Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
క్లాస్ గా ఉన్న స్ట్రీట్ లోని అంతే క్లాస్ గా ఉన్న ఇండిపెండెంట్ ఇంటి ముందు కారు ఆగింది , అమ్మమ్మా ..... ఇదేనా బ్యూటిఫుల్ హౌస్ అంటూ కిందకుదిగి డోర్ తెరిచాను , రోడ్డుకు ఇరువైపులా నిర్మానుష్యంగా ఉండటంతో అదే అడిగాను .
అమ్మమ్మ : ఈ ఏరియా అంతా ఎంప్లాయిస్ ఉంటున్నారు మహేష్ ...... , పిల్లలను స్కూల్ బస్సెస్ లో పంపించి పేరెంట్స్ ఇద్దరూ వాళ్ళ వాళ్ళ ఆఫీస్ లకు వెళ్ళిపోతారు మళ్లీ వచ్చేది చీకటిపడ్డాకనే అంతవరకూ ఇలా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది .
ఏరియాకు సెక్యూరిటీ ఉన్నారా అమ్మమ్మా ......
బుజ్జిజానకి : అమ్మమ్మా వాళ్ళ సేఫ్టీ గురించే కదా ...... , కంగారుపడకు స్ట్రీట్ కు ఇరువైపులా గేట్స్ దగ్గర సెక్యూరిటీ ఉన్నారు .
అయితే ok ......
అమ్మమ్మ : మళ్లీ ఆశీర్వదించారు .
అమ్మమ్మా ...... ముందు బుజ్జిజానకిని లోపలకు తీసుకెళ్లండి .
ముందైతే మా మహేష్ కు షర్ట్ ఇవ్వాలి .
మేడమ్ తాళాలు అందుకుని వెళ్లి మెయిన్ గేట్ మరియు లోపలికివెళ్లి మెయిన్ డోర్ తెరిచారు .
అమ్మమ్మ జాగ్రత్తగా నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్లారు .

అంతలో ఫుడ్ డెలివరీ వెహికల్ వచ్చి ఇంటి ముందు ఆగడంతో ముగ్గురూ మెయిన్ డోర్ దగ్గర నుండి తొంగి చూసారు .
వెహికల్ నుండి బాయ్స్ దిగి మేడమ్ డెలివరీ అంటూ ఫుడ్ పార్సిల్స్ అన్నింటినీ లోపల ఉంచబోయారు .
వాళ్ళను ఆపి మెయిన్ గేట్ దగ్గరే అందుకుని పంపించేసి అన్నింటినీ అమ్మమ్మ - మేడమ్ వాళ్లకు అందించాను , అమ్మమ్మా ..... బుజ్జిజానకికి ఇష్టమైనవి తినిపించి మీరూ తినండి .
ముగ్గురూ ఆశ్చర్యపోయారు , ఎప్పుడు మహేష్ ..... ? .
మీరే కదా అన్నారు , బుజ్జిజానకి కోరికలన్నీ తీర్చాలని అలా ఆకలి అనగానే ఆర్డర్ పెట్టేసాను .
మా బంగారం .......
లోపలనుండి ప్రేమతో చూస్తోంది బుజ్జిజానకి - అఅహ్హ్ ...... చాలు చాలు .
మేడమ్ : నవ్వుకున్నారు , మహేష్ ..... మనకేనా లేక వీధిలో ఉన్నవారందరికీనా ...... ? .
బుజ్జిజానకికి ఏమైనా తినాలనిపించవచ్చని వెజ్ ఐటమ్స్ అన్నింటినీ ఆర్డర్ పెట్టేసాను .
మేడమ్ : సో స్వీట్ ...... , కారుకు - ఫుడ్ కు అమౌంట్ అంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకున్నారు .
బుజ్జిజానకి : అంటీ .... బయట రెండూ లేవు .
మేడమ్ : పే చేసేసావన్నమాట ......
ఎప్పుడో మేడమ్ ...... , అవన్నీ అమ్మ - పెద్దమ్మ చూసుకుంటారు .
బుజ్జిజానకి : మరింత సంతోషిస్తోంది , అమ్మమ్మా ...... మీ బుజ్జిదేవుడికి షర్ట్ ఇవ్వండి .
అమ్మమ్మ : sorry sorry అంటూ లోపలికివెళ్లి బాక్స్ అందించారు .
చూస్తే కొత్త షర్ట్ ...... , అమ్మమ్మా ......
అమ్మమ్మ : నిన్న స్కూల్ నుండి ఇంటికి వస్తూ నీకు గిఫ్ట్ ఇవ్వాలని షాపింగ్ చేసింది తల్లి ...... , ఇష్టంగా సెలెక్ట్ చేసింది వేసుకో మహేష్ .
అఅహ్హ్ ...... టచ్ చేసావు బుజ్జిజానకీ అంటూ షర్ట్ ను గుండెలపై హత్తుకుని ఫీల్ అవుతున్నాను .
బుజ్జిజానకి : నువ్వు ఎన్నిసార్లు టచ్ చేసావో తెలుసా అంటూ ఆనందిస్తోంది , ముందు షర్ట్ వేసుకో మహేష్ ......
సిగ్గుతో అటువైపుకు తిరిగాను .
మేడమ్ : బుజ్జిదేవుడికి సిగ్గా ......
అందమైన దేవత - ప్రెట్టి బుజ్జిదేవకన్య ఎదురుగా ఉంటే రాదా అంటూ వేసుకున్నాను .
సిగ్గుపడటం మేడమ్ - బుజ్జిదేవకన్య వంతు అయ్యింది , wow సూపర్ మహేష్ .....
నవ్వుకున్నాను , తరువాత సిగ్గుపడవచ్చు చల్లారకముందే తినాలి - బుజ్జిజానకికి ఆకలిగా ఉంది , ఫ్రెష్ అవ్వడానికి తీసుకెళ్లండి .
బుజ్జిజానకి : ఏంటి బయట నుండే మాట్లాడుతున్నావు లోపలికిరా ........
మేడమ్ : అమ్మమ్మా ..... ఎలా ఇప్పుడు ? .
అమ్మమ్మ : అవును తల్లీ ..... బుజ్జితల్లిని స్నానం చేయించడానికి శాస్త్రం ప్రకారం ఐదుగురు అత్తయ్యలు కానీ ముత్తైదువులు గానీ కావాలి - నీకు తోడుగా మరొక నలుగురు కావాలి , బంధువులేమో చాలా దూరంలో ఉన్నారు - ఇరుగుపొరుగువారేమో డ్యూటీ కి వెళ్లి సాయంత్రానికి గానీ రారు - చీకటిపడేలోపు స్నానం చేయించాలి .
మేడమ్ : మరైతే ఎలా అమ్మా ....... , నాకు తెలిసినవాళ్ళుకూడా సాయంత్రానికి కానీ రారు .
నో నో నో మీరు బాధపడితే నేను ...... అమ్మ - పెద్దమ్మ తట్టుకోలేరు , మీరైతే బుజ్జిజానకికి ఇష్టమైనవి తినిపించి తినండి తోడుగా ఉండండి , చిటికెలో వెళ్లి దేవతల్లాంటి వారిని పిలుచుకునివస్తాను అంటూ బయలుదేరాను .
బుజ్జిజానకి : అమ్మమ్మా ......
అమ్మమ్మ : మహేష్ ..... తిని వెళ్లు .
తిని వెళితే ఆలస్యం అవుతుంది ఇదిగో తింటూ వెళతాను అంటూ పార్సిల్ అందుకుని హ్యాపీనా అంటూ మహివైపు సైగచేసాను , తనతోపాటు నవ్వుకుని మెయిన్ గేట్ వరకూ వెళ్ళాను , చిటికెలో తీసుకురావడానికి అంటీ వాళ్ళేమీ మనపై ఇష్టంగా లేరు గుర్రున ఉన్నారు - చెప్పేది కూడా వినరు , వెనక్కువెళ్లి అమ్మమ్మా ..... చీకటిపడేలోపు పిలుచుకునివస్తాను నమ్మకం ఉంచండి .
బుజ్జిజానకి : ఉన్నదే అది ......
( లవ్ యు బుజ్జిజానకీ ..... ) పెద్దమ్మనే సహాయం చెయ్యాలి అంటూ మెయిన్ గేట్ వేసి జాగ్రత్త అనిచెప్పి రోడ్డుమీదకు రాగానే ఇందాకనే దింపిన కారు వచ్చి ఆగడంతో బయలుదేరాను .

బుజ్జిజానకిని దేవతల్లాంటి అంటీ వాళ్ళ చేత స్నానం చేయించి ఆశీర్వదించేలా చేయగలిగితే దేవతలే ఆశీర్వదించినట్లు నిండు నూరేళ్లూ సంతోషంగా ఉంటుంది - అలాజరిగితే అమ్మకు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు కాబట్టి అంటీ వాళ్ళను ఒప్పించాలి , ఎలా ...... ? నేనేమి చెప్పినా వినకుండానే నో అంటారు , బుజ్జిజానకి శుభవార్త చెప్పి ఒప్పిద్దామా ..... ? , వద్దు వద్దు ..... మేము ఒప్పుకోవాలని నాటకాలు ఆడుతున్నావా ? అని ఖచ్చితంగా అంటారు , ఇంతటి సంతోషమైన పండుగను అపహాస్యం చెయ్యకూడదు , విషయం చెప్పకుండానే ఒప్పించి తీసుకెళ్లాలి - బుజ్జిజానకిని చూస్తే సంతోషించి దేవతల్లా ఆశీర్వాధిస్తారు .
సిస్టర్ వేగంగా పోనివ్వండి ...... , ఎలా ప్రయత్నించినా ఒప్పుకోనే ఒప్పుకోరు ఎలా అబ్బా ...... , నేనైతే అంటీ వాళ్ళతో నిజాయితీగానే ఉన్నాను , చేసిందంతా పెద్దమ్మే ......
స్స్స్ ..... బుగ్గపై పంటిగాటు .
లవ్ యు పెద్దమ్మా ...... అప్పుడప్పుడూ మీ ప్రేమ ఇలా ఆస్వాదించకపోతే సంతృప్తి కలగదు .
లవ్ యు అన్నట్లు పంటిగాటుపై ముద్దులు కురుస్తున్నాయి .
లవ్ యు టూ పెద్దమ్మా ..... , ముద్దులతోపాటు కాస్త ఉపాయం కూడా ......

మెసేజ్ సౌండ్ ....... , చూస్తే వాట్సాప్ లో అంటీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు - అక్కయ్యలు ..... బుజ్జాయిలుగా ఉన్నప్పటి నాటి ఫోటోలు - wow ..... అంటీలలో అందం అప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు అంటూ మురిసిపోతున్నాను , అక్కయ్యలు పుట్టాక ఇలా ఉంటే పెళ్లికాకముందు పంపించి ఉంటే మిస్ ఇండియా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ కిరీటాలు సాధించేవారు , అఅహ్హ్ ..... ఒకరిని మించిన అందం మరొకరిది , లవ్ యు లవ్ యు లవ్ యు ....... ఆ అదృష్టం ఎప్పుడో ఏమిటో ......
అవునూ ...... నేను ఉపాయం చెప్పమంటే ఫోటోలు పంపించారేమిటి పెద్దమ్మా , పెద్దమ్మ అయితే సందర్భం లేకుండా పంపరు , ఏమీ అర్థం కావడం లేదే ......

అంతలో సిస్టర్ సిగ్నల్ ఇచ్చి రైట్ టర్నింగ్ తీసుకుంటుండగా ...... సైరెన్ చేసుకుంటూ సెక్యూరిటీ అధికారి జీప్ స్ట్రెయిట్ గా వెళ్లిపోతోంది .
క్యాజువల్ గా సెక్యూరిటీ అధికారి జీప్ వైపుకు చూసాను , జీపులో ముద్దాయిలా కూర్చున్న వ్యక్తి తెలిసినవారులా తోచారు కానీ ఇక్కడ చూసానబ్బా ...... 
ఫొటోస్ ఫొటోస్ అంటూ వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే వాగ్దేవి అక్కయ్య నాన్న ...... 
సిస్టర్ సిస్టర్ ..... స్ట్రెయిట్ స్ట్రెయిట్ పోనివ్వండి ఆ సెక్యూరిటీ అధికారి జీప్ ను ఫాలో అవ్వండి , వేగంగా వెళ్లిపోతోంది , దగ్గరకు చేరుకుని చూస్తే జీప్ లో వాగ్దేవి అక్కయ్య నాన్నతోపాటు అక్కయ్యల నాన్నలు కూడా , బెంగళూరులో ఉండాల్సినవారు వైజాగ్ లో అదికూడా సెక్యూరిటీ అధికారి జీప్ లో ఉండటం చూసి షాక్ చెందాను ......
సెక్యూరిటీ అధికారి జీప్ వెనుకే ఫాలో అవుతూ ఓల్డ్ టౌన్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు చేరుకున్నాను .

అంకుల్ వాళ్ళను సంకెళ్లతో బంధించి తప్పుచేసినవాళ్ళలా లోపలికి లాక్కెలుతున్నారు కానిస్టేబుల్స్ ......
కిందకుదిగి లోపలికివెళుతూ , పెద్దమ్మా ...... అంకుల్ వాళ్ళు ఏమైనా తప్పు చేశారా ? .
" కుటుంబానికి దూరంగా ఉండి మరీ మంచిస్థాయిలో ఉండాలని మీ అంటీవాళ్ళ నగలతోపాటు ఆస్థులన్నింటినీ తాకట్టుపెట్టి కలిసికట్టుగా కష్టపడ్డారు , విజయం సాధించి ఆస్థాయికి చేరుకునే సమయానికి పార్ట్నర్స్ నమ్మించి మోసం ఫ్రాడ్స్ ముద్రవేసి తప్పుడు కేసుల్లో ఇరికించారు , వారికి తాకట్టు పెట్టుకున్నవాళ్ళు మరియు లోపలికివెళుతున్న CI సహాయం చేస్తున్నారు , నువ్వు లోపలికి వెళ్ళేసరికి ప్రూఫ్స్ నీ చేతుల్లో ఉంటాయి , ఇక రెచ్చిపో ....... " .
లవ్ యు సో మచ్ పెద్దమ్మా ...... అంటూ పరుగున లోపలికివెళ్ళాను . 

అంకుల్ వాళ్ళ సంకెళ్లను విప్పి లాకప్ లోకి తోస్తున్నారు .
సర్ సర్ సర్ ఆపండి అంకుల్ వాళ్ళు ఏ తప్పూ చెయ్యలేదు , ప్లాన్ ప్రకారం ఇరికించారు .
కానిస్టేబుల్ : బాబూ ..... బయటకువెళ్లు , అంకుల్ వాళ్ళను లోపలికి తోసారు .
నో సర్ వెళ్లను - మీరుకూడా వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి - మీరు చేస్తున్నది తప్పు - అంకుల్ ..... కొట్టారా ? , కోర్ట్ కు తీసుకెళ్ళకుండా కొట్టడం కూడా తప్పే ......
కానిస్టేబుల్ : కొట్టాము ఇప్పుడు లాఠీలు విరిగేలా కొడతాము మాఇష్టం మేము సెక్యూరిటీ ఆఫీసర్లం ......
ప్రజలను రక్షించేవారు సెక్యూరిటీ ఆఫీసర్లు - ఇలా అమాయకులైన వారిని శిక్షించేవారిని ఏమంటారో నాకంటే మీకే బాగా తెలుసు , అంకుల్ వాళ్ళు గౌరవంగా బ్రతికారు - ఎన్నో దెబ్బలు తిని ఉన్నదంతా పెట్టి చివరికి అనుకున్నది సాధించారు - లంచం తీసుకుని ఇలాచెయ్యడం తప్పు ......
అంకుల్ వాళ్ళు : ఎవరీ బాబు మనగురించి ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాడు అంటూ ఆశ్చర్యపోతున్నారు .
కానిస్టేబుల్స్ : మాకే నీతులు చెబుతున్నావా ..... ? , అవును లంచమే తీసుకుని వీరిని పక్కాగా ఇరికించాము ఇక జీవితాంతం జైల్లోనే ......
అలా జరగనివ్వను - నిజాలు సాక్ష్యాలతో బయటపెట్టి మిమ్మల్ని ఊసలులేక్కపెట్టిస్తాను .
కానిస్టేబుల్స్ : బచ్చావి నువ్వేమి చేస్తావు , రెండు దెబ్బలు వేస్తే మూసుకుని ఉంటావు అంటూ లాఠీ ఎత్తాడు .

దెబ్బపడేలోపు ఎక్కడనుండి వచ్చారో లాఠీని పట్టుకుని , పిల్లాడిని కొట్టడం తప్పు అంటూ ఆపాడు .
SI విశ్వ సర్ ......
నన్ను ఆపితే లోపల ఉన్న CI గారిని ఆపినట్లు , నక్సలైట్ ఏరియా కు ట్రాన్స్ఫర్ అయిపోతావు అంటూ ఒక చిన్న కానిస్టేబుల్ ..... SI సర్ ను బెదిరిస్తున్నాడు .
విశ్వ సర్ : తప్పు ఎవరుచేసినా తప్పే ..... , ఇంతవరకూ ఓపికపట్టాను పిల్లాడిని కొడుతుంటే చూస్తూ ఊరికే ఉండలేను ఎవరికైనా చెప్పుకో ..... , బాబూ ..... నువ్వు అనుకున్నది జరగదు - చూసాను ప్రూఫ్స్ అన్నీ వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నాయి .
అవన్నీ సృష్టించినవి విశ్వ సర్ ......
విశ్వ సర్ : నా పేరు నీకెలా తెలుసు ......
స్కూల్లో డ్రగ్స్ నుండి పిల్లలను కాపాడి నెంబర్ ఇచ్చినది గుర్తుచేసాను , విశ్వ సర్ ..... అంకుల్ వాళ్ళు ఏ తప్పూ చెయ్యలేదు .
విశ్వ సర్ : తప్పుడు ప్రూఫ్స్ తోపాటు CI గారి సపోర్ట్ ఉంది .
మనదగ్గర రియల్ ప్రూఫ్స్ .... ఆడియో & వీడియో కూడా ఉన్నాయి సర్ .....
విశ్వ సర్ : ఏదీ ఎక్కడ ? .

అలా చిటికె వేశానో లేదో ఒక వ్యక్తి లోపలికివచ్చి సూట్ కేస్ ఇచ్చి వెళ్ళిపోయాడు .
కానిస్టేబుల్స్ భయపడిపోయి సర్ సర్ అంటూ లోపలికివెళ్లారు . 
కానిస్టేబుల్స్ జరిగినదంతా వివరించినట్లు , CI అనుకుంటాను వచ్చి పిల్లాడితో మాటలేంటి బయటకు తోసేయ్యండి అంటూ లాఠీ అందుకున్నాడు .
విశ్వ సర్ : ప్రూఫ్స్ ఉన్నాయట సర్ .....
CI : ఆఫ్ట్రాల్ SI వి నీస్థాయిలో నువ్వు ఉండు .
విశ్వ సర్ : నన్ను నమ్మినట్లు , నాస్థాయి నిజాయితీ దానిని నమ్ముకునే ఇక్కడిదాకా చేరుకున్నాను .
విశ్వ సర్ కు సెల్యూట్ చేసి , సూట్ కేస్ లోనుండి ఫైల్ మరియు పెన్ డ్రైవ్ ఇచ్చాను .
పెన్ డ్రైవ్ తీసుకెళ్లి గోడకు ఉన్న టీవీ కి కనెక్ట్ చేశారు , మోసం చేసిన పార్ట్నర్స్ - CI తోపాటు సేట్ ...... ముగ్గురూ కలిసి ఎలా తప్పుడు కేసులలో ఇరికించాలో మాట్లాడుకుంటున్నారు .
స్టేషన్ మొత్తం షాక్ లో చూస్తున్నారు .

CI కోపంతో టీవీ లాగెయ్యబోతే .......
CI సర్ ...... టీవీకి ఏమైనా అయ్యిందో మరుక్షణంలో మీడియా మొత్తం ఇక్కడ ఉంటుంది .
అంతే గప్ చుప్ గా అక్కడే ఆగిపోయాడు .
విశ్వ సర్ : CI గారూ ..... ఏంటో స్థాయి అన్నారు , మీస్థాయి ఏమిటో అందరూ చూస్తున్నారు .
కొట్టడానికి లాఠీ ఎత్తిన CI మరియు కానిస్టేబుల్స్ ...... కాళ్ళ బేరానికి వచ్చారు .
నాకు కాదు అంకుల్ వాళ్లకు క్షమాపణ చెప్పి వెంటనే ఆ వీడియో లో ఉన్నవారందరినీ పిలిపించి అంకుల్ వాళ్లకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వండి .
CI సైగచెయ్యడంతో కానిస్టేబుల్స్ పరుగులుతీశారు .
కానిస్టేబుల్స్ ..... నేను ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను ఆలస్యం కాకూడదు .
కానిస్టేబుల్స్ : ఏమాత్రం ఆలస్యం కాదు బాబూ ..... , ప్రక్కనే ఉన్న హోటల్లో జల్సాగా గడుపుతున్నారు లాక్కోస్తాము .
CI ...... అంకుల్ వాళ్ళ దగ్గరికివెళ్లి క్షమాపణలు చెప్పి స్వయంగా కుర్చీలు వేసి కూర్చోమన్నారు .
అంకుల్స్ దర్జాగా కూర్చోండి .
అలా చూస్తుండిపోయారు అంకుల్స్ ......
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 20-12-2023, 07:15 PM



Users browsing this thread: 3 Guest(s)