచ్చి మీ ఒక్కమాటతో మీ అన్నయ్య ఇంత చేసాడంటే మీరు నిజమైన హీరో అంటూ అభినందించారు . సీఎం గారు పిల్లలు అని చెప్పగానే , ఒక పిల్లాన్ని ఎత్తుకోవడంతో , మళ్లీ స్టేడియం మొత్తం దద్దరిల్లింది . మహేష్ నేను నిమిషం నిమిషానికి నీకు ఋణపడిపోతున్నాను అని చెప్పడంతో మహి లోలోపలే పరవశించిపోయింది . 



ఆపేరటర్ అని పిలవడంతో లాప్టాప్ తీసుకువచ్చి మేడం సీక్రెట్ పాస్వర్డ్ సెట్ చేయండి అనిచెప్పి స్క్రీన్ ఆఫ్ చేసాడు . సెట్ చేయగానే మేడం ఇక మీ ఇష్టం అంటూ లాప్టాప్ వదిలి వెళ్ళిపోయాడు . అన్నయ్యా అంటూ పిలిచి కీర్తిని ఎత్తుకొని నా గుండెలపై వాలిపోయి తన చేతులతోనే తన శరణాలయానికి 7 1/2 crores ను  స్క్రీన్ పై అందరూ చూస్తుండగానే ట్రాన్స్ఫర్ చెయ్యడంతో మహి ఫౌండేషన్ మహి ఫౌండేషన్.......... అంటూ కరతాళధ్వనులతో మారుమ్రోగింది. మహి కళ్ళల్లో ఆనందబాస్పాలు చూసి నా హృదయం పరవశించిపోయింది. 



ఆర్గనైజర్స్ సమయం రెండు గంటలు అవుతోంది పిల్లలు భోజనం చేశారా అని అడిగారు . సర్ మహేష్ 12 గంటలకే మీ పేరు చెప్పి ఆ ఏర్పాట్లు కూడా చేసేసారు అని బదులివ్వడంతో , మహేష్ మహేష్ మహేష్........అంటూ మళ్లీ నన్ను అభినందించారు , ఒక వ్యక్తి వచ్చి సర్ చెవిలో ఏదో చెప్పడంతో go on అంటూ పర్మిషన్ ఇచ్చారు . నెక్స్ట్ విద్యా రంగం అందులో మొదటి సరస్వతి ఎవరో కాదు మన మహి ఫౌండేషన్ డైరెక్టర్ మహి ...........అని గట్టిగా చెప్పడంతో నాకంటే ఎక్కువ అదిరిపోయింది . 10th ఇంటర్ లలో ప్రతిభా అవార్డ్స్ ఇప్పుడు ఒక చిన్న కాలేజ్ అంటూ పేరు చెప్పి university , state levelలో ఉన్నతస్థాయిలో రాణించినందుకు సీఎం గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానోత్సవం అంటూ అనౌన్స్ చెయ్యడంతో as it is గా స్టేడియం దద్దరిల్లింది , సీఎం గారు సంతోషన్గా బహుకరించి మైకు అందుకొని మహేష్ మీరిద్దరూ ట్విన్స్ అన్నట్లు గుర్తు అవును కదూ , మీరిద్దరూ ఒకేసారి పుట్టి రాష్ట్రాన్ని మరియు నన్ను అంటూ చిన్నగా నావైపు చూసి ఉన్నతస్థాయికి తీసుకెళ్లినందుకు మీ పేరెంట్స్ ను సన్మానించుకోవాలని ఆశపడుతున్నాను అని చెప్పడంతో ,



నేరుగా మహితోపాటు అమ్మావాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మా అమ్మమ్మా అత్తయ్యా రండి అంటూ మహితో స్టేజి మీదకు పంపించి ప్రిన్సిపాల్ గారు మీరు కూడా రండి అంటూ వారిని కూడా గౌరవంగా తీసుకెళ్లి అమ్మావాళ్లను మరియు టీచర్స్ ను సీఎం గారికి పరిచయం చేశాను . రెండు చేతులతో అమ్మావాళ్లకు మరియు మేనేజ్మెంట్ కు నమస్కరించి శాలువాలను చేతికిచ్చి ఇలాంటి కవలలను కన్న మీ జన్మ ధన్యం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆనందబాస్పాలతో మెరిసిపోతున్న అమ్మా అమ్మమ్మను చెరొకవైపు హత్తుకొని పరవశించిపోయాను. పిల్లలూ మీరేమీ కడుపునిండా తినేశారు మీ అన్నయ్య వల్ల, ఇప్పుడు నాకు ఆకలి వేస్తోంది ఈ సంతోష సమయంలో నాతోపాటు మళ్లీ భోజనం చేస్తారా అని అడగడంతో , చేస్తాము అంటూ గట్టిగా అరిచి చెప్పారు .



మైకులో one hour lunch break అని చెప్పడంతో అందరూ ఒక సంతోషమైన భావంతో మహి ఫౌండేషన్ కు తమ వంతుగా donations ట్రాన్స్ఫర్ చేశారు . మెసేజ్ అలర్ట్స్ తో చెల్లి ఫోన్ మ్రోగుతూనే ఉండటంతో చూసి అమితమైన సంతోషంతో అన్నయ్యా అంటూ చూపించి మొబైల్ ను సైలెన్స్ లో పెట్టింది . నా మహి స్వచ్ఛమైన కోరికకు నిదర్శనమే అదంతా అంటూ తన సంతోషాన్ని చూసి మురిసిపోయాను . 



PA పిల్లలతోపాటు స్టేజి పై ఉన్నవారందరినీ మాతోపాటు లంచ్ చెయ్యడానికి పిలుచుకొనివచ్చెయ్ అంటూ చీఫ్ గెస్ట్స్ తోపాటు స్టేజి వెనక్కు వెళ్లిపోయారు . మహేష్ మీ అందరినీ మరియు పిల్లలను కూడా సర్ పిలుస్తున్నారు .......ఇటువైవు అంటూ దారి చూపించడంతో , మహి , అమ్మా ......వెళదామా అని అడగడంతో , నవ్వుతూ మహి కీర్తికి ముద్దుపెట్టి పిల్లలను తనతోపాటు రమ్మని చెప్పి పిల్లల మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళింది . వెనుకే అమ్మా వాళ్ళతోపాటు ప్రిన్సిపాల్ వాళ్ళను పిలుచుకొని వెనుకే వెళుతూ , అమ్మా ఇంతకీ నాన్న ఎక్కడ ఇలాంటి సత్కారాలు అంటే ముందు ఉండేవారు అంటూ నవ్వితూ అడిగాను . 



బుజ్జికన్నా ఇంకెక్కడ నీకు సీఎం అందించిన నగదు పురస్కారాన్ని ఎప్పుడైతే నీ చెల్లెలి ఫౌండేషన్ ద్వారా అనాధ పిల్లలకు ఇచ్చేస్తున్నానని చెప్పగానే కోపంతో ఊగిపోతూ ఒక్కమాట కూడా చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడు అంటూ అమ్మమ్మ మూసిముసినవ్వులు నవ్వుతూ చెప్పింది . 



అమ్మా అమ్మమ్మా నేనేమైనా తప్పుచేశానా అని అడిగాను . అమ్మ ఆగి నా కన్నయ్య తప్పుచేయ్యడమా , ఒక్కసారి ఆ పిల్లల సంతోషాన్ని చూడు అంటూ చూపించి , వర్ణించలేని సంతోషంతో నా కన్నయ్య బంగారం , మేమే కాదు ఇక్కడ వచ్చినవారందరూ గర్వపడేలా చేసావు అంటూ ఆనందబాస్పాలతో మురిసిపోతూ నా బుగ్గపై ప్రేమగా తాకింది . నా బుజ్జికన్నయ్య మరియు నా బంగారు తల్లికి ఇంటికివెల్లగానే డబల్ దిష్టి తీయాలి అంటూ నవ్వుతూ చెప్పింది . లవ్ యు మా , అమ్మమ్మా అంటూ ఇద్దరి చేతులను పట్టుకొని స్టేజి వెనుక సీఎం గారి కోసం ఏర్పాటుచేసిన దగ్గరికి చేరుకున్నాము . 



ఆయన కోసం వండిన స్పెషల్ ఐటమ్స్ పిల్లలతోపాటు మా అందరికీ వడ్డించారు . చెల్లి అమ్మావాళ్ళు పిల్లలకు ఎదికావాలో ఆడిగిమరీ తెప్పించి వాళ్ళతో పాటు తింటున్నారు . నేను ప్రిన్సిపాల్ వాళ్ళ దగ్గరకు వెళ్లి వారి సంతోషాన్ని వింటూ తిన్నాము . సీఎం గారు సెక్యూరిటీతోపాటు వచ్చి మహేష్ నీతో wonderful టైం spent చేసాను thank యు ........... ఫారినర్స్ తో మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను , మీరు ప్రోగ్రాం ఎంజాయ్ చెయ్యండి . మీరు మహేష్ కాలేజ్ ప్రిన్సిపాల్ అన్నారు కదూ అంటూ చేతులు కలిపి మీ కాలేజ్ లో ఏదైనా ఫంక్షన్ జరిగితే చీఫ్ గెస్ట్ గా రావడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను , మహేష్ తో నా PA నెంబర్ ఉంది కాల్ చెయ్యండి బై అనిచెప్పి హడావిడిగా వెళ్లిపోయారు . మహేష్ ఇది చాలు అంటూ సంతోషం పట్టలేక ప్రిన్సిపాల్ అమాంతం నన్ను కౌగిలించుకొన్నారు .
[+] 14 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-09-2019, 10:09 AM



Users browsing this thread: 5 Guest(s)