Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అసూయ by monica sunny
#1
అసూయ:-

లాలస కోపంగా చేతిలో ఉన్న బ్యాగును నేలకు విసిరి కొట్టి, అక్కడికీ కోపం తీరక ఎదురుగా ఉన్న తమ ఫ్యామిలీ ఫోటోని నేలకు విసిరికొట్టి తునాతునకలు చేసేసింది.తన తమ్ముడు తోవన్ చెప్పింది విని కాసేపు ఏమీ అర్థం కాలేదు, అర్థం అయిన వెంటనే ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది లాలస.చేతికి అందిన వస్తువులన్నీ విసరికొడుతూ తన ఆవేశాన్ని అదుపు చేసుకొనే ప్రయత్నం చేసింది గాని ప్రయోజనం లేకపోవడంతో అమ్మకు ఫోన్ చేసింది. అటువైపు నుండి చాలా రింగుల తరువాత మదాలస లైన్ లోనికొచ్చింది మదాలస.లైన్లోనికొస్తూనే, లాలసకు అవకాశం ఇవ్వకుండా తోవన్ ఫోన్ చేసాడా నీకు అంటూ ఎదురు ప్రశ్నేస్తూ పలకరించింది.ఇక లాలస కు కోపం నశాళానికెక్కి చేతిలో ఉన్న ఫోన్ ను విసిరి కొట్టేసి సోఫాలో కూచుండి పోయింది. ఆవేశం తగ్గేదాకా చాలా సేపటివరకూ అలానే ఉండి, ఊరికెళ్ళి అమ్మను నేరుగా నిలదీసి అడిగితే గాని తన మనసు కుదుటపడేలా లేదని నిర్ణయించుకొని అప్పటికప్పుడు దొరికిన flight పట్టుకొని వైజాగ్ బయలు దేరింది లాలస.
సాయంకానికల్లా రుస రుసలాడుతూ ఇంట్లోకి దూసుకెళ్ళింది లాలస. లాలస ఇంట్లోకి రాంగానే టీవీ చూస్తున్న మదాలస calm గా లేచివెళ్ళి టవెల్, సోప్ తెచ్చి ఇచ్చింది.వాటిని పక్కకి విసిరి కొడుతూ నేను విన్నది నిజమేనా ? అంది లాలస ఉగ్రంగా. .

ఏం విన్నావే ?
Lal :- ఉదయం తోవన్ నాకు ఫోన్ చేసి చెప్పిన విశయం .
అన్నీ నీకు వివరంగా చెబుతా గాని ,నీవెళ్ళి స్నానం చేసిర.
La :- స్నానం గీనం ఏమీ లేవు నేను విన్నది నాకు ఇప్పుడే తేలి పోవాలి.
మదాలస :- నీవు విన్నది, రేపు జరగబోయేది ,అన్నీ నిజమే చాలా, నీవెళ్ళి స్నానం చేసి రా,, అన్నీ చెబుతాగా
అమ్మ మదాలస అన్న మాటలకు లాలస నివ్వెర బోతూ అసలు నీవేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా అమ్మా. . .రేపో మాపో మనుమళ్ళను మనుమరాళ్ళను ఎత్తుకొని ఆటాడించాల్సిన వయసులో పెళ్ళీ గిళ్ళీ అని అంటున్నవు నీకేమైనా మతిపోయిందా
మదాలస :- నాకేం మతిపోలేదే ,నువ్వు ఆవేశపట్టం ఆపేసి చక్కగా స్నానం చేసిరా, , , అన్ని విశయాలు చెబుతా అంటూ బలవంతంగా బాత్రూములో తోసింది.
అన్యమనస్కంగా నే స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబల్ మీద కూచొని పెద్దగా శబ్దం చేసింది లాలస.
మదాలస కూల్ గా భోజనం వడ్డించి ఎప్పుడు తిన్నవో ఏమో? నువ్వు అన్నం తింటూ ఉండు నేను అన్నీ చెబుతా ఉంటాను.
లాలస కరిగిపోయింది ఆమె ఆప్యాయతకు, కణ్ణీళ్ళు ఉబుకుతుండంగా గబగబ నాలుగు ముద్దలు తిని తేలిక బడింది.
లాలసనే చూస్తున్న మదాలస ఎందుకే నీకు అంత ఆవేశం అంతా మీ నాన్న పోలికే నీకు అంటూ ఇంకా చారు పోసి అందులో కొద్దిగా నేయినివేసింది.
లాలస ఇంకేం మాట్లాడకుండా ఏదో తిన్నాననిపించి లేచి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి కూచొంది ఇక చెప్పమన్నట్లుగా . . . . .
మదాలస :- ఇప్పుడే చెప్పమంటావా లేక ఉదయం మాట్లాడుకొందామా అంది ఉడికిస్తున్నట్టుగా మదాలస.
అమ్మ వైపు ఉరిమి చూసింది లాలస.
మదాలస నవ్వుతూ. . . సరె, సరేలే అంత ఎక్కిళ్ళు పడనవసరం లేదు, చెబుతా గా. . .చెప్పే ముందు నీవు ఏం అడగాలనుకొన్నావో అన్నీ అడిగేయ్
లాలస అదే తడవగా నీవు రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ద పడుతున్నావని తోవన్ చెప్పాడు, నిజమేనా ఇంతకీ తోవన్ ఎక్కడ ? వాడు కనిపించడం లేదు అంది చుట్టూ చూస్తూ
తన చేతుల్ని చేతుల్లోకి తీసుకొంటూ వాడు ఇప్పట్లో రాడుగాని వాడు చెప్పింది నిజమేనే అంది
అమ్మా అంది భరించలేనట్టుగా లాలస
మదాలస :- నువ్వు సినిమాల్లో మాదిరి కేకలేయడం మానేసి సాంతం విను.
ఏంటే వినేది? నాన్న చనిపోయి పదిహేనేళ్ళ పైగానే అవుతోంది ఇన్నేళ్ళూ లేని ఆలోచన ఇప్పుడెందుకొచ్చిందంట? అదీ గాక ఇప్పుడు నేను కూడా నా కాళ్ళ మీద నిలబడ్డనుగా రేపో మాపో వాడుకూడా ఏదో ఒక జాబ్ లో చేరనే చేరుతాడు.నిన్ను పోషించుకోవడానికి మా ఇద్దరి సంపాదన చాలదా లేక మరచి పోయిన వయసు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ ఆవేశపడిపోయింది.
మదాలసకు కన్న కూతురు అన్న మాటలకు కోపం వచ్చినా నిభాయించుకొంటూ నీవు అడిగిన ప్రశ్నలోనే జవాబూ ఉంది లాలూ . . .నువ్వు శాంతంగా ఉంటానంటే నేను మాట్లాడతా, లేదంటే నీ ఇష్టం, నా నిర్ణయం మార్పుండదు.అంటూ లేచి వెళ్ళిపోయింది మదాలస.
లాలసకు తల కొట్టేసినట్లయ్యింది.అమ్మ ఎంత మొండిదో తన చిన్న తన నుండీ చూస్తున్నదే. . .కాని ఈ లేటు వయసులో రెండో పెళ్ళి చేసుకోవాలనే ఆమె నిర్ణయం ఎందుకొచ్చిందో ఏంటో అనుకొని కాసేపాగి మెల్లగా లేచి అమ్మ గదిలోనికెళ్ళింది.
బెడ్ మీద తన ప్రక్కనే కూచొని మౌనంగా ఉండి పోయింది. అలా కూచోవడం వల్ల తనకు తెలియకుండానే కన్నీళ్ళు ధారగా కారసాగాయి.
లాలసను అలానే దుఖః పడనిచ్చి మదాలస కూడా చాలా సేపటివరకూ కాం గా ఉండిపోయింది.
రాత్రి పదవుతోండగా తోవన్ వచ్చాడు. వచ్చీ రాంగానే అమ్మ గదిలోనికి తొంగి చూసి ఎప్పుడొచ్చావే అంటూ పలకరిస్తూ వాకిట్లోనే నిలుచున్నాడు.
లాలస తల ఎగురవేసి ఇంత సేపటి వరకూ ఎక్కడ తిరుగుతున్నవురా? అమ్మ ఒకతే ఉంటుందని నీకు తెలీదూ?
తోవన్ :- నిన్న మొన్నటి వరకూ ఇంటి పట్టునే ఉండే వాడిని, ఇప్పుడావిడకు మన అవసరం లేదులా కనిపిస్తోంది అందుకే లేటుగా వచ.... .అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చి తన గదిలోనికెళ్ళిపోయాడు.
వాడు చెప్పిన సమాధానానికి లాలసకు ఇంట్లో ఏం జరుగుతోందనని ఊహించడానికి ప్రయత్నం చేస్తూ మదాలస వైపు చూసింది.
ఇక లాభం లేదన్నట్లుగా మదాలసే కల్పించుకొని చూడు లాలూ నీవు పెద్ద దానివని నీకు చెబుదామని వెయిట్ చేసాను.ఈలోగా వీడే నన్ను అపార్థం చేసుకొని నీకు ఫోన్ చేసి ఇలా రప్చర్ చేసాడు. వాడి సమాధానం విన్నావుగా . .ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడో?
లాలస మౌనంగా ఉండి పోయింది.
నీకు తెలిసినట్టుగా నీ చిన్నప్పటి నుండి నేనెప్పుడైనా తప్పడడుగు వేసినట్లు నీకనిపించిందా?
లాలస :-లేదు.
పోనీ అప్పట్లో రెండో పెళ్ళి చేసుకొని ఉండి ఉంటే , మీరు ఇప్పటికి సర్దుకొని ఉండే వారు కాదా?
లాలస :-అవును
రెండిట్లో దేనికీ అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని ఓ దారికి తేవడానికి ఒంటరి ఆడదాన్ని , నేను ఎంతగా కష్టపడి ఉంటానో నీకు అర్థం అవుతుందిగా ?
లాలస:-అవును
మీ నాన్నది నాది ప్రేమ వివాహం కావడంతో రెండు వైపుల నుండీ ఎటువంటీ సపోర్ట్ లేదని నీకు వాడికీ స్పష్టంగా తెలుసునా కదా. . .అంతెందుకు నీవు పెద్ద మనిషయినప్పుడు కార్యానికి స్నేహితులు తప్ప చెప్పుకోవడానికి ఒక్క బందువైనా వచ్చాడా ?
లాలస:- లేదు
మరి ఈ పరిస్థితుల్లో రేప్రొద్దున మీకు పెళ్ళై మీ కాపురాల్తో సుఖంగా ఉంటే వయసు ఉడిగిన తరువాత నన్ను ఎవరు చేరదీసి ఇంత అన్నం పెడతారు చెప్పగలవా?
లాలసకు చెళ్ళున తగిలింది ఆ అమాటకు. . .బేలగా చూస్తూ మేమున్నాం కదమ్మా అంది గాద్గికంగా
మదాలస తల అడ్డంగా తల తిప్పుతూ మీ నాన్న పెన్షనుతోనే మిమ్మల్ని సాకలేదే సూపర్ మార్కెట్లలో సీఫుడ్ అమ్మి, నానా గడ్డి కరచీ మిమ్మల్ని ప్రయోజకులను చేసాను, నా పెంపకంలో మీమీద నాకు ఎటువంటి కంప్లైంట్సూ లేవు. కాని ఆ వచ్చే అల్లుడు గాని కోడలు గాని నన్ను చూసుకోవడంలో ఏదైనా తేడాలు చూపిస్తే అప్పుడు మీరు మాత్రం చేసేదేముంటుంది చెప్పు?
అదీ గాకుండా నా ఇరవై ఐదేళ్ళ వయసులో మీ నాన్న పోయే సమయానికి ఇద్దరు పసి కందులను చేతిలో పెట్టుకొని ఆసరా కోసం తిరగని గడప లేదు తొక్కని గడపలేదు. ఈ ఇరవై ఏళ్ళూ ఒక ఆడ దానిగా ఒంటరి తనం తో ఎంత నరకం అనుభవించి ఉంటానో నువ్వు అర్థం చేసుకొగలవు కదా . . .అందుకే ఈ నిర్ణయం. ఎటూ మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డానికి కావల్సిన ఆసరా ఇచ్చాను. ఇకపై నా గురించి నేను ఆలోచించుకోవాలి కదా
లాలసకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
ఈ లోగా తోవన్ క్రోధం తో విరుచుకు పడ్డాడు వారి మధ్యలోకి.వచ్చీ రాంగానే అలా అని ,మాతో సరి సమానంగా తగుదునమ్మా అని పెళ్ళికూతుర్లా పెళ్ళి పీటల మీద కూచొంటావా ? శోభనం చేసుకొంటావా? . . .చేసుకొని పిల్లల్ని కను . . .అటు దాని , ఇటు నీ పిల్లలని ఎత్తుకొని మొండి ముండావాడిలా ఊళ్ళో తిరుగుతాను. థూ . . సిగ్గుండాలి అంతగా కొట్టుకొంటూ ఉంటే ఎవడినైనా చూసుకోవచ్చుగా ? మమ్మల్ని చంపడమెందుకూ అంటూ ఇంకా ఏదో మాట్లాడే అంతలోపునే లాలస లేచి చెంప చెళ్ళమని పించింది.
దెబ్బకి దిమ్మ తిరుగుతూఉంటే చెంప అదిమిపెట్టుకొని వెళ్ళిపోయాడు వాడు.
[+] 1 user Likes kick789's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అసూయ by monica sunny - by kick789 - 10-07-2019, 05:02 PM
RE: అసూయ by monica sunny - by kick789 - 10-07-2019, 05:05 PM
RE: అసూయ by monica sunny - by kick789 - 10-07-2019, 07:26 PM
RE: అసూయ by monica sunny - by kick789 - 10-07-2019, 07:29 PM
RE: అసూయ by monica sunny - by kick789 - 10-07-2019, 07:32 PM
RE: అసూయ by monica sunny - by kick789 - 14-07-2019, 12:01 AM
RE: అసూయ by monica sunny - by chiru143 - 14-07-2019, 12:42 AM



Users browsing this thread: 1 Guest(s)