Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చెల్లెమ్మా సంతోషమేకదా ఇక వెళ్ళండి .
చెల్లెమ్మ : పురోహితులారా ....... శాస్త్ర బద్దంగా అన్నీ కార్యక్రమాలూ జరగాలంటే పెళ్లికూతురుతోపాటు పెళ్ళికొడుకు కూడా ఉండాలా వద్దా ...... 
పురోహితులు : తప్పకుండా ఉండాలి యువరాణీ .......
చెల్లెమ్మా ...... నా హృదయ దేవకన్యతో ఎప్పుడో ఆ కార్యక్రమాలన్నీ పూర్తిచేసి వివాహం కూడా చేసుకున్నానని నీకు తెలుసుకదా ...... , ఆ అందమైన సంతోషపు అనుభూతులను నా ప్రాణమున్నంతవరకూ మరిచిపోలేను .
చెల్లెమ్మ : మాకు తెలియదా అన్నయ్యా అంటూ నా హృదయంపై ముద్దుపెట్టింది .
మహారాణి బుగ్గపై ముద్దుపెట్టినట్లు బుగ్గపై స్పృశించుకుంది - ఆ ఆనందపు అందాలను మేము తిలకించలేదు కదన్నయ్యా ......
మహారాణీ గారూ ...... ముద్దుపెట్టింది నా ప్రాణం కంటే ఎక్కువైన నా దేవకన్యకు .
బుజ్జాయిలు : మన దేవకన్య ....నాన్నగారూ ..... అంటూ నా హృదయంపై ముద్దులు కురిపిస్తుంటే మహారాణీగారు మెలికలు తిరిగిపోతున్నారు .
అదిగో మళ్లీ .......
మహారాణి : రెండురోజుల్లో  ఆస్థానం ఎలాగో నాదే కదా మహారాజా ......
అది ఎప్పటికీ జరగదు మహారాణీ గారూ .......
మహారాణి : వర్షం పడితే సాధ్యమే .......
వర్షం పడాలని కోరుకోవాలా లేక పడకూడదని కోరుకోవాలా ...... , ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి పడేశావు అమ్మా ...... , మీకు తెలుసుకదా ఈ హృదయంలో మీ బిడ్డకు మాత్రమే స్థానం అని ......
మహారాణీ : నాకుకూడా అమ్మే .......
అయితే ఇక ఆ అమ్మపైనా భారం ......
చెల్లెమ్మ : సరిగ్గా చెప్పారు అన్నయ్యా ...... , భారమంతా మన దుర్గమ్మపై వేసి మాతోపాటు రండి అంటూ ఏకంగా లాక్కునివెళ్లారు .

రాజభవనంలోని ఉద్యానవనం చూసి ఆశ్చర్యపోయాము , చెల్లెమ్మా ..... ఇందాకనే కదా పనులు మొదలుపెట్టినది ఇంతలోనే ఎలా సాధ్యం ఇంత అందంగా మార్చివేశారు .
ఆహా ..... ఎంత అందంగా ఉందో అంటూ మహారాణీ - యువరాణి ఆనందాలకు అంతేలేకుండా పోయింది .
చెల్లెమ్మ : రాజ్యప్రజలు బంధువుల్లా మారిపోతే ఇలానే ఉంటుంది అన్నయ్యా ...... 

పురోహితుల నియమానుసారం ముత్తైదువులు ..... మహారాణీ - యువరాణీని తీసుకెళ్లి మంగళ స్నానాలతో పెళ్లి కార్యక్రమాలను మొదలుపెట్టారు , మరొకవైపు నన్ను - యువరాజును ముస్తాబు చేశారు .
సాయంత్రానికల్లా యువరాజు రాజ్యం మరియు బంధువులంతా విచ్చేసారు .
సాయంత్రానికి రాణులు ముగ్గురు నుండి బదులు వర్తమానాలు వచ్చేసాయి , అక్కయ్యా - చెల్లీ ...... కొన్ని ముఖ్యమైన పరిస్థితుల వలన వెంటనే రాలేకపోతున్నాము వివాహం రోజు ఉదయానికల్లా వచ్చేస్తాము చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ మా ముందు చదివి వినిపించింది చెల్లెమ్మ .......
మహారాణీ బుజ్జాయిలు నిరాశచెందినా వస్తున్నారని సంతోషించారు .

మరుసటిరోజు ఉదయానికల్లా రాజ్యంలోని ప్రతీ ఇల్లు పెళ్లి కళతో కళకళలాడసాగింది . 
ఇక రాజభవనం అయితే స్వర్గంలా మారిపోయింది - ఉద్యానవనం పందిరిలతో మహాద్భుతంగా మారిపోయింది .
ఘడియలు గడుస్తున్నకొద్దీ నాలో కంగారు అంతకంతకూ పెరుగుతుంటే , బుజ్జాయిల సంతోషం - ఉత్సాహం ...... అంతకంతకూ పెరుగుతూనే ఉంది , ప్రతీ కార్యక్రమానికి నాచేతులను పట్టుకుని లాక్కుని వెళ్లి మరీ జరిపించి మురిసిపోయారు ముద్దులుపెడుతూ ఈ అదృష్టం ఎవరికి లభిస్తుంది , ఆ ఆనందాలను పరుగునవెళ్లి మహారాణీ - యువరాణులతో పంచుకుంటున్నారు .

వివాహం రోజు రానే వచ్చింది - దైవ ముహూర్తం దగ్గరపడటంతో ముందుగా పురోహితులు పెళ్ళికొడుకులను పిలవడంతో ......
యువరాజు వెళ్లి సంతోషంగా కూర్చున్నాడు , నేను ఎంతకూ కదలకపోవడంతో బుజ్జాయిలు లాగుతున్నారు - వీలుకాక పిల్లలందరినీ కేకెయ్యడంతో ఉత్సాహంగా వచ్చి పెళ్లిపీటల మీదకు లాక్కునివెళ్లి కూర్చోబెట్టడం చూసి అక్కడున్న ప్రజలు మరియు లోపలనుండి మహారాణీ - యువరాణీ సంతోషంతో నవ్వుకున్నారు .
మంత్రాలు పలుకుతూ పెళ్ళికూతుర్లను పిలవడంతో బుజ్జాయిలిద్దరూ వెళ్లి పిలుచుకునివచ్చి మాఇద్దరి ప్రక్కన కూర్చోబెట్టారు .
ప్రాణమైన నాథుడిని మళ్లీ తనవాడిని చేసుకోబోతున్నానన్న ఆనందంలో బుజ్జాయిలిద్దరినీ మామధ్యన కూర్చోబెట్టి ముద్దుచేస్తోంది .
ఆ దృశ్యాలు చూసి తరించినట్లు ప్రజలంతా మాపై పూలవర్షం కురిపించారు .

ప్రజలారా ...... ఇంకా తాళి కట్టనేలేదు కాస్త ఆగండి .
ప్రజలు : నవ్వుకున్నారు , మా దేవుడు - దేవతల వివాహం అంటే ప్రతీదీ మాకు సంబరమే మహారాజా అంటూ మళ్లీ పూలవర్షం కురిపించారు .
ప్రక్కన పీటలపై కూర్చున్న చెల్లెమ్మవైపుకు తిరిగి తప్పదా చెల్లెమ్మా అని అడిగాను .
చెల్లెమ్మ : ప్రజలారా విన్నారా ..... ? .
ప్రజలు : ఉపవాస దీక్షకు సిద్ధమే యువరాణీ ...... అంటూ పైకిలేచారు .
వద్దు వద్దు వద్దు ...... , పురోహితులూ ...... తెలుసుకదా సూర్యుడు చూడండి ఎలా భాగభగలాడిపోతున్నాడో తొలి ముడి వేసేసమయానికి మేఘావృతం కాకపోతే .....
మహారాణి : మీఇష్టప్రకారమే పెళ్లిని ఆపేయ్యొచ్చు మహారాజా ....... , మరి మేఘాలు కమ్ముకుంటే సంతోషంగా మూడు ముళ్ళూ వేస్తారా ? .
వెక్కిళ్ళు వచ్చేసాయి , బుజ్జాయిలు అందించిన నీటిని త్రాగి అప్పుడు చూద్దాములే అన్నాను , ఎండ భయంకరంగా ఉండటం చూసి హమ్మయ్యా అనుకున్నాను , తప్పు తప్పు వర్షం పడాలి - రాజ్యం పులకించాలి .
మహారాణి : తథాస్తు .......

పురోహితులు : ముహూర్త సమయం ముహూర్త సమయం అంటూ తాళి అందించారు .
మహారాణి : పురోహితులారా ...... కొద్దిసేపు ఆపగలరా , చెల్లెళ్ళు ఇంకా రాలేదు .
చెల్లెమ్మ : అవునవును .......
బుజ్జాయిలు : నా - మహారాణి బుగ్గలపై ముద్దులుపెట్టి , ద్వారం దగ్గరికి పరుగులుతీశారు , సమయం గడుస్తున్నా రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు .
పురోహితులు : మహారాణీ - యువరాణీ ...... దైవ ముహూర్తం మళ్లీ ఇలాంటి ముహూర్తం పుష్కరానికి కూడా రాదు .
పురోహితులూ ..... ముహూర్తం కాదు ముఖ్యం , రాణులు రావడం ముఖ్యం ......
చెల్లెమ్మ : వదినా ..... ఆలస్యం చెయ్యాలని చూస్తున్నారు అన్నయ్య , నాకు తెలిసి దారి తప్పిపోయి ఉంటారు వచ్చేస్తారులే ......
మహారాణి : బుజ్జాయిలూ మీఇష్టం ఎలా అంటే అలా ......
బుజ్జాయిలు : ఆలోచించి అత్తయ్య చెప్పినట్లే కానిద్దాము .
బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : నాన్నగారూ ...... మీరు తప్పించుకోలేరు , పూజారిగారూ కానివ్వండి .
అయిపోయాను , హమ్మయ్యా బయట ఎండ ఉందిలే అంటూ నిర్భయంగా పురోహితుడి నుండి తాళి అందుకుని పైకిలేచి అందరివైపుకూ చూయించి మరొకసారి బయట ఎండను చూసి వెటకారమైన నవ్వుతో మహారాణీ మెడను చేరాను .

ప్రజలందరూ మావైపు సంతోషంతో - ఎండవైపు కంగారుపడుతూ పదేపదే చూస్తూనే లేచినిలబడ్డారు .
మహారాణీ ...... ఎండను చూసారా అంటూ గర్వంగా తొలిముడి వెయ్యడానికి రెండువైపులా కలిపానో లేదో ఆశ్చర్యం ఒక్కసారిగా చీకటి కమ్ముకున్నట్లు మబ్బులు .........
దేవుడు - దేవత , దేవుడు - దేవత ...... అంటూ సంతోషాలతో మాపై పూలవర్షం కురిపించారు , మహారాజుగారూ ..... తొలి ముడిని వేసినట్లే కదా .......
నోరెల్లబట్టి వేసినట్లే అన్నాను .
నవ్వుకుని అందరూ ఒకటి ఒకటి అంటూ కేకలువేస్తున్నారు .
బుజ్జాయిలు : భలేభలే అంటూ ముద్దులుపెట్టి చిందులువేస్తూ చప్పట్లుకొడుతున్నారు .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... రెండవ ముడిని కూడా వెయ్యండి .

అలాగే అంటూ నాకు తెలియకుండానే రెండవ ముడిని వేసాను - మహారాణీ అందమైన నవ్వులు నా హృదయాన్ని చేరుతున్నాయి .
మరింత ఆశ్చర్యం ...... పెద్దగా ఉరుములు మెరుపులు ......
మామూలుగా అయితే బుజ్జాయిలు - చుట్టూ పిల్లలు ...... ఆ శబ్దాలు భయపడేవారు కానీ సంతోషంతో చిందులువేస్తున్నారు .
చుట్టూ ప్రజలు అమితమైన ఆనందాలతో రెండు రెండు అంటూ పూలవర్షం కురిపిస్తున్నారు .

మహారాణి : మూడవ ముడి వెయ్యక తప్పదు మహారాజా ......
వేస్తున్నాను అంటూ మూడుముళ్లు వెయ్యడం ఆలస్యం గ్రంథాలలో రాసినట్లుగానే లోకకల్యాణం అన్నట్లు దేవతలే స్వయంగా ఆశీర్వదిస్తున్నట్లు వర్షం ధారాళంగా కురవసాగింది .
మూడుముళ్లు వేసిన సంగతే మరిచిపోయి బుజ్జాయిలను ఎత్తుకుని వర్షం కిందకుచేరి పూర్తిగా తడిచాము - ముద్దులలో మునిగిపోయాము .
బుజ్జాయిలకు మాత్రమేనా ముద్దులు నాకులేవా మహారాజా ....... అంటూ మహారాణి వచ్చింది .
తాళి కట్టడమే కాకుండా ముద్దులా అంటూ వర్షం ఆస్వాధిస్తున్న చెల్లెమ్మ చెంతకు చేరాను .
మహారాణి నవ్వుతూనే వెనుకే వచ్చింది .
చుట్టూ ప్రజలందరూ ఆనందబాస్పాలతో వర్షంలో తడుస్తున్నారు - నాచుట్టూ చేరి దండాలుపెడుతున్నారు .
ప్రజలారా ...... నావలన కాదు .
ప్రజలు : అవును మీవలన కాదు , మీరు - మహారాణీ గారు ఏకం అవ్వడం వల్లనే , మహారాజు - మహారాణీ , మహారాజు - మహారాణీ ...... అంటూ కేకలువేస్తూ మహారాణీ గారిని నాప్రక్కన చేర్చి వర్షంతోపాటు పూలవర్షం కురిపించి ఆనందిస్తున్నారు .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ చెల్లెమ్మతోపాటు మేము స్వచ్ఛను అందించిన చెల్లెళ్ళందరూ గుండెలపైకి చేరారు , ఈ కంగారులో వాళ్ళు వచ్చిన సంగతే తెలియదు .
చెల్లెళ్ళూ ...... మీరు ? .
చెల్లెళ్ళు : మా అన్నయ్య వివాహం అంటే ఆషామాషీ కాదు , అన్నీ రాజ్యాలలో ఈ వీరుడి వివాహం గురించే మాట్లాడుకుంటున్నారు , అలా తెలియగానే నలువైపుల రాజ్యాలలో ఉన్న మీ చెల్లెళ్ళంతా విచ్చేసాము , మీరేలాగో పిలవలేదు . 
వివాహమే .......
చెల్లెళ్ళు : తెలుసు తెలుసు ...... , అయినాసరే దేవతనే చేసుకున్నారు అంటూ ఆనందిస్తున్నారు వర్షంలో .......

వర్షం కోసం తప్పలేదు చెల్లెళ్ళూ - ప్రజలంతా ఒక్కటై నాకు ఇష్టం లేకపోయినా మూడు ముళ్ళు వేయించారు - మూడు ముళ్ళు వేసినంత మాత్రాన ఒక్కటైనట్లు కాదులే .......
అలా అన్నానో లేదో పెద్ద ఎత్తున పడుతున్న వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది .
అందరిలో నిరాశ - బాధ .......
బుజ్జాయిలను ఎత్తుకుని రాజభవనం పైనున్న ఉద్యానవనం దగ్గరికి చేరుకుని చూస్తే కొండపైకూడా వర్షం ఆగిపోయింది , తల్లీ గంగమ్మా ఏమైంది అంటూ బాధపడుతూ కిందకుదిగి మిత్రుడిపై ఆనకట్ట దగ్గరకు చేరుకున్నాను - అప్పటివరకూ కురిసిన వర్షపు నీళ్లు ..... భూదేవి దాహం తీర్చడానికే సరిపోలేదు అన్నట్లు మొత్తం ఇంకిపోయాయి - మేఘాలవైపు ఆశగా చూస్తున్నకొద్దీ మేఘాలు పరుగులుతీస్తూ సూర్యుడికి దారిని ఇచ్చాయి .
నావెనుకే వచ్చిన కొంతమంది ప్రజాలుకూడా ఏమిజరిగిందో - అపరాధం ఎక్కడ జరిగిందో తెలియక బాధపడుతున్నారు .
సూర్యుడు అస్తమించి చీకటిపడి చంద్రుడి వెన్నెల ప్రకాశిస్తోంది కానీ మేఘావృతం మాత్రం జాడలేదు .

ప్రజలారా ప్రజలారా ...... వర్షం రాక మన దేవుడి వల్లనే - ఆగిపోవడం కూడా మన దేవుడి వల్లనే అంటూ పురోహితులు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు .
నావల్లనా ...... ? .
పురోహితులు : అవును మీవల్లనే మహారాజా ...... , వివాహానికి సంతోషంగా విచ్చేసిన వారిద్వారా మాకూ ఇప్పుడే తెలిసింది , " మూడు ముళ్ళు వేసినంత మాత్రాన ఒక్కటైనట్లు కాదు " గుర్తుకొచ్చాయా మహారాజా ......
అదీ అదీ ........
పురోహితులు : మీరు అలా అన్నారో లేదో తుఫానులా మారాల్సిన పెద్ద వర్షం ఒక్కసారిగా ఆగిపోయింది .
అవి నా మమసులోని మాటలే ..... , పరిష్కార మార్గం సూచించండి పురోహితులూ .........
పురోహితులు : దేవుడు - దేవత ఒక్కటవ్వడమే ....... , వివాహం తరువాత జరగాల్సిన మూడు రాత్రుల కార్యం జరగాల్సిందే .......
బలవంతంగా మూడు ముళ్ళు వేయించారు కానీ మూడు రాత్రుల కార్యం జరిపించలేరు - ఇక్కడినుండి కదిలితేనే కదా .......

బుజ్జాయిలు : తప్పు నాన్నగారూ తప్పు , ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరగాలి అంటూ కిందకుదిగి బుజ్జిసింహాలను ఎత్తుకుని సింహాలపైకి చేరారు , నాన్నగారూ ..... మేము వెళుతున్నాము మావెనుకే మీరు వస్తున్నారు .
ముత్తైదువులు : అక్కడ అన్నీ ఏర్పాట్లూ చేసేసాము మహారాజా ...... , యువరాణీ కోసం రాజభవనంలో యువరాణీ మందిరాన్ని - ప్రకృతి ఒడిలో పెరిగిన మీకోసం రాజభవనపు కొండపైనున్న ఉద్యానవనంలోని పూరి గుడిసెను శ్రుంగార పూల గుడిసెగా అలంకరించాము , ఒక్కసారి వచ్చి చూశారంటే మీరే ఉత్సాహంగా లోపలికి చేరిపోతారు .
లేదు లేదు లేదు నేను రానంటే రాను - బుజ్జాయిలూ నన్ను వదిలి వెళ్లిపోతున్నారా ? .
బుజ్జాయిలు : లేదు నాన్నగారూ ..... మీరూ వెనుకే వచ్చేస్తారు మాకు తెలుసు , అన్నాచెల్లెళ్ళు ( మీరు , మీ చెల్లెమ్మ ) అలంకరించిన గధుల్లోకి వెలితే మళ్లీ మమ్మల్ని పట్టించుకుంటారో లేదో అందుకే ముందే వెళ్లి అత్తయ్య - అమ్మలకు ముద్దులు అందిస్తాము , రండి రండి ......
ఊహూ రానంటే రాను అంటూ అమ్మవారి ముందు కూర్చున్నాను .

పురోహితులు : ముహూర్త సమయం కావస్తోంది .
ప్రజలు : మహారాజుగారు మొండిగా కూర్చున్నారు ఏమి చెయ్యడం ......
పురోహితులు : గ్రంథాల ప్రకారం వర్షం కురవాలి అంటే దేవుడు - దేవత ఒక్కటవ్వాలి , మీఇష్టం ఏమిచేస్తారో ....... , ఈ ముహూర్తం దాటితే ......
ప్రజలు : తెలుసు తెలుసు పుష్కరం వరకూ ఆగాలి , మన దేవుడిని ఎత్తుకుని వెళ్లిపోవడం ఒక్కటే మార్గం .......
వద్దు వద్దు అంటూ పరుగుతీసాను .
అప్పటికే ప్రజలంతా చుట్టుముట్టడంతో తప్పించుకునే వీలులేక అమ్మవారి వృక్షాన్ని గట్టిగా చుట్టేసి పట్టుకున్నాను .
ప్రజలంతా నవ్వుకున్నారు , మహారాజుగారూ ..... మీరు ఒక్కరు - మేము వందకుపైనే అంటూ ఒక్కటై కాస్త కష్టమైనా చెట్టు నుండి వేరుచేసి కళ్ళూ చేతులూ కత్తివేసి జై వీరాంజనేయ అంటూ ఎత్తుకున్నారు .

అమ్మా దుర్గమ్మ తల్లీ ఇక మీరే రక్ష ......
రాజ్య వీధులగుండా ఎత్తుకుని వెళుతుంటే అందరూ చూసి మంచిపని చేశారు అంటూ సంతోషంతో నవ్వుకుంటూ రాజ్య ద్వారం వరకూ వచ్చి లోపలికి పంపించారు .
కింద ఉద్యానవనంలో ఉన్న చెల్లెళ్ళు - చెలికత్తెలు ..... ఇక మేము తీసుకెళతాము , ప్రజలు కిందకుదించి కట్లు విప్పారు , అన్నయ్యా అన్నయ్యా ..... తప్పించుకోవాలని ప్రయత్నించారో మీ చెల్లెళ్ళు ఒక్కొక్కరూ ఒక్కొక్క భద్రకాలీ అవతారం ఎత్తుతారు గుర్తుపెట్టుకోండి అంటూ నవ్వుకున్నారు , శోభనం నుండి పారిపోయే వీరాధివీరుడిని మిమ్మల్నే చూస్తున్నాము అంటూ రెండువైపులా చేతులను ఒడిసి పట్టుకుని పైకి తీసుకెళ్లారు .

చివరి అంతస్తులోని యువరాణీ మందిరం దగ్గర నాకోసమే ఎదురుచూస్తున్న చెల్లెమ్మ ..... నాగుండెలపైకి చేరి ఈరోజుతో మీ విరహ వనవాసం పూర్తవ్వబోతోంది చాలా చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా , మీరు - వదిన ఇక జీవితాంతం సుఖసంతోషాలతో వర్ధిల్లుతారని మాత్రం చెప్పగలను .
చెల్లెమ్మా చెల్లెమ్మా ..... నా దేవకన్య గురించి నీకంటే ఎవరికి బాగా తెలుసు నువ్వే రక్షించాలి .
చెల్లెమ్మ : ప్రాణమైన చెల్లెమ్మగా చెయ్యాల్సినదే చేస్తున్నాను అన్నయ్యా - ఒక్కసారి మా వదిన సౌందర్యం చూశారంటే మేమెవ్వరం గుర్తుకురాము చివరికి బుజ్జాయిలుకూడా ......
ఇక నన్ను రక్షించేది బుజ్జాయిలు మాత్రమే ......, బుజ్జితల్లీ బుజ్జినాన్నా .......
చెల్లెమ్మ : అవునవును వారే వారే , మీకోసం మా వదినతోపాటు మీ మిత్రులతోపాటు పైన వెయ్యికళ్ళతో వేచిచూస్తున్నారు , నావలన ఆ సంతోషం ఆలస్యం అవ్వడం ఇష్టంలేదు తీసుకెళ్లండి తీసుకెళ్లండి అంటూ వెళ్లి యువరాజు కౌగిలిలోకి చేరి ఆనందిస్తోంది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-04-2023, 10:27 AM



Users browsing this thread: 59 Guest(s)