Thread Rating:
  • 7 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic హా.. హా.. హాసిని...!
#5
నేను కూడా ఇంటికి వచ్చి బ్యాగ్ ఇంట్లో పడేసి అట లో మునిగిపోయా... మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేసరికి నాన్న ఉన్నాడు ఇంట్లో... మెల్లిగా పిల్లిలా వెళ్లి అమ్మ పక్కన చేరిపోయా.. అప్పుడే నాన్న రేయ్ నానీ ఇటు రారా అంటూ కేకేసాడు. అబ్బా దొరికిపోయాను రా బాబు అనుకుంటూ డాడీ దగ్గరకు వెళ్ళాను. డాడీ టీవీ లో మొఖం పెట్టి నా వైపు చూడకుండా ఎటు వెళ్ళావ్ ఇప్పటిదాకా అన్నారు... నేను భయం భయం గానే డాడీ నోట్స్ రాసుకుదాం అని ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిన...
అబద్ధం చెప్తున్నాడు డాడీ వీడు ఇప్పటిదాకా దున్నపోతు లా ఆటలు ఆడుకొని వచ్చాడు అని చెప్తూ నవ్వుతుంది... నా రాక్షసి చెల్లి..
అబ్బా దొరికిపోయాను రా దేవుడా అని మొఖం కిందుకి వేసా...
ఏరా కొంచెమ్ అయినా సిగ్గు ఉందారా... నా చిట్టీ తల్లి చూడు వచ్చిన దగ్గర నుంచి పుస్తకం లో తల పెట్టి చదువుతుంది.... ( నేను తల పెట్టి చదువుతుందో నిద్ర పోతుందో ఎవడికి తెల్సు )
రేయ్ ఎటు చూస్తున్నవ్ రా దున్నపోతా... సరిగ్గా చదువు రా లేకపోతే సంక నాకిపోతావ్... అని తిడుతూనే ఉన్నాడు మా డాడీ... అబ్బా ఊరుకోండి వాడిని తిట్టానిదే మీకు పొద్దు పొదు. రేయ్ నువ్ రా రా వెళ్లి కళ్ళు చేతులు కడుకుపో అన్నం పెడ్తా... ఏమే చదివింది చాలు లేచి ఈ గిన్నెలు అన్ని అక్కడ పెట్ట్టు..
నేను ఫ్రెష్  అయ్యి వచ్చి కూర్చున్న.. అమ్మ అందరికి అన్నం పెట్టింది.. ఎం కూర చేసావ్ అమ్మ.. పప్పు చారు రా ఇంకా అప్పడాలు కూడా ఉన్నాయి... ఓహో అని తింటూ టీవీ చూస్తున్న అప్పుడే సౌందర్య పాట వస్తుంది... అప్పుడే నా సౌందర్య గుర్తుకు వచ్చింది.. తన ని తలుచుకుంటూ అన్నం తినేసి బెడ్ ఎక్కేసా... మళ్ళీ ఊహల్లో తానే వచ్చేది.... ఆలా ఆలా ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్ర పోయానో నాకే తెలియదు...
ఉదయం అమ్మ లేపుతుంది నిద్ర లేరా నానీ 6:30 అవుతుంది లేచి రెడీ అవ్వు... అమ్మ కాసేపు అగు అమ్మ లేస్తాను.... ప్లీజ్.. అప్పుడే నాన్న రేయ్ నాన్న లేవరా అని అరిచాడు... టక్కున లేచి కూర్చున్న టైం చుస్తే 6:05.... (6:30 అని చెప్పింది కదా మరి మళ్ళీ 6:05 అవుతుంది అంటున్నాడు ఏంటి అని చూస్తున్నారా అమ్మ అంతే లెండి ఏ టైం అయినా ఒక అరగంట గడిచినట్టు చెపుతుంది...)
నేను లేచి బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి డ్రెస్ వేసుకున్న.. మా చెల్లి ఆల్రెడీ రెడీ అయ్యి జడలు వేయించుకుంటుంది అమ్మ తో.... నేను వెళ్లి టిఫిన్ ఎం పెట్టిందా అని చూసే సరికి అదే ఉప్మా...కోపం గా అమ్మ ని చూస్తూ దాన్ని ప్లేట్ పెట్టుకొని కొంచము చట్నీ వేసుకొని టీవీ చూస్తూ తినేసా..... తరువాత నేను కూడా రెడీ అయ్యి బూట్లు వేసుకొని బ్యాగ్ వేసుకున్న అప్పుడే డాడీ మా దగ్గరికి వచ్చి నాకు చెల్లి కి ఒక్కో 5 రూపాయలు ఇచ్చాడు.... (ఇప్పుడు అంటే 5 రూపాయలు ఎం రావు అనుకోండి...) మా డాడీ కి ఆనందం తో ముద్దు పెట్టి ఇద్దరం నడుచుకుంటూ స్కూల్ కి వెళ్లిపోయాం...
ఓహ్ సారీ ఇంత వరకు మా ఫ్యామిలీ ని పరిచయం చేయలేదు గా...  మాది ఒక చిన్న ఫ్యామిలీ...
నాన్న. తిరుపతి.
అమ్మ. స్వప్న.
చెల్లి. ప్రియా
నేను. నానీ( manitheja)
నాన్న కరెంటు పని చేస్తుంటాడు.. అమ్మ ఇంట్లోనే ఉంటుంది.. అమ్మ నాన్న వాళ్ళది ప్రేమ వివాహం.. ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. అందుకే మాకు చుట్టాలు అంటే ఎవరో కూడా తెలీదు... ఎప్పుడైనా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం చెల్లి నేను... తాత వాళ్లకు ఆస్థి బాగానే ఉంది. అప్పుడప్పుడు అవసరరాలకి డబ్బులు తాత ఇచ్చేవాడు నాన్న కి . పప్పు లు కారం బియ్యం అన్ని అక్కడి నుంచే వచ్చేవి కాబట్టి దేనికి అంత బాధ లేదు... ఉన్న దాంట్లో మేము హ్యాపీ గా ఉండేవాళ్ళం...తాత నానమ్మ డాడీ తో నాతో చెల్లి తో బానే ఉంటారు కానీ అమ్మ తో మాట్లాడరు....
ఇక ప్రస్తుతం..
నేను చెల్లీ వచ్చేసరికి క్లాస్ లో ఒక్కడు లేడు.. ఇక నేను మా చెల్లి కలిసి బోర్డు మంచిగా కాకర ఆకు తో తుడిచి ఒక వైపు తారీకు రోజు అవి అన్ని రాసి దాని కింద ఒక సూక్తి రాసి.. బెంచ్ లు అన్ని కరెక్ట్ గా సెట్ చేసే సరికి ఒక్కకరు వస్తున్నారు...
అన్నట్టు మీకు చెప్పడం మరిచా. మా క్లాస్ 4th ఫ్లోర్ లో ఉంటుంది రూఫ్ టాప్ మీద ఓన్లీ 3 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉంటాయి.. మిగతా ప్లేస్ కాళీ గా ఉంటది వరండాలాగా... స్టడీ హోవర్స్ కోసం అని.. ఇక చుట్టు చూస్తూ మా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెడ్తున్నావ్ ఉన్న అంతలోనే నా హాసిని వచ్చేసింది.. ఒక జబ్బ కి బ్యాగ్ వేసుకొని చేతిలో బెల్ట్ తో అదే నవ్వు తో వచ్చి అదే బెంచ్ లో కూర్చుంది... ఇక మా మేడం వచ్చి అటెండెన్స్ తీసుకుంటుంది అందరికి.. దాని తరువాత నిన్న హోమ్ వర్క్ ఎంత మంది కంప్లీట్ చేసారు.. బుక్స్ తీసుకొని నా టేబుల్ మీద పెట్టండి... అని అరిచింది... అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు హోమ్ వర్క్ ఉంది అని... ఎలా ఎలా అని చూస్తూ ఉంటే మా ఫ్రండ్స్ కూడా నాలాగే దిక్కులు చూస్తున్నారు.. నేను సైగలతో ఏమైంది రా అని అడిగా.. వాడు హోమ్ వర్క్ చేయలేదు రా అని చెప్పాడు... హమ్మయ్య నాకు ఒక తోడు దొరికింది అని సంబర పడ్డ.. అప్పడూ మేడం హోమ్ వర్క్ చేయని వాళ్లు ఉంటే  స్టాండ్ అప్.. అని అరిచింది... నేను మెల్లిగా లేచాను నాతో  పాటు ఒక్కకోడు లేస్తున్నాడు ఆలా 6 మంది అయ్యాం... ఇక మేడం shame less fellows  సిగ్గు లేదారా  ఎన్ని సార్లు చెప్పాలి మీకు బైటికి వెళ్లి నిల్చొండి. అపుడు అయినా సిగ్గు వస్తది... అంటే మేము మెల్లిగా బైటికి వెళ్లి ముచ్చట్లు పెడ్తున్నాం... అమ్మాయిలు ఏమో నవ్వుతున్నారు... నేను మొఖం దాచుకొని ఇలా అయ్యింది ఏంటి రా దేవుడా అనుకుంటూ ఉంటే మా ఫ్రెండ్ గాడు ఏమో నవ్వుతున్నాడు..ఆలా క్లాస్ అయిపోయేదాకా బయటే ఉన్నాం.. ఆలా క్లాస్ అయిపోయింది మేడం వెళ్తు వెళ్తు మా దగ్గరికి వచ్చి రేపు కూడా హోమ్ వర్క్ చేయకపోతే స్కూల్ లో రౌండ్స్ వేపిస్తా... వెళ్ళండి ఇడియట్స్...
హమ్మయ్య అనుకుంటూ క్లాస్ లోపలకి వచ్చి కూర్చున్నాం... ఆలా పిరియడ్స్ అన్ని అయ్యాయి లంచ్ టైం అయ్యింది. ఇక అందరం చేతులు కడుకొని లంచ్ బాక్స్ లు ఓపెన్ చేసి తింటూ ఉన్నాం గర్ల్స్ అందరూ ఒక వైపు..  బాయ్స్ అందరూ ఒక వైపు.. ఇందులో ఒకరి గురించి చెప్పాలి మీకు.. వాడి పేరు వెంకటేష్..  పొట్టి గా ఉంటాడు కానీ క్లాస్ లో టాప్ వాడే.. ఊరికే అన్నారా పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అని.. వాడు ఎం చేస్తాడు అంటే
ఎవరి దగ్గర అయితే మంచి కర్రీస్ వాడికి ఇష్టం అయినవి ఉంటాయో అవి కొంచము కొంచము తెచ్చుకొని వాడు తిని మాకు తినిపిస్తాడు ఒక్కో ముద్ద... ఆలా అందరం తింటూ జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిచిపోయింది... దాని తరువాత మళ్ళీ క్లాస్సేస్ స్టార్ట్ అయ్యాయి.. అది సోషల్ పీరియడ్ మా మేడం క్లాస్ చెప్తూ మధ్యలో ఎవరైనా వరల్డ్ మ్యాప్ డ్రా చేసుకొని తీసుకురండి క్లాస్ లో పెట్టుదాం అని అంది... అపుడు మా ఫ్రెండ్ గాడు రేయ్ డ్రాయింగ్ అంట రా నువ్ చేయి రా బాగుంటది.. అని చెప్తే నేను కూడా అలోచించి ఎలాగో నా సౌందర్య ఉంది కదా... తన ముందు కూడా కొంచము వేల్యూ ఉంటది అని లేచి మేడం చేసుకుని వస్తా అని చెప్పా... గుడ్ తేజ.. అనేసరికి అందరు నా వైపు చూసారు ఎవడ్రా వీడు అని అప్పుడు చూసింది నా వైపు నా హ.. హ. హాసిని... ❤️
Like Reply


Messages In This Thread
RE: హా.. హా.. హాసిని...! - by Rishithejabsj - 27-10-2023, 09:16 AM



Users browsing this thread: 1 Guest(s)