Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ముత్యాలు ~ MISSION CLASS X
#4
అపార్ట్మెంట్ పైన శ్రీనివాస్, వినయ్, ప్రణయ్ ముగ్గురు మందు కొడుతూ కూర్చున్నారు. చిన్న బల్బ్ పెట్టుకుని సెట్ చేసుకున్నారు. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ముగ్గురు టీచర్లే. శ్రీనివాస్ అందరికంటే పెద్దవాడు. మాథ్స్ టీచర్. వినయ్ అందరికంటే చిన్నవాడు సైన్స్ టీచర్. ఇక ప్రణయ్ సోషల్ టీచర్. ముగ్గురు ఒకటే స్కూల్లో పని చేస్తున్నారు. పిల్లలు చదివేది కూడా అదే స్కూల్.

వినయ్ : అన్నా ఈ సారి జనవరి 1st గ్రాండ్ గా చేసుకుందాం
ప్రణయ్ : అవునన్నా
శ్రీనివాస్ : నేనూ అదే అనుకుంటున్నాను అన్నాడు సీరియస్ గా గ్లాసు కింద పెడుతూ.. కానీ అన్నాడు

ప్రణయ్ : ఏమైంది..
శ్రీనివాస్ : పోయిన సారి ఏం జరిగిందో గుర్తుందిగా
వినయ్ : ఎందుకు గుర్తులేదు.. అని గతంలోకి వెళ్లారు ముగ్గురు

కష్టపడి ప్లాన్ చేసి అమ్మాయిలని తెచ్చుకుని మందు తాగుతూ డాన్సులతో నాన్నలు పార్టీ జరుపుకుంటుంటే దాన్ని మన ఆణిముత్యాలు వీడియో తీసి అమ్మాలకి చూపించేశారు. అప్పటి గాయాలు ఇంకా వీపు మీద అలానే పదిలమై ఉన్నాయి. ఒక్కసారి గుర్తుకురాగానే ఒళ్లు జలదరించింది ముగ్గురికీ

ప్రణయ్ : నాకు భయంగా ఉంది
వినయ్ : ఊరుకో అన్నా.. అన్నిటికి భయపడతావ్
ప్రణయ్ : మీ ఆవిడ పిర్ర మీద పెట్టిన గాయం తగ్గిందా
వినయ్ : మచ్చ అలానే ఉంది, అయినా శ్రీను అన్న ఉన్నాడుగా
ప్రణయ్ : వాళ్ళ ఆవిడ కూడా పెట్టింది ఇంతది అని నాలుగు వెళ్ళు చూయించాడు
ప్రణయ్ : అవునా.. నువ్వెప్పుడు చూసావ్
వినయ్ : మొన్న పార్కులో వాకింగ్ కి వెళుతున్నప్పుడు గాలికి అన్న లుంగీ ఊడిందిలే

శ్రీనివాస్ : ఎహె ఆపండి.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో మన ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి వీలు లేదు. పెళ్లాలని పిల్లల్ని ఊరికి పంపించేద్దాం. మనం గోవా టూర్ ప్లాన్ చేద్దాం. అక్కడ బీచులు, పాపాలు, మసాజులు.. అన్నీ

ప్రణయ్ : అన్నా నురు మసాజ్

శ్రీనివాస్ : అహ.. రసికుడవే

వినయ్ : అబ్బా.. ఏం చెప్పవన్నా.. ఫిక్స్ ఫిక్స్ ఇది ఫిక్స్

సగం చల్లగాలి కోసం, సగం మొగుళ్ళు ఏం మాట్లాడుకుంటారు అన్న కుతూహలంతో అప్పుడే వచ్చిన పిచ్చి ముత్యాల చెవిన పడ్డాయి పెద్దముత్యాల మాటలు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది.

సుగుణ : చూసావే.. మీ ఆయన ఎలా చెడగోడుతున్నాడో అంది తన మొగుడు వినయ్ వంక కళ్ళు ఉరిమి చూస్తూ
ప్రతిమ : అవునే అంది తన మొగుడు ప్రణయ్ ని చూస్తూ

జయంతి తన మొగుడు శ్రీనివాస్ ని నోట్లోనే తిట్టుకుంటూ.. అబ్బో మీ వాళ్ళు దిగోచ్చారు మీ ఆయనకి నురు మసాజ్ కావాలంట, వెళ్లి చెయ్యి. మీ ఆయన ఇందాకటి నుంచి ఫిక్స్ ఫిక్స్ అని ఒకటే గోల. అన్ని మా ఆయన మీదకి నెట్టేస్తున్నారు. ఉ.ఉమ్.. అని నోరు మెలికలు తిప్పింది.

ప్రతిమ : అక్కా.. ఎలా అయినా ఫెయిల్ చెయ్యాలి

సుగుణ : అవునక్కా

జయంతి : వాళ్ళని ఎలా ఆపాలో నాకు తెలుసు.. పదండి ప్లాన్ చేద్దాం.

కింద శ్రీనివాస్ ఫ్లాట్లో కిడ్స్ రూములో కూర్చున్నారు వెర్రి ముత్యాలు. అదే సింధు, ప్రియ, ప్రకృతి.

ప్రియ : జనవరి 1st కి ఏం చేద్దాం, ఎలా చేద్దాం

ప్రకృతి : ఇంకా టైం ఉందిగా

సింధు : అస్సలు అవసరమంటారా

ప్రియ : అబ్బా.. ఎక్కడ దొరికారే నాకు మీరు.. ఎప్పుడూ అంతే దేనికి, ఎందుకు అంటారు. ఈసారి నాకోసం మనం కూడా న్యూ ఇయర్ చేస్తున్నాం అంతే.. అంది బల్ల గుద్దినట్టుగా

సింధు : సరే చేద్దాంలే.. కానీ కేక్ వద్దు.. ఒకవేళ తెచ్చినా నీట్ గా అయిపోవాలి, నాకస్సలే స్కిన్ అలర్జీ

సుగుణ : మొదలు పెట్టింది. అవును మన ఆణిముత్యాలు ఎక్కడా

సింధు : మీ ఇంట్లోనే ఉన్నారు.

ఆణిముత్యాలు.. త్వరలో
Like Reply


Messages In This Thread
RE: ముత్యాలు ~ MISSION **th Class - by Takulsajal - 17-02-2024, 11:47 PM



Users browsing this thread: 1 Guest(s)