Thread Rating:
  • 29 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
అలా మెయిన్ రోడ్డు చేరుకున్నానో లేదో ......

తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ అక్కయ్య కేకలు వినిపించడంతో పాటు అక్కయ్య పరుగున వస్తున్నట్లు తినిపించడంతో చీకట్లో చూసి వెంటనే రోడ్డు ప్రక్కనే ఆగి ఉన్న వెహికల్ వెనుక దాక్కున్నాను .
తమ్ముడూ తమ్ముడూ ..... అంటూ అక్కయ్య వెనుకే బామ్మ ఆయాసపడుతూ వచ్చి , మెయిన్ రోడ్డుపై మరియు వెనుక చూసి నిరాశతో , తమ్ముడూ తమ్ముడూ ....... నీతో అక్కయ్య - బామ్మ అని పిలిపించుకోవడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలి ,పెద్దక్కయ్య అని ఎంత ఆప్యాయంగా పిలిచావు , ప్లీజ్ ప్లీజ్ తమ్ముడూ ఒక్కసారి కనిపించవా .......
ఆనందిస్తూనే Sorry అక్కయ్యా ...... , ఈ తమ్ముడు మీకు కనిపించేది మీ అన్నీ సమస్యలను తీర్చిన తరువాతనే అంటూ సైలెంట్ గా అక్కడే ఉండిపోయాను .
తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ ఆప్యాయంగా పిలిచి నిరాశతోనే బామ్మతోపాటు వెనుతిరిగారు అక్కయ్య .
Sorry అక్కయ్యా ..... , ఇంట్లోకి వెళ్లేంతవరకూ చూసి నడుచుకుంటూ బయలుదేరాను , 20 నిమిషాలలో బీచ్ రోడ్డు చేరుకున్నాను , అలల సౌండ్ మరియు చంద్రుడి వెన్నెలలో సముద్రపు అందాన్ని వీక్షిస్తూ అపార్ట్మెంట్ వైపు నడిచాను .

అటూ ఇటూ వెహికల్స్ వెళుతున్నా నడుచుకుంటూ నేనొక్కడినే అదికూడా పిల్లాడిని కావడంతో అటువైపుగా వెళుతున్న సెక్యూరిటీ అధికారి పెట్రోలింగ్ వెహికల్ నాప్రక్కనే ఆగింది .
ఈ టైం లో ఒంటరిగా నడుచుకుంటూ ...... హేయ్ మహేష్ ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నావు ? అంటూ సర్ డ్రైవర్ సెక్యూరిటీ అధికారి మరియు అంబులెన్స్ దగ్గర చూసిన సెక్యూరిటీ అధికారి ......
సర్ ముఖ్యమైన పని ఉంటే పూర్తిచేసుకుని వచ్చేసరికి ఈ సమయం అయిపోయింది , డబ్బు లేకపోవడంతో నడుచుకుంటూ వెళుతున్నాను .
సెక్యూరిటీ అధికారి : ఎక్కు అపార్ట్మెంట్ వరకూ డ్రాప్ చేస్తాను .
పర్లేదు సర్ దగ్గరేకదా ......
సెక్యూరిటీ అధికారి : నిన్ను చూసి కూడా ఎక్కించుకోలేదు అని సర్ వాళ్లకు తెలిస్తే ఏమైనా జరగొచ్చు , మాకు భయం ప్లీజ్ ఎక్కు ......
అలా అయితే ఎక్కుతాను అంటూ నవ్వుకున్నాను .
రెండే నిమిషాలలో అపార్ట్మెంట్ ముందు ఆపారు - మహేష్ ..... ఏ అవసరం వచ్చినా సర్ వాళ్ళకే చెయ్యనవసరం లేదు మధ్యలో మేమున్నామని గుర్తించు నెంబర్లు సేవ్ చేసుకో అంటూ ఇచ్చారు , హేయ్ సెక్యూరిటీ ..... 
సెక్యురిటి : సర్ సర్ అంటూ పరుగునవచ్చారు .
సెక్యూరిటీ అధికారి : సిటీ కమిషనర్ తాలూకు తెలుసుకదా ......
సెక్యురిటి : ఇప్పటివరకూ డౌట్ సర్ ఇప్పుడు పూర్తిగా తెలిసింది సర్ ......
సెక్యూరిటీ అధికారి : జాగ్రత్త , గుడ్ నైట్ మహేష్ ......
గుడ్ నైట్ సర్ ......

సెక్యురిటి : తమ్ముడూ ...... క్షమించు క్షమించు చిన్న సర్ .....
తమ్ముడు అని పిలవండి అనిచెప్పి లోపలికి నడిచాను .
సెక్యురిటి : తమ్ముడూ తమ్ముడూ ...... సాయంత్రం అడుగుదామంటే అర్జెంట్ అని వెళ్లిపోయారు , ఫ్లాట్ లో అంతా ok కదా అంటూ భయపడుతూ అడిగారు .
డౌట్గానే ఆ ఆ ok ok అన్నాను .
సెక్యురిటి : Ok తమ్ముడూ ..... , తమ్ముడూ తమ్ముడూ ...... నీ ఫ్లాట్ ఎదురుగా ఉన్నవాళ్లు ......
అంతే కోపం సర్రున నెత్తికి పాకినట్లు , ఎదురుగా ఉన్నవాళ్లు అంటూ కోపంగా అడిగాను .
సెక్యురిటి : ఒక అడుగు వెనక్కువేసి , తమ్ముడూ ..... సంవత్సరం ముందు నువ్వుంటున్న ఫ్లాట్ లో వాళ్ళు ఉండేవారు - జరగకూడనిది ఏదో జరగడం వలన ఎదురు ఫ్లాట్ లోకి మారారట - అప్పటి నుండి ఫ్లాట్ ఖాళీగానే ఉంది లాక్ చేసే ఉంది - వారి ఒకవస్తువు ......
వస్తువు ......
సెక్యురిటి : ఎందుకు తమ్ముడూ కోపం , వారు అడగమంటే అడుగుతున్నాను , వారి ఒక వస్తువు నీ ఫ్లాట్ లోనే ఉండిపోయిందట , తీసుకోవచ్చాన్ని అడగమన్నారు .
అదేంటో చెప్పు వెంటనే కాల్చేస్తాను .
సెక్యురిటి : ఏ వస్తువో చెప్పలేదు తమ్ముడూ ..... , కాసేపు ముందు వరకూ నీకోసం వేచి చూసి వెళ్లారు .
కనుక్కో వారికైతే ఇవ్వను , పైనుండి కిందపడేసి బూడిద చేసేస్తాను .
సెక్యురిటి : సరేతమ్ముడూ అలాగే చెబుతాను .
ఇంతకూ ఫ్లాట్ లో జరగకూడనిది ఏమి జరిగింది ? .
సెక్యురిటి : నేను కొత్తగా వచ్చాను తమ్ముడూ ......, హార్న్ వినిపించడంతో వస్తా తమ్ముడూ అనిచెప్పి వెళ్ళిపోయాడు .
సంవత్సరం ముందు వాళ్ళు ఉన్నారా ? అని ఆలోచిస్తూ లిఫ్ట్ లో పైకివెళ్లి ఫ్లాట్ దగ్గరికి చేరుకున్నాను , మనసులో ఏవేవో ఆలోచనలు ...... అలా అయి ఉండదులే అనుకుని డోర్ ఓపెన్ చేయబోతే ఆశ్చర్యంగా తాళం వేసి ఉంది , నాకు గుర్తు ఉంది ఆత్రంలో లాక్ చెయ్యకుండా వెళ్ళాను - ఏమోలే తాళం జేబులోనే ఉందికాబట్టి సరిపోయింది అంటూ తాళం తీసి డోర్ తెరిచి లోపలికివెళ్ళాను .
ధడేల్ మంటూ డోర్ క్లోజ్ అయిపోయింది , భయంతో ఉలిక్కిపడ్డాను ...... , రేయ్ మహేష్ గా జైల్లో ఎలాంటి ఎలాంటి నేరస్తులను చూసి ఉంటావు ...... కొందరేమో దొంగలు - కొందరేమో నేరస్థులు - కొందరేమో పిల్లలను ముసలివాళ్లను చంపినవారు - కొందరేమో సైకోలు క్రూరులు ...... ఇంతమంది రాక్షసుల్లాంటి వాళ్ళ మధ్యన ఒకటా రెండా నాలుగేళ్లు ఉన్నావు , ఈ చిన్న సౌండ్ కే భయపడితే ఎలా ? , ఈ ఆటోమేటిక్ లైట్స్ ఒకటి .... ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతున్నాయి కానీ ఆన్ అవ్వడం లేదు అంటూ గోడ వెంబడి వెళ్లి స్విచస్ అన్నీ ఆన్ చేసాను , ప్చ్ ..... సాయంత్రమూ ఇంతే అన్నీ లైట్స్ వెలిగినా వెలుతురు మసకగానే డల్ గానే ఉంది - ఫ్లాట్ ఏదో పోగొట్టుకున్నట్లు అంటూ మొబైల్ చూసుకున్నాను ప్చ్ ...... అక్కయ్య నుండి నో మెయిల్ ....... , కాస్త చెమట పట్టినట్లు అనిపించడంతో మొబైల్ - కీస్ ను టీపాయ్ పై ఉంచి బట్టలన్నీ విప్పుతూ బెడ్ రూమ్ కు వెళ్లి బిన్ లో వేసి నగ్నంగా వెచ్చని షవర్ కింద ఫ్రెష్ అయ్యి తుడుచుకున్నాను .
" అన్నయ్యా ..... రాత్రి వేసుకోవడానికి నైట్ డ్రెస్సెస్ కూడా తెచ్చారు డాడీ వేసుకోండి " అన్న కీర్తి మాటలు గుర్తుకువచ్చి , థాంక్యూ చెల్లీ అంటూ పలుచటి తెల్లని నైట్ డ్రెస్ వేసుకున్నాను , కీర్తి చెప్పినట్లు కంఫర్ట్ గా ఉందే ...... , ఫ్రెష్ అవుతున్నంతసేపూ అందమైన నవ్వులు - స్వీట్ వాయిస్ మరియు గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉన్నా ఏమాత్రం భయపడనేలేదు ఎందుకో నా మనసుకు అర్థమైనట్లు .......

అంతలో మొబైల్ కు ఒకదానివెనుక మరొకటి మెసేజెస్ వస్తూనే ఉన్నట్లు మెసేజ్ టోన్ ఐదారుసార్లు మ్రోగి ఆగడంతో అక్కయ్య నుండే అంటూ పెదాలపై చిరునవ్వులతో హాల్లోకి పరుగులుతీసి మొబైల్ అందుకున్నాను .
అనుకున్నట్లుగానే మెయిల్స్ ...... , యాహూ అంటూ సంతోషంతో కేకవేసి టచ్ చేసాను , వరుసగా ఫోటోలు డౌన్లోడ్ అయినట్లు డిస్ప్లే పై స్నానం చేసి చక్కగా రెడీ అయినట్లు పట్టు లంగావోణీలో అక్కయ్య సెల్ఫీ .......
కళ్ళు మిరుమిట్లలా వెలిగిపోతున్నాయి - అప్పటివరకూ డల్ గా ఫ్లాట్ నిజమైన వెలుగులతో నిండుకున్నట్లు ...... అక్కయ్య ఇల్లు ఎలా వెలుగులతో నిండిపోయిందో సంతోషంగా ఎలా మారిపోయిందో అలా ఒక్కసారిగా మార్పు జీవం పోసుకుందా అన్నట్లు బ్రైట్ గా మారిపోవడం - అక్కయ్య సంతోషమైన సెల్ఫీ చూసి ఫ్లాటే మురిసిపోతున్నట్లు మారిపోవడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యి చుట్టూ చూసాను , ఆక్ ఆక్ అక్కయ్య ..... అక్కయ్య సంతోషం అంటూ సంతోషంలో మాటలు రానట్లు తడబడుతున్నాను , వేలు ఆటోమేటిక్ గా స్క్రీన్ పై స్క్రోల్ చేసింది , అక్కయ్య - బామ్మ చిరునవ్వులు చిందుస్తున్న సెల్ఫీ ....... 
కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... , ఆక్ అక్కయ్యా - బా బామ్మా ...... ఇప్పుడు ఇప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తోంది అంటూ వచ్చిన సెల్ఫీలన్నింటినీ చూసి ఆనందిస్తున్నాను .
చివరగా మెసేజ్ " తమ్ముడూ ...... అక్కయ్య - పెద్దక్కయ్య అని పిలిపించుకోవడం మా అదృష్టం , ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో ...... మమ్మల్ని ప్రాణంలా చూసుకునే తమ్ముడు దొరికాడు , తమ్ముడూ ...... నువ్వు కోరుకున్నట్లుగానే నీ అక్కయ్య - బామ్మలో సంతోషం , నువ్వు హ్యాపీనే కదా ...... , ఒక్కటి మాత్రం నిజం ...... నేను లేక చెల్లి - బామ్మ ఎలా ఉంటారో అని నీపెద్దక్కయ్య బాధపడని క్షణం ఉండదు , ప్రాణంలా చూసుకునే తమ్ముడు వచ్చాడని ఎంత ఆనందించారో ..... , అక్కయ్య మరియు ఈ తమ్ముడి కోసం అక్కయ్యను అక్కయ్యతోపాటు మా ఈ తమ్ముడిని హృదయమంతా నింపుకుని అక్కయ్య కోరుకున్నట్లుగా ఆవడం కోసం సంతోషంగా ఉంటాము ".
ఎక్కడి నుండి పడ్డాయో నా బుగ్గలపై చెరొక వర్షపు చుక్క ..... , వర్షపు చుక్కలయితే చల్లగా ఉంటాయి - ఈ చుక్కలు వెచ్చగా హాయిగా అనిపించాయి ఆనందబాస్పాలలా ....... 

పైకిచూసి ఏమోలే అనుకున్నాను , సంతోషంలో థాంక్యూ థాంక్యూ అక్కయ్యా అంటూ సోఫాలోకి చేరిపోయాను , ఒకసారి రెండోసారి మూడోసారి ...... అలా పది పదిహేను సార్లు చూసినా తనివితీరనట్లు చూస్తూనే ఉన్నాను మళ్లీ మళ్లీ , చూస్తున్న ప్రతీసారీ ఆనందం రెట్టింపవుతూనే ఉంది ఫ్లాట్ మురిసిపోతున్నట్లు వెలుగులు పెరుగుతూనే ఉన్నాయి , బామ్మ ఈ సంతోషాన్ని చెల్లి కీర్తి చూస్తే ఎలా ఆనందిస్తుందో ...... , వద్దు వద్దులే ప్రయాణం చేసి అలసిపోయి అమ్మ గుండెలపై హాయిగా నిద్రపోతూ ఉంటుంది , చెల్లీ ...... ఈ సంతోషంలో ఉదయం నుండీ అలసిపోయినా నిద్రమాత్రం రావడం లేదు , ఓకేరోజులో ఎవ్వరూ లేని ఈ అనాధ ...... చెల్లి మరియు అక్కయ్య ప్రేమను పొందగలిగాడు ఇకనుండీ అనాధను కానే కాను , అదృష్టమంటే నాదే అంటూ సంతోషం పట్టలేక సంతోషంతో కేకలువేస్తున్నాను .

చాలా చాలా చాలా చాలా చా ............లా చాలా హ్యాపీ అక్కయ్యా ...... పెద్దక్కయ్య ఎక్కడ ఉన్నా ఇకనుండీ సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను అంటూ రిప్లై ఇచ్చాను .
" నేను సంతోషంగా లేను అంటూ బుంగమూతి సెల్ఫీతో రిప్లై "
ఏమైంది ఏమైంది అక్కయ్యా ...... ? .
" మన ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాలేదు , రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్లడం అవసరమా - మెయిల్ ఏంటి ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చుకదా - నేను ఎన్ని సెల్ఫీలు పంపాను నువ్వు ఒక్కటైనా పంపలేదు " 
నేను ..... మా అక్కయ్య అంత తెలివైనవాడిని కాను .... పంపి నవ్వుకున్నాను .
( నా నవ్వులతోపాటు ప్రక్కనే అందమైన నవ్వులు ..... ) 
గుటకలు మింగుతూనే చూసాను , అయినా ఈ సంతోషంలో భయమేలేకపోయింది .
" తమ్ముడూ అంటూ చిరు కోపపు అలక "
ల ....... sorry sorry so sorry అక్కయ్యా ...... , సాయం చెయ్యాలనుకున్నాను కానీ రుణం ఆశించలేదు .
" అంటే ఈ అక్కయ్యకు కనిపించవా ? " 
అన్నింటికీ కాలమే సమాధానం , మా అక్కయ్య - బామ్మ ఎంత సంతోషంగా ఉంటే అంత దగ్గరకు వస్తాను .
" ఏమీ కాకపోయినా మేమంటే ఎందుకింత ఇష్టం తమ్ముడూ ...... "
అంటే మీ తమ్ముడిని కాదన్నమాట , నేను బుంగమూతిపెట్టుకున్నాను .
" లవ్ యు లవ్ యు లవ్ యు sorry sorry తమ్ముడూ ..... , ఇదిగో గుంజీలు తీస్తున్నాను అంటూ సెల్ఫీ "
నో నో నో ...... అంటూ పంపి నవ్వుకున్నాను .
( మళ్లీ అందమైన నవ్వులు ..... ) 
నెమ్మదిగా రెండు వైపులా చూసి హమ్మయ్యా అనుకున్నాను .
" లేదు శిక్ష పడాల్సిందే ...... , బామ్మ - పెద్దక్కయ్య - తమ్ముడు - నేను ..... ఒక అందమైన కుటుంబం "
అఅహ్హ్ ...... హృదయాన్ని కదిలించావు అక్కయ్యా , లవ్ యు తమ్ముడూ అన్నప్పుడే కళ్ళల్లోనుండి ఆనందబాస్పాలు ......
" అవునా అయితే అలానే పిలుస్తాను , నేను చాలా చాలా హ్యాపీ ..... లవ్ యూ తమ్ముడూ లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... "

నేనైతే సగం మాత్రమే హ్యాపీ - చిరు అసంతృప్తితో ఉన్నాను .
" ఎందుకు ఎందుకు తమ్ముడూ ...... , ఖచ్చితంగా కారణం నేనే అయి ఉంటాను , నేనే కదా ...... "
అవును నా చిన్నక్కయ్యే ......
" ఏమి తప్పు తమ్ముడూ ...... ప్లీజ్ ప్లీజ్ చెప్పొచ్చు కదా ...... "
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 04-01-2024, 12:10 PM



Users browsing this thread: 1 Guest(s)