Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
#10
అలారం చప్పుడుకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని ట్రిమ్ చేసుకొని ఫ్రెష్  బ్రెడ్ ఆమ్లెట్ తయారుచేసుకొని fruits తో పాటు తినేసి నీట్ గా రెడి అయ్యి అమ్మ ఫస్ట్ డే అంటూ కాల్ చేసి మాట్లాడి కారులో 20 నిమిషాలలో చేరుకోగా అందరూ ఐడెంటిటీ కార్డ్స్ చూపించి లోపలకు వెళుతుండగా జాయినింగ్ లెటర్ చూపించగా welcome అంటూ లోపలకు కారును పోనిచ్చి ఇటువైపు సర్ 8అంటూ సెక్యూరిటీ రూంలోకి పిలుచుకొనివెల్లగా ఒక వ్యక్తి జాయినింగ్ లెటర్ చూసి క్షణాల్లో నా పేరు మీద ఐడెంటిటీ కార్డ్ ముద్రించి come with me అంటూ స్వయంగా అతడే లోపలకు పిలుచుకొని వెళ్తుండగా అందరూ ఉత్సాహంగా లోపలకు వెళుతుండగా ముగ్గురు మాత్రం ఉదయం ఉదయమే గులాబీ పువ్వులు పట్టుకొని ఒక్కొక్క అమ్మాయి వెంట పడుతూ లవ్ మీ లవ్ మీ ............అంటూ బ్రతిమిలాడుతుండగా నాకైతే నవ్వు ఆగక చేతిని అడ్డం పెట్టుకొని నవ్వుతూ ప్రక్కనే ఉన్న వ్యక్తిని చూసి బలవంతంగా కంట్రోల్ చేసుకొని ,



Sorry sir అనగా ఎందుకు వాళ్ళను చూసా మొదట్లో అలా చూసి చుట్టూ పట్టించుకోకుండా వెళుతున్నారే వాళ్ళందరూ నాతో సహా ఇలా ఇంతకంటే ఎక్కువగా నవ్వినవాళ్ళమే కానీ అలవాటైపోయింది , దాదాపు మూడు నెలల నుండి రోజూ చూసి చూసి అలవాటైపోయి వాళ్ళను పట్టించుకోవడమే మానేసాము ఇంటరెస్టింగ్ ఆ అబ్బాయిలేమైనా బ్యాడా అని అడుగగా , నో నో నో ........పాపం వాళ్ళు ఛీకొడుతున్నా సిన్సియర్ గా వాళ్లనే ప్రేమిస్తున్నారు కానీ ఆ అమ్మాయిలే ఇంకా బెటర్ వాళ్ళ కోసం ఆశపడి వాళ్ళను అలా కుక్కల్లా తిప్పుకుని ఎంజాయ్ చేస్తూ వాళ్ళతోనే ఖర్చులు పెట్టిస్తూ అలా గడిపేస్తున్నారు అప్పటి నుండి వాళ్లకు గుణపాఠం చెప్పే మగాడు ఎవరైనా వస్తారా అని నాతోపాటు చాలామంది ఆతృతగా ఎదురుచూస్తున్నాము కానీ మా ఆశ తీరడం లేదు అంటూ నేరుగా మేనేజర్ రూమ్ కు తీసుకెళ్లి సర్ your ఫేవరేట్ మహేష్ అని వదిలి చిరునవ్వుతో వెళ్లిపోగా ,



Yes yes come in మహేష్ atlast we met అంటూ లోపలకు పిలిచి కూర్చోమని చెప్పి పరిచయాలయ్యాక ప్రాజెక్ట్ గురించి brief గా వివరించి డైరెక్ట్ గా టీం లీడర్ బాధ్యతలు అప్పగించబోగా , ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్పీరియన్స్ కోసం టీం మెంబెర్ గా జాయిన్ అవుతాను అని కాన్ఫిడెంట్ గా చెప్పగా , thats soooo impressive మహేష్ , గో ahead anything you want you can directly come to my office అంటూ చేతులు కలిపి come lets introduce to your team members అంటూ స్వయంగా ఆయనే వచ్చి నన్ను టీం కు introduce చెయ్యగా చేతులు కలుపుతుండగా అర్థమైంది ఏంటంటే ఆ ముగ్గురు ట్రూ లవర్స్ మరియు ముగ్గురు కన్నింగ్ గర్ల్స్ అందరూ నా టీం లోనే ఉన్నారని , ఉండటమే కాదు వాళ్ళు ముగ్గురూ నన్ను కొరికేసి తినేట్లు చూస్తుండగా పట్టించుకోకుండా ముగ్గురు అబ్బాయిల దగ్గరకు వెళ్లగా , మహేష్ you carry on అని నవ్వుతూ చెప్పేసి మేనేజర్ గారు వెళ్లిపోగా , మహేష్ right నువ్వు చాలా స్పెషల్ బ్రో ఇప్పటివరకూ మన మేనేజర్ గారు వచ్చి టీం మెంబెర్ అని introduce చెయ్యడం ఈ కంపెనీలోనే ఫస్ట్ టైం బ్రో అందుకే చూడు అందరూ నిన్ను ఎలా చూస్తున్నారో అంటూ చుట్టూ అందరినీ చూపించగా ,



Yes i am mahesh అంటూ నన్ను నేను పరిచయం చేసుకోగా టీం లోని వారంతా ఒక్కోక్కరే పరిచయం చేసుకోగా , ముగ్గురు అమ్మాయిలు కన్నార్పకుండా నన్నే చూస్తూ మా దగ్గరకు వచ్చి నా ప్రక్కనే ఉన్న వాళ్ళను ప్రేమిస్తున్న అబ్బాయిల చేతులలో ఉన్న ఫ్లవర్స్ అందుకొని welcome to our team మహేష్ అంటూ అందిస్తూ ఫ్రీ టైం లో కాఫీ అంటూ ముగ్గురూ ఒకేసారి ఆహ్వానించి వాళ్లలో వాళ్లే నేను ముందు నేను ముందు అంటూ ఈర్ష్యపడుతుండగా , అంటే వీళ్ళ ముగ్గురికీ ఆ బెటర్ పర్సన్ నేనే అన్నమాట వీళ్ల తిక్క కుదర్చాలి అంటూ పూలను అందుకొని sure anytime అనగానే థాంక్స్ , థాంక్స్.......అంటూ ఎదురుగా కూర్చోగా , అప్పటివరకూ సంతోషన్గా పలకరించిన ఆ అమ్మాయిలను ఇష్టపడే అబ్బాయిలు నన్ను కోపంగా చూస్తుండగా , అమ్మాయిలు మాత్రం ప్రాజెక్ట్ discussion అంతా నన్నే చూస్తుండగానే లంచ్ టైం రాగా ముగ్గురూ shall we go , shall we go............ అంటూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ పిలువగా , 



 కూల్ కూల్ నలుగురమూ వెళదాము అంటూ క్యాంటీన్ కు వెళ్లి టేబుల్ చుట్టూ కూర్చొని లంచ్ ఆర్డర్ చేసి మాట్లాడుతూ వీళ్ళను ఎలా మార్చాలి అని ఆలోచిస్తుండగా నాన్న  మొబైల్ లో అమ్మ నెంబర్ డార్లింగ్ అని సేవ్ చేసుకొని ఉండటం గుర్తుకురాగా వెంటనే మొబైల్ తీసుకుని టేబుల్ కింద అమ్మ నెంబర్ కు డార్లింగ్ అని లవ్ థీమ్  సేవ్ చేసి మాటల్లో మొబైల్ టేబుల్ మీద ఉంచేసి excuse me అంటూ రెస్ట్ రూమ్ వైపు మొబైల్ వదిలేసి వెళ్లి వెంటనే లోపల ఉన్న వ్యక్తి దగ్గర నుండి మొబైల్ అందుకొని అమ్మకు కాల్ చేసి అమ్మా ఇది కొల్లిగ్స్ నెంబర్ ఎందుకు , ఏమిటి అని అడగకుండా నా మొబైల్ కు ఆగకుండా కాల్స్ చేస్తూనే ఉండు కొద్దిసేపటి తరువాత నేనే ఎత్తి కొత్తగా మాట్లాడుతాను వింటూ ఊ కొట్టు విషయం తరువాత చెబుతాను అని కాల్ కట్ చేసి ,



థాంక్స్ సర్ అంటూ మొబైల్ ఇచ్చేసి డోర్ దగ్గరకు వెళ్లగానే మొబైల్ రింగ్ అవుతున్నట్లుగా మొదటిసారి ముగ్గురూ పట్టించుకోకుండా వాళ్ళల్లో వాళ్ళు కూడా మాట్లాడుకోకుండా నాకోసం ఎదురుచూస్తుండగా , కట్ అయ్యి మళ్లీ రెండవసారి మ్రోగగానే ప్రక్కనే ఉన్న అమ్మాయి ఎవరా అన్నట్లుగా క్యూరియోసిటీ తో చూసి గోళ్లు నములుతూ డార్లింగా ఎవరై ఉంటారు అని తనలో తాను జలసీ ఫీల్ అవుతుండగా , కట్ అయ్యి మూడవసారి మ్రోగగానే ఎవరే అంటూ లేచి చూసి డార్లింగ్ విత్ లవ్ థీమ్ అంటూ టెన్షన్ పడుతూ మొదటి అమ్మాయిలా గోళ్లు నములుతూ కూర్చోగా , చెప్పినట్లుగానే అమ్మ ఆపకుండా కాల్ చేస్తూనే ఉండగా ఇక్కడ ముగ్గురిలో డార్లింగ్ ఎవరో తెలుసుకోవాలని టెన్షన్ ఎక్కువవుతుండగా , మరొక వ్యక్తి రెస్ట్ రూమ్ కు రాగా మొబైల్ ఇప్పించుకొని నాన్నకు కాల్ చేసి అమ్మను కాల్ చెయ్యడం ఆపించి అమ్మాయిల దగ్గరకు వెళుతుండగా , మా టేబుల్ కు కాస్త దూరంగా అమ్మాయిలను ఇష్టపడుతున్న ముగ్గురూ మమ్మల్ని గమనించడానికన్నట్లుగా కూర్చొని టెన్షన్ పడుతూ లంచ్ చేస్తుండగా ,



Hi బ్రదర్స్ అంటూ పలకరించగా పట్టనట్లుగా నా మీద కోపంగా ఉన్నట్లుగా తలలు ప్రక్కకు తిప్పేసుకుగా , టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చుంటూ have it గర్ల్స్ అంటూ లంచ్ చేస్తుండగా వాళ్ళు తింటూ ఎలా అడుగుదాము అని మాదనపడుతూ ముగ్గురూ ఒకేసారి మహేష్ డార్లింగ్ ఎవరు అని అడుగుతూ ఒకరినొకరు చూసుకొని తలలు దించుకోగా , మీకెలా తెలుసు oh........ shit......... మొబైల్ ఇక్కడే మరిచిపోయానన్నమాట అంటూ మొబైల్ అందుకొని తెలిసినా this many missed కాల్స్ i am finished అంటూ నటిస్తూ so so soooooo sorry darling, my heart అంటూ వెంటనే కాల్ చేయగా అటువైపు అమ్మ ఎత్తగా నెమ్మదిగా so sorry డార్లింగ్ , i am really really sorry ఇప్పుడే మొబైల్ మరిచిపోయి రెస్ట్ రూమ్ కు వెళ్ళాను ఇంతలో నువ్వు చేసావు , నీ తీయని కోపం చల్లారడానికి ఏమి చెయ్యాలి చెప్పు నీ బుగ్గలు పట్టుకొనా వద్దా నీ చేతులు పట్టుకొనా , నీ పాదాలు పట్టుకొనా అనగానే అటువైపు నవ్వినట్లుగా నటిస్తూ , డార్లింగ్ నువ్వు నవ్వావు నాకదే చాలు లవ్ యు లవ్ యు లవ్ యు ........so so soooo much రా అంటూ ప్రేమగా మొబైల్ లోనే ముద్దులుపెడుతూ ముగ్గురి వంక చూడగా ముఖాలంతా చెమటతో తింటున్నట్లుగా నటిస్తూ నా మాటలే వింటుండగా మరింత రెచ్చిపోయి ప్రేమగా మాట్లాడుతూ ముద్దులుపెడుతూ కొద్దిసేపు మాట్లాడి వర్క్ అవ్వగానే కాల్ చేస్తాను డార్లింగ్ ప్రేమగా ఒక్క ముద్దు ప్లీస్ ప్లీస్ ........ఒకే ఒక తియ్యటి ముద్దు అని అడుగగా ఇచ్చినట్లుగా చాలు డార్లింగ్ అంటూ గుండెలపై చేతిని వేసుకుని ప్రేమ పారవశ్యంలో మునిగితేలుతున్నట్లుగా ముఖం వెలిగిపోతూ పెదాలపై చిరునవ్వుతో ప్రేమగా ముద్దుపెట్టి లవ్ you too డార్లింగ్ బై అంటూ కాల్ కట్ చేసి నన్నే కన్నార్పకుండా బాధపడుతూ చూస్తున్న ముగ్గురినీ చూసి sorry అంటూ గుండెలపై చెయ్యి వేసుకొని తలుచుకున్నట్లుగా నటించి మీరు కానివ్వండి అంటూ తల వంచుకొని వారి నెక్స్ట్ ప్రశ్న కోసం ఆత్రంగా ఎదురుచూస్తుండగా ,



దానికి ఎంతో సమయం పట్టలేదు మహేష్ are you in love? , do you have girl friend ? , డార్లింగ్ అంటే నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయా ? అంటూ ముగ్గురూ మూడు ప్రశ్నలు ఒకే సమాధానం కోసం సంధించగా , గుండెలపై చెయ్యి వేసుకొని ఫీల్ అవుతూ " yes , i am in deep love sisters " అనగానే , నాకు లవర్ ఉన్నందుకు ఒకటి మరియు సిస్టర్స్ అన్నందుకు మరొకటి ఏకంగా రెండు షాక్ లు తిన్నట్లుగా లేచి నిలబడగా , మరొక టేబుల్ పై కూర్చున్న ముగ్గురూ సిస్టర్స్ అన్న మాట వినగానే సంతోషంతో మావైపు చూస్తుండగా , చూడండి సిస్టర్స్ ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి దేనిలో నైనా betterment కోరుకోవచ్చు కానీ జీవిత భాగస్వామి విషయంలో అది కూడా మిమ్మల్ని మీరు కాదంటున్నా కూడా మీకోసమే మిమ్మల్నే ప్రాణంగా ప్రేమిస్తున్న నా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వారికి దూరమైపోతారో అని ఎంతలా బాధపడుతున్నారో చూడండి అంటూ వారిని చూయించి ,



ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప , మీ అదృష్టం అంత మంచి వాళ్ళ కన్నా మిమ్మల్ని ప్రాణంగా చూసుకునేవాళ్ళు దొరకనే దొరకరు , వాళ్ళ ప్రేమను ఒక్కసారి ఫీల్ అయ్యి ఆలోచించండి ఇప్పటికైనా మించిపోలేదు , ఇప్పుడు మీరు వెళ్లినా వారు కొద్దిగా మీపై అలగవచ్చు కానీ వాళ్ళలా ఆలోచించి మీ ప్రేమతో జయించండి , ఏదైనా తప్పుగా మాట్లాడితే మీ సొంత బ్రదర్ లా నన్ను మన్నించండి అంటూ కూర్చుని లంచ్ చేస్తుండగా కాంటీన్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ గా మారిపోగా ముగ్గురూ తమ తప్పు తెలుసుకున్నట్లుగా బాధతో కన్నీళ్లు కారుతూ ఒకరినొకరు చూసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం సరిపోకపోవడంతో , కళ్ళతోనే ఏమి పర్లేదు నేను చూసుకుంటాను వెళ్ళండి అంటూ గుండెలపై చేయివేసి చెప్పగా ,



నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇన్నిరోజులుగా వాళ్ళను తమ చుట్టూ తిప్పుకుని బాధపెట్టినది పదే పదే గుర్తుకువస్తున్నట్లుగా తాము ఎంత పెద్ద తప్పు చేసాము అన్నట్లుగా పశ్చాత్తాపంతో కళ్ళల్లో కన్నీళ్ళతో వారి వారి లవర్స్ ప్రక్కకు చేరుకొని sorry చెప్పేంతలో ముగ్గురు అబ్బాయిలు నేను చెప్పినట్లుగానే వాళ్ళను వదిలి నా దగ్గరకు వచ్చినందుకు కాస్త బాధపడినట్లుగా పట్టించుకోకుండా లేచి వెళ్లిపోగా , మహేష్ ...........అంటూ నా వైపు చూడగా , వెళ్ళండి మీ ప్రేమతో ఈ క్షణం నుండి అన్ని వదిలి మీరు నిజాయితీగా బ్రతిమాలండి అని చెప్పగా , సరే అన్నట్లుగా త్తల ఊపి కొన్ని నెలలుగా వాళ్ళ చుట్టూ ఎలా బ్రతిమాలుతూ తిరిగారో ఇపుడు exact opposite గా వాళ్ళ పేర్లతో పిలుస్తూ ప్రక్కకు చేరి sorry మాకు మీ నిజాయితీ అయిన ప్రేమ ఇప్పుడు తెలిసింది మమ్మల్ని క్షమించండి అంటూ తమ తప్పు తెలుసుకున్నట్లుగా వేసుకుంటూ క్యాంటీన్ నుండి బయటకు వెళ్లగానే ,



ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరూ షాక్ లో ఉన్నట్లుగా ఆరుగురు బయటకు వెళ్లగానే శభాష్ అన్నట్లుగా నావైపుకు తిరిగి చప్పట్లతో అభినందించగా thank you thank you అంటూ నవ్వుతూ లంచ్ పూర్తి చేసి మొత్తం బిల్ పే చేసి అలా బయటకు వచ్చి వెంటనే అమ్మకు కాల్ చెయ్యగా , బేబీ is everything ఫైన్ అని అడుగగా , నీవల్ల ఆరుగురి లైఫ్ సెటిల్ అయిపోయిందమ్మా అంటూ ఉదయం ఎంటర్ అయ్యిన దగ్గర నుండి జరిగిందంతా చెప్పగా , అమ్మ మురిసిపోతున్నట్లుగా మా కన్నయ్య బంగారం అంటూ ప్రాణంగా ముద్దుపెట్టగా , ఇందులో మా అమ్మ పాత్ర కూడా చాలా ఉంది చుట్టూ అందరూ బాగుండాలని చిన్నప్పటి నుండి నాకు చెప్పడం వలనే ఎవరు బాధల్లో ఉన్నా వెంటనే మా మంచి అమ్మ మాటలే గుర్తుకురావడం వల్లనే ఇది సాధ్యమయ్యింది అమ్మా అంటూ సంతోషంగా కొద్దిసేపు మాట్లాడి వర్క్ అయ్యాక కాల్ చేస్తాను అమ్మా నో నో నో my one and only darling mom అంటూ కాల్ కట్ చేసి వెనక్కు తిరుగగా ,



మహేష్ we are really really sorry for misundaerstanding you ప్లీస్ forgive us అంటూ ప్రాధేయపడగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ .........ఫ్రెండ్స్ మధ్యన sorry లు ఉండవు అంటూ చేతులు కలిపి we are friends నో అంటూ కౌగిలించుకోగా , మహేష్ you are really గ్రేట్ అంటూ మనసారా హత్తుకొని , నీ మాటలు విన్నందుకు sorry డార్లింగ్ అంటే మీ అమ్మ గారా అని అడుగగా , guys guys ..........slowly మీ అమ్మాయిలు విన్నారంటే మళ్లీ మొదటికొస్తారు అంటూ కంగారుపడుతూ చెప్పగా , వాళ్ళు ముగ్గురూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకొని అంటే నీకు లవర్ లేదా అని అడుగగా , నువ్వు ప్రేమలో లేవా అని అడుగగా , 



ప్రేమ..............మా అమ్మనాన్నల స్వచ్ఛమైన ప్రేమ తప్ప నాకు ఇప్పటివరకూ మరొక ప్రేమ గురించితేలియదు , పడలేదు కూడా నా aim వేరు నా గోల్ వేరు భవిష్యత్తులో ప్రేమలో పడతానో లేదో కూడా నాకు తెలియదు అని చెప్పగా , ముగ్గురూ వాళ్ళల్లో వాళ్ళు కంగారుపడుతూ ఈ విషయం తెలిస్తే ముందుగా మేము చాలా నష్టపోతాము ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయిలకు ఈ విషయం తెలియనే రాదు అని భయపడుతుండగా , నా గుండెలపై చేతిని వేసుకొని నా ప్రాణం పోయినా చెప్పను అనగానే ముగ్గురూ థాంక్స్ మహేష్ అంటూ కౌగిలించుకోగా , సంతోషిస్తూ లోపలకు వెళ్లగా అప్పటికే మొత్తం అందరికి తెలిసిపోయినట్లుగా అందరూ నావైపే అభినందిస్తున్నట్లుగా చూస్తుండగా , మేనేజర్ గారు ఎదురుపడి i know about you మహేష్ I strongly believe now you do miracles అంటూ అభినందిస్తున్నట్లుగా కౌగిలించుకొని సంతోషంగా నవ్వుతూ వెళ్లిపోగా ,



సాయంత్రం వరకూ ప్రాజెక్ట్ గురించి టీం మెంబెర్స్ తో చర్చించి మొదటిరోజు తృప్తిగా గడిచిందని కారులో  అమ్మానాన్నలతో సంతోషంగా మాట్లాడి ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి ఒంటరిగా బోర్ కొడుతుండగా దగ్గరలోని షాపింగ్ సెంటర్ కు వెళ్దామని నిర్ణయించుకొని కిందకు రాగా అపార్ట్మెంట్ పిల్లలందరూ సంతోషన్గా ఆడుకుంటుండగా వాళ్ళ అమ్మలు ఒక దగ్గర చేరి ముచ్చట్లు పెట్టుకోవడం చూసి చిన్నప్పటి సంతోషమైన జ్ఞాపకాలతో పెదాలపై చిరునవ్వుతో కారులో మెయిన్ రోడ్డులో నెమ్మదిగా ప్రయాణిస్తూ నచ్చిన షాప్ లలో షాపింగ్ తో టైం పాస్ చేసి బయటే భోజనం చేసి ఇంటికి చేరుకొని కాసేపు టీవీ చూసి బెడ్రూం లోకి వెళ్లి పడుకున్నాను.



As it is గా అలారం చప్పుడుకు నిద్రలేచి రెడీ అయ్యి దారిలో హోటల్ ల్ టిఫిన్ చేసి ఆఫీస్ కు చేరుకోగా ప్రతిరోజూ ఆ ముగ్గురు అబ్బాయిలు వాళ్ళ అమ్మాయిల కోసం వేచిచూస్తుండగా , ఈ రోజు మాత్రం అమ్మాయిలే ముగ్గురూ ముందుగా వచ్చి వాళ్ళ లవర్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుండటం రాగానే ఇంకా బెట్టు చేస్తున్నట్లుగా లోపలకు వెళ్లిపోతుండగా సారి sorry అంటూ వేసుకోవడం  చూసి నిన్న జరిగింది తెలియనివాళ్ళు ఆశ్చర్యపోతుండగా ప్రక్కనే తెలిసిన వాళ్ళు వాళ్లకు వివరించగా సంతోషిస్తూ గుసగుసలతో లోపలకు వెళ్లిపోగా సెక్యూరిటీ రూమ్ లో ఉన్న వ్యక్తి కూడా అలాగే తెలుసుకొని నేను లోపలకు వస్తుండగా సెక్యూరిటీ ఐడెంటిటీ కార్డ్ అడుగగా ఇతను పరుగున వచ్చి సర్ కారు కనపడగానే నేరుగా పంపించేయ్ అంటూ సెక్యూరిటీకి ఆర్డర్ వేసి మాంచి గుణపాఠం చెప్పారు అన్నట్లుగా సెల్యూట్ చెయ్యగా నవ్వుతూ పార్కింగ్ లో కారు ఉంచేసి లోపలకు వెళ్ళాను. అలా రెండు రోజులు కాగానే అంతా మరిచిపోయి అందరూ కలిసిపోగా అప్పుడు అనుకున్నాను అబ్బాయిల మనసు బంగారం అని ,



అలా బిజీ బిజీగా సరదాగా ఐదు రోజులు గడిచిపోగా శనివారం తెల్లవారుజామునే ఆత్రంగా లేచి నిద్రమబ్బులోనే కారు తీసుకొని ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే అమ్మానాన్నలు వారం రోజులకే సంవత్సరాలైనట్లుగా చూడగానే బేబీ అంటూ వచ్చి మనసారా కౌగిలించుకొని కన్నయ్య చిక్కిపోయినట్లున్నావె అనగా అమ్మా ......... అనగానే లేదులే బేబీ నీ సంతోషం చెబుతోంది నువ్వు ఎలా ఉన్నావో చాలా సంతోషం అని మురిసిపోతుండగా , నాన్న అంటూ పాదాలకు నమస్కరించగా మహేష్ అంటూ కౌగిలించుకోగా అమ్మా బయట చలి ఎక్కువగా ఉంది అంటూ నేను వేసుకున్న జర్కీన్ తీసి అమ్మకు కప్పి రండి వెళదాము అంటూ బ్యాగు అందుకొని కారులో ఇంటికి బయలుదేరగా అప్పుడప్పుడే తెల్లవారుతుండగా మంచు చలికి అవునండి చాలా చలిగా ఉంది అంటూ నాన్న చేతిని అమ్మ తన చుట్టూ వేసుకొని నాన్న గుండెలపై వాలిపోగా మిర్రర్ లో చూసి dad you are వెరీ lucky అంటూ సంతోషన్గా చెప్పగా , అమ్మను వెచ్చగా ఇంకా దగ్గరకు తీసుకొని yes my son i am luckiest హుస్బెండ్ అండ్ father అంటూ మురిసిపోతూ అమ్మ నుదుటిపై వెచ్చగా ప్రేమగా ముద్దుపెట్టగా , థాంక్స్ dad , లవ్ యు sooo much శ్రీవారు అంటూ ఇంటికి చేరుకోగానే మొత్తం చూసి ముందుగా నాన్నకు సంతోషంతో ముద్దుపెట్టి చాలా బాగుంది అని మురిసిపోతుండగా ,



అమ్మా రాత్రంతా నిద్రపోయారో లేదో కాసేపు రెస్ట్ తీసుకుంటారా అని అడుగగా ఫ్లైట్ లో హాయిగా నిద్రపోయాము కన్నా మైసూర్ అమ్మవారి మొక్కు ఉంది వెళ్ళాలి అని బదులివ్వగా అయితే ఇప్పుడే బయలుదేరాలి అని చెప్పగా అమ్మ లోపల స్నానం చేసి రెడి అయ్యేలోపు ఇద్దరమూ బయట బాత్రూం లో రెడి అయ్యి కొత్తబట్టలు వేసుకొని నాన్న మీరు టీవీ చూస్తూ ఉండండి బయట tiffin తెచ్చేస్తాను అంటూ వెళ్లి తీసుకురాగా సరదాగా మాట్లాడుతూ తినేసి కావలసిన వస్తువులను తీసుకొని కారులోనే మైసూర్ బయలుదేరాము.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 11-07-2019, 10:32 AM



Users browsing this thread: 62 Guest(s)