Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జాయిలు : బజ్జిసింహాల దాహం తీర్చి , ఆకలివేస్తోందా ...... అమ్మ చెంతకు చేరి పాలు త్రాగుతారా అంటూ అడవిరాణి దగ్గరికి వదిలి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరారు , మహారాజా ...... నీళ్లు లేవు కాబట్టి ఆహారం కూడా లేదేమో , వంటశాల ప్రక్కనే ఉన్న పెద్ద భవనంలో కూరగాయలతోపాటు మాంసం కూడా చాలా నిల్వ ఉంచారు , మహారాజుగా ఆజ్ఞవేస్తే వెంటనే తీసుకొస్తారు .
మహారాజు మహారాజు ....... మిమ్మల్నీ , మహారాజే ఆజ్ఞ వెయ్యాల్సిన అవసరం లేదు మా ముద్దిచ్చే బుజ్జి యువరాజు యువరాణి కూడా ఆజ్ఞ వెయ్యవచ్చు ఎందుకంటే జంతువుల ఆకలి తీరబోతున్నది మీవల్లనే కదా ...... , మీ మనస్సు గొప్పది మీ అమ్మగారిలానే అనుకుంటాను , మహారాణీగారు ...... దాహం తీరుస్తున్నారు - మీరు ..... ఆకలి తీర్చబోతున్నారు అంటూ ఇష్టంగా ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ఊహూ మహారాజుగారే ఆజ్ఞ వెయ్యాలి .
నాకోసం నాకోసం దయచేసి నాకోసం అంటూ బ్రతిమాలుకున్నాను .
బుజ్జాయిలు : మహారాజు ఆజ్ఞ మేముకూడా పాటించాలి కాబట్టి సరే అంటూ సైనికులకు ఆజ్ఞవేశారు మొత్తం ఆహారాన్ని తీసుకురమ్మని ........
మా బుజ్జాయిల మనస్సు బంగారం అంటూ ముద్దులుకురిపిస్తాను .
మహారాణిగారు సంతోషం పట్టనట్లు చప్పట్లు కొడుతూనే ఉన్నారు .
కాస్త ఇబ్బందిపడుతూనే , ప్రజలందరికీ కూడా ధాన్యాన్ని పంచండి .
మహారాజా మహారాజా మహారాజా .........
ఆగండి ఆగండి ....... , ఎవరి గొప్పతనం ఎవరికి ఇస్తున్నారు , బుజ్జియువరాజు - బుజ్జియువరాణి ........
ప్రజలు : బుజ్జి యువరాజు - బుజ్జి యువరాణి ....... అంటూ రాజ్యం మొత్తం వినిపించేలా హోరెత్తించారు సంతోషంతో ........
జంతువులు మాంసం - కూరగాయలను చూసి సంతోషాలతో గర్జించాయి - గాండ్రించాయి , మాపైకి నీళ్లు వెదజల్లి సంతృప్తిగా తిని ఆశీర్వదించి వెళ్లిపోయాయి , చివరగా అడవిరాజు కుటుంబం మాత్రమే మిగిలింది .
ప్రజలు : మహారాజా ...... ఈ ధాన్యంతో చాలారోజుల తరువాత పిల్లలు కడుపునిండా తినబోతున్నారు - ధన్యవాదాలు మహారాజా అంటూ దండాలు పెడుతున్నారు .
ఈ ఒక్కపూటే కాదు రోజూ మూడుపూటలా ఇంటిల్లిపాది సంతృప్తిగా తినేలా చెయ్యాలి ఎలా యువరాజా మహారాజా ....... ? .
యువరాజు : వీలవుతుంది మహారాజా ...... , మీవీరత్వం వలన చుట్టుప్రక్కల వేరువేరుగా ఉన్న పదులసంఖ్యలో పెద్ద చిన్న రాజ్యాలు ఒక్కటైపోయాయి ఒకరికొకరం సహకరించుకుంటే సంతోషంగా జీవించవచ్చు , ఆ ఏర్పాట్లు నేను చూసుకుంటాను నాకు వదలండి .
చాలా చాలా సంతోషం మహారాజా ...... , అలాగే మన రాజ్యం కరువు పోయేలా దుర్గమ్మ తల్లికి పూజలు జరిపించాలి .
యువరాజు : మీరు ఎలా అంటే అలా మహారాజా ...... , నాకుకూడా సెలవు ఇప్పిస్తే మా తండ్రిగారి దహన సంస్కారాలు పూర్తిచేయాలి .
మరొకసారి మా సంతాపం మహారాజా ......
యువరాజు : కృతజ్ఞుణ్ణి మహారాజా ...... , పూర్తయ్యాక కలుస్తాను అంటూ చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి తన భద్రతా సైన్యంతోపాటు వెళ్ళిపోయాడు .

ప్రజల గురించి ఆలోచించే మహారాజు దొరకడం మన అదృష్టం అంటూ సంతోషంతో నినాదాలు చేసి సెలవు తీసుకున్నారు ప్రజలు ....... 
అడవిరాజా ...... పూర్తిగా చీకటిపడింది మీరు వెళ్లలేదే ? , ఓహో ...... మీ పిల్లలు కదూ ......
ఊహూ ..... అంటూ తలలను అడ్డంగా ఊపి నాప్రక్కనే చేరి ఆశతో చూస్తున్నాయి .
మంజరి : అడవిరాజుపైకి చేరి , " నేను , నా కుటుంబాన్ని చేరినట్లుగానే మీరుకూడా మీ ప్రియసఖి చెంతకు చేరేంతవరకూ మీరు ఔనన్నా కాదన్నా మీవెంటే " అంటున్నాడు ప్రభూ అడవిరాజు అనిచెప్పివెళ్లి మహారాణీ చుట్టూ ఎగురుతోంది .
అడవిరాజా ....... నిర్ణయానికి వచ్చేసారన్నమాట నామాటకూడా వినరు అయితే , కృతజ్ఞుణ్ణి .......
మేమే కృతజ్ఞులం అన్నట్లు నా పాదాలను స్పృశిస్తున్నారు .
భలేభలే అంటూ ఆనందిస్తున్నారు బుజ్జాయిలు ....... 
కృష్ణా ...... రేయ్ మిత్రమా ఎక్కడ ఎక్కడ , నువ్వుకూడా మహారాణీ చెంతకే చేరిపోయావా ...... సరిపోయింది - ఏమైంది మీకు ? , మీకు ఆకలివెయ్యడం లేదా నాకైతే తెగ ఆకలిగా ఉంది .
ఆకలిగా ఉందా వెంటనే వంటలు సిద్ధం చేస్తాము అంటూ మహారాణిగారు ఆతృతతో రాణులు - చెల్లితోపాటు రాజమందిరం లోపలికివెళ్లారు .
బుజ్జాయిలూ ....... మీ రాజ్యంలో .....
బుజ్జాయిలు : మన రాజ్యం ......
అమ్మో సరే సరే మనరాజ్యంలో మాహారాణి - రాణులు వంటలు చేస్తారా ? .
బుజ్జాయిలు : లేదు లేదు వంట మనుషులు చాలామంది ఉన్నారు కదా ..... మాకూ  అదే ఆశ్చర్యంగా ఉంది , మీరు ఆకలి అనగానే అమ్మ చలించిపోయి పరుగులుతీశారు వెనుకే మంజరి కూడా ......
మంజరి కూడా వెళ్లిపోయిందా సరిపోయింది - నువ్వు వెళ్లలేదే మిత్రమా .......
బుజ్జాయిలు : వెళ్లడానికే ప్రయత్నించి ఆగడం చూసాము మహారాజా ......
ఏమో అయ్యింది మీకు , నాకంటే మహారాణీగారే ఎక్కువ అయిపోయింది మీకు .
బుజ్జాయిలు :  గారు వద్దండి అమ్మ .......
తప్పు తప్పు ....... , ఆహా ...... చంద్రుడి వెన్నెల మరియు కాగడాల వెలుగులలో ఎంత అద్భుతంగా ఉంది అంటూ కొండకు ఆనుకుని నిర్మించిన మహాద్భుతమైన రాజభవనాలను చూస్తున్నాను .
బుజ్జాయిలు : కొండ పైభాగం మరింత అద్భుతంగా ఉంటుంది రండి చూయిస్తాము అంటూ బుజ్జిచేతులతో చూయించారు అటు అంటూ ....... , అడవిరాజా - కృష్ణ మిత్రమా రండి ........
ఉమ్మా ఉమ్మా .......

బుజ్జాయిలు : మహారాజా ...... మీకు రాజభవనాలంటే ఇష్టమా ? , భవనాలలోపల మరింత విలాసవంతంగా ఉంటుంది .
నాకు - నా ప్రాణ సఖికి ...... ప్రకృతి అంటే ఇష్టం , కొండ అందాలను చెరపకుండా - పచ్చని చెట్లను నరికి వెయ్యకుండా నిర్మించిన రాజభవనాల నిర్మాణపు సౌందర్యం ఇష్టం , ఇక విలాసాలకు చాలాదూరం - ఉద్యానవనాల సౌందర్యం చూయించండి చాలు ....... , మేము విశ్రమించబోయేది కూడా అక్కడే .......
బుజ్జాయిలు : మహారాజు గారు ఉద్యానవనంలోనా ? .
అవునుమరి మేము పుట్టి పెరిగినది ప్రకృతి ఒడిలో ........
బుజ్జాయిలు : సరిగ్గా అమ్మలానే మాట్లాడుతున్నారు - అమ్మకూడా ........
ఇప్పుడు మహారాణిగారి గురించి ఇప్పుడెందుకు ? .
బుజ్జాయిలు : మీ ప్రాణసఖి చాలా చాలా అదృష్టవంతురాలు , పరాయి స్త్రీ గురించి ఆలోచనే లేదు .
ఇక్కడ ఉన్నది కేవలం .......
బుజ్జాయిలు : తెలుసులే మహారాజా ...... , ప్రతీసారీ గుర్తుచేయ్యాల్సిన అవసరం లేదు అంటూ బుజ్జి అసూయ చెందుతున్నారు .
అసలు మరిచిపోతేనే కదా నా హృదయసుందరి దేవకన్యను అంటూ కళ్ళు మూసుకుని అనుభూతి చెందుతున్నాను.
బుజ్జాయిలు : దేవకన్యనా ...... ? , ప్చ్ ...... ఆ దేవకన్య మా అమ్మ కానీ పిన్నమ్మలు కానీ అయిఉంటే ఎంత బాగు ........
ష్ ష్ ష్ ...... తప్పు తప్పు బుజ్జాయిలూ ....... మహారాణీ గారు - రాణీ వాళ్ళు వింటే బాధపడతారు .
బుజ్జాయిలు : మాకైతే అలా అనిపించనే లేదు , అమ్మ - పిన్నమ్మలు ...... ఇక్కడ ఉన్నంతసేపూ మిమ్మల్నే ప్రేమతో చూస్తూనే ఉన్నారు తెలుసా ? , మీకెలా అనిపించింది మిత్రమా కృష్ణా - అడవిరాజా .......
అవునన్నట్లు తలలుఉపారు .
బుజ్జాయిలు : మీరు ఊ అనాలేకానీ మమ్మల్ని లాగేసి మీ గుండెలపైకి చేరిపోరూ .......
నాకూ అదే భయంగా ఉంది బుజ్జాయిలూ ...... , మహారాణులు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలరు , తెల్లవారగానే ఇక్కడనుండి జారుకోవడం ఉత్తమం .
బుజ్జాయిలు : వీరాధివీరా అంటూ కళ్ళల్లో చెమ్మతో నా వస్త్రాన్ని చిరిగిపోయేలా పట్టేసుకున్నారు .
మిమ్మల్ని వదిలివెళ్లడం కూడా కష్టమే అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి ఆప్యాయంగా హత్తుకున్నాను .
బుజ్జాయిలు : అయితే మమ్మల్ని కూడా మీవెంటే తీసుకెళ్లండి .
తల్లీబిడ్డలను వేరుచెయ్యడం పాపం తెలుసా ...... 
బుజ్జాయిలు : అమ్మా దుర్గమ్మా ...... వీరాధివీరుడి దేవకన్య అమ్మను ఎందుకు చెయ్యలేదు అంటూ బాధపడుతున్నారు .
ష్ ష్ ష్ ...... బుజ్జాయిలూ మీరుకూడా దుర్గమ్మ తల్లినే పూజిస్తారా ? .
బుజ్జాయిలు : ఆ దుర్మార్గపు రాజు నుండి అమ్మను - పిన్నమ్మలను కాపాడుతూ వస్తున్నది దుర్గమ్మ తల్లే , మేముకూడా రోజూ పూజిస్తాము అంటూ ముద్దుముద్దుగా చెప్పారు , అంటే మీరుకూడా .......
అవును అమ్మవారి భక్తుడినే అంటూ ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : ఆనందించారు , మహారాజా ....... రాజ భవనాలలోకి వచ్చేసాము - ప్రకృతి తప్ప ఏ అద్భుతాలనూ వీక్షించారన్నమాట అయితే ఉద్యానవనాల దగ్గరకే తీసుకెళతాము రండి పైకివెళ్లండి అటువైపు అటువైపు ...... , సింహాసనం ఇటువైపు .......
మనకు సింహాసనంతో పనిలేదు పైకివెళదాము .
బుజ్జాయిలు : నవ్వుకున్నారు , ఆయుధ నిల్వాగారం - వజ్రాలు బంగారం రాసులుగా పోసిన బాండాగారం ...... అంటూ చూయిస్తూ సగం పైకి వచ్చేసాము మహారాజా అన్నారు , దారిపొడుగునా కాపుకాస్తున్న సైనికులు - చెలికత్తెలు ..... సింహాలను చూసి భయపడటం చూసి నవ్వుకుంటున్నారు .
అవన్నీ అవసరంలేదు అందమైన ఉద్యానవనాల దగ్గరకు .......
బుజ్జాయిలు : అక్కడికే తీసుకెళతాము అంటూ బుజ్జికోపాలతో ముద్దులుపెట్టారు - ముందైతే వంటశాలలో మా మహారాజుగారికోసం ఏమేమి వంటలు చేస్తున్నారో చూసి ఆకలివేస్తోంది అన్నారుకదా రెండుచేతులతో తీసుకొస్తాము అదిగో అతిపెద్దదైన వంటశాల - అమ్మావాళ్ళు లోపలే ఉన్నట్లున్నారు తీసుకెళ్లండి .
మీరువెళ్లి మీ అమ్మలను పలకరించి రండి నేను ఇక్కడే వేచిచూస్తాను అంటూ అడవిరాజుపై బుజ్జిసింహాన్ని ఎత్తుకున్న బుజ్జియువరాజును - అడవిరాణిపై బుజ్జిసింహాన్ని ఎత్తుకున్న బుజ్జియువరాణిని కూర్చోబెట్టాను .
బుజ్జాయిలు : అమ్మలేమీ మిమ్మల్ని కొరుక్కుని తినెయ్యరు .
ముసిముసినవ్వులతో తలదించుకున్నాను రాను అన్నట్లు ......
బుజ్జాయిలు : అయితే కొద్దిగా ముందుకువెలితే ఉద్యానవనం ఉంది అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండండి వెంటనే వచ్చేస్తాము .
ఎటువైపు బుజ్జాయిలూ .......
బుజ్జాయిలు : ప్రకృతి అంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం - చెలికత్తెలూ ..... మన మహారాజుగారిని ఉద్యానవనానికి తీసుకెళ్లండి అంటూ ఆజ్ఞవేశారు .
చిత్తం బుజ్జియువరాణీ ...... , మహారాజా ..... ఇటువైపు అంటూ తీసుకెళ్లారు .
బుజ్జాయిలను వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ వెళ్లడం చూసి సంతోషంతో ముద్దులువదిలి అమ్మా - అత్తయ్యా - పిన్నమ్మలూ ...... అంటూకేకలువేస్తూ వంటశాల లోపలికివెళ్లారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-02-2023, 10:55 AM



Users browsing this thread: Shiva@123, 56 Guest(s)