Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మంజరి : అదిగో మహారాణీ - రాణులు - యువరాణీ వంటలు కూడా సిద్ధం , మీకోసం ప్రేమతో ...... అదే అదే స్వయంగా తీసుకొస్తున్నారు ప్రభూ అంటూ ఎగురుకుంటూ వెళ్లి మహారాణీ గారి భుజంపైకి చేరింది .
అంతలోనే మహారాణీ చెంతకు చేరిపోయావా మంజరీ అన్నట్లు చిరుకోపంతో చూస్తున్నాను .
మహారాణీ - రాణులంతా చిరునవ్వులు చిందిస్తూ తమ తమ చేతుల్లోని వంట పాత్రలను మాచుట్టూ ఉంచారు , ఆకలివేస్తోంది అన్నారుకదా ప్ర .....భూ .... మహారాజా ...... మీకోసం ప్రేమతో మేమే వండాము స్వీకరించండి అంటూ ముఖాలను చెంగులతో కప్పుకునే మాట్లాడారు .
ప్రేమతోనా ....... ? .
మాహారాణి : అంతులేని ప్రేమతో ...... అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
మంజరి : ( మా ముద్దుల మహిలా కాకుండా భలేగా మాట్లాడుతున్నావు మహీ ) అంటూ మహారాణీ బుగ్గపై ముద్దుపెట్టింది .
బుజ్జాయిలు : ముద్దులుకూడా అమ్మకే పెడుతోంది , అమ్మ - పిన్నమ్మలు - అత్తయ్య ....... వంట చెయ్యడం మెమెప్పుడూ చూడనేలేదు - చివరికి మాకోసం కూడా వండనేలేదు - ప్రాణంలా తినిపించేవాళ్ళు అంతే , ఘుమఘుమలాడిపోతున్నాయి ....... మీరంటే ఎంత ప్రేమో అర్థమౌతోందా నాన్నా - నాన్నా .......
ష్ ష్ బుజ్జాయిలూ ....... , మీ అమ్మగారు వింటే బాధపడతారు అంటూ సున్నితంగా బుజ్జి నోళ్ళకు చేతులను అడ్డుపెడుతున్నాను .
 మాహారాణి: నాన్న - నాన్న ........
బుజ్జాయిలు : మహి హృదయంపై చేతినివేసుకుని పరవసించిపోతుండటం చూసి అంతులేని ఆనందంతో మహారాణీవైపు గాలిలో ముద్దులు వదిలారు , మరింత సంతోషపెట్టడానికన్నట్లు నాన్నా నాన్నా నాన్నా నాన్నా ....... అంటూ ప్రాణంలా పిలుస్తూనే ఉన్నారు నేను ఎంత వారించడానికి ప్రయత్నిస్తున్నా .......
మహారాణి : అఅహ్హ్ ...... అంటూ రాణుల గుండెలపైకి చేరారు .
బుజ్జాయిలు : మహి సంతోషాన్ని ఆస్వాదిస్తూనే నాన్నా - నాన్నా అంటూ నా బుగ్గలపై ముద్దుల వర్షమే కురిపిస్తున్నారు .
అఅహ్హ్ ...... మీ ముద్దులతో నన్ను మంత్ర ముగ్ధుడిని చేసేస్తున్నారు తెలుసా అంటూ అంటూ ఆప్యాయంగా గుండెలతో హత్తుకుని అంతే ప్రాణంలా ముద్దులుపెట్టాను .
మాహారాణి గారి సంతోషమైన మూలుగుకు స్పృహలోకొచ్చి , బుజ్జాయిలూ బుజ్జాయిలూ ...... అలా పిలవకూడదు - మీ అమ్మగారు బాధపడతారు అంటూ తలదించుకుని వారిస్తున్నాను .

ఏంటి బాధపడటమా ....... , మాకైతే అలా అనిపించడం లేదు అన్నయ్యా అంటూ నాప్రక్కన చేరి బుజ్జితల్లికి ముద్దులుకురిపించింది చెల్లి , ఏంటి వదినమ్మా ..... బాధపడుతున్నారా లేక లేక ....... సిగ్గుపడుతున్నారా ? అంటూ బుజ్జాయిలతోపాటు ఆనందిస్తోంది .
చెల్లీ చెల్లీ ....... నువ్వుకూడానా ? .
యువరాణి : నన్నేమి చేయమంటారు అన్నయ్యా ...... , ఎదురుగా జరుగుతున్నదే చెబుతున్నాను .
బుజ్జాయిలు : అవునవును నాన్నా నాన్నా .......
ష్ ష్ ష్ ....... 
బుజ్జాయిలు : అమ్మ బాధపడితే అమ్మను అమ్మ అని కాకుండా మహారాణీ అని పిలుస్తాము - మా నాన్నను .... నాన్న అని పిలవకుండా ఉండలేము .
బుజ్జాయిలూ ...... అంటూ కళ్ళల్లో బాస్పాలు .
యువరాణి : మీ నాన్న కళ్ళల్లో ఆనందబాస్పాలు చూస్తేనే తెలియడం లేదూ ...... , మీరంటే ఎంత ప్రాణమో .......
బుజ్జాయిలు : నాన్నంటే నాన్నే అంటూ గట్టిగా ముద్దులుపెట్టారు .

మాహారాణి : ముద్దులు మాత్రమేనా బుజ్జాయిలూ లేక ఆకలివేస్తోంది అన్న మీ నాన్నకు తినిపించడం ఏమైనా ఉందా ? .
అమ్మో అమ్మో అమ్మో ఇంత ప్రేమ - ఇంత ప్రాణమా అంటూ గిలిగింతలు పెట్టి ఆటపట్టించారు రాణులు .
లేదు లేదు లేదు .......
రాణులు : ఆ విషయం మీరు కాదు మా అక్కయ్య చెప్పాలి , ప్రాణం పోయినా చెప్పరు , మీరంటే ప్రాణం కంటే ఎక్కువేమో .......
లేదు లేదు నా ప్రాణం కంటే ఎక్కువ నా దేవకన్య మహి మాత్రమే అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పచ్చని గడ్డిపైకి వాలిపోయాను బుజ్జాయిలతోపాటు తియ్యనైన అనుభూతితో ....... , చూసారా ...... తలుచుకుంటేనే ఎంత ఆనందమో ...... , మహీ ..... ఎక్కడ ఉన్నావురా - తెల్లవారగానే నా ప్రయాణాన్ని మొదలుపెట్టి నిన్ను ఎలాగైనా చేరుకుంటాము , ఈ మంజరి ఉందే నువ్వే సర్వస్వమని చెప్పి ఇప్పుడేమో మరొక మాహారాణి చెంతకు చేరిపోయింది , తెల్లారాక మా వెంట వస్తుందో లేదో .......
మహారాణీ గారు నాకంటే ఎక్కువగా పులకించిపోతున్నట్లు మంజరిని సున్నితంగా చేతుల్లోకి తీసుకుని ముద్దులుపెడుతూ మురిసిపోతుండటం చూసి ఆశ్చర్యపోయాను .

యువరాణి : మీ హృదయంలో మీ దేవకన్య ఉన్నా మీరంటే ఇంత ప్రాణం అన్నమాట వదినమ్మకు , ఉమ్మా వదినమ్మా .......
బుజ్జాయిలు : భలే భలే మహారాణీ మహారాణీ ......
మాహారాణి : ఉమ్మ్ .......
బుజ్జాయిలు : అలాగే అలాగే అమ్మా అమ్మా ....... , భలే భలే .......
చిరుకోపంతో లేచి కూర్చున్నాను .
యువరాణి : మీ నాన్నగారికి కోపం వచ్చినట్లుంది - ఆకలిలో మరింత కోపం రాకముందే తినిపించండి బుజ్జాయిలూ .......

బుజ్జాయిలు : కోపంలో కూడా మా నాన్న ముద్దొచ్చేస్తున్నారు అంటూ ముద్దులుపెట్టి నవ్వుతున్నారు .
ఆ ముద్దులకే కోపం మొత్తం ఎగిరిపోవడం తెలిసి నాకే ఆశ్చర్యం వేసింది .
బుజ్జాయిలు : నాన్న నవ్వారు నాన్న నవ్వారు .......
మాహారాణి : మా బంగారుకొండలు అంటూ బుజ్జాయిలతోపాటు నావైపుకు కూడా ముద్దులు వదిలి సిగ్గుపడుతున్నారు .
మహారాణీ గారూ .........
యువరాణి : అన్నయ్యా ...... మీ దేవకన్య అంత అందంగా ఉంటుందా ? .
స్వయంగా దివి నుండి భువికి దిగివచ్చిన విశ్వ సుందరి సుగుణాల రాశి , అందంతోపాటు అనకువ - నేనంటే అంతులేని ప్రేమ అంటూ నాకు తెలియకుండానే అనుభూతిలో బుజ్జాయిల బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టాను .
యువరాణి : ఒక్కసారి వదినమ్మను చూశారంటే ...... , వదినమ్మా ...... 
లేదు లేదు లేదు అంటూ బుజ్జాయిలతోపాటు అటువైపుకు తిరిగేసాను .
యువరాణి : అంటే వదినమ్మ అందం చూస్తేనే దాసోహం అయిపోతారని అటువైపుకు తిరిగారన్నమాట .
లేదు లేదు లేదు , నా దేవకన్యను మించిన సౌందర్యారాశి ఈ భువిపై లెనేలేదు అంటూ మహారాణీ వైపుకు తిరిగాను .
యువరాణి : అందరితోపాటు నవ్వుకుని , అయితే ఒకసారి ......
ఆకలి అమ్మో ఆకలి ...... బుజ్జాయిలూ ఆకలి ......
మాహారాణి : నవ్వుకుని , బుజ్జాయిలూ ...... మీ నాన్నకు ప్రాణంలా తినిపించండి .

బుజ్జాయిలు : అలాగే అమ్మా ...... , నాన్నా నాన్నా ...... మీ ముందు ఉన్నవాటిలో ముందు ఏమి తినిపించాలి ? .
అన్నీ చూసి మధ్యలో ఉన్న వంట పాత్రవైపు చూయించాను .
అమ్మో అమ్మో అంటూ అందరూ ఆశ్చర్యపోయి ఆనందిస్తున్నారు .
మంజరి అయితే చుట్టూ సంతోషంతో ఎగురుతోంది .
ఏమైంది ఏమైంది ?
బుజ్జాయిలు : అంతులేని ఆనందంతో ముద్దులుపెట్టి , ఆ పాత్రను అందుకుని ప్రేమతో నోటికి అందించారు .
బుజ్జాయిలూ ...... ముందు మీరు ? .
బుజ్జాయిలు : మాకు మాకు .......
ఓహో ...... మీ అమ్మ గోరుముద్దలు తినాలని ఉందా వెళ్ళండి .
బుజ్జాయిలు : ఊహూ ఊహూ ...... మా నాన్నను వదిలి ఆ మాహారాణి ...... లేదు లేదు అమ్మ దగ్గరికి వెళ్లాడమా ? అంటూ నవ్వుకుంటున్నారు .
మరి ........
బుజ్జాయిలు : అమ్మ గోరుముద్దలను నాన్న చేతులతో తినాలని ఆశగా ఉంది .
మీ అమ్మగారు బాధపడతారేమో .......
యువరాణి : బాధపడటమా ...... ? , ఇప్పటివరకూ జరిగినది చూశాక కూడా మా అన్నయ్య లాంటి వీరాధివీరులు అడిగాల్సిన ప్రశ్నలేనా అవి అంటూ నవ్వుకుంటున్నారు .
నిజమేకదా అంటూ ఇద్దరినీ తొడలపై కూర్చోబెట్టుకుని ప్రాణంలా నోటికి అందించాను .
మాహారాణి : బుజ్జాయిలూ ముద్దులతో ........
బుజ్జాయిలు : అవునవును నాన్నా నాన్నా ..... , ముద్దులతో మా అమ్మ గోరుముద్దలను మీ చేతులతో తినిపించండి .
మాహారాణి : సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
చెల్లీ ...... నాకేమీ అర్థం కావడం లేదు .
యువరాణి : పోను పోను అర్థమవుతాయిలే అన్నయ్యా ...... , దేవదేవుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారుకదా .......
బుజ్జాయిలు : నాన్నా నాన్నా ఆకలి ఆకలి అంటూ ముద్దుముద్దుగా .......
చెల్లెమ్మా ...... ఇదిమాత్రం నిజం , బుజ్జాయిల పిలుపులు మాత్రం నేరుగా హృదయానికే చేరుతున్నట్లు ఏదో తెలియని మాధుర్యం అంటూ ఎవ్వరికీ వినిపించకుండా చెవిలో గుసగుసలాడాను .
యువరాణి : వదినమ్మా .......
చెల్లెమ్మా చెల్లెమ్మా .......
యువరాణి : పో అన్నయ్యా ...... , ఈ మాటలను వినాల్సిన వాళ్ళు వింటే మరింత ఆనందం .......
ష్ ష్ ష్ చెల్లీ ....... , బుజ్జాయిలకు ముద్దులతో తినిపించాను .
బుజ్జాయిలు : నా వేళ్ళతో సహా జుర్రుకుని మ్మ్ మ్మ్ ....... 
అంత రుచిగా ఉందా బుజ్జాయిలూ ...... , మిమ్మల్ని చూస్తుంటేనే నోరూరిపోతోంది అంటూ మళ్లీ ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ఎంత బాగుందో తింటే మీరే చెబుతారు , నాన్నా - నాన్నా ...... అంటూ నోటికి అందించారు .
మిత్రమా - అడవిరాజా ....... అంటూ వాళ్ళవైపు చూసాను .
యువరాణి : వాళ్లంటే ఎంత ఇష్టమో తెలిసే ముందు వాటికి ఆహారం అందించింది వదినమ్మ , మీరు సంతోషంగా తినవచ్చు ......
కుమ్మేస్తున్నారన్నమాట తినండి తినండి , మంజరీ ........ రా తినిపిస్తాను .
ఎగురుకుంటూ వచ్చి నా భుజంపైకి చేరి నాతోపాటు బుజ్జాయిలకు ముద్దులుపెట్టి అంతలోనే మళ్లీ మహారాణీ భుజంపైకి చేరి , మహారాణీ చేతినుండి గింజలను తింటోంది .
మంజరీ ....... 
అందరితోపాటు బుజ్జాయిలు - మహారాణీగారు కూడా నవ్వేశారు , నాన్నా - నాన్నా ....... తినండి .
మహారాణీ గారూ - చెల్లీ - రాణులూ ....... వెళ్లి మీరూ తినండి .
మాహారాణి : తినడం కోసం వెళ్లడం దేనికి ఇక్కడే తింటాము .
ఇక్కడే తింటారా కానివ్వండి , బుజ్జాయిలూ ..... ఆకలి .
మహారాణీ చిరునవ్వులు .......
బుజ్జాయిలు : చిరునవ్వులు చిందిస్తూ నాన్నా నాన్నా అంటూ ముద్దులుపెట్టి బుజ్జి బుజ్జి చేతులతో ఒకేసారి తినిపించారు .
ముద్దలతోపాటు బుజ్జాయిల బుజ్జివేళ్ళను చప్పరించాను .
బుజ్జాయిలు : సంతోషంతో మళ్లీ ముద్దులుపెట్టి మురిసిపోతున్నారు .
మ్మ్ మ్మ్ ...... మీరు చెప్పినట్లుగానే అమృతంలా ఉంది - మొత్తం తినేయ్యాలని ఉంది .
యువరాణి : ఆ వంట వండినది మా దేవత వదినమ్మ కాబట్టి అంత రుచి .......
అవునా ...... , అదేమీకాదు మన బుజ్జాయిలు తినిపించారు కాబట్టి అంత రుచి .
యువరాణి : బాగుంది అన్నయ్యా ...... , ఏదో సామెత ఉంది కానీ గుర్తుకురావడంలేదు , సరిగ్గా వదినమ్మ వండిన వంటను ఎంచుకుంది మీరు - అమృతం అంటూ పొగిడింది మీరు - మొత్తం తినేయ్యాలని అన్నది మీరే కదా ......
నేనే ....... , అదంతా మన బుజ్జాయిల బుజ్జి గోరుముద్దలు మహిమ అంటూ తినిపించి తిని బుజ్జిచేతులపై ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : లేదులే నాన్నా నాన్నా ...... , అమ్మ చేతి గొప్పతనం అది అంటూ బుజ్జిబుజ్జినవ్వులు నవ్వుకుంటున్నారు .
సరేసరే బుజ్జాయిలూ ష్ ష్ ....... , చెల్లీ ...... వదినమ్మ అంటూ ప్రాణంలా పిలుస్తున్నావు .
యువరాణి : వదిన నిజంగా అమ్మనే దేవతనే , చిన్నప్పుడే అమ్మను కోల్పోయాను - అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగాను , ఎప్పుడైతే వదిన వచ్చారో అమ్మలా చూసుకున్నారు అంటూ మహారాణీ చెంతకు చేరబోతే .......
మహారాణీ గారు ఆపారు .
యువరాణి : అన్నయ్యతో ఈ సంతోషాన్ని పంచుకోవడమే మా వదినమ్మకు మరింత సంతోషం అన్నమాట అంటూ బుజ్జితల్లి బుగ్గను వదలడం లేదు .
మహారాణీ సంతోషం మనసుకు తెలుస్తోంది .
చాలా సంతోషం చెల్లీ ....... , ఎక్కువ చెబుతున్నాను అనుకోకండి మహారాణీ గారిని మించిన గొప్ప యువరాణి నా దేవకన్య అంటూ బుజ్జితల్లికి ముద్దుపెట్టి అనుభూతి చెందుతున్నాను .
మహారాణి : తెగ పులకరించిపోతూనే చాలు చాలు భోజనం చెయ్యండి - బుజ్జాయిలూ ...... ముద్దులతో తినిపించండి , మీ అత్తయ్య - పిన్నమ్మలు నాకంటే రుచిగా వండారు .
చెల్లీ ...... అసూయ చెందుతున్నారా ? లేక ఆనందిస్తున్నారా ? , నాకు నవ్వులు కూడా వినిపిస్తున్నాయి .
యువరాణి : ప్రాణ నాథుడే అంతలా పొగిడితే వొళ్ళంతా సీతాకోకచిలుకలే .......
చెల్లీ ...... నేను పొగిడినది నాదేవకన్యను కదా .......
యువరాణి : మనసు గెలిచిన వీరాధివీరుడు ఎవ్వరిని పొగిడినా ...... తనే పరవసించిపోతుంది .
అర్థం కానట్లు ఆలోచనలో పడ్డాను .
యువరాణి : అన్నయ్యా ...... పోను పోను మీకే అర్థమవుతుందిలే తినండి .
బుజ్జి గోరుముద్దలు అందుకుని , ఆడువారిమాటలకు అర్థాలే వేరు అంటూ తృప్తిగా తిని బుజ్జాయిలకు తినిపించాను .
మాహారాణి : ప్చ్ ....... నాకూ తినిపించొచ్చుకదా ప్రభూ ......
అంతే ఒక్కసారిగా వెక్కిళ్ళు వచ్చేసాయి .
మహారాణీ గారితోపాటు అందరూ నీళ్లు అందించి నవ్వుకుంటున్నారు .
బుజ్జాయిలు ఎవరి గ్లాస్ అయితే అందుకోకూడదు అనుకున్నానో వారిదే అందుకుని నోటికి అందించారు - వెక్కిళ్ళు ఎక్కువ అవ్వడంతో తప్పక త్రాగి బుజ్జాయిల నుదుటిపై సున్నితంగా తాకించాను .
బుజ్జాయిలు : స్స్స్ స్స్స్ .....
నొప్పివేసిందా బుజ్జాయిలూ ....... , నన్నూ ......
బుజ్జాయిలు : లేదు లేదు నాన్నా ...... హాయిగా ఉంది అన్నారు .
మా మంచి బుజ్జాయిలు అంటూ ముద్దులుపెట్టాను .
మాహారాణి : అలా మళ్లీ నన్నెప్పుడు కొడతారు - మళ్లీ ఇప్పుడు ముద్దులుపెడతారు ? .
లేదు లేదు లేదు ....... , బుజ్జాయిలూ ...... కొండపైనున్న అందమైన ఉద్యానవనాన్ని చూయిస్తాను అన్నారుకదా తీసుకెళ్లండి అంటూ పైకిలేచాను .
మహారాణీ నవ్వులు ఆగడంలేదు .
బుజ్జాయిలు : ఆ ఉద్యానవనం అమ్మ - అత్తయ్య - పిన్నమ్మలది ..... నాన్నా , ఎంత అందంగా .......
ఈ మాటలను వినడం కంటే అక్కడకు వెళ్లడమే ఉత్తమం పదండి .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-02-2023, 10:57 AM



Users browsing this thread: 55 Guest(s)