Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
( సింహాలను చూసి భయంతో అక్కయ్యా అక్కయ్యా - చెల్లెళ్ళూ - వదినలూ - మహారాణీ ( చెలికత్తెలు - వంట వాళ్ళు ) ...... అంటూ మహారాణిగారు తప్ప అందరూ ఒకరినొకరు హత్తుకున్నారు .
బుజ్జితల్లీ - నాన్నా ...... అంటూ ధైర్యంగా సింహాల దగ్గరకువెళ్లి వెనక్కు చూస్తున్నారు - గుమ్మం దగ్గరికి వెళ్లి బయటకు తొంగి తొంగి చూస్తున్నారు మాహారాణి గారు ఆశతో .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ...... ఎవరికోసం చూస్తున్నావో మాకు తెలుసులే మహారాజుగారు రాలేదు - ఎంత బ్రతిమాలుకున్నా ఊహూ , మీపేరు చెబితేనే చాలు అంతదూరం పారిపోతున్నారు , ప్రాణసఖి - దేవకన్య - హృదయసుందరి ..... ఇంకా ఏవేవో ప్రియమైన పేర్లతో ఊహల్లోనే ఉంటున్నారు అంటూ ఇప్పటివరకూ జరిగిన సంభాషనను వివరించారు .
మాహారాణి గారి ఆనందాలకు అవధులులేకుండాపోయాయి - బుజ్జాయిలకు ముద్దులవర్షం కురిపించారు .
బుజ్జాయిలు : నువ్వంటేనే ఇష్టం లేదని తెలిపినా ఎందుకమ్మా అంత సంతోషం , పిన్నమ్మలూ - అత్తయ్యా ...... ఎందుకంత భయం అంటూ సింహాలతో మరింత దగ్గరికివెళ్లి భయాన్ని ఆనందిస్తున్నారు , అమ్మా ...... నువ్వెంటి అస్సలు భయపడటం లేదు .

మంజరి : ఎందుకంటే బుజ్జాయిలూ ....... , మీ మహారాజు హృదయసుందరి - ప్రాణసఖి - దేవకన్య - మహి ...... ఎవరోకాదు మీ అమ్మనే కాబట్టి .
కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం ...... , అవునా అక్కయ్యా అక్కయ్యా - వదినా అంటూ అంతులేని ఆనందంతో మహారాణీగారి కాదు కాదు నా దేవకన్య మహిని చుట్టేశారు - అంటే మీ అసలుపేరు అందమైన పేరు మహి అన్నమాట , వీరాధివీరుడి వీరపత్ని ........ , అందుకేనా ...... మహారాజు గారిని కోరుక్కుతినేసేలా చూస్తూనే ఉన్నారు - గుండెలపై చేరడానికి అంతలా ప్రయత్నించారు .
దేవకన్య : అవును అంటూ సిగ్గుపడింది , ముసుగులో ఉన్నా నా మంజరి మరియు మిత్రుడు కృష్ణ కనిపెట్టేసారు అంటూ మంజరిని ప్రేమతో అక్కున చేర్చుకుంది .
బుజ్జాయిలకు పట్టరాని ఆనందంతో వెక్కిళ్ళు వచ్చేసాయి , బుజ్జితల్లీ - నాన్నా ..... అంటూ నీళ్లు త్రాగించారు అందరూ ......
బుజ్జాయిలు : అమ్మా అమ్మా అంటూ కిందకుదిగి బుజ్జిసింహాలను కిందకువదిలి వెళ్లి సంతోషంతో హత్తుకున్నారు , అంటే మమ్మల్ని నిద్రపుచ్చడానికి చెప్పిన " మహి - మహేశ్వరుడి కథలు " .......
అవునన్నట్లు సిగ్గుపడింది మహి ........
అడవిరాజు - అడవిరాణి ఆనందాలకు అవధులులేనట్లు గుర్రంలా ఎగురుతున్నాయి , అమ్మానాన్నలను చూసి బుజ్జిసింహాలు కూడా నాట్యం చేస్తున్నాయి .
బుజ్జాయిలు : చూసి ఆనందించి , నాన్న నాన్న ....... ఇప్పుడా చెప్పేది అంటూ తొడలపై గిల్లేసారు .
దేవకన్య : స్స్స్ స్స్స్ .......
బుజ్జాయిలు : మాకొస్తున్న కోపానికి కొరకలేదు సంతోషించండి అంటూ బయటకు పరుగులుతీశారు .
దేవకన్య : బుజ్జితల్లీ - నాన్నా ....... ఆగండి ఆగండి .
బుజ్జాయిలు : మమ్మల్ని ఆపకండి మరొక్క క్షణం కూడా ఉండలేము .
దేవకన్య : అధికాదు బుజ్జితల్లీ ...... , ఈ విషయం ఇప్పుడే చెప్పకండి .
బుజ్జాయిలు : మావల్ల అయితే కాదు , నాన్నగారి ప్రేమ అంతులేనిది , మేమంటే ఎంతో ఇష్టం , ఈ విషయం తెలిస్తే ..... అంటూ మురిసిపోతున్నారు .
దేవకన్య : మీకు కథలుగా చెప్పినవన్నీ మీ నాన్నగారికి తెలియదు కదా .......
బుజ్జాయిలు : అవును నదీఅమ్మ సహాయంతో ప్రేమను పంచారు కదూ ...... అయ్యో ఇప్పుడెలా అమ్మా .......
బుజ్జాయిలు : మీ నాన్నగారితో గడిపినది మూడే మూడు రోజులు అయినా జీవితాంతం సరిపోతుంది , మీ నాన్నకు తెలియనివ్వకుండా ప్రేమను పంచాలన్న కోరిక కలిగింది .
చిలిపికోరిక - చిలిపి పనులు - చిలిపి ప్రేమ అన్నమాట అంటూ రాణులు - చెల్లి ..... దేవకన్య చుట్టూ చేరి గిలిగింతలుపెట్టారు .
దేవకన్య : చిరునవ్వులు చిందిస్తోంది .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా ...... మిమ్మల్ని ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడనేలేదు కనీసం నవ్వడం కూడా చూడలేదు , " మహి - మహేశ్వరుడి కథలు " చెప్పేటప్పుడు తప్ప , మిమ్మల్ని ఇలానే చూడాలి - ఇప్పుడు మేమేమి చెయ్యాలో చెప్పండి .
దేవకన్య : ఆ మాత్రం తెలియదా ....... , మీరు పిల్లలుకాదు పిడుగులు అని మీ నాన్నగారు పొగిడారు కదా .......
బుజ్జాయిలు : అర్థమైంది అర్థమైంది అమ్మా ...... , ముఖాన్ని పారదర్శకంగా ఉండే వస్త్రంతో దాచుకోండి అంటూ మహితోపాటు రాణులు - యువరాణి బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిసింహాలను ఎత్తుకుని పరుగులుతీశారు , ఒక్కసారిగా ఆగి మళ్లీ వెనక్కువచ్చి నాన్నగారికి - మిత్రుడు కృష్ణకు ఆకలివేస్తోంది అంటూ ఒక బుజ్జి చేతిలో బుజ్జిసింహం మరొక బుజ్జిచేతిలో ఆహారపాత్రను పట్టుకుని పరుగులుతీశారు .
మంజరి : నిజంగా పిడుగులే అంటూ దేవకన్య భుజంపైకి చేరింది .
అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా - వదినా ...... మీ నిజమైన పేరు మహేశ్వరి అన్నమాట , " మహి - మహేశ్వరుడి కథలు " మాకూ చెప్పండి - చెప్పాల్సిందే అంటూ హత్తుకున్నారు .
యువరాణి : నా ప్రేమకంటే అందమైనది - మా వదిన ఇక్కడకువచ్చి నాలుగేళ్లు అవుతోంది , ఇప్పటికీ అన్నయ్య హృదయదేవతగా మా అందమైన వదిననే ......
దేవకన్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో సిగ్గుపడుతోంది .
రాణులు : మీ దేవుడి దగ్గర సిగ్గుపడవచ్చుకానీ ముందైతే మాకు ఆ మహా అద్భుతమైన కథలు కాదు కాదు ప్రేమదృశ్యకావ్యం గురించి చెప్పండి చెప్పండి .
దేవకన్య : సరే సరే అంటూ పులకించిపోతూ మొదలుపెట్టింది .
రెండు సింహాలూ బుద్ధిగా వెళ్లి దేవకన్య వాళ్ళ ముందు కూర్చున్నాయి .
మంజరి ...... అడవిరాజుమీదకు చేరి , మహీ ..... వినాలని ఆశపడుతున్నారు చెప్పు చెప్పు ......
అందరూ ఆనందించారు ) .

వచ్చేసాం మేము వచ్చేసాం అంటూ చాలావేగంగా వచ్చి బుజ్జి పాత్రలను బండపై ఉంచేసే , చేతులలో బుజ్జిసింహాలతో ఏకంగా నామీదకు ఎగిరారు .
జాగ్రత్త జాగ్రత్త అంటూ ఇద్దరినీ గుండెలపై ఆప్యాయంగా హత్తుకుని హమ్మయ్యా అన్నాను .
కొన్ని క్షణాలపాటు నన్నే చూస్తూ ముద్దులు ఆగడం లేదు .
ముద్దుముద్దుకూ ఆనందం రెట్టింపవుతూనే ఉంది - ఏంటి ఏమయ్యింది బుజ్జాయిలూ ...... ఈ అంతులేని సంతోషపు ముద్దులు మరియు ఆనందబాస్పాలతో కొత్తగా చూస్తున్నారు .
మారు మాట్లాడకుండా ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు , కానివ్వండి కానివ్వండి మీరెన్ని ముద్దులుపెడితే అంత ఇష్టం అంటూ చిరునవ్వులు చిందిస్తూ ముద్దులను ఆస్వాధిస్తున్నాను .
అంతలో ఒక్కసారిగా ముద్దులుఆపి నాకళ్ళల్లోకే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ " నాన్న - నాన్న " అంటూ పిలిచారు .
హృదయం పులకించిపోసాగింది - అంతే ప్రాణంలా వాళ్ళ కళ్ళల్లోకి కన్నార్పకుండా చూస్తుండిపోయాను , " నాన్న " పిలుపులోని మధురానుభూతిలో నన్ను నేను మరిచిపోయాను .
" నాన్న - నాన్న " అంటూ ముద్దులతో మళ్లీ పలికి నా భుజంపైకి చేరారు .
వొళ్ళంతా తియ్యదనంతో జలదరించిపోతోంది .

ఆ దృశ్యాలను చూసి ప్రక్కనే ఉన్న మిత్రుడు నాట్యం చేస్తున్నాడు .
బుజ్జాయిలు : నాన్న నాన్న నాన్న నాన్న .......
ఆ అందమైన పిలుపుల మైకం నుండి తేరుకున్నట్లు లేదు లేదు లేదు అలా పిలవకూడదు బుజ్జాయిలూ , మహారాణీగారు వింటే బాధపడతారు ష్ ష్ ష్ అంటూ ఆపడానికి ప్రయత్నించినా ఆపడంలేదు .
బుజ్జాయిలు : నాన్న నాన్న నాన్న నాన్న ....... , ఈ పిలుపుకోసం మాటలు వచ్చినప్పటి నుండీ ఎదురుచూస్తున్నాము నాన్నా - నాన్నా .......
ష్ ష్ ష్ ...... అలా అని నన్ను పిలవకూడదు - మీ అమ్మ కోప్పడతారు .
బుజ్జాయిలు : కోప్పడితే అమ్మను అమ్మ అని పిలవడం మానేస్తాము - మిమ్మల్ని నాన్న అని పిలుస్తాము , మాకు మా అమ్మ కాదు కాదు ఆ మహారాణీ కంటే మా నాన్ననే ప్రాణం - మిమ్మల్ని నాన్న అని పిలవడమే ఇష్టం అంటూ గట్టిగా చుట్టేశారు , ఇక మీతోనే ఉండిపోతాము , నాన్నా - నాన్నా ...... మమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళకండి .
మంజరి చూసి అంతులేని ఆనందంతో ఎగురుకుంటూ వచ్చి , బుజ్జాయిల సంతోషం కోసమైనా అవును ఆనండి ప్రభూ .......
నాకు తెలియకుండానే నానోటి నుండి " ఊ " పలకడమే కాకుండా వెనుక మెత్తటి గడ్డిమీదకు చేరిపోయాను .
బుజ్జాయిలు : నాన్న నాన్న నాన్న నాన్న అంటూ అంతులేని ఆనందాలతో ముద్దులుకురిపిస్తూనే ఉన్నారు , నాన్నా - నాన్నా ...... ఆకలివేస్తోంది అన్నారుకదూ అంటూ నన్ను లేపి కూర్చోబెట్టి ఒకపాత్రను మిత్రుడి ముందు ఉంచి నాదగ్గరకు చేరుకుని ఒడిలో కూర్చున్నారు బుజ్జిసింహాలతో ....... , నాన్న నాన్న ...... మీకోసం అమ్మ - అత్తయ్య - పిన్నమ్మలు కలిసి ప్రేమతో చేశారు తినండి .
మంజరి : బుజ్జాయిలూ ...... మీ బుజ్జిబుజ్జిచేతులతో తినిపిస్తే మరింత సంతోషం మీ నాన్నకు .
బుజ్జాయిలు : అవునా నాన్న - నాన్న ......
" నాన్న " మధురమైన పిలుపు మైకంలో మళ్లీ ఊ అన్నాను .
బుజ్జాయిలు : సంతోషంతో కేకలువేస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించి ప్రేమతో తినిపించారు .
మ్మ్ మ్మ్ ...... చాలా రుచి .
బుజ్జాయిలు : అమ్మ వంట మరి అంటూ ముద్దులతో ముద్దలు తినిపించి ఆనందిస్తున్నారు .
బుజ్జాయిల ఆనందాలను చెరపడం ఇష్టంలేక మౌనంగా ఉండిపోయాను - ఆ ముద్దైన ఆనందాలను చూస్తూ ఉండిపొమ్మని మనసు హృదయం పరవళ్లు తొక్కుతున్నాయి .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-02-2023, 10:56 AM



Users browsing this thread: Kacha, 9 Guest(s)