Thread Rating:
  • 25 Vote(s) - 3.04 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మహేష్ - తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... తీసుకో అంటూ అమ్మకూచీ - అక్కయ్యలు ..... బజ్జీలు తీసుకొచ్చారు .
లవ్ ..... థాంక్యూ అమ్మకూచీ , అచ్చు అమ్మలానే ఉన్నావు అమ్మకూచీ ......
బుజ్జిజానకి : నీవల్లనే అమ్మలా రెండోసారి ......
నావల్ల ఏంటి ? , గిఫ్ట్స్ తెచ్చినది దేవతలైతేనూ .......
బుజ్జిజానకి : అక్కయ్యలు అంతా చెప్పారులే .....
చెప్పినంత మాత్రాన నావల్లనే అయిపోతోందా ? , దేవతలు ఎంతో ప్రేమతో తీసుకొస్తేనూ ......
బుజ్జిజానకి : సరే సరే నీకు ఏది ఆనందం పంచితే అదే అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .
అఅహ్హ్హ్ ...... అంటూ హృదయంపై చేతినివేసుకుని , వెనక్కు పడిపోబోతే అక్కయ్యలు పట్టేసుకుని హమ్మయ్యా అనుకున్నారు .
నో నో నో స్ట్రేంజర్స్ వదిలెయ్యండి వదిలెయ్యండి .
అక్కయ్యలు : స్ట్రేంజర్స్ ..... అంటూ కోపంతో వదిలేశారు .
కోపంతో వచ్చిన దేవతలు .... మంచిపని చేశారు తల్లులూ అంటూ ముద్దులుపెట్టి సంతోషంతో వెళ్లారు .
గడ్డిలో పడ్డాను సరిపోయింది .
అక్కయ్యలు : మరి స్ట్రేంజర్స్ అంటావా ...... ? .
మహేష్ మహేష్ ....... అంటూ నవ్వుతూ పైకిలేపి , అలా అనవచ్చా అంటూ కొడుతోంది - గిల్లేస్తోంది .
స్స్స్ స్స్స్ ..... , అలా అనగానే నా దేవతల పెదాలపై సంతోషాలను చూశావుకదా ...... , దేవతల సంతోషం కంటే నాకింకేమీ అవసరం లేదు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ..... కాస్త పైనుండి వదలాల్సింది .
అక్కయ్యలు : పర్లేదులే చెల్లీ ...... , మొదటి రోజు నుండీ పాడుతున్న పాటే కదా , అమ్మలూ అమ్మలూ అమ్మలూ ...... మాకూ ఒకరోజు వస్తుంది , అప్పుడు అంతులేని ప్రేమను పంచుతాము .
బుజ్జిజానకి : విన్నావా దేవుడా ...... ? .
దేవతల ప్రేమ తప్ప వేరొకటి కనిపించనే కనిపించదు .
అక్కయ్యలు కోపంతో గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ......
అంటీలు : అల్లరి చేస్తున్నాడా ? , అదీ అలా గిల్లేయ్యండి .

నేనేమీ మాట్లాడటం లేదు దేవతలూ ..... , అయినా సరే అంటూ లెంపలేసుకుని గుంజీలు తీస్తున్నాను .
అంటీలు : ఫస్ట్ గుంజీలు మొదలుపెట్టేస్తాడు , ఇప్పటికే వెయ్యి గుంజీలు తీయించామని బాధగా ఉంది .
బుజ్జిజానకి : నాకు తెలుసు అత్తయ్యలూ ..... , అల్లరి పిల్లాడిపై ఎక్కడో ప్రేమ ఉంది .
అంటీలు : ష్ ష్ ష్ జానకీ ..... , అలాంటిదేమీ లేదు వెయ్యి గుంజీలు తీయించాము అని ఫీల్ అవుతున్నాము , అమ్మా దుర్గమ్మా ..... ఆ అల్లరి పిల్లాడికి ఏమీ కాకూడదు , ఇలా ప్రార్థించానని చెప్పకండి మరింత అల్లరి చేస్తాడు , హలో హీరో .... చాలు చాలు ఆపు .
దేవతలు ఎలా అంటే అలా .......
అందరూ నవ్వుకున్నారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ..... అంటూ ముద్దులుపెట్టి నావైపు కన్నుకొట్టింది .
అఅహ్హ్ ......

మేడమ్ కు కాల్ రావడంతో ప్రక్కకువెళ్లి మాట్లాడారు , కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని రావడం చూసి పెద్దమ్మనే మేడమ్ దగ్గరికి వెళ్లారు , విషయం తెలిసినా చెల్లీ ...... ఏమైంది ? అని అడిగారు .
మేడమ్ : అక్కయ్యా ..... అదీ అదీ .....
పెద్దమ్మ : నాదగ్గర మొహమాటం ఏమిటి చెల్లీ ...... 
మేడమ్ : పెద్దమ్మ చేతిని అందుకుని లోపలికి తీసుకెళ్లారు , అక్కయ్యా ...... అదీ అదీ డిన్నర్ నేను తీసుకురావాల్సింది కదా ..... , అత్తయ్యగారిని అడిగితే సరే అన్నారు అన్నీ ఉదయమే సిద్ధం చేసాము - ఇప్పుడు నేను వెళ్లి వంట చేయాల్సింది - ఈ విషయం తెలుసుకున్న మావారు అనవసరమైన ఖర్చులు అంటూ అత్తయ్య గారిపైనే కోప్పడ్డారట - స్టోర్ రూమ్ లాక్ చేసుకుని వెళ్లిపోయారట - వంట సరుకులన్నీ అందులోనే ఉన్నాయి , ఏమిచెయ్యాలో పాలుపోవడం లేదు అక్కయ్యా ...... , ఇప్పుడేలాగోలా బయటపడితే మన బుజ్జిజానకి కోసం ఉదయం ప్రేమతో వంట చేసుకొస్తాను , నాపై నమ్మకంతో బయట అందరూ అంటూ పెద్దమ్మ గుండెలపైకి చేరారు కన్నీళ్ళతో .......
పెద్దమ్మ : ఈ మగాళ్లు ఎప్పుడూ ఇంతే కొంతమంది మగాళ్లు ...... - చెల్లీ ..... ఈమాత్రం దానికి కన్నీళ్ళుపెడితే ఎలా ..... ? .
మేడమ్ : వారు ఎప్పుడూ ఇలానే అక్కయ్యా , అత్తయ్యగారి మాటకు అదే అమ్మ మాటకు కూడా విలువ ఇవ్వరు .
పెద్దమ్మ : చెల్లీ ...... స్టోర్ రూమ్ లాక్ చేసేసాడు కదా మరి ఉదయం ఎలా క్యారెజీ తీసుకొస్తావు ? .
మేడమ్ : కావాల్సిన సరుకులను ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురమ్మన్నారు అత్తయ్య గారు , ఆయన ఎలాగో ఉదయమే వెళ్ళిపోతారు .....
పెద్దమ్మ : అర్థమైంది చెల్లీ ..... , ఇక డిన్నర్ సంగతి ఈ అక్కయ్య చూసుకుంటుందిలే , ఉదయం మాత్రం నీ వంతు , ఎందుకంటే మా అందరికంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం బుజ్జిజానకికి , నీ చేతి వంట జానకి చేతి వంటతో సమానం అంటూ కన్నీళ్లను తుడిచారు .
మేడమ్ : లవ్ టు లవ్ టు అక్కయ్యా అంటూ సంతోషమైన నవ్వులు ......

ఏంటి అక్కాచెల్లెళ్ళు లోపలికి వచ్చిమరీ సీక్రెట్స్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు , మాకూ చెబితే మేమూ సంతోషిస్తాము కదా అంటూ దేవతలు - అక్కయ్యలు లోపలికివెళ్లారు .
దేవతలను హత్తుకునే ఉన్న అమ్మకూచీ లోపలికి రా అంటూ కన్నుకొట్టింది .
అంత ప్రేమతో పిలిస్తే వెళ్లకుండా ఉంటానా ..... ? , నాకు తెలియకుండానే అడుగులు పడ్డాయి .
అంటీ - దేవతమ్మా ...... మాకు చెప్పకూడదా అంటూ హత్తుకున్నారు అక్కయ్యలు .

పెద్దమ్మ : అలాంటిదేమీ లేదు తల్లులూ మా ప్రాణమే మీరు ...... 
అక్కయ్యలు : అయితే ఆ సీక్రెట్ ఏంటో చెప్పాల్సిందే ......
పెద్దమ్మ : సీక్రెట్ ఏమీ కాదులే తల్లులూ ...... , మీ అమ్ములు ..... షాపింగ్ వెళ్లి ఇదిగో ఇంతటి అందమైన గిఫ్ట్స్ తీసుకొచ్చి జానకిలా మార్చేసి ఫుల్ మార్కులు కొట్టేశారు , మీరే చూడండి అత్తయ్యలూ అత్తయ్యలూ ...... అంటూ వదలకుండా హత్తుకునే ఉంది మీ చెల్లి ......
లవ్ యు అత్తయ్యలూ అంటూ ముద్దులుపెట్టి మురిసిపోతోంది అమ్మకూచీ .....
పెద్దమ్మ : చూసారా ముద్దులన్నీ మీ అమ్మలకే , రేపు మాత్రం జానకి మొత్తం ప్రేమను - మొత్తం ముద్దులను మేము పొందాలని ఫిక్స్ అయిపోయాము .
అక్కయ్యలు : ఎలా ? .
పెద్దమ్మ : మీ అమ్ములు ఎలా అయితే బుట్టలో వేసుకున్నారో అచ్చు అలానే .......
అంటీలు : అంటే మా బుజ్జితల్లికి కాదు కాదు జానకికి బోలెడన్ని గిఫ్ట్స్ రాబోతున్నాయన్నమాట అంటూ సంతోషంతో నుదుటిపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మ : అవును దేవతలూ ...... రేపు నువ్వా ? - నేనా ? చెల్లీ అంటూ అందమైన మేడమ్ గారితో డిస్కస్ చేస్తున్నాను అంతలోనే మీరు వచ్చేసారు , కన్నయ్యా ..... అంటూ కంటి సైగ ద్వారా విషయం తెలియజేసి , చెప్పు చెల్లీ ..... ఆ ముగ్గురు దేవతల కంటే ఎక్కువ గిఫ్ట్స్ నువ్వు తీసుకొస్తావా ? లేక నన్ను తీసుకురమ్మంటావా ? , ముందుగా నువ్వు తెస్తేనే కదా జానకికి మరింత సంతోషం .......
మేడమ్ : అక్కయ్యా ...... అదీ అదీ ఈ నెల సాలరీ మొత్తాన్నీ ఆయన తీసేసుకున్నారు , ఒకటో తారీఖున సాలరీ పడగానే మొత్తం సాలరీతో మా బుజ్జిజానకికి ప్రేమతో గిఫ్ట్స్ తీసుకొస్తాను అంటూ బాధపడుతూ చెప్పారు .
అంటీ ...... గిఫ్ట్స్ కంటే మీ ప్రేమ విలువైనది , ఇన్నాళ్లూ ప్రాణంలా చూసుకున్నది మీరే కదా అంటూ మేడమ్ గుండెలపైకి చేరింది అమ్మకూచీ ......
మేడమ్ : లవ్ యు లవ్ యు సో మచ్ బుజ్జిజానకీ ...... అంటూ ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .

మేడమ్ గారూ ...... మీ ప్రాణమైన బుజ్జిజానకికి గిఫ్ట్స్ తీసుకురావడం ఇష్టంలేదు అని చెప్పండి కానీ సాలరీ వంక చూపి తప్పించుకోవాలని ప్రయత్నించకండి .
మహేష్ ...... అనబోయి ఏదో సర్ప్రైజ్ ఉందని అర్థమై కన్నుకొట్టి నవ్వుతోంది అమ్మకూచీ , కంటిన్యూ కంటిన్యూ దేవుడా అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
అంటీలు : మా చెల్లి అలాంటిది కాదులే అల్లరి పిల్లోడా ..... అంటూ మేడమ్ చుట్టూ చేరారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ అంటూ చెవులలో గుసగుసలాడింది .
అక్కయ్యలకు అర్థమైనట్లు అమ్మకూచీతోపాటు ఆనందిస్తున్నారు .
పెద్దమ్మ : నవ్వుకుని , అవునవును మాట జాగ్రత్త మహేష్ , నువ్వు ..... నీకూచీ జీవితంలోకి వచ్చినది రోజులే కానీ ఊహతెలిసినప్పటి నుండీ ప్రాణంలా చూసుకుంటున్నది మా చెల్లి .......

మేడమ్ గారి ప్రాణం బుజ్జిజానకి అందులో సందేహం లేదు దేవతలూ ...... , మేడమ్ గారి కళ్ళల్లో చెమ్మ చూస్తుంటే విషయమైతే తెలిసినట్లుగా లేదు , తప్పైతే నాదే sorry sorry మేడమ్ అంటూ గుంజీలు తీస్తున్నాను .
అంటీలు : తప్పు ఒప్పుకున్నావుకదా ముందైతే గుంజీలు తియ్యడం ఆపు , ఇప్పటికే వెయ్యి గుంజీలు తీయించినందుకు ఫీల్ అవుతున్నాము .
బుజ్జిజానకి : నాకు తెలుసు అత్తయ్యలూ ......
అంటీలు : జానకీ ..... నువ్వేమి చెప్పబోతున్నావో తెలుసులే , అలా ఏమీ కాదు అంటూ ముద్దుపెట్టి నవ్వించారు .
బుజ్జిజానకి : ఇంతకూ మేడమ్ కు - మాకు కాకుండా నీకు మాత్రమే తెలిసిన ఆ విషయం ఏమిటో చెప్పు .......
మేడమ్ గారికి విషయం తెలియదే అనుకుంటున్నాను .
అంటీ : ఏ విషయం మహేష్ ...... ? .
బుజ్జిజానకి : టెన్షన్ పెట్టకుండా ముందైతే ఆ విషయం చెప్పు మహేష్ అంటూ కన్ను కొట్టింది .
కూల్ కూల్ కూల్ బుజ్జిజానకీ ..... , మేడమ్ అంటే ఎంత ప్రాణమో తెలుసులే , హెడ్ మిస్ట్రెస్ ..... మధ్యాహ్నం నిద్రపట్టక టీవీ చూస్తుంటే న్యూస్ లో చెప్పారు ......
బుజ్జిజానకి : ల్యాగ్ లేకుండా చెబుతావా లేక అంటూ లోలోపలే నవ్వుకుంటూ వచ్చి నాచేతిని చుట్టేసి భుజంపై కొరికేసింది .
స్స్స్ ......
అంటీలు : అదీ అలా కొరికేయ్యి జానకీ అంటూ అమ్మకూచీతో హైఫై కొట్టి ఆనందిస్తున్నారు .
పనిలోపనిగా దేవతలూ అంటూ హైఫై కోసం చేతిని ఉంచాను .
దేవతల కోపం చూసి అమ్మకూచీ - అక్కయ్యలతోపాటు మేడమ్ కూడా నవ్వేశారు .
బుజ్జిజానకి : నవ్వించి మాట మార్చడం కుదరదు చెబుతావా కొరికేయ్యాలా .... ? , న్యూస్ లో ఏమి చెప్పారు ?  .
చెబుతాను చెబుతాను ...... , న్యూస్ లో ఏమి చెప్పారంటే సంక్రాంతి రాబోతున్నందుకు గానూ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఏకంగా సంవత్సరం జీతాన్ని కానుకగా ఇచ్చేసాము .
బుజ్జిజానకి : వన్ ఇయర్ సాలరీ ..... wow అంటీ అంటూ వెళ్లి హత్తుకుంది , అంటీ అంటీ ..... ఓహో స్వీట్ షాక్ లో ఉన్నారా ? .
మేడమ్ : అమ్మకూచీ బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మకూచీని హత్తుకునే చేతిలోని మొబైల్లో అకౌంట్ ఓపెన్ చేసి చూసి , 5 lakhs ...... పట్టరాని ఆనందంతో అమ్మకూచీకి ముద్దుల వర్షం కురిపించి , బుజ్జిజానకీ ...... రేపటి వరకూ ఆగలేకపోతున్నాను షాపింగ్ కు ఇప్పుడే వెళ్లిపోవాలని ఉంది , మన బుజ్జిజానకికి ఎప్పటి నుండో ఎన్నో ఇవ్వాలని ఆశపడ్డాను , ఇప్పటికి అదృష్టం కలిగింది అంటూ పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు .
చెల్లీ చెల్లీ ..... అంటూ దేవతలంతా సంతోషాన్ని పంచుకుని నవ్వుకున్నారు .
ప్చ్ ప్చ్ ...... వన్ ఇయర్ కాకుండా two year బోనస్ ఇచ్చి ఉంటే మరింత బాగుండేది .

మేడమ్ : థాంక్యూ సో సో మచ్ మహేష్ ...... 
నో నో నో నేనే sorry మేడమ్ ......
మేడమ్ : ఏమీ పర్లేదు , గుడ్ న్యూస్ తెలియజేశావు , ఎన్ని గంటల న్యూస్ లో చెప్పారు ? .
టైం తెలియదు మేడమ్ , బుజ్జిజానకి - ఆక్ ..... ప్రాణంలా జోకొడుతూ నిద్రపుచ్చి మీరూ నిద్రపోయారు కదా అప్పుడు ......
బుజ్జిజానకి : అంటే సంతోషంతో ఈ విషయం చెప్పడానికే టీపాయ్ దగ్గరకు వచ్చి చూసి చూసి అలాగే నిద్రపోయావన్నమాట ....... అంటూ కన్ను కొట్టింది .
ఆ ఆ ఆ ...... అవునవును బుజ్జిజానకీ , దేవతలూ ...... ఎందుకు ఎందుకు అని ఆడిగారుకదా అర్థమయ్యిందా ? , ఎన్ని గుంజీలు తీసానో అమ్మా హమ్మా ......
బుజ్జిజానకి : యాక్టింగ్ చెయ్యకు మహేష్ ...... , ఇదే విషయం అప్పుడేందుకు చెప్పలేదు ? .
అదీ అదీ ..... ఆ ఆ , ఎంత కోపంతో అడిగారు దేవతలు , భయపడిపోయాను ఆ సందర్భంలో మైండ్ పనిచెయ్యలేదు .
కవరింగ్ ......
నో నో నో ........
అందరూ నవ్వేశారు .
మేడమ్ : మహేష్ ..... ఇంత గుడ్ న్యూస్ తెలియజేసినందుకు ......
అంటీలు : అంతలా పొగడకు చెల్లీ ...... , మరింత అల్లరి చేస్తాడు .
మేడమ్ : నావైపే దీనంగా - ఆరాధనతో - సంతోషంతో చూసి , అల్లరి చేసినా అందంగా ఉంటుంది అంటూ నవ్వుకున్నారు .
బుజ్జిజానకి : నావైపే ప్రేమతో చూస్తూ మేడమ్ బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుతోంది , అత్తయ్యలూ ...... మధ్యాహ్నం మీరు లేకుండా కళ్ళకు గంతల ఆట ఆదుకున్నాము , మీరు లేకుండా మేమూ ఆడలేము అన్నారు అంటీ - పెద్దమ్మ , ఇప్పుడు అందరం కలిసి ఆడుకుకుందాము .
అంటీలు : మా ముద్దుల జానకి కోరడమూ మేమంతా కాదనడమూనా ..... ? , లవ్ టు బంగారూ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు , లవ్ యు చెల్లీ - అక్కయ్యా ......
లోపల సోఫాలు - టేబుల్స్ అడ్డుగా ఉన్నాయి , మధ్యాహ్నం మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం గమనించాము , బయట కాంపౌండ్ లో ఆడుకుందాము అన్నారు పెద్దమ్మ .
బుజ్జిజానకి - అక్కయ్యలు : యాహూ యాహూ ...... అంటూ దేవతల చేతులను అందుకుని బయటకు నడిచారు , మహేష్ - తమ్ముడూ రా ...... , అంటీ ఆగిపోయారే ......
మేడమ్ : ఒక కాల్ చేసుకుని వచ్చేస్తాను తల్లులూ , వన్ మినిట్ అంతే ......
త్వరగా వచ్చెయ్యండి .
[+] 6 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 27-03-2024, 11:39 AM



Users browsing this thread: 26 Guest(s)