Thread Rating:
  • 59 Vote(s) - 3.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
ఆ మాటలకి తడబడుతూ "ఏం మాట్లాడుతున్నావ్ అమ్మాయ్,నేనెందుకు అంజలి నీ సార్ తో పడుకోపెడతాను "అన్నాను

నా మాటలకి అమ్మాయ్ నవ్వుతూ "మరి ఇంతకు ముందు ఏదో తెగ ఆలోచించావ్ కదా అదేంటి
నువ్వు నాకు అబద్దం చెప్పలేవ్ అబ్బాయ్
ఏందుకంటే నువ్వు మనసులో ఏం ఆలోచించిన
అనుకున్న నాకు తెలిసిపోతుంది సో నాకు నిజమే చెప్పాలి "అని నవ్వుతుంది

తన మాటలకి కోపం వచ్చింది

ఛీ నా బతుకు కనీసం ఆలోచించే స్వేచ్చ కూడా లేదా నాకు

అస్సలు ఇదేవరో నా గురించి ఎలా తెలుసో అస్సలు తెలియడం లేదు
నా పాటికి నేను బీర్ తాగుతుంటే వచ్చి నా గురించి అన్ని చెప్తుంది
నేను ఆలోచించేవి తెలిసినప్పుడు నన్ను ఎందుకు అడగటమో అనుకుంటుంటే
"హుమ్మ్ నాకు వినపడుతున్నాయి "అని మళ్ళీ నవ్వింది

నేను చిరాకుగా మొకం పెట్టి
"నా మనసులో అనుకునే స్వేచ్చ కూడా లేదా అన్నాను "

"ఎందుకు లేదు ఉంది కానీ నువ్వెందుకు అంజలి నీ కార్తీక్ తో పడుకోపెదాం అనుకుంటున్నావో అది చెప్పు,
అయిన నువ్వు అంజలి నీ ప్రేమిస్తున్నావ్ కదా మరి ఎందుకు పడుకోపెడదాం అనుకున్నావ్ "అని అడిగింది

నేను కోపం గా "అమ్మాయ్ నువ్వు పదే పదే పడుకోపెడతా అనకు
నేను ఏం అంజలి నీ పడుకోపెట్టాలి అనుకోలేదు
వాళ్ళు మొగుడు పెళ్ళాలు ఎప్పటికయినా ఒకటి అవ్వాల్సిందే

అది కాక నాకు ఒక జీవితం ఉంది

అంజలి కార్తీక్ సార్ తో పిల్లలను కంటె వాళ్ళు హ్యాపీ గా వుంటారు
అప్పుడు అంజలి కి నా మీద కన్నా తన పిల్లల మీద మొగుడి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది,అప్పుడు నా జీవితం నేను చూసుకోవచ్చు
కార్తీక్ సార్ చాలా మంచోడు
ఆయనలా నేను ఉండలేను

అంజలి కోసం తను ఇష్టపడింది అని సార్ కి ఇష్టం లేకపోయినా నన్ను ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండటానికి ఒప్పుకున్నారు

సార్ కి కూడా పిల్లలని కనాలి హ్యాపీ గా ఉండాలి అని ఉంటుంది కదా అందుకే అలా ఆలోచించాను "అని చెప్పాను

దాంతో ఆ అమ్మాయ్ పెద్దగా నవ్వుతూ
"పిచ్చి అబ్బాయ్, నువ్వు అనుకున్నవి అన్ని జరుగుతాయి అనుకుంటున్నావా"అడిగింది

నాకేం అర్ధం కాక అయోమయం గా ఆ అమ్మాయ్ నీ చూస్తుంటే

ఆ అమ్మాయ్ నవ్వటం ఆపి "నువ్వు ఇలా ఆలోచిస్తావ్ అనే ముందే అనుకున్న అబ్బాయ్

అందుకే నువ్వు కానీ నీ అంజలి కానీ ఊహించని విధంగా ప్లాన్ చేసి

నీకు అంజలి కి కార్తీక్ కి మీ గత జన్మ కల ల వచ్చేలా చేసాను "అని పెద్దగా నవ్వింది

తను చెప్పింది విని ఒళ్ళంతా చల్లగా ఐపోయింది,వెన్ను లో వణుకు పుట్టింది
ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు

ఇప్పుడు తనని చూస్తుంటే చాలా భయమేస్తుంది

అస్సలు ఎవరు ఈ అమ్మాయి, మనీషా, భూతమా అని
భయపడుతూ ఆలోచిస్తుంటే

ఇంతలో "నువ్వు బయపడకు అబ్బాయ్ నేను ఏం దెయ్యన్ని కాదు
నేను ఏం చేసిన నువ్వు సంతోషం గా వుండాలనే,ఎక్కువ ఆలోచించకు
నేను ఏం ప్లాన్ చేసిన నువ్వు చేయాలనుకుంది చేసేయ్
నీ ఆలోచనలకి నేను అడ్డు రాను
నువ్వు ఏం చేసిన సమయం దాని పని అది చూసుకుంటుంది
నా కోరిక ఒక్కటే అబ్బాయ్ నువ్వు ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి బాధలు లేకుండా నీ వాళ్ళ తో హ్యాపీ గా ఉండాలనేదే "అని చెప్పింది

తన మాటలు ఎక్కడో తకాయి
తన మాటల్లో ప్రేమ నాకు తెలుస్తుంది

అస్సలు తను ఎవరో నాకు తెలియదు, ఎందుకు అంత ప్రేమ నో అర్ధం కావడం లేదు అని ఆలోచిస్తుంటే

"ఇప్పుడు అర్ధం కాదులే అబ్బాయ్, time వచ్చినప్పుడు నీకె తెలుస్తుంది "అని చెప్పింది

నేను ఇంక ఎక్కువ ఆలోచించలేదు
ఎందుకంటే తను నాకు చెప్పదని అర్థం అయ్యింది అందుకే సైలెంట్ గా ఉన్నాను

అప్పుడే "సరే నాకు ఇంకొకటి చెప్పు అబ్బాయ్,
ఇప్పుడు మీ అమ్మానాన్న కి నీ లవర్నీ
ఎవర్ని తీసుకెళ్లి చుపిస్తావ్,అంజలి నా "అని నవ్వుతుంది 

నేను  చిరాకు గా "ఏంటి నన్ను వెక్కిరిస్తున్నావా
అన్ని తెలిసే ఎందుకు అడుగుతున్నావు
అస్సలు ఇదంతా నీ వల్లనే
మొత్తం నువ్వే చేశా అంటున్నావ్ కదా
నువ్వే కనుక అంజలి నీ నా జీవితంలోకి రాకుండా చేస్తే నాకు ఇన్ని తిప్పలు వచ్చేవి కావు

నా పాటికి నేను మా అమ్మ నాన్న చుసిన అమ్మాయ్ నీ పెళ్లి చేసుకునే వాడిని

ఇప్పుడు అంజలి గురించి మా ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు
తనకి పెళ్లి అయ్యింది అని చెప్తే అస్సలు ఒప్పుకోరు
డైవర్స్ తీసుకున్నా కూడా ఒప్పుకోరు

ఇంకోవైపు మేడం నేను ఏ అమ్మాయి నీ చుసిన తట్టుకోలేదు
ఇంక వేరే అమ్మాయ్ తో పెళ్లి అంటే నన్ను చంపి,అది చస్తుంది
నా లైఫ్ లో నేను హ్యాపీ గా ఉండాలి అని నా జీవితాన్ని ప్లాన్ చేశా అన్నావ్ కదా ఇదేనా నీ ప్లాన్"అని ఆవేశం గా అడిగాను

ఆ అమ్మాయ్ మళ్ళీ నవ్వుతూ "కూల్ అబ్బాయ్, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావ్ చెప్పు..."అని ఇంకేదో చెప్తుంటే

కోపం గా "ఆలోచించక ఏం చేయమంటావు, నా ప్లేస్ లో ఉంటే నీకె అర్థం అవుతుంది,
ఎవరికైన చెప్పటం ఈజీ బతకటమే కష్టం "అన్నాను

"ఇప్పుడేంటి అబ్బాయ్
నీ పెళ్లి గురించే కదా నీ బాదంతా
నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు

ఇంకో నాలుగు రోజుల్లో నీ పెళ్లి సెట్ అవుతుంది
నీకు పెళ్లి కూతుర్ని కూడా అంజలినే సెట్ చేస్తుంది
ఇంక నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు అబ్బాయ్ "అంది 

అమ్మాయ్ చెప్పింది విని షాక్ తో "ఏంటి..... అంజలి నాకు పెళ్లి కూతుర్ని సెట్ చేస్తుందా
నువ్వు చెప్పేది నిజామా "అని ఆశ్చర్యం గా అడిగాను 

"నేను నిజమే చెప్తున్నాను అబ్బాయ్,
నీ పెళ్లి నాలుగు రోజుల్లో సెట్ అవుతుంది

అది కూడా నీ మేడం అంజలి నే  దగ్గర వుండి 
నీకు పెళ్లి కూతుర్ని చూస్తుంది "అని చెప్పి  నవ్వుతుంది

ఆ మాటలకి దెబ్బకి షాక్ అయ్యాను

నాకు పెళ్లి కూతుర్ని అంజలి దగ్గర వుండి చూస్తుందా
అది సాధ్యమేనా, ఆహా అస్సలు కాదు
మేడం చాలా పోస్సేసీవ్, నా పక్కన వేరే అమ్మాయ్ నీ ఉహించుకోలేదు
కావాలని 
ఈ అమ్మాయినే అబద్దం చెప్తుంది అనుకోని

నేను నమ్మను అన్నట్టు ఆ అమ్మాయి నీ చూసాను

ఆ అమ్మాయి ఇంకా నవ్వుతూ
"నాకు తెలుసు అబ్బాయ్, నువ్వు నమ్మవు అని
కానీ ఇక్కడ నువ్వొక విషయం మర్చిపోతున్నావ్ అది ఏంటంటే 
TIME అన్నింటిని మార్చేస్తుంది అని 

ఎంతలా అంటే ఒక చిన్న ఆక్సిడెంట్, నీ జీవితం మొత్తం మారిపోయేలా చేసింది, అలానే నీ పెళ్లి కూడా

ఒక్కసారి ఆలోచించు
నువ్వు అంజలి కి దగ్గర అవ్వటానికి కారణం ఆ ఆక్సిడెంట్

ఒకవేళ ఆ ఆక్సిడెంట్ జరగకుండా ఉంటే నువ్వు అంజలి నీ కలిసేవాడివా,ఇప్పుడు ఇక్కడ ఉండేవాడివా
బాగా ఆలోచించు "అని ఆ అమ్మాయి చెప్పగానే

ఆశ్చర్యపోతూనే  ఆ అమ్మాయి చెప్పింది ఆలోచించాను

ఆ అమ్మాయి చెప్పింది  మొత్తం నిజమే అనిపించింది

ఒకవేళ ఆ రోజు ఆక్సిడెంట్ జరగకుండా ఉంటే మేడంకి నాకు ఎలాంటి సంబంధం ఉండేది కాదు

మేడం నన్ను చూడకుండా ఉంటే నన్ను ప్రేమించేది కాదు

నిజమే ఆ ఒక్క ఆక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది

మేడం లాంటి మంచి అమ్మాయి దొరికింది

కానీ నా పెళ్ళికి అంజలి ఒప్పుకోవటం అనేది జరగని పనిగా అదెలా సాధ్యం అవుతుంది "అనుకుంటుంటే

అప్పుడే ఆ అమ్మాయి 
"సాధ్యం అవుతుంది,సాధ్యం అయ్యేలా చేయటానికి నేను ఉన్నా కదా
నా గురించి నీకు తెలీదు అబ్బాయ్,నేను ఏం చేయగలనో తెలిస్తే కళ్ళు తిరిగిపడిపోతావ్

నిజానికి నీ జీవితం నీ చేతుల్లో లేదు నా చేతుల్లో ఉంది,
నువ్వు ఈ జన్మ లో ఎలా బతకాలో
ఎలా చావాలో అనేది ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నాము

ఈ జన్మ లో నీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కి

నీ గడిచిపోయిన జన్మలకి

గడపాల్సిన జన్మలకి చాలా సంబంధం ఉంది

ప్రతి వ్యక్తి తో నీకు సంబంధం ఉంది

ఒక విధంగా చెప్పాలి అంటే నీ జీవితం ఒక butterfly effect లాంటిది

ఎక్కడో ఉన్న సీతాకొకచిలకల వల్ల ఇంకేక్కడో తుఫాన్ వచ్చింది అంట

అలాంటిది నీ జీవితం

అలాంటి తుఫాన్ లు, నీ జీవితంలో చాలా ఉన్నాయి, అద్భుతాలు కూడా ఉన్నాయి

మేము ఎన్నో సంవత్సరాలు ఒక మనిషి ల కస్టపడి నీ కోసం నీ వాళ్ళ కోసం ఒక మంచి జీవితాన్ని సిద్ధం చేసాము
ఇదంతా నీకోసమే చేసింది,నీ మీద ప్రేమతోనే చేసాను

అలాగే నీ వల్ల జరగాల్సిన పని ఒకటుంది

అందుకే మేము ఈ జన్మ నీ ఎంచుకున్నాము

అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే
నీ జీవితం లో ఒక butterfly effect లాంటిది అవసరం అయ్యింది

అదే నిన్ను అంజలి నీ కలిపిన ఆక్సిడెంట్

ఆ ఆక్సిడెంట్ వల్ల ఎన్ని జీవితాలు మారుతాయో నీకు ముందు ముందు తెలుస్తుంది "అని చెప్పింది

ఆ అమ్మాయి చెప్పినవి వింటుంటే భయమేస్తుంది,
నాకు షాక్ మీద షాక్ లు ఇస్తుంది,
ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో అస్సలు అర్ధం అవ్వటం లేదు
ఏదో butterfly effect అంటుంది
ఇంకేదో జన్మలు అంటుంది 
అస్సలు ఇది మనీషా, భూతమా
నా గురించి ఏదో మొత్తం తెలిసినట్టు చెప్తుంది అని బయపడుతుంటే

"ఏంటి అబ్బాయ్ నేను చెప్పింది నమ్మట్లేదా "అని అడిగింది

నేను భయం గానే "హ్మ్మ్ అవును "అని మాత్రం అన్నాను

ఆ అమ్మాయి వెంటనే
"హో అయితే నువ్వు నమ్మట్లేదు అంతే కదా, అయితే ఇది చెప్పు
నీకు, అంజలి కి,కార్తీక్ కి వచ్చే కల నీ పూర్వ జన్మ అని నువ్వు నమ్మినప్పుడు
నేను చెప్పేవి ఎందుకు నమ్మట్లేదు "అని అడిగింది

నేను వెంటనే "నాకు అస్సలు పూర్వ జన్మ ల మీదనే నమ్మకం లేదు, నాకు వచ్చే కల కూడా పూర్వ జన్మ అని నేను పూర్తిగా నమ్మలేదు అయిన ఈ కాలం లో కూడా ఈ పూర్వ జన్మ ల గురించి నమ్ముతారా
పైగా ఇప్పుడు నువ్వొచ్చి నీ జీవితాన్ని నేనే ప్లాన్ చేసాను, నీ చావు, బతుకు నా చేతుల్లో నే ఉన్నాయి అని చెప్తే నమ్మటానికి నేను పిచోడ్ని అనుకుంటున్నావా అంత లేదు, ఎవడికి అయిన చెప్పు నమ్ముతారు నేను కాదు "అని ధైర్యంగానే చెప్పాను

అంతలో ఆ అమ్మాయి సడెన్ గా పైకి లేచి
"సరే అబ్బాయి నువ్వు నన్ను నమ్మట్లేదు కదా,
సరే పద నీకు నమ్మకం కుదిరేలా ఒకటి చూపిస్తా "అంది

నేను అయోమయం గా ఆ అమ్మాయి నీ చూస్తుంటే
"పైకి లే అబ్బాయ్, వెళ్దాం నీకు ఈ జన్మ ల మీద,నేను చెప్పే వాటి మీద నీకు నమ్మకం లేదు కదా
నేను చూపించేది చూస్తే అప్పుడు నువ్వే నా మాటలు నమ్ముతావు,ఈ జన్మ ల గురించి కూడా నమ్ముతావు"అని చెప్పింది

ఇంక నేను కూడా పైకి లేచి
"సరే పద అమ్మాయ్,నువ్వేం చూపిస్తావో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది"అన్నాను

అమ్మాయి ఏం మాట్లాడకుండా నా దగ్గర గా వచ్చి నిలబడింది
ఎంత దగ్గరగా అంటే తన శ్వాస నాకు తగిలె అంత
తను నాకు దగ్గర గా వుండే సరికి

తన నుండి వచ్చే స్మెల్ కి నా ఒళ్ళంతా తేలికగా ఐపోయింది
ఏదో ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది
చాలా ప్రశాంతంగా ఉంది
నేను కళ్ళు మూసుకొని ఆ స్మెల్ నీ నా గుండెల నిండా నింపుకుంటుంటే

ఆ అమ్మాయి "ఏంటి అబ్బాయ్, వెళ్దాం అని నిద్రపోతున్నావ్ "అని నవ్వింది

నేను వెంటనే కళ్ళు తెరిచి "చ చ నేను నిద్రపోట్లేదు మాములుగా కళ్ళు మూసుకున్న అంతే,సరే దాని గురించి వదిలేయ్, నువ్వెంటి వెళ్దాం అని నా దగ్గరికి వచ్చి నిలబడ్డావ్ "అనీ తడబడుతూ అడిగాను

"నేను కూడా వెళ్దాం అనే నీ దగ్గరికి వచ్చా అబ్బాయ్ "అని చెప్పింది

తన మాటలకి నవ్వుతూ "మనం వెళ్లాలంటే రూమ్ బయటికి వెళ్ళాలి, నా దగ్గరికి కాదు "అని నవ్వాను

ఆ అమ్మాయి కూడా నవ్వుతూ "అయ్యో అవునా,నాకు తెలీదు లే  అబ్బాయ్ "అని వెటకారం గా అంది

అది నాకు అర్థం అయ్యి
"మరి తెలిసినప్పుడు నా దగ్గర ఎందుకు రావటం, బయటికి పద "అని అన్నాను 

ఆ అమ్మాయి వెంటనే 
"చాల్లే కానీ ముందు కళ్ళు మూసుకొ, మనం ఇక్కడ నుండే వెళ్దాం "అంది 

"వెళ్ళటానికి కళ్ళు మూసుకోవటం ఎందుకు అమ్మాయ్ "అనేసరికి

ఆ అమ్మాయి కొంచం చిరాకు గా "చెప్పింది చెయ్ అబ్బాయ్,నేను తీసుకెళ్తా గా "అని చెప్పింది

ఇదొక పిచ్చిది, ఎలా తీసుకెళతుందో చూస్తాగా అనుకోని ఆ అమ్మాయి చెప్పినట్టు కళ్ళు ముసుకున్నాను

నేను కళ్ళు మూసుకోగానే
"అబ్బాయ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను
నన్ను అస్సలు ముట్టుకోవద్దు
కొంచం కూడా టచ్ చేయొద్దు
ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ చూసి నువ్వు కంగారు పడొద్దు, బయపడొద్దు "అని చెప్పింది

ఆ మాటలకి ఇంక ఎక్కువ గా బయపడుతూనే "ఏంటమ్మాయ్ బయపెడుతున్నావ్, అస్సలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావ్, నన్ను ఏమైనా చేస్తావా ఏంటి "అని వణుకుతూనే అడిగాను

ఆ అమ్మాయి పెద్దగా నవ్వుతు "అవును అబ్బాయ్ నిన్ను ఏదో చేయటానికే తీసుకెళ్తున్న

ఎక్కడికో తెలుసా
నీలాంటి ఒక చెడ్డ అబ్బాయ్ నీ చూపించటానికి,నువ్వు ఈ జన్మ లో జనిపోయిన తరవాత మళ్ళీ future లో నువ్వు పుట్టే జన్మ లోకి తీసుకెళ్తున్నాను

అక్కడ నువ్వు ఒకటి చూడాలి

అది చూస్తేనే, ఈ జన్మ లో నువ్వు ఆ పని చేయగలవు

వచ్చిన దగ్గర నుండి ఆలోచిస్తున్నావ్ కదా

నేను ఎవరు, ఎందుకు వచ్చాను అని
నీకు నీ ఫ్యూచర్ జన్మ నీ చూపించటానికే వచ్చాను

అక్కడ నువ్వు చూడాల్సింది ఒకటి ఉంది

అది చూసే వరకు నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకు రాను
నువ్వు దాన్ని చుసిన తరవాత నే మళ్ళీ మనం వెనక్కి వచ్చేది "అని చెప్పి నవ్వింది 

నేను షాక్ తో "ఏంటి.."అని భయం తో కళ్ళు తెర్వబోతుంటే

వెంటనే ఆ అమ్మాయి 
"అబ్బాయ్, అస్సలు కళ్ళు తెరవొద్దు, నేను చెప్పే వరకు అలానే ఉండాలి
నేను చెప్పినప్పుడే కళ్ళు తెరవాలి, కళ్ళు తెరిచావో, చనిపోతావ్ ఇంక నీ ఇష్టం "అని చెప్పి ముసి ముసిగా నవ్వుతుంది

ఆ అమ్మాయ్ మాటలకి ఏమో కానీ తన నవ్వుకి చాలా కోపం వచ్చింది

ఇది నన్ను ఏం చేస్తుందో అని భయం గా కళ్ళు మూసుకున్నాను

అప్పుడే ఆ అమ్మాయ్
"అబ్బాయ్ వెళ్తున్నాం గట్టిగా కళ్ళు మూసుకొ"అనగానే
నాకు చాలా భయమేసి

"అమ్మాయ్, నేను నమ్ముతాలే నన్ను వదిలేయ్,
నువ్వేం చెప్పిన చేస్తా అమ్మాయ్
నన్ను ఎక్కడికి తీసుకెళ్లకు ప్లీజ్ " అని భయపడుతూ అన్నాను

నా మాటలకి ఆ అమ్మాయ్ ఇంకా నవ్వుతూ "ఎందుకు అబ్బాయ్ బయపడతావు
ఏం కాదులే నేను ఉన్నా కదా నీ పక్కన ఏం బయపడకు "అనీ చెప్పింది

హుమ్మ్ నువ్వు నా పక్కన ఉన్నావనే నా భయం అంత
నేను ఏదో బీర్ తాగక చాలా రోజులు ఐనట్టు అనిపించి  వచ్చి

నా పాటికి నేను ఏదో బీర్ తాగుతుంటే దెయ్యం ల వచ్చి నన్ను తగులుకున్నావ్ 

ఇప్పుడు ఇది నన్ను ఏం చేస్తుందో ఏమో అని నేను మనసులో అనుకుంటూ బయపడుతుంటే

"హు హు నాకు వినపడుతున్నాయి "అని నవ్వుతుంది

ఛీ నా బతుకు మనసులో కూడా ఏం అనుకోకూడదా ఏంటి అనుకుంటుంటే

ఆ అమ్మాయి మళ్ళీ "అనుకోకూడదు,నువ్వు మనసు లో ఏం అనుకున్న నాకు తెలిసిపోతుంది
నువ్వు ఏం ఆలోచించ కుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొ"అనేసరికి

కళ్ళు, అన్ని మూసుకొని
ఇది ఎలా తీసుకెళ్తుంది,ఎటు తీసుకెళ్తుందో ఏంటో  అని భయపడుతూ, వణుకుతూ ఉన్నాను

అప్పుడే ఆ అమ్మాయ్
"నేను మూడు లెక్కపెడతాను అబ్బాయ్ అంతే మనం వెళ్లి పోతాం " అంది
నేను  షాక్ తో భయం గా "అమ్మాయ్ "అని ఏదో చెప్పబోయాను
అంతలో ఆ అమ్మాయ్ "1"అంది
దాంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాను
ఆ అమ్మాయి "2....,3"
అంతే నా కళ్ళు మూసుకుపోయాయి.......


పెద్ద పెద్దగా అరుపులు, మ్యూజిక్ వినపడుతుంది,
చుట్టూ చాలా మంది ఉన్నట్టు అనిపిస్తుంది
కళ్ళు తెరుద్దాము అంటే తెరవలేకపోతున్న
ఇంతలో నా పక్కన
"అబ్బాయ్ మనం వచ్చేసాం కళ్ళు తెరువు "అంది

"ఎక్కడికి తీసుకొచ్చావే దొంగమొకందాన,నా ప్రాణానికి దెయ్యం లా తగిలావ్ కదే "అని మనసులో తిట్టుకుంటున్నాం చిన్నగా కళ్ళు తెరవటానికి ట్రై చేసాను కానీ తెరవలేకపోయాను
అప్పుడే "నన్ను తిడతావా అబ్బాయ్ నువ్వు అలానే కళ్ళు మూసుకొని ఉండు"అని కోపం గా చెప్పింది
"అబ్బా వదిలేయ్ తల్లి నేను ఏదో నోరు ఆగక నీలానే అన్నాను, సారీ ప్లీజ్ "అని బ్రతిమలాను
అలా అనటం తోనే నా కళ్ళు తెరుచుకున్నాయి
కానీ నా కంటికి ఏదో కాంతి కనపడి కళ్ళు తెరవలేక మళ్ళీ కళ్ళు మూసుకున్నాను
"ఏం కాదు అబ్బాయ్ చిన్నగా కళ్ళు తెరువు "అని చెప్పింది
తను చెప్పినట్టే చిన్నగా కళ్ళు తెరిచ్చాను
నా ఎదురుగా కనిపించేది చూసి షాక్ తో
"ఏంటమ్మాయ్, ఎక్కడికి తీసుకొచ్చావ్ "అని అరిసినట్టు అడిగాను

ఆ అమ్మాయ్ నవ్వుతు
"Welcome to the future అబ్బాయ్"
ఇక్కడ కనిపించేది అంత నువ్వు పుట్టిన జన్మ కాదు

నువ్వు చనిపోయిన తరవాత మళ్ళీ పుట్టిన జన్మ
నేను చెప్తే నువ్వు నమ్మట్లేదు కదా అందుకే
నువ్వు నమ్మేలా నీ మరో జన్మలోకి తీసుకొచ్చాను

ఇది నువ్వు ఫ్యూచర్ లో పుట్టిన జన్మ "అనగానే

"ఏంటిఇఇఇఇఇఇఇఇ " అని  పెద్దగా అరిచి
 నమ్మలేనట్టు నాకు కనిపించేది  నోరు తెరిచి ఆశ్చర్యం గా చూస్తున్నాను........
Like Reply


Messages In This Thread
RE: story bagundi - by ridersd1211 - 19-09-2023, 11:57 PM
RE: మహా (TIME) -ఇందులేఖ (LOVE) - by Prasad@143 - 08-02-2024, 11:40 AM



Users browsing this thread: Rohitshrama, రసిక రాజా, 4 Guest(s)