Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మహారాణి : బుజ్జాయిలూ ...... మీ నాన్నకు ఆకలివేస్తోందేమో ఈ పళ్ళు తినిపించండి , మహారాజు గారూ ...... సైనికులకు మన మిత్రులకు కూడా తెచ్చాము మీసంగతి మాకు తెలియదా .......
ధన్యవాదాలు మహారాణీ గారూ అంటూ బుజ్జాయిలను బండపై కూర్చోబెట్టి పండు అందుకుని బుజ్జాయిలకు తినిపించి తిన్నాను .
అలా కొరకడం ఆలస్యం బుజ్జితల్లి ..... నాచేతిలోని పండును లాక్కుని అమ్మా అంటూ పరుగునవెళ్లి అందించింది .
మహారాణి : నా బంగారం అంటూ వారించేలోపు నేను కొరికిన చోటనే కొరికి చాలా చాలా తియ్యగా ఉంది ఇప్పుడు తీసుకోండి మహారాజా .......
వద్దు .......
బుజ్జాయిలు : మా నాన్న - అమ్మ కొరికినది మాకు కావాలి అంటూ తిన్నారు .

అంతలో ప్రజలు ...... ఆహారం తీసుకురావడంతో అమ్మవారి సమక్షంలో కలిసి తిన్నాము .
చెల్లెళ్ళూ ..... ఎప్పుడు పడుకున్నారో ఏమో రాజభవనానికి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి .
చెల్లెళ్ళు : మా అన్నయ్య - బుజ్జాయిలు మరియు మరియు .......
ష్ ష్ ష్ ...... చెల్లెళ్ళూ అంటూ మహారాణీ గారు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు .
చెల్లెళ్ళు : నవ్వుకున్నారు , మీరు రోజూ విశ్రాంతి తీసుకునేది ఇక్కడే అని తెలిసింది కాబట్టి మేముకూడా ఇక్కడే .......
ఇక్కడా ..... ? , వద్దు చెల్లెళ్ళూ ..... చాలా ఇబ్బంది - చలికూడా ఎక్కువ , మీలో సుకుమారంగా పెరిగిన వాళ్ళు - యువరాణులు ఉన్నారు , ఇక్కడ ఉన్నంతసేపూ మీకు ఏలోటూ లేకుండా చూసుకుని మిమ్మల్ని జాగ్రత్తగా మీవాళ్ళ దగ్గరికి చేర్చడం మా బాధ్యత , తెల్లవారగానే కలుద్దాము , చెల్లెమ్మా - రాణులూ - మహారాణీ గారు ........ పిలుచుకుని వెళ్ళండి , ఈ అన్నయ్య అంటే ఇష్టమే కదా వెళ్ళండి వెళ్లి హాయిగా విశ్రాంతి తీసుకోండి అని ఒప్పించి అందరినీ పంపించి ఈరాత్రికైనా వర్షం పడాలని ప్రార్థించి గుడిసెలోకి చేరాను .

బుజ్జాయిలు ముద్దులుపెట్టి పాన్పును ఏర్పాటుచేశారు .
నా బంగారు బుజ్జాయిలు అంటూ గుండెలపై పడుకోబెట్టుకుని జోకొడుతున్నాను .
బుజ్జితల్లి : నాన్నా ..... మన దేవకన్య గురించి చెప్పండి .
ఈపాటికి వందసార్లకు పైనే విన్నారుకదా ......
బుజ్జినాన్న : ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది .
బుజ్జితల్లి : మొదటనుండీ చెప్పండి నాన్నా ...... అంటూ ముద్దుపెట్టింది , మీకు విసుగు వస్తోందా నాన్నా .......
నా ..... మన దేవకన్య గురించి వందసార్లు కాదు వెయ్యి సార్లైనా సంతోషంగా చెబుతాను బుజ్జాయిలూ ....... , ఈరోజు మాత్రం చెబుతూ చెబుతూ నిద్రపోయేదేలేదు , ప్రతీరోజూ ఉదయానికల్లా ఒంటిపై నూలుపోగు ఉండటం లేదు , ఈరాత్రికి ఎలాగైనా కనిపెట్టాలి .
బుజ్జాయిలు : ( మీవాళ్ళ కాదులే ) అన్నట్లు నవ్వుకుంటున్నారు - ముద్దులుపెడుతున్నారు .
నా దేవకన్యను తొలిసారి కలిసిన క్షణం నుండీ ఎంతో ఉత్సాహంగా హుషారుగా చెబుతూ చెబుతూనే అంతులేని ఆనందాన్ని పొందుతూ నాకే తెలియకుండా నిద్రలోకిజారుకున్నాను .
( బుజ్జాయిలు : కనిపెడతారన్నారు కదా నాన్నగారూ అంటూ చిన్నగా నవ్వుకుని ముద్దులుకురిపించి అమ్మా అమ్మా అంటూ పిలిచారు ) .
*****************

యధావిధిగా బుజ్జాయిల ముద్దులు మేల్కొని ఒంటిపై పూలు కప్పి ఉండటం చూసుకుని ప్చ్ ప్చ్ అంటూ వస్త్రాలు ధరించి , బుజ్జాయిలను ఎత్తుకుని చిన్నపాటి జలపాతం కిందకుచేరి స్నానమాచరించి సూర్యవందనం చేసుకున్నాను - నిద్రలో ఏమో జరుగుతోంది ఇబ్బందిగా అయితే అనిపించదు పైగా హాయిగా ఉంటుంది ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను వెంటనే నిద్రపట్టేస్తోంది .
బుజ్జాయిల ముసిముసినవ్వులు వినిపించి చూస్తే నిశ్శబ్దం ........

అంతలో మహారాజా మహారాజా ...... మిమ్మల్ని కలవడం కోసం దూరప్రాంతాలనుండి ముగ్గురు రాజులు వచ్చారు - అర్ధ రాత్రే వచ్చారు ప్రభూ - అతిథి మందిరాలలో విశ్రాంతి తీసుకున్నారు - మీకోసం ఎదురుచూస్తున్నారు .
అయితే వస్తున్నాము .
అవసరంలేదు మహారాజా ..... , మీలాంటి వీరాధివీరులను రప్పించడం భావ్యం కాదు అందుకే మేమే స్వయంగావచ్చాము అంటూ తండ్రి వయసున్న ముగ్గురు రాజులు గుర్రాలపై వచ్చారు వెనుకే పెద్ద సంఖ్యలో సైనికులు .......

నావెనుకే మహారాజా - బుజ్జాయిలూ అంటూ రాణులు తోడుగా మహారాణీ - చెల్లెమ్మ వచ్చారు .
ముగ్గురు రాణులూ నావెనుకకు చేరి బుజ్జాయిలను ఎత్తుకుని ముద్దుచేస్తూనే నావైపుకు ఆరాధనతో చూస్తున్నారు - రాజులవైపూ చూస్తున్నారు .

మహారాజులకు స్వాగతం - మీ రాకకు కారణం .......
రాజులు : సంతోషం వీరాధివీరా ...... , ఏ రాజ్యానికి వెళ్లినా మీ వీరత్వం గురించే మాట్లాడుకుంటున్నారు , మా రాజ్యాలు అంటూ మూడు పేర్లు చెప్పి రాణులవైపు ఆశతో చూస్తున్నారు .
వెనకున్న రాణులవైపుకు చూస్తే మహారాణీ - చెల్లెమ్మలను వదలనంతగా హత్తుకుని ఊహూ అంటున్నారు .
వీరాధివీరా ...... మీ రాణులు మా ముగ్గురి బిడ్డలు , మీరు అనుమతిస్తే వారిని మా రాజ్యాలకు తీసుకువెళ్లాడానికి వచ్చాము - మీరు పంపిన వర్తమానం నిన్న సాయంత్రానికి రాగానే ఎంతో ఆశతో బయలుదేరాము - మా బిడ్డలను రాక్షసుడైన ఆ మూర్ఖుడు బలవంతంగా తీసుకొచ్చాడు .
సంతోషంగా మహారాజులూ ...... , వారు మీ బిడ్డలు మీఇష్టం , తల్లిదండ్రులను చేరడం కంటే మరొక సంతోషం ఏమిటి అంటూ సంతోషంతో రాణులవైపు చూస్తే ఊహూ ఊహూ ..... అంటూ సైగలుచేస్తున్నారు .

రాణులూ ...... వెళ్లడం ఇష్టం లేదా ? , మీ తండ్రులంటే ఇష్టం లేదా ? .
రాణులు : చాలా చాలా ఇష్టం ...... , అంతకుమించి మీరు ...... బుజ్జాయిలు అక్కయ్య చెల్లి అంటే ప్రాణం , మాకు వెళ్లాలని లేదు , మేమిక్కడ సంతోషంగా ఉన్నాము .
రాజులు : సంతోషం తల్లులూ ...... , కానీ అక్కడ మీకోసం మీ తల్లులు మంచం పట్టారు , మిమ్మల్ని చూడాలని మిమ్మల్నే తలుచుకుంటున్నారు , మీకిష్టం లేకపోయినా మీఅమ్మల కోసమైనా ఒకసారి రండి , మీ ఇష్టం మీరు ఉండాలంటే ఉండండి లేకపోతే ఇక్కడికే వచ్చెయ్యండి .
చక్కగా చెప్పారు ...... , మీఇష్టం అన్నారుకదా వెళ్ళిరండి రాణులూ .......
రాణులు : అమ్మలకోసం - మా ప్రాణమైన మహారాజు కోరుతున్నారు కాబట్టి వెళతాము కానీ మాకు మాట ఇస్తేనే .......
ఏమిటి ? .
రాణులు : ఇక్కడకు రావడం మాకు ఇష్టం ఇక్కడే మా జీవితం - ఎట్టి పరిస్థితులలో మమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తానని మాటిస్తే సంతోషంగా వెళతాము .
మీ తండ్రులు .......
రాణులు : మా తండ్రులు కాదు మా మహారాజు మీరు ..... మీరు మాటిస్తేనే వెళతాము .
అమ్మవారి సమక్షంలో మాటిస్తున్నాను - మీకు ఇష్టమైతే మీఇష్టప్రకారం మిమ్మల్ని ఇక్కడకు తీసుకొస్తాను .

రాజులు : చాలా చాలా సంతోషం వీరాధివీరా ...... , అక్కడ వీళ్ళ తల్లులు కంగారుపడుతుంటారు వెంటనే బయలుదేరాలి .......
మీఇష్టం ...... , మంత్రిగారూ ...... వజ్రవైఢూర్యాలు - మణి మాణిక్యాలను రాసులుగా కానుకలతో అంగరంగవైభవంతో ఏర్పాట్లు చెయ్యండి .
మంత్రి : అలాగే ప్రభూ అంటూ వెళ్ళాడు .
కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది .
మహారాణీ గారు : బిడ్డలు దూరమైతే తల్లులు - తల్లులకు దూరంగా బిడ్డల బాధ నాకు తెలుసు , సంతోషంగా వెళ్ళిరండి , అన్నీ సర్దుకున్నాక వచ్చెయ్యండి అంటూ ప్రాణంలా కౌగిలించుకొన్నారు .
బుజ్జాయిలను తమ గుండెలపైనుండి వదలడం లేదు రాణులు .......
అన్నీ ఏర్పాట్లు పూర్తవ్వడంతో రాజ్యం చివరవరకూ తోడుగా వెళ్లి మూడు దారులలో ఒక్కొక్కరూ వెళ్లడం చూసి నాకూ కొద్దిగా బాధవేసింది .
ఇక కష్ట సమయాలలో ఒకరికొకరు తోడుగా ఉన్నట్లు చెల్లెమ్మ - మహారాణీ గారి కన్నీళ్లు ఆగడంలేదు - బుజ్జాయిలు అయితే పిన్నమ్మా పిన్నమ్మా పిన్నమ్మా అంటూ ఏడుస్తూనే ఉన్నారు .
మళ్లీ వస్తారని నచ్చచెబుతూ ఆనకట్ట దగ్గరకు చేరుకుని తరువాతి కొన్నిరోజులపాటు వర్షం కోసం చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా ప్రయోజనం లేకపోయింది .

మరికొద్దిరోజులపాటు వర్షం కురావకపోతే దాదాపు రాజ్యంలోని ఆహారనిల్వలు ఖాళీ అయిపోతాయని మంత్రిగారు వ్యక్తపరిచారు .
ఎమ్మెచెయ్యలేకపోతున్నానన్న నా నిస్సహాయస్థితిని చూడలేకపోయింది మహి ..... , అమ్మవారి చెంతకువెళ్లి అమ్మా నదీతల్లీ ...... ప్రజలంతా నా ప్రాణనాథుడి మీదనే ఆధారపడి ఉన్నారు , అనుగ్రహించండి అంటూ నిద్రాహారాలు మాని ప్రార్థించింది - రెండుమూడురోజులు కావడంతో అమ్మవారి పాదాలముందే స్పృహకోల్పోయింది .
( తల్లీ మహీ ...... మిమ్మల్ని ఇబ్బందిపెట్టాలని కాదు - మీఇద్దరి కలయికే ఏకైక మార్గం .
దుర్గమ్మ అనుగ్రహించినట్లు కళ్ళుతెరిచి భక్తితో మొక్కుకుంది - ఇప్పుడే ఇప్పుడే వెళ్లి నాదేవుడు గుండెలపైకి చేరతాను అమ్మా .......
అప్పుడే కాదు మహి తల్లీ ...... , ఒక చిలిపితనంలా జరగాలి , నీ ప్రాణ నాథుడిని ఆటపట్టిస్తూ నువ్వే కదా ఆలస్యం చేసినది , మీ చిలిపి ప్రేమను ఎంతలా ఆనందించానో మాటల్లో వర్ణించలేను , చివరగా మరింత రంజుగా ఉండాలి అంటూ వివరించారు .
మహి : అమ్మా ...... మీరేనా కోరిక కోరుతున్నది అంటూ ఆశ్చర్యపోతోంది .
మేము మాత్రమే మీ కోరికలు తీర్చాలా ...... నా సంతోషం కోసం తప్పదు , చిలిపి పసందైన శుభకార్యం జరగాల్సిందే అటుపై రాత్రికి ....... నీకు చెప్పాల్సిన అవసరం లేదులే ......
పో అమ్మా అంటూ సిగ్గులోలికిపోతోంది మహి ...... 
అలాగే మీతోపాటు యువరాణీ వివాహం కూడా .....
మహి ఆనందాలకు అవధులులేకుండాపోయింది - ఆనందబాస్పాలతో మొక్కుకుంది .
ఎంత త్వరగా శుభకార్యాలు జరిగితే మీ రాజ్యానికి అంత మంచిది ఎందుకంటే రాజ్యంలో చాలా ఉన్నాయి , అలా అని ఆహారానికి ఎప్పటిలానే ఇబ్బందిపెట్టనులే .......
మహి : అంటే ఎప్పుడో ఖాళీ అవ్వాల్సిన ఆహారనిల్వలు ...... మీవల్లనే అన్నమాట ధన్యులం అమ్మా అంటూ కన్నీళ్లను తుడుచుకుని పాదాభివందనం చేసుకుని పరుగున ఈవిషయమై బాధపడుతున్న చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళింది ) .

మహి : చెల్లీ చెల్లీ .......
చెల్లెమ్మ : వదినా వదినమ్మా ...... అంటూ కౌగిలించుకుంది .
మహి : చెల్లీ చెల్లీ ......
చెల్లెమ్మ : మూడురోజులయ్యింది మీరు తిని ముందైతే తినండి అంతో ప్రాణంలా తినిపించసాగింది .
మహి : సంతోషంగా తింటాను చెల్లీ ..... అంటూ తినిపించింది , చెల్లీ ..... శుభవార్త , రాబోవు శుభాధినాన మీ వివాహం ......
చెల్లెమ్మ : వదినమ్మా ..... అంటూ సిగ్గుపడుతూ కౌగిలిలోకి చేరింది , నాతోపాటు నా వదినమ్మ వివాహం కూడా జరిగితేనే నేను - బుజ్జాయిలు చూడలేదుకదా .......
మహి : పిల్లలు ..... తల్లిదండ్రుల వివాహం చూడలేరే చెల్లీ .....
చెల్లెమ్మ : అధినిజమే కానీ ఆ అదృష్టం మన బుజ్జాయిలకు కలగబోతోంది .
మహి : అంతా అమ్మవారి అనుగ్రహం అంటూ చెల్లెమ్మతోపాటు సిగ్గుపడింది , నాకిష్టమే కానీ ఎలా చెల్లీ ......
చెల్లెమ్మ : జరిపించడానికి నేనున్నానుకదా రండి అంటూ మంత్రిగారి దగ్గరకు తీసుకెళ్లింది , మంత్రిగారూ ..... వెంటనే ఎంతమంది ఉంటే అంతమందీ పురోహితులను వెంటనే పిలిపించండి అంటూ ఆజ్ఞవేసింది .
మంత్రి : అలాగే యువరాణీ .......
చెల్లెమ్మ : ఈవిషయం ముందుగా బుజ్జాయిలకు తెలియజెయ్యాలి వాళ్ళూ సహాయం చేస్తారు , చెప్పగానే వాళ్ళ సంతోషం .......
మహి ఇంకా సిగ్గుపడుతూనే ఉంది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-04-2023, 10:25 AM



Users browsing this thread: Depukk, 4 Guest(s)