Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఎప్పుడు వచ్చారో ఏమిటో వెనక్కు తిరుగగానే నాకు అతిదగ్గరగా ముసుగులలో రాణీగారు ఉన్నారు , ఆగండి ఆగండి ప్రజలారా ...... ఈక్షణం నుండీ మన రాజ్యాన్ని - మనల్ని కాపాడిన ఈ వీరాధివీరుడే మన మహారాజు అంటూ అభినందించడానికన్నట్లు నన్ను కౌగిలించుకోబోయారు ...........
మంజరి ...... మహారాణీ గారి చుట్టూనే తిరుగుతోంది .
ష్ ష్ ష్ అన్న సైగలూ వినిపిస్తున్నాయి .
మహారాజు మహారాజు మహారాజు ...... అంటూ రాజ్యం మొత్తం దద్దరిల్లింది .
బుజ్జాయిలు : మహారాజు మహారాజు .......
అడవిరాజుతోపాటు చుట్టూ ఉన్న జంతువులన్నింటికీ ఇష్టమే అన్నట్లు సంతోషంలో గర్జిస్తున్నాయి - గాండ్రిస్తున్నాయి - అరుస్తున్నాయి .
యువరాజు : సరైన నిర్ణయం తీసుకున్నారు మహారాణీ - మా రాజ్యం కూడా సంతోషంగా మద్దతిస్తుంది అంటూ ఆనందాన్ని పంచుకున్నారు .
అక్కయ్యా - వదినా ...... గొప్ప నిర్ణయం తీసుకున్నారు అంటూ చప్పట్లు కొడుతున్నారు .
లేదు లేదు లేదు మన్నించండి మన్నించండి రాణీగారూ ..... క్షమించండి ఇప్పుడు మహారాణీ గారు కదూ ....... అంటూ వెనక్కు వెళ్ళాను .
మహారాణి : లేదు లేదు అన్నది నేను కౌగిలించుకుని అభినందించబోతున్నందుకా లేక మహారాజునని అందరి ఇష్టాలతో ప్రకటించినందుకా .......
మంజరి ..... మహారాణీ గారి భుజంపైకి చేరబోతే నాకు కనిపించకుండా తోసేస్తున్నారు .
మన్నించండి మహారాణీ గారూ ...... రెండింటినీ తిరస్కరిస్తున్నాను , నా హృదయంలో నా దేవకన్యకు మరియు ఈరోజు నుండీ ఈ బుజ్జాయిలకు మాత్రమే స్థానం మరొకరు ...... మన్నించండి , ఇక రాజ్యకాంక్ష నాకు లేదు , నా గమ్యం నా ప్రియమైన ప్రాణమైన దేవకన్య అంటూ హృదయంపై చేతినివేసుకుని అనుభూతిని పొందుతున్నాను .
తిరస్కరించినా మహారాణీ గారు తెగ సంతోషిస్తున్నట్లు తెలుస్తోంది .
అయితే మమ్మల్ని అభినందించనివ్వండి అంటూ ముగ్గురు రాణులు ముందుకువచ్చారు .
మన్నించండి మన్నించండి రాణులూ ...... ఇక్కడ కేవలం నా ప్రాణసఖికి మాత్రమే స్థానం , ఈ ప్రయాణం కూడా తనకోసమే మీరు సెలవిస్తే బయలుదేరుతాను .
మహారాజా మహారాజా ...... అంటూ బుజ్జి సింహాలను ఎత్తుకుని నా గుండెలపైకి చేరారు బుజ్జాయిలు , ఇప్పుడే కదా మీ హృదయంలో మేమూ ఉన్నామని అన్నారు అప్పుడే వెళ్లిపోతాను అంటున్నారు .
మిమ్మల్ని విడిచివెళ్లడం కష్టమే కానీ అంటూ గట్టిగా హత్తుకున్నాను - కళ్ళల్లో చెమ్మ ........
బంజాయిలు : మీ కళ్ళల్లో నీటిని చూస్తుంటేనే మేమంటే ఎంత ఇష్టమో అర్థమైపోతోంది .
ఎందుకో తెలియదు ఈ గుండెలపై చేరిన క్షణమే నా ప్రాణసఖితో సమానం అయిపోయారు .
అయితే ఉండిపోండి అన్నయ్యా అంటూ హత్తుకోబోయింది యువరాణి , అన్నయ్య ఆప్యాయతతో .......
చెల్లీ అంటూ నవ్వడంతో హత్తుకుంది - చెల్లీ ...... నీ ప్రేమికుడి సహాయం వల్లనే ఇదంతా సాధ్యం అయ్యింది పాపం నీ ప్రేమకోసం ఎంతలా ఎదురుచూస్తున్నాడో చూడు .
సిగ్గుపడుతూ వెళ్లి యువరాజు గుండెలపైకి చేరింది .

మహారాణి : చీకటిపడుతోంది ఎలాగో మార్గమధ్యమంలో విశ్రాంతి తీసుకోవాలికదా అదేదో ఇక్కడే తీసుకోండి .
మంజరి ..... మహారాణీగారి చుట్టూనే ప్రదక్షణలు చేస్తుండటం ఆశ్చర్యంగా ఉంది .
బుజ్జాయిలు : బుజ్జి యువరాజు యువరాణిగా ఆజ్ఞ వేస్తున్నాము - బ్రతిమాలుకుంటున్నాము అంటూ ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
మంజరీ - మిత్రమా ....... ఏమంటారు ? .
మంజరి : జీవితాంతం ఇక్కడే ఉండమన్నా సంతోషమే అంటూ మహారాణి దగ్గరకు వెళుతుంటే తప్పించుకుంటున్నారు .
బుజ్జాయిలకోసం ఒప్పుకుంటున్నాను .
అంతే బుజ్జిసింహాలను పట్టుకున్న బుజ్జాయిలను ఎత్తుకున్న నన్ను అమాంతం పైకెత్తేసి మహారాజా మహారాజా ....... అంటూ హోరెత్తిస్తున్నారు .
వద్దన్నా వినకపోవడంతో తప్పలేదు .

మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అంటూ సంతోషంగా కిందకుదిగాను , బుజ్జియువరాజా - బుజ్జి యువరాణీ ...... రాజ్యంలోని పొలాలు మరియు వాటిచుట్టూ ఉన్న అడవి చెట్లన్నీ ఎండిపోయాయి కానీ ఈ ఉద్యానవనం మాత్రం పచ్చదనంతో కళకళలాడుతోంది , ఈ గడ్డి - పూలమొక్కలకు నీరు ఎక్కడనుండి చేరుతోంది .
బుజ్జాయిలు : కొండపైనుండి అంటూ పైకి చూయించారు - ఇంతకుమించిన ఉద్యానవనాలు బోలెడన్ని ఉన్నాయి , ఇక కొండ ఉపరితలంపై అమ్మ - అత్తయ్య - పిన్నమ్మల ఉద్యానవనాలు అయితే మరింత అందంగా ఉంటాయి .
ఆశ్చర్యం - అద్భుతం ...... ఈ పోరాట హడావిడిలో గమనించలేదు కానీ కొండ పైనుండి పాదాలవరకూ రాజభవనం అత్యద్భుతం , రాజభవనాల వాస్తుశిల్ప సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు .
బుజ్జాయిలు : ఏమిటి మహారాజా అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నారు .
అత్యద్భుతమైన రాజ్యం అంటూ కింద నుండి పైకి - పైనుండి కిందకు పదేపదే చూస్తున్నాను , నేను మహారాజుని కాదు .
మహారాజా మహారాజా మహారాజా ...... అంటూ చుట్టూ ఉన్నవారితోపాటు ఇళ్లల్లో బంధింపబడినవారూ వచ్చినట్లు నినాదాలు చేస్తున్నారు .
బలవంతంగా మహారాజును చెయ్యడం భావ్యం కాదు , బుజ్జాయిలూ ..... చెప్పానుకదా నా పియసఖికి మాత్రమే ప్రభువునని ........ , ఏంటి రాణీగారు సిగ్గులొలికిపోతున్నారు - మంజరి అయితే రాణిగారి చుట్టూనే ప్రదక్షణలు చేస్తోంది , సరికానీ బుజ్జాయిలూ ..... ఆ ఉద్యానవనాలు కూడా ఇలాగే పచ్చగా ఉన్నాయా ? .
బుజ్జాయిలు : అవును . 
ఉద్యానవనాలన్నింటికీ నీళ్లు ఎక్కడనుండి వస్తున్నాయి .
బుజ్జాయిలు : పైనున్న చిన్న కొలను నుండి , పారిపోయిన రాజు ఉన్నాడుకదా అతడు కేవలం రాజభవనంలో ఉన్న వారికి - ఉద్యానవనాలకు మాత్రమే నీటిని వదిలేలా అడ్డుకట్ట వేసాడు , రాజ్యంలోని ప్రజలు దాహంతో అలమటిస్తున్నారని అమ్మా - అత్తయ్యావాళ్ళు ఎంత విన్నవించుకున్నా వదలలేదు , మళ్లీ వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియదు ప్రజలకు వదిలితే చివరికి నాకు త్రాగడానికి ఉండవు అని నీళ్లు అడిగిన ప్రజలను చిత్రహింసలు పెట్టాడు , ప్రజల ప్రార్థనలు ఫలించాయి .

బుజ్జియువరాజా - బుజ్జియువరాణీ ...... రాజ్యంలోని ప్రజలతోపాటు రాజ్యం చుట్టూ ఉన్న అడవులలో ఉన్న జంతువులన్నీ రోజుల తరబడి నీళ్లు లేక దాహంతో అలమటిస్తున్నాయి , మీరు అనుమతి ఇస్తే వాటి దాహం తీరుద్దాము .
దాహం అని వినిపించగానే చుట్టూ ఉద్యానవనంలో మరియు రాజ్యపు కోటపై ఉన్న జంతువులన్నీ మాచుట్టూ చేరాయి .
అమ్మా అమ్మా నాన్నా ....... అంటూ పిల్లలందరూ భయపడటం చూసి , అక్కయ్యలూ - అన్నయ్యలూ ...... భయపడకండి , మన మహారాజు ఆజ్ఞలతో మనల్ని - మన రాజ్యాన్ని రక్షించిన దేవుళ్ళు ఈజంతువులు .
బుజ్జాయిల మాటలకు ఈలలు - చప్పట్లు హోరెత్తాయి .
వయసుకే బుజ్జాయిలు నిజానికి పిడుగులు .......
బుజ్జాయిలు : మా మహారాజు వల్లనే పిడుగులం అయ్యాము - అది వదిలెయ్యండి ముందైతే రాజ్యానికి మహారాజు ఎవరు ప్రజలారా ...... ? .
ప్రజలు - సైనికులు : వీరాధివీరుడు - మహారాజు , వీరాధివీరుడు - మహారాజు ........
బుజ్జాయిలు : మహారాజు ఆజ్ఞ వేస్తేనే పైనున్న చిన్నకొలనులోని నీరు కిందకువస్తుంది .
మిమ్మల్నీ అంటూ బుగ్గలపై సున్నితంగా కొరికేసాను .
బుజ్జాయిలు : స్స్స్ స్స్స్ ......
క్షమించండి క్షమించండి అంటూ లెంపలేసుకోబోయి ఎత్తుకుని ఉండటంతో కుదరలేదు .
బుజ్జాయిలు : మేము సహాయం చేస్తాము అంటూ కొట్టబోయి ముద్దులుపెట్టి నవ్వుతున్నారు .
బుజ్జితల్లీ - నాన్నా ....... అంటూ ముసుగులోనే ఆనందిస్తున్నట్లు హృదయంపై చేతినివేసుకున్నారు .
బుజ్జాయిలు : మాకిష్టమైన వీరాధివీరుడిని కొడతామా అమ్మా ....... , అయినా మహారాజును కొట్టే ధైర్యం ఎవరైనా చేస్తారా అంటూ నవ్వుతున్నారు .
అయ్యో .......
బుజ్జాయిలు : మళ్లీ ముద్దులుపెట్టి , నీరు అంటూ గుర్తుచేశారు .
అవునవును అంటూ బుజ్జాయిలకు ముద్దులుపెట్టాను , సైనికులారా ....... వెంటనే వెళ్లి జంతువులకు మరియు రాజ్యంలోని ప్రజలందరికీ దాహం తీరేలా నీటిని వదలండి .
సైనికులు : ప్రభూ ...... అలాచేస్తే చిన్న కొలనులోని నీళ్లన్నీ అయిపోతాయి .
రాజ్యంలోని ప్రజల మరియు జంతువుల దాహం తీర్చలేని రాజులు ఉంటే ఏమి లేకపోతే ఏమి , మహారాణీ ....... 
మాహారాణి ...... ఆహ్హ్హ్ అంటూ ప్రక్కనున్న రాణి భుజంపై తలవాల్చి పరవసించిపోతున్నారు మహారాణి .
నా ఉద్దేశ్యం అధికాదు మహారాణీ గారూ ....... , ఇక్కడ ఉన్నది .......
మహారాణి : కేవలం మీ దేవకన్య మాత్రమే తెలుసు , ప్చ్ ప్చ్ ...... అంటూ మంజరిని భుజం మీదనుండి తోసేశారు , అయినాకూడా మంజరి మహారాణి చుట్టూనే ఎగురుతూ ఆనందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది .
నవ్వుకున్నాను , మహారాణీ గారూ - రాణులూ - చెల్లీ - బుజ్జి యువరాజా - బుజ్జి యువరాణీ ...... మీ అనుమతి లేకుండా నీటిని వదలమన్నాను .
మహారాణి : ఇన్నాళ్లకు దేవుడే స్వయంగా మహారాజులా వచ్చారు , ప్రజలు - జంతువుల దాహార్తి తీర్చే దేవుడు మా దాహార్తిని తీర్చలేడంటారా ? , మహారాజు మాటే శాసనం - మహారాజు మహారాజు అంటూ నినాదాలు చేయడంతో మళ్లీ అందరూ హోరెత్తించారు .
ధన్యవాదాలు మహారాణీగారూ ........
మాహారాణి : గారు అవసరంలేదు అంటూ సిగ్గుపడితున్నారు .
మహారాణిగారు అంతే , సైనికులారా ఇంకా ఇక్కడే ఉన్నారే , చూసారా ...... మీ మహారాజుని నేను కాదు .
చిత్తం మహారాజా ...... మా ఆలస్యాన్ని మన్నించండి మన్నించండి అంటూ పైకి పరుగులుతీశారు .

జంతువులు - ప్రజలతోపాటు అందరమూ పైకి చూస్తుండగానే కొండ పైభాగం నుండి వేదికల వారీగా చిన్న చిన్న జలపాతాలుగా అందమైన దృష్యంగా కింద ఉద్యానవనంలోని ఈతకొలనులలోకి అవి నిండటం ద్వారా పాయలుగా ప్రజల గృహాలవైపుకు ప్రవహిస్తోంది గంగమ్మ తల్లి .......
నీటిని చూడగానే జంతువులన్నీ సంతోషంతో గెంతులువేస్తూ ఈతకొలనులలోకి చేరి దాహాన్ని తీర్చుకుని జలకాలాడుతున్నాయి .
ఏనుగులైతే తమ తొండాలతో మాపైకి నీటిని చిమ్మరించడంతో తడిసిపోయాము .
ఆ అందమైన దృశ్యాలను చూసి బుజ్జాయిల ఆనందాలకు అవధులులేకుండాపోయాయి - భలే భలే .......
బుజ్జాయిలూ ...... మీ బుజ్జిసింహాలకు కూడా దాహం తీర్చండి అంటూ ముద్దులుపెట్టి కిందకుదించాను , అడవిరాజా - అడవిరాణీ ..... మీరూ వెళ్లి దాహం తీర్చుకోండి .
అడవిరాజును రక్షించి మాదగ్గరికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు అన్నట్లు ఆనందబాస్పాలతో నన్ను వదిలివెళ్లడం లేదు అడవిరాణి .
బుజ్జాయిల రాజ్యాన్ని కాపాడి రుణం తీర్చుకున్నారు అడవిరాణీ ......
ఊహూ అంటూ నన్ను స్పృశిస్తూనే ఉంది .
భలేభలే అంటూ ఆనందిస్తున్నారు బుజ్జాయిలు - మీరుకూడా వెళతారా వెళ్ళండి అంటూ బుజ్జిసింహాలను కిందకు దించారు - వడివడిగా నాచెంతకు చేరడంతో ఎత్తుకుని ఆనందించాను .
బుజ్జిసింహాలూ ...... నేనెక్కడికీ వెళ్లను అమ్మానాన్నలతో వెళ్లి దాహం తీర్చుకోండి అంటూ బుజ్జాయిల చేతికి అందించి వెల్లమన్నాను .
బుజ్జాయిలు : దాహం తీర్చినవంటనే మళ్లీ మీపైకి ఎక్కుతాము .
అఅహ్హ్ ...... అంతకంటే భాగ్యమా అంటూ మురిసిపోతున్నాను .
మహారాణిగారు ...... క్షణకాలం కూడా వదలకుండా నావైపే చూస్తున్నట్లు అనిపించి కాస్త ఇబ్బందిపడుతున్నాను .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 02-02-2023, 10:55 AM



Users browsing this thread: 54 Guest(s)