Thread Rating:
  • 29 Vote(s) - 2.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#14
టెన్త్ క్లాస్ చివరి exam సోషల్ స్టడీస్ మంచిగా రాయడంతో అన్నీ పరీక్షలూ బాగా రాశానని సంతృప్తితో సెంటర్ నుండి బయటకువచ్చాను .
ఇక నుండీ సెలవులు అన్నట్లు exams రాసి బయటకువచ్చింది తోటి స్టూడెంట్స్ అందరూ సంతోషాలతో కేకలువేస్తూ జట్టు జట్టుగా కలిసి ఈ సెలవులలో ఏమేమి చెయ్యాలో చర్చించుకుంటూ ముందుగా మూవీకి వెళ్ళాలి అనుకుంటూ వారి వారి ఇళ్లకు హుషారుగా బయలుదేరారు , కొంతమంది అయితే ముందు మూవీ చూసే ఇంటికి వెళ్లొచ్చు అన్నారు - ఒకటీ రెండు జట్లు అయితే రేయ్ రేయ్ నాకు నాకు వాటిని చూడాలని ఉందిరా ..... అంటూ సిగ్గుపడుతూ మోహమాటపడుతున్నారు .
వేటిని రా .....
వాటినే రా .....
రేయ్ వీడు హాఫ్ ఇయర్లీ exams అప్పుడే చూడాలని అన్నాడురా ..... , వీడికి గిలిగింత కొట్టినట్లుంది ప్యాంటులో అంటూ నవ్వులు .
మీకు లేదారా చూడాలని .....
ఉంది అనుకో .......
Ok ok అర్థమైంది అర్థమైంది అందరికీ చూడాలని ఉంది , CD షాప్ కు వెళ్లి తీసుకొద్దాము .
రేయ్ CD షాప్ కు దేనికిరా , మొబైల్లోనే లెక్కలేనన్ని చూడొచ్చు , మా మామయ్య చూస్తుంటే చూసాను , రేయ్ రేయ్ మీ ఇంట్లో ఎవరూ లేరుకదా పైగా వీడితో పెద్ద మొబైల్ ఉంది మీ ఇంటికి వెళ్లి చూద్దాము .
రేయ్ రేయ్ వద్దురా ..... , నైబర్స్ కు తెలిస్తే అంతే .....
సౌండ్ లేకుండా చూద్దాములేరా , టీవీ కి కనెక్ట్ చేసి చూస్తే పెద్దగా భలేగా ఉంటుంది పదండి పదండి అంటూ వాడు ఒప్పుకోకముందే లాక్కుంటూ వెళ్లారు .
నవ్వుకున్నాను , తోటి స్టూడెంట్స్ అందరి సంతోషాలనూ కోరికలనూ విని , ఇలాంటి సంతోషాలేవీ నా జీవితంలో లేవు ఈ పదిరోజులు మాత్రమే స్వేచ్ఛగా తిరగగలిగాను మళ్లీ నిర్బంధమీ అనుకుని నిరాశతో నడుచుకుంటూ బయలుదేరాను .

మొదటి exam రాసి వెళ్ళేటప్పుడు మొదలుకుని ప్రతీరోజూలానే ఈ చివరి రోజున కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మాణం అయినట్టు మరియు అవుతున్న ఒక పోష్ ఏరియా లో బయట ఆడుకుంటున్న పిల్లల సంతోషాలను చూస్తూ కొద్దిసేపు ఆగి ఆనందిస్తున్నాను .
అటూ ఇటూ వెళుతున్న పేరెంట్స్ .... బుజ్జాయిలకు జాగ్రత్త జాగ్రత్త అని చెబుతున్నారు ఎందుకంటే దగ్గరలోనే భారీ యంత్రాలతో బిల్డింగ్ స్టార్టింగ్ పనులు జరుగుతున్నట్లు - భోజనం గ్యాప్ అన్నట్లు వర్కర్స్ అందరూ ఒక ప్రక్కన చేరి తింటున్నారు .

అంతలో ఒక సెక్యూరిటీ అధికారి జీప్ ఏరియా లోపలికి వెళ్లబోతూ నాప్రక్కనే ఆగింది , రేయ్ ఎవర్రా నువ్వు ఇక్కడేమి చేస్తున్నావు - పిల్లలను అలా చూస్తున్నావేంటి - పిల్లలను ఎత్తుకుని వెళ్ళేవాడివా ? - వెళతావా లేక లాఠీ రుచి చూయించమంటావా అంటూ డ్రైవర్ సెక్యూరిటీ అధికారి హెచ్చరించాడు .
నో నో నో సర్ వెళతాను .
ఆ అబ్బాయి అలా కనిపిస్తున్నాడా ? పోనివ్వు అంటూ లోపలున్న పెద్ద సెక్యూరిటీ అధికారి మాటలు వినిపించడంతో ..... , yes సర్ అంటూ లోపలికి పోనిచ్చాడు .
మంచి సెక్యూరిటీ అధికారి అనుకుని , అమ్మో టైం అవుతోంది - పిల్లల సంతోషాలను చూస్తుంటే వెళ్లబుద్దికావడం లేదు , మళ్లీ చూడలేను అంటూ చివరిసారిగా చూసి నవ్వుకుంటున్నాను .

ఆడుకుంటున్న పిల్లలలో తమ బుజ్జాయి కూడా ఉందేమో అనుకుని కిందకు దిగిన పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ కీర్తీ కీర్తీ కీర్తి తల్లీ అంటూ పిలుస్తున్నారు , ఎంతకూ కనిపించకపోవడంతో ఇంటిలోపల ఉందేమో అన్నట్లు లోపలికివెళ్లి మేడమ్ తోపాటు బయటకువచ్చారు .
మేడమ్ : ప్రయాణానికి టైం అయ్యింది అన్నాకూడా మళ్లీ రాము కదా మమ్మీ డాడీ వచ్చేన్తవరకూ ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను , బయటే ఉంటాను అంది , తల్లీ కీర్తి కీర్తి అంటూ పిలిచినా పలుకకపోవడంతో కంగారుపడుతూ ఆడుకుంటున్న పిల్లలను అడిగారు .
మాతోపాటే ఆడుకుంటోంది ఇప్పటివరకూ అంటీ - అంకుల్ ..... , బాల్ బాల్ అంటూ కార్తీ బొమ్మను చేతిలో పట్టుకుని వెళ్ళింది , ఇంట్లోకి వెళ్లిందిలే అనుకున్నాము .
అంతే ఒక్కసారిగా కంగారు పెరిగిపోయింది , ఏమిటి ఏమిటి అంటూ పిల్లల పేరెంట్స్ కూడా బయటకువచ్చి విషయం తెలుసుకుని పాపను పిలుస్తూ మొత్తం వెతికినా జాడలేదు .

వాడే సర్ వాడే .... వాడే ఏమైనా చేసి ఉంటాడు , వాడు ఖచ్చితంగా పిల్లలను ఎత్తుకుని వెళ్ళేవాడే , అదిగో ఇంకా అక్కడే ఉన్నాడు పట్టుకోండి పట్టుకోండి వాడిని అంటూ పరుగునవచ్చి లాఠీతో కొడుతూ లాక్కెళ్లాడు .
సర్ సర్ సర్ నాకేమీ తెలియదు - నేను అలాంటి వాడిని కాదు - ఇప్పుడే టెన్త్ క్లాస్ exams రాసి పిల్లలు సంతోషంగా ఆడుకుంటుంటే చూస్తున్నాను అంతే కావాలంటే నా హాల్ టికెట్ చూడండి అయ్యో ఎక్కడో పడిపోయింది అంటూ జేబుల్లో వెతుకుతున్నాను .
డ్రైవర్ సెక్యూరిటీ అధికారి : చూసారా సర్ వీడి యాక్టింగ్ అంటూ కొట్టాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : చేతిలో exam ప్యాడ్ ఉంది వదిలెయ్యండి ..... , అయినా పిల్లలను ఎత్తుకుని పోయేవాడే అయితే ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటాడు , ఆ అబ్బాయి కళ్ళల్లోనే తెలుస్తోంది , వదిలెయ్యమని చెప్పానా ? అంటూ కోప్పడ్డారు .
అవును సర్ రోజూ exam రాసి ఇక్కడ కాసేపు పిల్లలను చూసి చాలా ఆనందం కలుగుతుంది అని చెప్పి వెళతాడు సర్ , ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు మంచి పిల్లాడు అంటూ సెక్యూరిటీ ......
డ్రైవర్ సెక్యూరిటీ అధికారి : విన్నారా సర్ , పిల్లలకోసం రెక్కీ చేసాడు అంటూ మళ్లీ కాళ్లపై కొట్టాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : వదిలెయ్యమన్నాను .....
డ్రైవర్ సెక్యూరిటీ అధికారి : Yes సర్ sorry సర్ .......
కాలర్ వదిలెయ్యడంతో లాఠీ దెబ్బలకు నొప్పితో కుంటుకుంటూ బయటకు నడిచాను .

కానిస్టేబుల్ ..... మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లను అలర్ట్ చెయ్యండి , సీసీ ఫుటేజీ చెక్ చెయ్యండి , పుష్ప ..... మన కీర్తికి ఏమీకాదు , నిమిషాలలో మనదగ్గర ఉంటుంది అంటూ పెద్ద సెక్యూరిటీ అధికారి సర్ ధైర్యం చెబుతున్నారు , చాలా మంచివారు అనిపించింది .
తల్లీ తల్లీ కీర్తి కీర్తి అంటూ ఆ తల్లి కన్నీళ్లకు చలించిపోయాను - నొప్పివేస్తున్నా కూడా కుంటుకుంటూనే అందరితోపాటు వెతుకుతూ బిల్డింగ్ పనుల కోసం తీసిన గుంతల దగ్గరికి వెళ్ళాను .
అందరి కేకల మధ్యన పాప ఏడుపులు వినిపించడంతో , పాప పాప అంటూ ఆ ప్రాంతమంతా వెతికినా కనిపించలేదు , అందరి కేకల మధ్యన పాప ఏడుపులు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయో ..... , సైలెంట్ ఇక్కడివాళ్ళు అక్కడే ఆగిపోండి మాట్లాడకండి అంటూ గట్టిగా కేకలు వేయ్యడంతో పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది . పాప ఏడుపు వినిపించడంతో వెతుకుతూ గుంతలు గుంతల నుండి అంటూ ఒక్కొక్క గుంతలో వింటున్నాను - చాలా లోతుగా యంత్రాలతో తీసినట్లు లోపల మొత్తం చీకటి - మధ్య గుంతలో చెవి ఉంచగానే పాప ఏడుపు ..... చూస్తే ఏమీ కనిపించడం లేదు , లోపల పాప పరిస్థితి తెలిసి ఒక్కసారిగా వొళ్ళంతా చెమట పట్టేసింది - పాప పాప ...... , పాపకు వినిపించినట్లు ఏడుపు తీవ్రత పెరిగింది .
మమ్మీ మమ్మీ .....

పాప ...... అయ్యో ఇప్పుడెలా ? , సర్ సెక్యూరిటీ అధికారి సర్ పాప పాప .... ఇక్కడ ఉంది .
సెక్యూరిటీ అధికారి సర్ - మేడమ్ గారితోపాటు అందరూ పరుగున చేరుకున్నారు , ఎక్కడ ఎక్కడ ...... , వర్కర్స్ కూడా చేరుకున్నారు .
వెనక్కు వెనక్కు ...... అంటూ అందరినీ కాస్త దూరంలోనే ఆపేస్తున్నాను .
ఎక్కడ నా తల్లి ఎక్కడ అని సంతోషంగా అడిగిన తల్లి కళ్ళల్లో కన్నీళ్లు చేరడానికి క్షణిక కాలం కూడా పట్టలేదు .
పిల్లర్ కోసం తీసిన గుంత వైపు చిపోయించాను .
అంతే ఆ తల్లి కన్నీళ్లతో స్పృహ కోల్పోయింది .
అంబులెన్స్ అంబులెన్స్ అంటూ డ్రైవర్ సెక్యూరిటీ అధికారి కాల్ చేస్తున్నాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : పుష్ప పుష్ప అంటూ పట్టుకునే గుంత దగ్గరకువెళ్లి కీర్తి కీర్తి .....
డాడీ అంటూ ఏడుపు వినిపించడంతో ఆ తండ్రి విలవిలలాడిపోతున్నాడు .

సర్ సర్ ..... మీ ఏడుపు వినపడితే పాప మరింత భయపడుతుంది , కష్టమే అయినా కంట్రోల్ చేసుకుని ధైర్యం చెప్పండి , ప్లీజ్ ప్లీజ్ ఆక్సిజన్ లోపలకు వెళ్ళాలి మీరు వదిలిన CO2 కాదు , లోపల చాలా తక్కువగా ఉంటుందని సైన్స్ సర్ చెప్పారు వెనక్కు వెనక్కు ఇంకా ఇంకా ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : ఒకచేతితో మేడమ్ ను పట్టుకుని మరొక చేతితో కన్నీళ్లను తుడుచుకున్నారు , డ్రైవర్ సెక్యూరిటీ ఆఫీసర్ను పిలిచి డాక్టర్స్ - రెస్క్యూ టీం - అంబులెన్స్ - క్రేన్ - జేసీబీతోపాటు అవసరం అన్నవాళ్ళందరినీ పిలిపించు త్వరగా త్వరగా , తల్లీ కీర్తి ..... మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నాము , నీకేమి కాలేదు అంటూ మొబైల్ టార్చ్ వేస్తున్నారు .
కరెంట్ పోయింది ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : పవర్ కట్ అయ్యింది అంతే ......
దాగుడుమూతలు - దొంగ సెక్యూరిటీ అధికారి ఆట ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : మనం రోజూ ఆడుకుంటాము కదా దొంగ సెక్యూరిటీ అధికారి ఆట , ఇప్పుడూ అదే ఆడుకుంటున్నాము , మా బంగారు తల్లి దొంగ - మమ్మీ డాడీ సెక్యూరిటీ అధికారి ..... , చీకట్లో దాక్కుంటావు కదా అలా .....
మమ్మీ డాడీ మమ్మీ డాడీ అంటూ ఏడుపు .....

అన్నలూ ..... గుంత ఎంత లోతులో ఉంది ? .
వర్కర్స్ : మెయిన్ పిల్లర్ కోసం ప్రత్యేకంగా ఈ పెద్ద మెషీన్ తెప్పించి సుమారు 100 - 110 అడుగులవరకూ తీయించాము బాబు .....
100 అడుగులా ? , పాప ఎలా పడిందో ఏమో ..... , కదిలేంతలా ఉంటుందా ? .
వర్కర్స్ : చెప్పలేం బాబూ ..... , పాప ఎలా పడిందో ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : తన్నుకొస్తున్న ఏడుపును తిప్పుకుని , కీర్తి తల్లీ ..... నీ బుజ్జితమ్ముడు కార్తీ కూడా ఉన్నాడుగా , మాకు దొరకకుండా దాక్కోవాలి .
మమ్మీ డాడీ ......
ఇద్దరా ? సర్ ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : బొమ్మను తమ్ముడిగా చూసుకుంటుంది , ఆ బొమ్మ లేకుండా ఉండలేదు అంత ఇష్టం ......

డ్రైవర్ సెక్యూరిటీ అధికారి : సర్ అందరికీ కాల్ చేసాను , 30 నిమిషాలలో వచ్చేస్తారు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : త్వరగా త్వరగా .....
మేడమ్ కు స్పృహ వచ్చినట్లు కన్నీటితో పాప పాప పాప - ఆ తల్లి బాధకు అందరూ చలించిపోతున్నారు .
మమ్మీ మమ్మీ ......

అర గంట పడుతుందా ? , అంతవరకూ ఆక్సిజన్ అందడం కష్టమే అంతవరకూ ఆగకూడదు - ఎలా ఎలా ఎలా అంటూ చుట్టూ చూసాను , పెద్ద తాడు కనిపించడంతో తీసుకొచ్చి పాదాలకు బాగా కట్టుకున్నాను , అన్నలూ ..... పట్టుకుని కిందకు వదలండి .
చాలా అపాయం బాబూ - నీకేమైనా అవ్వవచ్చు - పైగా కాళ్ళ నుండి రక్తం కారుతోంది .
ఇవన్నీ నాకు మామూలే అన్నలూ ...... , ఆ తల్లి కన్నీళ్లు - పాప ప్రాణం కంటే నా ప్రాణం విలువైనదేమీ కాదు , ఈ జీవితం పాపను సేవ్ చెయ్యడం కోసం అయితే సంతోషంగా వెళ్లిపోతాను , పాపను రక్షిస్తే చాలు పట్టుకోండి , ఎవరైనా టార్చ్ వేసి మొబైల్ ఇస్తారా ? , ఇవి కాదు కీ ప్యాడ్ మొబైల్ ....... 
నాదగ్గర ఉంది అంటూ వర్కర్ ఇచ్చారు .
గుంతలోపల బాగా కనిపించేలా తలకు కట్టండి , వదులుతుంటే నా బరువు తెలుస్తుంది కదా కాస్త పెరిగినా జాగ్రత్తగా పైకి లాగండి , నా చేతులలో పాప ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి అనిచెప్పి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా గుంత దగ్గరికి వెళ్ళాను .
నిమిషాల్లోనే అన్నలు ..... దిగడానికి లాగడానికి వీలుగా ఉండేలా ( పాతకాలంలో బావిలోనుండి నీళ్లకోసం తాడుతో బిందెలు లాగేలా ) ఏర్పాటు చేయడం - నా తాళ్ల ముడిని చెక్ చేసి భారంగానే ok అన్నారు .
తలను గుంతలోపలికి ఉంచి లోపలికివెళ్ళాను - టార్చ్ వెలుగులో లోపలికి నిటారుగా నెమ్మది నెమ్మదిగా వెళుతూ పాప పాప ఇదిగో మమ్మీ డాడీ దగ్గరకు తీసుకెళ్లడానికి వచ్చాను , ఎంచక్కా మమ్మీ ఒడిలో తినొచ్చు ఆడుకోవచ్చు నిద్రపోవచ్చు అంటూ మాట్లాడిస్తూ నిటారుగా కిందకువెళుతున్నాను , చేతులకు - వీపుపై - ఛాతీపై రాళ్లు గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా గాలిని బాగా పీల్చాలి - నోస్ తోనే కాదు నోటితోకూడా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను - నాకే ఊపిరి పీల్చడం కష్టం అవుతోంది అంటూ దగ్గుతున్నాను , వీలైతే చేతులు పైకెత్తాలి , గేమ్ రూల్ .......
అలాగే ...... , మమ్మీ డాడీ అంటూ ఏడుపు .

పాప చేతులు స్పృశించగానే , హమ్మయ్యా ..... నిలువుగా జారింది లోపలకు అంటూ ఊపిరి పీల్చుకున్నాను - టార్చ్ వెలుగులో పాపపై మట్టి పడి ఉండటం చూసి ఏమీకాలేదు ఏమీకాలేదు , పాప పాప ..... మమ్మీ డాడీ దగ్గరకు వెళదాము .
తమ్ముడుని పట్టుకోలేదు - ఎవరు నువ్వు ? మమ్మీ డాడీ ఎక్కడ అంటూ ముద్దుగా అడిగింది .
అన్నయ్యను అనుకో ..... , తమ్ముడంటే ఇష్టం కదూ ఎక్కడ ఎక్కడ నీ ప్రక్కనే ఉన్నాడు అంటూ కష్టమైనా షర్ట్ లోపలికి వేసుకున్నాను , పాప ..... కొద్దిసేపు నొప్పివేస్తుంది అమ్మ ముద్దులు పెట్టగానే మాయమైపోతుంది అంటూ మోచేతులవరకూ బాగా పట్టుకుని ఒక జర్కు ఇచ్చాను .
పైకి మెసేజ్ చేరినట్లు అతినెమ్మదిగా పైకి లాగుతున్నారు .
10 అడుగులకే అన్నయ్యా అన్నయ్యా నొప్పివేస్తోంది అంటూ ఏడుపు .....
కన్నీటి ధార నేరుగా వెళ్లి పాప బుగ్గపై చేరింది .
అన్నయ్యా ఏడుస్తున్నారు ఎందుకు , నొప్పి అన్నయ్యా నొప్పి ..... మమ్మీ మమ్మీ అంటూ ఏడుపు ......
కొద్దిసేపు ఇంకాసేపు అంతే అంటూ నాకు రాళ్లు గుచ్చుకున్నప్పుడు పాపను మరింత జాగ్రత్తగా పట్టుకున్నాను , ఇంతకాలం అనుభవించిన జీవితం కళ్ళ ముందు మెదిలింది - ఈ పెయిన్ తో పోలిస్తే అది చిన్నగా మారిపోయింది .
పాపతో మాట్లాడుతూ - పాట పాడుతూ - తల్లిదండ్రులను గుర్తుచేస్తూ - పిల్లలతో ఆటలను గుర్తుచేస్తున్నా ఏడుస్తూనే ఉంది , పాప .... కీర్తీ ..... కార్తి అనగానే ఒక్కసారిగా ఏడుపు మాయం అయిపోయింది .
Ok ..... తమ్ముడు కార్తి అంటే అంత ఇష్టం అన్నమాట .
అవును అన్నయ్యా అంటూ నవ్వు .....
తమ్ముడు నాలోపల హ్యాపీగా నవ్వుతున్నాడులే .....
అవునా అయితే నేనూ నవ్వుతాను అన్నయ్యా ......

పైన టార్చ్ వెలుగులు కనిపించడం - నేను కనిపించినట్లు జాగ్రత్త జాగ్రత్త అంటూ కాస్త వేగంగా పైకి లాగి జాగ్రత్త జాగ్రత్త అంటూనే నన్ను ఆవెంటనే పాపను అందుకుని తల్లి ఒడిలోకి చేర్చారు .
కీర్తి కీర్తి తల్లీ తల్లీ ...... అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
మమ్మీ ...... అంటూ ఏడవగానే , అందరూ ఊపిరిపీల్చుకున్నారు , సంతోషాలతో కౌగిలించుకొన్నారు చప్పట్లు కొడుతున్నారు .
ఆ తల్లి కన్నీళ్లు ఆనందబాస్పాలతో నిండిపోయాయి .

అంబులెన్స్ వచ్చినట్లు డాక్టర్ వచ్చి తల్లి ఓడిలోనే పాపకు ఆక్సిజన్ ఉంచారు - హార్ట్ బీట్ చెక్ చేసి మినిట్స్ ఆలస్యం అయినా కష్టమైపోయేది సర్ , సమయంలో రక్షించారు .
ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి కూడా అంటూ మేడమ్ చెప్పడంతో , పెద్ద సెక్యూరిటీ అధికారి సర్ ..... బాబు బాబు అంటూ వచ్చారు .
పర్లేదు పర్లేదు సర్ , I am fine సర్ ..... , పాప సేఫ్ ఆ సంతోషం చాలు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : థాంక్యూ థాంక్యూ , నీ రుణం తీర్చుకోలేనిది , పెళ్ళైన ఎన్నో ఏళ్లకు పుట్టిన మా ప్రాణం , తనకు ఏమైనా అయి ఉంటే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అంటూ కౌగిలించుకొన్నారు , స్వయంగా నా పాదాలకు తాళ్లను విప్పారు .
సర్ సర్ సర్ ...... అంటూ కూర్చున్నాను .
పెద్ద సెక్యూరిటీ అధికారి : నా సంతోషం కోసం అంటూ విప్పారు .

అప్పుడు సైరెన్స్ చేసుకుంటూ రెస్క్యూ టీం - సెక్యూరిటీ ఆఫీసర్లు - జేసీబీ లు వచ్చాయి .
థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబు ...... , ఇప్పటివరకూ ఆగి ఉంటే ఊహించుకుంటేనే ఊపిరి ఆగిపోయేలా ఉంది .
సర్ ..... పాప సేఫ్ , పాపదగ్గరకు వెళ్ళండి , మీరంటే ప్రాణం ......
అంతే అన్నలు పైకెత్తి కేకలువేస్తూ సంతోషాలను పంచుకున్నారు .

పెద్ద సెక్యూరిటీ అధికారి : తల్లీ కీర్తి కీర్తి .....
డాడీ డాడీ .....
పెద్ద సెక్యూరిటీ అధికారి : ఇక్కడే ఉన్నాను తల్లీ .....
తమ్ముడు ఎక్కడ ? .
పెద్ద పోలిస్ : నాకు తెలుసు , ఈ డాడీ కంటే తమ్ముడు అంటేనే ఇష్టం , అదిగో ఇప్పుడే నీ తమ్ముడిని బయటకు తీస్తారు .
సర్ అంటూ షర్ట్ లోపల నుండి తీసి ఇచ్చాను .
తమ్ముడూ అంటూ తల్లి ఓడిలోనుండి లేచివచ్చి , థాంక్యూ అన్నయ్యా అంటూ అందుకుని ఒంగు అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టి మళ్లీ మేడమ్ ఒడిలోకి చేరిపోయింది .
తమ్ముడంటే ప్రాణం అన్నారుకదా సర్ .....

Sorry sorry బాబు , నీ గురించి తెలుసుకోకుండా రక్తం వచ్చేలా కొట్టాను , బాబూ ..... వొళ్ళంతా కూడా రక్తం అంటూ ఫీల్ అవుతున్నాడు డ్రైవర్ సెక్యూరిటీ అధికారి .
గుంతల్లో రాళ్లు గుచ్చుకున్నాయి సర్ ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : డాక్టర్ డాక్టర్ ......
డాక్టర్ వచ్చి షర్ట్ విప్పి గుచ్చుకున్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు .
Like Reply


Messages In This Thread
RE: సహాయం - శృంగారం - by Mahesh.thehero - 15-11-2023, 06:17 PM



Users browsing this thread: Roja rani, 2 Guest(s)