Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
సూర్యోదయాయానికి ముందే వొళ్ళంతా తియ్యదనంతో మహిని తలుచుకుంటూనే వొళ్ళువిరుస్తూ లేచి కూర్చున్నాను - ఈ నాలుగేళ్లలో ఇంత హాయిగా నిద్రపోలేదు అంటూ కళ్లుమూసుకునే మెలికలుతిరిగిపోతున్నాను .
నాకు తెలియకుండానే మూడురాత్రుల శోభనం చేసేసుకున్నావు కదూ ఒక్కసారి నిన్ను చేరనివ్వు అప్పుడు ఏడాదిపొడవునా శోభనమే .......
మూసిముసినవ్వులు వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళుతెరిచిచూస్తే ఎవ్వరూ లేరు - ఇంతకూ ఒంటిపై వస్త్రాలు ఉన్నాయా ? , తడిమి చూసుకుని హమ్మయ్యా అనుకున్నాను , కానీ ఆశ్చర్యం ఛాతీపై వస్త్రం ముడులన్నీ విప్పేసి ఉన్నాయి - వర్షం నిలిచిన తరువాత చలి తగలకుండా ముడులన్నీ వేసుకున్నట్లుగా గుర్తుందే ఎలా ఊడిపోయాయబ్బా ...... , రాత్రంతా నా ఎడమవైపున నిలువునా ఎవరో ఘాడంగా హత్తుకుని పడుకున్నట్లు అనుభూతి - ఇంకెవరూ నా ఊహా దేవకన్యనే ..... తన స్థానమే కదా - ఒక్కటిమాత్రం చెప్పగలను వొళ్ళంతా మాధుర్యం కొత్తగా ఉంది , బుజ్జాయిలూ ...... పడిపోయేలా ఉన్నారు అంటూ ఇద్దరినీ ఆప్యాయంగా ఎత్తుకుని గుండెలపై పడుకోబెట్టుకుని జోకొట్టాను .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ...... అంటూ నిద్రలోనే నా బుగ్గలపై ముద్దులుపెట్టారు.
బుజ్జాయిలూ ...... అమ్మ కావాలా ? , ఇదిగో ఇప్పుడే తీసుకెళతాను .
బుజ్జాయిలు : ఇద్దరూ ఒకేసారి కళ్ళుతెరిచి నాన్న నాన్న అంటూ ముదులుకురిపించి గట్టిగా హత్తుకున్నారు నిద్రమత్తులో .......
మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లనా ? .
బుజ్జాయిలు : ఎందుకు ? .
మీరేకదా అమ్మా అమ్మా అంటూ కలవరించారు .
బుజ్జాయిలు : మేము కలవరించినది మా నాన్న హృదయంలో మాతోపాటు ఉన్న అమ్మను ....... , బుజ్జాయిలూ ...... మీనాన్న ప్రాణంలా ఎత్తుకుని ముద్దులతో జోకొడుతున్నారు మరికాసేపు హాయిగా నిద్రపోండి అంటూ తెలియజేస్తే నూ అమ్మను తలుచుకున్నాము , మరొక విషయం చెప్పమా ...... రాత్రంతా నిద్రపోకుండా మిమ్మల్నే ప్రాణంలా చూస్తూ మీ పెదాలపై - నుదుటిపై ముద్దులతో జోకొడుతూనే ఉన్నారు .
నిజమా నిజమా బుజ్జాయిలూ , మీకూ అలాంటి కలనే వచ్చిందా అంటూ ముద్దులతో ముంచెత్తుతున్నాను .
బుజ్జాయిలు : నిజమే నాన్నా , కావాలంటే అమ్మ చిత్రలేఖనం వేసి చూయిస్తాము .
మా బుజ్జాయిలకు ఈ బుజ్జివయసుకే చిత్రలేఖనం వచ్చా ? .
బుజ్జాయిలు : మా నాన్న అన్ని విద్యాలలో ప్రావీణ్యులు అవునాకాదా ? .
నేనేనా ? లేక .......
బుజ్జాయిలు : నాన్నా - నాన్నా ....... అంటూ బుజ్జికన్నీళ్ళు .
అంతే హృదయం చలించిపోయింది - క్షమించండి క్షమించండి అంటూ ప్రాణంలా ముద్దులుపెట్టి కన్నీళ్లను తుడిచాను .
బుజ్జాయిలు : మీకు తెలియదు కదా తెలిస్తే అలా మాట్లాడరని మాకు తెలుసులే , మా నాన్న ఎన్ని విద్యలలో ప్రావీణ్యులో అన్ని విద్యలలో మేమూ ప్రావీణ్యులం .
బుజ్జాయిల ఆంతర్యం అర్థం కాక మళ్లీ ఆలోచనలో పడ్డాను .
బుజ్జాయిలు : నమ్మడం లేదు కదూ ...... అంటూ నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి కిందకుదిగి వెళ్లి వస్త్రాల పెట్టె ప్రక్కన ఉన్న మరొక పెట్టెలోనుండి తెల్లనైన వస్త్రాలను - పుల్లలను - రంగులు గల మట్టి పాత్రలను జాగ్రత్తగా తీసుకొస్తున్నారు , పెట్టెలోనుండి తీసుకున్నంతసేపూ బుజ్జాయిలతోపాటు వేరొక గుసగుసలు కూడా వినిపించాయి - నా ఏకాగ్రత అంతా బుజ్జాయిలు ఏమిచేస్తున్నారనే ........

బుజ్జాయిలూ ఏమిచేస్తున్నారు ? , మరికాసేపు హాయిగా పడుకోవచ్చు కదా .......
బుజ్జాయిలు : ఆగండి నాన్నా ...... , మా నాన్న చిత్రలేఖన విద్య మాకూ వచ్చిందని నిరూపించనివ్వండి అంటూ ముచ్చటగా నాముందు కూర్చున్నారు , అయ్యో బుజ్జిసింహాలూ ...... మీ నిద్రకు భంగం కలిగించేసామా క్షమించండి క్షమించండి అంటూ పూలపాన్పు ప్రక్కన చేరి దీనంగా బుజ్జాయిలవైపు పైకి చూస్తుండటం చూసి ఎత్తుకుని ఒడిలో పడుకోబెట్టుకున్నారు .
ముద్దొచ్చేస్తున్నారు బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : ముద్దొస్తే ముద్దులుపెట్టాలి మాటలు కాదు .
మళ్లీ మూసిముసినవ్వులు వినిపించాయి .
చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరి వెనుకకుచేరి ముద్దులుకురిపించాను - చూద్దాం ఏ అమ్మ చిత్రలేఖనం వేస్తారో ........
బుజ్జాయిలు : అన్నయ్యా - అక్కయ్యా ...... నాన్న అంతులేని ఆనందంతో ఆశ్చర్యపోవాలి , నాన్నా - నాన్నా ...... మేము చెప్పేంతవరకూ కళ్ళు తెరవనేకూడదు , మా నాన్న హృదయంలో మాతోపాటు ఉన్న అమ్మను స్పృశిస్తూ చిత్రలేఖనం వేస్తాము , నాన్నా ...... కళ్ళు మాత్రం తెరవకూడదు .
మా బుజ్జాయిలు ఎలా అంటే అలా అంటూ కళ్ళు మూసుకున్నాను , మీ అమ్మ చిత్రలేఖనం కాకపోయినా అమ్మాయిలా ఉండే చిత్రలేఖనం అయినా వెయ్యండి .
బుజ్జాయిలు : నాన్నా - నాన్నా అంటూ బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ స్స్స్ .......
ఈసారి కాస్త ప్రస్ఫూటంగా నవ్వులు వినిపించి చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు .
బుజ్జాయిలు : కళ్ళు తెరవకండి మొదలుపెడుతున్నాము అంటూ నా హృదయంపై పదేపదే బుజ్జి అరచేతులతో స్పృశిస్తున్నారు .

అలాగే అలాగే ...... బుజ్జాయిలూ ఒక విషయం అడుగుతాను .
బుజ్జాయిలు : కళ్ళు మూసుకునే అడగండి .
ఒకసారేమో నా బుజ్జితల్లి అన్నయ్య అని ఒకసారేమో తమ్ముడు అని - బుజ్జినాన్న ఏమో చెల్లి అని మరొకసారి అక్కయ్య అని ప్రాణంలా పిలుస్తున్నారు ఏంటి ? .
బుజ్జాయిలు : మేము ...... మీ కవలలం కదా నాన్నా నాన్నా అంటూ నా హృదయంపై ఒకేసారి ముద్దులుపెట్టారు ప్చ్ ప్చ్ అంటూ .......
అఅహ్హ్ ...... హృదయంలో పులకింత , నా బుజ్జాయి బంగారాలు కవలలన్నమాట ఉమ్మా ఉమ్మా అంటూ కురులపై ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ముద్దులెన్నైనా మాకు ఇష్టమే కానీ కదిలించకండి అంటూ నా హృదయంపై మళ్లీ స్పృశించారు .
లేదు లేదులే ....... 
ముసిముసినవ్వులు ........

కొద్దిసేపటి తరువాత బుజ్జాయిలూ అయ్యిందా ? .
బుజ్జాయిలు : చాలాసేపు కళ్ళు మూసుకుని ఉండటం కష్టం కదా నాన్నా ...... , క్షమించండి క్షమించండి కొద్దిసేపు కొద్దిసేపు అయిపోవచ్చింది అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
ఇలా ముద్దులుపెడితే ఎంతసేపైనా సంతోషంగా కళ్ళు మూసుకుంటాను .
బుజ్జాయిలు : అలాగే నాన్నా అంటూ బుజ్జిబుజ్జినవ్వులతోపాటు మధ్యమధ్యలో ముద్దులుకురిపిస్తున్నారు .
బుజ్జిబుజ్జినవ్వులతోపాటు వేరొక నవ్వులు అతిదగ్గరగా అంతలోనే ముద్దులుకూడా ...... , బుజ్జాయిలూ ......
బుజ్జాయిలు : కళ్ళు తెరవకూడదు నాన్నా......
అధికాదు బుజ్జాయిలూ ముద్దులు ముద్దులు అదిగో మళ్లీ .......
బుజ్జాయిలు : అవును ముద్దులు మీరే ఆడిగారుకదా .......
మీ ముద్దులతోపాటు అదిగో మళ్లీ ......
బుజ్జాయిలు : మా ముద్దులతోపాటు ఏంటి నాన్నా ..... ? .
బుజ్జాయిలూ ...... మనతోపాటు ఎవరైనా ఉన్నారా ? అదిగో మూడు ముద్దులు - నవ్వులు .......
బుజ్జాయిలు : అవును మనతోపాటు బుజ్జిసింహాలు ఉన్నాయికదా ......
అదిగో మళ్లీ మూడు ముద్దులు - మధురమైన వెచ్చని శ్వాస , ఒక్కసారి కళ్ళు తెరవనా ? .
బుజ్జాయిలు : ఇలా అపద్దo చెప్పి కళ్ళు తెరవకూడదు నాన్నా తప్పు అంటూ ముద్దులుపెట్టి నవ్వుకుంటున్నారు .
అదిగో మళ్లీ మూడు ముద్దులు ...... , ఖచ్చితంగా మనతోపాటు ఎవరో ఉన్నారు .
బుజ్జాయిలు : ఉన్నారుకదా ......
ఎవరు ఎవరు ? .
బుజ్జాయిలు :  మనం ముగ్గురం - బుజ్జిసింహాలు మరియు ...... మరియు మా నాన్న హృదయదేవకన్య అయిన అమ్మ అంటూ ఈసారి హృదయంపై ముద్దులు .
అనుకున్నట్లుగానే మూడో ముద్దు తాకగానే వొళ్ళంతా తియ్యనైన జలదరింపులతో వెనక్కు పూలపాన్పుపైకి వాలిపోయాను భువిని మరిచిపోయి ....... , అటుపై హృదయపైనే కాకుండా ముఖమంతా చివరికి పెదాలపై ముద్దులవర్షమే కురుస్తోంది ........ , ఆ మాధుర్యానికి అలా అలా స్వర్గపు ద్వారంవరకూ వెళ్లిపోసాగాను .

నాన్నా నాన్నా ...... కళ్ళు మూసుకోమని చెబితే ఏకంగా ఊహల్లోకి వెళ్లిపోయారా ? చిరునవ్వులు చిందిస్తూ లేపారు .
ఒక్కసారిగా కళ్ళుతెరిచి బుజ్జాయిలూ ..... ఎవరో ఉన్నారు , హృదయంపై - నుదుటిపై - బుగ్గలపై మరియు మరియు పెదాలపై కూడా ముద్దులు అంటూనే పెదాలపై వేళ్ళతో స్పృశించుకుని ఇదిగో ఇంకా ముద్దు మాధుర్యం అలానే ఉంది అంటూ బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి పూలపాన్పు కిందకుదిగి పూరిగుడిసె మొత్తం అణువణువూ వెతికి ఎవరూ లేరే అంటూ ఆశ్చర్యపోతున్నాను .
నాన్నా నాన్నా ...... ఇదిగో ఇదిగో అమ్మ చిత్రలేఖనం అమ్మ చిత్రలేఖనం అంటూ పూలపాన్పుపై లేచి నిలబడి తెల్లనైన వస్త్రాలను చూయించారు .
వేరే ఎవరి చిత్రలేఖనమో అదికూడా సరిగ్గా వేసి ఉండరు అంటూ సాధారణంగా బుజ్జాయిలవైపుకు చూసాను . 

అంతే బుజ్జాయిలు అన్నట్లుగానే ఆశ్చర్యం - ఆనందం - అవాక్కై అలా కన్నార్పకుండా చూస్తూ కదలకుండా ఉండిపోయాను , నా దేవకన్య అంటూ నా చెయ్యి నాకు తెలియకుండానే నా హృదయంపైకి చేరిపోయింది , కళ్ళల్లో ఆనందబాస్పాలు .......
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... మా నాన్న హృదయంలోని మా అమ్మ చిత్రలేఖనం సరిగ్గానే వేసామా ? అంటూ ప్రాణంలా అడిగారు .
బుజ్జాయిలూ ...... అంటూ వెళ్లి ఒక్కసారిగా ప్రాణం కంటే ఎక్కువగా నా గుండెలపైకి హత్తుకున్నాను - ఇంత ఖచ్చితంగా ఇంత అద్భుతంగా ఎలా అంటూ నా దేవకన్యను ప్రాణంలా చూస్తూనే బుజ్జాయిలకు ముద్దులుకురిపిస్తున్నాను .
బుజ్జాయిలు : చెప్పాముకదా నాన్నా ...... , రాత్రంతా ప్రక్కనే ఉన్నారని , పైగా మీ హృదయంలో అమ్మకు తోడుగా ఉన్నది మేమేకదా ....... , మీ సంతోషం చూస్తుంటేనే అర్థమైపోతోంది బాగా వేశామని .......
నాకంటే నాకంటే అందంగా చిత్రీకరించారు - ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో వర్ణించలేను అంటూ ఎత్తుకుని చుట్టూ తిరుగుతున్నాను .
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... పాపం బుజ్జిసింహాలకు కళ్ళు తిరిగేలా ఉన్నాయి .
లేదులేదు అంటూ చిత్రలేఖనాలవైపు ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : అన్నయ్యా - చెల్లీ ...... , నాన్న ..... అమ్మ పెదాలపైనే ముద్దులుపెడుతున్నారు అంటూ నవ్వుకుంటున్నారు .
సిగ్గేసి బుజ్జితల్లి బుజ్జి హృదయంలో తలదాచుకున్నాను .
బుజ్జాయిలు ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు .

నమ్ముతున్నాను నమ్ముతున్నాను బుజ్జాయిలూ ...... , ఇంతకూ మీ పేర్లు తెలుసుకోనేలేదు .
బుజ్జాయిలు : మీకంటే అమ్మే నయం , మమ్మల్ని చూడగానే మా పేర్లతోనే ప్రాణం కంటే ఎక్కువగా పలకరించింది అంటూ బుంగమూతిపెట్టుకున్నారు , ఒక్కరోజైనా మా పేర్లు తెలియలేదు మీకు ...... , ఇంకా తెలియలేదా మా నాన్న అమ్మకు ప్రాణం కంటే ఎక్కువైన పేర్లే .......
ఏమాత్రం ఆలోచించకుండా ...... , " మీ అమ్మకు ప్రాణమైన పేరు మహేశ్వరుడు - నాకు ప్రియాతిప్రియమైన పేరు మహేశ్వరి " .
బుజ్జాయిలు : హమ్మయ్యా ...... ఇప్పటికైనా మా నాన్న నుండి విన్నాము అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
" బుజ్జితల్లి మహీ - బుజ్జినాన్న మహేశ్వర్ " సంతోషంలో మాటలు రావడంలేదు మహీ - మహేష్ అంటూ ఆనందబాస్పాలతో ప్రాణమైన ముద్దులుపెట్టి అంతే ప్రాణంలా హత్తుకుని ఆనందానుభూతికి లోనౌతున్నాను .
నాన్నా - నాన్నా అంటూ బుజ్జాయిలు కూడా బుజ్జి ఆనందబాస్పాలతో ముద్దులుకురిపిస్తున్నారు .
మహీ - మహేష్ ...... క్షణక్షణానికి అంతులేని సంతోషం పంచుతూనే ఉన్నారు , నాలుగేళ్ళ బాధను ఒక్కరోజులో మాయం చేసేసారు తెలుసా ? .
బుజ్జాయిలు : నాన్నా తెల్లవారుతోంది మీరు వెళ్లే సమయం .......
లేదులేదు అవును అంటూ లోలోపలే ఏదోతెలియని బాధ - విడిపోనంతలా హత్తుకున్నాను .

బుజ్జాయిలు : నా కన్నీళ్లను తుడిచి , నాన్నా నాన్నా ...... సూర్యోదయం అవుతోంది సూర్యవందనం చేసుకోవాలికదా అంటూ కిందకుదిగి , బుజ్జిచేతులతో నా చేతివేళ్ళను అందుకుని బయటకుపిలుచుకునివెళ్లారు .
మరింత ఆశ్చర్యం ...... సూర్యోదయం వైపుకు తిరిగి సూర్యవందనం చేసుకుంటున్నారు .
మహీ - మహేష్ ....... , ముందుగా బుజ్జాయిలతోపాటు సూర్యవందనం చేసుకున్నాను .

బుజ్జాయిలు : నాన్నా నాన్నా ...... నదీఅమ్మ ఒడిలో సూర్యవందనం చేసుకోవాలి కానీ ......
నదీఅమ్మ కోపాగ్నికి లోనయ్యింది రాజ్యం అని అర్థమయ్యింది బుజ్జాయిలూ ...... , అనుక్షణం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు తెలుసా ? .
బుజ్జాయిలు : అంటే ఇంకా నమ్మడం లేదన్నమాట అంటూ మళ్లీ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వు వచ్చేసింది - నమ్ముతున్నాను నమ్ముతున్నాను ముద్దొచ్చేస్తున్నారు తెలుసా అంటూ ప్రాణంలా గుండెలపైకి తీసుకున్నాను .

అంతలో మహారాజా మహారాజా ....... అంటూ బాధతో మాదగ్గరికి వచ్చారు చెలికత్తెలు .
అన్నయ్యా ...... కొలనులోని నీళ్లన్నీ ఖాళీ అయిపోయాయి రండి అంటూ చెల్లి వెనుకే రాణులు బాధపడుతున్నారు .
వెళ్ళిచూస్తే అడుగున మాత్రమే కొన్నిరోజులకు కేవలం దాహార్తిని తీర్చడానికి మాత్రమే మిగిలాయి .
మహారాణీగారు ముసుగులో వెనుకే వచ్చి చూసి చెల్లెళ్ళూ ...... ఎలా ఖాళీ అయ్యాయి అని బాధతో అడిగారు .
తప్పు నాదే మహారాణీగారూ ...... , రాజ్యప్రజలకోసం నిన్న కొలను కవాటాలను తెరవమని ఆజ్ఞవేసి రాత్రికి మూసేయించడం మరిచిపోవడం వలన రాజ్యపు మంచినీటి కాలువలద్వారా సముద్రం పాలు అయిపోయాయి , మన్నించండి మన్నించండి .
మహారాణీ : లేదులేదు మహారాజా .......
తప్పు మాదే మన్నించండి మహారాజా ...... మేము అప్రమత్తంగా ఉండాల్సింది అంటూ భటులంతా మోకరిల్లారు .
లేదు లేదు నిన్న అలసిపోవడం - అటుపై వర్షం ఆనందంలో అందరమూ మైమరిచిపోయాము , మళ్లీ వర్షం ఎప్పుడు పడుతుందో ఆకాశంలో ఒక్క మేఘపు జాడకూడా కనిపించడం లేదు అంటూ బాధపడుతూ కొండ అంచువరకూ వెళ్ళాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-04-2023, 10:16 AM



Users browsing this thread: 54 Guest(s)