Thread Rating:
  • 26 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
1అంతటి హడావిడిలోనూ మహేష్ అంటూ తియ్యనైన నెమలి స్వరంలా పిలుపు వినిపించింది ప్రస్ఫూటంగా ఇంకేముందు నా హృదయం పులకించిపోసాగింది - నా హృదయస్పందననే అంటూ అటువైపుకు చూడగానే మహేష్ మహేష్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చి నాకు అతిదగ్గరగా ఆగి ఎందుకో కంట్రోల్ చేసుకుంటున్నట్లు పిడికిళ్ళు బిగిస్తోంది .
నన్ను కౌగిలించుకోకుండా ఉండటానికి తెగ కంట్రోల్ చేసుకుంటోందని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు - తను ...... నా కళ్ళల్లోకి చూస్తున్న ఘాడతకు పులకించిపోయినట్లు హృదయంపై చేతినివేసుకుని ఆహ్హ్ ...... అంటూ వెనక్కు పడిపోవడం అటుగా వస్తున్న ఫ్రెండ్స్ చూసి పట్టుకుని నిలబెట్టి జాగ్రత్త అనిచెప్పి వెళ్లిపోవడం చూసి నా హృదయస్పందన నవ్వులు ఆగడం లేదు .
జీవితాంతం అలా చూస్తూ ఉండమన్నా చూస్తూ ఉండిపోతానేమో .......

" మహేష్ నీకొక సంతోషమైన విషయం చెప్పాలి - బుజ్జిజానకీ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి " అని ఇద్దరం ఒకేసారి పలికి నవ్వుకున్నాము .
" ముందు నువ్వు బుజ్జి జానకీ - ముందు నువ్వు మహేష్ " మళ్లీ నవ్వుకున్నాము .
" ముందు నువ్వు - ముందు నువ్వు  " అంటూ మళ్లీ మళ్లీ నవ్వుకుంటున్నాము .
మహేష్ మహేష్ ........ నువ్వు బుజ్జిజానకీ అంటూ అమ్మ పేరుతో పిలిచిన ప్రతీసారీ వొళ్ళంతా బటర్ ఫ్లైస్ ఎగురుతున్నంత హాయిగా ఉంటుంది తెలుసా ....... , ( పేరెంట్స్ ఉండగా నిన్ను కౌగిలించుకోకుండా ఉండటానికి ఎంత ఘర్షణ చెందుతున్నానో నీకు తెలియదు ) .
బుజ్జి జానకీ ....... వినిపించలేదు .
మహి : పో మహేష్ వినిపించుకోవాలికదా అంటూ బుంగమూతిపెట్టుకుంది .
ఆహ్హ్ ....... అంటూ మళ్లీ కిందపడిపోతుంటే ఈసారి మహినే చేతిని పట్టుకుని జాగ్రత్త కింద రాళ్లు ఉంటాయి అంటూ నవ్వుతోంది .
ఈ ఆనందంతో పోలిస్తే అవి ఏపాటివి బుజ్జిజానకీ .......
మహి : " బుజ్జిజానకి " ...... ఈరోజంతా కాదు కాదు జీవితాంతం వింటూ ఉండమన్నా సంతోషమే మహేష్ .......
జీవితాంతం పిలిచే అదృష్టం లభించినా సంతోషమే బుజ్జిజానకీ బుజ్జిఇందూ ......
మహి : మహేష్ ....... అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలు .
బుజ్జిజానకీ ....... ఆనందబాస్పాలే కదా అంటూ ఆనందిస్తున్నాను .
మహి : తెలిసే అడుగుతున్నావు కదూ పో మహేష్ ....... , ఏదో ముఖ్యమైన విషయం అన్నావు చెప్పు .......
ముందైతే బుజ్జిజానకి గారు చెప్పండి .
మహి : " గారు " 
మరి బుజ్జిజానకి గారు 10th క్లాస్ - నేను 9th క్లాస్ , జూనియర్ ని కదా ......
మహి : వయసులో జూనియర్ వి అయినా చుట్టూ ఉన్నవారిని సంతోషపెట్టడంలో దేవుడితో సమానం , ఊహూ ....... నా ఆనందానికి కారణమైన మహేష్ గారే చెప్పాలి .
ఊహూ ఊహూ ఊహూ ఊహూ ....... , అంతలో స్కూల్ బెల్ మ్రోగడంతో ఇద్దరమూ నవ్వుకున్నాము .

మహి : మహేష్ ...... అమ్మమ్మా - తాతయ్య వచ్చారు .
అవునా ఎక్కడ ఉన్నారు ? .
మహి : అంటీ అదే అదే హెడ్ మిస్ట్రెస్ మేడమ్ ఆఫీస్ లో ఉన్నారు - నీకోసమే నిన్ను కలవాలని ఎప్పుడో వచ్చాము తెలుసా .......
Sorry sorry బుజ్జిజానకీ ........
మహి : పర్లేదులే రా వెళదాము అంటూ చేతిని అందుకోబోయి ప్చ్ ప్చ్ అంటూ ప్రక్కనే అతిదగ్గరగా నడవసాగింది .

స్కూల్ కు ఎందుకు పిలిపించారో అంటూ గ్రౌండ్ లోని పేరెంట్స్ అందరూ గుసగుసలాడుకుంటున్నారు .
బుజ్జిజానకీ ...... ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ వచ్చినట్లున్నారు గుడ్ గుడ్ ........
మహి : ఐడియా ఎవరిది అంటూ మురిసిపోతూ హెడ్ మిస్ట్రెస్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లింది .
మే ఐ కం ఇన్ హెడ్ మిస్ట్రెస్ ? .
మేడమ్ : నాకు తెలియకుండా కొట్టానని sorry కూడా చెప్పానుకదా అయినా కూడా నాపై కోపం పోలేనట్లుంది మహేష్ కు ........
మహి : అంటీ ....... మహేష్ ను కొట్టారా ఎప్పుడు అంటూ లోపలికి లాక్కెళ్ళింది - కొట్టనంటే కొట్టను అన్నారుకదా అంటీ - నాకు తెలియకుండా ఎప్పుడబ్బా , మహేష్ చెప్పు చెప్పు .......
మేడమ్ : నేను నేనుచెబుతానుకదా అంటూ మహి చెవిలో గుసగుసలాడారు .
మహి : ఓహో మొత్తానికి మహేష్ అనుకున్నది సాధించాడన్నమాట అలాచేసే అంటూ మేడమ్ తోపాటు సిగ్గుపడుతోంది .

మహేష్ మహేష్ ...... అంటూ అమ్మమ్మ పిలిచారు - ఏమండోయ్ ఇతడే మన మనవరాలి సంతోషాలకు కారణం .
మహేష్ ........
తాతయ్యా ఎలా ఉన్నారు ? , అమ్మమ్మా ...... వచ్చి చాలాసేపు అయ్యిందట క్షమించండి అంటూ పెద్దల పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకున్నాను .
మహేష్ అంటూ లేపి కురులను స్పృశిస్తూ మా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు నాయనా ...... 
మీరు నిండు నూరేళ్లూ బుజ్జిజానకి సంతోషాలను చూస్తూ అంతే సంతోషంగా ఉంటే చాలు .
అమ్మమ్మ : మా నాయనే అంటూ గుండెలపైకి తీసుకున్నారు .
తాతయ్య : ఒక్కమాటతో మహేష్ అంటే ఏమిటో తెలిసింది బుజ్జిజానకీ ....... 
మహి : ఇంటికి వెళ్లిన క్షణం నుండీ అమ్మమ్మ - తాతయ్యలు అలానే పిలుస్తున్నారు మహేష్ , సో సో sooooo హ్యాపీ ........
నీ సంతోషమే కదా కావాల్సింది బుజ్జిజానకీ ....... , మీ అమ్మమ్మ తాతయ్యలతో పాటు మరొకరు కూడా చూసి ఎంత ఆనందిస్తున్నారో అంటూ బుజ్జిహృదయంపై చేతినివేసుకుని పైకి చూస్తున్నాను .
మహి : లవ్ ....... థాంక్యూ సో మచ్ మహేష్ .
అమ్మమ్మ : తల్లీ బుజ్జిజానకీ ....... మహేష్ కు చెప్పావా ? .
మహి : లేదు అమ్మమ్మా ....... , ముందు తనే ఏదో చెప్పడానికి వచ్చి చెప్పడం లేదు .
ఊహూ ముందు బుజ్జిజానకి .......
మహి : ఊహూ ...... ఇంతమంది సంతోషాలకు కారణమైన మహేష్ ......
ఊహూ ఊహూ .......
అంతలో ప్రేయర్ బెల్ మ్రోగడంతో నవ్వుకున్నాము .

మేడమ్ : నవ్వుకుని , అమ్మా ...... ప్రేయర్ పూర్తయ్యేంతవరకూ మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి .
అమ్మమ్మ : లేదు లేదు మా మనవడు మహేష్ - మనవరాలు బుజ్జిజానకితోపాటు ప్రేయర్ చేస్తాము , మళ్లీ మా చిన్ననాటి స్మృతులను తలుచుకుంటాము , ఈ భాగ్యం కూడా మహేష్ వల్లనే లభిస్తోంది .
మహి : లవ్ టు అమ్మమ్మా ....... , లవ్ ..... థాంక్యూ మహేష్ అంటూ నావైపుకు సంతోషంతో చూస్తూ అమ్మమ్మ చేతిని చుట్టేసింది .

మేడమ్ : మహేష్ ....... పేరెంట్స్ అందరినీ చూస్తుంటే కాస్త కంగారుగా ఉంది - నువ్వున్నావనే ధైర్యం .......
పెద్దమ్మ ఉండగా కంగారు ఎందుకు హెడ్ మిస్ట్రెస్ ...... 
మేడమ్ : కళ్ళుమూసుకుని పెద్దమ్మను తలుచుకున్నట్లు వెంటనే కాంఫిడెన్స్ గా అడుగులుపడ్డాయి .
మహి : ఆశ్చర్యం , ఆంటీ అంటీ ...... మహేష్ ఏదో మంత్రం వేసినట్లు క్షణంలో ఎంత మార్పు అంటూ నా ప్రక్కన చేరింది .
మేడమ్ : మహేష్ ప్రక్కన ఉంటే ఇంతేమరి , థాంక్యూ థాంక్యూ సో మచ్ మహేష్ , ఇక చూడండి ఎలా ఆటాడిస్తానో అంటూ మహిని తనవైపుకు పిలుచుకుని చేతిలో పెనవేసి ప్రేయర్ దగ్గరకు చేరుకున్నారు .
మహిని వారి ప్రక్కనే ఉంచుకోవడంతో సరిగ్గా మహికి ఎదురుగా వెళ్లి స్టూడెంట్స్ వరుసలో నిలబడ్డాను .
ప్రక్కనే ఉన్నావుకదా ఎప్పుడు వెళ్ళావు ఇక్కడికిరా అన్నట్లు కళ్ళతోనే సైగలుచేస్తున్నారు మేడమ్ .......
ఇక్కడే బాగుంది మేడమ్ అంటూ మహివైపే చూస్తుండటం చూసి సరే సరే అంటూ నవ్వుకున్నారు - అమ్మమ్మావాళ్ళు పేరెంట్స్ తోపాటు నిలబడ్డారు. 
అంతలోనే ప్రేయర్ మొదలవడం - స్టూడెంట్స్ తోపాటు పేరెంట్స్ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అవడం - జనగణమనతో ప్రేయర్ పూర్తవ్వడంతో స్టూడెంట్స్ అందరినీ వారి వారి క్లాస్సెస్ కు వెళ్ళమని అనౌన్స్మెంట్ జరగడంతో వెళ్లిపోయారు .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 03-12-2023, 09:09 AM



Users browsing this thread: 6 Guest(s)