Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మేడమ్ : వన్ ఇయర్ సాలరీని సంక్రాంతి కానుకగా అంటే మాటలా ...... యాహూ యాహూ ...... బుజ్జిజానకికి బోలెడన్ని అందమైన గిఫ్ట్స్ ఇచ్చేస్తాను , వెంటనే విజయవాడ లోని నా స్నేహితురాలితో సంతోషాన్ని పంచుకోవాలి అది నాకంటే లేజీ , ఇప్పటికైనా తెలుసుకుందో లేదో అంటూ కాల్ చేశారు .
" హలో మై ఫ్రెండ్ ఎలా ఉన్నావు ? అంటూ సంతోషంతో అడిగారు" 
మేడమ్ ఫ్రెండ్ : ఏంటి మేడమ్ గారు ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు ఏంటి విషయం .
మేడమ్ : నాకు తెలిసే నువ్వునాకంటే లేజీ అని , క్షేమసమాచారాలు తరువాత మాట్లాడుకుందాము అర్జెంట్ గా వెళ్ళాలి , ఒసేయ్ ..... సంక్రాంతి కానుకగా వన్ ఇయర్ సాలరీ ఇచ్చారు .
మేడమ్ ఫ్రెండ్ : ఎవరు ? .
మేడమ్ : ఇంకెవరు ఇస్తారే govt .....
మేడమ్ ఫ్రెండ్ : ఏంటీ మన govt .... వన్ ఇయర్ సాలరీ బోనస్ , జోక్స్ వెయ్యడానికి నేనే దొరికానేoటే ..... చాలా పనులున్నాయి ఆయన పిల్లలు వచ్చారు వెంటనే వంట చెయ్యాలి .
మేడమ్ : నిజమే ఒకసారి చూసుకో .....
మేడమ్ ఫ్రెండ్ : చూసుకున్నాను ...... నథింగ్ , అయినా మా జిల్లాలోనే కాదు కొన్ని జిల్లాలలో ఈ మంత్ సాలరీనే పడలేదే - నాకే కాదు మా వారికి కూడా పడలేదు , నెల నెలా సాలరీలు ఇవ్వడానికే డబ్బులు లేవక్కడ , వన్ ఇయర్ సాలరీ బోనస్ ఇచ్చారట దీనికి - కల ఏమైనా కన్నావా ఏమిటి ? , ఫోన్ పెడతావా లేక అక్కడకు వచ్చి నీ పీక పిసికెయ్యమంటావా ? ...... నాకొస్తున్న కోపానికి .....
మేడమ్ : కూల్ కూల్ వే అంత కోపం దేనికి ? .
మేడమ్ ఫ్రెండ్ : జీతాలు సరిగ్గా వస్తే చాలయ్యింది ఇది వన్ ఇయర్ బోనస్ అంటూ ఆటపట్టించడానికి కాల్ చేసింది .
మేడమ్ : ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లున్నావు తరువాత కాల్ చేస్తాను .
మేడమ్ ఫ్రెండ్ : నీకు సాలరీ పడింది మాట్లాడుతావే , సాలరీ గురించి వదిలెయ్యి బాబు ఎలా ఉన్నాడు ? .
మేడమ్ : బాగున్నాడు .
మేడమ్ ఫ్రెండ్ : నీకిష్టమైన పాపను కనేది ఉందా లేక .....
మేడమ్ : గుర్తుచేయ్యకే కన్నీళ్లు వచ్చేస్తాయి , ఒక్కడే చాలు అంటాడు ఎంత చెప్పినా ఒప్పుకోవడం లేదు .
మేడమ్ ఫ్రెండ్ : మీ ఆయన నిర్ణయంలో మార్పు రావాలని కనక దుర్గమ్మను ప్రార్ధిస్తాను .
మేడమ్ : థాంక్యూ సో మచ్ మై ఫ్రెండ్ , బాబు - పాప ..... ఈ జీవితాన్ని హ్యాపీగా పూర్తిచేస్తాను , పిల్లలు ఎలా ఉన్నారు ? .
మేడమ్ ఫ్రెండ్ : అల్లరే అల్లరి ..... అంటూ నవ్వుకున్నారు .
మేడమ్ : ఎంజాయ్ వే , ప్రేమతో చూసుకునే భర్త - అల్లరి చేసే పిల్లలు , సరేనే వెళ్ళాలి బై బై ..... అంటూ కట్ చేశారు . అవును రాష్ట్రమంతా పూర్తిగా సాలరీనే పడలేదు బోనస్ అంటే కోప్పడక ఏమిచేస్తారు - వాళ్ళ జిల్లాలో పడలేదేమో నా స్కూల్ కొలీగ్ కు కాల్ చేస్తాను ..... , " హలో మేడమ్ ...... సాలరీ ....." 
మేడమ్ కొలీగ్ : మీకు వారం ముందే పడితే మిగతా సగం మందికి ఈరోజే పడ్డాయి మేడమ్ , ఇప్పుడు కాస్త ఊపిరి ఆడుతోంది , EMI లు - బిల్లులు ...... ఒకటి తరువాత ఒకటి మీదపడుతుంటే నరకం కనిపించింది అనుకోండి , అడిగినందుకు థాంక్స్ మేడమ్ ......
మేడమ్ : సరే మేడమ్ సంతోషం ఉంటాను అంటూ కట్ చేశారు , సాలరీనే ఇప్పుడు పడింది ఇక బోనస్ ...... అంటే నాకు మాత్రమే అంటే అంటే ..... మహేష్ .....

అంటీ అంటీ ...... ఒక్క నిమిషం అన్నారు 10 నిమిషాలు అయ్యింది అంటూ అమ్మకూచీ లోపలికివెళ్లింది , అంటీ అంటీ ......
మేడమ్ : తేరుకుని , బుజ్జిజానకీ .....
బుజ్జిజానకి : ఏమైంది అంటీ ..... ఏదో ఆలోచిస్తున్నారు  .
మేడమ్ : నథింగ్ నథింగ్ పదా వెళదాము , దేవుడు ఎక్కడ ఉన్నాడు ? .
బుజ్జిజానకి : దేవుడా ? ..... కొత్త పిలుపుకు ఆశ్చర్యపోయింది .
మేడమ్ : నీ మరియు నీ చుట్టూ ఉన్నవాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేస్తున్న బుజ్జి దేవుడు మహేష్ ఎక్కడ అని ......
బుజ్జిజానకి : సిగ్గుపడి మేడమ్ గుండెలపైకి చేరింది .
మేడమ్ : ఎంత సిగ్గుపడినా తప్పులేదు బంగారూ ...... , నిజంగా నీసంతోషం కోసం వచ్చిన దేవుడేరా అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు , ఇంతకూ ఎక్కడ నీ దేవుడు ? .
బుజ్జిజానకి : పులకించి బయట అంటీ ...... , ఏమీ ఎరుగనట్లు అందరి సంతోషాలను ఆస్వాధిస్తున్నాడు .
మేడమ్ : వెంటనే చూడాలి పదపదా అంటూ బయటకువచ్చి , గుమ్మం దగ్గరే ఆగిపోయి నావైపే కొత్తగా ఆరాధనతో చూస్తున్నారు .
బుజ్జిజానకి : నవ్వుకుని , అమ్మో నాకంటే ఎక్కువ ప్రేమతో చూస్తున్నారు అంటే ఏదో అంతులేని ఆనందాన్నే నా అంటీకి పంచినట్లున్నాడు , ఏమిటబ్బా ...... ? .
మేడమ్ : మా బంగారం కంటే ఎక్కువ ప్రేమతో ఎవరూ చూడలేరులే , ఉదయమంతా ఏమిచేసావో అమ్మ చెప్పిందిలే ...... , కొట్టావాట - గిల్లేసావట - కొరికేశావట ...... పాపం వొళ్ళంతా పంటి గాట్లు .....
బుజ్జిజానకి : సిగ్గుపడి , ఫీల్ అవ్వకండి ప్రతీ పంటి గాటుపై ప్రేమతో బోలెడన్ని ముద్దులుకూడా ......
మేడమ్ : ఆ ఆ ..... ఇది తెలుసుకోవాలనే కవ్వించాను .
బుజ్జిజానకి : పో అంటీ అంటూ మేడమ్ బుగ్గపై ముద్దుపెట్టి పరుగున దేవతల గుండెలపైకి చేరి నవ్వుతోంది .
మేడమ్ : మా బంగారం అంటూ నావైపే చూస్తూ దిష్టి తీసి ఆనందిస్తున్నారు .

అక్కయ్యలు : అంటీ వచ్చారా ? , మొదట కళ్ళకు గంతలు కట్టుకోవాల్సినది మీరే ......
మేడమ్ : నేనా ? .
బుజ్జిజానకి : నేను - అక్కయ్యలం మధ్యాహ్నం కట్టేసుకున్నాము , ఇక మిగిలినది మీరు - అత్తయ్యలు - దేవతమ్మ - అమ్మమ్మ ...... , అందరూ కలిసి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు .
మేడమ్ : అక్కయ్యలు సెలెక్ట్ చేశారంటే అంతకంటే ఆనందం ఏముంది ? , ఇంతకూ రూల్స్ ఏంటి ? .
బుజ్జిజానకి - అక్కయ్యలు : టచ్ చేస్తే కాదు గట్టిగా పట్టేసుకోవాలి , చివరగా ఎవరిని పట్టుకుంటే వారే ఔట్ .
అంటీలు : పట్టేసుకోవడం ok కానీ చివరన ఔట్ రూల్ ఫస్ట్ టైం వింటున్నాము , చిన్నప్పుడు ఆడింది ఎలాగో అలాగే ఆడుదాము , మొదట ఎవరిని పట్టేసుకుంటే వారే ఔట్ ......
బుజ్జిజానకి : దేవతలు ఎలా అంటే అలా అంటూ మధ్యాహ్నం కొత్త రూల్ పెట్టిన పెద్దమ్మ వైపు చుర చురమంటూ చూసారు .
పెద్దమ్మ : మీకోసమే ..... ఎంజాయ్ చేశారా లేదా తల్లులూ ? .
ఫుల్ గా అంటూ పెద్దమ్మను చుట్టూహత్తుకుని ముద్దులు కురిపించారు అమ్మకూచీ - అక్కయ్యలు ...... , అంటీ రండి రండి అంటూ కర్చీఫ్ తీసుకొచ్చి కళ్ళకు గంతలు కట్టారు .
మేడమ్ : ఇంతకూ మన బుజ్జిదేవుడు ఆటలో ఉన్నాడా లేదా ? .
బుజ్జిజానకి - అక్కయ్యలు : ఎందుకలా అడిగారు అంటీ ...... , మహేష్ లేకుండా ఎలా ఆడుతాము - అత్తయ్యలు కూడా ok అన్నారు .
మేడమ్ : లేదు అమాయకుడిలా దూరంగా నిలబడి ఉంటేనూ ......
బుజ్జిజానకి : కళ్ళకు గంతలు కట్టాము కదా ......
మేడమ్ నవ్వులు ......
అక్కయ్యలు : అంటే కనిపిస్తోందన్నమాట మోసం మోసం .....
మేడమ్ : కట్టుకుంది నేనైతే కాదు అంటూనవ్వుతున్నారు .
ఇప్పుడు చూడండి అంటూ చిమ్మ చీకటిలా జాగ్రత్తగా కట్టారు .
మేడమ్ : అమ్మో మొత్తం చీకటి ..... 
ఇప్పుడు పట్టుకోండి అంటూ చుట్టూ తిప్పి వదిలి , అంటీ - అంటీ - చెల్లీ - చెల్లీ ..... అంటూ పిలుస్తూ కవ్విస్తున్నారు , మధ్యమధ్యలో ముద్దులుపెడుతున్నారు .
మేడమ్ : బుజ్జిజానకి ముద్దు - వాగ్దేవి ముద్దు - అక్కయ్య ముద్దు ..... ప్చ్ ప్చ్ ప్చ్ దొరకడం లేదే ..... , అందరూ ముద్దులుపెడుతున్నారు కానీ ఒకరు మాత్రం ప్చ్ ప్చ్ ......
ఎవరో తెలుసులే అంటీ , దేవతలు ఉండగా అంత ధైర్యం చేయలేడు పాపం , మహేష్ ముద్దు నేను పెడతాను కదా అంటూ బుగ్గపై కొరికేసింది బుజ్జిజానకి ......
మేడమ్ : స్స్స్ ......
బుజ్జిజానకి : మహేష్ ముద్దు ఇలానే ఉంటుంది మరి తెలుసుకదా ......
మేడమ్ పెదాలపై నవ్వులు ...... 
బుజ్జిజానకి : అంటీ ..... గైడ్ చేస్తాను వెళ్లి అత్తయ్యలను పట్టేసుకోండి , దేవతలకు ముద్దులుపెట్టాలన్నదే మహేష్ కోరిక ...... 
మేడమ్ : లవ్ టు బంగారూ ..... , అమ్మకూచీ గుసగుసలతో వెళ్లి సునీత అంటీని కాంపౌండ్ కార్నర్ కు చేసి పట్టేసుకుని ఔట్ ఔట్ ఔట్ అంటూ కేకలువేస్తున్నారు .

బుజ్జిజానకి : అత్తయ్యలు ఔట్ ముగ్గురు అత్తయ్యలూ ఔట్ ......
అవునవును ముగ్గురు అమ్మలూ ఔట్ ..... అంటూ వంత పాడారు అక్కయ్యలు .
ఔట్ అయ్యింది సునీత ఒక్కటే కదా ..... అన్నారు పెద్దమ్మ .
బుజ్జిజానకి : మాకైతే ముగ్గురు అత్తయ్యలూ ఒక్కటే , ఒక్కరు ఔట్ అయినా ముగ్గురూ ఔట్ అయినట్లే - ఒక్కరు గెలిచినా ముగ్గురూ గెలిచినట్లే ......
సంతోషంతో గట్టిగా ఈల వేసాను .
అంటీలు : లవ్ యు బుజ్జితల్లీ కాదు కాదు జానకీ అంటూ ఒకేసారి అమ్మకూచీ బుగ్గలపై - నుదుటిపై ముద్దులుపెట్టారు .
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ అత్తయ్యలూ అంటూ ముగ్గురినీ చుట్టేసింది .
అంటీలు : మేము ఔట్ అయ్యామని విజిల్ వేశావు కదూ ...... , అయినా నీకేంటి అంత సంతోషం ......
అక్కయ్యలు : మీ కళ్ళకు గంతలు ఏమైనా చేసుకోవచ్చుకదా ...... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అంటీలు : తల్లులూ ...... ఏమిటో అన్నారు ? .
అక్కయ్యలు : నథింగ్ నథింగ్ అమ్మలూ ..... నావైపు కన్నుకొట్టి నవ్వుకుంటున్నారు .
అంటీలు : నో నో నో ..... ఆ అల్లరి పిల్లాడు ఆటలో ఉండగా కళ్ళకు గంతలు కట్టుకోమంటే కట్టుకోము .
బుజ్జిజానకి : మా అత్తయ్యలు ఎలా అంటే అలా ..... , మహేష్ నిన్ను గేమ్ నుండి తీసేసాము దూరంగా వెళ్లు - బుద్ధిగా కాంపౌండ్ మీద కూర్చో మేము మళ్లీ చెప్పేంతవరకూ కిందకు దిగకూడదు అంటూ కన్ను కొట్టింది .
ప్చ్ ప్చ్ అంటూ కాంపౌండ్ పైకెక్కాను - పెద్దమ్మా అంటూ ఆశతో చూసాను .
పెద్దమ్మ : నేనున్నానుకదా ......
లవ్ యు పెద్దమ్మా అంటూ మనసులో బోలెడన్ని ముద్దులు కురిపించాను .
పెద్దమ్మ : బుగ్గలపై - పెదాలపై తడుముకుని మురిసిపోతున్నారు .

అంటీలు : లవ్ యు లవ్ యు లవ్ యు జానకీ ...... , ఈ అత్తయ్యలంటే ప్రాణం , ఆ అల్లరి పిల్లాడు కోతికొమ్మచ్చిలా పైన ఉన్నాడు కాబట్టి మేము సిద్ధం , ఇక కళ్ళకు గంతలు కట్టెయ్యండి .
కోతికొమ్మచ్చిలానా ...... అంటూ బుంగమూతిపెట్టుకోవడం చూసి దేవతలు నవ్వుకున్నారు , బుజ్జిజానకి - అక్కయ్యలు ...... ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , అంటీలు ముగ్గురికీ గంటలుకట్టి కనిపించడం లేదుకదా అంటూ టెస్ట్ చేశారు , లెట్స్ స్టార్ట్ అత్తయ్యలూ - అమ్మలూ ..... అంటూ చుట్టూ తిప్పి వదిలారు .
ముగ్గురు దేవతలూ మూడువైపులా వెళ్లడం చూసి అందరూ నవ్వుకున్నారు , అత్తయ్యలూ - అక్కయ్యలూ - చెల్లెళ్ళూ - అమ్మలూ ..... అంటూ వీపుపై తాకుతూ కవ్విస్తున్నారు .
అత్తయ్యలు : జానకీ - చెల్లీ - అక్కయ్యా - తల్లులూ ..... పట్టేస్తాము ఇక్కడ ఉన్నారు కదూ ..... ప్చ్ ప్చ్ ప్చ్ .....
అక్కడ కాదు ఇక్కడ అంటూ అమ్మకూచీ మొదలుకుని అందరూ ముద్దులుపెడుతున్నారు . 
గోడపైనుండే ఎంజాయ్ చేస్తున్నాను .
అంటీలు : ముద్దులుపెట్టి భలేగా తప్పించుకుంటున్నారే ....... , జానకి ముద్దు - అక్కయ్య ముద్దు - తల్లుల ముద్దు - చెల్లి ముద్దు ..... మరొక ముద్దు ఎవరిది ఎవరిది కొంపదీసి అంటూ కోపంతో గంతలు కిందకు జార్చేసి చుట్టూ చూసి నావైపుకు తిరిగారు , గోడపైననే ఉన్నాడే మరి చివరి బుజ్జి పెదాల ముద్దు ఎవరిది ?.
బుజ్జిజానకి : అయ్యో అత్తయ్యలూ ..... ఆ బుజ్జిపెదాలు మరెవరివో కాదు అమ్మమ్మ ఎత్తుకున్న బాబువి ......
అమ్మలూ ..... ఇలా ఆట మధ్యలో గంతలు విప్పడం మోసం .....
అంటీలు : లవ్ యు లవ్ యు లవ్ యు జానకీ - తల్లులూ ...... మళ్లీ గంతలు కట్టండి గట్టిగానే కట్టండి .
అక్కయ్యలు : ఈసారి విప్పారో బాగోదు .....
అంటీలు : లేదు లేదు లేదు ...... 
గంతలు గట్టిగా కట్టి తిప్పి వదిలారు , తాకుతూ కవ్విస్తున్నారు  ......

బుజ్జిజానకి : హలో హీరో ...... నీ దేవతలకు ముద్దులుపెట్టాలని లేదా ? .
లవ్ టు లవ్ టు అమ్మకూచీ అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు .....
బుజ్జిజానకి : మళ్లీ ఇలాంటి అవకాశం రాదు , రామరి .....
అమ్మో ఇంకేమైనా ఉందా ..... ? , తెలిస్తే ముగ్గురు దేవతలూ మూడో కన్ను తెరిచినా తెరిచేస్తారు , పైగా ఆక్ ..... లు ఉన్నారు .
బుజ్జిజానకి : ప్లాన్ చేసినదే అక్కయ్యలు .....
ఊహూ ఆక్ ..... చూస్తుండగా నావల్ల కాదు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ......
అంతే ముగ్గురు అక్కయ్యలూ అటువైపుకు తిరిగి కళ్ళు మూసుకున్నారు .
బుజ్జిజానకి : నా పెదాలపై చిరునవ్వులను చూసి కిందకు లాగింది .
మరి మేడమ్ - పెద్ద .... దేవతమ్మ ? .
మేడమ్ : All the best మహేష్ , గో గో ......
స్వీట్ షాక్ ...... , పెద్దమ్మ ఫ్లైయింగ్ కిస్ ..... , అమ్మమ్మ నవ్వులు ..... , yes yes yes అంటూ వెళ్లి అమ్మకూచీ వరుసగా ముద్దుపెట్టగానే నా ప్రియమైన దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి , యాహూ యాహూ యాహూ ..... పరుగున గోడపైకి చేరాను .
అంటీలకు అనుమానం వచ్చినట్లు తీద్దామా వద్దా అన్న ఆలోచనలో నేను గోడపైకి చేరిపోయాను , అంటీలు మళ్లీ గంతలు లాగేసి చూస్తున్నారు .
బుజ్జిజానకీ - ఆక్ .... - మేడమ్ ...... మళ్లీ మళ్లీ గంతలు తీసేసారు అంటూ ఏమీ ఎరుగనట్లు అమాయకంగా చూయించాను .
అమ్మకూచీతోపాటు అందరూ నవ్వుకుని , అత్తయ్యలూ - అమ్మలూ ...... మోసం మోసం అంటూ వెళ్లి బుగ్గలపై - చేతులపై గిల్లేసారు .
అంటీలు : స్స్స్ స్స్స్ స్స్స్ ...... అదీ అదీ ఆ అల్లరి పిల్లాడు ముద్దులుపెట్టినట్లు అనిపించి ......
అవునా అంటీలూ ...... నా ముద్దులు ఎలా ఉన్నాయి ? అని అడిగాను .
అంటీలు : నువ్వు గోడపై ఉండగా ముద్దులు ఎలా ? , ముద్దులే పెట్టనప్పుడు ఎలా ఉన్నాయో ఎలా చెప్పగలం ? .
బుజ్జిజానకి : ఆ అల్లరి పిల్లాడి గురించి వదిలెయ్యండి , నా తరువాత పెట్టిన బాబు ముద్దులు ఎలా ఉన్నాయి అత్తయ్యలూ ...... ? అంటూ నావైపు కన్ను కొట్టింది .
అంటీలు : మా జానకికి నిజం చెప్పాలి కాబట్టి , నీతో మొదలుకుని మీ అందరి ముద్దులకంటే తియ్యదనం - ప్రేమ  హాయిగా అనిపించింది .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ......
దేవతలకు కనిపించకుండా ఎంజాయ్ చేస్తున్నాను , బుజ్జిజానకీ ...... ఎందుకో తెలియదు డాన్స్ చెయ్యాలనిపిస్తోంది , పర్మిషన్ ఇస్తే ......
బుజ్జిజానకి : అత్తయ్యలూ ...... నాకు డాన్స్ చూడాలని ఉంది .
పెద్దమ్మ : నువ్వు కోరాడమూ నీ అత్తయ్యలు కాదనడమూనా మహేష్ కూచీ .....

అంతే పైనుండి జంప్ చేసి సాంగ్ అని అరవగానే నాటు నాటు పెద్దగా ప్లే అవ్వడంతో అచ్చుగుద్దినట్లు అలాగే స్టెప్స్ వేసాను .
Wow wow సూపర్ అంటూ అందరితోపాటు అత్తయ్యలూ ఎంజాయ్ చేసినట్లు చప్పట్లు - ఈలలు ......
థాంక్యూ థాంక్యూ అల్ అంటూ సిగ్గుపడ్డాను .
అమ్మకూచీ - అక్కయ్యలు వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు , అమ్మకూచీతోపాటు అక్కయ్యలు ముద్దులుపెట్టబోతే .......
నో నో నో ..... sorry అంటీలు అంటూ గుంజీలు తియ్యడం మొదలెట్టాను .
అంటీలు : మొదలెట్టేసాడు .......
అందరూ నవ్వుకున్నారు .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 27-03-2024, 11:40 AM



Users browsing this thread: 2 Guest(s)