Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
#11
మూడు గంటల్లో మైసూర్ చేరుకొని కొండమీద అమ్మవారిని దర్శించుకుని కిందకు వచ్చి భోజనం చేసి మహల్ నుండి మొదలెట్టి ఫేమస్ టూరిస్ట్ స్పాట్ లన్నింటినీ చుట్టేసి చివరగా  గార్డెన్ చేరుకొని చీకటిలో musical fountain వీక్షించి రాత్రికి అక్కడే స్టే చేసి ఉదయం బెంగళూరుకు చేరుకొని రెస్ట్ తీసుకొని ఆరోజంతా సిటీ చుట్టేసి అమ్మకు ఇక్కడే ఉండాలని ఆశగా ఉన్నా నేను ఆఫీస్ కు వెళితే ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ప్రేమగా నచ్చజెప్పి మళ్లీ నెల తిరక్కుండానే నేనే ఒకసారి వైజాగ్ వస్తానమ్మా అని చెప్పగా , సరే అంటూ ఎయిర్పోర్ట్ లో వదలగా భారంగా కౌగిలించుకొని జాగ్రత్త కన్నయ్యా , నాన్నా అంటూ అమ్మానాన్నలిద్దరూ చెప్పగా , సంతోషిస్తూ అలాగే అమ్మా వెళ్లగానే కాల్ చెయ్యండి అని ముగ్గురమూ కౌగిలించుకొని లోపలకు వెళ్లేంతవరకూ ఉండి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 10 గంటలు అవ్వగా అలసిపోయి నిద్రలోకి జారుకున్నాను.



ఉదయం లేవగానే అమ్మ నుండి missed కాల్ రాగా చూసి వెంటనే చేసి మాట్లాడి ఆఫీస్ కు రెడి అయ్యి వెళ్ళాను , ఇష్టమయిన పని కాబట్టి రోజూ అమ్మతో మాట్లాడుతూ వీకెండ్స్ కృష్ణ మరియు మిగతా ఫ్రెండ్స్ తో  రోజులు చాలా తొందరగా గడిచిపోయాయి  , మొదటి నెల సాలరీ అకౌంట్ లో పడినట్లుగా మెసేజ్ రాగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పాలని కాల్ చెయ్యబోయి ఆగిపోతూ రేపు ఎలాగో వీకెండ్ కాబట్టి ఈ రోజు రాత్రికి వైజాగ్ వెళ్లి స్వయంగా చెబుదామని టికెట్ బుక్ చేసి ఆఫీస్ అవ్వగానే సాలరీ డబ్బుతో అమ్మకు పట్టుచీర , గోల్డ్ చైన్ తీసుకునేసరికి సాలరీ డబ్బులో 10 వేలు మాత్రమే మిగులగా నాన్నకు వాచ్ మాత్రమే తీసుకొని ఇంటికి తాళాలు వేసి మా సీక్రెట్ ప్లేస్ లో ఉంచి కృష్ణ గాడికి కాల్ చేసి నేను వైజాగ్ వెళుతున్నాను కీస్ మన ప్లేస్ లోనే ఉన్నాయి ఎంజాయ్ అని చెప్పి రాత్రి ఫ్లైట్ కు వైజాగ్ బయలుదేరాను.



ఉదయం ఇంకా చీకటిగానే ఉండగా ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ లో ఇంటికి చేరుకొనగా సెక్యూరిటీ గేట్ తెరిచి ఎలా ఉన్నారు బాబు అని పలకరించగా బాగున్నాను అన్నా అనిచెప్పి లోపలకు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కగా నిద్రపోతున్నట్లుగా కొద్దిసేపటితరువాత తలుపు తెరవగానే అమ్మా సర్ప్రైజ్ అంటూ అమాంతం పైకి ఎత్తుకోగా , కన్నయ్యా అంటూ సంతోషంగా నవ్వుతూ ఏమండోయ్ శ్రీవారు ఎవరు వచ్చారో చూడండి అంటూ మురిసిపోతూ కేక వెయ్యగా , బెడ్రూం నుండి వచ్చి నాన్నా అంటూ సంతోషపడుతూ రాగా అమ్మను నెమ్మదిగా కిందకు దించి నాన్న ఆశీర్వాదం తీసుకోగా నాన్నా ఇప్పుడేనా వచ్చింది ప్రయాణం బాగా జరిగిందా అంటూ అడుగగా నవ్వుతూ సమాధానమిచ్చి నాన్న జీవితంలో మొదటిసారి సంపాదనను మీతో సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చాను అంటూ బ్యాగులో నుండి అమ్మకు పట్టుచీర మరియు జ్యూవెల్లరీ ఇవ్వగా అమ్మ ఆనందబాస్పాలతో మా కన్నయ్య బంగారుకొండ అంటూ మురిసిపోతూ అందుకొని చూసి wow చూడండి నా కన్నయ్య ఎంత అందమైనవి తెచ్చాడో అంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ చూపిస్తుండగా , నాన్నకు వాచ్ మాత్రమే ఇవ్వగా ఇంకా అన్నట్లుగా బ్యాగు వంక చూస్తుండగా , thats it నాన్న గారు అని సైగ చెయ్యగా , మీ అమ్మకేమో లక్షల్లోనా నాకు కేవలం వేల ల్లోనా అంటూ బుంగమూతి పెట్టుకోగా ,చూసి అమ్మ గట్టిగా నవ్వుతుండగా, నాన్న అమ్మకు తీసుకోగా నా సాలరీ లో మిగిలింది అంతే అనగా , వెంటనే గట్టిగా నవ్వుతూ వాచ్ ను తన గుండెలపై పెట్టుకొని వెంటనే చేతికి తగిలించుకొని loved it నాన్నా అంటూ మురిసిపోతూ మాఇద్దరినీ సంతోషంగా కౌగిలించుకొని మా జీవితాంతం ఈ క్షణాలను సంతోషంగా గుర్తుపెట్టుకుంటాము కన్నా , నాన్నా అంటూ అమ్మానాన్నలిద్దరూ చెప్పి కన్నయ్యా కొద్దిసేపు వెళ్లి పడుకో అని చెప్పగా , అమ్మా నీ ఒడిలో పడుకోవాలని ఉందమ్మా అనగానే ఆనందబాస్పాలతో దగ్గరకు తీసుకొని వాళ్ళ బెడ్రూం లోకి వెళ్లి అమ్మ ఒడిలో వాలిపోగానే హాయిగా నిద్రపట్టగా , నా కురులలో ప్రేమగా నిమురుతూ జోకొట్టింది.



లేచేసరికి 11 గంటలు అవ్వగా ఫ్రెష్ అయ్యి కిందకు రాగా నాకోసం చాలా వంటలు చేసినట్లుగా స్వయంగా తన చేతులతో తినిపించి రెండు రోజుల్లోనే నెలకు సరిపడా అన్ని రకాలు రుచిచూపించగా సండే నైట్ మళ్లీ బెంగళూరు చేరుకొని యధావిధిగా వర్క్ లో వీకెండ్స్ తో బిజీ బిజీ అయిపోగా మూడు వారాలు తరువాత అమ్మ కాల్ చేసి ఈ ఫ్రైడే సాటర్డే తిరుపతి దగ్గర మన బంధువుల పెళ్లి మేము వస్తున్నాము వీలుచూసుకొని నువ్వు కూడా రా కన్నయ్యా అని పిలువగా సంతోషిస్తూ అమ్మా పెళ్లి ఎవరిదో చెప్పలేదు అని అడుగగా అది అది..........అంటూ నసుగుతూ మీ పెద్ద తాతయ్య అనగానే కోపంతో ఆ సైకో ఫ్యామిలీదా నేను రాను మీరు వెళ్లడం కూడా నాకు ఇష్టం లేదు అని బల్లగుద్దినట్లుగా చెప్పగా , కన్నయ్యా నేను చెప్పేది విను చాలా సంవత్సరాల తరువాత మీ పెద్దమ్మ నువ్వు చిన్నప్పుడు ఇష్టంగా ఆడుకునేవాడివే చెల్లెలు ఇద్దరూ వచ్చి ప్రేమగా ఆహ్వానించారు నీకు కూడా కాల్ చేస్తామని నెంబర్ తీసుకున్నారు నిన్ను చూడాలని చాలా ఆశపడుతున్నారు కన్నా నాకోసం అలా వెళ్లి ఇలా వచ్చేద్దాము పెళ్లి చూసినట్లుగా ఉంటుంది తిరుమల దర్శించినట్లుగానూ ఉంటుంది అని చెప్పగా ,



అమ్మా నీ కోరికను ఎందుకు దూరం చెయ్యడం తిరుమల దర్శనం అంటున్నావు చూడు అందుకు మాత్రమే వస్తాను పెద్దమ్మను చెల్లిని కలిసి పెళ్లికి మాత్రo దూరంగా ఉంటాను పెద్ద తాతయ్య , పెదనాన్నలే సైకో లు అనుకుంటే వాడు పెళ్ళికొడుకు పేరు మరిచిపోయాను అమ్మ కార్డ్ చూసి హర్ష అని చెప్పగా , ఆ అవును వాడి పెరు కూడా పలకడం నాకు ఇష్టం లేదు అంటూ కోపంగా మాట్లాడగా సరే కన్నయ్యా నీ ఇష్టం నిన్ను చూసి చాలా రోజులవుతోంది ఎప్పుడు వస్తున్నావు అని ప్రేమగా అమ్మ అడుగగానే కోపం మొత్తo పోయి మీరు వచ్చేలోపల వచ్చేస్తానమ్మా అడ్రస్ పెట్టు అని చెప్పగా చూసి చంద్రగిరిలోనా లవ్ యు మా అంటూ కట్ చేసి ఫ్రైడే లీవ్ తీసుకొని తిరుమలకు అమ్మనాన్నలను తీసుకువెళ్లాలి కాబట్టి ఫ్రైడే మధ్యాహ్నం కారులోనే చంద్రగిరి బయలుదేరాను.



చాలా సంవత్సరాల తరువాత కలవబోతున్నందుకు పెద్దమ్మకు చెల్లికి పట్టుచీరలు తీసుకొని హైవే లో పోనిస్తూ , మా తాతయ్యలు ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు మా తాతయ్య కష్టపడి వ్యవసాయం చేస్తూ ఒక్కొక్క ఏకరాను పెంచుకుంటుపోతుండగా నాన్న గారు పట్నంలో పెద్ద చదువులు చదువుతూ, మా పెద్ద తాతయ్య ఎవ్వరికీ తెలియకుండా ఆ ఆస్తి పత్రాలను తాకట్టుపెట్టి వ్యభిచారం , జూదం లో తగలేస్తుండగా ఆయన కొడుకైతే చుట్టూ ఉన్న ఊళ్ళల్లో అమ్మాయిలను తార్చుతూ జైల్ కు కూడా పోయి రాగా ఇలా కాదని నాన్నగారితోపాటుగా ఇద్దరికీ పెళ్లిళ్లు చేసినా , నాన్నకు నేను , వాళ్లకు హర్ష గాడు మరియు చిన్నప్పటి నుండి హర్ష గాడి కంటే నాతోనే ఇష్టంగా ఆడుకునే చెల్లి ప్రమీలా పుట్టి ఊహ తెలిసేలా పెరిగినా ఎన్నిసార్లు మంచిగా చెప్పినా పెద్ద తాతయ్య ఆయన కొడుకు వినకుండా అలాగే ప్రవర్తిస్తూ తాతయ్యకు చెడ్డ పేరు తీసుకువస్తుండగా  ఒకసారి కోపం తో చెప్పగానే ఇద్దరూ అప్పటికే తాగి ఉండటం వలన తెలివిలో లేక తాతయ్యమీదకు వచ్చి చెయ్యి కూడా చేసుకోగా , వాడు హర్ష గాడూ ఇంతలేడు మా నాన్న తాతయ్యనే తిడతావా అంటూ తాతయ్యను రాయి అందుకొని కొట్టగా తాతయ్యకు రక్తం వచ్చినా పట్టించుకోకుండా ఉండిపోగా , చెల్లితో ఆడుకుంటున్న నామీద కూడా దాడి చేసి ప్రమీలా రావే అంటూ లాక్కొని వెళ్లిపోగా ,



పెద్దమ్మ వంట గదిలోనుండి వచ్చి తాతయ్య నుండి వారిని దూరంగా పంపించేసి డాక్టర్ ను పిలిపించి మా ఇద్దరికీ కట్లు కుట్టించగా , పనిమీద సిటీకి వెళ్లిన అమ్మానాన్నలు వచ్చి చూసి బాధపడుతుండగా చాలాసేపటి తరువాత లేచిన తాతయ్య ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండము అంటూ పెద్దమ్మను చూసి ఆస్తిని సగం సగం చేసి మా భూములన్నీ అమ్ముకొని వైజాగ్ వచ్చి సగం డబ్బుతో భూములను మిగతా సగం డబ్బును నాన్న బిజినెస్ చేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము , అప్పటినుండి ఇప్పటివరకూ మామధ్య మాటలు కూడా లేవు , తాతయ్యను కొట్టినందుకు వాణ్ణి చూసినవెంటనే నేను ఏమి చేస్తానో నాకే తెలియదు అంటూ కోపంతోన్ చంద్రగిరి చేరుకొని వెంటనే అమ్మకు కాల్ చేసి ఎక్కడ ఉన్నారని చెప్పగా , ఇప్పుడే నైట్ ఫంక్షన్ అయిపోయి భోజనాలు జరుగుతున్నాయి వాళ్ళ ఇంటికి వెళ్లడం నీకు ఇష్టం లేదని పెద్దమ్మకు తెలిసి మనకు విడిదిని గుడికి ప్రక్కనే ఉన్న స్కూల్ లో వధువు తరపు వారితోపాటు ఇచ్చారు అక్కడికే వచ్చెయ్యి అని చెప్పగా,



అక్కడ ఉండటం కూడా నాకు ఇష్టం లేదు తిరుపతిలో స్టే చేసి ఉదయమే పెళ్లికి వేద్దాము అని చెప్పగా  సరే కన్నయ్యా నీ ఇష్టం అని బదులివ్వగా అయితే వస్తున్నాను రెడీగా ఉండండి అని చెప్పి నేరుగా స్కూల్ దగ్గరకు చేరుకొని లోపలకు వెళుతుండగా ఇద్దరు నన్ను దాటుకుని వెళుతుండగా గుర్తుపట్టి పెద్దమ్మా అని పిలువగా వెనక్కు తిరిగి చూసి తదేకంగా చూస్తూ మహేష్ కదా అని అడుగగా ప్రక్కనే ఉన్న అమ్మాయి అన్నయ్యా అని పిలువగా , ప్రమీలా ఎంత పెద్దదానివి అయిపోయావు అనగానే నా కౌగిలిలో వాలిపోగా ఎలా ఉన్నారు అని అడుగగా అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము ఇప్పుడు పాపం ఒక మంచి అమ్మాయిని మా నరకం లోకి తీసుకురాబోతున్నాము అంటూ బాధపడుతూ చెప్పి చుట్టూ చూసి ఈ మాటలు మా మగవాళ్ళు వింటే అంతే ఇక అంటూ వెంటనే నువ్వు ఎలా ఉన్నావు మహేష్ రా వెళదాము అని పిలువగా , నేను వచ్చినది కేవలం మిమ్మల్ని చూడటానికి మాత్రమే పెద్దమ్మా , చెల్లి అంటూ కారులో నుండి చీరలను తీసి ఇచ్చి చెల్లి నీకే కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడని మాత్రం మరిచిపోకు అనగానే అన్నయ్యా...........అంటూ ఆనందబాస్పాలతో నా గుండెలపై వాలిపోగా నా మొబైల్ నెంబర్ ఉందిగా ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యి వాలిపోతాను అంటూ ఆప్యాయంగా హత్తుకొని రండి అమ్మవాళ్ల దగ్గరకు వెళదాము అని చెప్పగా ,



లేదు మహేష్ అక్కడ ఏదో పని ఉందంటే పెళ్లికూతురుని పిలుచుకురావడానికి వచ్చాము ఏదో మరిచిపోయిందని తన రూం కు వెళ్ళింది వేచి చూస్తుండగా నువ్వు వచ్చావు అదిగో ఆ సెకండ్ ఫ్లోర్ లో అమ్మావాళ్ళు ఉన్నారు నువ్వు వెళ్లు తరువాత వచ్చి కలుస్తాము అని చెప్పి వెళ్లిపోగా లోపలకు వెళుతుండగా చీకటిలో గలగలా చప్పుడుతో నలుగురు అమ్మాయిలు బయటకు వెళుతుండగా పెళ్లి కూతురేమో అనుకుని నవ్వుతూ స్టెప్స్ ఎక్కుతూ టర్న్ అవుతుండగా పై నుండి హుషారుగా పట్టుచీరలో ఒక అమ్మాయి వేగంగా వస్తూ నన్ను గుద్దేయ్య బోతూ పట్టుతప్పి స్టెప్స్ పై పడిపోతుండగా నా రెండు చేతులతో పడిపోకుండా చేతిని మరియు నడుమును పెట్టుకోగానే ఆ వెచ్చటి స్పర్శకు నా వొళ్ళంతా ఎప్పుడూ ఎరుగని తియ్యటి జలదరింపుకు లోనవ్వగా ,



వెంటనే తేరుకొని చేతిని పెట్టుకోగానే నా వైపుకు తిరుగగా అమాంతం నా గుండె వేగం పెరిగిపోతూ ఇప్పటివరకూ చూడని సౌందర్యం , అందమైన కళ్ళు , చేతికి గోరింటాకు పెట్టుకొని దేవకన్యలా కనిపించగానే నా మనసు గాలిలో తెలిపోతూ నన్ను నేనే మరిచిపోయినట్లుగా కన్నార్పకుండా పెదాలపై చిరునవ్వుతో అలా చూస్తూ ఉండిపోగానే బాలన్స్ చేసుకొని నిలబడి థాంక్స్ అంటూ అందమైన చిరునవ్వుతో చెప్పి హంసలాగా వెళ్లిపోగా , తన అందాన్ని నా హృదయమంతా నింపుకొన్నట్లుగా తను వెళ్లిపోయిన తరువాత చాలాసేపటికి తేరుకొని వెంటనే ఆ దేవకన్య ఎక్కడ అంటూ కిందకు వేగంగా పరిగెత్తుకుంటూ రాగా చుట్టూ ఎటుచూసినా చీకటి తప్ప ఎవరూ కనిపించకపోయేసరికి , ఎంతపని చేసాను మళ్లీ తను నాకు కనిపిస్తుందో లేదో అని బాధపడుతూ గుండెల్లో నింపుకున్న అందాలరాసిని తలుచుకుంటూ పైకి అమ్మానాన్నలున్న రూంలోకి రాగానే కన్నయ్యా వచ్చేసావా అంటూ కౌగిలించుకొని మేము రెడి అంటున్నా పట్టించుకోకుండా పడుకోవడానికి ఏర్పాటు చేసిన బెడ్ పై వాలిపోయి పెద్దకళ్ళతో గుండెలపై చేతిని వేసుకొని నిశ్శబ్దన్గా తిరుగుతున్న ఫ్యాన్ ను అలా చూస్తూ ఉండిపోగా ,



అమ్మానాన్నలు నన్ను చూసి ఆశ్చర్యపోతూ నాన్న గారు కంగారుపడుతుండగా శాంతంగా ఉండండి అంటూ చిలిపిగా నవ్వుకుని అమ్మ నా ప్రక్కనే కూర్చుని నా కురులలో ప్రేమగా చేతితో నిమురుతూ కన్నయ్యా ............ ఆ అమ్మాయి ఎవరు అని అడుగగానే నాన్న మళ్లీ ఆశ్చర్యపోగా వెంటనే లేచి కూర్చొని సిగ్గుతో అమ్మ గుండెలపై తల దాచుకోగా , అయితే నీ ప్రవర్తనకు కారణం అమ్మాయి వల్లనే ఎవరు బేబీ ఆ అదృష్టవంతురాలు మరియు నా కోడలు అనగానే నాన్నకు కూడా అర్థమయినట్లుగా ఆనందిస్తుండగా , అమ్మ , అమ్మా.........అంటూ సిగ్గుపడుతూ జరిగిందంతా వివరించగా , అయితే ఆ అమ్మాయి కచ్చితంగా పెళ్లికి వచ్చి ఉంటుంది భోజనాలు కాబట్టి కచ్చితంగా గుడిలో అందరూ తింటుంటారు కానీ ఏమీ లాభం నువ్వు అక్కడకు రావు కదా అనగా , వెంటనే లేచి అమ్మా ఫస్ట్ అక్కడకు వెళదాం పదా తను దొరికెంతవరకూ చంద్రగిరి వదిలి వెళ్ళేది లేదు అంటూ ఆత్రం చెయ్యగా , నీ ఇష్టమే నా ఇష్టం కన్నయ్య అంటూ రూమ్ కు తాళం వేసి గుడికి బయలుదేరాము. ఒకే ఒక్క మాట నన్ను అక్కడ ఎవ్వరికీ పరిచయం చెయ్యకూడదు అని చెప్పగా , కన్నయ్య ఒక మాట చెప్పనా వాళ్ళ మీద కోపంతో మన బంధువులు ఒక్కరు కూడా రాలేదు నువ్వు మాకు కాస్త దూరంగా ఉన్నావంటే ఎవ్వరూ పట్టించుకోరు అని చెప్పగా , ఇదేదో బాగుంది అంటూ పెళ్లి మండపం దగ్గరకు ఆత్రంగా చేరుకున్నాము.



తన కోసం నా కళ్ళు నా కళ్లల్లో అమ్మాయి కనపడిందా అన్న స్పార్క్ కోసం అమ్మానాన్నలు నన్నే చూస్తుండగా కళ్యాణ మండపం దగ్గర , భోజనాలు జరిగే దగ్గర , గుడి లోపల బయట మొత్తం వెతికినా ఆ దేవకన్య జాడ తెలియకపోవడంతో గుడి లోపల ఉన్న రూంలలో నుండి అమ్మాయిల మాటలు వినిపించగా ఒక రూమ్ పెళ్ళికొడుకు కోసం అని తెలియగానే అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా ఎదురుగా ఉన్న పెళ్లికూతురు రూంలో ఎలా చూడటం అని ఆలోచిస్తుండగా , అంతలో ఒక పెద్దావిడ వచ్చి పెళ్లి కూతురు గది తలుపు తెరిచి అందరి భోజనాలు పూర్తయ్యాయి మీరు కూడా తినేసి పెళ్లికూతురికి కావాలంటే ఇక్కడికే పంపిస్తాను అంటూ కేకలు వేస్తూ చెప్పగానే అమ్మతో పాటుగా చిరునవ్వులు చిందిస్తూ తను కచ్చితంగా బయటకు రావాల్సిందే అంటూ ఆతృతగా వేచి చూస్తూ బయట ఉన్న అన్ని స్విచ్ లను on చేసి ఎక్కడా కనిపించలేదంటే కచ్చితంగా ఇక్కడే ఉంటుంది ఇంతలో నా హృదయ వేగం కూడా తియ్యగా అమాంతం పెరిగిపోతూ తను ఇక్కడే ఉంది అన్నట్లుగా తెలియజేస్తుండగా ,



గుండెలపై చేతిని వేసుకొని గజ్జెల శబ్దం అంతకంతకూ పెరుగుతుండగా నాకళ్లు పెద్దవిగా అవుతూ బయటకు వచ్చిన వారందరినీ చూస్తుండగా ఎవ్వరూ కాదన్నట్లుగా అందరూ మమ్మల్ని దాటుకుని వెళ్లిపోగా , సంతోషంగా నా వైపు చూసిన అమ్మ ఇందులో కూడా లేదని తెలుసుకొని బాధపడుతుండగా , అమ్మా పెళ్లి కూతురు కాకుండా లోపల ఇంకెవరైనా ఉన్నారేమో చూడమని చెప్పగా , సరే కన్నయ్యా అంటూ గుండెలపై సైగ చేస్తూ లోపలకు వెళ్లి కాసేపైన తరువాత తలవంచుకొని బాధగా వచ్చి పెళ్లికూతురు తప్ప ఎవరూ లేరు కన్నయ్యా అనగానే బాధపడుతుండగా , కన్నయ్యా బాధపడకు ఎవరైనా సరే పెళ్లికి తప్పకుండా రావాల్సిందే కాబట్టి రేపు కచ్చితంగా నా కోడలు నీకు కనిపిస్తుంది పదా భోజనం చేద్దాము అని చెప్పగా , అమ్మా నేను దారిలోనే తినేసాను అని అపద్ధాన్ని చెప్పి లేకపోతే నాకోసం ఇద్దరూ తినరని , మీరు వెళ్లి తిని అటు నుండి విడిదికి వెళ్లిపోండి నేను ఇక్కడే తనకోసం వేచిచూస్తాను అంటూ పెళ్లి జరిగే ప్రదేశం దగ్గర కుర్చీ వేసుకొని చూస్తూ కూర్చోగా పెళ్లి కూతురికి కూడా భోజనం తీసుకువెళ్లారు,



అమ్మానాన్నలు తినేసి వచ్చి నన్ను డిస్టర్బ్ చెయ్యకుండా నాకు తెలియకుండా వెనుకనే కూర్చోగా అర్ధరాత్రి దాటినా తారసపడక ఒక్కరూ కూడా కనిపించక అందరూ నిద్రపోతుండగా , వెనుక నుండి చలికి అమ్మ దగ్గినట్లుగా వినిపించగా వెంటనే వెనక్కు తిరిగి చూడగా నవ్వుతూ కన్నయ్యా అనగా , అమ్మా నాకోసం మీరు కూడా ఇంత చలిలో నన్ను క్షమించమ్మా పదండి వెళదాము అంటూ అమ్మ చేతులను వెచ్చగా చేసి విడిదికి చేరుకొని కారులో నుండి జర్కీన్ తీసి అమ్మ వెనుక వేసి రూమ్ కు వెళ్లగానే పడుకోబెట్టి బ్యాగులో నుండి మందమైన దుప్పటి తీసి కప్పి ఇద్దరమూ ప్రక్కనే కూర్చుని లవ్ యు sooooo మచ్ మా అంటూ కాసేపు చేతులతో వెచ్చదనాన్ని పంచి నాన్న గారు చూసుకోండి అంటూ లైట్ off చెయ్యగానే దుప్పటిలో దూరి వెచ్చగా కౌగిలించుకొని పడుకోగా సంతోషిస్తూ నాకోసం ఏర్పాటుచేసిన బెడ్ పై పడుకున్నాను. పడుకున్నాను అన్నమాటే కానీ తన అందమైన కళ్ళే మళ్లీ మళ్లీ కనిపిస్తూ హాయిగా పిచ్చెక్కిస్తూ చాలాసేపటి తరువాత నిద్రలోకి జారుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 11-07-2019, 10:34 AM



Users browsing this thread: 55 Guest(s)