Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
సేట్ గారూ ...... మీరు కొద్దిసేపటి ముందే మారిపోయారు కానీ ఈ అపరాధం మీవల్లనే జరిగిపోయింది మరి .......
సేట్ : ఎలా సరిదిద్దాలో నాకర్థమైపోయింది బాబూ ...... , CI సర్ రండి .
సేట్ గారూ ..... అంకుల్ వాళ్ళ వల్లనే , బెంగళూరు నుండే అమౌంట్ పంపించారు అనే నమ్మించి మన్నింపు కోరుకోవాలి .
సేట్ : మీరెలా అంటే అలా బాబూ .....
CI : ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందని మేడమ్ వాళ్లకు తెలియజేయ్యండి అంటూ లేడీ కానిస్టేబుల్స్ కు ఆర్డర్ వేశారు .

కానిస్టేబుల్స్ : మేడమ్ మేడమ్ ...... ఇక ఇంటి జోలికి ఎవ్వరూ రారు , జేసీబీ లు వెళ్లిపోయాయి , దయచేసి డోర్ తెరవండి , మీరే గెలిచారు .
అంటీవాళ్ళు కిటికీ దగ్గరకువచ్చి బయట మొత్తం చూసి , మమ్మల్ని బయటకు రప్పించడానికి వేసిన ప్లాన్ ......
కానిస్టేబుల్స్ : నో నో నో మేడమ్ - అంటే ఇప్పటివరకూ జరిగినది చూడలేదా మేడమ్ , రౌడీలంతా గజగజవణికిపోతుంటే ఇంకెక్కడి ప్లాన్ , మీకు క్షమాపణ చెప్పడానికి సేట్ మరియు మా CI సర్ వచ్చారు .
సేట్ : అవునండీ ...... , మీ వారు .... నాకివ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసారు ఇదిగోండి ఇంటి పత్రాలు తిరిగివ్వడానికి వచ్చాను , తలుపు తెరవండి .

భయపడుతూనే డోర్ తెరిచారు అంటీవాళ్ళు ......
మమ్మల్ని మన్నించండి , ఆలస్యం అయ్యుంటే దేవాలయం లాంటి ఇంటిని పడగొట్టేసేవాళ్ళం , దేవుడి దయవలన అంటూ నావైపుకు తిరిగిచూసి అలాంటిదేదీ జరగలేదు .
ఊహూ అంటూ సైగచేసాను .
సేట్ : నాతప్పును మన్నించి దేవాలయం లాంటి ఇంటిపత్రాలను తీసుకోండి అంటూ అంటీవాళ్ళ పాదాల ముందు ఉంచి తలదించి చేతులుకట్టుకుని నిలబడ్డాడు .
CI : ఈ అపరాధంలో నా హస్తం కూడా ఉన్నందుకు మన్నించమని కోరుకుంటున్నాను - కానిస్టేబుల్స్ ...... ఇంకా జనాలు ఎందుకున్నారు క్లియర్ చెయ్యండి - ప్రక్కవాళ్ళు బాధపడుతుంటే చూసి ఎంజాయ్ చెయ్యడానికి పనులన్నీ మానుకుని వచ్చేస్తారు - ఇరుగుపొరుగువారు కదా హెల్ప్ చేద్దామని కానీ బాధను పంచుకుందామని కానీ చెయ్యరు - కళ్ళుమూసి తెరిచేలోపు ఉంటే లాఠీలు విరగ్గొట్టoడి .
కానిస్టేబుల్స్ : Yes సర్ ......
సినిమా అయిపోయాక ఇంకెందుకు ఉంటాము అంటూ వెళ్లిపోయారు . 
ఎవరైతే సామానులన్నీ బయటకు విసిరేశారో వాళ్ళ చేతనే క్లీన్ చేయిస్తున్నారు .
సేట్ : CI గారూ ..... నాకిచ్చిన పని ఇంకా పూర్తవ్వలేదు వెళ్ళొస్తాను అనిచెప్పి వెళ్ళాడు .

అంటీ వాళ్ళు : ఇంటి పత్రాలను చూసి ఆనందిస్తున్నారు .
మొత్తానికి అంకుల్స్ సాధించారు అంటీలూ ..... అంటూ మెయిన్ గేట్ దగ్గరనుండే వారి ఆనందాలను చూసి మురిసిపోతున్నాను .
అంటీ వాళ్ళు : ఒక్కరోజులో ఇంతపెద్దమొత్తంలో డబ్బు ఎలా పంపించగలిగారో ఆశ్చర్యంగా ఉంది , జనాలలో నువ్వూ ఉన్నావన్నమాట ......
ఏమిచెయ్యాలో తెలియక - రౌడీల్లాంటి వాళ్ళను చూసి భయంతో దాక్కున్నాను అంటీలూ ......
మెయిన్ గేట్ దగ్గర సామానులను తీసుకుంటున్న ఇద్దరు ...... నామాటలకు షాక్ లో ఉండిపోయారు .
వెళ్ళండి వెళ్ళండి అంటూ చిన్నగా చెప్పాను .
భయంతో వెళ్లిపోయారు .
అంటీ వాళ్ళు : చూస్తే అలా అనిపించడం లేదే ......

అవును అంటీలూ ..... మీరు చాలా ధైర్యస్తులే , ఇంటిని కూల్చేస్తామని చెప్పినా ధైర్యంగా లోపలే ఉన్నారు .
అంటీలు : దైర్యంగానా ..... ? , భయంతో వణికిపోయి ఒకరినొకరు కౌగిలించుకుంటేనూ ......
ప్చ్ ...... ఆ కౌగిళ్ళల్లో నేనుంటే ఎంత బాగున్నో ......
అంటీలు : ఏంటీ .......
నథింగ్ నథింగ్ అంటీ ...... , ఇంటిని కూల్చేస్తారేమోనని ఏడ్చినట్లుగా ఉన్నారు - ఇల్లు దేవాలయంతో సమానం అనుకుంటాను .
అంటీలు : చాలా ఇష్టంతో మూడు కుటుంబాలూ కలిసి కట్టుకున్నది , నువ్వు చెప్పినట్లు మాకు దేవాలయమే ...... , మీ అక్క ..... మా తల్లులకు కూడా చాలా చాలా ఇష్టం , వాళ్ళు చేతికొచ్చినది ఈ ఇంటిలో గృహప్రవేశం చేసిన తరువాతనే .... , అయినా నీకెందుకు చెబుతున్నాము .
అడగకపోయినా మీరే చెబుతున్నారు అంటీలూ అంటూ నవ్వుకున్నాను - మీరు హ్యాపీ సో నేనూ హ్యాపీ ......
అంటీలు : తల్లులు వచ్చేలోపు ఇలా జరిగిందన్న ఆనవాళ్లే ఉండకూడదు - వారికి తెలిస్తే బాధపడతారు .
అలా జరగదులే అంటీలూ ...... CI సర్ స్వయంగా పని పూర్తి చేయిస్తారని అంటుంటే విన్నాను .
అంటీలు : నువ్వెంటీ ఈ సమయంలో ఇక్కడ స్కూల్ కు వెళ్లలేదా ? .

మీ సహాయం కోసం వచ్చాను అంటీలూ ......
అంటీలు : అనుకున్నాము ఏదో ఒకటి ఉంటుందని , ఏంటి విషయం ......
టైం చూసుకుని థాంక్ గాడ్ , అంటీలూ ...... కొద్దిసేపు మీరు నాతోపాటు రావాలి .
అంటీలు : ఏంటీ ...... నీతో మాట్లాడటమే ఇష్టం లేదు - నువ్వంటేనే ఇష్టం లేదు నీతోపాటు బయటకు రావాలా , కుదరదంటే కుదరదు .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటీలూ ...... ఈ ఒక్కసారికి ప్లీజ్ ప్లీజ్ ఆ తరువాత మీరేమి చెయ్యమన్నా చేస్తాను .
అంటీలు : లేదు లేదు లేదు ...... , ఏంటీ ఏమి చెయ్యమన్నా చేస్తావా ? .
ఏమైనా చేస్తాను అంటీలూ ...... చిన్న ఆశ .
అంటీలు : ఇక్కడ నుండి వెళ్లిపోవాలి .
కన్నీళ్లు .......
అంటీలు : వద్దు వద్దు వద్దు ..... , మన ఇంటి నుండి వెళ్ళిపొమ్మన్నప్పుడు ఇలానే కన్నీళ్లు వచ్చాయి , ఎవరికైనా ఇల్లు ఇల్లే కదా ...... , sorry sorry మహేష్ .....
లవ్ ...... థాంక్యూ థాంక్యూ సో మచ్ అంటీలూ ( మిమ్మల్ని వదిలి వెళ్లడం అంటే ఒక ప్రాణం ఆగిపోయినట్లే ) .
అంటీలు : గుసగుసలాడుకుని , ఇకనుండీ రోజూలా మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు మాతో మాట్లాడటానికి ప్రయత్నించకూడదు మరియు మా తల్లుల స్కూటీలలో వెళ్లకూడదు మొత్తంగా వాళ్ళ దగ్గరికి వెళ్లకూడదు మాట్లాడకూడదు కూడా , తల్లులకు ..... నువ్వంటే ఇష్టం వాళ్ళు మాట్లాడటానికి ప్రయత్నించినా నువ్వు ప్రక్కకు వెళ్లిపోవాలి .
కళ్ళల్లోనుండి ధారలా కారిపోతున్నాయి కన్నీళ్లు - సమయం గడిచిపోతోంది - అమ్మమ్మకు ..... దేవతలను తీసుకొస్తానని మాటిచ్చాను , కన్నీళ్లను తుడుచుకుని అంటీలూ ...... వేరే మార్గం లేదా ? .
అంటీలు : మహేష్ కళ్ళల్లో కన్నీళ్లు ...... మనమంటే అంత ఇష్టమా ? , లేదు లేదు నటన , అవును వేరే మార్గం లేదు .
తన్నుకొస్తున్న కన్నీళ్లను తుడుచుకుని సరే అంటీలూ ..... మీరు కోరినట్లుగానే ప్రవర్తిస్తాను అంటూ మళ్లీ కన్నీళ్లను తుడుచుకున్నాను .
అంటీలు : మహేష్ కన్నీళ్లను చూస్తుంటే కోరకూడనిది ఏమైనా కోరామా అంటూ ఫీల్ అవుతున్నారు , సరే పద మరి - తల్లులు వచ్చే సమయం వాళ్ళు వచ్చేలోపు వచ్చేయ్యాలి .
ఇలాకాదు అంటీలూ ...... శుభకార్యానికి వెళ్లే దేవతల్లా పట్టుచీరలలో ......
అంటీలు : పట్టుచీరలలో దేవతల్లా ..... నో నో నో ఆడిగావు ఒప్పుకున్నాము అంతే ఇలానే వస్తాము .
( మిమ్మల్ని ఎలా ఒప్పించాలో నాకు తెలియదా దేవతలూ ..... ) అయితే రోజులా కాకుండా మిమ్మల్ని కవ్విస్తాను - ఇక నేనంటే ఇష్టమైన అక్కయ్యలతో అయితే .....
అంటీలు : Ok ok ok అర్థమయ్యింది నువ్వు చెప్పినట్లుగానే చేస్తాము - నవ్వైతే మాట తప్పకూడదు .
హృదయంపై చేతినివేసుకున్నాను .
అంటీలు : ఇక్కడే wait చెయ్యి .....
ఎంతసేపు అంటీలూ ......
అంటీలు : మాకు మామూలుగా అంటేనే ఆలస్యం అవుతుంది ఇక పట్టుచీరలలో దేవతల్లా అన్నావుకదా ...... ఎంతసేపైనా అవ్వవచ్చు .
Understood understood అంటీలూ ..... టేక్ your own టైం , వెళ్ళండి వెళ్ళండి .
రెడీ అవ్వడం అంటే ఏంటో అనుకున్నాడు అంటూ నవ్వుకుంటూ వాళ్ళ వాళ్ళ ఇళ్ల లోపలికివెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు .

యాహూ ...... పెద్దమ్మ సహాయం లేకుండానే ఒప్పించాను ఎంతైనా నువ్వు గ్రేట్ రా అంటూ హృదయంపై ముద్దుపెట్టుకున్నాను .
బుగ్గపై పంటిగాటు ......
స్స్స్ ..... లవ్ యు పెద్దమ్మా .....
(మనసులో
పెద్దమ్మ : జేసీబీ కు అడ్డుగా నిలబడి హీరోలా ఇంటిని సేవ్ చెయ్యడం మీ అంటీలు చూసి ఉంటే ఈజీగా ఒప్పుకునేవారు కదా ......
పెద్దమ్మ : కదా అంటూ నన్ను అడుగుతున్నారా ..... ? , అంతసేపూ అంటీ వాళ్ళను లోపలే ఉండేలా చేసింది ఎవరు ? .
లవ్ యు లవ్ యు ..... అయినా నేనేమి చేసినా నా ముద్దులకన్నయ్య కోసమే అంటూ ముద్దుపెట్టారు .
అయితే ok పెద్దమ్మా ......
పెద్దమ్మ : అవునూ ..... శాస్త్రం ప్రకారం ఐదుగురితో స్నానం చేయించాలని కదా అమ్మమ్మ అన్నది , అక్కడ నీ ప్రియమైన దేవత మేడమ్ ఇక్కడ ప్రియాతిప్రియమైన ముగ్గురు దేవతలు ...... మరి ఐదవ దేవత ఎవరు ? .
బదులివ్వకుండా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాను .
పెద్దమ్మ : బదులివ్వకుండా నవ్వుతావే కన్నయ్యా ..... నాకైతే కంగారు వచ్చేస్తోంది .
మళ్లీ బదులివ్వకుండా నవ్వుతూనే మొబైల్ తీసి , కొద్దిసేపట్లో వచ్చేస్తున్నాము అమ్మమ్మా అంటూ మెసేజ్ పెట్టాను .
పెద్దమ్మ : నలుగురే కదా కన్నయ్యా ..... , నవ్వడమే కాకుండా అమ్మమ్మకు మెసేజ్ కూడా పెట్టేశావు .
బై అమ్మమ్మా ..... చాలా పనులున్నాయి అంటూ నా హృదయంలోని పెద్దమ్మకు ముద్దుపెట్టి , CI సర్ దగ్గరకు వెళ్ళాను ) .

CI సర్ : బాబూ ...... సామానులన్నీ లిస్ట్ తీసుకున్నాను , డ్యామేజ్ చేసిన వాడితోనే అన్నింటినీ తెప్పిస్తున్నాను .
థాంక్యూ సర్ ...... , నేనూ దగ్గరుండి చూసుకోవాల్సింది కానీ ముఖ్యమైన చోటుకు వెళ్ళాలి .
CI సర్ : నేను చూసుకుంటాను బాబూ ...... 
థాంక్యూ సర్ ......

మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే నా హృదయస్పందన బుజ్జిజానకి ..... , ఎస్క్యూస్ మీ సర్ అంటూ పెదాలపై తియ్యదనంతో చెట్టు నీడకు చేరాను .
ఎత్తి హలో అన్నాను .
బుజ్జిజానకి : హలో ఏంటి హలో ..... ఇంతసేపు ఎక్కడికి వెళ్లిపోయావు , నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను తొందరగా రా ......
అఅహ్హ్ ..... టచ్ చేసావు బుజ్జిజానకీ , మనసు - హృదయం పరవళ్లు తొక్కుతోంది అంటే నమ్ము లవ్ ..... థాంక్యూ సో మచ్ , మా అందమైన బుజ్జిజానకిని రెడీ చేయించడం కోసం ఏకంగా దివినుండి దిగివచ్చిన దేవతలనే వెంటబెట్టుకుని వస్తున్నాను , మరింత సమయం పట్టేలా ఉంది .
బుజ్జిజానకి : మరింత సమయమా ...... మహేష్ ......
నేనూ ఆ దేవతలను ఇదే విషయం అడిగాను , వారేమన్నారో తెలుసా ...... దివినుండి దిగివచ్చిన బుజ్జిదేవత బుజ్జిజానకిని రెడీ చెయ్యాలంటే మేమూ దేవతల్లా రెడీ అవ్వాలికదా అన్నారు .
బుజ్జిజానకి : పో మహేష్ సిగ్గేస్తోంది , నన్నూ టచ్ చేసావు తెలుసా ...... లవ్ యు .... థాంక్యూ సో సో మచ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు నవ్వులు ......
నాకు తెలిసి అమ్మనే ఆ దేవతలను వారి బుజ్జిదేవత కోసం పంపిస్తున్నారేమో ......
బుజ్జిజానకి : నిజమా మహేష్ ...... , ఆనందబాస్పాలు ఆగడం లేదు మహేష్ , నువ్వు త్వరగా వచ్చెయ్యి ......
ఆ దేవతలు రెడీ అయిన మరుక్షణమే నీముందు ఉంటాము అంటూ సమయాన్ని మరిచిపోయాము సంతోషమైన మాటలలో ........
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-12-2023, 07:22 PM



Users browsing this thread: 6 Guest(s)