Thread Rating:
  • 29 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#17
జైలర్ : నేనూ వస్తాను - మహేష్ ఫ్రీడమ్ లోని సంతోషం నేనూ చూడాలి అంటూ బయటకువచ్చారు .


మెయిన్ గేట్ దగ్గరకు రాగానే అన్నయ్యా అంటూ పరుగునవచ్చి హత్తుకుంది కీర్తి , డాడీ - అంకుల్ ...... అన్నయ్యతోపాటు ఇంటికే కదా .
అంకుల్ : ఇంకా లేదు కీర్తీ ...... 
కీర్తి : డాడీ ......
సర్ : కొద్దిసేపట్లో తల్లీ ..... , కోర్టుకు వెళ్లడం - జడ్జి గారితో మాట్లాడి రిలీజ్ పేపర్స్ మీద సంతకం చేయించుకోవడం - నీ అన్నయ్యను నిరపరాధిగా ప్రపంచానికి తెలియజెయ్యడం - అప్పుడు అప్పుడు హ్యాపీగా ఇంటికి వెళదాము .
కీర్తి : సూపర్ డాడీ ......
సర్ : నీ అన్నయ్యతోపాటు మీముగ్గురూ మన కారులో ఫాలో అవ్వండి అంటూ విశ్వ సర్ govt వెహికల్లో జైలర్ తోపాటు బయలుదేరారు .
కీర్తి : రా అన్నయ్యా , మమ్మీ బానే డ్రైవ్ చేస్తారులే , భయపడాల్సిన అవసరం లేదు అంటూ లాక్కెళ్లి ముందుసీట్లో కూర్చోబెట్టి నాపై కూర్చుంది .
మేడమ్ : బానే డ్రైవ్ చేస్తానా అంటూ కీర్తికి ప్రాణంలా మొట్టికాయవేసి సర్ వెహికల్ వెనుకే పోనిచ్చారు .
ఫాస్ట్ ఫాస్ట్ మమ్మీ ......
మేడమ్ : మీ డాడీ ఫాస్ట్ గా వెళ్లాలికదా .......

దగ్గరే కావడంతో 15 నిమిషాలలో చేరుకున్నాము - సర్ వాళ్ళు కారులోనే ఉండమని సైగచేసి లాయర్ ను కలిసి లోపలికివెళ్లారు .
కీర్తి : మమ్మీ ఆపకు ఆపకు లోపలికి పోనివ్వు , లవ్ యు మమ్మీ ..... , ఎవ్వరు ఏమిచెప్పినా సరే అన్నయ్యతోనే ఉంటాను - కోర్ట్ లోపలికి కూడా రాకూడదా అన్నయ్యా అంటూ బుజ్జికోపంతో అడిగింది .
నవ్వు వచ్చేసింది , కోర్టు అంటే న్యాయానికి దేవాలయం కాబట్టి రావచ్చు .
కీర్తి : యాహూ ...... 
ష్ ష్ ష్ కీర్తీ , కోర్టు లో ఇలా కేకలువెయ్యరాదు .
కీర్తి : నా అన్నయ్య జైలు నుండి బయటకు వస్తున్నాడు , సంతోషంగా ఉండాలా వద్దా ......
థాంక్యూ కీర్తీ ......
మేడమ్ : ఫస్ట్ టైం నీ నవ్వును చూస్తున్నాను మహేష్ ......
నవ్వి నాలుగేళ్లు అయిపోయింది మేడమ్ , ఈ సంతోషమంతా మీవల్లనే - కీర్తి వల్లనే, థాంక్యూ థాంక్యూ .......
కీర్తి : Only థాంక్యూ నేనా అన్నయ్యా ......
మేడమ్ : థాంక్యూ తోపాటు ముద్దులుకూడా పెట్టాలి మహేష్ తెలియదా ......
అలాంటివేమీ తెలియదు మేడమ్ ......
మేడమ్ : ఇప్పుడు తెలిసింది కదా , ముద్దుపెట్టు లేకపోతే గోల గోల చేస్తుంది గట్టిగా కేకలువేస్తుంది .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో కీర్తి బుగ్గపై ముద్దుపెట్టబోయి ఆగిపోయాను , నేను చూస్తున్నదే కీర్తి కూడా చూస్తోంది . ఒక బామ్మను ..... లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు నిర్దాక్షిణ్యంగా బయటకు లాక్కెళ్లిపోతున్నారు - బామ్మ కళ్ళల్లో కన్నీళ్లను చూస్తుంటేనే మాఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు చేరిపోయాయి .
అన్నయ్యా .......
కీర్తిని ఎత్తుకుని కిందకుదిగాను - మేడమ్ కు అందించి పరుగునవెళ్లి , సెక్యూరిటీ అధికారి మేడమ్స్ మేడమ్స్ ..... ముసలావిడ ముసలావిడ జాగ్రత్త జాగ్రత్త అంటూ ముందుకువెళ్లి ఆపుతున్నాను .
లేడీ సెక్యూరిటీ అధికారి : కోర్ట్ ఏమైనా నీ ఇల్లు అనుకున్నావా ముసలిదానా ఏకంగా కోర్టు ఆవరణలోనే నిరాహారదీక్ష చేస్తున్నావు అంటూ గేట్ బయటకు తోసేశారు .
బామ్మా అంటూ పడిపోకుండా పట్టుకున్నాను - ప్రక్కనే ఉన్న చెట్టు కింద కూర్చోబెట్టి నీళ్లు నీళ్లు అంటూ చుట్టూ చూసి బడ్డీ కొట్టు ఉండటంతో పరుగునవెళ్లి వాటర్ ప్యాకెట్స్ అడిగాను .
నాలుగు రూపాయలు ......
అన్నా ..... పాపం బామ్మ మీరూ చూశారుకదా ......
లేదా అయితే వెళ్లు ......
అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ ......
అన్నయ్యా అంటూ 10 రూపాయల నోటు ఇచ్చింది కీర్తి ......
థాంక్యూ కీర్తి అంటూ చెమ్మను తుడుచుకుని అన్నా ఇవ్వు అంటూ తీసుకుని , కీర్తితోపాటు పరుగున బామ్మ దగ్గరకు చేరి తాగమన్నాను .
బామ్మ : ఆయాసపడుతూనే వద్దు వద్దు అన్నారు .
బామ్మా ..... త్రాగండి , నేను ముందే చెప్పాను కోర్టులో బాధ - కన్నీళ్లు పనికి రావు అని , కోర్టుకు కావాల్సొనది సాక్ష్యాలు ఆధారాలు , అన్నీ వాళ్లకు అనుకూలంగా ఉన్నాయి , అయినాకూడా సంవత్సరం పాటు పోరాడాము , ఈరోజుతో తుది తీర్పు ఇచ్చేసారు , నేను చెయ్యాల్సినదంతా చేసాను క్షమించండి అన్నారు లాయర్ మేడమ్ .......
కీర్తి ..... వాటర్ ప్యాకేట్ కట్ చేసి , గ్రానీ త్రాగండి అంటూ నోటికి అందించడంతో త్రాగారు ......
థాంక్యూ కీర్తీ ...... , లాయర్ గారూ ఏమైంది ? - ఈ వయసులో న్యాయం కోసం పోరాడుతున్న బామ్మ ఎవరు ? - కేస్ ఏంటి ? .

లాయర్ మేడమ్ : బామ్మకు ఇద్దరు మనవరాళ్లు , వారు చిన్నవయసులో ఉన్నప్పుడే కూతురు - అల్లుడు ఆక్సిడెంట్ లో చనిపోయి పిల్లలిద్దరినీ బామ్మ చేతిలో వదిలేశారు , అప్పట్లో ఉన్నవాళ్లే కాబట్టి ఇద్దరు మనవరాళ్లను ప్రయోజకులను చేసింది , ఒకరిని ఇంజనీరింగ్ మరొకరిని MBBS చదివించింది , ఇంతలో పెద్ద మనవరాలికి పెద్ద సంబంధం పైగా సాఫ్ట్ వేర్ సంబంధం రావడం - కట్నం పెద్దమొత్తంలో అడిగినా సంతోషంగా ఒప్పుకున్నారు , చిన్న మనవరాలి చివరి సంవత్సరం MBBS కు కావాల్సిన డబ్బును ఉంచుకుని ఇంటిని సైతం అమ్ముకుని పాతిక లక్షల కట్నం ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్లికూడా జరిపించారు - పెళ్ళైన రోజు నుండీ చేసుకున్నవాడితోపాటు అత్తామామలు చిత్రహింసలు పెట్టారు , డబ్బు డబ్బు అంటూ కొట్టి ఇంటికి పంపించేవారు , అక్కయ్య సంతోషం కంటే చదువు ముఖ్యం కాదు అనుకుని తీసిపెట్టుకున్న డబ్బును సైతం ఇచ్చేసారు , అయినా చిత్ర హింసలు ఆగలేదు , ఇంకా ఇంకా డబ్బు తీసుకురా అని చేతులూకాళ్లకు వాతలు పెట్టి గదిలో బంధించారు .
బామ్మ కన్నీళ్లను తుడుస్తోంది కీర్తి ......
బాధ ఆగడం లేదు .....
లాయర్ : చెల్లెలు వెళ్లి సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేదు , అక్కడకూడా డబ్బే కదా గెలిచేది , మాపైనే కంప్లైంట్ ఇస్తారా అని ...... చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు - సెక్యూరిటీ ఆఫీసర్లకు డబ్బు ఇచ్చి వీరిపైనే అపద్ధపు కేస్ పెట్టించింది , తన వలన చెల్లి - బామ్మ స్టేషన్ చుట్టూ తిరగడం చూసి తట్టుకోలేక తను ప్రాణాలతో ఉంటేనే కదా ఈ కష్టాలు అంటూ ఒకరోజు రాత్రి సూసైడ్  .......
అంతే తట్టుకోలేక మోకాళ్లపైకి పడిపోయాను , బామ్మ కన్నీళ్లను చూసి కీర్తి కన్నీళ్ళు ఆగడం లేదు .
లాయర్ : పెళ్ళైన 2 నెలల్లోనే ప్రాణంలా పెంచుకున్న ఒక మనవరాలు ప్రాణాలు విడవడం - రెండో మనవరాలి చదువు ఆగిపోవడం తట్టుకోలేకపోయింది , నెలలపాటు తిండిహారాలు లేక కన్నీళ్లతోనే సహవాసం చేశారు , ఇల్లుకొన్నవాళ్ళు మరింత బాధపెట్టడం ఇష్టం లేక కొద్దికాలం సమయాన్ని ఇచ్చారు , ప్రాణాలైతే తీసుకురాలేము కానీ చిన్న మనవరాలిని ఎలాగైనా చదివించాలి అనుకుని కట్నం డబ్బుల కోసం కోర్టులో కేస్ వేసింది నా సహాయంతో ...... , కేస్ అయితే హియరింగ్ కు వచ్చింది కానీ కట్నం ఇచ్చినట్లు మళ్లీ మళ్లీ డబ్బులు ఇచ్చినట్లు ఏ పత్రాలు లేకపోవడంతో నెలకోసారి వాయిదాపడుతూ ఈరోజుతో కేస్ పూర్తిగా వారివైపుకు తీర్పు ఇచ్చేసారు , డబ్బంతా వద్దు బిడ్డ చదువుకు అవసరమైంది ఇప్పించండి అని ఇద్దరూ బ్రతిమిలాడుకున్నా , కావాల్సింది ఆధారాలు అంటూ ఉదయమే కేస్ కొట్టివేశారు , వాళ్ళ కన్నీళ్లు చూసి కోర్టు మొత్తం కన్నీళ్లు కార్చింది కానీ న్యాయ దేవతకు మాత్రం కనికరం కలగలేదు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు , ఏడుస్తున్న మనవరాలిని ఇంటికి పంపించి పట్టు వదలకుండా ఇక్కడే కూర్చున్నారు , తరువాత ఏమిజరిగిందో అందరూ చూసారు , బామ్మా ..... ఇప్పుడంతా డబ్బుదే విజయం ఇంటికి వెళదాము .
బామ్మ : ఇంటికివెలితే రేపటితో ఇల్లూ ఉండదు - మనవరాలి చదువూ ఉండదు - నేను బ్రతికి లాభం ఏమిటి .
బామ్మా ..... అక్కయ్య కోసం , ఇంటి దగ్గర అక్కయ్య ఎదురుచూస్తూ ఉంటుంది , ధైర్యంగా ఉండండి ఏదో దారి ఉంటుంది .
కీర్తి : అవును గ్రానీ ...... , మా అన్నయ్య కూడా చెయ్యని నేరానికి నాలుగేళ్లు జైలులో ఉన్నారు , గాడ్ sad ఫీల్ అయినట్లు ఈరోజు రిలీజ్ అవుతున్నారు .
ఎండ కూడా ఎక్కువగా ఉంది , లాయర్ గారూ ప్లీజ్ ఇంటివరకూ వదలండి అంటూ ఆటోను పిలిచాను , బామ్మను ఆటోలో ఎక్కించి లాయర్ గారూ డబ్బు లేదు .
లాయర్ : పర్లేదు నేను ఇస్తాను , అదిగో అదే గయ్యాలి అత్తమామలు - ఎలా రాక్షస నవ్వులు నవ్వుకుంటూ వెళుతున్నారో చూడు , ఆ లగ్జరీ కారు కూడా కట్నం డబ్బులతో కొన్నదే ......
బామ్మ చూడకూడదు వెళ్ళండి .
మేడమ్ కన్నీళ్లతో డబ్బు ఇచ్చారు .
డ్రైవర్ అన్నా జాగ్రత్తగా తీసుకెళ్లండి , బామ్మా ధైర్యం కోల్పోవద్దు - అక్క ఉందని గుర్తుపెట్టుకోండి , ఆటో కదిలింది .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 15-11-2023, 06:22 PM



Users browsing this thread: Hellogoogle, 11 Guest(s)