Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"సరిగా పెట్టండి"
#2
"అబ్బా ఏంటా పెట్టడం, సరిగా పెట్టండి"

"ఆ"

"అరే మళ్ళీ పక్కకి పోతోంది, నిలవట్లేదు, సరిగా పెట్టండి, నేను కాస్త జరుగుతాను, మీకు చోటు వస్తుంది"

"ఆ"

"ఆ ఆ అంటున్నారు, సరిగా పెట్టట్లేదు, జారిపోతోంది, ఏమైంది మీకీసారి"

"ఏమో ఈసారి నాకు సరిగా రావట్లేదు, ఏం చెయ్యను"

"కొత్తా ఏంటిది మీకు, దేని గురించో ఆలోచిస్తూ ఉంటే ఇలానే అవుతుంది, సరిగా పెట్టండి"

"ఆ"

"మన వీధి చివర సుబ్బారావు గారు బాగా పెడతారుట, మీకేమో జారిపోతోంది"

"ఎవరు చెప్పారు"

"ఇంకెవరు చెప్తారు, ఆయన భార్య మంజు చెప్పింది, నిన్న మనింటికి వచ్చింది, చెప్పింది"

"మీ అమ్మలక్కలు ఇలాంటివి కూడా మాట్లాడుకుంటారా"

"మరి మా మగాళ్ళ లాగా మేము ఉద్యోగాలు వెలగబెట్టట్లేదు కదా, కబుర్లు చెప్పుకుంటాం మరి"

"ఉద్యోగం చేస్తే నువ్వు కందిపోతావు, రోజు అయ్యేసరికి వాడిపోతావని ఒద్దన్నా, నీకు తెలుసు కదా"

"అబ్బో పెళ్ళాం మీద ప్రేమ కారిపోతోంది"

"నీ మీద నాకు ఎంత ప్రేముందో నీకు తెలిదా డియర్"

"డియర్ లేదు, డ్రాయర్ లేదు. ముందు పని చూడండి, పెట్టండి, టైం అయిపోతోంది. సాయంత్రం అయితే మళ్ళీ పిల్లలొస్తారు"

"ఎందుకో ఈసారి నువ్వు అనుకున్నట్టు పెట్టడం కుదరట్లేదు డియర్"

"అదే వస్తుంది, కానివ్వండి, పెట్టండి"

"ఆ"

"అదీ ఇప్పుడు బాగుంది, బాగా పెట్టారు, నాకు తెలుసు మీరు బాగా పెట్టగలరు, కాస్త ముందుకి తోయాలంతే"

"ఇక చాలు డియర్, నాకు ఆఫీస్ పనుంది"

"పెళ్ళాం పని కన్నా ఆఫీస్ పని ముఖ్యమా మీకు"

"నిజంగా పని ఉంది డియర్"

"మీరు పెట్టకపోతే, సుబ్బారావు గారిని పిలుస్తా"

"ఎందుకు"

"ఇంకెందుకు, వచ్చి పెడతారు, అందుకు"

"ఆయన్ని పెట్టమని అడుగుతావా, ఛీ ఛీ"

"ఎందుకు ఛీ, మరి ఇంట్లో మొగుడికి పెట్టడం రాకపోతే, నా తిప్పలు నేను పడాలి కదా, మీ కన్నా పెద్దగా ఉంటారు, పెద్ద చేతులు, అన్నీ చక్కగా పట్టుకుంటారుట, ఓపిక ఎక్కువట"

"ఆయనవి పెద్దవని నీకెలా తెలుసు"

"వాళ్ళావిడ మంజు చెప్పింది ఇవన్నీ"

"ఛీ ఛీ, మీకు సిగ్గు లేదసలు, ఇలాంటివన్ని మాట్లాడుకుంటారా, మా ఆయనవి పెద్దవి, అన్నీ బాగా పట్టుకుంటాడు అని"

"మొన్నే పరిచయం అయినా క్లోజ్ అయ్యాము, అన్నీ మాట్లాడుకుంటున్నాము"

"అబ్బో"

"మాటలు ఆపి పని చూడండి, పెట్టండి"

"అయినా నువ్వు పిలిస్తే వస్తాడా ఏంటి"

"మనసు కూడా పెద్దదే, మంజు చెప్పింది, తప్పకుండా వస్తారు, నాకు తెలుసు"

"అబ్బో"

"నేనంటే ఆయనకి ఒక ఇది ఉందని నాకు తెలుసు"

"అబ్బో"

"నిన్న మార్కెట్ నించి వస్తూ, నన్ను చూసి నవ్వుతూ వెళ్ళారు. ఏవైనా మంజు అదృష్టవంతురాలు, ఏం పెట్టమంటే అది పెడతారట, ఎప్పుడూ కాదు అనరుట. మీరూ ఉన్నారు ఎందుకు, ఎప్పుడు చూడు, ఆఫీస్ పని అంటూ తప్పించుకుంటారు"

"నీ మొగుడు ఆఫీసర్, అతను అసిస్టెంట్. ఆఫీసర్ అన్నాక, మరి పని ఉంటుంది"

"అవన్నీ నాకు తెలీదు. నా మొగుడు మహరాజు అయినా సరే, నేను చెప్పింది చెయ్యాలి, పెట్టమన్నది పెట్టాలి"

"నేను పెట్టను"

"సుబ్బారావు గారికి ఫోన్ చెయ్యానా అయితే, మంజు తన నెంబర్, సుబ్బారావు గారి నెంబర్ కూడా ఇచ్చింది"

"ఛీ ఛీ ఆపు"

"పెట్టండి అయితే, బాగా పెట్టండి, మొత్తం అయ్యేదాకా పెట్టండి"

"నువ్వెక్కడికి"

"కింద ఇంకో పెద్ద గిన్నె పిండి కలిపాను, అవి కూడా పెట్టాలి"

"ఇన్ని వడియాలా???"

"అవును, మీ వాళ్లకి, మా వాళ్ళకి, అందరికి ఇవ్వాలి... నేనేళ్ళి పిండిని బాగా కలిపి తెస్తాను, అవి కూడా పెడుదురుగాని, నేను వెళ్ళానని సిగరెట్ ముట్టించకుండా ఆ గిన్నె పిండి మొత్తం గుండ్రంగా, బాగా పెట్టండి"


ఇదీ వడియాలు పెట్టే కథ Big Grin
Like Reply


Messages In This Thread
RE: "సరిగా పెట్టండి" - by earthman - 14-10-2023, 09:33 PM



Users browsing this thread: 1 Guest(s)